1 ENS Live Breaking News

ఆర్బీకేలకు పీఎసిఎస్ లు అనుసంధానం

ఆంధ్రప్రదేశ్ లోని 10,778 రైతుభరోసా కేంద్రాలను (RBK)లను రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(PACS)కు అనుసంధానించి రైతులకు ఉత్తమసేవలు అందించాలని, తద్వారా గ్రామ స్థాయిలో రైతులు, గ్రామీణ సమాజానికి విస్తృత సేవలందించాలన్న ఈ ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార,  మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆకాంక్షించారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాకార బ్యాంకు లిమిడెడ్ (ఆప్కాబ్) కార్యాలయంలో డీసీసీబీ చైర్ పర్సన్ లు, సీఈవో లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆప్కాబ్ అభివృద్ది కోసం చైర్ పర్సన్ లు, అధికారులు చెప్పిన ప్రతి  విషయంపై కూలంకషంగా మంత్రి కాకాణి చర్చించారు. అనంతరం  PACS అడాప్షన్ పాలసీ, 59వ యాన్యువల్ అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ 2021-22, కార్పోరేట్ గవర్నెన్స్ పాలసీ, COBNET మొబైల్ యాప్ లను మంత్రి విడుదల చేశారు. ఆప్కాబ్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంస్థ ప్రగతిని  మంత్రికి వివరించారు. అనంతరం 13 జిల్లాల కేంద్ర సహకార బ్యాంకుల చైర్ పర్సన్ లు మంత్రిని కలిసి  శాలువాతో సత్కరించి పుష్ఫగుచ్చాలు అందజేసి శుభాభినందనలు తెలిపారు.

                ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... అప్కాబ్ 2021-22 వసంవత్సరానికి 40% పైగా వృద్ధి రేటుతో అద్భుతమైన  ప్రగతిని సాధించిందని, వ్యవసాయ రుణాల పంపిణీలో రాష్ట్రంలో సహకార బ్యాంకులు 4వ స్థానంలో ఉండటం సంతోషకరమన్నారు.  ఇదే స్పూర్తిని కొనసాగిస్తూ వ్యవసాయ రుణ పంపిణిలలో సహకార బ్యాంకులు మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత సహకార రంగంలో పెద్ద ఎత్తున మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగింన్నారు. అందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గత సంవత్సరం APCOB, DCCBలకు 295 కోట్లు షేర్ కేపిటల్ రూపంలో సహయం చేసిందన్నారు.  ఈ రోజు APCOB గాని, 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు కానీ లాభాల్లో నడుస్తున్నాయంటే దానికి ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమన్నారు.  ఈ బ్యాంకులపై శ్రద్ధ వహించి, గత సంవత్సరం దాదాపు రూ. 600 కోట్ల పైచిలుకు బకాయిలు విడుదల చేయడం జరిగిందన్నారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ రోజు జిల్లా కేంద్ర, సహకార బ్యాంకులు, APCOB లాభాల ఉండి.. ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై సమీక్ష నిర్వహించడం ఆనందదాయకమన్నారు.  సహకార బ్యాంకులకి బకాయిలు విడుదల చేయడమే కాకుండా.. రాష్ట్ర ప్రభుత్వ స్కీములతో అనుసంధానం చేయడం జరిగిందన్నారు.

  రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్న వ్యవసాయ యాంత్రీకరణ, ఆర్బీకే గోడౌన్ల నిర్మాణం వంటివి మన బ్యాంకుల ద్వారా చేపించి, పెద్దఎత్తున ఈ బ్యాంకులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఆర్బీకేలు, పీఏసీఎస్ ల అనుసంధానికి పూర్తి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పీఏసీఎస్ ల బలోపేతానికి ఒక సమగ్రమైన విధానాన్ని తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులకు మేలు కలిగిలే అవసరమైన అన్ని వసతులు, సదుపాయాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్దంగా ఉంటుందని.. ఆ రకమైన అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.  మూడంచెల సహకారవ్యవస్థలో పైనున్నరెండు అంచెలు APCOB, DCCBs ఆర్థికంగా బలపడ్డాయని, దిగువన ఉన్నప్రాథమిక వ్యవసాయ సంఘాలుఇంకా బలపడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల ఛైర్ పర్సన్ లకు, సీఈవోలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అభివృద్ధి మీద దృష్టిపెట్టాలని మంత్రి కోరారు. ముఖ్యంగా రైతుల శ్రేయస్కారం కలిగించే చర్యలు, కంప్యూటరైజేషన్ కు ప్రణాలికలు రూపొందించామని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. .

                 ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ పర్సన్ ఇన్ ఛార్జ్ ఎం. ఝాన్సీ రాణి, ప్రిన్సిపల్ సెక్రటరీ వై. మధు సూదన్ రెడ్డి,  సీసీ అండ్ ఆర్సీఎస్ బాబు. ఏ., ఆప్కాబ్ ఎండీ ఆర్. శ్రీనాథ్ రెడ్డి, సీజీఎం ఎన్. రాజయ్య, ఆప్కాబ్ 13 జిల్లాల కేంద్ర సహకార బ్యాంకుల చైర్ పర్సన్ లు, సీఈఓ లు తదితరులు పాల్గొన్నారు.

Tadepalli

2022-05-05 10:56:04

పిఏసి-2లో అన్నప్రసాదసేవలు ప్రారంభం

తిరుమలలోని పిఏసి- 2లో భక్తుల కోసం అన్నప్రసాద సేవలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. కోవిడ్-19 కారణంగా 2020 మార్చిలో టిటిడి పిఎసి-2 వద్ద అన్నప్రసాదాన్ని మూసివేయగా, మళ్లీ ఈరోజు తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా  అన్న‌ప్ర‌సాదం డెప్యూటీ ఈవో పద్మావతి పూజలు నిర్వహించి రెండేళ్ల తర్వాత అన్నప్రసాద సేవలను పునఃప్రారంభించారు. దీనితో మళ్లీ శ్రీవారి భక్తులకు పిఏసి-2లో అన్నప్రసాదం అందుబాటులోకి వచ్చించి. ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో  హరీంద్రనాథ్, క్యాటరింగ్ ప్ర‌త్యేకాధికారి జిఎల్‌ఎన్ శాస్త్రి, ఇత‌ర అదికారులు పాల్గొన్నారు.

Tirumala

2022-05-05 08:22:03

టీటీడీకి బ్యాట‌రీ వాహ‌నాలు విరాళం

కోల్‌కతాకు చెందిన సుమిత్ సారీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎమ్‌డి  ప్రకాష్ చౌదరి గురువారం ఉదయం తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి  రూ.50 లక్షల విలువచేసే  10 బగ్గీలను విరాళంగా అందజేశారు.  శ్రీ‌వారి ఆలయం ముందు అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డికి దాత వాహనాలను అందజేశారు. అనంతరం వాటికి పండితులతో పూజా కార్యాక్రమాలు నిర్వహించి వాటిని ప్రారంభించారు. ఈ బగ్గీలను శ్రీవారి ఆలయానికి ముఖ్యంమంత్రి, ప్రధాన మంత్రి, గవర్నర్, రాష్ట్రపతి వంటి ప్రముఖులు వచ్చిన సందర్భంలో వీటిని వినియోగించనున్నారని తెలుస్తుంది.   ఈ కార్య‌క్ర‌మంలో తిరుమ‌ల డిఐ ఎం.జానకిరామ్‌ రెడ్డి పాల్గొన్నారు.

Tirumala

2022-05-05 07:37:46

శ్రీ‌వారి మెట్టు న‌డ‌క‌దారి పునఃప్రారంభం

శ్రీ‌వారి మెట్టు న‌డ‌క మార్గాన్ని గురువారం ఉద‌యం టీటీడీ చైర్మ‌న్ వై.వి.సుబ్బారెడ్డి శాస్త్రోక్తంగా పూజ‌లు నిర్వ‌హించి పునఃప్రారంభించి, ఈ మార్గంలో భ‌క్తుల‌ను తిరుమల కు  అనుమ‌తించారు. అనంత‌రం చైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ,  గ‌త ఏడాది నవంబ‌రు 18, 19వ తేదీల్లో కురిసిన భారీ వ‌ర్షాల‌కు శ్రీ‌వారి మెట్టు మార్గంలో  పెద్ద బండ‌రాళ్ళు ప‌డి రోడ్డు, మెట్లు, ఫుట్‌పాత్‌లు, మ‌రుగుదొడ్లు దెబ్బ‌తిన్నాయ‌న్నారు. ఇంజినీరింగ్ అధికారులు   యుద్ధ ప్రాతిపాదిక‌న న‌డ‌క మార్గాన్ని రూ.3.60 కోట్ల‌తో మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు పూర్తి చేశార‌ని చెప్పారు. కేవ‌లం నాలుగు నెల‌ల వ్య‌వ‌ధిలో శ్రీ‌వారి మెట్టు మార్గంలో మ‌ర‌మ్మ‌త్తులు పూర్తి చేసిన ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది కాంట్రాక్ట‌ర్ల‌ను చైర్మ‌న్ అభినందించారు.  ఈ మార్గం గుండా  ప్ర‌తి రోజు ఆరు వేల మంది, ప్ర‌త్యేక ప‌ర్వ‌దినాల్లో 15 వేల మంది భ‌క్తులు తిరుమ‌ల‌కు చేరుకుంటార‌న్నారు. శ్రీ‌వారి మెట్టు మార్గంలోనే సాక్షాత్తు శ్రీ‌నివాసుడు తిరుమ‌ల‌కు చేరుకున్న‌ట్లు , 
శ్రీ కృష్ణ‌దేవ‌రాయులు శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న‌ట్లు శాస‌నాల ద్వారా తెలుస్తోంద‌ని వివ‌రించారు.

 అనంత‌రం శ్రీ‌వారి మెట్టు న‌డ‌క మార్గంలో త్వ‌రిత‌గ‌తిన మ‌ర‌మ్మ‌త్తులు పూర్తి చేసిన సిఇ  నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ - 2  జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, ఇఇ  సురేంద్ర‌రెడ్డి, ఈరోడ్కు చెందిన ఆర్ఆర్ బిల్డ‌ర్స్ డిజిఎమ్  ఆర్ముగంను చైర్మ‌న్ శాలువ‌, శ్రీ‌వారి ప్ర‌సాదాల‌తో స‌న్మానించారు.  ఈ కార్య‌క్ర‌మంలో బోర్డు స‌భ్యులు, చంద్ర‌గిరి ఎం.ఎల్‌.ఏ.  చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి, బోర్డు స‌భ్యులు  పోకల ఆశోక్ కుమార్‌,  మొరం శెట్టి రాములు, జెఈవోలు  స‌దా భార్గ‌వి, వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో న‌ర‌సింహ కిషోర్‌, శ్రీ‌నివాస‌మంగాపురం ఆల‌య డెప్యూటీ ఈవో  వ‌ర‌ల‌క్ష్మీ, డిఇ  ర‌విశంక‌ర్ రెడ్డి, అద‌న‌పు సివిఎస్వో  శివ‌కుమార్ రెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2022-05-05 06:23:10

‘బూడి’ పైనే పంచాయతీరాజ్ ఆశలు..

ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇపుడు అనకాపల్లి జిల్లావైపే తొంగి చూస్తోంది.  అవును..రాష్ట్ర రాజకీ యాల్లో మునుపెన్నడూ లేనివిధంగా ఒక సీనియర్ ఎమ్మెల్యేకి డిప్యూటీ సీఎం పదవి ఇస్తూ, ఎంతో ప్రాముఖ్యత వున్న పంచాయతీరాజ్ మరియు గ్రామీనాభివ్రుద్ధి మంత్రిత్వ శాఖను కట్టబెట్టిన ప్రజామోదం పొందిన ప్రభుత్వంగా  రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రాధాన్యత సంత రించుకుంది. సాధారణంగా ఒక ఎమ్మెల్యే జీవితంలో ప్రభుత్వ విప్, మంత్రి పదవి రావడం అరుదుగా వుంటుంది. అలాంటిది ఒకసారి ప్రభుత్వ విప్ తోపాటు, ఏకంగా డిప్యూటీ సీఎం పదవి పొందిన వ్యక్తిగా బూడి ముత్యాలనాయుడు ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారారు. గ్రామం నుంచి రాష్ట్రాభివ్రుద్ధిలో ఒక మంచి విజన్ ఉన్న నాయకుడిగా, ప్రజలు మెచ్చిన నేతగా కూడా ఎదిగారు. అందులోనూ జిల్లాల విభజనలో ఒకే జిల్లాకి ఒక డిప్యూటీ సీఎం, మరో మంత్రి పదవి వస్తే ఆ జిల్లాపై రాష్ట్రం ద్రుష్టి ఏవిధంగా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ప్రభుత్వశాఖల్లో ఎంతో ప్రాధాన్యత వున్న శాఖకు మంత్రిగా, డిప్యూటీ సీఎంగా అనకాపల్లి జిల్లాను ఏ స్థాయిలో ముందుకి తీసుకెళ్లబోతున్నారనే ఆలోచనలు ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగుతున్నాయి. పరిపాలనలోనూ, అభివ్రుద్ధి విషయంలో చాలా పట్టువున్న ‘బూడి’ కొత్తగా మారిన అనకాపల్లి జిల్లాపై తనదైన శైలిలో ముద్రవేస్తారనే ఊహాగానాలకు బలం చేకూరుతుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ మానస పుత్రిక గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రజలు రెండున్నరేళ్లుగా చాలా దగ్గరగా చూస్తున్నారు. తక్కువ సమయంలోనే ప్రజలకు చేరువైన సచివాలయ వ్యవస్థను మరింతగా ప్రజల ముందుకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఇపుడు బూడి అడుగులు పడుతున్నట్టుగా కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే ఉపాది హామీ పథకంలోని పెండింగ్ బిల్లులు ఏకంగా రూ.1900 కోట్ల చెల్లింపులు చేయడానికి తీసుకుంటున్న చర్యలు ఇపుడు అందరి ద్రుష్టినీ ఆకర్షిస్తున్నాయి. వచ్చీరావడంతోనే పెండింగ్ బిల్లులకు మోక్షం కల్పిస్తే..రానున్న రోజుల్లో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివ్రుద్ధిలో ఇంకెలాంటి మార్పులు తీసుకు వస్తారనే ఆలోచన అందరిలోనూ పుట్టేలా చేసి ప్రజల ద్రుష్టిని మరల్చగలిగారు. 

           భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా ఒక లక్షా 30వేల ఉద్యోగాలతో ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను మరింత అభివ్రుద్ధి చేసి, దేశానికే ఆదర్శంగా ఈ శాఖను అభివ్రుద్ధి చేయాలన్నది ‘బూడి’ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దానికి అనుగుణంగానే చేసిన నిర్మాణాలు, కట్టడాలకు ఇబ్బందులు రాకుండా గ్రామీణ ఉపాది హామీ పనుల బిల్లులు క్లియర్ చేయడానికి రంగం సిద్ధం చేయడం కూడా దానికి మరింత ఊతమిచ్చింది. వీటితోపాటు, ప్రస్తుతం కొత్త జిల్లాలో సుమారు 75 ప్రభుత్వశాఖలకు మంచి అధికారులను ఏర్పాటు చేసుకోవడం ద్వారా జిల్లాను అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లాలనే మరో లక్ష్యాన్ని కూడా ఉప ముఖ్యమంత్రి ఏర్పాటు చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. అదేవిధంగా సచివాలయ శాఖలో మిగులు ఖాళీల భర్తీ, ఎన్ఎంఆర్ ఉద్యోగుల రెగ్యులైజేషన్,  పదోన్నతులు, బదిలీలు.. ఇలా చాలా కార్యక్రమాలు పెండింగ్ లో ఉండిపోయాయి. వాటితోపాటు కొత్త జిల్లాలో అన్ని శాఖలకు జిల్లా అధికారుల నియామకాలు పూర్తయితే ఆ తరువాత ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కూడా రాష్ట్రంలోనే అనకాపల్లిలోనే తొలుత నిర్మాణం చేపట్టే అవకాశాలూ కూడా లేకపోలేదు. అదే జరిగితే ‘బూడి’ ప్రధాన లక్ష్యం నెరవేరి జిల్లా పేరు రాష్ట్రంలోనే చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో అతిశయోక్తి కాదేమో. అందరి మరిషిగా, ప్రజా నేతగా నియోజవర్గంలోనే కాకుండా ఇపుడు కేబినెట్ లోనూ ఒక కీలక భూమిక పోషించే అనకాపల్లి జిల్లా మంత్రిగా, డిప్యూటీ సీఎంగా బూడి ముత్యాలనాయుడు అభివ్రుద్ధి అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇలా వుంటుందనే విధంగా చేసి చూపించడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టుగానే ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో రెండు మూడు నెలల్లో కొత్త జిల్లాలో అధికారుల కూర్పు పూర్తయితే, ఇక తరువాత మొత్తం అంతా జిల్లా అభివ్రుద్ధిపైనే డిప్యూటీ సీఎం ద్రుష్టికేంద్రీకరిస్తారని చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఎదురులేని నేతగా, ఓటమి ఎరుగని ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్న బూడి, తన మార్కును నూతన జిల్లా అనకాపల్లి జిల్లాపై అదే స్థాయిలో చూపించి సరికొత్త రీతిలో అభివ్రుద్ధి చేస్తారనడంలో ఎలాంటి సందేహమూ లేదు..! 

తాడేపల్లి

2022-05-04 04:59:40

రూ.1900కోట్ల బిల్లులు చెల్లింపునకు చర్యలు

రాష్ట్రంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పధకం కింద చేసిన పనులకు సంబంధిం చి 1900 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకుం టున్నట్టు రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధిశాఖ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు చెప్పారు. అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖపై సోమవారం ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి సమీక్షించారని అన్నారు.ఈసందర్భంగా పంచాయితీరాజ్ శాఖలో వివిధ పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను తక్షణం చెల్లించాలని,ఉపాధిహామీ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సియం ఆదేశించారని చెప్పారు.ఉపాధిహామీ పధకంలో చేసిన పనులకు సంబంధించి 1900 కోట్ల రూ.ల బిల్లులను వెంటేనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్ధికశాఖ అధికారులను సియం ఆదేశించారన్నారు.అదే విధంగా మెటీరియల్ కాంపొనెంట్ తో నిర్వహించే రైతు భరోసా కేంద్రాలు,గ్రామ సచివాలయాల భవనాలు,వెల్నెస్ కేంద్రాలు,బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలు సహా వివిధ భవన నిర్మాణాలకు ఎక్కడా సిమ్మెంట్ కొరత లేకుండా చూడాలని సియం ఆదేశించారని ముత్యాల నాయుడు వివరించారు.నిరంతర సిమ్మెంట్ సరఫరాకై ఆయా కంపెనీలతో సంప్రదించేందుకు వీలుగా ఒక లైజన్ అధికారిని నియమించాలని సియం ఆదేశించినట్టు ఆయన పేర్కొన్నారు.

        రాష్ట్రంలోని 9వేల కి.మీల పంచాయితీరాజ్ రోడ్ల మరమ్మత్తులకుగాను 1073 కోట్ల రూ.లు విడుదల చేసేందుకు వెంటనే అవసరమైన పరిపాలనామోదాన్నిఇస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు వెల్లడించారు.ఇందుకు సంబంధించి వెంటనే టెండర్ల ప్రక్రియను కూడా ప్రారంభించి పనులను కూడా మొదలు పెట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.పనుల నాణ్యత విషంయలో ఎంతమాత్రం రాజీపడే ప్రసక్తి లేదని ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు స్పష్టం చేశారు.ఎక్కడైనా పనుల నిర్వహణలో నాణ్యత లోపించినట్టు ఫిర్యాదులు వస్తే విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన కింద చేపట్టిన పనులకు సంబంధించి చెల్లించాల్సిన 83కోట్ల రూ.ల బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని సియం ఆదేశించారని ఆబిల్లులను కూడా వెంటనే విడుదల చేయనున్నట్టు తెలిపారు.

        గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా పధకంలో చేసిన పనులకు సంబంధించిన 800 కోట్ల రూ.లు బకాయిలను కూడా వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు వెల్లడించారు.ప్రస్తుత వేసవిలో రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి కొరత లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని నీటి ఎద్దడి గల గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందించడం జరుగుతోందని తెలిపారు.అదే విధంగా జగనన్న కాలనీల్లో ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించి ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేసి మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ముత్యాల నాయుడు చెప్పారు.  వైయస్ఆర్ జలకళ కార్యక్రమం కింద ఉచితంగా బోరు తవ్వించడం,విద్యుత్ కనక్షన్, పైపు వేయడం తోపాటు దూరంగా ఉన్న పొలాల్లో బోరువేసుకునే రైతులకు విద్యుత్ సబ్సిడీ కింద 2లక్షల రూ.లు వరకూ ప్రభుత్వమే భరిస్తుందని ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు మీడియాకు వివరించారు.వైయస్సార్ చేయూత కార్యక్రమాన్నివిజయవంతంగా అమలు చేస్తున్నట్టు చెప్పారు.

        గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగు పర్చేందుకు ఇంటింటా చెత్త సేకరణకు ప్రతి ఇంటికీ రెండేసి చెత్తబుట్టలను పంపిణీ చేయడం జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు చెప్పారు.ప్రతి ఇంటి నుండి తడి,పొడి చెత్తను వేరువేరుగా సేకరించి దానిని సెగ్రిగేషన్ పాయింటుకు రవాణా చేసేందుకు వీలుగా ప్రతి గ్రామ పంచాయితీకి ఒక ట్రాక్టర్ ను అందించనున్నట్టు ఆయన తెలిపారు.స్వచ్ఛ సంకల్పం పధకంలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తూ గ్రీన్ అంబాసిడర్లుగా పిలవబడుతున్నవారిని ఇకమీదట క్లాప్ మిత్రలుగా పిలవాలని నిర్ణయించడం జరిగిందని ఆయన చెప్పారు.వారికి చెల్లించాల్సిన మూడు నెలల జీతాల బకాయిలను కూడా వెంటనే చెల్లించడంతో పాటు ఇకమీదట వారికి నెలనెలా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు వెల్లడించారు. ఈసమావేశంలో నర్సీపట్నం ఎంఎల్ఏ పి.ఉమాశంకర్ గణేశ్ తదితరులు పాల్గొన్నారు.

Tadepalli

2022-05-03 14:44:22

ఏపీలో కొత్తజిల్లాలకు ఆర్టీసీ సర్వీసులు

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పాటు చేసిన 13 కొత్త జిల్లాలకు ప్రజలు, ఉద్యోగులు, వివిధ పను లపై  ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేందుకు వీలుగా ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. గతంలో వున్న ఆర్టీసీ డిపోల నుంచి కొత్తజిల్లాలకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడపే కార్యక్రమానికి తెరలేపింది. నిత్యం జిల్లా కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ తో పాటు ఇతర 75 ప్రభుత్వ శాఖల అధికారులను కలవడానికి వెళ్లాలంటే ప్రభుత్వంలోని ఆర్టీసీ సర్వీసులు ఒక్కటే మార్గం. దానిని ద్రుష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల నుంచి కొత్త జిల్లా కేంద్రాలకు ఆర్టీసీ సర్వీసులను నడుపుతోంది. గతంలో హైవే సర్వీసుగా నడిపే బస్సులను ఇపుడు అన్ని కొత్త జిల్లా కేంద్రాల్లోని ఆర్టీసీ డిపోల మీదుగా నడిపేలా కూడా అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. అత్యవసర సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఆలోచనతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. దీనితో అన్ని డిపోలలోని మేనేజర్లు డిపోల నుంచి కొత్త ఆర్టీసీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, నాన్- స్టాఫ్ సర్వీసులతోపాటు, ఇతర అన్ని రకాల సర్వీసులను కూడా జిల్లా కేంద్రాల్లోని బస్ స్టాప్ లకు వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు. తద్వారా ఆర్టీసీకి ఆదాయం పెరగడంతోపాటు, ప్రజలకు కూడా పూర్తిస్థాయిలో ఆర్టీసీ సేవలను దగ్గర చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. కొత్తగా ఆర్టీసీలో బస్సు ఛార్జీలు పెంచినప్పటికీ, ప్రజలకు, ప్రయాణీకులకు ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశ్యంతో ఆర్టీసీ చేపట్టిన ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణీకులు, ఉద్యోగులు, సిబ్బంది ఈ సేవలను వినియోగించుకునే అవకాశం వుంది. కొత్త జిల్లాల విభజన తరువాత చాలా మంది ఉద్యోగులు జిల్లా కేంద్రాలకు దగ్గరగా వున్న వారి సొంత గ్రామాలు, పట్టణాల నుంచి అధికంగా నిత్యం ప్రయాణాలు చేస్తున్నారు. ఆ విధంగా కూడా కొత్త జిల్లా కేంద్రాలకు వెళ్లే బస్సులకు గిరాకీ, ప్రయాణీకుల సంఖ్యపెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని ఆర్టీసీ డిపోల ద్వారా కొత్త జిల్లా కేంద్రాలకు బస్సు సర్వీసులను తిప్పుతున్నారు. ఇప్పటికే వున్న సర్వీసుల సంఖ్యను మరింతగా పెంచే కార్యాచరణ చేపడుతున్నారు.

Tadepalli

2022-04-30 06:49:15

టిటిడి ఎక్స్‌ అఫిషియో ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. టిటిడి అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి వీరి చేత ప్రమాణం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆ తరువాత అదనపు ఈఓ స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్ అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో జెఈఓ(ఆరోగ్యం, విద్య)  సదా భార్గవి, డెప్యూటీ ఈవోలు  రమేష్ బాబు కస్తూరిబాయి, విజిఓ  బాలిరెడ్డి, పేష్కార్  శ్రీహరి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2022-04-29 08:07:27

వెంగమాంబ ధ్యాన మందిరానికి శంఖుస్థాపన

తిరుమలలోని మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ బృందావంలో నిర్మించనున్న ధ్యానమం దిరానికి టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి శుక్రవారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి పరమ భక్తురాలు అయిన మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ శ్రీ అన్నమాచార్యుల తరహాలో సంకీర్తన సేవతోపాటు తిరుమలలో అన్నప్రసాద వితరణకు నాంది పలికారని తెలిపారు. తిరుమలలో చాలాకాలం పాటు ఆమె ధ్యానం చేశారని, ధ్యానం చేస్తూనే శ్రీవారిలో ఐక్యమయ్యారని చెప్పారు. రాజ్యసభ సభ్యులు శ్రీ ఎ.అయోధ్య రామిరెడ్డి అందించిన రూ.5 కోట్ల విరాళంతో 1.5 ఎకరాల విస్తీర్ణంలో 350 మంది భక్తులు కూర్చొని ధ్యానం చేసేందుకు వీలుగా అన్ని వసతులతో ఇక్కడ ధ్యానమందిరం నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా దాత అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ వెంగమాంబ బృందావనంలో ధ్యానమందిరం నిర్మించే అవకాశాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామివారు తనకు కల్పించడం పూర్వజన్మసుకృతం అన్నారు. ఇందుకు సహకరించిన టిటిడి చైర్మన్ కు, ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈఓ  ఏవి.ధర్మారెడ్డి, జెఈఓలు  సదా భార్గవి,  వీరబ్రహ్మం, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వరరావు, అదనపు సివిఎస్వో  శివకుమార్ రెడ్డి, ఇఇ  జగన్మోహన్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2022-04-29 08:03:19

సమాచారశాఖలో ఆర్జేడి వ్యవస్థకు మంగళం

సమాచార పౌరసంబంధాల శాఖలో ముఖ్యంగా మీడియాకి సకాలంలో సమాచారం అందిం చాలంటే కావాల్సిన అధికారులు డీపీఆర్వో, ఏపీఆర్వో, ఫోటో గ్రాఫర్, వీడియో గ్రాఫర్, టైపిస్టు(పత్రికా పరిభాషలో హార్మోనిస్టు అంటారు అంటే వార్తలు కంపోజ్ చేసేవాడు అని అర్ధం) అవన్నీ లేకపోయినా.. సమాచార శాఖలో మాత్రం కార్యాలయ సిబ్బంది చక్కగా నిండుగా, మెండుగా ఉన్నారు. కొన్ని చోట్ల ఏపీఆర్వోలు ఉన్నా వారంతా ఉత్సవ విగ్రహాలే. వారి వలన కొత్తజిల్లాల్లో డీపీఆర్వోలకు శిరోభారం తప్పా మరెలాంటి ఉపయోగం కొద్దిగైనా లేదు. అలాంటి తరుణంలో ప్రభుత్వం రాష్ట్రంలోని 26 జిల్లాలకు మీడియాకి ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రెస్ నోట్లు, ఫోటోలు, ముఖ్యమైన కార్యక్రమాల వీడియో విజువల్స్ అందించడానికి కావాల్సిన సిబ్బందిని నియమించాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సమాచారశాఖలోని ఆర్జేడీ కార్యాలయాల దుఖాణాలు సర్దేసి అందులోని సిబ్బందిని సమాచారశాఖ అప్పగించింది. పనిచేయని సిబ్బంది వందమంది ఉంటే ఏ సుఖం అన్నట్టుగా  సిబ్బంది లేమితో బాధపడుతున్న సమాచార పౌర సంబంధాల శాఖకు ఆర్జేడీ కార్యాలయాల నుంచి వచ్చిన సిబ్బంది వలన కార్యాలయం నిండుగా కనిపిస్తుంది తప్పతే  ప్రతినిత్యం ఉపయోగ పడే సిబ్బంది తక్కువనే చెప్పాలి. ఆ విషయం ప్రభుత్వానికి తెలిసినా డీపీఆర్వో కార్యాలయాలకు కావాల్సిన ఏపీఆర్వోలను మాత్రం నియమించడం లేదు. ఆర్ధిక భారం నెపంతో ఉన్న సిబ్బందిని సర్దేయడంతోపాటు,  విభాగాలను ఉన్న శాఖలోనే అనుసంధానం చేసి అక్కడ పనిచేసే అధికారులను రాష్ట్ర కార్యాలయానికి అటాచ్ చేసేస్తున్నది.  ప్రభుత్వ శాఖల్లో విభాగాలను కుదించేసే కార్యక్రమాలు శరవేగంగా చేపట్టింది. దానికోసం ప్రాధాన్యత లేని విభాగాలు వ్యవస్థలకు మంగళం పాడేస్తుంది. ఇటీవలే సమాచార పౌర సంబంధాల శాఖలో ఆర్జేడీ(రీజనల్ డైరెక్టర్) కార్యాలయాలను ఎత్తేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఏపీలో నాలుగు జోన్లలో నాలుగు ఆర్జేడీ కార్యాలయాలు ఉన్నాయి. వాస్తవానికి ఆర్జేడీ కార్యాలయాలు ఉన్నా వాటి వలన ప్రభుత్వానికి గానీ, మీడియా సంస్థలకు గానీ సమాచారశాఖ ద్వారా ఎలాంటి ఉపయోగం కూడా లేదు. దీనితో రాష్ట్రంలోని నాలుగు చోట్ల ఉన్న ఆర్జేడీ పోస్టులను రాష్ట్ర కార్యాలయానికి అటాచ్ చేస్తూ.. అక్కడి కార్యాలయ సిబ్బంది కొత్త జిల్లాల్లోని డిపీఆర్వో కార్యాలయాల్లోకి సర్ధుబాటు చేసేసింది. సిబ్బంది లేమితో బాధపడుతున్న సమాచారశాఖకు సిబ్బందిని అలా సర్ధుబాటు చేసింది. ఉన్న కార్యాలయ సిబ్బందితో అదనంగా ఆర్జేడీ కార్యాలయ సిబ్బంది వచ్చి చేరారు తప్పితే కొత్త జిల్లాల్లో పనిచేసే డీపీఆర్వోలకు సహకారంగా, సాంకేతిక సహాయం అందించే సిబ్బంది నేటికీ లేకపోవడం, ప్రభుత్వం నియమించకపోవడంతో అన్ని పనులు డీపీఆర్వోలే చేసుకోవాల్సి వస్తుంది. ఆఖరికి వీరికి వాహనాల సదుపాయం కూడా లేకపోవడంతో వారి సొంత వాహనాల్లో ప్రభుత్వ కార్యాక్రమాల ప్రెస్ కవరేజికి వెళుతున్నారు. ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందిగా వీరంతా ప్రభుత్వాన్నికానీ, సమాచారశాఖ కమిషనర్ ను గానీ అడిగే పరిస్థితి లేదు. ఒక వేళ ప్రస్తుతం పడుతున్న ఇబ్బందులు ద్రుష్ట్యా దైర్యం చేసి అడిగినా.. ఏపీఆర్వోలను గానీ, ప్రెస్ కవరేజికి సరపడే సిబ్బందిని గానీ నియమించే పరిస్థితి అంతకంటే లేదు. వాస్తవానికి ఏ ప్రభుత్వ శాఖలో సిబ్బంది, అధికారులు ఉన్నా లేకపోయినా సమాచార, పౌర సంబంధాల శాఖలో మీడియాకి సమాచారం అందించేందుకు అన్ని విభాగాల సిబ్బందిని ప్రభుత్వం నియమిస్తుంది కానీ గద పదేళ్లుగా ఈ శాఖలో ఔట్ సోర్సింగ్ నియామకాలే తప్పితే కొత్త నియామకాలు జరిగింది లేదు. పోనీ ఉన్నవారికైనా పనొచ్చా అంటే అదీ లేదు. దీనితో కొత్తజిల్లాలతోపాటు, పాత జిల్లా కేంద్రాల్లో కూడా డీపీఆర్వోలు నరకం చూడాల్సి వస్తుంది. ఈ సాంకేతిక సమస్యను సమాచార పౌర సంబంధాల శాఖ రాష్ట్ర అధికారులు ఎప్పుడు గుర్తిస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందనేది.

Tadepalli

2022-04-29 07:49:55

ఎన్ని‘కుల’ సంఘాలు ప్రభావితం చేస్తాయా

2024 ఎన్నికలను కుల సంఘాలు, సామాజిక వర్గాలు ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. రాజ్యాధికారం అంటే రెడ్లు, కమ్మవర్గానికే చెందిన వాళ్లే ఏళ్లకు ఏళ్లు పరిపాలించాలా, రాజ్యాధికారం అనుభవించాలా అనే ప్రశ్న నేడు బలంగా ఉద్బవిస్తోంది. ఏటెళ్లకాలం ఆ రెండు సామాజిక వర్గాలే రాజ్యాధికారం చేస్తే..అత్యధిక సంఖ్యలో వున్న బీసీ సామాజిక వర్గాలు ఏమైపోవాలి. రాష్ట్రంలో అదిపెద్ద రెండవ సామాజిక వర్గంగా వున్న చేనేత వర్గం, అంభేత్కర్ ముద్దుబిడ్డలైన ఎస్సీ, ఎస్టీలు ఏమైపోవాలి.. సరిగ్గా ఇపుడు ఇదే అంశం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది.  ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సామాజిక వర్గం బలాన్ని బట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ సీట్లు కట్టబెట్టి అక్కడితో సరిపెట్టాలని..వారిని అక్కడే ఉంచాలని చూసే రాజకీయపార్టీలకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలనే వాదనను యువ నాయకత్వం ఇపుడు తెరపైకి తీసుకు వస్తుంది. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారత దేశంలో ఎన్నాళ్లు ఒకరు పెట్టింది తినాలనే భావన ఇపుడు ప్రతీ సామాజిక వర్గంలోనూ మొదలైంది. చిన్నా చితకా పదవులతో సరిపెట్టుకుంటే వెనుక బడిన సామాజిక వర్గాలు రాజ్యాధికారం చేపట్టేది  ఎప్పుడు అనే ఆందోళన, బాధ, ఆలోచన ప్రతీ ఒక్క సామాజిక వర్గంలోనూ ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. 2024 ఎన్నికలకు రెండేళ్లు సమయం ఉన్నందున ఇప్పటి నుంచి అన్ని సామాజిక వర్గాలను బలోపేతం చేసుకోవాలని అన్ని సామాజిక వర్గాలూ సమాలోచన చేస్తున్నాయి. ఇప్పటి వరకూ ఒకతరం పెద్దలవలన అధికారానికి దూరమవ్వాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఇకపై అలా జరగకూడదనే ఆలోచనతో ఇపుడు యువత తెరపైకి వస్తున్నారు. సామాజిక వర్గం బలాన్ని బట్టి.. పార్టీలతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగితే వెనుక బడిన సామాజిక వర్గాల బలం కూడా రాజకీయ పార్టీలకు తెలుస్తుందనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. ప్రభుత్వాలు ఏర్పాటైన తరువాత ఆయా రాజకీయపార్టీలు ముష్టివేసే నామినేనెడ్ పోస్టులతో సరిపెట్టుకోకుండా అధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆలోచిస్తున్నారట. దానికి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వాలు ఆయా ప్రధాన సామాజిక వర్గాలను, ఓటు బ్యాంకును పట్టించుకోకపోవడమనే ప్రధానకారణాన్ని ఇపుడు అన్ని సామాజిక వర్గాలు అంచనాలు వేస్తున్నాయని తెలుస్తుంది. ఇలా అయితే పాత తరంతోపాటు, వచ్చే యువతరం కూడా భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, అలా జరగకుండా ఉండాలంటే కుల రాజకీయాలు చేయడం ఒక్కటే మార్గమని తలచి రాష్ట్రంలోని అన్ని ప్రధాన సామాజిక వర్గాల సంఘాల్లోనూ చర్చలు మొదలై సామూహిక సమావేశాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నారని సమాచారం అందుతుంది. గత ఎన్నికల సరళిని ద్రుష్టిలో పెట్టుకొని సామాజిక వర్గాల బలా బాలలను ప్రదర్శించడానికి 2024 ఎన్నికలే వేదిక కావాలని కూడా ప్రధాన సామాజిక వర్గాలు బేరీజు వేస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా రాష్ట్రంలో అతిపెద్ద రెండవ సామాజిక వర్గంగా వున్న చేనేత సామాజిక వర్గం కూడా ఈ సారి తమ బలాన్ని అన్ని రాజకీయ పార్టీల వద్ద చాలా బలంగా ప్రదర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ విభజించూ పాలించు అన్నట్టుగా రాజకీయాలు సాగాయాని, అందుకే ఈ దఫా ఎన్నికల్లో తమ సామాజిక వర్గం బలం తెలిసేలా అందరినీ ఏక తాటిపైకి తీసుకురావడానికి  చేనేత సామాజిక వర్గం ప్రధాన భూమిక పోషిస్తోంది. దానికోసం ఇదే సామాజిక వర్గంలోని ఉద్యోగ సంఘాలు, వ్యాపార సంఘాలు, సాధారణ సంఘాలు, యువ సంఘాలు, మహిళా సంఘాలు, ఇలా అన్ని రకాల సంఘాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి బల ప్రదర్శన చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అపుడే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంగ్రామంలోకి అడుగు పెట్టిన వేళ ప్రస్తుతం కుల సంఘాలు ఈ ఎన్నికల్లో గట్టిగా ప్రభావితం చేస్తాయనే వాదన బలంగా వినిపిస్తుంది. అదే సమయంలో ఇతర రాజకీయ పార్టీలు కూడా ఓటు బ్యాంకు ఎక్కువగా వున్న సామాజిక వర్గాలను లోబరుచుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టుగా చెబుతున్నారు. ఈ ఎన్నికల రాజకీయ ముఖచిత్రం డిసెంబరు మాసం నుంచి ఏ విధమైన మలుపు తిరుగుతుందనేదే ఇపుడు ప్రతీనోట వినిపిస్తున్న మాట. చూడాలి ఈసారి ఎన్నికల్లోనైనా రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద సామాజిక వర్గమైన చేనేత సామాజిక వర్గానికి ఏ తరహా ప్రాధాన్యత దక్కుతుందో..!

Tadepalli

2022-04-29 03:07:08

ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తిరుమల

తిరుమలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధం అమలుపై దుకాణదారులతో టిటిడి అదనపు ఈవో  ఎవి.ధర్మారెడ్డి గురువారం సమావేశం నిర్వహించారు. శ్రీవారి సేవా సదన్ - 2లో జరిగిన ఈ సమావేశంలో దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులు పాల్గొన్నారు. తిరుమలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు తాము కూడా సహరిస్తామని తెలిపారు. అనంతరం అదనపు ఈఓ మీడియాతో ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించేందుకు తిరుమల దుకాణదారులు సహకరించడం అభినందనీయమన్నారు. ఈరోజు ఐదో సమావేశం నిర్వహించామన్నారు. తయారీదారుల నుండి ప్లాస్టిక్ కవర్లలో వచ్చే కొన్ని ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. దుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులు తమ సమస్యలను చెప్పుకున్నారని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని అదనపు ఈఓ తెలిపారు. అనంతరం తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్వీ హైస్కూల్‌లో పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు తీసుకొచ్చిన అభివృద్ధిని వివరించారు. ఎస్ఇ-2  జగదీశ్వర్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, ఎస్టేట్ ఆఫీసర్  మల్లికార్జున, విజిఓ  బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2022-04-28 11:56:10

కొత్త జిల్లాల్లో సమాచారశాఖకు రక్తకన్నీరు

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని.. ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల విభజన సమాచార పౌర సంబంధాలశాఖ(డీపీఆర్వోలు)కు ప్రాణ సంకటంలా మారింది. మూలిగే నక్కపై తాడిపండు పడిట్టుగా అసలే తీవ్రమైన సిబ్బంది, అధికారుల లేమితో కొట్టిమిట్టాడుతున్న సమాచార శాకకు కొత్తజిల్లాల్లో ఎదురవుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సమాచారశాఖకు రక్త కన్నీరే. అవునండీ జిల్లాల విభజన తరువాత సమాచారశాఖకు ప్రభు త్వం పూర్తిస్థాయిలో కార్యాలయాలు కూడా కేటాయించలేదు సరికదా.. సరిపాడా సిబ్బందిని కూడా నియమించలేదు. కనీసం ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు మీడియాకి తెలియజేయా లంటే కావాల్సిన కంప్యూటర్లుగానీ, ఇంటర్నెట్ గానీ లేవు. కొత్త జిల్లాల్లో అన్ని కార్యక్రమాలు ఒక్క డీపీఆర్వోనే చూసుకోవాలి. కనీసం సహాయం చేయడానికి, ఒకేసారి ప్రభుత్వ కార్యక్రమా లు అధికంగా జరిగితే మొత్తం కవర్ చేయడానికి  ఔట్ సోర్సింగ్ ఏపీఆర్వోలను సైతం ప్రభుత్వం నియమించలేదు. ఆఖరికి కార్యక్రమాలు కవర్ చేసే టపుడు వెళ్లడానికి వాహన సదుపాయం అసలే లేదు. కొన్ని చోట్ల ఏపీఆర్వోలు ఉన్నా వారిని మీడియాకి ప్రెస్ నోట్ అందించే పనిచేయడం కూడా చేత కావడంలేదు. మరికొన్నిచోట్ల డీపీఆర్వోలు అసలు ప్రభుత్వ కార్యక్రమాల ప్రెస్ నోట్లు తయారు చేసి ఇచ్చే సామర్ధ్యం కూడా లేకపోవడంతో అధికారికంగా వచ్చే మెసేజ్ లను ప్రెస్ గ్రూపుల్లో ఫార్వార్డ్ చేసి చేతులు దులుపుకుంటు న్నారు. ఇంకొన్ని కొత్త జిల్లాల్లో తమకి చేతకాని పని మీడియాకి తెలియకుండా ఉండేందుకు ప్రెస్ వాట్సప్ గ్రూపుల్లో ప్రధాన మీడియా సంస్థలనుగానీ, జర్నలిస్టులను గానీ చేర్చుకోవడం లేదు. అదేమంటే అలా మీడియా గ్రూపుల్లో జర్నలిస్టులను చేర్చుకోవాలంటే రాష్ట్ర అధికారుల అనుమతి ఉండాలని కొత్త కధలు చెబుతున్నారు. వాస్తవానికి సమాచారశాఖలో డీపీఆర్వోతోపాటు ఒక ఫోటో గ్రాఫర్, ఒక వీడియో గ్రాఫర్, ఒక టైపిస్టు, ఒక ఏపీఆర్వో పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయాల్సి వుంది. కొన్ని చోట్ల వీడియోగ్రాఫర్లు వున్నా ప్రభుత్వ కార్యక్రమాల వీడియోలను మీడియాకి పంపించడానికి ఇంటర్నెట్ సౌకర్యం, కంప్యూటర్లూ లేవు. కొన్ని చోట్లు వీడియో గ్రాఫర్లు ఉన్నా కెమెరాలు లేవు. దానితో వారి మొబైల్ ఫోన్లలోనే కార్యక్రమాల వీడియోలు కవర్ చేయాల్సి వస్తుంది. డీపీఆర్వోలు వారి సెల్ ఫోన్లతోనే అధికారిక కార్యక్రమాలు ఫోటోలు తీయాల్సి వస్తుంది. ఏజెన్సీల జిల్లాల్లో అయితే డీపీఆర్వోల పరిస్థితి రక్త కన్నీరే. కనీస సౌకర్యాలు కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు డీపీఆర్వోలు ముందుగానే జిల్లా కేంద్రంలోని ప్రధాన మీడియా ప్రతినిధుల ఫోన్ నెంబర్లతో డీపీఆర్వో ప్రెస్ వాట్సప్ గ్రూపులు క్రియేట్ చేసి అందులో ప్రభుత్వ అధికారులకు చెందిన ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు తప్పితే ప్రెస్ నోట్లు అందించలేకపోతున్నారు. కొందరు డీపీఆర్వోలకి ప్రెస్ నోట్లు కూడా రాయడం రాక అయితే, మరికొందరికి రాయడం వచ్చినా కనీస సదుపాయాలు లేకపోవడంతో సమాచారం మీడియాకి అందించలేకపోతున్నారు. ఆదరాబాదరాగా ప్రభుత్వం కొత్త జిల్లాలకు డీపీఆర్వోలను సమాచారశాఖలో నియమించగలిగింది కానీ, వారి ద్వారా మీడియాకి కనీసం ప్రభుత్వ కార్యక్రమాలకు చెందిన సమాచారం అందించే ఏర్పాటు చేయలేకపోతుంది.. కొత్తజిల్లాల్లో  75 ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారం ఇవ్వాల్సి వున్నా.. అవకాశం లేక, సిబ్బంది కొరతతో కేవలం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సమాచారం మాత్రమే అందిస్తున్నారు డీపీఆర్వోలు. అటు కొత్త జిల్లాలకు వెళ్లడం చాలా మంది సమాచారశాఖ అధికారులకు, సిబ్బందికి ఇష్టం లేకపోవడంతో విధుల్లోకి చేరినా ఆడుతూ, పాడుతూ పనిచేస్తున్నారు తప్పితే డీపీఆర్వోలకు మాత్రం కార్యాలయ సిబ్బంది నుంచి కనీస సహకారం అందడం లేదు. మరికొందరు డీపీఆర్వోలు కొత్త జిల్లాలకు బదిలీలు చేయడంతో ఆరోగ్యకారణాలతో లాంగ్ లీవ్ పెట్టేసి ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇలాంటి తరుణంలో సమాచార పౌర సంబందాలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, లేదా కమిషనర్ రంగంలోకి దిగి కొత్తజిల్లాల్లోని డీపీఆర్వోలకు కార్యాలయాలు, సహాయానికి ఏపీఆర్వోలను నియమించకపోతే ముందు ముందు పరిస్థితి మరింత జఠిలమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూడాలి ప్రభుత్వం ఏం చేస్తుందో..!

Tadepalli

2022-04-27 03:03:23

తిరుమలలో భాష్యకారుల ఉత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు మంగ‌ళ‌వారం ఘనంగా ప్రారంభ మయ్యాయి. మే 14వ తేదీ వరకు 19 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. మే 5వ తేదీన శ్రీ భాష్యకార్ల సాత్తుమొర జరుగనుంది. భగవద్‌ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా మీమాంస గ్రంథానికి ''శ్రీభాష్యం'' పేరుతో వ్యాఖ్యానం చేశారు. అందుకే భాష్యకారులుగా పేరొందారు. శ్రీరామానుజులవారు జన్మించిన అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాదీ శ్రీవారి ఆలయంలో భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు. భాష్యకారుల ఉత్సవాల మొదటిరోజున ఉదయం శ్రీవారి ఆలయంలో మొదటి గంట అనంతరం శ్రీ రామానుజులవారిని బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయర్‌స్వామి, పార్‌ప‌త్తేదార్  గుర్ర‌ప్ప త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2022-04-26 12:59:16