1 ENS Live Breaking News

1.28 లక్షల తల్లులకి వేక్సినేషన్..

రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ లో చేసిన మార్పులకు అనుగుణంగా వయస్సుతో నిమిత్తం లేకుండా 1,28,824 మంది అయిదేళ్ల లోపు పిల్లలకు కలిగిన తల్లులకు, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు టీకాలు వేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ముఖ్యంగా అయిదేళ్ల లోపు పిల్లలు కలిగిన తల్లులకు టీకాలు వేసే పకడ్బందీగా సాగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 1,13,76,000 డోసులు పంపిణీ చేశామన్నారు. 26,04,000 మందికి రెండు డోసులు, 61,67,700 మందికి మొదటి డోసు వేశామన్నారు. 45 ఏళ్లుకు పైబడిన వారిలో 52,52,000 మందికి ఒక డోసు, 18,94,000 మందికి రెండు డోసులు వేశామన్నారు. ఇప్పటి వరకూ 45 ఏళ్లు పైబడిన జనాభాలో 53.07 శాతం మందికి టీకా వేశామన్నారు. జూన్ నెలాఖారు నాటికి రాష్ట్రంలో 47,50,000 డోసులు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతోందన్నారు. 

Mangalagiri

2021-06-11 14:22:58

శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్..

శ్రీవారి దర్శనార్థం గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ ఎన్.వి రమణకు  శ్రీ పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే  భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఎవి ధర్మారెడ్డి స్వాగతం పలికారు. జస్టిస్ ఎన్వీ రమణ సతీ సమేతంగా స్వామివారి ఏకాంత సేవలో పాల్గొన్నారు.ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత కుమారి, జిల్లా ప్రధాన న్యాయ మూర్తి  రవీంద్ర బాబు, తిరుపతి అదనపు జిల్లా జడ్జి  వై.వీర్రాజు, ప్రోటో కాల్ మేజిస్ట్రేట్  పవన్ కుమార్,
డిఐజి  క్రాంతి రాణా టాటా, సి వి ఎస్ ఓ  గోపీనాథ్ జెట్టి, జిల్లా కలెక్టర్  యం. హరి నారాయణన్,తిరుపతి అర్బన్ ఎస్.పి  వెంకట అప్పల నాయుడు పాల్గొన్నారు..

Tirumala

2021-06-10 17:15:46

ఆర్బీకేల్లోనే ధాన్యం అమ్ముకోవాలి..

రాష్ట్ర వ్యాప్తంగా రబీ 2021 పంటకాలంలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను రైతు భరోసా కేంద్రాల ద్వారా కనీస మద్ధత్తు ధరకు రైతుల నుండి కొనుగోలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఇఓ సెక్రటరీ మరియు కమీషనర్ కె.శశిధర్ స్పష్టం చేశారు.ఈమేరకు గురువారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలు,కోవిడ్ వంటి ప్రతికూల పరిస్థిలున్నప్పటికీ వాటిని అధికమించి రబీలో రైతులు పండించిన ప్రతి ధాన్యాపు గింజను రైతు భరోసా కేంద్రాల ద్వారా కనీస మద్ధత్తు ధరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు.కావున ఏరైతు కూడా దళారులకు లేదా మధ్యవర్తులకు,మిల్లర్లకు కనీస మద్ధత్తు ధరకంటే తక్కువకు లేదా తూకంలో తేడాతోగాని అమ్ముకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.ఒక వేళ మద్ధత్తు ధరకంటే ఎక్కువ ధర వచ్చినచో బయట అమ్ముకునే స్వేచ్ఛ రైతులకు ఉందని చెప్పారు.మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఇ-పంటలో ఉన్నరైతుల సమాచారం ఆధారంగా పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ ప్రక్రియ జరుగుతోందని పేర్కొన్నారు.ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు వాటి ద్వారా రైతు కల్లం వద్దనే ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేశామని ఇందుకుగాను 7వేల 706 రైతు భరోశా కేంద్రాలకు 3936 ధాన్యం కొనుగోలు కేంద్రాలను అనుసంధానించి ఈకొనుగోలు ప్రక్రియను చేపట్టడం జరిగిందని ఇఓ సెక్రటరి శశిధర్ వివరించారు.

ఇప్పటి వరకూ 3లక్షల 78వేల 206 మంది రైతులు వారి వివరాలను రైతు భరోసా కేంద్రాల్లో “Paddy Procurement Online Portal”నమోదు చేసుకున్నారని తెలిపారు.ఈవిధంగా పేర్లు నమోదు చేసుకున్న రైతులకు ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు లేకుండా ప్రతి రైతుకు ధాన్యం కొనుగోలు చేసే తేది కూపన్లను జారీ చేయడం జరుగుతోందని ఇప్పటి వరకూ ఆవిధంగా 2లక్షల 84వేల 129 మంది రైతులకు కూపన్లు జారీ చేశామని శశిధర్ వెల్లడించారు. 2020-0-21 ఏడాది రబీ పంటకాలానికి గాను 45లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సుమారు 8వేల 600కోట్ల రూ.లతో కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటికే 3లక్షల 78వేల 206 మంది రైతుల నుండి 25లక్షల 25వేల927 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 4వేల 729కోట్ల రూ.లతో కొనుగోలు చేయడం జరిగిందని ఇఓ సెక్రటరీ శశిధర్ వెల్లడించారు. 2018-19లో 27లక్షల 52వేల 702 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని4వేల838కోట్లతోను,2019-20లో 34లక్షల 73వేల 414 టన్నుల ధాన్యాన్ని 6వేల 331కోట్లతో కనీస మద్ధత్తు ధరకు కొనుగోలు చేయడం జరిగిందని మీడియాకు వివరించారు.ఇప్పటి వరకూ రబీ ధాన్యం కొనుగోలుకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలో 12లక్షల 26వేల 538 టన్నులు,తూర్పు గోదావరి జిల్లాలో 6లక్షల 29వేల 736 టన్నులు,కృష్ణా జిల్లాల్లో 2లక్షల 69వేల 558 టన్నులు,నెల్లూరు జిల్లాలో 2లక్షల 37వేల 218 టన్నులు,గుంటూరు జిల్లాలో 71వేల 130 టన్నులు,ప్రకాశం జిల్లాలో 50వేల 320 టన్నులను కొనుగోలు చేశామని తెలిపారు.అలాగే కడప,కర్నూలు,అనంతపురం జిల్లాల నుండి కూడా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని వివరించారు.

చిత్తూరు జిల్లాల్లోను,కృష్ణా జిల్లా పెడన తదితర ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే ధాన్యం ఎరైవల్స్ వస్తున్నాయని ఆధాన్యాన్ని అంతటినీ రైతుల నుండి కొనుగోలు చేసేందుకు జూలై నెలాఖరు వరకూ రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియను కొనసాగిస్తామని శశిధర్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి 3వేల 299 కోట్ల రూ.లు రావాల్సి ఉందని దీనిపై ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదికి,కేంద్ర పౌరసరఫరాల మంత్రికి లేఖలు వ్రాశారని శశిధర్ వివరించారు.అలాగే రైతుల నుండి కోనుగోలు చేసిన ధాన్యానికి 21 రోజుల్లోగా సొమ్ము చెల్లించాల్సి ఉండగా ఇంకా 360కోట్ల రూ.లను ఆవిధంగా చెల్లించాల్సి ఉండగా ఆనిధులను త్వరగా విడుదల చేయాల్సిందిగా ఇప్పటికే ఆర్ధికశాఖ అధికారులకు సియం ఆదేశాలు జారీ చేశారని త్వరలో వారికి సొమ్ము చెల్లించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.ఖరీఫ్ నుండి స్థానికంగా వినియోగించని వరి రకాలు సాగుచేయవద్దు రైతులకు విజ్ణప్తి
రాష్ట్రంలో వచ్చే ఖరీప్ సీజన్ నుండి స్థానికంగా వినియోగించని 1010,MTU 1001, NLR 145 వంటి వరి వంగడాలను సాగు చేయవద్దని రైతులందరిలో అవగాహన కలిగించేందుకు రైతు భరోసా కేంద్రాలు,స్థానిక రైతు సలహా కమిటీలు ద్వారా వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల ద్వారా పెద్దఎత్తున అవగాహనా కార్యక్రమాలను చేపట్టనునట్టు శశిధర్ పేర్కొన్నారు.ఎందుకంటే స్థానికంగా వినియోగించని వరి వంగడాలను సాగుచేయడం వల్ల వాటిని ప్రజలు తినకపోవడం,భారత ఆహార సంస్థ కొనుగోలు చేయకపోవడంతో రైతులు నష్టపోతారని కావున అలాంటి వరి వంగడాల సాగును చేపట్టవద్దని రైతులందరికీ అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు పౌరసరఫరాలశాఖ ఇఓ సెక్రటరీ కె.శశిధర్ పేర్కొన్నారు.        ఈమీడియా సమావేశంలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎండి సూర్యకుమారి పాల్గొన్నారు.

Tadepalle

2021-06-10 15:38:24

ప్రతీ ధాన్యపు గింజను కొంటాం..

రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు భరోసా ఇచ్చారు. రైతులు తప్పనిసరిగా తమ పేరును ‘ఈ పంట’లో నమోదు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో సూక్ష్మ సేద్యానికి అధిక ప్రాధాన్యతిస్తూ, ఈ ఏడాది యాక్షన్ ప్లాన్ లో భాగంగా రూ.1190.11 కోట్లతో లక్షన్నర హెక్టార్లలో డ్రిప్ ఇరిగేషన్ విస్తరింపజేసే విధంగా చర్యలు చేపట్టామన్నారు.  వెలగపూడిలోని అసెంబ్లీ ప్రాంగణంలోని కమిటీ హాలులో పంటల కొనుగోలుపై గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పలువురు ఎమ్మెల్యేలతో పాటు వ్యవసాయ, సివిల్ సప్లయ్ శాఖాధికారులు పాల్గొన్న ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కొడాలి వెంకటేశ్వరరావు(నాని), ఎం.శంకర నారాయణతో కలిసి ఆయన పాల్గొన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి  సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సమావేశం నిర్వహిస్తున్నామన్నారు.  దీనిలో భాగంగా ప్రతి ధాన్యపు గింజనూ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతు భరోసా కేంద్రాల కొనుగోలు చేయనున్నామన్నారు. ప్రతి గ్రామంలో ఉన్న ఆర్బీకేల ద్వారా ‘ఈ పంట’ లోని Paddy Procurement Online పోర్టల్ లో రైతులు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఈ పోర్టల్ లో పేర్లు నమోదు చేసుకోవడం వల్ల ఇతర రాష్ట్రాల రైతులు ఏపీలో తమ పంటలను విక్రయించుకునే అవకాశం ఉండదన్నారు.  రైతు భరోసా కేంద్రాల ద్వారా నేరుగా రైతుల పొలాల వద్దకెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. దీనివల్ల దళారులు/మధ్యవ్యర్తుల ప్రమేయం ఉండదన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన తరవాత 21 రోజుల్లో రైతుల ఖాతాలో నేరుగా నగదు జమ చేస్తున్నామన్నారు. దీనివల్ల రైతులకు కనీస మద్దతు ధర లభిస్తోందన్నారు. రాష్ట్రంలో సూక్ష్మ సేద్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11.90 లక్షల మంది రైతులు 13.43 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం చేస్తున్నారన్నారు. 

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు 2021-21 సంవత్సరానికి సంబంధించి మరో లక్షన్నర హెక్టార్లలో సూక్ష్మ సేద్యం చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఇందుకోసం రూ.1190.11 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 హెక్టార్లలో సూక్ష్మ సేద్యం చేసే రైతులకు 90 శాతం సబ్సిడీ అందజేయనున్నామన్నారు. రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలో 4 హెక్టార్లు కలిగిన రైతులకు 70 శాతం, 5 హెక్టార్లు కలిగిన ప్రకాశం జిల్లా మినహా మిగిలిన కోస్తాంధ్ర జిల్లాల రైతులకు 50 శాతం మేర సబ్సిడీ అందజేయనున్నామన్నారు. రబీ సీజన్ లో నేటి వరకూ ఎన్ని టన్నుల మేర ధాన్యాన్ని  కొనుగోలు చేశారని సివిల్ సప్లయ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సివిల్ సప్లయ్ శాఖ ఈవో కార్యదర్శి కోన శశిధర్ మాట్లాడుతూ, 2020-21 పంటల కాలానికి సంబంధించి 45 లక్షల మెట్రిక్ టన్నలు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటి వరకూ 3,78,206 మంది రైతుల నుంచి రూ.4,728.81 కోట్ల విలువ చేసే 25,25,927 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఎంత వరి పంట ఉన్నా కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో సూక్ష్మ సేద్యం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. వాణిజ్య పంటల కొనుగోలు వివరాలను మార్క్ ఫెడ్ అధికారులు వివరించారు. 

ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు అనంతరం రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నామన్నారు. నగదు జమలో ఎక్కడైనా సమస్యలు ఎదురైతే తనకు దృష్టికి తీసుకురావలని, తక్షణమే ఆ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రైతును ఆర్థికంగా అభివృద్ధి చేయడమే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. అన్నదాత సంక్షేమానికి వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోందన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని) మాట్లాడుతూ, ప్రతి రైతుకూ ఆర్థికంగా మేలు కలుగజేయాలన్నదే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలిపితే, అధికారుల సాయంతో వాటిని పరిష్కరిస్తామన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, పలువురు ఎమ్మెల్యేలు, మార్క్ ఫెడ్ ఎం.డి. ప్రద్యుమ్మ, వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ ఎం.డి. సూర్య కుమారి, మైక్రో ఇరిగేషన్ పీవో హరనాథ్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.

Tadepalle

2021-06-10 15:37:05

చిరువ్యాపారుల అభివ్రుద్ధే ప్రభుత్వ లక్ష్యం..

రాష్ట్రంలోని చిరువ్యాపారులు రుణాల కోసం ఎవరిపైనా ఆధారపడకూడదనే లక్ష్యంతోనే జగనన్న తోడు పథకం కింద 2వ విడతలో   3.70 లక్షల మంది చిరువ్యాపారుల ఖాతాలలో  రూ. 10వేల చొప్పున రూ. 370 కోట్లను  విడుదల చేసినట్లు   ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సీఎం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకంలోని లబ్దిదారులకు  కంప్యూటర్ బటన్ నొక్కి  ఖాతాలలోకి  నగదు జమ చేసారు.  ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తాను పాదయాత్రలో చిరువ్యాపారుల కష్టాలు స్వయంగా చూశానని వారిని ఆదుకోవడాని ఈ తరహా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు.   గత ఏడాది  జగనన్న తోడు ద్వారా 5.35 లక్షల మంది  రుణ సౌకర్యం పొందారని  అన్నారు.  అర్హత ఉన్నవారందరికి సహాయం చేస్తున్నామని  సకాలంలో వడ్డీ చెల్లించే వారికి  తిరిగి వారి ఖాతాలలోకి  వడ్డీ జమ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్,  పురపాలక, పట్టణాభివృద్దిశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, గ్రామ, వార్డు సచివాలయాల స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌జైన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆప్కాబ్‌ పర్సన్‌ ఇంఛార్జ్‌ ఎ.బాబు, గ్రామ, వార్డు సచివాలయాల కమిషనర్‌ నారాయణ భరత్‌ గుప్త, సెర్ప్‌ సీఈఓ  రాజాబాబు, మెప్మా ఎండీ విజయలక్ష్మి, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ బ్రహ్మానందరెడ్డి, స్త్రీనిధి ఎండీ నాంచారయ్య, ఆప్కాబ్‌ ఎండీ శ్రీనాధరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Tadepalle

2021-06-08 12:33:45

Tadepalli

2021-06-08 06:40:51

గ్రామీణ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు..

 తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో ఎస్సీ ,ఎస్టీ ,బీ సి వర్గాలకు చెందిన వెనుకబడిన ప్రాంతాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీరామాలయాల నిర్మాణాలు చేపట్టనున్నామని దేవాదాయ, ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ జి.ఏకాంబరం ఒక ప్రకటన లో తెలిపారు . ఆయా గ్రామాలలో  ఈ ఆలయాలను నిర్మించాలి అనుకున్నవారు లొకేషన్, సైట్ ప్లాన్, సదరు ఆలయ నిర్మాణానికి అనువుగా ఉందని భావిస్తే టిటిడి అధికారులు పరిశీలించి ఒక్కొక్క  ఆలయానికి రూ.10,00,000/- చొప్పున నిధులను కేటాయించనున్నారన్నారు.  ఈ ఆలయ నిర్మాణం విషయంలో  ఖచ్చితంగా ఈ అనుమతులు కావాల్సి వుంటుందన్నారు.
గ్రామాలలోని దళితవాడలు, ట్రైబల్ ఏరియా, మత్సకార కాలనీలు, వెనుకబడిన ప్రాంతాలలో మరియు ముఖ్యమైన ఆలయములు లేనిచోట పరిగణించబడుతుందని,  గుర్తించిన ప్రాంతంలో 10  సెంట్లు స్థలాన్ని రెవెన్యూ అధికారులు ధ్రువీకరించాలని, ఆయా ప్రాంతంలో ఎలాంటి ఆలయాలు లేవని సంబంధిత గ్రామస్థుడు దేవాదాయ శాఖకు అర్జీ సమర్పించాలని, టీటీడీ జారీచేసిన డిజైన్ లోనే రాష్ట్రంలో ఆలయ నిర్మాణం జరుగుతుందని ఆ ప్రకటనలో తెలిపారు.

Tadepalle

2021-06-07 17:30:05

ఇక ఉదయం 6 నుంచి 2 గంటల వరకూ..

రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి నివారణకు విధించిన 144 సెక్షన్, కర్ఫ్యూను జూన్ 20 వతేదీ వరకూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఈ నెల 11 వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ 144 సెక్షన్ పెంచుతూ నిర్ణయం తీసుకుందన్నారు. కర్ఫ్యూ మధ్యాహ్నం రెండు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకూ కర్ఫ్యూ విధిస్తూ... ఇదివరకటి నిబంధనలతో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసిందన్నారు. మరికొద్ది రోజులు కర్ఫ్చూ పొడిగిస్తే మరింత సత్ఫలితాలు వస్తాయని భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లోనూ పాజిటివిటీ రేటు తగ్గుముఖం పట్టిందన్నారు. గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పాజిటివిటీ రేటు పది శాతం లోపలే ఉంటోందన్నారు. ఆరోగ్య శ్రీ పథకం వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో జూన్ 6వ తేదీనాటికి  21,130 మంది చికిత్స పొందుతున్నారన్నారు. వారిలో 17,944 మంది(84.92 శాతం) ఆరోగ్య శ్రీ పథకం కింద వైద్య సేవలు పొందుతున్నారన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 9,659 మంది కరోనా చికిత్స పొందుతుంటే, వారిలో 6,473 మంది (67 శాతం) ఆరోగ్య శ్రీ కింద వైద్యసేవలు పొందుతున్నారన్నారు. రోజు రోజుకూ ఆరోగ్య శ్రీ కింద కరోనా చికిత్సలు పొందే వారి సంఖ్య పెరుగుతూ వస్తోందన్నారు.

Tadepalli

2021-06-07 17:22:17

థర్డ్ వేవ్ నివారణకు ప్రత్యేక చర్యలు.

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే రోజుల్లో కరోనా థర్డ్ వేవ్ వ్యాపించ వచ్చనే నిపుణుల సూచనల మేరకు ముందుస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని  సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొవిడ్ సమీక్షా సమావేశంలో సూచించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఇప్పటికే థర్డ్ వేవ్ వస్తే చేపట్టే నివారణ చర్యలపై ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించిందన్నారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు, పిడియాట్రిక్  కేసులు వస్తే, నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేదానిపైనా సీఎం చర్చించారన్నారు. కరోనా రెండు వేవ్ ల ఆధారంగా తీసుకుని బాధితుల వయస్సు జాబితాను దేశ, రాష్ట్రం వారీగా చర్చించామన్నారు. దేశ వ్యాప్త డేటా చూస్తే... 0 నుంచి 10 ఏళ్ల లోపు దేశంలో 3.35 శాతం, ఏపీలో  2.72 శాతం, 11 నుంచి 20 ఏళ్ల లోపు దేశంలో8.38 శాతం, ఏపీలో 8,35, 21-30 ఏళ్ల లోపు 21.79 శాతం, ఏపీ లో 20.28 శాతం, 31-40 ఏళ్లలోపు దేశంలో 21.91 శాతం, ఏపీలో 21.29 శాతంగా నమోదయ్యిందన్నారు. మొత్తంగా ఏపీలో ఏపీలో 20 ఏళ్లలోపు 11 శాతం మందిగా గుర్తించామన్నారు. థర్డ్ వేవ్ లో పిడియాట్రిక్ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదయితే,  ఐసీయూ, పిడియాట్రిక్ బెడ్లు, వెంటిలేటర్లు, పిల్లలకు ఇచ్చే సిరప్ లు, మాస్కులు, మందులు ఎన్ని కావాలి..? వాటిని ముందుగానే కొనుగోలు చేసేలా కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. అన్ని టీచింగ్‌ ఆస్పత్రుల్లో పీడియాట్రిక్‌ వార్డులు ఏర్పాటు చేయాలని, పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో అవకాశం ఉన్నచోట పిల్లలకు చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని, చిన్న పిల్లల వైద్యులను రిక్రూట్ మెంట్ చేసుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి  ఆదేశించారన్నారు. 

Tadepalle

2021-06-07 17:18:39

రాష్ట్రంలో 3 మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రులు..

రాష్ట్రంలో చిన్నారులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడానికి మూడూ పిడియాట్రిక్స్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. విశాఖలోని రాణి చంద్రమయి దేవీ గవర్నమెంట్ రిహాబిలిటేషన్ సెంటర్ పేరు మీదుగా 1965లో భూముల కేటాయించారన్నారు. వాటిలో రూ.200 కోట్ల వ్యయంతో 500 పడకల మల్టీ స్సెఫాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఏడాదిన్నర కిందట డీపీఆర్ రూపొందించారన్నారు. ఈ నిధులు వెంటనే మంజూరు చేసి ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీంతో పాటు రాయలసీమ రీజియన్ గా తిరుపతిలో, కోస్తాంధ్రా  రీజియన్ గా గుంటూరు/విజయవాడలో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైన భూములు, డీపీఆర్ సిద్ధం చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. 45 ఏళ్లు పైబడిన వారు, హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 55 శాతం మందికి కనీసం ఒక డోసు ఇచ్చామన్నారు. వారిలో 57,07,706 మందికి ఒక డోసు, 25,80,432 మందికి రెండు డోసులు వేశామని తెలిపారు. 
రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం(జూన్ 6) సాంయత్రం వరకూ 1,623 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయన్నారు. ఈ కేసుల నివారణకు కేంద్ర ప్రభుత్వం నుంచి 13,105 ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు వచ్చాయన్నారు. వాటిలో 1,225 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని, మిగిలినవి రోగులకు ఇంజక్షన్ చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం  91,650 ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్ల కొనుగోలుకు ఆర్డర్లిచ్చిందన్నారు. ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లను కేంద్ర ప్రభుత్వమే కోటా ప్రకారం రాష్ట్రాలకు కేటాయిస్తోందన్నారు. బ్లాక్ ఫంగస్ నివారణకు అవసరమైన పొసకొనజోల్ ఇంజక్షన్లను, మాత్రలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు. ఇప్పటి వరకూ 12,250 పొసకొనజోల్ ఇంజక్షన్లను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. వాటితో పాటు 1,01,980 పొసకొనజోల్ మాత్రలను కొనుగోలు చేయగా, ప్రస్తుతం 68,543 మాత్రలు అందుబాటులో ఉన్నాయన్నారు. 

Tadepalle

2021-06-07 17:16:08

థర్డ్ వేవ్ నివారణకు ప్రత్యేక చర్యలు..

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే రోజుల్లో కరోనా థర్డ్ వేవ్ వ్యాపించ వచ్చునంటూ నిపుణుల సూచనల మేరకు ముందుస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని  సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొవిడ్ సమీక్షా సమావేశంలో సూచించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఇప్పటికే థర్డ్ వేవ్ వస్తే చేపట్టే నివారణ చర్యలపై ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించిందన్నారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు, పిడియాట్రిక్  కేసులు వస్తే, నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేదానిపైనా సీఎం చర్చించారన్నారు. కరోనా రెండు వేవ్ ల ఆధారంగా తీసుకుని బాధితుల వయస్సు జాబితాను దేశ, రాష్ట్రం వారీగా చర్చించామన్నారు. దేశ వ్యాప్త డేటా చూస్తే... 0 నుంచి 10 ఏళ్ల లోపు దేశంలో 3.35 శాతం, ఏపీలో  2.72 శాతం, 11 నుంచి 20 ఏళ్ల లోపు దేశంలో8.38 శాతం, ఏపీలో 8,35, 21-30 ఏళ్ల లోపు 21.79 శాతం, ఏపీ లో 20.28 శాతం, 31-40 ఏళ్లలోపు దేశంలో 21.91 శాతం, ఏపీలో 21.29 శాతంగా నమోదయ్యిందన్నారు. మొత్తంగా ఏపీలో ఏపీలో 20 ఏళ్లలోపు 11 శాతం మందిగా గుర్తించామన్నారు. థర్డ్ వేవ్ లో పిడియాట్రిక్ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదయితే,  ఐసీయూ, పిడియాట్రిక్ బెడ్లు, వెంటిలేటర్లు, పిల్లలకు ఇచ్చే సిరప్ లు, మాస్కులు, మందులు ఎన్ని కావాలి..? వాటిని ముందుగానే కొనుగోలు చేసేలా కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. అన్ని టీచింగ్‌ ఆస్పత్రుల్లో పీడియాట్రిక్‌ వార్డులు ఏర్పాటు చేయాలని, పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో అవకాశం ఉన్నచోట పిల్లలకు చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని, చిన్న పిల్లల వైద్యులను రిక్రూట్ మెంట్ చేసుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి  ఆదేశించారన్నారు. 

Tadepalle

2021-06-07 16:09:17

రాష్ట్రంలో 3 మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రులు..

రాష్ట్రంలో చిన్నారులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడానికి మూడూ పిడియాట్రిక్స్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. విశాఖలోని రాణి చంద్రమయి దేవీ గవర్నమెంట్ రిహాబిలిటేషన్ సెంటర్ పేరు మీదుగా 1965లో భూముల కేటాయించారన్నారు. వాటిలో రూ.200 కోట్ల వ్యయంతో 500 పడకల మల్టీ స్సెఫాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఏడాదిన్నర కిందట డీపీఆర్ రూపొందించారన్నారు. ఈ నిధులు వెంటనే మంజూరు చేసి ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీంతో పాటు రాయలసీమ రీజియన్ గా తిరుపతిలో, కోస్తాంధ్రా  రీజియన్ గా గుంటూరు/విజయవాడలో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైన భూములు, డీపీఆర్ సిద్ధం చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. 45 ఏళ్లు పైబడిన వారు, హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 55 శాతం మందికి కనీసం ఒక డోసు ఇచ్చామన్నారు. వారిలో 57,07,706 మందికి ఒక డోసు, 25,80,432 మందికి రెండు డోసులు వేశామని తెలిపారు. 
రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం(జూన్ 6) సాంయత్రం వరకూ 1,623 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయన్నారు. ఈ కేసుల నివారణకు కేంద్ర ప్రభుత్వం నుంచి 13,105 ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు వచ్చాయన్నారు. వాటిలో 1,225 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని, మిగిలినవి రోగులకు ఇంజక్షన్ చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం  91,650 ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్ల కొనుగోలుకు ఆర్డర్లిచ్చిందన్నారు. ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లను కేంద్ర ప్రభుత్వమే కోటా ప్రకారం రాష్ట్రాలకు కేటాయిస్తోందన్నారు. బ్లాక్ ఫంగస్ నివారణకు అవసరమైన పొసకొనజోల్ ఇంజక్షన్లను, మాత్రలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు. ఇప్పటి వరకూ 12,250 పొసకొనజోల్ ఇంజక్షన్లను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. వాటితో పాటు 1,01,980 పొసకొనజోల్ మాత్రలను కొనుగోలు చేయగా, ప్రస్తుతం 68,543 మాత్రలు అందుబాటులో ఉన్నాయన్నారు. 

Tadepalle

2021-06-07 16:04:21

పిల్లల తల్లులకూ కోవిడ్ వాక్సిన్..

కరోనా థర్డ్ వేవ్ వస్తుందన్న నిపుణుల సూచనలతో ముందు జాగ్రత్తతో రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్లలోపు పిల్లలు ఉన్న తల్లులకు వ్యాక్సిన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్లలోపు పిల్లలు కలిగిన తల్లులు 15 లక్షల నుంచి 20 లక్షల వరకూ ఉండొచ్చునని, వారికి కూడా 45 ఏళ్లు పైబడిన వారితో కలిసి టీకాలు వేయనున్నామని, దీనికి సంబంధించిన విధివిధానాలను అన్నిజిల్లా కలెక్టర్లకు జారీచేయనున్నామని చెప్పారు. కరోనా చికిత్సల నిమిత్తం రాష్ట్రంలో 600లకు పైగా ప్రైవేటు ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతులిచ్చామన్నారు. థర్డ్ వేవ్ ను దృష్టిలో పెట్టుకుని వాటిలో పిడియాట్రిక్ కేసుల చికిత్స, వాటిలో పిడి యాట్రిక్ వార్డులు, ఇతర మౌలిక సదుపాయల కల్పనకు గల అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. చిన్న పిలల్లకు కరోనా పాజిటివ్ వస్తే, చికిత్స సమయంలో వారితో పాటు ఆసుపత్రుల్లో తల్లులు కూడా ఉండాల్సి ఉంటుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు సింఘాల్ వివరించారు..

తాడేపల్లి

2021-06-07 15:38:54

Tadepalle

2021-06-06 11:17:47

ఇక్కడా రోగనిర్ధారణ పరీక్షలు జరగవు..

డా.వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ ఈ పేరు వినగానే  దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయంగా వచ్చి వైద్యం చేసినంత అనుభూతి కలుతుంది.. కానీ ఏం సుఖం లక్షల ఖర్చుచేసి భవనం నిర్మించి, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు, ఏఎన్ఎంలతో సుమారు 100 రకాల మందులు ఏర్పాటు చేస్తున్నా ప్రభుత్వం నిర్ధేశించిన 12 వైద్యసేవల్లో ప్రధానంగా ఉండాల్సిన రోగ నిర్ధారణ పరీక్షలు(షుగరు,రక్తం, మూత్రం, మలం, జ్వరం) ఊసెత్తలేదు ప్రభుత్వం. రోగ నిర్ధారణ కాకుండా ఏ జబ్బుకి ఏ మందులిస్తారో కూడా తెలియని పరిస్థితి. తద్వారా గ్రామాల్లో క్లినిక్ లు ఏర్పాటు చేసినా రోగ నిర్ధారణ పరీక్షకోసం ప్రైవేటు ల్యాబ్ లను ఆశ్రయించక తప్పటట్టులేదు. అలా కాకుండా పీహెచ్సీల్లో అయినా పూర్తిస్థాయిలో పరీక్షలు చేయించుకుందామంటే ఆసుపత్రుల్లో మెడికల్ ల్యాబ్ లు సక్రమంగా లేవు. ల్యాబ్ లున్న ఉన్నచోట ల్యాబ్ టెక్నీషియన్ లేడు, టెక్నీషియన్ ఉన్నచోట ల్యాబ్ లు, పరికరాలు, మెడికల్ కిట్లు లేవు.. కనీసం విలేజ్ హెల్త్ క్లినిక్ లలో అయినా ప్రభుత్వం ప్రాధమిక వైద్యం అందించడానికి రోగ నిర్ధారణ గ్రామాల్లో చేస్తుందని ఆశపడ్డ రోగులకు నిరాసే ఎదురైంది.  ఏ రోజైతే గ్రామస్థాయిలో ప్రాధమిక వైద్యం రోగనిర్ధారణతో అందుబాటులోకి వస్తుందో ఆరోజే ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినట్టు అనేవారు వైఎస్సార్ ఎప్పుడూ..ఆ మాటలను నిజం చేస్తూ ఏర్పాటవుతున్న విలేజ్ హెల్త్ క్లినిక్ లలో రోగ నిర్ధారణ పరీక్షలు కూడా ఏర్పాటు చేస్తే.. మెడికల్ టెస్టుల కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించే భారం తప్పేది. ప్రస్తుతం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 10032 విలేజ్ హెల్త్ క్లినిక్ లను అందుబాటులోకి తెస్తుంది. వీటికోసం గత ఏడాది 2920 పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం కొత్తగా మరో ఏడువేల పోస్టులను భర్తీ చేసి వారి ద్వారా ప్రజలకు సేవలు అందించాలనేది ప్రభుత్వ ఆలోచన. ప్రజలకు సేవలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యం బాగానే ఉన్నా దానిని అమలు చేసే విధానంలోనే ప్రధాన లోపాలు కనిపిస్తున్నాయి.. రోగి వ్యాధిని పరీక్ష చేసి నిర్ధారణ అయిన తరువాత మందులిస్తే రోగం నయం అవుతుంది..అంతే తప్పా రోగం లక్షణాలు తెలుసుకొని మందులిస్తే... చీకటిలో బాణం వేసినట్టుగా ఒక్కోసారి మాత్రమే పనిచేస్తాయి. తరువాత మళ్లీ మళ్లీ మందులివ్వాలి.. ఇక్కడ ప్రభుత్వానికి సూచనలు చేసిన అధికారులు కూడా ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. వైద్యమంటేనే రోగ నిర్ధారణ.. కేవలం ఆ ఒక్క విషయంతోనే ప్రైవేటు ఆసుపత్రులు లక్షల రూపాయలు రోగులకు వైద్యపరీక్షల పేరుతో బిల్లులు వేస్తాయి. అలాంటిది ప్రభుత్వం నిర్మించే ఆసుపత్రులు, విలేజ్ క్లినిక్ లలో రోగ నిర్ధారణ పరీక్షలు(మెడికల్ టెస్టులు, మెడికల్ ల్యాబ్ లు) చేసే అవకాశం కల్పించకపోతే... రోగ నిర్ధారణ ఎలా జరుగుతుందనే విషయాన్ని వైద్యఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఒక్క ఉన్నతాధికారి కూడా ప్రభుత్వానికి సూచింకపోవడం దురద్రుష్టకరం. అలాగని పీహెచ్సీల్లో ఇద్దరు వైద్యులు, ఇద్దరు స్టాఫ్ నర్సులను, ఇద్దరు ఏఎన్ఎంలను నియమించినట్టుగా ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు ప్రభుత్వం నియమించిందా అంటే అదీ లేదు. ఒక్క ల్యాబ్ టెక్నీషియన్ తో అరకొరగా సేవలు అందిస్తుంది. కనీసం ఒక్కో పీహెచ్సీ పరిధిలోనైనా రెండో ల్యాబ్ టెక్నీషయన్ ను పూర్తిస్థాయిలో మెడికల్ కిట్ల తో ఏర్పాటు చేసినా, విలేజ్ క్లినిక్ ల నుంచి రక్త పరీక్షల కోసం పీహెచ్సీలకు రోగులకు రోగనిర్దారణ కోసం పంపడానికి వీలుపడేది. అలాకాకుండా ఇప్పటికే ఒక్కో గ్రామ సచివాలయానికి ఒక ఆరోగ్య సహాయకులను ప్రభుత్వం నియమించినా మళ్లీ మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పేరుతో మరో పోస్టును క్రియేట్ చేసి మరీ ఇక్కడ భర్తీచేస్తున్నారు. వాస్తవానికి ఈ పోస్టు అవసరమనే చెప్పాలి. దానికి కారణం కూడా లేకపోలేదు.. ఎందుకంటే ఇప్పటికే ఒక్కో గ్రామసచివాలయ పరిధిలో ఒక్కో ఏఎన్ఎం నియమించబడ్డారు. ఇపుడు అదనంగా నియమించే వారి స్థానంలో ల్యాబ్ టెక్నీషియన్లను నియమిస్తే ప్రజలకు తొలుత రోగ నిర్ధారణ జరుగుతుంది. ఇప్పటికే గ్రామంలో విధి నిర్వహణలో వున్న సచివాలయ ఏఎన్ఎంను హెల్త్ క్లినిక్ అనుసంధానిస్తే ప్రాధమిక వైద్యం వారి ద్వారానే అందుతుంది. ముఖ్యంగా ల్యాబ్ టెక్నీషియన్లును నియమించడం ద్వారా వయస్సు మళ్లిన వారికి సుగరు పరీక్షలు, గర్భిణీ స్త్రీలు, పాఠశాల విద్యార్ధులకు రక్త పరీక్షలు చేయడానికి ఆస్కారం వుంటుంది. రోగ నిర్ధారణ చేసిన తరువాత సదరురోగానికి సరైన మందు ఇవ్వడం ద్వారా రోగాలను అనుకున్న స్థాయిలో నియంత్రించడానికి ఆస్కారం వుంటుంది. అంతేకాకుండా రోగ నిర్ధారణ కోసం ప్రైవేటు ల్యాబ్ లను ఆశ్రయించే భారం కూడా ప్రజలకు తప్పుతుంది. ఎంతో ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న విలేజ్ క్లినక్ లలో ల్యాబ్ టెక్నీషియన్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం ప్రజలకు అందించాలనుకున్న ప్రాధమిక వైద్యసేవలు పూర్తిగా అందించడానికి వీలుపడుతుంది. లేదంటే మేడిపండు చందంగానే తయారవుతాయి డా.వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు కూడా ఇదేదో కావాలని అంటున్నమాట కాదు 12 రకాల వైద్యసేవల్లో రోగ నిర్ధారణ పరీక్షలను చేర్చకపోవడంపై ప్రజల నుంచి వస్తున్న స్పందనే ఈ ప్రత్యేక కధనానికి పునాది అనే విషయాన్ని తెలియజేస్తున్నాం..వైద్యో నారాయణో హరి..!

Tadepalle

2021-06-06 04:14:14