1 ENS Live Breaking News

సీఎం వైయస్.జగన్ కు ఘనస్వాగతం

దావోస్ విదేశీ పర్యటన ముగించుకొని  తిరిగి రాష్ట్రానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి ఘన స్వాగతం లభించింది. మంగళవారం గన్నవరం విమానాశ్రయంలో సీఎం జగన్ కు సీఎస్ సమీర్‌శర్మ, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్,  ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్సీ రుహుల్లా, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, వల్లభనేని వంశీ, కైలే అనిల్ కుమార్, మల్లాది విష్ణు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం జగన్ అందరినీ ఆప్యాయంగా పలుకరించారు. అనంతరం క్యాంపు కార్యాలయానికి బయలు దేరి వెళ్లారు.

Gannavaram

2022-05-31 15:28:43

సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర సక్సెస్

రాష్ట్రంలోని ఎస్సీ,ఎస్టీ,బి.సి, మైనారిటీ వర్గాల సంక్షేమం, అభివృద్దికి పథకాలను, కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఈ నెల 26 నుండి ఐదు రోజుల పాటు  రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర విజయవంతం అయ్యిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. మంగళవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సామాజిక న్యాయ భేరి బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరధం పట్టారని, తంతోపతండాలుగా ప్రజలు ఆ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసినందుకు ధన్యవాదములు తెలిపారు.   సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర ఈ నెల 26 న  శ్రీకాకుళంలో ప్రారంభం అయి 29 న అనంతపురంలో ముగిసిందన్నారు. వర్షం కారణంగా  26 న తేదీన విజయనగరంలో బహిరంగ సభ నిర్వహిణకు కొంత సమస్య ఏర్పడినప్పటికీ, 27 న రాజమండ్రిలో, 28 న నర్సరావుపేట మరియు 29 న అనంతపురంలో బహిరంగ సభలు విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.  ఈ బస్సు యాత్రలో మరియు బహిరంగ సభల్లో 17 మంది ఎస్సీ,ఎస్టీ,బి.సి., మైనారిటీ వర్గాలకు చెందిన మంత్రులు పాల్గొన్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈ బస్సుయాత్రలో మరియు బహిరంగ సభల్లో పాల్గొనపోయినప్పటికీ ఆయన  బొమ్మ చూపి ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారన్నారు.  రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించ దగ్గ విధంగా ప్రజారంకమైన పాలన రాష్ట్రంలో జరుగుచున్నదని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజా రంజక పాలనతో ప్రజల్లో అచంచల విశ్వాసం ఏర్పడటం వల్లే తమ బస్సుయాత్ర సఫలీకృతం అయిందన్నారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పరిపాలనా సరళి ఎస్సీ,ఎస్టీ,బి.సి., మైనారిటీ వర్గాలకు బంగారు బాట వేసే విధంగాను మరియు సామాజిక విప్లకారుల ఆలోచలకు అద్దం పట్టేలా ఉందని ఆయన కొనియాడారు.

Tadepalli

2022-05-31 15:21:49

ఏపీకీ సీడీటీఎల్ సేవ‌లు అందాలి

హైద‌రాబాదులోని సీడీటీఎల్ (సెంట్ర‌ల్ డ్ర‌గ్స్ లేబొరేట‌రీ) సేవ‌ల‌ను ఏపీకి కూడా అందించాల‌ని ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని డిప్యూటీ డ్ర‌గ్ కంట్రోల‌ర్ ఆఫ్ ఇండియా డాక్ట‌ర్ ఎ.రామ‌కృష్ణ‌న్ ను కోరారు. మంగ‌ళగిరిలోని ఏపీఐఐసీ ట‌వ‌ర్స్‌లో ఉన్న త‌న చాంబ‌ర్‌లో మంగ‌ళ‌వారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఏపీ, కేంద్ర ప్ర‌భుత్వాల‌కు చెందిన డ్ర‌గ్ కంట్రోల్ అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని డ్ర‌గ్ విభాగ సిబ్బందికి కేంద్ర డ్ర‌గ్ కంట్రోల్ అధికారులు పూర్తిస్థాయిలో స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని కోరారు. స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తే మంచి ఫ‌లితాలు సాధించవ‌చ్చ‌ని చెప్పారు. హైద‌రాబాదులోని సీడీటీఎల్ సేవ‌ల‌ను ఏపీకి పూర్తి స్థాయిలో అందించాల‌ని కోరారు. బ్ల‌డ్ బ్యాంకుల్లో సుర‌క్షిత ర‌క్తం అందేలా చొర‌వ‌చూపాల‌ని, హెచ్ఐవీ రోగుల‌కు చెందిన ర‌క్తం ఊసే ఎక్క‌డా లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. క్లినిక‌ల్ ట్రైల్స్ స‌మ‌యంలో డీసీజీఐ అధికారులు స్థానికంగా ఉండే రాష్ట్ర స్థాయి అధికారుల‌కు కూడా స‌మాచారం అందించాల‌ని చెప్పారు. 

దీనివ‌ల్ల క్లినికల్ ట్ర‌యిల్స్ విష‌యంలో లోపాలు లేకుండా నివారించ‌వ‌చ్చ‌ని చెప్పారు. ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా క్లినిక‌ల్ ట్ర‌యిల్స్ జ‌రిగేలా చూడాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉందని చెప్పారు. ప్ర‌పంచ‌స్థాయి నైపుణ్యం పొందేలా రాష్ట్రాల్లోని డ్ర‌గ్ విభాగం అధికారుల‌కు సెంట్ర‌ల్ డ్ర‌గ్స్ స్టాండ‌ర్డ్ కంట్రోల్ ఆఫ్ ఆర్గ‌నైజేష‌న్ (సీడీఎస్‌సీవో) తో శిక్ష‌ణ ఇప్పించాల‌ని కోరారు. మంత్రి విజ్ఞ‌ప్తుల‌పై డిప్యూటీ డ్ర‌గ్ కంట్రోల‌ర్ ఆఫ్ ఇండియా డాక్ట‌ర్ ఎ.రామ‌కృష్ణ‌న్ సానుకూలంగా స్పందించారు. హైద‌రాబాదులోని సీడీటీఎల్ ఇక‌పై ఏపీకి కూడా సేవ‌లు అందిస్తుంద‌ని చెప్పారు. రాష్ట్రంలోని అధికారుల‌తో పూర్తి స్థాయిలో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ప‌నిచేస్తామ‌ని వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వ అధికారుల‌తో పాటు, రాష్ట్ర డ్ర‌గ్ విభాగం డైరెక్ట‌ర్ ప్రసాద్‌, ప‌లు ఫార్మా కంపెనీల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Tadepalli

2022-05-31 15:14:00

కోర్టుకేసులు తొలగితేనే వారి సర్వీసు రెగ్యులర్

అనుకున్నట్టే జరిగింది.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసుల సర్వీసు ప్రొబేషన్ విషయంలో మరో బాంబు పేల్చింది. సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి కోర్టు కేసులు క్లియర్ అయిన శాఖల సిబ్బందికి మాత్రమే సర్వీసు రెగ్యులైజేషన్ ప్రక్రియ మొదలు పెట్టాలని, మిగిలిన శాఖల సిబ్బంది విషయంలో కోర్టు ఆదేశాలు వచ్చే వరకూ వేచి ఉండాలని ఆదేశాలు జారీచేసింది. దీనితో నియామకాల విషయంలో కోర్టు కేసులున్న సచివాలయ మహిళా పోలీసులు అంతా ఆందోళన చెందుతున్నారు. 2019లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన దగ్గర నుంచి సుమారు మూడు కేసులు వరకూ మహిళా పోలీసుల నియామకాలు చట్టవిరుద్దంగానూ, రాజ్యాంగ ఉల్లంగణ ద్వారా జరిగాయని కోర్టుల్లో పిల్స్ దాఖలు అయ్యాయి. దానికితోడు దేశంలో ఎక్కడా లేనివిధంగా, ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేపట్టని విధంగా ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ ను ఆంధ్రప్రదేశ్ లోని కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ శాఖలో 33నెలలు చేయిస్తోంది. దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రభుత్వ ఉద్యోగుల్లోకి చేరిన రెగ్యులర్ ఉద్యోగులకు రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్నవారిని రెగ్యులర్ చేసి వారికి పే స్కేలు వర్తింప చేస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఆ విధంగా జరగకపోవడం వలన రాష్ట్రవ్యాప్తంగా 15వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లోని సుమారు 14350పైగా మహిళా పోలీసులు డైలమాలో పడ్డారు. ప్రభుత్వానికి అనుకూలంగా సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ పీరియడ్ ను 33 నెలలకు పెంచేసిన ప్రభుత్వం, ప్రసూతి సెలవుల విషయంలో ప్రభుత్వ నిబంధన అమలు చేసింది. దానితో చాలామంది మహిళా ఉద్యోగులకు సర్వీసు ప్రొబేషన్ మరో 6నెలలు పొడిగింపు వర్తింపచేశారు. ఇప్పటికే 9నెలలు అదనంగా పొడిగించిన సర్వీస్ ప్రొభేషన్ చేస్తున్న సచివాలయ ఉద్యోగులకు, ఇపుడు కోర్టుకేసులు శాపంగా పరిణమించాయి. ఎన్నో ఆశలతో విధుల్లోకి చేరిన ఉద్యోగులకు, ప్రభుత్వం ప్రొభేషన్ ను 9నెలలు పెంచేయడం వలన సుమారు లక్ష రూపాయల వరకూ పేస్కేలు మొత్తం నష్టపోవాల్సి వచ్చింది. ప్రసూతి సెలవులు తీసుకున్నవారికి ఆరునెలలు అదనంగా పనిచేయాల్సి వచ్చింది. అంతేకాకుండా ఇపుడు కోర్టు కేసుల విషయం తెరపైకి రావడంతో అది ఇంకా ఎన్నినెలలకి ఫైనల్ హియరింగ్ కి వస్తుందో తెలియని పరిస్థితి.

ప్రస్తుత పరిస్థితుల్లో కోర్టు కేసులు తేలేవరకూ సచివాలయ మహిళా పోలీసులకు ప్రభుత్వం పేస్కేలు కూడా వర్తించే పరిస్థితి కనిపించడం లేదు. రాజ్యాంగ విరుద్ధంగా సచివాలయ మహిళా పోలీసు నియామకాలు జరిగాయని దాఖలైన వాజ్యంలో అవతలి వ్యక్తి ఆధారాలు కోర్టుకి సమర్పించినా, వాటిని కోర్టు ఏకీబవించినా.. సచివాలయ మహిళా పోలీసు పోస్టులన్నీ రద్దు అయినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. ఒకవేళ కోర్టులో కేసులు తేలకపోయినా వీరి సర్వీసును రెగ్యులర్ చేయరు సరికదా.. ఎంతకాలమైనా ప్రభుత్వం నిర్ధేశించిన రూ.15వేలకే వారంతా ఉద్యోగాలు చేయాల్సి వుంటుంది. సాధారణంగా ఈ తరహా కోర్టుకేసులంటే రెండు మూడేళ్లు సమయం పడుతుంది. ఈ తరుణంలో తమ ఉద్యోగాల పరిస్థితి ఏంటని గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరికి అదనంగా పనులు అప్పగించడం దగ్గర నుంచి 2వ శనివారం, ఆదివారాలు ఆఖరికి ప్రభుత్వ సాధారణ సెలవుల్లో సైతం దిశయాప్ లు, ప్రత్యేక కార్యక్రమాలు, సిటిజన్ ఔట్ రీచ్ అంటూ అదనపు విధులు చేయించిన ప్రభుత్వం సర్వీసు రెగ్యులర్, ఇతర కోర్టు కేసుల విషయంలో మాత్రం చాలా నెమ్మదిగా ఆచితూచి అడుగులు వేస్తూ వచ్చింది. తీరా ఉద్యోగుల సర్వీసు ప్రొభేషన్ డిక్లేర్ చేసే సమయానికి కోర్టుకేసులను తెరపైకి తీసుకువచ్చి.. కోర్టు కేసులు తేలేవరకూ వారి సర్వీసులు రెగ్యులైజేషన్ ప్రక్రియ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో మహిళా పోలీసులు అభద్రతా భావానికి లోనవుతున్నారు. ఈ తరుణంలోనే కోర్టు కేసులు బలపడితే వీరందరినీ..జూనియర్ అసిస్టెంట్లుగా వివిధ శాఖల్లో ఖాళీగా పోస్టుల్లో భర్తీచేస్తారనే కొత్త ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. కోర్టుకేసులు, సర్వీసు ప్రొబేషన్ గడువు జూన్ నెలాఖరుతో ముగుస్తున్న వేళ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి..!

Tadepalli

2022-05-31 03:50:04

తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రచారం..

EnsLive Appలో మీ వ్యాపార ప్రకటనలు ఇవ్వడం ద్వారా లక్షలాది పాఠకులకు, ప్రజలకు చేరువ అవ్వొచ్చు.. EnsLive Appతో పాటు www.enslive.net న్యూస్ వెబ్ సైట్ లో ఏక కాలంలో మీ ప్రకటన ప్రజలకు క్షణాల్లో చేరిపోతుంది. Whole salers, retailers, education, coaching centers, textiles, automobiles, interior developers ,real estate వ్యాపారం ఏదైనా మీరు ఆశించిన ఫలితాలు వచ్చేవరకు మీ ప్రకటనలను పాఠకుల దగ్గరకుతీసుకెళ్లడంతో మేము మీకు తోడుగా ఉంటాము. ప్రకటనలకు తక్కువ మొత్తం చెల్లించి అత్యంత ఎక్కువ ఫలితాలను పొంది. మీ వ్యాపారాలను మరింతగా వ్రుద్ధి చేసుకోండి.. ఇపుడే ఈఎన్ఎస్ లైవ్ యాప్ లో ప్రకటనల కోసం సంప్రదించండి..  మరిన్ని వివరాలకు :9390280270లో సంప్రదించండి.

Tadepalli

2022-05-30 17:56:22

YSRCP నుంచి అనంతబాబు సస్పెన్షన్

ఎట్టకేలకు వైఎస్సార్సీపీ అధిష్టానం ఎమ్మెల్సీ అనంతబాబుపై చర్యలు తీసుకుంది. డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య కేసులో అరెస్టైన ఎమ్మెల్సీని పార్టీ నుంచి  స‌స్పెండ్ చేసింది. ఈ మేర‌కు  బుధ‌వారం సాయంత్రం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.  ఆంధ్రప్రదేశ్ లో క‌ల‌క‌లం రేపిన  డ్రైవర్ సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య కేసులో అరెస్టైన అనంత‌బాబు ప్ర‌స్తుతం జ్యుడిషియ‌ల్ రిమాండ్‌లో  ఉన్నారు.  డ్రైవర్ ను తానే హత్య చేశానని తన తప్పుని ఒప్పుకోవడంతో వెంటనే శిక్షపడింది. వాస్తవానికి హత్యకేసులో అరెస్టు అయిన వెంటనే పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా..చాలా వరకూ తాత్సారం చేసింది. అయితే ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు, మీడియా పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్లడంతో చేసేదేమీ లేక ఆఖరికి ఈ రోజు ఎమ్మెల్సీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. కేవలం పార్టీ నుంచి మాత్రమే సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది ఎమ్మెల్సీ పదవి విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. వాస్తవానికి నేర చరిత్ర ఉన్నవారి విషయంలో పార్టీ అధిష్టానం గవర్నర్ లేదా రాష్ట్రపతి ఆమోదం తో పార్టీతోపాటు, పదవి నుంచి కూడా తప్పిస్తుంది. కానీ వైఎస్సార్సీపీ కేవలంల పార్టీ నుంచి మాత్రమే సస్పెండ్ చేసినట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఈ విషయంలో కూడా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

Tadepalli

2022-05-25 13:56:51

రైతుబజార్లలో కూరగాయలు సమ్రుద్దిగా ఉండాలి

రాష్ట్రంలో వివిధ రైతు బజారుల్లో ప్రజలకు అవసరమైన వివిధ నిత్యావసర సరుకులు, కూరగాయలను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అధికారులను ఆదేశించారు.ఈమేరకు బుధవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో నిత్యావసర సరకుల ధరల స్థితిగతులపై ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రతిరోజూ నిత్యావసర సరకుల ధరలను మానిటర్ చేయాలని ధరల పెరుగుదల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.నిత్యావసర సరుకుల అక్రమ నిల్వలపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.నిత్యావసర వస్తువుల ధరల మానిటర్ చేసేందుకు వీలుగా ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తేనున్నట్టు సిఎస్ పేర్కొంటూ దానిని అర్ధగణాంక విభాగం(డైరెక్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్) అధికారులు రూపొందిస్తున్నట్టు సిఎస్ డా.సమీర్ శర్మ ఆదేశించారు.ఈయాప్ ను మార్కెటింగ్ శాఖ,పౌరసరఫరాల శాఖలు,తూనికలు కొలతలు శాఖ,విజిలెన్సు అండ్ ఎన్ఫోర్సుమెంట్ విభాగాలు వినియోగించుకుని నిరంతరం ధరలను పర్యేవేక్షించాల్సి ఉంటుందని సిఎస్ డా.సమీర్ శర్మ చెప్పారు.

        రైతు బజారుల్లో వివిధ కూరగాయలను కూడా పూర్తిగా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ రైతు బజారుల సిఇఓ మరియు మార్కెటింగ్ శాఖల అధికారులను సిఎస్ సమీర్ శర్మ ఆదేశించారు.ముఖ్యంగా ప్రస్తుతం టమాటా ధరలు అధికంగా ఉన్నందున మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద రైతుల నుండి నేరుగా టమాటాలను కొనుగోలు చేసి రైతు బజారుల్లో నిర్దేశిత ధరలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

        ఈసమావేశంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఇఓ కార్యదర్శి మరియు కమీషనర్ గిరిజా శంకర్,మార్కెటింగ్ శాఖ కమీషనర్ ప్రద్యుమ్న,విజిలెన్సు అండ్ ఎన్ఫోర్సుమెంట్,ఆయిల్ ఫెడ్   తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.అలాగే వీడియో లింక్ ద్వారా రాష్ట్ర సహకార మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి వై.మదుసూదన రెడ్డి,విజిలెన్సు అండ్ ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టర్ జనరల్ బాగ్చి,ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tadepalli

2022-05-25 13:15:51

ప్రాధమిక ఆరోగ్యకేంద్రాల్లో హెల్త్ సాఫ్ట్ వేర్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకూ సెంట్రల్ హెల్త్ సాఫ్ట్ వేర్ విధానాన్ని తీసుకు రావాలని యోచిస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఈ సాఫ్ట్ వేర్ అందుబాటులోకి వస్తే ప్రభుత్వ వైద్య విధానాల్లో సమూల మార్పులు తీసుకు రావచ్చుననేది ప్రభుత్వ ఆలోచన. వాస్తవానికి ఈ విధానం డా.వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రావాల్సి వుంది. దివంతగత వైఎస్సార్ అనంతరం అది మరుగున పడిపోయింది.  తాజాగా మళ్లీ ఈ విషయం ఇపుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం  తెరపైకి తీసుకు వచ్చినట్టు తెలిసింది. ఈ సాఫ్ట్ వేర్ పనిచేసే విధానం తెలిస్తే ప్రతీఒక్కరూ ఆశ్చర్యపోతారు. అదే సమయంలోప్రభుత్వానికి మందులు, ఇతరత్రా సౌకర్యాల విషయంలో కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. ఆ సాఫ్ట్ వేర్ ఏవిధంగా పనిచేస్తుందో ఒక్కసారి తెలుసుకుందాం. ఒక రోగి ఆసుపత్రికి రాగానే ఆరోగి యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబరుతో ఒక డేటాబేస్ ను తయారు చేస్తారు. తరువాత ఆయనకి ఏ విధమైన వైద్యం అందించారో కూడా వివరాలు ఆ డేటా బేస్ ఫైల్ లోనే పొందుపరుస్తారు. మందులు, క్లినికల్ టెస్టులు ఇలా మొత్తం సమాచారం ఆ ఫైల్ లో ఉంటాయి. ఇలా ప్రతీ నెలా ఎంతమంది  రోగులు వస్తున్నారు..రాష్ట్రం మొత్తం మీద ఏ తరహా రోగాలు అధికంగా నమోదు అవుతున్నాయి.. వాటికి కావాల్సిన మందులు ఏమిటి, ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఏ తరహా రోగాలకు మందులున్నాయి.. అనే విషయాలన్నీ రాజధానిలోని సెంట్రల్ డేటా బేస్ సిస్టమ్ లో నమోదు అవుతాయి. తద్వారా రాష్ట్రంలోని ఏఏ ప్రాంతాల్లో ఏఏ రోగాలు అధికంగా నమోదుఅవుతున్నాయో తెలుసుకోవడానికి వీలుపడుతుంది. అంతేకాకుండా సదరు పీహెచ్సీకి జిల్లా సెంట్రల్ డ్రగ్ స్టోరేజి నుంచి మందులు సరఫరా చేయడం ద్వారా అనసర మందుల వినియోగం,  కొనుగోలు కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా రోగులకు ఏ తరహామందులు అందుబాటులో లేవో కూడా సదరు డేటాబేస్ ఫైలులోనే ఇండెంట్ పెట్టడానికి ఆస్కారం వుంటుంది. పైగా రోగికి పూర్తిస్థాయిలో వైద్యం అందడంతోపాటు, అత్యవసర సమయంలో రోగిని జిల్లా ఆసుపత్రికి సర్జరీ కోసం తరలించాల్సి వస్తే.. ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో రోగికి ముందుగా ఏ ఏ రకాల మందులు ఇచ్చారు.. ఆపరేషన్ సమయంలో ఇంకేరకాల మందులు ఇవ్వాలనే విషయం జిల్లా ఆసుపత్రుల్లోని వైద్యులకు కూడా ఈ-కేషీట్ ద్వారా తెలుస్తుంది.

ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో వైద్యం అందించడానికి అందుబాటులో ఉన్న చాలా రకాల మందులను కొనుగోలు చేస్తున్నది. వాటిలో కొన్ని మాత్రమే ఉపయోగ పడి మిగిలిన మందులన్నీ కాలం చెల్లిపోవడంతో వాటిని మొక్కలకు ఎరువుగా కానీ.. ఎక్కడో చెత్తకుప్పలోగానీ వేసేస్తున్నారు. ఈ సెంట్రల్ హెల్త్ సాఫ్ట్ వేర్ ను వినియోగించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వున్న ఆసుపత్రుల్లో ఎంత మంది రోజులకు వైద్య సేవలు అందాయి.. ఎంతమందికి ఆపరేషన్లు ఏఏ అవయవాలకు చేశారు.. ఎన్ని మందులు వినియోగించారు.. దానికి అయిన ఖర్చు ఎంత ఇలా మొత్తం సమాచారం ఆన్ లైన్ లో ఎప్పటికప్పుడు నమోదు అయిపోతాయి. అంతేకాకుండా ఈ విధానం అందుబాటులోకి వస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫార్మసీ విభాగం కూడా ప్రైవేటు ఆసుపత్రులు, మందుల షాపులను తలదన్నేవిధంగా తయారవుతుంది. పైగా ఏ రోగి ఎన్ని రకాల మందులు వాడారు, మోతాదుకి మించి వాడారా.. అలా వాడితే వచ్చే దుష్ప్రభావలు ఏంటి అనే విషయంపై కూడా ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆస్కారం వుంటుంది.

ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో ఎపడమిక్ సీజన్ లో వివిధ రకాల రోగాలు గిరిజనులను పట్టి పీడిస్తుంటాయి. ఆ సమయంలో వారికి ఏ తరహా మందులు కావాలి, ఏఏ రకాల క్లినికల్ పరీక్షలు చేయాలనే విషయమై కూడా ప్రభుత్వానికి ఒక క్లారిటీ వస్తుంది. తద్వారా జిల్లా కలెక్టర్ల ఆదేశాలతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సెంట్రల్ డ్రగ్ స్టోర్ అధికారులు కేవలం ఆయా ఎపడమిక్ సీజన్ లో కావాల్సిన మందులను మాత్రమే అందుబాటులో ముందుస్తుగా ఏర్పాటుచేసుకోవడానికి వీలుపడుతుంది. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం అన్ని జిల్లాల్లోనూ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో పూర్తిస్థాయిలో వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని నియమిస్తోంది. ఇపుడు ఆ హెల్త్ సాఫ్ట్ వేర్ కూడా అందుబాటులోకి వస్తే మరిన్ని ఫలితాలు నమోదు చేయవచ్చుననేది ప్రభుత్వ ఆలోచనగా వుంది. అయితే ప్రస్తుతం ఈ సెంట్రల్ హెల్త్ సాఫ్ట్ అంశం ప్రాధమిక దశలోనే ఉంది. కాగా ప్రస్తుతం అన్ని కార్పోరేట్ ప్రైవేటు ఆసుపత్రులు ఈ సెంట్రల్ హెల్త్ సాఫ్ట్ వేర్ ను వినియోగించి అనేక ప్రయోజనాలు పొందడంతోపాటు, అనవసర ఖర్చులను పూర్తిగా తగ్గించుకుంటున్నాయి. చూడాలి రాష్ట్రప్రభుత్వం ఆలోచన చేస్తున్న ఈ సెంట్రల్ హెల్త్ సాఫ్ట్ వేర్ ఎప్పటిలోగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నుంచి ఏరియా ఆసుపత్రలు, జిల్లా ఆసుపత్రుల్లో అందుబాటులోకి వస్తుందో..!

Tadepalli

2022-05-25 02:32:32

25 నుంచి తిరుమలలో హ‌నుమ‌జ్జ‌యంతి

తిరుమ‌ల‌లో మే 25 నుండి 29వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాలకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. మే 25న తిరుమ‌ల‌లోని శ్రీ బేడి ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం, మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారి విగ్ర‌హానికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తారు. నాద‌నీరాజ‌నం వేదిక‌, ఆకాశ‌గంగ‌, జ‌పాలి ప్రాంతాల్లో ధార్మికోప‌న్యాసాలు, భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు. మే 29న ధ‌ర్మ‌గిరి వేద‌పాఠ‌శాల‌లో ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వలకు సంపూర్ణ సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం జ‌రుగనుంది.  శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి బుధ‌వారం ఉద‌యం అభిషేకం, అర్చన, నివేదనలు నిర్వహిస్తారు. అదేవిధంగా, మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద గ‌ల  శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారి నిలువెత్తు విగ్రహానికి  మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు టిటిడి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ సంద‌ర్భంగా భ‌క్తుల సౌక‌ర్యార్థం తిరుమ‌ల నుండి ఏడో మైలు వ‌ర‌కు ఉదయం 11 నుండి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు ఉచిత ర‌వాణా సౌక‌ర్యం క‌ల్పించింది.

నాద‌నీరాజ‌నం వేదికపై ...
  నాద‌నీరాజ‌నం వేదిక‌పై మ‌ధ్యాహ్నం 3 నుండి 4 గంటల వ‌ర‌కు ఆధ్యాత్మిక ప్ర‌వ‌చ‌న కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది. ఇక్క‌డ మే 25న "అంజ‌నానంద‌నం వీరం" అనే అంశంపై ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి, మే 26న "సుంద‌రే సుంద‌రః క‌పిః" అనే అంశంపై డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ‌, మే 27న "వీరో హ‌నుమాన్ క‌పిః" అనే అంశంపై డా. ఎం.ప‌వ‌న‌కుమార్ శ‌ర్మ‌, మే 28న "జ్ఞానినామగ్ర‌గ‌ణ్యం" అనే అంశంపై ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి, మే 29న "రామ‌వైభ‌వ స్ఫూర్తి" అనే అంశంపై డా. ఎం.జి.నంద‌న‌రావు ఉప‌న్య‌సిస్తారు.

ఆకాశ‌గంగ వ‌ద్ద ...
ఆకాశ‌గంగలోని శ్రీ బాలాంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద ఉదయం 10 నుండి 11 గంటల వ‌ర‌కు  ప్ర‌ముఖ పండితులు శ్రీ హ‌నుమ అవ‌తార ఘ‌ట్ట ప్ర‌వ‌చ‌నాలు చేస్తారు. ఉద‌యం 11 గంట‌ల నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌రకు అన్న‌మాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య క‌ళాశాల ఆధ్వ‌ర్యంలో భ‌క్తిసంగీతం, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

జ‌పాలిలో...
జ‌పాలి శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద ఉదయం 10 నుండి 12 గంట‌ల వ‌ర‌కు, తిరిగి మ‌ధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌రకు అన్న‌మాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య క‌ళాశాల ఆధ్వ‌ర్యంలో భ‌క్తిసంగీతం, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

Tirumala

2022-05-24 12:25:01

మే26న వ‌యోవృద్ధుల కోటా టోకెన్లు విడుదల

తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారి కోసం జులై నెల ప్ర‌త్యేక ద‌ర్శ‌న టోకెన్ల కోటాను మే 25వ‌ తేదీన మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తారు. కాగా, ఈ విధంగా బుక్ చేసుకున్న వారిని ప్ర‌స్తుతం ప్ర‌తిరోజూ ఉద‌యం 10 గంట‌ల స్లాట్‌లో ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తున్నారు. జూన్ 1వ తేదీ నుండి ఉద‌యం 10 గంట‌లకు బ‌దులుగా మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స్లాట్‌లో అనుమ‌తిస్తారు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని టిటిడి కోరుతుంది. ఆగస్టు నెల‌కు సంబంధించిన గ‌దుల కోటా మే 26వ తేదీ ఉద‌యం 9 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల కానుంది. ఈ అవకాశాన్ని వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారి కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని టిటిడి మీడియాకి విడుదల చేసిన ప్రకటన ద్వారా కోరుతోంది.

Tirumala

2022-05-24 10:51:13

ఈఎన్ఎస్ లైవ్ వార్తకు స్పందన.. వారి ప్రొబేషన్ డిక్లరేషన్ ఫైల్స్ కి కదలిక..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ కి సంబంధించి మూడు రోజుల్లోగా ఉద్యోగుల డిక్లరేషన్ ఫైల్స్ స్వీకరించాలని  రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. వాస్తవానికి గత అక్టోబర్ 2నాటికే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసును ప్రభుత్వం రెగ్యులర్ చేయాల్సి వుంది. అనూహ్య పరిణామాల మధ్య వారి సర్వీసు ప్రొబేషన్ గడువుని 9నెలలు పెంచింది. 8నెలలు పూర్తవుతున్న తరుణంలో ‘వారి సర్వీస్ రెగ్యులైజేషన్ పై క్లారిటీ ఏది..?’ శీర్షికన ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారి మొబైల్ న్యూస్ యాప్,  వెబ్ సైట్  Ens Live మరియు www.enslive.net ద్వారా ఏకకాలంలో సచివాలయ ఉద్యోగుల ఇబ్బందులు, బాధలను ప్రత్యేక కధనంగా ప్రచురించింది. దీనితో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మేనెలాఖరు నాటికల్లా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన సర్వీసు రెగ్యులైజేషన్  ఫైళ్లను ఆయా శాఖలకు పంపాలని ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రభుత్వం ఆదేశించింది. దీనితో రాష్ట్రంలోని 15005 సచివాలయాల్లోని సుమారు లక్షా 28వేల మంది ఉద్యోగులకు చెందిన ప్రొబేషన్ డిక్లరేషన్ ఫైళ్లకు కదలిక వచ్చింది. అయితే ఇక్కడ ప్రభుత్వం ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ గడువుని అమాంతంగా పెంచేసినా.. ఆరు నెలల ప్రసూతి సెలవులు తీసుకున్న వారి విషయంలో మాత్రం నిభందనలు ఖచ్చితంగా అమలు చేసింది. పెంచేసిన గడువుతోపాటు, మహిళా ఉద్యోగులు తీసుకున్న ఆరు నెలల ప్రసూతి సెలవుల గడువు పూర్తయిన తరువాత మాత్రమే ఉద్యోగులకు చెందిన సర్వీస్ ప్రొబేషన్ ఫైళ్లను అధికారులు జాల్లా శాఖలకు చేరవేస్తున్నారు. దీనితో రాష్ట్రంలో చాలా మంది ఉద్యోగులు వారు చేస్తున్న సచివాలయ ఉద్యోగాలను వదిలిపెట్టి పోయారు. అంతేకాకుండా విశాఖజిల్లాల్లో ఒక సచివాలయ ఉద్యోగి సర్వీసు రెగ్యులర్ కాకపోవడం, పని భారం అధికంగా ఉండటంతో ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. ఈ తరుణంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ ఉద్యోగుల సర్వీసును రెగ్యులర్ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

మేనెలాఖరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా వున్న గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులకు సంబంధించిన సర్వీసు రెగ్యులైజేషన్ ఫైళ్లు డిఎస్సీ కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ కు చేరితే అక్కడి నుంచి ఫైనాన్స్ శాఖకు వెళ్లి ఆపై ఏజీ నుంచి ఖజానాశాఖకు వీరి ఫైల్స్ చేరుకుంటాయి. ఈ తంతు అంతా జరగడానికి సుమారు నెలరోజులు సమయం పడుతుంది.  దీనితో అన్ని సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ డిక్లరేషన్ కి సంబంధించిన ఫైళ్లను పంపాలంటూ రాష్ట్రవ్యాప్తంగా వున్న 26 జిల్లాలకు చెందిన కలెక్టర్లు ఆయా జిల్లాశాఖలను ఆదేశించడంతో గత 2 రోజులుగా ప్రొబేషన్ డిక్లరేషన్ ఫైళ్లకు మోక్షం వచ్చంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జూలై నెల నుంచి సర్వీస్ ప్రొబేషన్ ప్రక్రియ మొత్తం పూర్తయి, వారికి ప్రభుత్వం ప్రకటించిన విధంగా పేస్కేలు అందుతుంది. అయితే ఇక్కడ ప్రభుత్వం గతంలో ప్రకటించినట్టుగా పీఆర్సీతో కూడిన పేస్కేలు ఇస్తుందా...లేదంటే హెచ్ఆర్ ఏలో కోతలు వేసిన పేస్కేలు ఇస్తుందా అనే విషయంలో మాత్రం క్లారిటీ రావాల్సి వుంది. గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఏర్పాటైన దగ్గర నుంచి ఉద్యోగుల విషయంలోగానీ, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల విషయంలోగానీ వాటిని ప్రజలకు తెలియజేసేందుకు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారి మొబైల్ న్యూస్ యాప్, వెబ్ సైట్  Ens Live మరియు www.enslive.net ద్వారా ఏకకాలంలో ప్రత్యేక కధనాలు ప్రచురిస్తూ వచ్చింది. అదే క్రమంలో ప్రొబేషన్ డిక్లరేషన్ విషయంలో కూడా  ప్రత్యేకంగా కథనం ప్రచురించడంతోనే ప్రభుత్వంలో కదలిక వచ్చి తమ సర్వీసు ప్రొబేషన్ ఫైళ్లకు మోక్షం కలిగిందంటూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విశాఖపట్నంలోని ఈఎన్ఎస్ లైవ్ యాప్ ప్రధాన కార్యాలయానికి ఫోన్లు చేసి తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. అయితే ఇపుడే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు, వారి సమస్యలు, అక్కడక్కడా తేడా ఉద్యోగులు చేసే తప్పుడు పనులపైనా కూడా ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ తన గళం బలంగా వినిపిస్తుందని మరోసారి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం చేపట్టే అన్ని జనరంజక కార్యక్రమాలను కూడా ప్రజల ముందుకు ప్రత్యేక వార్తా కధనాలుగా తీసుకు వస్తామని కూడా ప్రకటిస్తున్నాం. జనం గళంగా ప్రారంభమైన ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఎప్పుడూ జనం వెంట..జనం కోసం మాత్రమే పనిచేస్తుందని, ఈ విషయంలో ఏ రాజకీయపార్టీకి, నాయకులకు కొమ్ముకాసేది లేదని.. బల్లగుద్ది చెబుతున్నాం. తెలుగు ప్రజల గుండె చప్పుడు ఈఎన్ఎస్ లైవ్..  అరచేతిలో విశ్వవార్తల సమాహారం..!

Tadepalli

2022-05-24 03:18:09

3ఏళ్ల YSRCP ప్రభత్వ పాలనలో ప్లస్, మైనస్

ఆంధ్రప్రదేశ్ లో సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజు అంటే మే 23 వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి ప్రజల ముందుకి వచ్చింది. రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో వైఎస్సార్సీపీకి ప్రజలు బ్రహ్మరధం పట్టారు. ఒకటి కాదు రెండు  ఏకంగా 151 సీట్లు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకొని టీడీపీని చావుదెబ్బకొట్టి మరీ గెలిచింది వైఎస్సార్సీపీ. కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం లాంటి జిల్లాలో పార్టీ టిడిపిని మట్టికరిపించింది క్లీన్ స్వీప్ చేసేసింది. దీనితో ఎంతో చరిత్ర ఉన్న టీడీపీ 23 సీట్లకే పరిమితం అయిపోయింది. అధికారంలోకి వచ్చింది మొదలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం జనంతోనే ఉంటున్నాం అన్నట్టుగా సంక్షేమ పథకాలు ప్రజల ఇంటి ముందుకే తెచ్చింది. ఎక్కడైనా, ఏ వ్యవస్థలో అయినా నూటికి నూరు శాతం ఎవరూ బాగా చేయలేరు. ఇక్కడ కూడా అదే జరిగింది. స్వతహాగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహరెడ్డి ఆలోచనో.. లేదంటే సలహాదారులు, ప్రభుత్వంలోని ముఖ్య అధికారుల దారిమళ్లింపో తెలీదు కానీ, కొన్ని కొన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఆ దిశలో ఒక వర్గానికి పూర్తిగా విలన్ గా మారిపోయింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. అయితే మెజార్టీ వర్గానికి మాత్రం మేలు జరిగిందనే వాదన మాత్రం పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా ఎక్కడా చెక్కు చెదరలేదు.  ఈ క్రమంలోనే మరికొంతమందికి తీవ్ర అన్యాయం కూడా జరిగింది. తద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు రావడంతోపాటు, పథకాలు కూడా ప్రజాకర్షణకు నోచులేకపోయాయి. ఈ దిశలో పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల నాడిని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ens live mobile news app, www.enslive.net ద్వారా 26 జిల్లాల్లో గ్రౌండ్ లెవల్ సర్వేని చేపట్టింది. ఇందులో ఆశక్తికర విషయాలు వెలుగు చూశాయి. సాధారణ ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారులు, పథకాలు పొందిన లబ్దిదారులు చెప్పిన విధంగా ప్లస్, మైనస్ లు వారీగా  ఏ విధమైన స్పందన తెలియజేశారో  ఇక్కడ వారి మాటలనే వార్తగా  తెలియజేస్తున్నాం. 


ప్లస్ లు ఈ విధంగా ఉన్నాయి..
ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న పార్టీగా వైఎస్సార్సీపీకి గుర్తింపు, దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఒక నూతన విధానం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు, లక్షా 28వేల ఉద్యోగాల కల్పన, నవరత్నాలతో పేదల వద్దకే సంక్షేమ పథకాల తరలింపు, నాడు-నేడు తో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్పు, దళారీలు లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాలోకే జమ, ప్రతీ పేదవాడికి ఇల్లు మంజూరు, సమర్ధవంతంగా కరోనా వైరస్ ను టీకాతో ఎదుర్కోవడం, ప్రజలకు అందుబాటులో మందులు ఏర్పాటు చేయడం, ఆసుపత్రుల అభివ్రుద్ధి, కొత్త పీహెచ్సీల నిర్మాణం, 104 వాహనాలతో ప్రజల ముందుకే వైద్యసేవలు, పశువులకు వైద్యం అందించడానికి సంచార పశువైద్యశాలలు, గ్రామాల్లో యూ పీహెచ్సీల ఏర్పాటు, నూతన విద్యావిధానంతో కేజీ నుంచి ఇంటర్ వరకూ సీబీఎస్ఈ సిలబస్ విద్య, మహిళలకు ఆర్ధిక స్వావలంబన, డ్వాక్రా రుణాల మాఫీ, అన్ని ప్రాంతాల అభివ్రుద్ధి కోసం నూతన జిల్లాల ఏర్పాటు, యువతకు ప్రత్యేక ఉపాది శిక్షణా కార్యక్రమాలు, గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే అత్యధిక సంక్షేమ పథకాలు నిరుపేదలకు నగదు రూపంలో ఆర్ధికంగా అందించడం. వాహన మిత్ర, రైతు భరోసా, మత్స్యరా భరోసా, ఫాస్టర్లు ఆర్దిక తోడ్పాటు, న్యాయవాధులకు ఆర్ధిక తోడ్పాటు, 45ఏళ్లు నిండిన వారికి ప్రతీ ఏటా ఆర్దిక సహాయం, వ్రుత్తిదారులకు ఆర్ధిక సహాయం, పావలా వడ్డీ రుణాలు, ఆర్బీకేల ద్వారా వ్యవసాయ రైతులకు, పాడి రైతులకు సేవలు, ప్రభత్వ ఆధ్వర్యంలోనే ధాన్యం కొనుగోళ్లు ఆన్ లైన్ లోనే నేరుగా రైతులకు పేమెంట్లు, ఎరువుల నుంచి పురుగు మందుల వరకూ అన్నీ ఆర్బీకేల్లోనే ఏర్పాటు, అత్యవసర వైద్యసేవల కోసం 108లు, ఆసుపత్రుల్లో జాతీయ ఆరోగ్య మిషన్ పథకం ద్వారా పారామెడికల్ సిబ్బందిని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో భర్తీచేయడం, గ్రామసచివాలయ ఏఎన్ఎంలకు ఇన్ సర్వీసులో స్టాఫ్ నర్సు శిక్షణ ఇప్పించడం, చాలా ప్రభుత్వ శాఖల్లో అధికారుల హోదాలు మార్పు చేయడం, కమర్షియల్ టాక్స్ అధికారులకు గెజిటెడ్ హోదా కల్పించడం, ప్రైవేటు పాఠశాలలను తలదన్నేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం విద్యతోపాటు, లాంగ్వేజి ఇంప్రూవ్ మెంట్ కార్యక్రమం అమలు చేసి, విద్యార్ధులకు పాఠశాల స్ధాయి నుంచే ఆంగ్లంలో పట్టు వచ్చేలా చేయడం, అన్ని సామాజిక వర్గాల వారికి సముచిత స్థానం కల్పించడం.. ఇలా ప్రభుత్వంలోని ప్లస్ లు చెప్పుకొచ్చారు.


ఇక మైనస్ లు ఈ విధంగా ఉన్నాయి..
ఎంతో సాఫీగా సాగే రేషన్ సరుకుల ప్రక్రియను విచ్చిన్నం చేసి, ఇంటింటికీ రేషన్ సరుకులు అని అట్టర్ ఫ్లాప్ పధకం పెట్టి వాహనాల ద్వారా .. అన్ని రేషన్ సరుకులు కుదించేసి ఒక్క బియ్యం మాత్రమే పంపణీచేయడం,  ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేక విధానాలకే పెద్దపీట వేయడం, ప్రభుత్వ ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ అమలు చేయడం, హెచ్ఆర్ఏలో కోత విధించడం, పించను దారులకు క్వాంటమ్ పించను తగ్గించయడం, రద్దు చేస్తామన్న సీపీఎస్ స్థానంతో రివర్స్ లో జిపిఎస్ విధానం తెరపైకి తేవడం, ప్రతీఏటా జాబ్ కేలండర్ ప్రకటించి ఉద్యోగాలు తీస్తామని చెప్పి కేవలం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు ఒక్కటే తీసి చేతులు దులుపుకోవడం, దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ ఉద్యోగుల రెండేళ్ల సర్వీస్ ప్రొబేషన్ 33 నెలలకు పెంచడం, ప్రతిపక్షంలో ఉండగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగ విధానాన్ని రద్దుచేయాలని పోరాటం చేసి, తీరా అధికారంలోకి వచ్చిన తరువాతన ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం కార్పోరేషన్ ఏర్పాటు చేయడం, ఉపాధ్యాయ, ఇతర గ్రూప్-1, 2, ఉద్యోగాలు భర్తీచేయకపోవడం, కొత్త జిల్లాల్లో ఉద్యోగులు, అధికారుల ప్యాట్రన్ విధానం పూర్తిగా మార్చేసి, ఉద్యోగాల్లో కోత విధించడం, దేశంలో ఎక్కడా లేనివిధంగా మీడియాను, ప్రెస్ ను, జర్నలిస్టులను పూర్తిగా అణగదొక్కి జర్నలిస్టు గుర్తింపు కార్డు అక్రిడిటేషన్ మంజూరుకి కొత్త రకాల విధి విధానాలు తీసుకు వచ్చి పూర్తిగా నియంత్రణ చేయడం, ప్రభుత్వంలోని తప్పులను చూపే మీడియాపై కేసులు పెట్టి భయపెట్టడం, అధికార పార్టీ సొంత మీడియాకే ప్రభుత్వ ప్రకటనలు మంజూరు చేసి, చిన్న పత్రికలను పూర్తిగా పక్కనపెట్టేయడం, ప్రభుత్వ శాఖల అభివ్రుద్ధి, సంక్షేమ పథకాల సమాచారం అందించే సమాచారశాఖపూర్తిగా నిర్వీర్యం చేయడం, ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయకపోవడం, అలాగనిఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేయపోవడం, సచివాలయ ఉద్యోగాలు భర్తీచేసే సమయంలో అయినా కాంట్రాక్టు విధానంలో పనిచేసేవారికి వెయిటేజీ ఇవ్వకపోవడం, యూనివర్శిటీల్లో అధ్యాపక పోస్టులను భర్తీచేయకపోవడం, కొత్త యూనివర్శిటీలు ప్రకటన తప్పా వాటని ఏర్పాటు చేయకపోవడం, ప్రైవేటు యూనివర్శిటీలకు అనుమతులు మంజూరు చేసి ప్రభుత్వ యూనివర్శిటీల మనుగడకు ముప్పుతేవడం, ఉద్యోగాల భర్తీచేపట్టకపోయినా.. నియామక వయస్సును పెంచకపోవడం, కొత్త ఉద్యోగాలు తీయడానికి వీలు లేకుండా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకే రెండేళ్లు సమయం పెంచేయడం, విద్యావిధానంలో మార్పులు తీసుకు వస్తామన్న ప్రభుత్వం ఖాళీగా ఉన్న లాంగ్వేజి , వ్యాయామ, ఇతర సబ్జెక్టుల ఉపాధ్యాయులను భర్తీచేయకపోవడం, నేర చరిత్ర ఉన్నవారికే రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వడం ఈ విధంగా ప్రభుత్వం చేస్తున్న, చేపడుతున్న మైనస్ లు వివరించారు.

మొత్తం మీద వైఎస్సార్సీపీకి ప్రజలు బ్రహ్మరధం పట్టిన తరువాత. సంక్షేమ పథకాలు, అభివ్రుద్ధి నిరుపేదలకు, మహిళలకు ఆర్ధికంగా నగదు పంపిణీ, కోవిడ్ నియంత్రణ అదీ కూడా కేంద్రం సహకారంతో తప్పితే, అభివ్రుద్ధి ఎక్కడా జరగలేదని 90శాతం మంది కుండ బద్దలు కొట్టారు. అయితే ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ పథకాలన్నీ నగదు రూపంలో నేరుగా తమ ఖాతాలకే పంపి ఆర్ధికంగా ఆదుకున్నారని మాత్రం మహిళలంతా ప్రభుత్వాన్ని కీర్తిస్తున్నారు. మళ్లీ మళ్లీ వైఎస్ జగన్ మాత్రమే సీఎంగా రావాలని కోరుకున్నారు. ఇక ఉద్యోగులు, ఉపాధ్యాయుల, పెన్షనర్ల నుంచి  మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రెండవ, శనివారం, ఆదివారం, ప్రభుత్వ శెలవుల్లో కూడా ప్రత్యేకంగా పనులు, డ్యూటీలు వేసి కుటుంబాలతో కనీసం ప్రశాంతంగా గడిపే అవకాశాన్ని కూడా ఇవ్వడం లేదని ఉద్యోగులంతా ప్రభుత్వంపై ఒంటికాలిపై లేస్తున్నారు. ఇదే ప్రభుత్వ ఉద్యోగుల్లో 30శాతం మంది ప్రభుత్వం చేసే ప్రతీ పనిని కూడా స్వాగతించారు. సరైన సమయంలో సరైన విధంగా ప్రభుత్వం వ్యవహరించిందని కీర్తిస్తున్నారు. మరో పక్క అధికారపార్టీకి చెందిన సర్పంచ్ లు అయినా నిధులన్నీ దారి మళ్లిపోయాయని ఇటు స్థానిక సంస్థల్లో కూడా నిరాశే మిగిలింది. ఇక వ్యాపారులు, సంస్థలు కోవిడ్ లాంటి సమయంలో వ్యాపారాలు జరగకపోయినా దారుణంగా జీఎస్టీ వసూలు చేశారని మండి పడుతున్నారు. ఇన్కమ్ టాక్సులు కట్టకపోయినా, ఐటిరిటర్న్స్ వేయించడాన్ని సాకుగా చూపి ప్రభుత్వ పథకాలు నిలుపుదల చేశారని అర్హత ఉండీ ప్రభుత్వ పథకాలు అందుకో లేకపోయిన మరో వర్గం ప్రజలు కూడా తమ నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనకు సంబంధించిన వారి అభిప్రాయాలను నిశ్శంకోచంగా తెలియజేశారు. ఈ విషయాలను తెలియజేసే సమయంలో ప్రభుత్వం చేసిన తేడా పనులు ప్రభుత్వంలోని పెద్దలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు నచ్చకపోయినా వాస్తవాలను మాత్రమే ఇక్కడ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ens live mobile news app, www.enslive.net ద్వారా తెలియజేసే ప్రయత్నం మాత్రమే చేశాం. ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదు. ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఏ రాజకీయపార్టీకి గానీ, సంస్థలకు గానీ కొమ్ముకాయదని కూడా విన్నవిస్తున్నాం.

Tadepalli

2022-05-23 14:21:40

దిశ యాప్ కి ఖాకీ యూనిఫారం మోకాలడ్డు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలు, విద్యార్ధినిలు, గ్రుహిణిలు సంరక్షణార్ధం అత్యంత ప్రతి ష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దిశ యాప్ కి రాష్ట్ర వ్యాప్తంగా ఖాకీ యూనిఫారం మోకాల డ్డుతోంది. ఏంటి దిశయాప్ ఇనిస్టాల్ చేసుకోవడానికి ఖాకీ యూనిఫారంకి సంబంధం ఏంటని అమరా వతిలోని ఏపీ పోలీస్ బాస్ డీజీపీ నుంచి అనకాపల్లిలోని పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వరకూ అనుమానం కలుగక మానదు. దిశయాప్ ఇనిస్టాల్ కి సంబంధించిన వాస్తవ పరిస్థితి తెలుసుకుంటే అదే డీజీపి నుంచి కానిస్టేబుల్ వరకూ అన్నన్నా.. ఇంత జరుగుతోందా అంటూ ముక్కున వేలేసుకుంటారు. అప్పుడు పూర్తిస్థాయిలో ఖాకీలే రంగంలోకి దిగి.. దిశ దశను మార్చి రాష్ట్రంలోని నలు దిశలు వ్యాపించేలా చేసి ఆండ్రాయిడ్ ఫోను వాడే ప్రజలందరూ ఈ యాప్ ని వినియోగించేలా చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దిశయాప్ ని ప్రత్యేకంగా  మహిళల రక్షణకోసం ప్రవేశపెట్టింది. యాప్ ని ప్రవేశ పెట్టిన దగ్గర నుంచి సాధారణ పోలీసులతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా వున్న 15వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని 14వేల పైచిలకు వున్న సచివాలయ మహిళా పోలీసులకు ఆ బాధ్యతను అప్పగించారు. సచివాలయ ఉద్యోగుల పేరులో పోలీస్ ఉంది తప్పితే.. ఆ పోలీసుల ఒంటిపై ఖాకీ యూనిఫారం లేదు. ఖాకీ యూనిఫారం వున్న పోలీసులంతా ఎస్పీ నుంచి కానిస్టేబుళ్ల వరకూ కార్యాలయాలకే పరిమితం అవుతూ(కొన్నిచోట్ల), సచివాలయ మహిళా పోలీసులు, ఇతర సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇనిస్టాల్ చేయించే దిశ యాప్ సంఖ్యను మానటరింగ్ చేస్తున్నారు. 

సాధారణంగా పోలీస్ యూనిఫారం వేసుకున్న వ్యక్తిని చూస్తే ఎలాంటి వ్యక్తికైనా చిన్న ఆందోళన, భయం, భక్తి, మరికొందరికి చిరాకు కూడా కలుగుతుంది. పోలీసోడు కనపబడితే నాకెందుకు వచ్చిన తలొనొప్పి అనుకొని ఏం చెబితే అది చేసే పరిస్థితికూడా వుంటుంది. సరిగ్గా ఇక్కడే ప్రభుత్వంలోని పోలీస్ శాఖ కూడా పెద్ద తప్పు చేసింది. గ్రామస్థాయిలోని సచివాలయ మహిళాపోలీలకు అప్పగించిన దిశయాప్ ఇనిస్టాల్స్ విషయంలో ఖాకీ యూనిఫారం వేసుకున్న పోలీసులు కూడా పూర్తిస్థాయిలో భాగస్వామ్యం అయితే ప్రజల్లో కూడా మార్పు వచ్చేది. కానీ యూనిఫారం లేని మహిళా పోలీసులు వెళ్లి దిశయాప్ పై అవగాహన కార్యక్రమాలు పెడితే అవి ప్రజల్లోకి చేరడం లేదు. అడపా దడపా అప్పుడప్పుడు స్పెషల్ డ్రైవ్ పేరుతో చేసే కార్యక్రమాల్లో జిల్లా ఎస్పీలు, డివిజన్ స్థాయిలో డిఎస్పీలు, స్టేషన్ పరిధిలో ఎస్ఐలు చేసే కార్యక్రమాల్లో పాల్గొనడం తప్పితే మిగిలిన సమయంలో ఆ బాధ్యత అంతా సచివాలయ మహిళా పోలీసులే చక్కబెడున్నారు. అలాగని నిత్యం పోలీసులకు దిశయాప్ పైనే ద్రుష్టిమొత్తం కేంద్రీకరించాలంటే అదికూడా జరగని పరిస్థితి.. అలాగని ఖాకీ రోడ్డుపైకి వెళ్లకపోతే సాధారణ ప్రజలు దిశ యాప్ ఇనిస్టాల్ చేయని దుస్థితే ఇప్పటి వరకూ కనిపిస్తూ వచ్చింది. దిశ యాప్ కోసం తెలిసినవారు సచివాలయ మహిళా పోలీసులు అవగాహన కల్పిస్తే అప్పటికి ఇనిస్టాల్ చేసుకుంటున్నారు. లేదంటే తరువాత చూద్దామని లైట్ తీసుకుంటున్నారు.

ప్రస్తుతం యువత ఆండ్రాయిడ్ ఫోన్లలో టిక్ టాక్, షేర్ చాట్, ఇనిస్టా గ్రామ్, ఫేస్ బుక్ వంటి వాటితోనే కాలం గడుపుతున్నారు తప్పితే రక్షణగా ఉండే దిశ యాప్ ని ఇనిస్టాల్ చేసుకోవడానికి ఎవరూ ముందుకి రావడంలేదు. ఒక వేళ గ్రామాల్లో సచివాలయ మహిళా పోలీసుల ఒత్తిడి తట్టుకోలేక దిశ యాప్ ని అప్పటికి ఇనిస్టాల్ చేసుకున్నా.. ఆ తరువాత వెంటనే యాప్ ని డిలీట్ చేసేస్తున్నారు. కానీ ఇనిస్టాల్ చేసుకున్న సంఖ్య మాత్రం పోలీస్ శాఖ డాష్ బోర్డులో కనిపిస్తుంది. ముఖ్యంగా యువతలో దిశ యాప్ పైపా.. దాని వినియోగంపైనా పూర్తిస్థాయిలో అవగాహన లేదు. అలాగని సచివాలయ మహిళా పోలీసులతో నిర్వహించే కార్యక్రమాలు వారి విధుల వరకూ సరిపోతున్నాయి తప్పితే ప్రజల్లోనూ, యువతలోనూ, ముఖ్యంగా విద్యార్ధినిల్లోనూ మార్పు తీసుకు రాలేకపోతున్నాయి. ‘శంఖంలో పోస్తేనే తీర్ధం’ అన్నట్టుగా దిశ యాప్ కోసం ఖాకీ యూనిఫారం వేసుకున్న పోలీసోడు చెబితేనే ప్రజలు వినే పరిస్థితి వచ్చింది..ఖచితంగా వినితీరుతున్నారు అంతే.. అలాకాకుండా పేరులో పోలీసు ఉండి.. ఒంటిపై ఖాకీ యూనిఫారం లేని సచివాలయ మహిళా పోలీసులు దిశ కోసం ఎంత చెప్పినా అక్కడక్కడ కొంత మంది యువత తప్పితే మిగిలిన ఎక్కవ శాతం మంది దిశయాప్ ని ఇనిస్టాల్ చేసుకునే పరిస్థితి కనిపిండం లేదు.

ఈ తరుణంలో రాష్ట్రప్రభుత్వం జిల్లా కలెక్టర్లను దిశయాప్ విషయంలో రంగంలోకి దించిన తరువాత నెలకి ఒకసారి చేపట్టే స్పెషల్ డ్రైవ్ లో మాత్రం అత్యధిక సంఖ్యలో యాప్ ఇనిస్టాల్స్ వస్తున్నాయి. తప్పితే వాటి వినియోగం, యాప్ పై అవగాహన మాత్రం ప్రజల్లో రావడం లేదు. అది జరగాలంటే స్టేషన్ పరిధిలోని ఎస్ఐ, సిఐ, డివిజన్ స్థాయిలో డిఎస్పీ, జిల్లా స్థాయిలో ఎస్పీ, రాష్ట్రస్థాయిలో డిజీపీ రంగంలోకి దిగితే తప్పా ఫలితం వచ్చేటట్టు కనిపించడం లేదు. ప్రస్తుతం పోలీసుశాఖలో ఎస్ఐ నుంచి డీజీపి వరకూ దిశ యాప్ పర్యవేక్షణ, అప్పుడప్పుడూ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు తప్పితే.. దిశయాప్ ఇనిస్టాల్స్ చేయించే విషయంలో కొంతమంది రోడ్లపైకి వచ్చినా.. అధికశాతం స్టేషన్ స్థాయిలోనే పోలీసు సిబ్బంది రోడ్డుపైకి సీరియస్ గా వచ్చిన ప్రజలకు యాప్ చేరువ చేస్తున్నది తక్కువగా కనిపిస్తున్నది. ఏదో ప్రత్యేక కార్యక్రమాలు పెట్టినపుడు, ఉత్సవాలు ఊరేగింపుల్లో తప్పితే. ఇలా పర్యవేక్షణ చేసేకన్నా స్టేషన్ స్థాయిలో ప్రతిరోజూ ఇద్దరు లేదా ముగ్గు కానిస్టేబుళ్లతో మహిళా పోలీసులు కలిసి ప్రజల ముందుకి వెళితే ఖాకీ యూనిఫారం చూసిన భయంతోనో, భక్తితోనో లేదంటే గౌరవం తోనో..అదీ కాదనుకుండే యాప్ ఇనిస్టాల్ చేసుకోకపోతే ప్రత్యేక తలనొప్పి వస్తుందనే భయంతోనైనా దిశయాప్ ఇనిస్టాల్ చేసుకోవడానికి ముఖ్యంగా యువత ముందుకి వచ్చే అవకాశాలున్నాయి. లేదంటే గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసులు ప్రతీరోజూ గుడులు, బడులు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో మార్కెంటింగ్ చేసే సిబ్బందిలా బాబ్బాబు అంటూ తిరిగి తిరిగి దిశ యాప్ ఇనిస్టాల్ చేయిస్తా ఉంటే.. వీరు అటు తిరిగే లోపు ఆ యాప్ ని డిలీట్ చేస్తున్నారు యువత. ఆ వాస్తవ సాంకేతిక కారణాలు, ఇబ్బందులు పర్యవేక్షణ చేసే పోలీసులకు తెలియడం లేదు. అంతేకాదు ఇదే కారణంతో చాలా మందికి యాప్ వినియోగించే అవకాశం, అవసరం కూడా రావడం లేదు. 

ముఖ్యంగా ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి దిశయాప్ ఇనిస్టాల్ చేసుకోవడం ద్వారా వారు మిగిలిన వారికి దాని యొక్క ప్రాముఖ్యతను చెప్పడానికి ఆస్కారం వుంటుంది. అదేవిధంగా రాష్ట్రంలోని పోలీస్ బాస్ డీజీపి దగ్గర నుంచి స్టేషన్ లోని హోం గార్డు వరకూ యాప్ వారి ఫోన్లలో ఇనిస్టాల్ చేసుకోవాలి. గ్రామస్థాయిలో సచివాలయ సిబ్బంది, మండల స్థాయిలో మండల అధికారులు, జిల్లా స్థాయిలో జిల్లా అధికారులు,  కళాశాలలు, యూనివర్శిటీలు, వివిధ రాజకీయపార్టీల నేతలు ఇలా ప్రతీ ఒక్కరూ యాప్ ఇనిస్టాల్ చేసుకునే విధంగా కార్యాచరణ రూపొందించాలి. ముఖ్యంగా ప్రతీనెలా రాష్ట్రవ్యాప్తంగా దిశ యాప్ ద్వారా ఎంత మందిని పోలీసులు రక్షించారు. ఎంతమంది నిందులకు శిక్ష పడిందనే విషయాలు ప్రసార మాద్యమాల ద్వారా  తెలియజేయడంతోపాటు, జిల్లాస్థాయిలోనూ ఆ సమాచారం గ్రామాల వరకూ తెలిసేలా అదే సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయాల్సి వుంది.  అన్ని రకాల ప్రసార మాద్యమాల ద్వారా దిశయాప్ వినియోగంపై చతన్యపూరిత కధనాలు, ప్రసారాలు చేయించాలి. ముఖ్యంగా వాహననం నడిపే ప్రతీ ఒక్కరిలోనూ దిశయాప్ ఇనిస్టాల్ చేయించగలిగితే రాష్ట్రప్రభుత్వం లక్ష్యం నెరవేరడంతోపాటు దిశ చట్టంగా మారే అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి. పోలీసులు స్టేషన్ లో నుంచే పర్యవేక్షణ చేస్తున్నంత కాలం గ్రామ, వార్డు సచివాలయ మహిళా పోలీసు యాప్ ఇనిస్టాల్ చేయిస్తుంటే.. అంతే స్పీడులో యువత ఆ యాప్ ని డిలీట్ చేస్తూ ఉంటారనడంలో ఎలాంటి సందేహం పెట్టుకోవాల్సిన పనిలేదు..!?

Tadepalli

2022-05-23 03:22:01

ఆ విద్యార్ధు ఇంగ్లీషుకి సీఎం జనగ్ ఫిదా..

కాకినాడ జిల్లా, తొండంగి మండలం, బెండపూడి హైస్కూలు విద్యార్ధినిలు ఇంగ్లీషు మాటలకు సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి ఫిదా అయిపోయారు. విద్యార్ధులంతా అమెరికన్ యాక్సెంట్ లో ఇంగ్లీషులో మాట్లాడుతుంటే.. సీఎం జగన్ వారిని ఉత్తేజ పరుస్తూ విద్యార్ధులందరితోనూ ముచ్చటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ స్థాయిలో విద్యార్ధులు ఇంగ్లీషు నేర్చుకోవాలనే లక్ష్యంతో అన్ని పాఠశాలల్లో సిబీఎస్సీ సిలబస్ ను అమలు చేయడంతోపాటు, ప్రత్యేక విద్యావ్యవస్థను వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. బెండపూడి విద్యార్ధులను సీఎం నేరుగా తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడటం ఇపుడు రాష్ట్రంలోనే కాదు..దేశంలోనే హాట్ టాపిక్ అవుతోంది.

Tadepalli

2022-05-19 16:45:33