1 ENS Live Breaking News

ఆ ఉద్యోగుల ప్రమోషన్ డౌటు.. మరి చట్టబద్దత దారెటు

భారతదేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు నేటికీ ప్రమోషనల్ ఛాన ల్  ప్రభుత్వం విదివిధానాలు రూపొందిం చలేదు. కనీసం ఈశాఖకు చట్టబద్దత కూడా కల్పించలేదు. కాకపోతే మంత్రివర్గ సమావేశంలో చట్ట బ ద్దతకి ఆమోదం మాత్రమే తెలిపారు. 19విభాగాల ఉద్యోగుల్లో ఇప్పటివరకూ కేవలం 5విభాగాల ఉద్యోగులకు మాత్రమే ప్రమోషనల్ ఛానల్ రూ పొందించారు. ఉదాహరణకు మహిళా పోలీసులను తీసుకుంటే మొదటి ప్రమోషన్ ఆరేళ్లు దాటగానే హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ ఇస్తా రు. తరువాత ఐదేళ్లకు ఏఎస్ఐ, ఎస్ఐ, సిఐ వరకూ వీరి పదోన్నతులున్నాయి. ఇవన్నీ జరగాలంటే ముందు గ్రామ, వార్డు సచివాలయ శాఖకు అ సెంబ్లీలో చట్టబద్దత తీసుకురావాలి. దానికంటే ముందు మిగిలిన విభాగాల సిబ్బందికి, సర్వీసు రూల్సు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటుచేయా లి.  అయితే వీరి సర్వీసు రెగ్యులరైన 6ఏళ్లా, లేదంటే విధుల్లోకి చేరిన ఆరేళ్లకు పదోన్నతిస్తారా అనేది క్లారిటీలేదు..!

Amaravati

2023-04-06 01:18:45

తెలుగుద‌నం ఉట్టిప‌డేలా రాముల‌వారి క‌ల్యాణ‌వేదిక‌

శ్రీ సీతారాముల కల్యాణం కోసం  టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో తెలుగు సంప్ర‌దాయం ఉట్టిప‌డేలా క‌ల్యాణ‌వేదిక‌ను అందంగా తీర్చిదిద్దారు. వేదిక రంగురంగుల పుష్పాలు, ఫలాలతో చూపరులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. సీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులు ఫలపుష్పాల అలంకరణ చూసి ముగ్ధులయ్యారు. ప్రత్యేకంగా వరి గింజలతో మండపం ఏర్పాటు, చెరుకులు, టెంకాయ గెలలు, టెంకాయపూత, అరటి ఆకులు,  మామిడాకులు, మామిడికాయలు, ఆస్ట్రేలియా ఆరెంజ్, వాషింగ్టన్ ఆపిల్,  ద్రాక్ష, చిలకలు, తదితర ఫలాలు, నీలం ఆర్కిడ్‌, రెడ్‌ ఆంథూరియం తదితర విదేశీ జాతుల పుష్పాలతో కల్యాణవేదికను అలంకరించారు. ఇందుకోసం 4 టన్నుల సంప్రదాయపుష్పాలు,  30 వేల కట్‌ ఫ్లవర్స్‌  వినియోగించారు. టీటీడీ ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్‌  శ్రీనివాసులు పర్యవేక్షణలో 3 రోజులపాటు 60  మంది అలంకరణ నిపుణులు, 30 మంది టీటీడీ సిబ్బంది  ఇందుకోసం పనిచేశారు.
 

Ontimitta

2023-04-05 15:39:01

ఎన్నికలకు ఇంకా ఏడాది..ఉద్యోగుల పదోన్నతి జాడేది..?

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడానికి ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉన్నది. నేటి వరకూ 75 ప్రభుత్వ శాఖల్లో పదోన్న తుల ఫైళ్లు మాత్రం ముందుకి కదలడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తమకు పదోన్నతులు వస్తాయని ఎదురు చూసిన ఉద్యోగులు, అధి కారులకి కొంతమేర మాత్రమే న్యాయం జరిగింది. ఇంతా అత్యధిక ప్రభుత్వశాఖల సిబ్బంది, అధికారులు వారి పదోన్నతల కోసం తమ రాష్ట్ర కార్యాలయం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో 13 కొత్త జిల్లాల ఏర్పాటు అయిన తరువాత అన్నిశాఖల ఉద్యోగులకు పదోతన్నతులు కల్పించడం ద్వారా క్రిందిస్థాయి ఉద్యోగులు, అధికారుల ఖాళీల సంఖ్య స్పష్టంగా తెలిసేది. కానీ ప్రభుత్వం ఉద్యోగుల పదో న్నతుల విషయంలో మీనమేషాలు లెక్కిస్తుందని..ఇంకో 6నెలల్లో తమకు పదోన్నతులు రాకపోతే, మళ్లీ వచ్చే ప్రభుత్వం వరకూ వేచి చూడా ల్సిందేనని..ఈలోగా ఎంతమంది ఉంటారో, మరెంత మంది సర్వీసులోనే కాలం చేస్తారో నని ఉద్యోగులు వాపోతున్నారు.

Tadepalli

2023-04-05 06:39:54

రిటైర్డ్ ఉద్యోగులకు 4వ తేదీవచ్చినా పెన్షన్లు పడలేదు

ఆంధ్రప్రదేశ్ లో సుమారు 3.50లక్షలకు పైగా ఉన్న రైటర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు 4వ తేదీ వచ్చినా పెన్షన్లు పడేలేదు. మొన్నటి వరకూ ప్రభుత్వ ఉద్యోగులకే ఆలస్యం అయ్యేది ఇపుడు పెన్షనర్లమైన మాకు కూడా ప్రభుత్వం పెన్షన్లు ఆలస్యంగానే వేస్తోందని అంటున్నారు పెన్షనర్లు. తమ సర్వీసు మొత్తం ప్రభుత్వంలోనే చేసినా..నేడు పెన్షన్లు ఎప్పుడు పడతాయాని ఎదురుచూసే రోజులు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకరి దశలో కాస్త సేదతీరుదామంటే, ఒకటో తేదీన పడాల్సిన పెన్షన్లు ఎప్పుడు పడతాయాని రోజులు లెక్కించుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు.

Amaravathi

2023-04-04 07:19:36

కొత్తజిల్లాల పాలనకు ఏడాది పూర్తి.. శాస్వత కార్యాలయమేది

ఆంధ్రప్రదేశ్ లో 13 కొత్త జిల్లాల పరిపాలనకు నేటితో ఏడాది పూర్తయింది. పరిధి తగ్గడంతో అధికారులకు ప్రజల సమస్యల పరిష్కారించడం సులవవుతుంది. వాటికితోడు గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటుతో ఇంటిముంగిటే సేవలు అందుతున్నాయి. కాకపోతే జిల్లా శాఖల్లో అధికారులు, సిబ్బంది చాలినంత లేపోవడంతో కాస్త వెనుకుబాటు తప్పితే కొత్తజిల్లాల ఏర్పాటుతో ప్రజలకు అధికారులు చేరవవుతున్నారు. వాస్తవానికి ఏపీలో కొత్త జిల్లాలకు రాష్ట్ర గవర్నర్ అనుతి తప్పా, కేంద్రంలో రాష్ట్రపతి అనుమతి లేదు. దీనితో కేంద్రం ద్రుష్టిలో ఆంధ్రప్రదేశ్ లో ఇంకా 13 జిల్లాలే. కేంద్రం ఏపీ విభజించిన కొత్త జిల్లాలకు అనుమతులు లభిస్తే నిధులు కూడా కొత్తజిల్లాలకు వస్తాయి. జిల్లాల విభజన వలన అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం మార్గం సుగమం చేసింది. 75 ప్రభుత్వశాఖలను అన్ని జిల్లాల్లో ఏర్పాటుచేసినప్పటికీ, అద్దె కలెక్టరేట్లు.  జిల్లా కార్యాలయాలు తప్పితే పాత 13 జిల్లాల్లో మాత్రమే శాస్వత ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు ఉన్నాయి.

Tadepalli

2023-04-04 04:16:25

సోషల్ మీడియాతోనే అసత్య ప్రచారాలను తిప్పికొట్టండి

2024 ఎన్నికల్లో 175/175 గెలవడమే లక్ష్యం..ప్రతీ ఒక్క ఎమ్మెల్యేని గెలిపించుకుంటాను..ఈ క్రమంలో ఎల్లోమీడియా చేసే అసత్యప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారానే తిప్పికొట్టాలి.. ఏ ఒక్కరినీ ఒదులుకోను అంటూ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, నియోజకవ ర్గాల ఇన్చార్జిలకు దిశానిర్ధేశం చేయడం ఇపుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అంటే మీడియా కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే లే దనే విషయాన్ని ఇండరైక్టుగా చెబుతూనే, వైఎస్సార్సీపీ మొత్తమంతా సోషల్ మీడియానే నమ్ముకోవాలన్నట్టు చెప్పడం ఇపుడు పరిశీలకుల ను సైతం ఆలోచనలో పడేలా చేసింది. అయితే గతంలో ఇదే స్ట్రాటజీ అమలు చేసిన టిడిపి ప్రభుత్వం ఇదే సోషల్ మీడియా ద్వారానే ప్రజ ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే ఇపుడు వైఎస్సార్సీపీ కూడా అదే సోషల్ మీడియానే నమ్ముకొని ముందుకి వె ళితే పరిస్థితులు, ఫలితాలు మరోలా ఉండే అవకాశం కూడా ఉందని పరిశీలకులు ప్రకటించేయడం ఇపుడు హాట్ టాపిక్..!

tadepalli

2023-04-04 03:44:16

మార్గదర్శిలో ముసలంతో మంచమెక్కిన రామోజీ

మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో సిఐడి విచారణ వేగవంతం చేయడంతో విచారణ జరిగే సమయానికి ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్, మార్గదర్శి కేసులో ఏ-1గా ఉన్న రామోజిరావుకి సుస్తీ చేసింది. దీనితో ఆయన మంచానికే పరిమితం అయ్యారు. విచారణకు రామోజి ఫిల్మ్ సిటీకి వస్తారని ముందుగానే సమాచారం ఇచ్చిన సిఐడికి, రావొచ్చునని బదులు ఇచ్చిన ఆయన తనకు సుస్తీచేసిందని మళ్లీ సమాచారం పంపారు. అయితే రామోజీ ఫిల్మ్ సిటీకి కాకుండా జూబ్లీ హిల్స్ లోని తన ఇంటికే రావాలని సిఐడికి సమాచారం అందించారు. మార్గదర్శి ఎండి శైలజ కూడా అక్కడే వుంటున్నారని కూడా తెలియజేశారు. తన ఆరోగ్యం బాగాలేని కారణంగా వైద్యపరీక్షలు చేయించుకోవడానికే ఇంటికి వచ్చినట్టు పేర్కొన్నారు. అయితే బెడ్ పై పడుకొని ఉండగానే విచారణ చేయాలని కూడా సిఐడిని రామోజీరావు కోరిన మేరకు సిఐడి అధికారులు ఆ విధంగానే చేస్తున్నారట సిసి కెమెరాల పర్యవేక్షణలో.  విచారణ సమయానికి ఆయన మంచమెక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Jubilee Hills

2023-04-03 13:32:25

ENS చెప్పిందే నిజమైంది ఆఎమ్మెల్యేల విషయంలో..!

ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్సార్సీపీలో ఆ40% ఎమ్మెల్యేలకు సీటుడౌటే అనే విషయాన్ని సరిగ్గా 6నెలల క్రితమే ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ Ens Live,న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ద్వారా ప్రత్యేక కథనాన్ని ప్రచురించాం. ఆ వార్తనేడు నిజమైంది. నేరుగా సీఎం వైఎస్ జగన్ సరిగా పనిచేయని ఎమ్మెల్యేలను ఇంటికి పంపిస్తాననే హెచ్చరిక జారీచేయడానికి సిద్దపడు తున్నారనే విషయం నేడు పార్టీలోని ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తుంది. నియోజకవర్గాల్లో వారి స్వలాభం చూసుకుంటూ, గడపగడప కూ వైఎస్సా ర్సీపీ కార్యక్రమంలో పాల్గొన కుండా ఉన్నవారిని నేరుగా సీఎం గుర్తించే పనిచేశారు. ఇపుడు ఆసంఖ్య ఈఎన్ఎస్ చెప్పిన 40%లో 45మందిని మందలించే స్థాయికి వచ్చింది. ఆసంఖ్య పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈరోజు జరిగే సీఎం రివ్యూలో ఆవిషయం కూడా తేలిపోతుం ది. ఈఎన్ఎస్ అంటే మీడియానే కాదు..తెలుగు ప్రజల గుండె చప్పుడు కూడా అని మరోసారి రుజువైందని తెలియజేస్తున్నాం..!

Amaravathi

2023-04-03 05:08:29

ENSచెప్పినట్టే.. 26జిల్లాల్లో జిల్లాఅక్రిడిటేషన్ కమిటీలు

ఆంధ్రప్రదేశ్ లో నూనత జిల్లాలో అక్రిడిటేషన్ కమిటీలు ఏర్పాటు చేయకపోతే కొత్త జిల్లాల కలెక్టర్ల పరువు పోతుందని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ యాప్ enslive,న్యూస్ వెబ్ సైట్ www.enslive.netలలో నూతన జిల్లాల్లో ఉత్తుత్తి కలెక్టర్లు శీర్షికిన వార్తను ప్ర చురిచింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం. ఇపుడు రాష్ట్ర కమిషనర్ కార్యాలయంతోపాటు 26 జిల్లాల్లోనూ జిల్లా అక్రిడిటేషన్ కమిటీలను ని యమిస్తున్నట్టు ప్రకటించింది.  ఏపీలోని కొత్తజిల్లాలకు రాష్ట్ర గవర్నర్, అసెంబ్లీ ఆమోదంతోనే గెజిట్లు వెలువడ్డాయికానీ కేంద్ర ప్రభుత్వం ద్రు ష్టిలో ఇంకా 13జిల్లాలే. ఈకొత్తజిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం ఇంకా రాలేదు. అంతేకాదు ఆర్ఎన్ఐ వెబ్ సైట్ లోనూ 13జిల్లాలుగానే ఉంది. కొత్త గాఏర్పడిన 13జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగం జిల్లాకలెక్టర్లు, జెసిలను నియమించిన ప్రభుత్వం ఇక అన్ని కార్యకలాపాలను జిల్లాల వారీగానే చేపట్టి నిర్వహించనుందని అక్రిడిటేషన్ల కమిటీల కోసం ఇచ్చిన జిఓ-38లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తేల్చిచెప్పేసింది..!

Amaravathi

2023-04-02 03:46:29

అధికారికంగా సెలవులు.. అయినా ఇంటినుంచే విధులు

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వైద్యాధికారులు వింత పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అత్యవసరం, ముఖ్యమైన పను ల కోసం సెలవులు పెట్టుకున్నా..ప్రభుత్వశాఖలు నిర్వహించే టెలీ కాన్ఫరెన్సు, వీడియో కాన్ఫరెన్సులో ఖచ్చితంగా పాల్గొనాల్సి వస్తోంది. దీ నితో తమకి సెలవులు పెట్టినా, విధినిర్వహణలో ఉన్నా పెద్దగా తేడా ఏమీ తెలియడం లేదని ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. గ తంలో ఎన్నడూ లేనివిధంగా ఉదయం 8గంటలకే జూమ్ కాన్ఫరెన్సులు, రాత్రి 8గంటల వరకూ జిల్లా కార్యాలయాలు, మండలకార్యాలయా ల్లో పనులు తీవ్రస్థాయిలో పెరిగిపోతున్నాయని వాపోతున్నారు. ప్రభుత్వశాఖల్లో సిబ్బంది లేకపోవడం, పనులు పేరుకుపోవడంతో సొంత ప నులు, కార్యక్రమాల్లో పాల్గొనే తీరిక కూడా దొరకడంలేదని కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఆరోగ్యం బాగాలేక సెలవులు పెట్టినా ఇంటినుంచే పనిచేయాల్సి వస్తుందని..ఇకమేము సెలువులు తీసుకొని ఉపయోగమేమిటో చెప్పాలంటున్నారు.

Amaravathi

2023-04-01 02:10:37

YSRCP థీమ్ వైనాట్ 175/175 But ఈసారి 4 అవుట్

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్సీపీ వైనాట్ 175/175 థీమ్ తో ముందుకి వెళ్లాలనుకుంటే అపుడే 4గురు ఎమ్మెల్యేలు ఎన్నికలకు ముందే ఔట్ అయిపోయారు. మరో పక్క పక్కాగా గెలుస్తామనుకున్న 4 ఎమ్మెల్సీలు కూడా టిడిపి వసం అయిపోయాయి. దీనితో ఇపుడు వైనాట్ 175/ 175 అనే థీమ్ కాస్తా తింక్ 175/175 స్లో అండ్ స్టడీ అనే ఆలోచనలోకి వచ్చేశారని చమత్కరిస్తున్నారు పరిశీలకులు. టిడిపి తన రాజకీయచతు రతను ప్రదర్శిస్తే రానున్నరోజుల్లో మరింతమంది అధికారపార్టీ ఎమ్మెల్యేలు కూడా చేజారిపోయే అవకాశాలూ కూడా లేకపోలేదని చెబుతు న్నా రు. అదే సమయంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు పొందిన వారంతా పక్కాగా పార్టీకే మద్దతు పలి కే అవకాశం కూడా లేకపోలేదని. పోతే గీతే  ప్రభుత్వ ఉద్యోగులు, సిపిఎస్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, జర్నలిస్టులు, గిరిజనులు మా త్రమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు తప్పితే.. మిగిలిన వారంతా వైఎస్సార్సీపికి అనుకూలమే అంటున్నారు.

Amaravathi

2023-03-31 01:38:32

ఏపీలో గిరిజనులు YSRCPకి దూరమవుతున్నారా..?!

ఆంధ్రప్రదేశ్ లో గిరిజన ఆదివాలసీలు వైఎస్సార్సీపికి దూరమవుతున్నారా అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అధికార వై ఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్టీల జాబితాలోకి బోయ, వాల్మీకిలను చేర్చుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడమే దీనికి కారణంగా చె బుతున్నారు. ఏపిలోని 26 జిల్లాల్లో గిరిజనులు 75లక్షల మందికిపైనే ఉన్నారు. వీరంతా ఒక్కసారి తిరగబడేసరికి గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు సైతం పత్తాలేకుండా తిరుగుతున్నారు. ప్రభుత్వం  తీసుకున్న నిర్ణయం కారణంగా మార్చిన 31న ఉమ్మడి విశాఖజిల్లా, విభజన అల్లూరి జిల్లావ్యాప్తంగా బంద్ కి కూడా గిరిజన సంఘం పిలుపునిచ్చింది. అయితే ఈ విషయంలో మాత్రం  ప్రభుత్వం ఎక్కడా తగ్గేది లేదని తెగేసి చెబుతోంది. కాగా గిరిజనుల ప్రధాన ఓటు బ్యాంకుతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఈవిషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించకపోవడంతో వీరినికూడా గిరిజనులంతా గిరిజన ద్రోహులుగానే చూస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు.

Amaravati

2023-03-30 03:34:08

ఎస్వీ ఆయుర్వేద కళాశాలకు 3 ISO సర్టిఫికెట్లు

శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద వైద్య కళాశాలకు 3విభాగాల్లో ఐ ఎస్ వో సర్టిఫికెట్లు లభించాయి. టీటీడీ పరిపాలన భవనంలో బుధవారం ఈవో ఎవి ధర్మారెడ్డి నుంచి కళాశాల ప్రిన్సిపల్ డా.మురళీకృష్ణ అందుకున్నారు. ఆయుర్వేద వైద్య కళాశాలలో విద్యుత్ పొదుపు చేసినందుకు, కళాశాల ఆవరణంలో పచ్చదనం పెంపొందించి పర్యావరణ పరిరక్షణకు ఉత్తమ విధానాలు అమలు చేస్తున్నందుకు సర్టిఫికెట్లు లభించాయి. అలాగే  కళాశాల.నిర్వహణలో ఉత్తమ విధానాలు అమలు చేస్తున్నందుకు మరో సర్టిఫికెట్ లభించాయి. కళాశాల ప్రిన్సిపల్ డా. మురళీకృష్ణ, ఇతర అధ్యాపకులు, సిబ్బందిని ఈవో ఈ సందర్భంగా అభినందించారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా.సుందరం,  ఐఎస్ వో ప్రతినిధులు  శివయ్య, మౌళిక ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా  శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ నిర్వహణలో ఉత్తమ విధానాలు అమలు చేస్తున్నందుకు గాను ఐ ఎస్ వో సర్టిఫికెట్ లభించింది. ఎస్వీబీసీ సిఈవో షణ్ముఖ్ కుమార్ ఈవో నుంచిసర్టిఫికెట్ అందుకున్నారు.            

Tirupati

2023-03-29 12:03:31

3.59లక్షల CPSఉద్యోగులు YSRCPమాట నమ్ముతారా

ఆంధ్రప్రదేశ్ లోని 3.59 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు అధికార వైఎస్సార్సీపీ మాట నమ్ముతారా అంటే.. చచ్చినా నమ్మేది లేదని తెగేసి చె బుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేస్తామని ప్రకటించిన వైఎస్సార్సీపీ మరో ఏడాదిలో అధికారం మొత్తం పూర్తవు తు న్నా ఇంకా చర్చల పేరుతోనే కాలయాపన చేస్తోందని సిపిఎస్ ఉద్యోగులు మండిపడుతున్నారు. తమకు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ ను అ మలు చేయాలని నెత్తీనోరూ కొట్టుకుంటున్నా ప్రభుత్వం ఎక్కడా వీరి గోడు పట్టించుకోలేదు. దీనితో 2024లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు తో నే సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నట్టుగా సిపిఎస్ ఉద్యోగులు అపుడే సామాజిక మాద్యమాల ద్వారా ఏకమై వారి కుటుంబాల్లో ని ఓట్ల(సరారి ఒక్కో కుటుంబంలో 4 ఓట్లు)ను పడకుండా చేసుకోవాలని జాగ్రత్త పడుతున్నారు. తమ కుటుంబాల్లో ఒక్కో ఇంట్లో 4ఓట్లు లెక్కేసి నా 359,000x4=1,436,000(14.36లక్షలు) ఓట్లు చేజారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Amaravathi

2023-03-29 01:57:03

ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్-1 మెయిన్స్ వాయిదా

ఏప్రిల్ నెల 23 నుంచి 29 వరకు జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్ ని జూన్ మొదటి వారానికి వాయిదా వేసినట్టు ఎపిపిఎస్సి ప్రకటించింది. ఈ పరీక్షలను జూన్ మూడు నుంచి 9 వ తేధీ వరకు చేపడతామని పేర్కొంది. 2022  సివిల్స్ ఫేజ్ - 3 ఇంటర్వ్యూలు ఏప్రియల్ 24 నుంచి మే 18 వరకు ప్రకటించడంతో గ్రూప్ వన్ మెయిన్స్ వాయిదా వేశామని ఎపిపిఎస్సి వివరణ ఇచ్చింది. అయితే యుపిఎస్సి సివిల్స్ ఇంటర్వ్యూలకి ఎపి నుంచి హాజరవుతున్న దాదాపు 25 మంది గ్రూప్ వన్ అభ్యర్ధులకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ సమయం తీసుకున్నామని పేర్కొంది.  ఇప్పటికే ఇంటర్వ్యూల షెడ్యూల్  యుపిఎస్సీ విడుదల చేసింది. సివిల్స్ ఇంటర్వ్యూల కారణంగా మెయిన్స్ ని జూన్ లో నిర్వ హించాలని ఎపిపిఎస్సీ నిర్ణయించినట్టుగా చెబుతున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి గ్రూప్-1 మెయిన్స్ కి సమయం కావాలని అభ్యర్ధు లు ప్రభుత్వానికి అర్జీలు పెడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అభ్యర్ధుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

Amaravathi

2023-03-28 15:36:21