1 ENS Live Breaking News

అక్టోబరులో ఎస్వీబీసీ కన్నడ ప్రసారాాలు..

తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ డాక్ట‌ర్ కెఎస్‌.జవహర్‌రెడ్డి గురువారం బెంగళూరు న‌గ‌రంలోని వయ్యాలికావల్ ప్రాంతంలో గ‌ల శ్రీ‌వారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఈఓకు టిటిడి అధికారులు, అర్చ‌కులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఈఓ అక్క‌డి టిటిడి కల్యాణ‌మండ‌పాన్ని, శ్రీ వేంక‌టేశ్వ‌ర భక్తి ఛాన‌ల్ కన్నడ కార్యాలయాన్ని ప‌రిశీలించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ రానున్న అక్టోబర్ నెల‌లో ఎస్వీబీసీ కన్నడ ఛానెల్ ప్ర‌సారాల‌ను ప్రారంభిస్తామ‌న్నారు. ఛానల్ ప్రారంభం సందర్భంగా పురందరదాస కీర్తనలను ప్రాచుర్యంలోకి తీసుకురావాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఎస్వీబీసీ సీఈఓ సురేష్ కుమార్‌కు సూచించారు.

Bengaluru

2021-09-02 12:10:58

2021-08-29 10:35:01

ప్రభుత్వానికి రూ.500 కోట్ల జిఎస్టీ జాక్ పాట్ జాంపండు..

జిఎస్టీ వలన ఏమొస్తుంది..ఏమొస్తుంది అనుకున్నారు అంతా..ఈ జిఎస్టీ వలన పెద్ద తలకాలను వదిలి..చిన్న తలకాలయలను టార్గెట్ చేస్తే  కోట్ల రూపాయల ఎంత ఆదాయం వస్తుందో తెలిస్తే జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసేవారు ఆ జోలికేపోలేక పోతున్నారు.. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటే ఫలితం ఉండదు..ఇపుడు అదే జరిగింది జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసిన వారందరికీ.. ఉచితంగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసినా.. ఇపుడు దానిని కేన్సిల్ చేయడానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఉపయోగించుకున్న నాన్చుడు దోరణి ఇపుడు వారికి కోట్ల రూపాయలను అప్పనంగా తెచ్చిపెడుతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒక్కో రాష్ట్ర వాటా కింద సుమారు రూ.500 కోట్లకు పైనే ఆదాయం వస్తుందట. ఇంత ఆదాయాన్ని ఎవరు మాత్రం వదులుకుంటారు. కోట్ల రూపాయాలు సంక్షేమ పథకాలు ఇస్తూనే.. వాటికి నిధులు సమకూర్చుకోవడానికి జిఎస్టీలోని లొసుగులను ఉపయోగించుకొని మరీ అపరాద రుసుము పేరుతో కోట్ల రూపాయాల ఆదాయం సమర్చుకోవాలని చూస్తున్న కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలపై  జనం ఒంటికాలపై లేస్తున్నారు. వాస్తవంగా వ్యాపారాలు చేసేవారిని టార్గెట్ చేస్తే ప్రభుత్వానికి ప్రస్తుతం వచ్చే ఆదాయం కంటే అధికంగానే వస్తుంది.. వారు ఎలాగూ కొన్ని చోట్ల ఫేక్  రిటర్న్స్ మాత్రమే  వేస్తారు.. లిఖిత పూర్వకంగా వారిని ఏమీ చేయలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం కరోనాలో వ్యాపారాలు చేయని వారిని నిబంధనలు వినియోగించి టార్గెట్ చేస్తే గళ్లాపెట్టి గలగలలాడుతుందని భావించి ఇపుడు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసి కేన్సిల్ చేసుకున్నారందరికీ షోకాజ్ నోటీసులు పంపింది. దాని సారాంశం ఏంటంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసిన దగ్గర నుంచి ఆరు నెలల లోపు వరుసగా అంటే ప్రతీ మూడు నెలల కొకసారి రిటర్న్స్ వేయకపోతే ఆ లైసెన్స్ కేన్సిల్ అవుతుంది. అలా కొన్నింటిని చేశారు కూడా.. 

అయితే ఇక్కడే ఒక చిన్న లాజిక్ తో కమర్షియల్ టాక్స్ డిపార్ట్ మెంట్ కోట్ల రూపాయల ఆదాయాని ఆర్టించాలని పక్కా ప్లాన్ వేసి కరోనా కాస్త తగ్గుముఖం పట్టిన తరువాత తమ ప్రతాపాన్ని చూపించింది.  కనీసం ఆ రిటర్న్స్ కూడా వేయని చిన్న చిన్న సంస్థల జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నవారిని టార్గెట్ చేయడం ద్వారా ప్రభుత్వానికి కాసుల వర్షం తుపానులా కురుస్తుంది. అదీ కూడా జిఎస్టీలోని లొసుగులను వినియోగించి ఈ టార్గెట్లు ఒక్కో సర్కిల్ కి ఇచ్చి మరీ చేపట్టడం ఇపుడు రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది. జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఎలాంటి రుసుము తీసుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇపుడు ఆ రిజిస్ట్రేషన్ ను కేన్సిల్ చేయడానికి రూ. 10వేలు ఫైన్లు వేస్తున్నాయి. అంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసి, నాటి నుంచి నేటి వరకూ రిటర్న్స్ దాఖలు చేయని వారందరూ ఖచ్చితంగా ఫైనల్ రిటర్న్స్ జిఎస్టీఆర్-10 వేయలేదని, మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన ఫోన్ నెంబర్లు పనిచేయలేదని తెలియజేస్తూ.. రాష్ట్రంలోని అన్ని కమర్షియల్ టేక్స్ కార్యాలయాల నుంచి చిన్నా చితకా సంస్థలకు నోటీసులు జారీచేశారు. వాస్తవానికి ఆన్ లైన్ వెబ్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు..ఆన్ లైన్ ద్వారానే కేన్సిల్ కూడా జరగాలి. అలా కేన్సిల్ కోసం లెటర్ పెట్టిన సందర్భంలో జిఎస్టీ నెంబరు కేన్సిల్ అయి ప్రభుత్వం ఇపుడు చెబుతున్నట్టుగా జిఎస్టీఆర్-10 విషయం సంస్థలకు తెలియజేయాలి. కానీ ప్రభుత్వం ఆ పనిచేయలేదు. 

సిస్టమ్ మెజేస్ కింద కొందరికి పంపి  కొందరికి పంపడం మానేసింది. రెండేళ్ల పాటు ఊరుకొని ఇపుడు మీరు జిఎస్టీ కేన్సిల్ కి ఫైనల్ రిటర్న్స్ ఫైల్ చేయలేదు కనుక అపరాద రుసుముతో రూ.10వేలు కట్టాలని నోటీసులు పంపింది. ఇపుడు నోటీసులు అందుకుంటున్నవారంతా లబో దిబో మంటున్నారు. చచ్చినట్టు నోటీసులందకున్న వారంతా కమర్షియల్ టేక్స్ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. ఆన్ లైన్ కేన్సిలేషన్ పెట్టినపుడు ఆన్ లైన్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ యాక్టివ్ అని మాత్రమే నిన్నటి వరకూ చూపించి ఇపుడు నోటీసులు ఇచ్చి ఫైన్లు కట్టమని చెప్పడమేంటని ప్రశ్నించినా..తామేమీ చేయలేమని.. ఖచ్చితంగా జిఎస్టీఆర్-10 కట్టాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. మరికొందరు గట్టిగా నిబంధనలపై ప్రశ్నిస్తే అలాంటి సంస్థల బ్యాంక్ అకౌంట్లను అటాచ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ఎనిమిది సర్కిళ్లలో మొదలైంది..చూడాలి జిఎస్టీ పేరుతో చేస్తున్న నిలువు దోపిడీ ఏ విధంగా సాగుతుందో..ప్రభుత్వం చేసిన తప్పుని, ఎస్టీ అధికారులు నాన్చిన వ్యవహారాన్ని పక్కన పెట్టి..కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఏడురోజుల్లో జిఎస్టీఆర్ ఫైల్ చేయకపోతే చర్యలు తప్పవంటూ నోటీసులు జారీ చేయడం వెనుక చూస్తే..పెద్ద ఎత్తునే ఈ జిఎస్టీకి నిలువుదోపిడీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాస్టర్ స్కెచ్ వేసినట్టు కనిపిస్తుంది.. చూడాలి ప్రభుత్వం ఈ విషయంలో ఏ విధంగా వివరణ ఇస్తుందో..!

New Delhi

2021-08-24 15:28:08

తిరుపతిలో ఐనా మ‌హ‌ల్ ప్రారంభం..

తిరుప‌తి  శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో రూ. 66 లక్షలతో  ఆధునీక‌రించిన ఐనా మ‌హ‌ల్‌ను ఆదివారం రాత్రి టిటిడి ఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ప్రారంభించారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం ఐనా మహల్ లో సాయంత్రం 6.30 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు, పుండరీక వల్లి అమ్మవారి ఉత్స‌వ‌ర్ల‌కు ఊంజ‌ల్ సేవ నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ,  గోవింద రాజాస్వామి ఆలయంలో ఆధునీకరించిన ఐనా మహల్ ను శ్రావణ పౌర్ణమి పుణ్యదినం సందర్భంగా పునఃప్రారంభించామని లిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, 20 ఏళ్ళ కిందట నిర్మించిన ఐనా మహల్ ను ఆధునీకరించి పునః ప్రారంభించామన్నారు. ఇక మీదట ఇక్కడ రోజూ స్వామివారి ఊంజల్ సేవ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు. ఐనా మహల్ ను విద్యుత్ దీపాలతో అలంకరించారు.  ఈ కార్య‌క్ర‌మంలో  శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, జెఈవో సదా భార్గవి, ఎఫ్ఏసిఎ వో బాలాజి, ఎస్ఈ ఎలక్ట్రికల్ వెంకటేశ్వర్లు,  ఆల‌య ప్ర‌త్యేకశ్రేణి డెప్యూటీ ఈవో  రాజేంద్రుడు, డెప్యూటీ ఈవోలు  గోవిందరాజులు,  రమణ ప్రసాద్, ప్ర‌ధాన అర్చ‌కులు ఎపి.శ్రీ‌నివాస దీక్షితులు, ఏఈవో  ర‌వికుమార్ రెడ్డి, సూప‌రింటెండెంట్ వెంక‌టాద్రి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్  కామ‌రాజు పాల్గొన్నారు.

Tirupati

2021-08-22 15:54:14

రక్షణ రంగ పరిశోధనల్లో భాగస్వామ్యం కల్పిస్తాం..

రక్షణ రంగ పరిశోధనల్లో ఆంధ్రవిశ్వవిద్యాలయానికి తగిన భాగస్వామ్యం, ప్రాధాన్యత కల్పిస్తామని డిఆర్‌డిఓ  చైర్మన్‌ డాక్టర్‌ జి.సతీష్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఏయూ అకడమిక్‌ సెనేట్‌ మందిరంలో ఆచార్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏయూలో నెలకొల్పే ఫుడ్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌, ఇంక్యుబేషన్‌ కేంద్రాలతో కలసి పనిచేస్తామన్నారు. మైసూర్‌లో ఉన్న తమ ఫుడ్‌ టెస్టింగ్‌ లాబరీటరీతో ఎంఓయూ చేసుకోవాలని కోరారు. తద్వారా రెండు సంస్థలు కలసి పనిచేయడం వీలవుతుందన్నారు. వీటికి అవసరమైన ఆర్ధిక సహకారాన్ని సైతం డిఆర్‌డిఓ అందించే అవకాశం ఉందన్నారు. రక్షణ రంగ సమస్యలకు పరిష్కారాలు చూపే దిశగా పనిచేసే స్టార్టప్‌,ఇంక్యుబేషన్‌ కేంద్రాలకు రూ కోటి వరకు ఆర్ధిక సహకారం అందించే వెసులుబాటు ఉందన్నారు.  ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, సైబర్‌ సెక్యూరిటీ రంగాలలో సైతం పరిశోధనల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. బెంగళూరు, ఢల్లీి నగరాలలో ఉన్న తమ ప్రయోగశాలలో కలసి పనిచేస్తూ, పరిష్కారాలను చూపాలని సూచించారు.డిఫెన్స్‌ టెక్నాలజీలో ఏఐసిటిఈ సహకారంతో ఎంటెక్‌ ప్రోగ్రాంలు నిర్వహించడం జరుగుతోందని, వీటిని ఏయూ సైతం అందించే ప్రయత్నం జరగాలన్నారు. ఏయూ సెంటర్‌ ఫర్‌ డిఫెన్స్‌ స్టడీస్‌ కేంద్రంగా చేసుకుని పరిశోధన ప్రాజెక్టులను నిర్వహించే విధంగా బలోపేతం చేయడానికి తమ సహకారాన్ని అందిస్తామన్నారు. ఎన్‌ఎస్‌టిఎల్‌, డిఆర్‌డిఓలలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు వర్సిటీలో బోధన బాధ్యతలు స్వీకరించి తమ నిపుణతను విద్యార్థులకు అందిస్తారన్నారు. అదే విధంగా వర్సిటీ ఆచార్యులు రక్షణ రంగ సంస్థల ప్రయోగశాలల్లో పనిచేసే అవకాశం కల్పింస్తారన్నారు.కంద్ర విద్యా మంత్రిత్వ శాఖతో సమన్వయం చేస్తూ 500 పిహెచ్‌డి పరిశోధకులను తమ ప్రయోగశాలల్లో పనిచేసే విధంగా ప్రతిపాదన ఉందని, దీనికి సైతం ఆంధ్రవిశ్వవిద్యాలయానికి ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. విశ్వవిద్యాలయం ఆచార్యులు నిర్వహిస్తున్న రక్షణ రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వర్సిటీ ఆచార్యులు పరిశోధన ప్రాజెక్టులకు దరఖాస్తు చేయాలని సూచించారు.

వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి మాట్లాడుతూ వర్సిటీలో ఫుడ్‌ టెస్టింగ్‌, ఫార్మ టెస్టింగ్‌, జెనెటిక్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నామని, స్టార్టప్‌`ఇంక్యుబేషన్‌ కేంద్రాలను, నాస్‌కామ్‌ సహకారంతో సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌లను నెలకొల్పుతున్నామని వివరించారు. 
ముందుగా డాక్టర్‌ సతీష్‌ రెడ్డి ఏయూ వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగా రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం సెనేట్‌ మందిరంలో ప్రిన్సిపాల్స్‌, ఆచార్యులతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌, కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పి.హరి ప్రసాద్‌, డిఆర్‌డిఓ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ కామత్‌, ఏయూ సిడిఎస్‌ సంచాలకులు ఆచార్య కె.నిరంజన్‌, ప్రిన్సిపాల్స్‌, ఆచార్యులు, డీన్‌లు తదితరులు పాల్గొన్నారు.



Andhra University

2021-08-20 11:38:56

శ్రీ పద్మావతి ఆలయంలో తులాభారం..

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం పర్వదినం సందర్భంగా శుక్రవారం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ, టిటిడి ఈవో డాక్టర్  కె. ఎస్.జవహర్ రెడ్డితో కలిసి తులాభారం ప్రారంభించారు. ఆలయంలోని  శ్రీ సుందరరాజ స్వామివారి ముఖ మండపంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం చైర్మన్ దంపతులు, మంత్రి, ఈవో తమ బరువుకు తగిన బియ్యం, చక్కెర, బెల్లం సమర్పించి  తులాభారం  ప్రారంభించారు. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం ప్రవేశపెట్టాలని టీటీడి నిర్ణ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చెన్నైకి చెందిన శ్రీ జయచంద్ర దంపతులు రూ.17 లక్షల విలువైన  తులాభారం ఆలయానికి బహూకరించారు.  ఈ కార్యక్రమంలో జెఈవో స‌దా భార్గ‌వి,  అదనపు సివిఎస్వో  శివకుమార్ రెడ్డి, ఆల‌య డెప్యూటి ఈవో  క‌స్తూరి బాయి, ఏఈవో ప్ర‌భాక‌ర్‌రెడ్డి, అర్చ‌కులు  బాబుస్వామి పాల్గొన్నారు.

Tirupati

2021-08-20 08:13:31

ఆగ‌స్టు 20న ఆలయంలో వరలక్ష్మీ వ్రతం..

సిరుల‌త‌ల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగ‌స్టు 20న శుక్ర‌వారం వరలక్ష్మీ వ్రతం శాస్త్రోక్తంగా నిర్వ‌హించ‌నున్నారు. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఈ కార్య‌క్ర‌మం ఏకాంతంగా నిర్వ‌హిస్తారు. ఆగ‌స్టు 20న ఉద‌యం అమ్మ‌వారి మూల‌వ‌ర్ల‌కు, ఉత్స‌వ‌ర్ల‌కు ఏకాంతంగా అభిషేకం చేస్తారు. ఉద‌యం 10 నుండి 12 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌కృష్ణస్వామి ముఖ మండ‌పంలో వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం నిర్వ‌హిస్తారు.  శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా వ‌ర్చువ‌ల్ విధానంలో భ‌క్తులు పాల్గొనేందుకు వీలుగా టికెట్ల‌ను టిటిడి ఆన్‌లైన్‌లో విక్రయించింది. ఈ సేవ‌లో పాల్గొనే భ‌క్తుల‌కు ఉత్త‌రీయం, ర‌విక‌, కుంకుమ‌, అక్షింత‌లు, కంక‌ణాలు, డ‌జ‌ను గాజులు ప్ర‌సాదంగా ఇండియా పోస్ట‌ల్ ద్వారా గృహ‌స్తుల చిరునామాకు పంపుతారని దేవస్థాన అధికారులు తెలియజేస్తున్నారు.

Tirumala

2021-08-19 16:35:15

రూ.300/- టికెట్ల విడుదల వాయిదా..

భక్తుల సౌకర్యార్థం సెప్టెంబరు నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదలను పరిపాలనా కారణాల వల్ల టిటిడి వాయిదా వేసింది. ప్రతినెలా 20వ తేదీన మరుసటి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబరు నెల‌ దర్శన టికెట్ల విడుదల తేదీని త్వరలో తెలియజేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలియజేశారు. భక్తులు ఈ విషయాన్ని గుర్తించాలని టిటిడి కోరుతోంది.

Tirumala

2021-08-19 16:33:29

త్వరలో కాషన్ డిపాజిట్ సొమ్ము రీఫండ్..

తిరుమలలో వసతి పొందిన భక్తులు గది ఖాళీ చేశాక కాషన్ డిపాజిట్ త్వరగా వారి బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అదనపు ఈవో  ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. గోకులం అతిథి గృహంలో గురువారం సాయంత్రం ఆయన ఐటి విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భక్తులు గది ఖాళీ చేసిన 12 గంటల్లోగా కాషన్ డిపాజిట్ టీటీడీ వారి ఖాతాకు జమ చేయడం జరుగుతోందన్నారు. అయితే బ్యాంకు నుంచి వెండార్ కు, వెండార్ నుంచి భక్తుడి ఖాతాలో జమ కావడానికి మూడు రోజుల సమయం పడుతోందని చెప్పారు. ఇంకా త్వరగా కాషన్ డిపాజిట్ భక్తుల ఖాతాలో జమ అయ్యేలా బ్యాంక్ అధికారులతో.మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాలుగు రోజుల్లో కాషన్ డిపాజిట్ తిరిగి రాకపోతే భక్తులే ఫోన్ చేసి అడిగేందుకు వీలుగా ఒక మొబైల్ నంబర్ ఏర్పాటు చేయాలని  ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలో గదులు పొందిన భక్తులు ఆ గదుల్లో వసతికి సంబంధించిన ఇబ్బందులు ఉంటే ఫిర్యాదు చేయడానికి వీలుగా 9966812345 నంబర్ అందుబాటులోకి తేవాలన్నారు. గదుల్లో వసతులకు సంబంధించి ప్రస్తుతానికి భక్తుల నుంచి చాలా తక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని, ఇవి కూడా రాకుండా ఎఫ్ ఎమ్ ఎస్ అధికారులు పని చేయాలని అదనపు ఈవో సూచించారు. తిరుమలలో గదుల లభ్యత, మరమ్మతుల వివరాలు తెలిపేలా ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ తయారు చేయాలని ఐటి అధికారులను ఆదేశించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే ఉద్దేశ్యంతో తయారు చేసిన సాఫ్ట్వేర్ అప్లికేషన్లను క్రమం తప్పకుండా సెక్యూరిటి ఆడిట్ చేయించాలని ఆయన చెప్పారు. తిరుపతిలో భక్తులు దిగగానే తిరుమల యాత్ర గొప్ప అనుభూతి కల్పించేలా చేయడానికి సకల సమాచారంతో కూడిన వర్చువల్ టూర్ లాంటి సాఫ్ట్వేర్ అప్లికేషన్ రూపొందించాలన్నారు.  టీటీడీలో పలు విభాగాలకు   సంబంధించిన కేబుల్స్ ఎలా పడితే అలా ఉంచకుండా, క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

     టీటీడీ డేటా సెంటర్ ను బలోపేతం చేయాలని, ఇందుకోసం టీటీడీలోని క్వాలిఫైడ్ సిబ్బందిని ఎంపిక చేసి అవసరమైతే ప్రోత్సాహకాలు ఇద్దామని ఆయన అన్నారు. టీటీడీలోని ఐటి విభాగం సిబ్బందికి శిక్షణ ఇప్పించడానికి దేశంలోని ప్రముఖ ఐటి సంస్థల నుంచి నిపుణులను ఆహ్వానించాలని చెప్పారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో ఐటి చదువుతున్న  విద్యార్థులకు ఇంటర్న్ షిప్ కల్పించేలా ఏర్పాట్లు చేయాలని ఐటి అధికారులను ఆయన ఆదేశించారు. డోనార్ సెల్ కు వివిధ ట్రస్ట్ లకు  విరాళాలు ఇస్తున్న భక్తుల కోసం యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా సాఫ్ట్వేర్ ను మార్పులు చేయాలని ఆయన చెప్పారు. ఐటి విభాగాధిపతి  శేషారెడ్డి, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్  సందీప్, డిప్యూటీ ఈవో లు లోకనాథం,  భాస్కర్,  రమేష్, పద్మావతి ఈ సమీక్ష లో పాల్గొన్నారు.

Tirumala

2021-08-19 16:32:34

కపిలేశ్వరస్వామికి స్పీకర్ శ్రీ ఓం బిర్లా పూజలు..

లోక్‌స‌భ స్పీక‌ర్  ఓం బిర్లా కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి మంగళవారం తిరుప‌తిలోని శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారిని ద‌ర్శించుకున్నారు. టిటిడి జెఈఓ సదా భార్గవి, ఆల‌య అర్చ‌కులు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారి దర్శనానంతరం నవగ్రహాలు, శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంత‌రం టిటిడి ఛైర్మన్  వైవి.సుబ్బారెడ్డి, జెఈఓ  సదా భార్గవి కలిసి కండువా, తీర్థ‌ప్ర‌సాదాలు అందించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపిలు విజయసాయిరెడ్డి,  మిధున్ రెడ్డి,  గురుమూర్తి,  భరత్, ఆల‌య డెప్యూటీ ఈవో  సుబ్ర‌మ‌ణ్యం, విఎస్వో  మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Tirupati

2021-08-17 14:13:29

శ్రీవారిని దర్శించుకున్న లోక్ సభ స్పీకర్..

లోక్ సభ స్పీకర్  ఓం బిర్లా కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.  ఆలయం వద్దకు చేరుకున్న స్పీకర్ కు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈఓ  ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్పీకర్  ఓం బిర్లా ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించి ఆ తరువాత మూలమూర్తి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్, ఈఓ కలిసి శ్రీవారి తీర్థప్రసాదాలు, డైరీ, క్యాలెండర్, కాఫీ టేబుల్  బుక్ అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిలు  విజయసాయిరెడ్డి,  మిధున్ రెడ్డి,  గురుమూర్తి, భరత్, కలెక్టర్  హరినారాయణన్, అదనపు ఎస్పీ మునిరామయ్య, ఆలయ డెప్యూటీ ఈఓ  రమేష్ బాబు, రిసెప్షన్ డెప్యూటీ ఈఓ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2021-08-17 14:03:38

లోక కళ్యాణం కోసం శ్రీ‌వారిని ప్రార్థించా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దేశంతోపాటు ప్ర‌పంచ ప్ర‌జ‌లంద‌రూ సుఖ‌సంతోషాల‌తో, ఆరోగ్య‌వంతులుగా ఉండాలని, విశ్వమానవ కల్యాణం కోసం ఆశీస్సులు అందించాలని శ్రీవారిని ప్రార్థించిన‌ట్టు లోక్‌స‌భ స్పీకర్  ఓం బిర్లా తెలిపారు. మంగ‌ళ‌వారం ఉద‌యం తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం ఆల‌యం వెలుప‌ల మీడియాతో మాట్లాడారు. శ్రీవారిపై త‌న‌కు అపారమైన నమ్మకం ఉందని, ప్రస్తుతం ఉన్న సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తిని స్వామివారు ఇస్తారని చెప్పారు. భారత్ పెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఉభ‌య‌స‌భ‌ల్లోని సభ్యులు తమ పాత్రను సక్రమంగా పాటించేలా స్వామివారు కరుణ చూపాలని కోరారు.

Tirumala

2021-08-17 14:02:22

ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం సందర్శన..

లోక్‌స‌భ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠాన్ని సంద‌ర్శించారు. వేద విజ్ఞాన పీఠానికి చేరుకున్న స్పీకర్ కు ఇక్క‌డి వేద‌పండితులు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ప్రార్థ‌నా మందిరంలో గ‌ల శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి అర్చ‌కులు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. స్పీక‌ర్ దంప‌తుల‌కు వేద‌పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. టిటిడి ఛైర్మ‌న్‌  వైవి.సుబ్బారెడ్డి దంప‌తులు శాలువ‌, శ్రీ‌వారి చిత్రప‌టం, తీర్థ‌ప్ర‌సాదాల‌తో స్పీక‌ర్ దంప‌తుల‌ను స‌న్మానించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపిలు  విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి, గురుమూర్తి,  భరత్, అదనపు ఈఓ  ఎవి.ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tirupati

2021-08-17 14:01:36