1 ENS Live Breaking News

3వ విడ‌త‌ అఖండ బాలకాండ పారాయ‌ణం..

కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై న‌వంబరు 2వ తేదీ మంగ‌ళ‌వారం మూడ‌వ‌ విడ‌త‌ అఖండ బాలకాండ పారాయణం జ‌రుగ‌నుంది. నాదనీరాజనం వేదికపై ఉదయం 6 నుంచి 8 గంటల వరకు జరుగనుంది. బాలకాండలోని 8 నుంచి 13 సర్గల వ‌ర‌కు గ‌ల 163 శ్లోకాలను పారాయణం చేస్తారు. ఎస్.వి. వేద విఙ్ఞాన పీఠం, ఎస్.వి. వేద విశ్వవిద్యాలయం, టిటిడి వేదపండితులు, టిటిడి సంభావన పండితులు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాల అధికారులు, పండితులు, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా శ్రీ‌వారి భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని టిటిడి కోరుతోంది.

Tirumala

2021-11-01 08:17:42

2021-10-31 02:18:55

శ్రీవారికి 3.604 కేజీల బంగారు బిస్కెట్లు విరాళం..

కోయంబత్తూరుకు చెందిన ఎం అండ్ సి ప్రాపర్టీస్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు బుధవారం తిరుమల శ్రీవారికి రూ.1.83 కోట్ల విలువ గల 3.604 కేజీల బంగారం బిస్కెట్లు కానుకగా అందించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈఓ  ఎవి.ధర్మారెడ్డికి ఈ విరాళాన్ని అందించారు. అనంతరం దాతలు శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థాన అధికారులు దాతల దర్శనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Tirumala

2021-10-27 15:22:47

గో సంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం..

అమెరికాలోని ప్రవాస భారతీయులు  వేంకటేశ్వరరావు, మాధవి దంపతులు రూ. 10 లక్షలు ఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు విరాళంగా అందించారు. తిరుపతి  టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో  కార్యాలయంలో గురువారం దాత  తన తల్లి  ఎం.వసంత జ్ఞాపకార్థం చెక్కును టీటీడీ ఈవో  డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డికి అందించారు. ఏపీఎన్ ఆర్టీ ద్వారా వీరు ఈ విరాళం అందించారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, తిరుమల కేంద్రంగా గోవులను పరిరక్షించేందుకు ఎంతో మంచి కార్యక్రమం టిటిడి చేపట్టడం ఆనందంగా వుందన్నారు. గోవులను ఎక్కడైతే పూజిస్తారో ఆ ప్రాంతం శుభిక్షంగా వుంటుందని తాము ప్రగాఢంగా నమ్ముతామని అన్నారు. ఈ కార్యక్రమంతో దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.

Tirumala

2021-10-27 15:16:23

22న శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు విడుదల..

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం నవంబరు, డిసెంబరు నెలలకు సంబంధించి రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్ఈ డి) టోకెన్లు అక్టోబరు 22 వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో  విడుదల చేస్తారు. అయితే డిసెంబరు 8 వ తేదీ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం, డిసెంబరు 16వ తేదీ  ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. ఈ రెండు రోజులకు సంబంధించి శ్రీవారి ఆలయ కార్యక్రమాలు ఇంకా ఖరారు కాలేదు. ఈ కార్యక్రమాల వివరాలు ఖరారయ్యాక డిసెంబరు 8 మరియు 16 వ తేదీలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు విడుదల చేస్తారు. నవంబరు నెలకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు అక్టోబరు 23వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తారు.  తిరుమలలో వసతికి సంబంధించి నవంబరు నెల కోటాను అక్టోబరు 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేయడం జరుగుతుందని టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయం గుర్తించి స్వామి వారి దర్శనం టోకెన్లు, తిరుమలలో వసతి బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.

Tirumala

2021-10-20 14:50:25

వ్రుద్ధులకు చంటిపిల్లలకు శ్రీవారి దర్శనాలు లేవు..

తిరుమలలో శ్రీవారి ప్రత్యేక దర్శనాలు  వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు పున‌రుద్ధ‌రించ‌లేదని టీటీడీ పేర్కొంది. కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో 2020, మార్చి 20వ తేదీ నుంచి వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నాల‌ను నిలిపివేశామని.. ఇప్ప‌టికి కూడా కోవిడ్ పూర్తి అదుపులోకి రానందువ‌ల్ల వీరి ద‌ర్శ‌నాల విష‌యంలో ఇదే స్థితి కొన‌సాగుతోందిని పేర్కొంది.  అయితే గ‌త కొన్ని రోజులుగా సామాజిక మాధ్య‌మాల్లో తిరుమ‌ల‌లో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు పున‌రుద్ధ‌రించిన‌ట్టు అవాస్త‌వ స‌మాచారం ట్రోల్ అవుతోంది. అనేకమంది ఇది నిజ‌మ‌ని న‌మ్మి తిరుపతికి  వ‌చ్చి ఇబ్బందులు ప‌డే అవ‌కాశం ఉంది. భ‌క్తులు ఈ విష‌యం గుర్తించాల్సిందిగా టిటిడి విజ్ఞ‌ప్తి చేస్తోంది. కోవిడ్ పూర్తిగా అదుపులోకి వ‌చ్చాక ఈ ద‌ర్శ‌నాల పున‌రుద్ధ‌ర‌ణ‌పై త‌గిన నిర్ణ‌యం తీసుకుని మీడియా ద్వారా భ‌క్తుల‌కు తెలియ‌జేయ‌డం జ‌రుగుతుంది. అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే వ‌ర‌కు సామాజిక మాధ్య‌మాల్లో వ‌చ్చే అవాస్త‌వ స‌మాచారాన్ని న‌మ్మ‌వ‌ద్ద‌ని టిటిడి కోరుతోంది.

Tirumala

2021-10-19 08:02:41

ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం..

ఒడిసాలోని భువ‌నేశ్వ‌ర్‌కు చెందిన శివం కాండెన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్ర‌తినిధి  రాఘ‌వేంద్ర శ‌నివారం ఎస్వీబీసీ ట్ర‌స్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం అందించారు.  ఈ మేర‌కు విరాళం చెక్కును తిరుమ‌ల‌లోని క్యాంపు కార్యాల‌యంలో అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు. ఈ సందర్భంగా దాత మాట్లాడుతూ, దేశంలోని ప్రముఖ భాషల్లో శ్రీవారి ఛానళ్లు ప్రారంభించి దేశంలోని అన్నివర్గాల ప్రజలకు స్వామి వైభవం చేరువ చేయాలని కోరారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-10-16 13:28:15

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ వారి బ్రహ్మోత్సవాలు..

తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీ‌వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శుక్ర‌వారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. రాత్రి 7 గంట‌లకు ఆల‌యంలో బంగారు తిరుచ్చి ఉత్స‌వం, రాత్రి 8.00 నుండి 9.00 గంటల మధ్య ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. ధ్వజారోహణం నాడు గరుడాళ్వార్ ఆహ్వానించిన దేవతలను తిరిగి సాగనంపే కార్యక్రమమే ధ్వజావరోహణం. తిరిగి వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఈ సందర్భంగా గరుడాళ్వార్ దేవతలను కోరతాడు. ఈ సందర్భంగా గరుడధ్యానం, భేరిపూజ, భేరితాడనం, గరుడగద్యం, దిక్పాలక గద్యం, గరుడ లగ్నాష్టకం, గరుడ చూర్ణిక అనే ఏడు మంత్రాలను అర్చకులు జపించారు.   ఈ కార్యక్రమంలో  శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి ఈవో డాక్ట‌ర్‌ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు ఎపి.నందకుమార్, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, జెఈఓ  సదా భార్గవి, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి దంపతులు, ఆలయ డెప్యూటీ ఈఓ  రమేష్ బాబు, విజివో  బాలిరెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-10-15 16:16:49

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు..

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద జస్టిస్ రమణకు టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్ కు పండితులు వేద ఆశీర్వాదం చేశారు.  ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి ఎన్వీ రమణకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం, 2022 డైరీ, క్యాలెండర్, టిటిడి తయారు చేసిన అగరబత్తులు అందజేశారు.శ్రీవారి దర్శనం అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ శ్రీ బేడీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. అఖిలాండం వద్ద కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టారు.

Tirumala

2021-10-15 16:12:24

శాస్త్రోక్తంగా చక్రధారుడి చక్రస్నానం..

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్ర‌వారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం 8 నుంచి 11 గంటల నడుమ శ్రీ‌వారి ఆల‌యంలోని ఐనా మ‌హ‌ల్ ముఖ మండ‌పంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం శాస్త్రో‌క్తంగా నిర్వహించారు. అనంత‌రం ఐనా మ‌హ‌ల్ ముఖ మండ‌పం ప్రాంగ‌ణంలో  ప్ర‌త్యేకంగా నిర్మించిన చిన్న పుష్క‌రిణిలో ఉద‌యం 10 గంట‌ల‌కు సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణీజలంలో ముంచి, స్నానం చేయించారు. ఇందువల్ల ఈ ఉత్సవాలు చేసినవారికి, చేయించినవారికి, ఇందుకు సహకరించినవారికీ, దర్శించిన వారికీ - అందరికీ ఈ ఉత్సవ యజ్ఞఫలం లభిస్తుంది.  ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టిటిడి వేదపారాయణదారులు పారాయణం  చేశారు. అభిషేకానంతరం వివిధ పాశురాలను శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్లు  పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.

చక్రస్నానం - లోకం క్షేమం

 తొమ్మిదిరోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై - లోకం క్షేమంగా ఉండడానికీ, భక్తులు సుఖశాంతుల్తో ఉండడానికీ - చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక - యజ్ఞాంతంలో అవభృథస్నానం' చేస్తారు. యజ్ఞనిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాలవల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, అన్నీ సంపూర్ణ ఫలాలు చేకూరడంకోసం చేసే దీక్షాంతస్నానం అవభృథం. చక్రస్నా
నంనాటి సాయంకాలం ధ్వజావరోహణం యథావిధిగా చేస్తారు. ఇంతటితో బ్రహ్మోత్సవయజ్ఞం మంగళాంతం అవుతుంది. ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకొంటారో వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారు. విషమృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల ఐహిక శ్రేయస్సులు పొందుతారు. పరాంతకాలం వరకూ ఎటువంటి జనన, మరణ వికారములు లేకుండా సర్వలోకాలలో యథేచ్ఛగా విహరిస్తూ బ్రహ్మానందాన్ని పొంది శాశ్వతమైన విష్ణులోకాన్ని చేరుకొంటారు.

         ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి  ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా, హైకోర్టు  న్యాయమూర్తులు జస్టిస్ ల‌లిత‌కుమారి, జస్టిస్ స‌త్య‌నారాయ‌ణ మూర్తి, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పార్త్ ప్రతీం సాహు, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.సోమరాజన్, శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి, టిటిడి ఛైర్మ‌న్  వై.వి.సుబ్బారెడ్డి , ఈవో డాక్ట‌ర్‌ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంపతులు, బోర్డు స‌భ్యులు  ప్ర‌శాంతి రెడ్డి,  అశోక్ కుమార్,  నంద కుమార్, లక్ష్మి నారాయణ, బోర సౌరబ్, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి దంపతులు, విజివో  బాలిరెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-10-15 16:10:32

అశ్వవాహనంపై అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు..

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన గురువారం రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీమలయప్పస్వామి వారు క‌ల్కి అలంకారంలో అశ్వ వాహ‌నంపై దర్శనమిచ్చారు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలిదోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నాడు.  వాహ‌న‌సేవ అనంత‌రం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి  ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా, హైకోర్టు  న్యాయమూర్తులు జస్టిస్ ల‌లిత‌కుమారి, జస్టిస్ స‌త్య‌నారాయ‌ణ మూర్తి, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పార్త్ ప్రతీం సాహు, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.సోమరజన్, శాసనసభ ఉప సభాపతి  కోన రఘుపతి, టిటిడి ఛైర్మ‌న్  వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్‌ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి దంపతులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

       శ్రీవారి సాల‌క‌ట్ల  బ్ర‌హ్మోత్స‌వాల్లో చివ‌రి రోజైన శుక్ర‌వారం ఉద‌యం 8 నుండి 11 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని ఐనా మ‌హ‌ల్ వ‌ద్ద‌ స్న‌ప‌న తిరుమంజ‌నం, చ‌క్ర‌స్నానం నిర్వ‌హిస్తారు. రాత్రి 7 గంట‌లకు ఆల‌యంలో బంగారు తిరుచ్చి ఉత్స‌వం, రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు ధ్వ‌జావ‌రోహ‌ణం జ‌రుగ‌నుంది.

Tirumala

2021-10-14 15:59:39

సర్వభూపాల వాహ‌నంపై శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్ప..

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు గురువారం  ఉదయం 7.35 నుంచి 9 గంటల వ‌ర‌కు రథోత్సవం బదులుగా శ్రీవారి ఆలయంలోని క‌ల్యాణోత్సవ మండ‌పంలో శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహ‌నంపై దర్శనమిచ్చారు. సర్వభూపాల అంటే రాజుల‌కు రాజు అని అర్థం. ఈ ప్ర‌పంచాన్ని మొత్తం పాలించే రాజు తానేనని భ‌క్త లోకానికి చాటి చెపుతూ స్వామివారు ఈ వాహ‌నాన్ని అధిష్టించారు.  ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, శాసనసభ ఉప సభాపతి  కోన రఘుపతి, టిటిడి ఈవో డాక్ట‌ర్‌ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు  ప్ర‌శాంతి రెడ్డి,  ఎపి.నందకుమార్, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి దంపతులు, విజివో  బాలిరెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో  ర‌మేష్‌బాబు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-10-14 05:27:18

శోభాయ‌మానంగా స్న‌ప‌న తిరుమంజ‌నం..

బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా మొద‌టిసారిగా ప‌టిక‌బెల్లం, కివిపండ్లు, ఎరువు ప‌విత్ర‌మాల‌లతో  ప్ర‌త్యేకంగా రూపొందించిన మాల‌లు, కిరీటాల‌తో స్న‌ప‌న తిరుమంజ‌నం శోభాయ‌మానంగా జ‌రిగింది.  శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో బుధ‌వారం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి వేదమంత్రాల న‌డుమ కంక‌ణ‌భ‌ట్టార్ శ్రీ వాసుదేవ భ‌ట్టాచార్యులు ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. దాదాపు రెండు గంట‌ల పాటు జ‌రిగిన స్న‌ప‌న తిరుమంజ‌నంలో కురువేరు, తెల్ల‌ప‌ట్టు, రంగురంగుల ఎండుఫ‌లాలు, వ‌ట్టివేరు, ప‌సుపు రోజామాల‌ల‌ను శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి అలంక‌రించారు. వేదపండితులు శ్రీసూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణసూక్తాలను పఠిస్తుండగా అర్చ‌క‌స్వాములు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం త‌దిత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు. తిరుపూర్ కు చెందిన దాత  రాజేందర్ స‌హ‌కారంతో స్వామి, అమ్మ‌వార్ల‌కు ప్ర‌త్యేక మాల‌లు, కిరీటాలు, హైద‌రాబాద్‌కు చెందిన  శ్రీ‌నివాస్‌,  శ్రీ‌ధ‌ర్ స‌హ‌కారంతో రంగ‌నాయ‌కుల మండ‌పం అలంక‌ర‌ణ చేశామని టిటిడి ఉద్యానవ‌న విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాసులు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంపతులు, అదనపు ఈఓ  ఎవి.ధర్మారెడ్డి దంపతులు, బోర్డు స‌భ్యులు  ప్ర‌శాంతి రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. శోభాయమానంగా సాగిన ఈ స్న‌ప‌న తిరుమంజ‌నాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

Tirumala

2021-10-13 15:25:44

చంద్ర‌ప్ర‌భ వాహ‌నంపై వటపత్రశాయిగా..

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు బుధ‌వారం రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు వటపత్రశాయి అలంకారంలో చంద్ర‌ప్ర‌భ వాహ‌నంపై దర్శనమిచ్చారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది. ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి, టిటిడి ఈవో డాక్ట‌ర్‌ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు ప్ర‌శాంతి రెడ్డి,  పోకల అశోక్ కుమార్, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు,  విజివో  బాలిరెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో  ర‌మేష్‌బాబు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-10-13 15:21:56

సూర్య‌ప్ర‌భ వాహ‌నంపై శ్రీ గోవింద‌రాజ‌స్వామిగా..

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు బుధ‌వారం ఉదయం 9 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు శ్రీ గోవింద‌రాజ‌స్వామి అలంకారంలో దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఉదయం సూర్యనారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి ఈవో డాక్ట‌ర్‌ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు  ప్ర‌శాంతి రెడ్డి, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, సివిఎస్వో  గోపినాధ్ జెట్టి దంప‌తులు, విజివో బాలిరెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో ర‌మేష్‌బాబు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.  రాత్రి 7 గంటలకు చంద్ర‌ప్ర‌భ ‌వాహనంపై శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు అనుగ్ర‌హిస్తారు.

Tirumala

2021-10-13 05:55:29