1 ENS Live Breaking News

ఆగ‌స్టు 18 నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు..

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగ‌స్టు 18 నుంచి 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఆగ‌స్టు 17న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. కోవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటిస్తూ ఈ ఉత్స‌వాలను జ‌రుపుతారు.పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.  ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వ‌హిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. ఆగ‌స్టు 18న పవిత్రాల ప్రతిష్ట, ఆగ‌స్టు 19న పవిత్ర సమర్పణ, ఆగస్టు 20న పూర్ణాహుతి కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తారు.  ప‌విత్రోత్స‌వాల్లో ఆగ‌స్టు 17న అంకురార్ప‌ణ కార‌ణంగా సహస్రదీపాలంకార సేవను టిటిడి ర‌ద్ధు చేసింది. అదేవిధంగా, ఆగ‌స్టు 18 నుండి 20వ తేదీ వ‌ర‌కు వ‌ర్చువ‌ల్ సేవ‌లైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ర‌ద్ద‌య్యాయి.

Tirumala

2021-08-16 14:40:51

శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా..

లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా సోమవారం మధ్యాహ్నం కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద  స్పీకర్ కు టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, జేఈవో శ్రీమతి సదా భార్గవి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.ఆలయంలో ధ్వజస్తంబానికి మొక్కు కున్న అనంతరం శ్రీ ఓంబిర్లా అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆశీర్వాద మండపంలో టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి స్పీకర్ కు అమ్మవారి తీర్థ ప్రసాదాలు,  అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశం క్షేమంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయారారోగ్యాలతో ఉండాలని శ్రీ పద్మావతి అమ్మవారిని కోరుకున్నానని స్పీకర్ చెప్పారు.  ఈ కార్యక్రమంలో ఎంపి లు  వి.విజయసాయిరెడ్డి,  పివి మిథున్ రెడ్డి,  ఎం. గురుమూర్తి , డిప్యూటీ ఈవో  కస్తూరి బాయి పాల్గొన్నారు.

Tirupati

2021-08-16 14:35:17

ప్రాణదానం ట్రస్ట్ కు రూ.10 లక్షల విరాళం..

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాణదానం ట్రస్ట్ కు హైదరాబాద్ కు చెందిన హైకోర్టు న్యాయవాి సి.శ్రీనివాస రెడ్డి  రూ 10 , 01, 116 విరాళం అందించారు. గురువారం సాయంత్రం తిరుమలలో టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి కి ఈ మేరకు ఆయన డిడి ని అందజేశారు. ఈ సందర్భంగా దాత మాట్లాడుతూ, స్వామివారి సేవలో ఎందరో తరిస్తున్నారని తనకు ఇపుడు అవకాశం వచ్చిందన్నారు. తనవంతుగా చేసిన ఈ సహాయంతో కొందరికైనా స్వామివారి క్రుపతో ప్రాణాలు నిలబడాలని అభిప్రాయ పడ్డారు. ఈ కార్యక్రమంతో టిటిడి అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-08-12 15:31:20

తరిగొండ వెంగమాంబ 204వ వర్ధంతి ఉత్సవాలు..

శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 204వ వర్ధంతి ఉత్సవాలు ఆగస్టు 15, 16వ తేదీల్లో తిరుమల, తిరుపతి, తరిగొండలో జ‌రుగ‌నున్నాయి. టిటిడి తరిగొండ వెంగ‌మాంబ ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. కోవిడ్‌-19 నేప‌థ్యంలో ప‌రిమిత సంఖ్య‌లో భ‌క్తుల‌తో ఈ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.   వెంగమాంబ జన్మస్థలమైన తరిగొండలో కొలువైన శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో ఆగస్టు 15వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఆగస్టు 16వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీలక్ష్మీనృసింహస్వామివారికి కల్యాణోత్సవం జ‌రుగ‌నుంది. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆగస్టు 15వ తేదీన ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తరిగొండ వెంగమాంబ సాహిత్యంపై సదస్సు జ‌రుగనుంది. అదేరోజు సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా  ఆగస్టు 16వ తేదీ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు,  సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు ప్రముఖ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 16వ తేదీ  ఉదయం 11.30 గంటలకు  ఎం.ఆర్‌.పల్లి సర్కిల్‌ వద్ద ఉన్న తరిగొండ వెంగమాంబ విగ్రహానికి టిటిడి అధికారులు పుష్పాంజలి ఘటిస్తారు. తిరుమ‌ల‌లోఆగస్టు 16వ తేదీ ఉదయం 9 గంటలకు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ బృందావనంలో టిటిడి ఉన్నతాధి కారులు పుష్పాంజలి సమర్పించనున్నారు.

వెంగ‌మాంబ ప్ర‌స్థానం..
తరిగొండ వెంగమాంబ క్రీ.శ 1730వ సంవత్సరంలో చిత్తూరు జిల్లా వాయల్పాడు సమీపంలోని తరిగొండ గ్రామంలో కానాల మంగమాంబ, కానాల కృష్ణయామాత్యులు దంపతులకు  జన్మించారు. శ్రీ వేంకటేశ్వరుని దయవల్ల కలిగిన సంతానం కావున ఈమెకు 'వెంగమాంబ' అని పేరు పెట్టారు. ఈమెకు పదేళ్ల వయసులోనే ఇంజేటి వేంకటాచలపతి అనే వ్యక్తితో బాల్య వివాహం జరిగింది. వివాహమైన కొన్నాళ్లకే భర్త వియోగం ఏర్పడింది. అయినా శ్రీ వేంకటేశ్వరుడే తన భర్త అని ప్రకటించి వెంగమాంబ ముత్తయిదువు చిహ్నాలు ధరించే ఉండేవారు. మదనపల్లికి చెందిన రూపావతారం సుబ్రహ్మణ్యయోగి వద్ద ఆధ్యాత్మిక విద్య, యోగవిద్య ఉపదేశం పొందారు. కొద్దికాలానికే ఆ విద్యల్లో ఎంతో అనుభవం సాధించారు. ఆధ్యాత్మిక, భక్తి, యోగ విషయాలకు సంబంధించి తరిగొండలో 5, తిరుమలలో 13 పుస్తకాలు రాశారు. ఇందులో యక్షగానాలు, సంకీర్తనలు, స్తోత్రాలు, పద్యరచనలు, ద్విపదరచనలు ఉన్నాయి. వెంగమాంబ తిరుమల శ్రీవారి ఆలయంలో ఏకాంతసేవలో ''ముత్యాలహారతి'' అనే విశిష్ట నిత్యకైంకర్యాన్ని నెలకొల్పారు. ఈ సేవ నేటికీ అవిచ్ఛిన్నంగా జరుగుతూనే ఉంది. తాళ్లపాక అన్నమాచార్యుల వారిని ప్రస్తుతించిన ఏకైక కవయిత్రి వెంగమాంబ కావడం విశేషం. క్రీ.శ. 1817వ సంవత్సరంలో తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవేంకటేశ్వరున్ని స్మరిస్తూ వెంగమాంబ సజీవసమాధి చెందారు.

Tirumala

2021-08-12 15:22:40

స్వయం సహాయక సంఘాలు బలపడాలి..

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయం సహాయక సంఘ సభ్యులతో “ఆత్మ నిర్భర్ నారీ శక్తి సే సంవాద్” ముఖాముఖి కార్యక్రమం గురువారం ప్రత్యక్ష ప్రసారం ద్వారా నిర్వహించారు. ఈ కార్యక్రమములో పధక సంచాలకులు, డి.ఆర్.డి.ఎ – వై.కె.పి, అదనపు పధక సంచాలకులు – వై.కె.పి, సంఘ సభ్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ప్రధానమంత్రి  మాట్లాడుతూ స్వయం సంఘ సభ్యులు ఆర్ధికంగా బలపడాలని తెలియజేసినారు. సంఘ సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులను online ద్వారా అమ్మకాలు జరిపి లాభాలా బాటలో నడవాలని తెలియజేసినారు.  సంఘ ఇస్తున్న బ్యాంక్ లింకేజ్ మొత్తము రూ. 10.00 లక్షల రూపాయలను రెండు రెట్లు అనగా రూ.20.00 లక్షలు పెంచుతున్నారని, వీటి ద్వారా జీవనోపాధులను పెంపొందించుటకు దోహద పడునని తెలియజేసినారు. అన్ని రాష్ట్రాలలో గల మహిళా సంఘ సభ్యులు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసినారు.

Vizianagaram

2021-08-12 13:56:04

తిరుమలలో ఆగస్టు 13న గరుడ పంచమి..

తిరుమ‌ల‌లో ఆగస్టు 13వ తేదీ శుక్ర‌వారంనాడు గరుడ పంచమి పర్వదినం జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు త‌న‌కు ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించ‌నున్నారు. ప్రతి ఏడాదీ తిరుమ‌ల‌లో గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు ''గరుడపంచమి'' పూజ చేస్తారని ప్రాశస్త్యం.

Tirumala

2021-08-12 13:54:03

ఆగ‌స్టు 18నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు..

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగ‌స్టు 18 నుంచి 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఆగ‌స్టు 17న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలిసి తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.  పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఉదయం 9.00 నుంచి 11.00 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు. ఆగ‌స్టు 18న పవిత్ర‌ ప్రతిష్ట, ఆగ‌స్టు 19న పవిత్ర సమర్పణ, ఆగస్టు 20న పూర్ణాహుతి నిర్వహిస్తారు.

Tirumala

2021-08-10 16:22:41

తిరుమలలో శ్రీవారి ఆర్జితసేలు రద్దు..

తిరుమలలో శ్రీవారి ప‌విత్రోత్స‌వాల కార‌ణంగా ఆగ‌స్టు 18 నుం 20వ తేదీ వ‌ర‌కు వ‌ర్చువ‌ల్ సేవ‌లైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. అదేవిధంగా ఆగ‌స్టు 17న అంకురార్ప‌ణ సంద‌ర్భంగా సహస్రదీపాలంకార సేవను ర‌ద్ధు చేసింది. కోవిడ్ - 19 వ్యాప్తి నేప‌థ్యంలో శ్రీ‌వారి ప‌విత్రోత్స‌వాల‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించి.. తిరుమల తిరుపతి దేవస్థానాకి సహకరించాలని ఒక ప్రకనలో కోరింది..

Tirumala

2021-08-10 16:21:50

సీఎం వైఎస్ జగన్ ను కలిసిన బ్రిటన్ హై కమిషనర్..

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను క్యాంప్‌ కార్యాలయంలో బ్రిటన్‌ డిప్యూటీ హైకమిషనర్‌ (ఏపీ, తెలంగాణ) డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్, బ్రిటీష్‌ ట్రేడ్, ఇన్వెస్టిమెంట్‌ హెడ్‌ వరుణ్‌ మాలి, పలువురు బృంద సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం ఆంధ్రప్రదేశ్‌ లో జరుగుతున్న అభివృద్దిని వివరించి, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని బ్రిటన్‌ టీంను కోరారు. ఏపీలో ఆరోగ్యం, ఇంధనం, విద్యుత్‌ వాహనాలు, వ్యవసాయ టెక్నాలజీ, వాతావరణ మార్పులు వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు సీఎంకి  బ్రిటన్‌ టీమ్ కి వివరించారు. అనంతరం డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ను సన్మానించి, జ్ఞాపిక సీఎం జగన్ అందజేశారు.

Tadepalle

2021-08-10 15:59:58

పీఏసీ సభ్యుడిగా విజయసాయి రెడ్డి..

కేంద్ర ప్రభుత్వ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) సభ్యులుగా వైఎస్సార్సీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని రాజ్య సభ సెక్రటరీ జనరల్‌ దేష్‌ దీపక్‌ వర్మ ఒక బులెటెన్‌ ద్వారా మంగళవారం అధికారికంగా ప్రకటించారు. రాజ్యసభ నుంచి గతంలో పీఏసీ సభ్యులుగా వ్యవహరించిన భూపేందర్ యాదవ్‌, రాజీవ్‌ చంద్రశేఖర్‌ కేంద్ర మంత్రివర్గంలో చేరడంతో వారి స్థానాలు ఖాళీ అయ్యాయి. ఖాళీ అయిన ఈ 2 స్థానాలకు నామినేషన్లు ఆహ్వానించగా  విజయసాయి రెడ్డితోపాటు బీజేపీకి చెందిన డాక్టర్‌ సుధాంశు త్రివేది నామినేషన్లు దాఖలు చేశారు. ఇతరులెవరూ ఈ పోటీలో లేకపోవడంతో వీరిద్దరూ పీఏసీకి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ ప్రకటించారు.

New Delhi

2021-08-10 13:14:10

ఆగస్టులో 2 సార్లు శ్రీవారి గరుడవాహన సేవ..

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఆగస్టు నెలలో రెండుసార్లు గరుడవాహనసేవ జరుగనుంది. ఆగస్టు 13వ తేదీ గరుడ పంచమి, ఆగస్టు 22వ తేదీ శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా శ్రీమలయప్పస్వామివారు గరుడవాహనంపై నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.  ఆగస్టు 13వ తేదీన‌ గరుడ పంచమి పర్వదినం జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు త‌న‌కు ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించ‌నున్నారు.  ప్రతి ఏడాదీ తిరుమ‌ల‌లో గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు ''గరుడపంచమి'' పూజ చేస్తారని ప్రాశస్త్యం.  ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో నిర్వహించే పౌర్ణమి గరుడసేవను ఆగస్టు 22వ తేదీ శ్రావణ పౌర్ణమినాడు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీవారు గరుడునిపై ఆలయ నాలుగు వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

తిరుమల

2021-08-09 13:19:59

అల్లూరి తిరిగిన ప్రాంతానికి రావడం నా అదృష్టం..

మన్యం వీరుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు తిరుగాడిన  ప్రాంతానికి రావడం, అయన సమాదులను సందర్శించడం తన అదృష్టంగా భావిస్తున్నానని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి  నిర్మలా సీతారామన్ అన్నారు.ఆదివారం కేంద్ర మంత్రి పర్యటన లో భాగంగా గొలుగొండ మండలం కృష్ణ దేవి పేటను సందర్శించారు.  అల్లూరి సీతారా మరాజు,అనుచరులు గాం గంటం దొర,గాం మల్లుదొర , సమాదులను సందర్శించి ఘన నివాళులు అర్పించారు. ఆనంతరం అల్లూరి స్మారక పార్క్ లో మొక్కలను నాటారు.  ఈ కార్యక్రమానికి హాజరైన చిన్నారులతో కొద్ది సేపు మంత్రి ముచ్చటించారు. నేనిక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? బ్రిటిష్ వాళ్ళని పారద్రోలడానికి 100 సంవత్సరాల క్రితం ఇక్కడ "రంప పితూరి "జరిగింది. ఈ ఉద్యమ నాయకుడిగా అల్లూరి వ్యవహరించారు.అదే విధంగా మనకు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్స రాలు   అవుతున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా భారత స్వాతంత్ర ఉద్యమం లో పాల్గొన్న విశిష్ట ప్రదేశాలను గుర్తించి  ఆయా ప్రాంతాలలో" ఆజాదీకా అమృత్ ఉత్సవ్ " కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నదన్నారు.  ఆనాటి స్వాతంత్ర్య ఉద్యమంలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన ప్రతీ ఒక్కరినీ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి,ఎమ్ పీలు బీ సత్యవతి, గొడ్డేటి మాధవి, ఎమ్ ఎల్ సి పి వి యన్ మాధవ్, ఎం ఎల్ ఏ పెట్ల ఉమా శంకర్ గణేశ్, జాయింట్ కలెక్టర్ పి అరుణ్ బాబు, ఏ ఎస్ పీ మణికంఠ, డీ సి సి బీ ఛైర్పర్సన్  సీ హెచ్ అనిత, అర్ డీ వో అనిత, అధిక సంఖ్య లో స్థానిక ప్రజలు హాజరయ్యారు.

Krishnadevipeta

2021-08-08 09:14:28

ప్రజలకి ఉచిత టీకా కేంద్రమే ఇస్తుంది..

దేశంలోని ప్రజలందరికీ కేంద్రప్రభుత్వమే ఉచితంగా కరోనా టీకా ఇస్తుందని కేంద్ర ఆర్దిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఆదివారం విశాఖ చినవాల్తేరులో జరుగుతున్న కోవిడ్ వేక్సినేషన్ కార్యక్రమాన్ని ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీతారామన్ మాట్లాడుతూ, కరోనా నియంత్రణకు కేంద్రం అన్ని రకాలుగా పటిష్ట చర్యలు చేపడుతుందన్నారు.  ప్రదాని నరేంద్ర మోదీ  నాయకత్వంలో దేశంలో ఇప్పటికే అనుకున్నంత కంటే ఎక్కువ మంది ప్రజలకు ఉచితంగా టీకా అందజేసామని మరికొన్ని మాసాలలో అందరికీ ఉచితంగా టీకాలను అందజేస్తామని స్పష్టం చేశారు.  జిల్లా కలెక్టర్ మల్లికార్జున గారు టీకా ఏవిదంగా సరపరా చేస్తున్నామనే విషయాలను మంత్రికి వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర అద్యక్షులు  సోము వీర్రాజు, ఎమ్మెల్సీ పి.వి.ఎన్ మాధవ్ , ఎంపీ నరసింహారావు,  రాష్టృ ఆర్దిక శాఖ మంత్రిబుగ్గన.రాంజేంద్రనాథ్ , తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-08-08 07:14:20

ఖాదీ అభివ్రుద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలు..

దేశంలోని ఖాదీ పరిశ్రమను ప్రోత్సాహించి చేనేత కార్మికులు ఆర్ధికంగా నిలదొక్కుకొనేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అందులో భాగంగా జాతీయ చేనేత దినోత్సవాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినట్లు చెప్పారు. శనివారం జిల్లా పర్యటనలో భాగంగా పొందూరులోని ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం భవనంలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత నూలు వడుకు యంత్రాలను పరిశీలించి, వివరాలను నేత కార్మికులను అడిగి తెలుసుకున్నారు. కార్మిక సంఘ భవనం ఆవరణలో నూతనంగా నిర్మించనున్న ఖాదీ కార్మికుల సామూహిక షెడ్ కు ఆమె శంకుస్థాపన చేశారు. తదుపరి నేత కార్మికులు మర యంత్రాలు ద్వారా వస్త్రాలను రూపొందిస్తున్న విధానాన్ని పరిశీలించిన ఆమె వస్త్రాల తయారీకి సంభందించిన పూర్తి వివరాలు ఆమె అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఏర్పాటుచేసిన వస్త్ర ప్రదర్శనను తిలకించి, ప్రాంగణంలో మొక్కను నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చేనేత కార్మికులు పడుతున్న కష్టాలను  దూరం చేసి, వారిని ఆర్ధికంగా ఎదిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. దేశవ్యాప్తంగా చేనేత మెగా క్లస్టర్లను ఏర్పాటుచేసి వారిని ప్రోత్సహించేలా కార్యక్రమాలను రూపొందించామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. జిల్లాలోని పొందూరు ఖాదీకి ప్రత్యేకత ఉందని, అయితే ఇక్కడ మెగా చేనేత క్లస్టర్ ఏర్పాటు కాకపోవడానికి నేత కార్మికుల సంఖ్య తగ్గడమే అని చెప్పారు. కావున ఆ సంఖ్యను పెంచుకొని మెగా క్లస్టర్లను ఏర్పాటుచేసుకోవాలని ఆమె కార్మికులకు పిలుపునిచ్చారు. తొలుత ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘానికి రూ.18 లక్షల చెక్కును ఆమె అందించారు. అలాగే భవన నిర్మాణానికి చెందిన ధ్రువీకరణ పత్రాలను ఆమె సంఘ ప్రతినిధులకు అందజేశారు.

ఈ పర్యటన కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, రాజ్యసభ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, జి.వి.ఎల్. నరసింహా రావు,ఉత్తరాంధ్ర శాసన మండలి సభ్యులు పి.వి.ఎన్. మాధవ్, దువ్వాడ శ్రీనివాస్,ఎచ్చెర్ల శాసన సభ్యులు గొర్లె కిరణ్ కుమార్, వీవర్స్ సెల్ రాష్ట్ర సభ్యులు బండారు జై ప్రతాప్ కుమార్,కేంద్ర అదనపు కార్యదర్శి సంజీవ్ కౌశిక్,ఖాదీ గ్రామ పరిశ్రమ కమీషన్ ఆర్ధిక సలహాదారు ఆషిమా గుప్త,జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్,  ఎస్.పి అమిత్ బర్దార్,టెక్కలి సబ్ కలెక్టర్ వికాస్ మర్మాట్, సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములునాయుడు, ఖాదీ పరిశ్రమ సంచాలకులు ఎస్.రఘు, సౌత్ జోన్ డిప్యూటీ సి.ఇ. ఓ ఆర్.ఎస్.పాండే,బి.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు జి.రాజారావు, ఆంధ్ర ఫైన్ ఖాదీ కార్మిక అభివృద్ధి సంఘం అధ్యక్షులు జి.కె.ప్రసాదరావు, కార్యదర్శి దండ వెంకటరమణ, గ్రామ సర్పంచ్ రేగిడి లక్ష్మి , ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2021-08-07 14:39:15