1 ENS Live Breaking News

ఆగ‌స్టు 7న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో..

తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ డ‌య‌ల్ యువ‌ర్ కార్య‌క్ర‌మం ఆగ‌స్టు7 శ‌నివారం తిరుప‌తిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో జరుగనుంది. ఉద‌యం 9 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ  కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి‌తో ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261 భక్తులు అధికారులకు సమస్యలను కూడా ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయవచ్చు. దానికి అనుగుణంగా అధికారులు కూడా సమాధానాలు ఇవ్వనున్నారు.

Tirupati

2021-08-05 16:06:48

ధ‌ర్మప్ర‌చారం కోసం ఉమ్మ‌డి ప్ర‌ణాళిక..

హిందూ ధ‌ర్మ ప్ర‌చారాన్ని మ‌రింత విస్తృతం చేయ‌డంలో భాగంగా హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిషత్‌, టిటిడిలోని అన్ని ధార్మిక ప్రాజెక్టులు క‌లిపి ఉమ్మ‌డి ప్ర‌ణాళిక రూపొందించాల‌ని టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో సోమ‌వారం అన్ని ప్రాజెక్టుల అధికారుల‌తో అద‌న‌పు ఈవో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ సంవ‌త్స‌రం పొడ‌వునా నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌తో ప్రాజెక్టుల వారీగా వార్షిక క్యాలెండ‌ర్‌ను రూపొందించాల‌న్నారు. హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిషత్ ఆధ్వ‌ర్యంలో శ్రావ‌ణ‌పౌర్ణ‌మి, వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం, కృష్ణాష్ట‌మి ప‌ర్వ‌దినాల‌ను మండల స్థాయిలో నిర్వ‌హించాల‌ని, ఇందుకోసం భ‌జ‌న‌మండ‌ళ్లు, ఎస్వీ వేదవిశ్వ‌విద్యాల‌యం వేద‌పండితులు, నాలాయిర దివ్య ప్ర‌బంధ ప్రాజెక్టు అధ్యాప‌కులు, స్థానిక అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు, శ్రీ‌వారి సేవ‌కులను భాగ‌స్వాముల‌ను చేయాల‌న్నారు. ఆళ్వార్ దివ్య‌ప్ర‌బంధ ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో దివ్యప్ర‌బంధంలోని 4 వేల పాశురాల‌ను తెలుగులోకి అనువ‌దించాల‌ని, ఇందుకోసం తెలుగు, త‌మిళం తెలిసిన పండితుల‌తో క‌మిటీ ఏర్పాటుచేయాల‌ని కోరారు. ఆళ్వార్ల తిరున‌క్ష‌త్ర ఉత్స‌వాల్లో స్థానిక భ‌క్తుల‌ను భాగ‌స్వాముల‌ను చేయాల‌న్నారు. దాస‌సాహిత్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో నిపుణులైన పండితుల‌తో క‌మిటీ ఏర్పాటుచేసి అందుబాటులో ఉన్న అన్ని దాస సంకీర్త‌న‌ల‌ను సేక‌రించాల‌ని, వాటిని ఇత‌ర భాష‌ల్లోకి అనువ‌దించాల‌ని ఆదేశించారు.

            కృష్ణా, గుంటూరు, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో శ్రావ‌ణమాసంలో శుక్ర‌వారంనాడు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించాల‌ని అద‌న‌పు ఈవో సూచించారు. తూర్పుగోదావరి, విశాఖ‌ప‌ట్నం, శ్రీ‌కాకుళం జిల్లాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో కృష్ణాష్ట‌మి ప‌ర్వదినాన్ని నిర్వ‌హించాల‌న్నారు.  అన్న‌మాచార్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో అన్న‌మయ్య సంకీర్త‌న‌ల‌కు అర్థాన్ని వివ‌రించే ప‌నిని వేగ‌వంతం చేయాల‌న్నారు. పురాణ ఇతిహాస ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న అగ్నిపురాణం ముద్ర‌ణ‌ను త్వ‌ర‌గా పూర్తి చేసి, మిగిలిన 13 పురాణాల అనువాద ప‌నులు చేప‌ట్టాల‌ని సూచించారు. త‌రిగొండ వెంగ‌మాంబ వాఙ్మ‌య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో ఇంకా ముద్రించాల్సిన పుస్త‌కాల వివ‌రాల‌ను సిద్ధం చేయాల‌న్నారు. ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే వేద‌స‌భ‌లు, చ‌తుర్వేద హ‌వ‌నాల్లో మిగిలిన ప్రాజెక్టుల సిబ్బంది కూడా పాల్గొనాల‌న్నారు. ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు, పురంద‌ర‌దాస సంకీర్త‌న‌ల రికార్డింగ్‌ను వేగ‌వంతం చేయాల‌ని ఆదేశించారు. ప్ర‌స్తుతం శ్రీ‌నివాస క‌ల్యాణాలు నిర్వ‌హించేందుకు అనువైన ప‌రిస్థితులున్నాయా అనే అంశాన్ని ప‌రిశీలించాల‌న్నారు.

             టిటిడి నిర్వ‌హించే అన్ని ధార్మిక కార్య‌క్ర‌మాల్లో ఆయా ప్రాజెక్టుల అధికారులు, సిబ్బందితోపాటు ప్ర‌జాసంబంధాల విభాగం, ఎస్వీబీసీ, స‌ప్త‌గిరి మాస‌ప‌త్రిక విభాగాల‌ను భాగ‌స్వాముల‌ను చేయాల‌ని సూచించారు. అన్ని ప్రాజెక్టుల స‌మ‌న్వ‌యంతో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని, ఈ బాధ్య‌త‌ను ప్రోగ్రాం అధికారులు తీసుకోవాల‌ని కోరారు. ఆయా ప్రాజెక్టుల్లో అప‌రిష్కృతంగా ఉన్న ధార్మిక గ్రంథ ర‌చ‌న‌ల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌న్నారు.  ఈ స‌మావేశంలో అన్ని ప్రాజెక్టుల అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2021-08-02 16:43:13

సింధుకు ఏపీ గవర్నర్ అభినందన..

టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ విభాగంలో తెలుగు తేజం పీవీ సింధు కాంస్య పతకం సాధించి కొత్త రికార్డు నెలకొల్పటం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరి చందన్ సంతోషం వ్యక్తం చేశారు.  చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోతో హోరాహోరీగా సాగిన పోరులో సింధు స్పష్టమైన ఆధిక్యం కనబరిచి, వరుస గేమ్స్‌లో 21-13, 21-15 తేడాతో అద్భుత విజయం సాధించారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆమె రెండో పతకం అందించగా గవర్నర్ తన అభినందనలు తెలిపారు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధు, తాజా ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించి భారత దేశానికి గుర్తింపు తీసుకు వచ్చారని గవర్నర్ ప్రస్తుతించారు.  వరుసగా రెండుసార్లు ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా సింధు కొత్త రికార్డు సృష్టించారని గౌరవ హరిచందన్ పేర్కొన్నారు. భవిష్యత్తులో సింధు మరిన్ని విజయాలు సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు.

Tadepalle

2021-08-01 15:22:33

అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలం..

 తిరుమల లోని అంజనాద్రి పర్వతమే ఆంజనేయ స్వామి వారి జన్మస్థలమని వాల్మీకి రామాయణం లో స్పష్టంగా ఉందని శ్రీ కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరీ  పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని, వివాదం అవసరమే లేదని చెప్పారు. టీటీడీ శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో హనుమంతుని జన్మస్థలం అంజనాద్రి అనే అంశంపై శుక్రవారం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం లో రెండురోజుల అంతర్జాతీయ వెబినార్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భారతీ మహాస్వామి  దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కృత యుగంలో వృషాద్రి, త్రేతాయుగంలో అంజనాద్రి, కలియుగంలో వెంకటాచలంగా పిలవబడుతోందని చెప్పారు.బ్రహ్మాండ పురాణంలో ఈ విషయం ఉందన్నారు. దీంతో పాటు అనేక పురాణాల్లో అంజనాద్రి ఆంజనేయుని జన్మస్థలమని పేర్కొన్నట్లు స్వామి వివరించారు. కిష్కింధకు శాస్త్ర, పురాణ ప్రమాణాలు లేవని స్వామి చెప్పారు. సంస్కృతం, పురాణం, శాస్త్రాలు తెలియని వారికి ఇలాంటి విషయాల గురించి మాట్లాడే అర్హత ఉండదని అన్నారు.

    టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షోపన్యాసం చేశారు. తాను ఈవో గా బాధ్యతలు తీసుకున్న రెండు నెలలకే అంజనాద్రి హనుమంతుని జన్మస్థలమని, ఈ విషయం గురించి ఆలోచించాలని పలువురు మెయిల్స్ ద్వారా సూచనలు చేశారని చెప్పారు. దీనిపై తాను పలువురు ప్రముఖ పండితులతో మాట్లాడితే ఇందుకు తగిన ఆధారాలు ఉన్నాయని వారు వివరించారన్నారు. వీటిపై నమ్మకం కుదిరాకే 2020 డిసెంబరు లో పండిత పరిషత్ ఏర్పాటు చేసినట్లు ఈవో తెలిపారు. ఈ పరిషత్ పురాణ, ఇతిహాస, భౌగోళిక, పురావస్తు అంశాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశోధించి అంజనాద్రి హనుమంతుని జన్మస్థలమని నిర్ధారణ చేసిందన్నారు. జార్ఖండ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర లో ఆంజనేయుని జన్మ స్థలాలుగా అక్కడి వారు నమ్ముతున్న ప్రాంతాలను కూడా పండిత పరిషత్ పరిశీలించిందన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా పండితులు ఆధారాలతో సహా ఈ విషయం ప్రకటించడంతో పాటు బుక్ లెట్ కూడా విడుదల చేశామని చెప్పారు. ఈ అంశాన్ని సశేషంగానే ఉంచి, ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. ఒకరిద్దరు అభ్యంతరాలు తెలపడానికి వస్తే చర్చ పెట్టామని, వారు మాట్లాడిన భాష, వ్యవహరించిన తీరు చాలా అభ్యంతర కరంగా ఉండటంతో వారితో ఇక మాట్లాడలేదన్నారు. అవసరమైతే మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు.

    మహీంద్రా  విశ్వవిద్యాలయం న్యాయ కళా శాల డీన్  మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ, రామాయణాన్ని కూడా అనుమానించే యుగంలో మనం ఉన్నామన్నారు. రామాయణం జరిగిందనడానికి ధనుష్కోటి లోని రామసేతు వంతెనలాంటి అనేక ఆధారాలు ఉన్నాయన్నారు. తిరుమల అంజనాద్రి ఆంజనేయుని జన్మస్థలమని టీటీడీ తీసుకున్న పురాణ ఆధారాలు చాలా బాగాఉన్నాయన్నారు. 2007లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటి ముద్రించిన హనుమాన్స్ కేం అనే పుస్తకంలో కూడా అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలమని రాసారని చెప్పారు. టీటీడీ కంటే కొన్ని దశాబ్దాల ముందే చాలామంది ఈ విషయం రాశారని ఆయన తెలిపారు.  జాతీయ సంసృత విశ్వవిద్యాలయం ఉప కులపతి , టీటీడీ పండిత పరిషత్ అధ్యక్షులు ఆచార్య వి.మురళీధర్ శర్మ  మాట్లాడుతూ, అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలమని నిర్ధారించడానికి పండిత పరిషత్ పరిశోధన ప్రపంచానికి తెలియాలనే వెబినార్ నిర్వహిస్తున్నామని చెప్పారు. పురాణాలు లేక పోతే భారతీయతే లేదన్నారు. ఈ విషయంపై అందరి అభిప్రాయాలు సేకరించి సమగ్ర పుస్తకం ముద్రిస్తామని అన్నారు.

     జీవా డైరెక్టర్ ఆచార్య సముద్రాల రంగ రామానుజాచార్యులు మాట్లాడుతూ, అంజనాద్రిలో ఆంజనేయుడు జన్మించారని అనేక పురాణాల్లో ఉందన్నారు.  ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. వెంకటాచల మహాత్యం, వెంకటాచలం ఇతిహాసమాల, తిరుమల సమయాచారముల పుస్తకాలు ప్రతిఒక్కరు చదివితీరాలని అన్నారు.

     పూణె దక్కన్ కాలేజి ప్రాజెక్టు డైరెక్టర్ ఆచార్య వెంపటి కుటుంబరావు శాస్త్రి, పురాణాలు ప్రామాణికం కాదంటే భారతీయతను నరుక్కున్నట్లే నని చెప్పారు. పురాణాలు ప్రామాణికం కాదనే వారి వాదనలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

 వెబినార్ లో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా  విశ్రాంత డైరెక్టర్ డాక్టర్ కె. మునిరత్నం, ఆచార్య శంకర నారాయణ, ఆర్కియాలజీ అండ్ మ్యూజియం విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ విజయ కుమార్, సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్ ఎ. ప్రసన్న కుమార్,  విశ్రాంత సంస్కృతోపన్యాసాకులు శ్రీ.ఇ. సింగరాచార్యులు, చారిత్రక పరిశోధకులు  గోపికృష్ణ వివిధ అంశాలపై మాట్లాడి అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలమని నిరూపించే ఆధారాలను తెలియజేశారు. శ్రీ శక్తి పీఠాధీశ్వరి  రమ్యానంద భారతీ స్వామిని, తిరుమల  పెద్ద జియ్యంగారు అనుగ్రహ భాషణం చేశారు. పండిత పరిషత్ కార్యదర్శి డాక్టర్ ఆకెళ్ళ విభీషణ శర్మ,  పండిత పరిషత్ సభ్యులు ఆచార్య రాణి సదాశివమూర్తి పాల్గొన్నారు.

Tirumala

2021-07-30 17:31:21

తిరుమలలో ర‌క్ష‌ణ ఏర్పాట్లు పరిశీలన..

తిరుమలలో భ‌క్తుల భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకుని రెండో ద‌శ‌లో చేప‌డుతున్న బాహ్య‌వ‌ల‌య(ఔట‌ర్ కార్డ‌న్‌) ర‌క్ష‌ణ ఏర్పాట్ల‌ను సివిఎస్వో  గోపినాథ్ జెట్టి బుధ‌వారం క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌లో భాగంగా టిటిడి ఇదివ‌ర‌కే మొద‌టి ద‌శలో ర‌క్ష‌ణ ఏర్పాట్ల‌ను పూర్తి చేసింది. భ‌ద్ర‌త‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేయ‌డంలో భాగంగా రెండో ద‌శ బాహ్య‌వ‌ల‌య ప‌నులు చేప‌ట్టాల్సిన ప్రాంతాల‌ను అధికారులు ప‌రిశీలించారు. సివిఎస్వో వెంట టిటిడి చీఫ్ ఇంజినీర్  నాగేశ్వ‌ర‌రావు, ఇఇ-1 జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, ఎవిఎస్వోలు  గంగ‌రాజు, ప‌వ‌న్‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2021-07-28 15:08:05

ధ‌న ప్రాప్తికై అయోధ్యకాండ పారాయ‌ణం..

శ్రీ‌వారి అనుగ్ర‌హంతో సృష్టిలోని స‌క‌ల జీవ‌రాశులు సుభిక్షంగా ఉండాల‌ని, స‌క‌ల కార్యాలు సిద్ధించాల‌ని కోరుతూ తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో శ్రీ‌మ‌ద్రామాయ‌ణ పారాయ‌ణ కార్య‌క్ర‌మంలో భాగంగా రెండ‌వ రోజైన సోమ‌వారం ఉద‌యం అయోధ్య‌ కాండ పారాయ‌ణం నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్  కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని మాట్లాడుతూ రామాయ‌ణంలోని అయోధ్య‌కాండ పారాయ‌ణం చేసిన‌, విన్న‌ ప్ర‌తి ఒక్క‌రికి  ధ‌న ప్రాప్తి క‌లుగుతుంద‌ని చెప్పారు. ఇందులో శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి అంద‌రికి ధ‌నం, ధాన్యం, గోవులు, ఏనుగులు త‌దిత‌ర వాటిని దానం చేసిన‌ట్లు వివ‌రించారు.  అయోధ్య‌కాండ‌లోని 32వ స‌ర్గ‌ల్లో గ‌ల 45 శ్లోకాల‌ను 16 మంది వేద పండితులు ఉద‌యం 8.30 గంట‌ల‌కు, మ‌ధ్యాహ్నం 1 గంట‌కు పారాయ‌ణం చేశారు. అదేవిధంగా రాత్రి 7 గంట‌ల‌కు పారాయ‌ణం చేయ‌నున్నారు.  ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠంలో మ‌రో 16 మంది ఉపాస‌కులు ఉద‌యం, సాయంత్రం వేళ‌ల్లో హనుమంత‌, సీతాల‌క్ష్మ‌ణ స‌మేత శ్రీ‌రాముని మూల‌మంత్రానుష్టానం, శాస్త్రోక్తంగా జ‌ప‌-త‌ర్ప‌ణ‌-హోమాలు  నిర్వ‌హించారు.ఆగ‌స్టు 23వ తేదీ వ‌ర‌కు 30 రోజుల పాటు ఈ పారాయ‌ణాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తోంది.

Tirumala

2021-07-26 16:21:18

మానవీయ విలువలు పెంపొందించేందుకే..

యువ‌త‌లో మాన‌వీయ‌, నైతిక విలువలు పెంపొందించేందుకు, ఆర్ష గ్రంథాలు, ప్రాచీన సంప్ర‌దాయాల‌కు చేరువ చేసేందుకే రామాయ‌ణం, మ‌హాభార‌తం, భ‌గ‌వ‌ద్గీత పారాయ‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌ని టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఆదివారం బాల‌కాండ పారాయ‌ణ ప్రారంభ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ  సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ సుంద‌ర‌కాండ పారాయ‌ణం ద్వారా శ్రీ‌వారి అనుగ్ర‌హంతో క‌రోనా మొద‌టి ద‌శ‌, రెండో ద‌శలను అధిగ‌మించ‌గ‌లిగామ‌ని చెప్పారు. క‌రోనా మూడో ద‌శ ప్ర‌మాదం పొంచి ఉంద‌ని, ఇది పిల్ల‌ల‌పై ఎక్కువ ప్ర‌భావం చూపే అవ‌కాశ‌ముంద‌ని డాక్ట‌ర్లు, శాస్త్రవేత్త‌లు చెబుతున్న క్ర‌మంలో బాల‌కాండ పారాయ‌ణం ద్వారా శ్రీ‌వారి ఆశీస్సులు పిల్ల‌లంద‌రిపై ఉండాల‌ని ఆశిస్తూ ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్టామ‌న్నారు. ఇందులో శ్రీ‌రాముని బాల్యం, విద్యాభ్యాసం, విశ్వామిత్రుని శిష్య‌రికం, రాక్ష‌స‌సంహారం, శివ‌ధ‌నుర్భంగం త‌దిత‌ర అంశాలు ఉంటాయ‌ని తెలిపారు. మంత్ర‌పూరిత‌మైన ఈ శ్లోకాల‌ను ఉచ్ఛ‌రించి, అర్థ‌తాత్ప‌ర్యాలు తెలుసుకుని, ప్ర‌స్తుత‌ స‌మాజ ప‌రిస్థితుల‌కు అన్వ‌యించుకోవ‌డం ద్వారా స‌త్ఫ‌లితాలు ల‌భిస్తాయ‌న్నారు. టిటిడి ఏర్పాటుచేసిన పండిత్ ప‌రిష‌త్ సూచ‌ల‌తో ఇలాంటి కార్య‌క్ర‌మాలు రూపొందిస్తున్నామ‌ని, పారాయ‌ణం ద్వారా రామాయ‌ణంలోని ప్ర‌తి శ్లోకాన్ని భ‌క్తులంద‌రితో ప‌లికిస్తామ‌ని చెప్పారు.

              జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య ముర‌ళీధ‌రశ‌ర్మ బాల‌కాండ ప్రాముఖ్య‌త‌, విశిష్ట‌త‌పై మాట్లాడుతూ రామాయ‌ణ కావ్యం ధ‌ర్మార్థ‌కామ‌మోక్షాల‌ను ప్ర‌సాదిస్తుంద‌న్నారు. భ‌గ‌వంతుడు విశ్వ‌చైత‌న్య‌స్వ‌రూపుడని, శ్రీ‌రాముడు త‌న అవ‌త‌ర‌ణ ద్వారా కుమారుడిగా, భ‌ర్త‌గా, సోద‌రుడిగా, తండ్రిగా, చ‌క్ర‌వ‌ర్తిగా అనేక ఆద‌ర్శాల‌ను చాటార‌ని వివ‌రించారు. యోగ్యుడైన విద్యార్థి శ్రీ‌రాముడైతే, యోగ్యుడైన‌ గురువు విశ్వామిత్రుడని అన్నారు. విశ్వామిత్రుడు త‌ప‌స్సుతో సంపాదించిన అస్త్రాల‌న్నీ త‌న శిష్యుడైన రామునికి అందించార‌ని, ఇది గురుశిష్యుల సంబంధానికి ప్ర‌తీక అని తెలియ‌జేశారు.

              తిరుమ‌ల‌ ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని బాల‌కాండ ప్ర‌వ‌చ‌నక‌ర్త‌ల‌ను ప‌రిచ‌యం చేశారు. ధ‌ర్మ‌గిరి వేద‌విజ్ఞాన‌పీఠం శాస్త్ర పండితులు డా. కోగంటి రామానుజాచార్యులు శ్లోక పారాయ‌ణం చేస్తార‌ని, ఎస్వీ వేద విశ్వవిద్యాల‌యం ఆచార్యులు డా. ప్ర‌వా రామ‌కృష్ణ సోమ‌యాజి వ్యాఖ్యానం అందిస్తారని తెలిపారు. రామాయ‌ణంలోని బాల‌కాండను క‌ర్మ‌కాండ‌, అయోధ్య‌కాండ‌ను ధ‌ర్మ‌కాండ‌, అర‌ణ్య‌కాండ‌ను మోక్ష‌కాండ‌, కిష్కింధ‌కాండ‌ను ఆచార్యకాండ‌, సుంద‌ర‌కాండ‌ను మంత్ర‌కాండ, యుద్ధ‌కాండను ముక్తికాండ‌, ఉత్త‌ర‌కాండ‌ను స‌మాధాన‌గా కాండ‌గా అభివ‌ర్ణించారు.  జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఆచార్యులు డా. కుప్పా విశ్వ‌నాథ‌శ‌ర్మ విద్యార్థుల‌పై బాల‌కాండ ప్ర‌భావంపై మాట్లాడుతూ ల‌క్ష్య‌సాధ‌న‌కు చేయాల్సిన క‌ఠోర‌మైన ప‌రిశ్ర‌మ, త‌ల్లిదండ్రుల మాట‌ను శిర‌సావ‌హించ‌డం లాంటి విష‌యాల్లో శ్రీ‌రాముడు విద్యార్థులంద‌రికీ ఆద‌ర్శ‌నీయుడ‌న్నారు.  ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ రామాయ‌ణ వైభ‌వం - వాల్మీకి వైశిష్ట్యంపై మాట్లాడుతూ రామాయ‌ణం ద్వారా మాన‌వుని ఆద‌ర్శ జీవ‌న విధానం ఎలా ఉండాలో తెలుసుకోవ‌చ్చ‌న్నారు. ఆర్ష చింత‌న‌తోనే స‌మాజంలో నాగ‌రిక‌త వ‌ర్ధిల్లుతుంద‌ని, మ‌న‌స్ఫూర్తిగా క‌ర్మ‌ను ఆచ‌రిస్తే ఎంత‌టి ఉన్న‌త‌స్థితికైనా చేరుకోవ‌చ్చ‌ని తెలిపారు.

               ఎస్వీ వేద విశ్వవిద్యాల‌యం ఆచార్యులు డా. ప్ర‌వా రామ‌కృష్ణ సోమ‌యాజి బాల‌కాండ స్వ‌రూపం - వివిధ అంశాలు అనే అంశంపై మాట్లాడారు. ద‌శ‌ర‌థ మ‌హారాజు రాజ్య‌పాల‌న‌, మంత్ర‌వ‌ర్గం, భార్య‌లు, ప‌రివారం, అశ్వ‌మేథ‌యాగం నిర్వ‌హ‌ణ‌, పుత్ర‌కామేష్టి యాగం, వాన‌ర‌రాజ్యం, రామ‌చంద్ర ప్ర‌భువు జ‌న‌నం, విశ్వామిత్రుని యాగ‌సంర‌క్ష‌ణ‌, తాట‌కి వ‌ధ‌, అహ‌ల్య శాప‌విమోచ‌నం, శివ‌ధ‌నుర్భంగం, సీతారాముల క‌ల్యాణం త‌దిత‌ర అంశాలు బాల‌కాండ‌లో ఉంటాయ‌ని వివ‌రించారు. ఆ త‌రువాత ధ‌ర్మ‌గిరి వేద‌విజ్ఞాన‌పీఠం శాస్త్ర పండితులు డా. కోగంటి రామానుజాచార్యులు బాల‌కాండ రామాయ‌ణ ఫ‌ల‌శృతిని వినిపించారు. బాల‌కాండ శ్లోకంతో పారాయ‌ణాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్రార్థ‌నా శ్లోకాలు, సంక‌ల్పం, విషూచికా మంత్రం, ధ‌న్వంత‌రి మంత్రం, న‌వ‌గ్ర‌హ ప్రార్థ‌న శ్లోకాల‌ను పారాయ‌ణం చేశారు. ముందుగా టిటిడి అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారిణి శ్రీ‌మ‌తి బుల్లెమ్మ ఏడ‌కేడ నీ చ‌రితలు ఏమ‌ని పొగ‌డ‌వ‌చ్చు... అనే కీర్త‌న‌ను వీనుల‌విందుగా ఆల‌పించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీబీసీ సీఈవో సురేష్‌కుమార్‌, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య ద‌క్షిణామూర్తి, ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన‌పీఠం, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం పండితులు పాల్గొన్నారు.

తిరుమల

2021-07-25 16:22:22

శ్రీ‌మ‌ద్రామాయ‌ణ పారాయ‌ణం..

శ్రీ‌వారి అనుగ్ర‌హంతో సృష్టిలోని స‌క‌ల జీవ‌రాశులు సుభిక్షంగా ఉండాల‌ని, స‌క‌ల కార్యాలు సిద్ధించాల‌ని కోరుతూ తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో శ్రీ‌మ‌ద్రామాయ‌ణ పారాయ‌ణం ఆదివారం ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ఆగ‌స్టు 23వ తేదీ వ‌ర‌కు 30 రోజుల పాటు ఈ పారాయ‌ణం జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్   కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని మాట్లాడుతూ శ్రీ‌మ‌ద్రామాయ‌ణ పారాయ‌ణం ఒక జ్ఞాన‌య‌జ్ఞమ‌న్నారు. వేద‌స్వ‌రూప‌మైన రామాయ‌ణ పారాయ‌ణం ద్వారా భ‌క్తి, జ్ఞానం, వైరాగ్యం, చిత్త‌శుద్ధి క‌లుగుతాయ‌ని, వీటి ద్వారా మోక్షం ల‌భిస్తుంద‌ని చెప్పారు. మోక్ష‌సాధ‌నే మాన‌వ జీవితానికి సార్థ‌క‌త అన్నారు. ఈ పారాయ‌ణ గ్రంథాన్ని ఎస్వీబీసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామ‌ని, భ‌క్తులు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని పారాయ‌ణం చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. రామాయ‌ణంలోని బాల‌కాండ, అయోధ్య‌కాండ‌, అర‌ణ్య‌కాండ‌, కిష్కింధ‌కాండ‌, సుంద‌ర‌కాండ‌, యుద్ధ‌కాండలోని ప్ర‌ధాన‌మైన స‌ర్గ‌ల‌ను రోజుకు ఒక‌టి చొప్పున పారాయ‌ణం చేస్తామ‌న్నారు. అయితే జ‌న్మాంత‌ర స‌క‌లసౌఖ్య‌ప్రాప్తి కోసం యుద్ధ‌కాండ‌లోని 131వ స‌ర్గ‌లో గ‌ల 120 శ్లోకాల‌ను 30 రోజుల పాటు పారాయ‌ణం చేస్తామ‌ని వివ‌రించారు. మ‌రోవైపు ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠంలో ఉద‌యం, సాయంత్రం వేళ‌ల్లో హోమాలు, జ‌పాలు, హనుమంత‌, సీతాల‌క్ష్మ‌ణ స‌మేత శ్రీ‌రాముని మూల‌మంత్రానుష్టానం జ‌రుగుతాయ‌ని తెలియ‌జేశారు. ఈ కార్య‌క్ర‌మాల్లో మొత్తం 32 మంది వేద‌పండితులు పాల్గొంటున్నార‌ని చెప్పారు. తొలిరోజు ధ‌ర్మ‌కార్య‌సిద్ధి కోసం అయోధ్య‌కాండ‌లోని 21 నుండి 25 స‌ర్గ‌ల్లో గ‌ల 221 శ్లోకాలు, జ‌న్మాంత‌ర స‌క‌లసౌఖ్య‌ప్రాప్తి కోసం యుద్ధ‌కాండ‌లోని 131వ స‌ర్గ‌లో గ‌ల 120 శ్లోకాలు క‌లిపి మొత్తం 341 శ్లోకాల‌ను పారాయ‌ణం చేశారు. ముందుగా హ‌నుమ‌త్ సీతాలక్ష్మ‌ణభ‌ర‌తశ‌త్రుజ్ఞ స‌మేత శ్రీ‌రాముల‌కు పూజ‌లు నిర్వ‌హించి ఐదు అర‌టి పండ్లు నైవేద్యంగా స‌మ‌ర్పించారు.  ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీబీసీ సీఈవో  సురేష్‌కుమార్‌, ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ, ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన‌పీఠం పండితులు పాల్గొన్నారు.

Tirumala

2021-07-25 10:26:35

శాస్త్రోక్తంగా చాతుర్మాసదీక్ష సంకల్పం..

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం పెద్దజీయంగారి నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం జరిగింది. ఈ సందర్భంగా పెద్దజీయర్‌స్వామి మాట్లాడుతూ శ్రీ వైష్ణ‌వ సంప్ర‌దా‌యక‌ర్త శ్రీ రామానుజాచార్యుల పారంప‌ర్యంలో చాతుర్మాస దీక్ష విశేషమైన‌ద‌న్నారు. ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారని తెలిపారు. కావున ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారని, చాతుర్మాస వ్రతం ప్రాచీనకాలం నుండి ఆచరణలో ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోందని వివరించారు. అనంతరం  చిన్నజీయర్‌స్వామి మాట్లాడుతూ రామానుజాచార్యులవారి వంశపారంపర్య ఆచారంలో భాగంగా గురు పూర్ణిమ ప‌ర్వ‌దినాన ఈ చాతుర్మాస దీక్ష సంకల్పాన్ని చేయడం విశేషమైనదిగా భావిస్తారన్నారు.  అంతకుముందు  పెద్దజీయ‌ర్ స్వామి మ‌ఠంలో క‌ల‌శ స్థాప‌న, క‌ల‌శ పూజ‌, విష్వక్సేనారాధన, మేదినిపూజ, మృత్సంగ్రహణం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు. త‌రువాత సేక‌రించిన పుట్ట మ‌న్నుకు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి చాతుర్మాస సంక‌ల్పం స్వీక‌రించారు. అనంత‌రం ‌‌పెద్దజీయంగారు తిరుమల బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కనగల జీయ్యంగారి మఠం వద్ద నుండి  చిన్నజీయంగారు మరియు ఇతర శిష్యబృందంతో బయల్దేరారు. తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ  స్వామి పుష్కరిణి, శ్రీ వరాహస్వామివారి బాలాలయాన్ని సందర్శించారు. అక్కడినుంచి మంగళవాయిద్యాలతో శ్రీవారి ఆలయానికి విచ్చేశారు.

         శ్రీవారి ఆలయ మహ‌ద్వారం చెంత టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో  ఎ.వి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి ఇతర ఆలయ అధికారులతో కలిసి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికారు.  జీయంగార్లు శ్రీవారిని దర్శించుకున్న తరువాత  పెద్దజీయంగారికి మేల్‌చాట్‌ వస్త్రాన్ని,  చిన్నజీయంగారికి నూలుచాట్‌ వస్త్రాన్ని బహూకరించారు.   అనంతరం పెద్దజీయర్‌ మఠంలో  పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి కలిసి ఈవో, అద‌న‌పు ఈవో, సివిఎస్వోను శాలువతో సన్మానించారు. అనంత‌రం పెద్దజీయర్ స్వామి భ‌క్తుల‌కు కొబ్బ‌రికాయల‌ను బ‌హూక‌రించారు. ఈ కొబ్బ‌రికాయ‌ల‌ను ఇంటిలో ఉంచుకుంటే ఆయురారోగ్యాలు, అష్టైశ్వ‌ర్యాలు సిద్ధిస్తాయ‌ని అర్చ‌కులు తెలిపారు.

Tirumala

2021-07-25 09:45:48

విశాఖస్టీలు ప్లాంట్ అమ్మకం ఆపండి..

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌(ఆర్‌ఐఎన్‌ఎల్‌)ను విక్రయించే ఆలోచనను ఉపంసహరించుకోవాలని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి  నిర్మల సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. ఉక్కు కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి శుక్రవారం ఆయన ఆర్థిక మంత్రితో భేటీ అయ్యారు. అనేక ఏళ్ళ పోరాటాలు, 32 మంది ఆత్మబలిదానాల అనంతరం 1966లో విశాఖ ఉక్కు పరిశ్రమ ఆవిర్భవించి ఆంధ్రుల చిరకాల కల నెరవేరింది. ఈ పరిశ్రమ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలలో నవరత్నగా నిలిచిన విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్‌కే ఆభరణం వంటిది. 35 వేల మంది ఉద్యోగులు, కార్మికులతోపాటు లక్షకుపైగా కుటుంబాలు విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌పై ఆధారపడి జీవనోపాధిని కొనసాగిస్తున్నాయి. స్టీల్‌ ప్లాంట్‌ కారణంగానే విశాఖపట్నం నగరం మహా నగరంగా విస్తరించి రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నగరంగా భాసిల్లుతోందని విజయసాయి రెడ్డి మంత్రికి వివరించారు. ఇటీవల దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టించిన సమయంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ద్వారా దేశంలోని అనేక ప్రాంతాలకు లిక్విడ్‌ మెడికల్‌ ఆక్జిజన్‌ను రైళ్ళ ద్వారా తరలించి లక్షలాది మంది ప్రాణాలను నిలబెట్టిన విషయాన్ని ఆయన మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అలాగే విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లో ఉత్పతి అయ్యే స్టీల్‌ నాణ్యతలో ప్రపంచస్థాయి సంస్థలకు పోటీ ఇస్తుంది.
అలాంటి సంస్థ కేవలం సొంతంగా గనులు లేకపోయినందునే నష్టాలను చవిచూడాల్సి వస్తోందని అన్నారు. కేవలం ఇనుప ఖనిజాన్ని మార్కెట్‌ రేటుకు కొనుగోలు చేయడం కోసమే ఆర్‌ఐఎన్‌ఎల్‌ ఏటా 300 కోట్ల రూపాయలను అదనంగా భరించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల దృష్ట్యా ఆర్‌ఐఎన్‌ఎల్‌కు సొంత గనులు కేటాయించి, అప్పులను ఈక్విటీ కింద మారిస్తే అతి తక్కువ కాలంలోనే విశాఖ ఉక్కు తిరిగి లాభాల బాట పడుతుంది. తద్వారా ఆ లాభాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి భారీగా డివిడెండ్లు చెల్లిస్తుందని ఆర్థిక మంత్రికి ఆయన సమర్పించిన వినతి పత్రంలో వివరించారు.

New Delhi

2021-07-23 15:58:20

గోసంర‌క్ష‌ణకై గోవిందుని గోప‌థ‌కం..

సనాత‌న ధ‌ర్మంలో ఎంతో వైశిష్ట్యం గ‌ల గోవుల సంర‌క్ష‌ణ కోసం నూత‌నంగా గోవిందుని గోప‌థ‌కం ప్రాజెక్టును ప్రారంభించామ‌ని, త్వ‌ర‌లో విధివిధానాలు తెలియ‌జేస్తామ‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. గోవిందుని గోప‌థ‌కం ప్రాజెక్టుకు సంబంధించి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి నేతృత్వంలో టిటిడి బోర్డు నిష్ణాతుల‌ క‌మిటీ ఏర్పాటుచేసింది. ఈ క‌మిటీ మొద‌టి స‌మావేశం శుక్ర‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా క‌మిటీ స‌భ్యులు దేశంలోని ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించి వారి అనుభ‌వాల‌ను ఈవోకు వివ‌రించారు.  స‌మావేశం అనంత‌రం ఈవో మీడియాతో మాట్లాడుతూ గో ఆధారిత ప‌దార్థాల‌తో స్వామివారి నైవేద్యం, ప్ర‌సాదం త‌యారు చేస్తామ‌న్నారు. పంచ‌గ‌వ్యాల‌తో త‌యార‌య్యే ఉత్ప‌త్తుల ద్వారా స‌మాజంలో గోవు ప్రాముఖ్య‌త‌ను పెంచ‌వ‌చ్చ‌న్నారు. గో ఆధారిత సేంద్రీయ వ్య‌వ‌సాయం ద్వారా మంచి దిగుబ‌డులు రాబ‌ట్ట‌వ‌చ్చ‌ని చెప్పారు. క‌మిటీ స‌భ్యులు ప‌లు అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించార‌ని, వారి సూచ‌న‌లు నిర్మాణాత్మ‌కంగా, స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డేలా ఉన్నాయ‌ని తెలిపారు. ఈ క‌మిటీ స‌భ్యులు శుక్ర‌, శ‌నివారాల్లో గోశాల‌లను సంద‌ర్శించి ప‌లు అంశాల‌పై అధ్య‌య‌నం చేస్తార‌ని చెప్పారు. ఈ స‌మావేశంలో టిటిడి సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వ‌ర‌రావు, ఎస్వీ గోశాల డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌ర‌నాథ‌రెడ్డి, క‌మిటీ స‌భ్యులైన బోర్డు మాజీ స‌భ్యులు కె.శివ‌కుమార్‌,  ఎం.విజ‌య‌రామ‌కుమార్‌, డాక్ట‌ర్ ఎం.శివ‌రామ్‌, డాక్ట‌ర్ జి.విజ‌య‌కుమార శ‌ర్మ‌, డాక్ట‌ర్ టి.ప‌ద్మాక‌ర‌రావు,  జి.నాగేంద‌ర్‌రెడ్డి, డాక్ట‌ర్ ఉమాశంక‌ర మ‌హాపాత్రో, డాక్ట‌ర్ కె.శివ‌సాగ‌ర్‌రెడ్డి పాల్గొన్నారు.

Tirumala

2021-07-23 13:28:04

యాత్రికుల కోసం కంప్లైంట్ ట్రాకింగ్..

తిరుమల శ్రీవారి దర్శనార్ధం వచ్చే భక్తులు..వారు పొందే గదులు, యాత్రికుల సౌక‌ర్యాల‌కు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు/సూచ‌న‌లు వ‌చ్చినా వెంట‌నే ప‌రిష్క‌రించేందుకు వీలుగా కంప్లైంట్ ట్రాకింగ్ సిస్ట‌మ్ అప్లికేష‌న్ రూపొందించాల‌ని టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి ఐటి అధికారుల‌ను ఆదేశించారు. తిరుమ‌ల గోకులంలో గ‌ల కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం  అద‌న‌పు ఈవో వివిధ విభాగాల అధికారులతో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ తిరుమ‌ల‌లోని వివిధ ప్రాంతాల్లో వేలాది గ‌దులు ఉన్నాయ‌ని, ఆయా ప్రాంతాల్లో గ‌దులు పొందిన యాత్రికులు ఫ‌ర్నీచ‌ర్‌, ప‌రుపులు, కొళాయిలు, ప‌రిశుభ్ర‌త‌, లైట్లు త‌దిత‌ర‌ స‌మ‌స్య‌ల‌ను తెలిపేందుకు వీలుగా ప్ర‌త్యేకంగా సెల్ నంబ‌రు ఏర్పాటు చేయాల‌ని రిసెప్ష‌న్ అధికారులను ఆదేశించారు. ఈ నంబ‌రుతో పాటు అవ‌స‌ర‌మైన ఇత‌ర స‌మాచారాన్ని అన్ని గ‌దుల్లో స్టిక్క‌ర్ల ద్వారా యాత్రికుల‌కు తెలియ‌జేయాల‌న్నారు. గ‌దులు పొందిన యాత్రికుల‌కు పంపే ఎస్ఎంఎస్‌లో కంప్లైంట్ ట్రాకింగ్ సిస్ట‌మ్ స‌మాచారం ఉంచాల‌న్నారు. యాత్రికుల ఫిర్యాదులు/సూచ‌న‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించేందుకు వీలుగా రిసెప్ష‌న్ విభాగం త‌గినంత మంది సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాల‌ని సూచించారు. గ‌దుల్లో మ‌రింత మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు కంప్లైంట్ ట్రాకింగ్ సిస్ట‌మ్ ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు.  అంత‌కుముందు సుప‌థం మార్గం ద్వారా భ‌క్తుల ప్ర‌వేశానికి సంబంధించి ఆల‌య అధికారుల‌తో అద‌న‌పు ఈవో స‌మీక్షించారు. ఈ స‌మావేశాల్లో డెప్యూటీ ఈవోలు ర‌మేష్‌బాబు, లోక‌నాథం,  భాస్క‌ర్‌, ఐటి విభాగాధిప‌తి శేషారెడ్డి, విజివో  బాలిరెడ్డి, ఈఈ(ఎఫ్ఎంఎస్‌) మ‌ల్లికార్జున ప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2021-07-20 16:59:01

శ్రీవారికి కొప్పెర హుండీ విరాళం..

తిరుమల శ్రీవారికి మంగ‌ళ‌వారం కొప్పెర హుండీ విరాళంగా అందింది. తిరుప‌తి స‌మీపంలోని కొప్పెర‌వాండ్ల‌ప‌ల్లెకు చెందిన  కొప్పెర సాయిసురేష్‌, కొప్పెర కుమార్ ఈ మేరకు హుండీని ఆలయంలో పేష్కార్  శ్రీ‌హ‌రికి అందించారు. రాగి, ఇత్త‌డితో క‌లిపి త‌యారుచేసిన ఈ హుండీ బ‌రువు 60 కిలోలు ఉంటుంద‌ని, దీని విలువ రూ.1.50 ల‌క్ష‌ల‌ని దాత‌లు తెలిపారు. తాము 200 ఏళ్లుగా వంశ‌పారంప‌ర్యంగా స్వామివారికి కొప్పెర హుండీలు స‌మ‌ర్పిస్తున్నామ‌ని దాత‌లు వెల్ల‌డించారు.

Tirumala

2021-07-20 16:53:35

మిజోరం గవర్నర్‌గా కె.హరిబాబు..

మిజోరం గవర్నర్ గా  హరిబాబు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. గతవారంలోనే కేంద్రం ఆయనను మిజోరం గవర్నర్ గా నియమించింది. ఆయన ఐజ్వాల్ లో ఆయన గవర్నర్ గాఈరోజు  ప్రమాణం చేశారు. దేశవ్యాప్తంగా ఇటీవలనే గవర్నర్లను కేంద్రం బదిలీ చేసింది.  ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణానికి చెందిన హరిబాబును మిజోరం గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ నెల 18 నుండి రాజధాని నగర పరిధిలో లాక్‌డౌన్ అమల్లో ఉంది. దీంతో కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారు. హరిబాబు మిజోరం రాష్ట్రానికి 22వ గవర్నర్ గా ఇవాళ భాద్యతలు చేపట్టారు. ఈ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో సీఎం జోరామ్‌తంగా, టాన్‌లూయా,ఉప ముఖ్యమంత్రి స్పీకర్,లాలిన్లియానా పైలో, మంత్రుల మండలి ముఖ్య కార్యదర్శి,డీజీపీతో పాటు పలు పార్టీ ముఖ్యలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

Haryana

2021-07-19 15:16:42