1 ENS Live Breaking News

ఇక సెలవు.. మీ ప్రీతి

మెడికో ప్రీతి అంత్యక్రియలు జనగాం జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండా గ్రామంలో సోమవారం మధ్యాహ్నాం ముగిశాయి. డాక్టర్ ప్రీతిని చివ రి సారిగా చూసేందుకు జనం తండోప తండాలుగా గ్రామానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యుల అశ్రునయనాలు, స్నేహితుల కన్నీటి వీడ్కోలు మధ్య అంత్యక్రియలు చేపట్టారు. ప్రీతిని చూడటానికి వచ్చిన వారంతా ర్యాగింగ్ భూతానికి ఇంకా ఎంత మంది బలైతే ప్రభుత్వం కఠిన చర్య లు తీసుకుంటుందోనంటూ ఆక్షేపించారు.  అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విగతజీవిగా మారిన ప్రతీ పార్దీవశరీరాన్ని చూస్తూ రోధించిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బాధ వర్ణణాతీతం అయ్యింది. వాళ్లని ఊరుకోపించడం ఎవరితరం కాలేకపోయింది. ఈ సంఘటన మొత్తం చూపరులను సైతం కంటతడిపెట్టేలా చేసింది. ర్యాగింగ్ కు పాల్పడిన సైఫ్ తల్లిండ్రుల పెంపకం వలన డాక్టర్ అయిన ప్రజలకు ప్రాణాలు పోయాల్సిన మహిళ తనువు చాలిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Warangal

2023-02-27 08:45:00

గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా నియమితులైన జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ దంపతులను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం వైయస్‌. జగన్,  వైయస్‌.భారతి దంపతులు. అనంతరం గవర్నర్ ను ఘనంగా సీఎం ఘనంగా సత్కరించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు తెలియజేశారు.  ప్రభుత్వం సహకారంలో రాష్ట్రంలో అభివ్రుద్ధి పదంలో నడవాలని గవర్నర్ ఆకాంక్షించారు.

Vijayawada

2023-02-23 11:12:11

టీవి9లోగో విషయమా.. నిజంగా అకౌంట్స్ చూడటానికేనా..?

టీవి9 భాగస్వామిల్లో ఒకరిగా సంస్థల్లో అకౌంట్స్ చూడటానికి కార్యాలయానికి వచ్చానని మాజీ సీఈఓ రవిప్రకాష్ అన్నారు. మంగళవారం హైదరాబాదులోని టివి9 కార్యాలయానికి వచ్చిన ఆయన బయట మీడియాతో మాట్లాడారు. ఈ సంస్థలో నలుగురు భాగస్వాములు ఉన్నారని అన్నారు. టివి9తో, పాటు ఏబిసిఎల్ సంస్థలు నడుస్తున్నాయన్నారు. వాటి అకౌంట్స్ ను చూడటానికే తాను ఇక్కడికి వచ్చానన్నారు. కాగా ఛానల్ లోగోకి సంబంధించిన చర్చలు లోన జరిగాయని ప్రశ్నించిన జర్నలిస్టులకి అంతా మనకి అనుకూలంగానే జరుగుతోందని సమాధానం ఇచ్చారు. చాలా రోజుల తరువాత మళ్లీ టివి9 కార్యాలయంలో రవిప్రకాష్ కనిపించడంలో పాత టివి9 లోగో విషయంలోనే మళ్లీ చర్చలు జరుపుతున్నారనే ప్రచారం గట్టిగా సాగింది. మరోపక్క రవిప్రకాష్ ఆర్ టివి అనే న్యూస్ ఛానల్ ను ఎస్టాబ్లిస్ చేశారు. ఇప్పటికే అన్నిజిల్లాల్లో నియామకాలు కూడా పూర్తయ్యాయి. సెక్యూరిటీ క్లియరెన్స్ తీసుకున్నాకే లోనికెళ్లారు.  ప్రస్తుతం ఈవిషయం చర్చనీయాంశం అవుతోంది.

Hyderabad

2023-02-21 08:32:09

మార్చి 1నుంచి ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నిషన్

తిరుమల శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు వీలుగా మార్చి ఒకటో తేదీ నుంచి ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని టిటిడి ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. సర్వదర్శనం కాంప్లెక్స్ లో ఒకే వ్యక్తి అధిక లడ్డు టోకెన్లు పొందకుండా నివారించడానికి మరియు గదుల కేటాయింపు కేంద్రాలు వద్ద, కాషన్ డిపాజిట్ కౌంటర్ల వద్ద ఈ టెక్నాలజీని వినియోగిస్తారు. దీనికోసం టిటిడి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసింది. నెలాఖరు నాటికి గుర్తించి ప్రాంతాల్లో ఫేస్ రికగ్నైజేషన్ బయో మెట్రిక్ యూనిట్లను ఏర్పాటు టెక్నాలజీని వినియోగించనున్నారు. ప్రయోగం పూర్తయితే టిటిడిలో అన్నిచోట్ల దీనినే ఏర్పాటు చేయాలని టిటిడి భావిస్తోంది.

Tirumala

2023-02-20 09:23:09

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచంటే..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు తేదీలను ఫిక్స్ అయ్యాయి. ఈ నెల 27, 28 రెండు రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి రోజు గవర్నర్ ప్రసంగం, ఆ తర్వాత బీఏసీ సమావేశం ఉండనుంది. అలాగే రెండో రోజు సంతాప తీర్మానాలు, తర్వాత సభ వాయిదా వేయనున్నారు. మళ్లీ తిరిగి మార్చి 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాగా, మొత్తం 13 పని దినాల్లో ఏపీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేవలం రెండు రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించి నిరధికంగా వాయిదా వేయాలని ప్రభుత్వం భావించింది. ఈఎన్నికల ప్రచార సమయం పూర్తికాగానే మళ్లీ తిరిగి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపార్టీ అభ్యర్ధులు నిలబడ్డ స్థానాల్లో గట్టి పోటీనే ఉంది.

Tadepalli

2023-02-18 12:46:47

అన్నవరం సత్యదేవుని వసతి గదుల సమాచారం

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యర్ధం వసతి గదుల సమాచారాన్ని సోమవారం అధికా రులు మీడియాకి ప్రకటన ద్వారా విడుదల చేశారు. శ్రీసీతారామ చౌల్ట్రీ(రూ.200) 39 గదులు, ఓల్డ్ సెంటినరీ(రూ.400) 06, న్యూసెంటి నరీ( రూ.500)21, శ్రీవనదుర్గా చౌల్ట్రీ (రూ.200)01, సత్యనికేతన్(రూ.200) 31, శ్రీసత్యదేవ(రూ.400)38, ప్రకాష్ సదన్(రూ.650) 46, ప్రకాశ్ సదన్ డబుల్  రూమ్(రూ.1600)32, హరిహరసదన్ నాన్ ఏసి (రూ.600) 37, హరిహర సదన్ సింగిల్(రూ.400) 04, హరిహర సదన్ ఏసి(రూ.950) 77 గదులు అందుబాటులో ఉన్నాయి.

Annavaram

2023-02-17 01:21:00

సీఎంను కలిసిన ధార్మిక సలహాదారు చాగంటి


సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని టీటీడీ ధార్మిక సలహాదారుగా నియమితులైన చాగంటి కోటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం సీఎం క్యాంప్‌ కార్యాలయం లో కలిసి చాగంటిని సీఎం కూడా సత్కరించారు. అనంతరం  శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ప్రతిమను అందజేశారు. ఆయనతో పాటు శాంతా బయోటెక్నిక్స్‌ లిమిటెడ్‌ ఫౌండర్, ఎండీ డాక్టర్‌ కే.ఐ. వరప్రసాద్‌ రెడ్డి కలిశారు. ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం చాగంటి సీఎం నివాసం వద్ద ఉన్న గోశాలను సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు. గోశాలను అద్భుతంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు.

Tadepalli

2023-02-16 16:44:54

ఎక్స్ అఫిషియో సభ్యులుగా డా.ఎం.హరిజవహర్‌లాల్

టిటిడి బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యులుగా రెవెన్యూ ఎండోమెంట్స్  ప్రిన్సిపల్ సెక్రటరీ(ఎఫ్‌ఎసి) డా. ఎం.హరి జవహర్‌లాల్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో  టిటిడి జేఈవో  వీరబ్రహ్మం వారితో ప్రమాణం చేయించారు.  దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. జేఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈఓ బోర్డు సెల్  కస్తూరి బాయి, విజిఓ  బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2023-02-16 15:17:18

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈనాడుకు గట్టి ఎదురు దెబ్బ

ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో-12ను అమలను నిలిపివెయ్యాలంటూ ఈనాడు వేసిన అనుబంధ పిటిషన్ ను ఏపీ హైకోర్టు మంగళవారం కొట్టేసింది. అంతేకాకుండా జీవో నెంబర్ 12 పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది.  గ్రామ, వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులకు ఏదైనా న్యూస్ పేపర్ కొనుగోలు చేయడానికి ఎలవెన్సీ ఇస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవోను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ పిటిషన్ వేసింది. అయితే  సత్యమేవ జయతే సాక్షి దినపత్రిక సర్కులేషన్ ను ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ABC)ని పరిగణలోకి తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఈనాడు దాఖలు చేసిన మరొక అనుబంధ పిటిషన్నుకూడా హైకోర్టు కొట్టేసింది. వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ (ABC)ఆధారంగానే ప్రభుత్వ ప్రకటనలు, పత్రికల కొనుగోలుకు అనుమతినిస్తాయి. ఒకేసారి సాక్షి సర్క్యూలేషన్ 6 లక్షలకి పెరిగిపోవడంతో ఈనాడు కోర్టుకెక్కినా ఫలితం దక్కలేదు.

2023-02-14 10:03:49

అన్నవరం సత్యదేవుని వసతి గదుల సమాచారం

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యర్ధం వసతి గదుల సమాచారాన్ని శుక్రవారం అధికారులు మీడియాకి ప్రకటన ద్వారా విడుదల చేశారు. శ్రీసీతారామ చౌల్ట్రీ(రూ.200)21 గదులు, ఓల్డ్ సెంటినరీ(రూ.400)17, న్యూసెంటినరీ(రూ.500)12, శ్రీవనదుర్గా చౌల్ట్రీ (రూ.200)1, సత్యనికేతన్(రూ.200)14, శ్రీసత్యదేవ(రూ.400)60, ప్రకాష్ సదన్(రూ.650) 9, ప్రకాశసదన్ ఏసి(రూ.1050)12, ప్రకాశ్ సదన్ డబుల్ రూమ్(రూ.1600)35, హరిహరసదర్(రూ.600)24, హరిహర సదన్ సింగిల్(రూ.400) 0, హరిహర సదన్ ఏసి(రూ.950) 0 గదులు అందుబాటులో ఉన్నాయి.

Annavaram

2023-02-10 02:35:18

ఒంటిమిట్టలో రాములోరి కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తి

వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి  బ్రహ్మోత్సవాలు మార్చి 30వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ జేఈవో  వీరబ్రహ్మం చెప్పారు.  బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై బుధవారం ఆయన అధికారులతో కలసి క్షేత్రస్థాయిపరిశీలన,  సమీక్ష జరిపారు.  అనంతరం జేఈవో మీడియాతో మాట్లాడారు.  మార్చి 30వ తేదీ సాయంత్రం అంకురార్పణతో శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీ శ్రీ కోదండరాముడి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి   వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో ఇప్పటికే సమీక్ష జరిపి అనేక సూచనలు చేశామన్నారు. బ్రహ్మోత్సవాలకు,  స్వామివారి కల్యాణానికి హాజరయ్యే భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. 

నెలరోజుల ముందు నుంచే టీటీడీ  ఈ పనులను ప్రారంభించిందని  వీరబ్రహ్మం తెలిపారు. కల్యాణోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయాల్సిన గ్యాలరీలు, వాటిలోకి భక్తులను అనుమతించాల్సిన విధానం, భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీ ఏర్పాట్లపై సమీక్ష జరిపామన్నారు. గ్యాలరీల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈసారి మరింత మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కల్యాణ వేదిక అలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భక్తులను ఆకట్టుకునేలా  నిర్వహిస్తామన్నారు. కల్యాణానికి హాజరయ్యే భక్తులందరికీ ముత్యాల తలంబ్రాలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి రెండు వారాల్లో జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహిస్తారని తెలిపారు.

 టీటీడీ చీఫ్ ఇంజనీర్  నాగేశ్వరరావు విద్యుత్ విభాగం ఎస్ఈ   వెంకటేశ్వర్లు,  ఆలయ డిప్యూటీ ఈవో  నటేష్ బాబు, డిప్యూటీ ఈవోలు గుణభూషణ్ రెడ్డి,  సుబ్రహ్మణ్యం, ఈ ఈ సుమతి,  అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ కుమార్, డిఎఫ్ఓ  శ్రీనివాస్, గార్డెన్ సూపరింటెండెంట్  శ్రీనివాస్,  ఎలక్ట్రికల్ డిఈ  చంద్రశేఖర్, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి  రామరాజు పాల్గొన్నారు.   అంతకు ముందు జేఈవో  వీరబ్రహ్మం రాజంపేట లోని 108 అడుగుల శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య విగ్రహం ఆవరణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

Ontimitta

2023-02-08 17:33:15

అన్నవరం సత్యదేవుని పెళ్లి మండపాల అద్దె ధరలివే

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్ధానంలో పెళ్లిళ్లకు మండపాలను అద్దెకు తీసుకోవచ్చు. సుమారు 18 రకాల పెళ్లి మండపాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే ఎవరికీ ఒక్క పైసాకూడా అధికంగా 
చెల్లించాల్సిన పనిలేదు. నేరుగా సీఆర్వఓ కార్యాలయాన్ని సంప్రదించి వివాహ శుభకార్యాలకు మండపాలను అద్దెకు తీసుకోవచ్చు. అద్దె మండపాలు వాటికి నిర్ణయించిన ధరలు ఒక్కసారి తెలుసుకుంటే..1)శ్రీ సీతారామ చౌల్ట్రీ హాల్(2) ఒక రోజుకి అద్దె ధర రూ.5వేలు, 2)శ్రీ సీతారామ స్టేజి (1) రూ.5వేలు, 3)ప్రకాస్ సదన్ కేంటీన్ హాల్(1) రూ.15వేలు, 4)ప్రకాష్ సదన్ సౌత్ రోడ్డు(1) రూ.25వేలు, 5) ప్రకాష్ సదర్ నార్త్ రోడ్డు(1) రూ.15వేలు, 6)వాయువ్య వ్రత మండపం(1) రూ.50వేలు,  7)నైరుతి వ్రత మండపం(1) రూ.50వేలు, 8)విష్ణు సదన్ హాలు పెద్దవి(12) రూ.5వేలు, 9)విష్ణు సదన్ హాలు చిన్నవి(26) రూ.3వేలు, 10) విష్ణు సదన్ హాలు సెల్లార్(1) రూ.4వేలు, 11)ఓల్డ్ సిసి స్టేజ్(2)రూ.5వేలు, 12) న్యూ సిసి స్టేజి(1) రూ.10వేలు, 13)ఓల్డ్ కళ్యాణ మండపం 1, 2(రూ.35వేలు), 14) హరిహర సదన్ పార్కింగ్ ప్లేస్ రూ.25వేలు, 15)పబ్లిక్ ఎమినిటీస్ సెంటర్(పంపా చౌల్ట్రీ డౌన్ హాలు)(7)రూ.3వేలు, 16)పబ్లిక్ ఎమినిటీస్ సెంటర్(పంపా చౌల్ట్రీ డౌన్ హాలు 1,2,3,6)రూ.వెయ్యి, 17)పబ్లిక్ ఎమినిటీస్ సెంటర్(పంపా చౌల్ట్రీ డౌన్ హాలు 4, 5)రూ.700, 18) సత్యనికేతన్ చౌల్ట్రీ బ్యాక్ సైడ్(1)రూ.1500

Annavaram

2023-02-07 02:29:28

అన్నవరం సత్యదేవుని వసతి గదుల సమాచారం

అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానంలో భక్తుల సౌకర్యర్ధం వసతి గదుల సమాచారాన్ని శనివారం అధికారులు మీడియాకి ప్రకటన ద్వారా విడుదల చేశారు. శ్రీసీతారామ చౌల్ట్రీ(రూ.200)94 గదులు, ఓల్డ్ సెంటినరీ(రూ.400)64, న్యూసెంటినరీ(రూ.500)32, శ్రీవనదుర్గా చౌల్ట్రీ (రూ.200)12, సత్యనికేతన్(రూ.200)62, శ్రీసత్యదేవ(రూ.400)60, ప్రకాష్ సదన్(రూ.650)41, ప్రకాశసదన్ ఏసి(రూ.1050)44, ప్రకాశ్ సదన్ డబుల్ రూమ్(రూ.1600)1, హరిహరసదర్(రూ.600)51, హరిహర సదన్ సింగిల్(రూ.400)5, హరిహర సదన్ ఏసి(రూ.950)84గదులు అందుబాటులో ఉన్నాయి.

Annavaram

2023-02-07 02:27:54

విశాఖ స్టీల్ ప్లాంట్ మూడేళ్లలో మెుత్తం ఖాళీ..!

విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటన ఒకవైపు..వచ్చే మూడేళ్లలో భారీస్థాయిలో ఉద్యోగుల ఉద్యోగ విరమణలు మరోవైపు స్టీల్ ప్లాంట్ మనుగడను ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ప్రస్తుతం 14,880 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా..  గత మూడేళ్లలో 1,987 మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేశారు. ఇక మరో మూడేళ్లలో భారీ ఎత్తున అంటే.. 1,170 మంది ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు, 2,039 మంది నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు సహా 3,209 మంది ఉద్యోగులు ఆర్ఐఎన్ఎల్ (RINL) రికార్డుల ప్రకారం పదవీ విరమణ చేయనున్నారట. ఈ విషయాన్ని కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి  ఫగ్గన్ సింగ్ కులస్తే పార్లమెంటు సమావేశాల్లో ప్రకటించారు. అంటే మరో ఐదేళ్లలో స్టీలుప్లాంట్ లోని అన్నివిభాగాల్లో ఇంకెంత మంది ఉద్యోగ విరమణలు చేస్తారో అర్ధం చేసుకోవచ్చు. విశాఖ స్టీలు ప్లాంట్ లో ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది ఉద్యోగ విరమణలు చేస్తున్నప్పటికీ వాటికి అనుగుణంగా ఉద్యోగాల భర్తీ మాత్రం జరగడం లేదు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ లో ప్రతి సంవత్సరం భారీ ఎత్తున పదవీ విరమణ జరుగుతున్నా ఉద్యోగుల సమస్య వలన క్షీణిస్తున్న మానవ వనరుల పరిస్థితిని దారుణంగా ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది.


పార్లమెంటులో మంత్రి మాటలు ప్రైవేటీకరణకు ఊతం..!
పార్లమెంటులో బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు విశాఖ ఉక్కు ఉద్యోగాల్లో భారీ ఎత్తున జరుగుతున్న ఉద్యోగ విరమణలపై ప్రశ్నలేవనెత్తగా, అవసరం అయిన ఉద్యో గాలను ఔట్ సోర్సింగ్ ద్వారా తీసుకుంటామనే మాట..స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు ఊతమిచ్చినట్టు అయ్యింది. దానికి తగ్గట్టుగానే ఉద్యోగులు రిటైర్ అవుతున్నా స్టీల్ ప్లాంట్ మాత్రం ఉద్యోగాల భర్తీ జరగడం లేదు. ఇదే విషయమై ప్రశ్నించిన ఎంపీ రాబోయే రోజుల్లో స్టీలు ప్లాంటు పెద్ద ఎత్తున మానవ వనరుల కొరతను ఎదుర్కొంటుందని పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లారు. కొత్త నియామకాలపై ఎలాంటి ఆంక్షలు లేవని చెబుతూనే, గత మూడేళ్లలో 106 మంది కొత్త ఉద్యోగులను నియమించామని మంత్రి సమాధానం ఇవ్వడం ఇపుడు ప్రైవేటీకరణ నిప్పుపై నూనెపోసిసట్టు అయ్యింది. అంతగా ప్రాధాన్యత లేని కార్యకలాపాలను ఔట్ సోర్సింగ్ చేయడం ద్వారా, ప్రధాన కార్యకలాపాల్లో సిబ్బందిని పునర్ వ్యవస్థీకరణ ద్వారా మానవ వనరుల అవసరాలను తీర్చుతున్నామని కేంద్ర మంత్రి పేర్కొనడం ఇక్కడ విశేషం. అంటే ఎంత త్వరగా ఉద్యోగాలు ఖాళీ అయిపోతే అంతగా తదుపరి కార్యాచారణ ముందుకి సాగుతుందని చెప్పకనే చెప్పినట్టు అయ్యింది.


స్టీలుప్లాంటును ఖాళీచేసి ప్రైవేటీకరణ చేపడతారా..?
లాభాల్లో ఉన్న విశాఖస్టీలు ప్లాంటును ఉద్యోగులకు అన్యాయం జరగకుండా వారంతా ఉద్యోగవిరమణ చేసిన తరువాత ప్రైవేటు యాజమాన్యానికి అప్పగించే ప్రయత్నం జరగుతున్నట్టు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. ప్లాంటులో ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నవారంతా ఉద్యోగ విరమణ చేయాలంటే ఐదునుంచి ఏడేళ్ల సమయం పడుతుంది. ఈలోగా ప్రాధాన్యత క్రమంలోని ఉద్యోగాల్లోని వారంతా ఉద్యోగ విరమణచేస్తారు. దీనితో ప్లాంటును ప్రైవేటీకరణ చేయడం సులవుతుంది. దానికోసమే కొత్తగా ఉద్యోగాల భర్తీచేపట్టడం లేదనే వాదనకు ఈరోజు పార్లమెంటులో జరిగిన ప్రశ్నోత్తరాల్లో వచ్చిన సమాధానాలు ఊతమిస్తున్నాయి. ఆ కారణంగానే బడ్జెట్ లో కూడా స్టీల్ ప్లాంట్ విస్తరణకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. అయితే దీనిపై రాష్ట్రం నుంచి ఒక్కఎంపీ కూడా పార్లమెంటులో ప్రశ్నించిన దాఖలాలు ఒకటి అరా తప్పా పెద్దగా లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో పేరుకుపోయిన ఆర్ కార్డు దారుల సమస్యలు, ఇతరత్రా ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించి నేటి వరకూ కేంద్రం ఎలాంటి నష్టపరిహారంగానీ, ఉద్యోగాలను కానీ భర్తీచేయలేదు. దీనితో స్టీల్ ప్లాంట్ ను పూర్తిగా ఖాళీ చేసిన తరువాత అయితే ప్రైవేటకరణ కు ఎలాంటి ఆటంకాలూ ఉండవని కేంద్రం భావిస్తు్నట్టుగా సమాచారం అందుతున్నది. కేంద్రం అనుకున్నట్టుగా ఖాయిలా పడ్డ పరిశ్రమగా మార్చాలంటే కొత్త సిబ్బంది నియామకాలు చేపకట్టకుండా ఉండటం, ఉత్పాదకతను సిబ్బంది లేమితో  తగ్గించేయడం తదితర అంశాలన్నీ తెరపైకి తీసుకురావాలని చూస్తున్నట్టుగా కనిపిస్తుంది

ఉద్యమాలు ఫలితాలనిస్తాయా..ఉసూరు మనిపిస్తాయా 
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించకూడదంటూ జరుగుతున్న ఉద్యమాలు ఫలితాలనిచ్చేలా అయితే కనిపించడం లేదు. ఉక్కు విషయంలో కేంద్రం అనుకున్నట్టుగా ఒక్కో అవకాశాన్ని ఉద్యోగులకు చిక్కకుండా చేస్తుందనే విషయం తేటతెల్లం అవుతుంది. భారీ ఎత్తున ఉద్యోగుల రిటైర్ మెంట్లు, కొత్త ఉద్యగాల భర్తీ లేకపోవడం, అన్ని పనులూ ఔట్ సోర్సింగ్ ద్వారా చేపట్టడం, ప్రధాన్యత కలిగిన పోస్టులను కుదించేయడం, ఆర్ కార్డుదారులకు న్యాయం చేయకపోవడం, ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని పట్టించుకోకపోవడం, తదిర అంశాలన్నీ ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని ఉసూరు మనిపిస్తాయనే సంకేతాలను ఇస్తున్నాయి. ఇది కాకుండా త్వరలోనే వీఆర్ఎస్ స్కీము ద్వారా మరింత మంది ఉద్యోగులను ఇంటికి పంపే కార్యక్రమానికి కూడా యాజమాన్యం కేంద్రం ఆధ్వర్యంలో తెరలేపుతుందనే ప్రచారం కూడా జరుగుతంది. అదే జరిగితే మూడేళ్లలో కాకుండా అంతకంటే ముందుగానే స్టీలు ప్లాంటు ఖాళీ అయిపోవడం ఖాయంగా కనిపిస్తున్నది. ఎంతో మంది ప్రాణాలు బలితీసుకొని సాధించుకున విశాఖ ఉక్కు...పరిస్థితి ఏమవుతుందో తెలియని పరిస్థిని నెలకొంది. ఇటు రాష్ట్రప్రభుత్వం కేంద్రంపై తీసుకువచ్చే ఒత్తిడి, ఉద్యోగుల ఆందోళనలు, ఉద్యమాలు ఫలితం ఎలా ఉండబోతుందో ప్రశ్నార్ధకంగా మారింది..!

Visakhapatnam

2023-02-07 02:19:42

ఫిబ్రవరి7న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 7వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 11 నుండి  19వ  తేదీ  వరకు ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు  నిర్వహించనున్నారు . ఈ సందర్బంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో  భాగంగా మంగళవారం ఉదయం 6.30 నుండి 11 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది.  ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

వాహనసేవల వివరాలు :
11-02-2023 -  ధ్వజారోహణం - పెద్దశేష వాహనం
12-02-2023 - చిన్నశేష వాహనం - హంస వాహనం
13-02-2023 - సింహ వాహనం - ముత్యపుపందిరి వాహనం
14-02-2023 - కల్పవృక్ష వాహనం - సర్వభూపాల వాహనం
15-02-2023 - పల్లకి ఉత్సవం(మోహినీ అవతారం) - గరుడ వాహనం
16-02-2023 -  హనుమంత వాహనం - వసంతోత్సవం, స్వర్ణరథం, గజ వాహనం
17-02-2023 - సూర్యప్రభ వాహనం - చంద్రప్రభ వాహనం
18-02-2023 - రథోత్సవం -     అశ్వవాహనం
19-02-2023 - చక్రస్నానం - ధ్వజావరోహణం చేస్తారు.
ఈ సంద‌ర్భంగా ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు ఆలయ మాడ వీధుల్లో వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు. గ‌రుడ‌సేవ మాత్రం రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హిస్తారు.

Srinivasa Mangapuram

2023-02-06 11:31:26