1 ENS Live Breaking News

గ్రూప్-1 ఇంటర్వ్యూలపై హైకోర్టు స్టే..

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గ్రూప్‌-1 ఇంటర్వ్యూ ప్రక్రియపై  స్టే విధించింది.. ఇంటర్వ్యూను నాలుగు వారాలపాటు నిర్వహించకూడదని న్యాయస్థానం తీర్పు వెలువరించింది. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల జవాబు పత్రాలను డిజిటల్‌ విధానంలో వాల్యుయేషన్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. షెడ్యూల్‌ ప్రకారం రేపటి నుంచి ఇంటర్వ్యూలు జరగాల్సి ఉండగా హైకోర్టు తీర్పుతో వాయిదా పడింది. నాలుగు వారాల్లో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఏపీ ప‌బ్లిక్ క‌మిష‌న్‌ను ఆదేశించింది.  కాగా గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం పరీక్షలు జరగలేదని పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. డిజిటల్‌ వాల్యూయేషన్‌ గురించి చివరి దశలో చెప్పారన్నారు. అయితే నిబంధనల ప్రకారమే గ్రూప్‌-1 పరీక్షలు జరిగాయని, వాల్యూయేషన్‌ గురించి ముందుగా చెప్పాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరపున వ్యాయవాది వాదనలు హైకోర్టుకు తెలిపారు. ఇక ఇరు వాదనలు విన్న హైకోర్టు మంగళవారం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. గ్రూప్‌-1 ఇంటర్వ్యూ ప్రక్రియపై స్టే విధిస్తూ ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Tadepalle

2021-06-16 15:16:43

Tadepalle

2021-06-15 09:47:56

Hyderabad

2021-06-15 04:17:07

కోవిడ్ వారియర్స్ కి ప్రభుత్వ అండ..

కొవిడ్ విధుల్లో పాల్గొంటున్న వైద్య సిబ్బందికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు..  విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు కరోనా కారణంగా మృతి చెందిన వైద్య సిబ్బందికి భారీ మొత్తంలో ఎక్స్ గ్రేషియా ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూ జీవో జారీచేసిందన్నారు. కొవిడ్‌ విధి నిర్వహణలో మృతి చెందిన వైద్యుని కుటుంబానికి రూ.25 లక్షలు, స్టాఫ్‌ నర్సు కుటుంబానికి రూ.20 లక్షలు, ఎఫ్‌ఎన్ఓ, ఎమ్‌ఎన్ఓలకు రూ.15 లక్షల ఎక్స్‌ గ్రేషియా చెల్లించాలని నిర్ణయించిందన్నారు. ఇతర వైద్య సిబ్బంది మృతి చెందితే రూ.10 లక్షల ఎక్స్‌ గ్రేషియా ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు.  కేంద్ర ప్రభుత్వం చెల్లించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ పథకానికి అదనంగా ఈ ఎక్స్‌ గ్రేషియా చెల్లించనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొందన్నారు. తక్షణమే ఎక్స్‌ గ్రేషియా అందేలా జిల్లా కలెక్టర్లకు అధికారం అప్పగించిందన్నారు. ఇతర ఇతర బీమా పరిహారాలు పొందినా సరే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్ గ్రేషియో అందజేస్తామన్నారు.

తాడేపల్లి

2021-06-14 15:45:08

3,540 సచివాలయాల్లో కేసులు నిల్..

రాష్ట్రంలో కరోనా రోజు రోజుకూ తగ్గుముఖం పడుతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. రాష్ట్రంలో ఉన్న వార్డు, గ్రామ సచివాలయాల వారీగా డేటా పరిశీలిస్తే కేసులు తగ్గుతున్నాయనేది అవగతమవుతుందన్నారు. రాష్ట్రంలో 15 వేల వార్డు, గ్రామ సచివాలయాలు ఉన్నాయన్నారు. వాటిలో గడిచిన 24 గంటల్లో 3,540 సచివాలయాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. కేవలం ఒక్క కేసు 2,637 సచివాలయాల్లో, రెండు కేసులు 1,961 సచివాలయాలు, మూడు కేసులు 1500 సచివాలయాల్లో నమోదయ్యాయన్నారు. సున్నా నుంచి 3 కేసుల వరకూ 9 వేల పైన సచివాలయాల్లో(60 శాతంపైగా) నమోదయ్యాయన్నారు. 15 సచివాలయాల్లో 50 కేసులు, 18 సచివాలయాల్లో 40 కేసులు, 40 సచివాలయాల్లో 30 కేసులు నమోదయ్యాన్నారు. ఇలా 70 సచివాలయాలు... 0.5 శాతంపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్ధేశం చేశారన్నారు. కేసులు తగ్గుతున్నాయని 104 కాల్ సెంటర్ నిర్వహణపైనా, ఫీవర్ సర్వేపైనా నిర్లక్ష్యం చూపొద్దని, ప్రస్తుతమున్న స్ఫూర్తిని మరికొంతకాలం పాటు పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారన్నారు. రాష్ట్రంలో నేటి వరకూ 2,303 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని, వాటిలో 1,328 యాక్టివ్ కేసులు అని తెలిపారు. 

ఈ కేసుల్లో 538 మందికి ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు, 577 మందికి పొసకొనజోల్ ఇంజక్షన్లు ఇస్తున్నామన్నారు. 157 మంది మృతిచెందారని తెలిపారు. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 32,285 ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు అన్ని జిల్లాలకు కేటాయించామని, ప్రస్తుతం 10,759 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 49,250 పొసకొనజోల్ ఇంజక్షన్లు, 1,39,980 పొసకొనజోల్ ట్యాబ్ లెట్లు అన్ని జిల్లాలకు అందజేశామన్నారు. అన్ని టీచింగ్ ఆసుపత్రుల్లోనూ అదనంగా  పిడియాట్రిక్, ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేయాలని సోమవారం నిర్వహించిన కొవిడ్ సమీక్షా సమావేశంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. ఇపుడున్న ఐసీయూ బెడ్ల కంటే అదనంగా ఐసీయూ బెడ్లు పెంచాలన్నారు. ఆరు నెలల చిన్నారుల కోసం అవసరమైన బెడ్ల పెంపుదలపైనా చర్చించామన్నారు. ప్రైవేటు టీచింగ్ ఆసుపత్రుల్లో అదనపు బెడ్లు, సిబ్బంది నియామకంపైనా అధికారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి దిశా నిర్ధేశం చేశారన్నారు.  ఆరోగ్య శ్రీ పథకంలో పిడియాట్రిక్ కేసుల చేర్పుపైనా సీఎం సమీక్షా సమావేశంలో చర్చించామన్నారు. 

మంగళగిరి

2021-06-14 15:37:43

రాష్ట్రంలో 19 ఆర్టీపీసీఆర్ ల్యాబ్ లు..

ఆంధ్రప్రదేశ్ లోని 16 మున్సిపల్ కార్పొరేషన్లలో 19 ఆర్టీపీసీఆర్ ల్యాబ్ లు ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 16 మున్సిపాలిటీల్లో  11, 12 చోట్ల భూములు గుర్తించామన్నారు. ఆర్టీసీపీఆర్ ల్యాబ్ ల ఏర్పాటు కోసం యూనిట్ల వారీగా వీటిని ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇక్కడ సౌకర్యాల కల్పన, సిబ్బంది నియామకంపై రెండు వారాల్లో విధి విధానాలు ఖరారు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని చెప్పారు.  భవిష్యత్తులో రాష్ట్రంలో కేవలం ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ల్యాబ్ లు ఏర్పాటు చేస్తోందన్నారు. తద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అత్యధిక పరీక్షలు చేయడానికి వీలు పడుతుందని పేర్కొన్నారు. వైద్యసేవలు అందించే విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీలేకుండా ముందుకు వెళుతుందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లలో సూపర్ స్పెషాలిటీ, మల్లీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి అయిదు ఎకరాల గుర్తింపుపైనా సీఎం సమీక్షా సమావేశంలో చర్చించినట్టు సింఘాల్ వివరించారు.

Mangalagiri

2021-06-14 15:29:50

2021-06-14 11:15:29

రక్తదానంలో కిరణ్ ఆదర్శప్రాయుడు..

ఆయనొక జర్నలిస్టు..ఎప్పుడూ సామాజిక సేవలో ఫస్టు..ఎన్నో నిశ్వార్ధ సేవలపై వార్తా కధనాలు రాసి రాసి ఆయనకి తన జీవితంలో సేవ ఒక బాగమైపోయింది. రక్తధానం యొక్క విలువ తెలిసిన వ్యక్తిగా ఇప్పటి వరకూ 64సార్లు రక్తదానం చేసి ఎందరో ప్రాణాలు నిలువడానికి కారణమయ్యాడు. ఆయనే విశాఖకు చెందిన సీనియర్ జర్నలిస్టు కాళ్ల సూర్యప్రకాష్ (కిరణ్) అనునిత్యం ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తూ వస్తున్నారు. అర్ధరాత్రిలో రక్తం అవసరమైనా దానం చేయడానికి ఈయన హుటాహుటీన బాధితుల కోసం వెళతారంటే అదిమాటల్లో చెప్పలేం. ఇదంతా ఎందుకూ అంటే ఇన్నిసార్లు రక్తదానం చేసిన నిజమైన రక్తదాత మరెందరికో మార్గదర్శి కావాలన్న చిన్న సంకల్పమే ఆయన కోసం ఇంతలా రాసేలా చేసింది. అలాంటి రక్తదాత, సమాజ సేవకుడు
స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో ఉండటం గర్వకారమని భావించిన యూనియన్ కార్యవర్గం కిరణ్ ను సోమవారం ప్రత్యేకంగా యూనియన్ కార్యాలయంలో ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని సత్కరించి గౌరవించింది. ఈ సందర్బంగా బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ, రక్తదానం ప్రాణదానంతో సమానమని, రక్తదానంపై అవగాహన పెంచుకొని అవకాశం ఉన్న ప్రతీ ఒక్కరూ స్వచ్ఛందంగా రక్త దాతలుగా ముందుకు రావాలన్నారు. అసోసియేషన్ సభ్యులు కిరణ్ అనేక మందికి రక్తదానం చేసి
ఎంతో ఆదర్శంగా నిలిచారని  కొనియాడారు.ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్  ప్రధాన కార్యదర్శి కర్రి సత్యన్నారాయణ(సత్య),కార్యదర్శి నక్కాన అజయ్ కుమార్ యాదవ్,ఉపాధ్యక్షులు వెంకట సూరి అప్పారావు(శ్రీనివాసరావు),రామకృష్ణ,ప్రధాన కార్యవర్గ సభ్యులు సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-06-14 08:57:54

సచివాలయ మిగులు ఉద్యోగాల భర్తీఎప్పుడు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల్లో మిగులు ఉద్యోగాల భర్తీకి గ్రహణం వీడటం లేదు. సుమారు లక్ష ఉద్యోగాలు తొలి దశలో భర్తీ చేసిన ప్రభుత్వం మిగిలిపోయిన సుమారు 26వేల ఉద్యోగాలకు రెండవ సారి నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత అన్నిజిల్లాల్లో సిబ్బందిని నియమించలేదు. సుమారు 8వేల ఉద్యోగాలకు పైగా సచివాలయ ఉద్యోగాలు ఇంకా భర్తీ కాకుండా అలానే మిగిలిపోయాయి.  ఇదే సమయంలో కొంత మంది గ్రేడ్-5 సచివాలయ కార్యదర్శిలు గతంలో రాసిన గ్రేడ్-4 కార్యదర్శి ఉద్యోగాలు రావడంతో ఉన్న ఉద్యోగాలకు రాజీనామా చేసి కొత్తగా వచ్చిన ఉద్యోగాల్లో చేరిపోయారు. ఆ సమయంలో కూడా రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని ఖాళీలు ఏర్పడ్డాయి. సచివాలయంలో అత్యధికంగా గ్రామ మహిళా సంరక్షణా కార్యదర్శిలు, వెటర్నరీ అసిస్టెంట్లు, సెరీకల్చర్ అసిస్టెంట్లు, పోస్టులు అధికంగా ఖాళీలు ఉండిపోయాయి. మిగిలిన శాఖలైన హార్టికల్చర్, గ్రామ కార్యదర్శిలు పోస్టులు తక్కువగానే ఉన్నాయి. మరికొంత మంది వివిధ శాఖల్లో అప్పటికే పరీక్షలు రాసి ఉండటంతో కొత్తగా వచ్చిన ఉద్యోగాల్లోకి చేరిపోయారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉండిపోయిన గ్రామ, వార్డు సచివాలయ పోస్టులు భర్తీకాలేదు. మధ్యలో వేరే ఉద్యోగాలు వచ్చి వెళ్లిపోయిన ఖాళీల గుర్తింపు కూడా జరగలేదు. దీనితో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందే డిప్యుటేషన్లపై ఇతర సచివాలయాల్లోని డిప్యుటేషన్ పై అదనంగా చేయాల్సి వస్తుంది. ఈ విషయంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఆదేశాలున్నప్పటికీ కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు నియామకాలు చేపట్టలేదు. ఆ తరువాత కరోనా వైరస్ విజ్రుంభించడంతో ఆ వ్యవహారం పూర్తిగా మూలకు చేరింది. కొన్ని జిల్లాల్లో విధుల్లోకి చేరిన సిబ్బంది ద్వారా మాత్రం ప్రస్తుతం సేవలు అందుతున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల్లో ఏ జిల్లాల్లోని గ్రామసచివాలయాల వారీగా ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయనే అంశంపై కూడా నేటికీ క్లారిటీ రాకపోవడం విశేషం. తొలుత సచివాలయ ఉద్యోగాల్లో చేరినప్పటికీ, జీతం కేవలం మొదటి రెండేళ్లు 15వేలు మాత్రమే ఇవ్వడంతో చాలా మంది ఇతర ఉద్యోగాలకు వెళ్లిపోయారు. అలా ఖాళీ అయిన స్థానాలను కూడా ప్రభుత్వం ఏప్రిల్ నెలాఖరుకే ఎపీపీఎస్సీ కేలండర్ ప్రకటిస్తామని ప్రభుత్వం ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదు. అటు దీనితో గ్రామ, వార్డు సచివాలయాల్లో మిగులు ఉద్యోగాల భర్తీ కాకుండా ఉండిపోయింది. ఈ కరోనా ప్రభావం తగ్గేవరకూ మళ్లీ ప్రభుత్వం సచివాలయాల్లో మిగులు ఉద్యోగాల భర్తీపై ద్రుష్టిపెట్టే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అందులోనూ అమలాపురం వైఎస్సార్సీపీ రెబల్ ఎంపీ రామక్రిష్ణరాజు సచివాలయ ఉద్యోగులపై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి లేఖ రాయడంపైనా చర్చజరుగుతోంది.. ఇటీవలే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సచివాలయ మిగులు ఉద్యోగాలని భర్తీ చేస్తామని ప్రకటించిన కొద్ది రోజులకే రెబల్ ఎంపీ లేఖతో హడావిడీ చేయడం, దానిని ఒక వర్గం మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ హడావిడి చేయడంతోనూ ప్రభుత్వం ఆలోచనల్లో పడింది. ఇప్పట్లో భర్తీచేయాలా..లేదంటే ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను ఆరునెలల్లో రెగ్యులర్ చేసి ఆ తరువాత ఒకే సారి మిగులు ఉద్యోగాలను ఉద్యోగాల జాబ్ కేలండర్ విడుదల చేసి అందులో భర్తీచేయాలా అనే విషయంపై సమాచాలోచన చేయాలా అనే కోణంలో ఆలోచిస్తున్నట్టు సమాచారం అందుతుంది..  ఏం జరుగుతుందనేది వేచి చూడాలి..!

తాడేపల్లి

2021-06-14 02:00:04

ఆ పరీక్షతోనే వారి సర్వీసు రెగ్యులర్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించిన ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ చేయడానికి ఏర్పాట్లు చకచకా చేస్తున్నది. ఇందులో భాగంగా వారికి సర్వీసు రెగ్యులైజేషన్ కు సంబంధించి శాఖా పరమైన పరీక్షలు పాసైన తరువాత వారి ప్రొహిభిషన్ పీరియడ్ ఎత్తివేసి వారి ఉద్యోగాలను రెగ్యులర్ చేయనున్నది. అయితే ఇక్కడ ఉద్యోగులకు ప్రధానంగా ఒక డౌట్ పట్టి పీడిస్తోంది.. ప్రభుత్వం ఆరు నెలల క్రితం ఇచ్చిన డిపార్ట్ మెంటల్ టెస్టు నోటిఫికేషన్ లో పాసైన వారినే రెగ్యులర్ చేస్తుందా.. లేదంటే ఆయా ప్రభుత్వ శాఖల విధి నిర్వహణ పరంగా ఇచ్చిన శిక్షణ పూర్తిచేసుకున్న తరువాత పెట్టిన టెస్టులు పాసైన వారి ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తుందనే విషయంలో ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి క్లారిటీ రాలేదు. మరోపక్క సచివాలయ శాఖలో ఇంకా శాఖాపరమైన శిక్షణలు మిగిలి పోయిన వారికి ఆన్ లైన్ శిక్షణను పూర్తిచేయడానికి కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. దానికోసం శిక్షణకు సంబంచిన ఆన్ లైన్ క్లాసులను కూడా శిక్షణ మిగిలి పోయిన సచివాలయ ఉద్యోగులకు పూర్తి చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తుంది. చాలా మంది సచివాలయ ఉద్యోగులు శాఖా పరమైన ఉద్యోగ శిక్షణ పూర్తిచేసుకొని ఉన్నారు. ఆ శిక్షణపై ప్రభుత్వం ఏమైనా ప్రత్యేక పరీక్ష ఏర్పాటు చేస్తుందా...లేదంటే డిపార్ట్ మెంటల్ పరీక్షలు నిర్వహించి అందులో పాసైన వారిని రెగ్యులర్ చేస్తుందా అనే విషయంపై క్లారిటీ లేకపోడంతో సచివాలయ సిబ్బంది మల్లగుల్లాలు పడుతున్నారు. ఇటీవలే సీఎం జగన్మోహనరెడ్డిని సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కలిసినపుడు సీఎం ఈ విషయమై బదులివ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా అంది ఉద్యోగుల్లోనూ ఆందోళన మొదలైంది. అప్పట్లో కరోనా కేసులు అధికంగా వుండటంతో కొన్ని బ్యాచ్చీల ఉద్యోగులకు శాఖ పరమైన శిక్షణ మధ్యలోనే ఆపేశారు. ప్రభుత్వం నుంచి ఈ రకమైన సమాధానం రావడంతో తమ ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయా లేదా అనే అనుమానాలు వారిని తొలిచేస్తున్నాయి. మరోవైపు నవంబరు నాటికి ఉద్యోగులంతా విధుల్లోకి చేరి రెండేళ్లు పూర్తవుతున్నాయి. ఆ సమాయానికి ఉద్యోగులందరి ప్రొహిభిషన్ పీరియడ్ పూర్తవుతుంది. అనుకున్న తేదీకే ఉద్యోగులను రెగ్యులర్ చేయకపోతే ఇబ్బందులొస్తాయనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం వారికి ఆరునెలల ముందుగానే సర్వీసు రిజిస్టర్లు కూడా ఓపెన్ చేశారు. ఎస్ ఆర్ లు ఓపెన్ చేయడంతో అంతా వారి ఉద్యోగాలకు లైన్ క్లియర్ అయిందని సంబర పడిన తరుణంలో ప్రభుత్వం శాఖాపరమై పరీక్షలు పాసైన వారి ఉద్యోగాలు మాత్రమే రెగ్యులర్ చేస్తామని చెప్పడంతో రాష్ట్ వ్యాప్తంగా వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఈ తరుణంలో ప్రభుత్వం అసలు ఏ పరీక్ష ద్వారా తమ ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తారో చెబితే దానికే తామంతా ఇప్పటి నుంచే సిద్దమవుతామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఒక నిర్ధిష్ట ప్రకటన చేస్తే తప్పా ఆ.. అర్హత పరీక్ష ఏంటనేది ఉద్యోగులకు క్లారిటీ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు..!

Tadepalli

2021-06-13 05:42:17

జూమ్ లో బీఎంఎస్ 3వ రాష్ట్ర మహాసభ..

భారతీయ మజ్దూర్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ 3వ రాష్ట్ర సమావేశం రేపు(ఆదివారం) ఉదయం 9 గంటలకు వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నట్టు అధ్యక్ష, కార్యదర్శిలు ఎం.శ్రావణ్ కుమార్, ఎల్ ముత్యాలు తెలియజేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఒక ప్రటన విడుదల చేసింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా నేషనల్ ప్రెసిడెంట్ హిరణ్మన్య పండ్య, ఉపాధ్యక్షులు ఎల్పీ కటక్వార్, ఎం జగదీశ్వర్రావు, సౌత్ జోన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్.దురారీరాజ్ పాల్గొంటారని అన్నారు. వీరితోపాటు బిఎంఎస్, బిటిఈయూ నేషనల్ ప్రెసిడెంట్ వివిఎస్.సత్యన్నారాయణ, జిల్లా కార్యదర్శిలు డివి.ప్రసాద్(విశాఖపట్నం) , సోమేశ్వరరావు(శ్రీకాకుళం), క్రిష్ణారావు(విజయనగరం), రాష్ట్ర కార్యదర్శి ధర్మాంగుదుడు పాల్గొంటారని తెలియజేశారు. ఈ సమావేశాలు రాత్రి ఏడు గంటల వరకూ నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ రాష్ట్ర సమావేశాల్లో సంఘ్ చేపట్టిన కార్యక్రమాలతోపాటు, చేపట్టబోయే కార్యక్రమాలపై కూడా సుదీర్ఘ చర్చ జరుతుందని వివరించారు.

Tadepalle

2021-06-12 16:28:29

ప్రభుత్వ శాఖల్లో కోవర్టు అధికారులు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోవర్టు అధికారులు తలనొప్పిగా తయారయ్యారు..ప్రభుత్వ శాఖల్లోని పనిచేసే కొందరు అధికారులు ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను ముందుగానే లీక్ చేస్తున్నారు. ప్రభుత్వ పాలసీ ప్రకారం చేయాలనుకున్న కొన్ని కీలకమైన పనుల విషయంలో వీరి వలన అవరోధాలు ఏర్పడుతున్నాయి. అలాంటి వారంతా గత ప్రభుత్వంలోని పెద్దలకు ఈ సమాచారం అందిస్తే..వారు వారి అనుకూల మీడియాకి ఉప్పు అందించి ప్రభుత్వంపై బురదచల్లే పనికి తెగబడుతున్నారనేది ఇటీవల కాలంలో పలు అంశాల్లో తేట తెల్లమైంది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేదనే నానుడికి తగ్గట్టుగా ప్రభుత్వ శాఖల్లోని కొందరు పెద్దస్థాయిలో వున్న అధికారులే ప్రభుత్వ సమాచారాన్ని చాలా తెలివిగా బయటకు తీసుకురావడంలో సఫలీక్రుతులవుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ అనుకూల మీడియా వున్నప్పటికీ ప్రతిపక్ష నేతల అనుకూల మీడియా బయటకు తీసే కొన్ని కీలకమైన వ్యవహారాలపై కౌంటర్ ఇచ్చే దైర్యం కూడా చేయలేకపోతుంది. దీంతో ఇపుడు ఇదే రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం చేయాలనుకున్న పనిని కొన్ని సందర్భాల్లో ఒక వర్గం మీడియా ప్రజలను భయపెట్టేవిధంగా, ప్రభుత్వంపై చెడు ప్రభావం పడే విధంగా చేయడంలో కీలకభూమిక పోషిస్తుంది. ఈవిషయంలో ప్రభుత్వంలోని కొందరు అధికార ప్రతినిధులు ఉన్నప్పటికీ ఆ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడంలో విఫలం కావడం వలనే ప్రభుత్వ వ్యతిరేక మీడియా అనుకున్నది చేయగలుగుతోందని చెబుతున్నారు. అందులోనూ ప్రభుత్వం కూడా మీడియాను పట్టించుకోకపోవడం, కావాలనే పక్కన పెట్టడం, జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరించడంతో  కొన్ని మీడియా సంస్థలు ఏకంగా ప్రభుత్వం మంచి పనులు చేసినప్పటికీ వాటిని ప్రజల ముందుకి తీసుకెళ్లే ప్రయత్నం చయడం లేదు. అదేస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక మీడియ చేస్తున్న ప్రచారాన్ని తమకున్న నెట్వర్క్ తో తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేయడం లేదు. వెరసీ ప్రభుత్వంలోని కోవర్టులు ఇచ్చే కీలక సమాచారంతో ప్రభుత్వ వ్యతిరేక మీడియా ప్రజలను విభిన్నంగా ఆలోచింపజేసే విధంగా తమ వార్తా కధనాలను వండి వార్చేస్తుంది. ఈ విషయంలో మంత్రులు గానీ, ఎంపీలు గానీ, చిన్న చితకా ప్రెస్ మీట్లకే పరిమితం అవడం తప్పా.. ఆ కీలక సమాచారం ఎలా బయటకు వెళ్లిందనే విషయంలో ద్రుష్టిసారించకపోవడం కూడా ఇపుడు రాష్ట్ర్యంలో చర్చనీయాంశం అవుతుంది.

Tadepalle

2021-06-12 02:24:13

పాస్ పోర్ట్, పాన్ కార్డుతో 536 సేవలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 15003 గ్రామ, వార్డు సచివాలల్లో పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్సుతో సహా సుమారు 536 పై చీలుకు సేవలను రాష్ట్రవ్యాప్తంగా వున్న  అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటి వరకూ కేవలం సుమారు 50 సేవలు మాత్రమే ఉండే ఇక్కడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యమైన సేవలు ద్రువీకరణ పత్రాలు అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇటీవలే పాస్ పోర్టుకి దరఖాస్తులు ఏ విధంగా అప్లోడ్ చేయాలనే విషయమై గ్రామ, వార్డు డిజిటల్ అసిస్టెంట్లకు శిక్షణ కూడా ఇచ్చారు. దీనితో ఏ సేవకైనా గ్రామంలోని సచివాలయాన్నే సంప్రదించేలా ప్రభుత్వం కీలక మార్పులు చేపడుతుంది. ఇప్పటికే గ్రామ, వార్డు  సచివాలయాల్లో సుమారు 14శాఖల సిబ్బందిని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రత్యక్షంగా సేవలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో ప్రజలు తెల్లవారి లెగిస్తే ఏపనికైనా సచివాలయానికే వెళ్లేలా కార్యాచరణ రూపొందించింది. ఒకప్పుడు ఏదైనా ద్రువీకరణ పత్రం కావాల్సి వస్తే మండల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే తప్పా పనులు జరిగేవి కాదు. ఇపుడు కేవలం మూడు నుంచి వారం రోజుల్లోపే పలు ద్రువీకరణ పత్రాలు ఇంటి ముంగిటే సచివాలయాల్లోనే అందుకునే పరిస్థితిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. అయితే మిగిలిన అన్ని రకాల ప్రధాన సేవలను కూడా ఇక్కడే అందించడం ద్వారా చాలా పనులకు జిల్లా కార్యాలయాలకు కూడా తిరిగే అవసరం లేకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా రాబోయే రోజుల్లో మరింత సులువుగా అనుకున్న ద్రువీకరణ పత్రాలను గ్రామంలోనే చేయించుకునే సౌలభ్యం కలుగుతుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వంలోని శాఖలతోపాటు, కేంద్ర ప్రభుత్వంలోని మరికొన్ని శాఖలకు చెందిన ప్రభుత్వ శాఖల వెబ్ సైట్లను కూడా గ్రామసచివాలయ వ్యవస్థకు అనుసంధానం చేసే పనిలో ప్రభుత్వం నిమగ్నమైవుంది. ఆ విధానం పూర్తయితే ఎలాంటి అనుమతులైనా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పొందే వీలుంటుంది. ఒకప్పుడు పాస్ పోర్టు, పాన్ కార్డుకి దరఖాస్తు చేసుకోవాలంటే దళారులను సంప్రదించాల్సి వచ్చేది ఇపుడు ఆ ఇబ్బందులు లేకుండా నేరుగా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే వీటిని అందిస్తే ప్రజలకు మండల, జిల్లా కేంద్రాలకు వెళ్లే బాధల నుంచి విముక్తి కలుగుతుందని ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేయడం రాష్ట్రంలోనే చర్చనీయాంశం అవుతోంది. ప్రస్తుతం మీసేవా కేంద్రాల్లో లభించే సేవల కంటే అత్యధికంగా సచివాలయాల్లో ప్రజలకు అతి తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకు రావాలనేది ప్రభుత్వ యోచన. అంతేకాదు త్వరలోనే ఈ-ఆఫీస్ విధానాన్ని అమలు చేసి, జిల్లా కార్యాలయాలు మాదిరిగా పేపర్ లెస్ సచివాలయాలుగా కూడా మర్చే యోచన ప్రభుత్వం వద్ద ఉందనే సమాచారం అందుతుంది. అదే జరిగితే ఈ ఫైలింగ్ విధానం అభివ్రుద్ధి చెంది మోసాలకు తావు లేకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందడానికి వీలుపడుతుంది..!

తాడేపల్లి

2021-06-12 02:16:27

రాష్ట్రంలో పెరిగిన పడకల ఖాళీల సంఖ్య..

రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతుండడంతో పలు ఆసుపత్రుల్లో కొవిడ్ పడకల ఖాళీల సంఖ్య పెరుగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా కేసులు రిజిస్టర్ కాకపోవడంతో ఆ చికిత్సలకు బదులు ఇతర చికిత్సలకు వైద్యసేవలు అందజేస్తున్నాయన్నారు.  కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో 625 ఆసుపత్రుల్లో కొవిడ్ కు చికిత్స అందజేసేవారన్నారు. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గడంతో 454 ఆసుపత్రుల్లో కొవిడ్ నివారణ చికిత్సలు అందజేస్తున్నారన్నారు. అన్ని జిల్లాల్లో ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు.  ప్రస్తుతం 2,231 బెడ్లు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయన్నారు. 10,447 ఆక్సిజన్ బెడ్లు రోగులతో నిండి ఉండగా, 11,290 బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ వినియోగం కూడా తగ్గుతోందన్నారు. రోజువారీగా చూస్తే కేంద్ర ప్రభుత్వం...ఏపీకి 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయిస్తోందన్నారు. గడిచిన 24 గంటల్లో కేంద్ర ప్రభుత్వ నుంచి 423 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను మాత్రమే డ్రా చేశామన్నారు. కరోనా తీవ్రంగా ఉన్న రోజుల్లో 650 మెట్రిక్ టన్నుల వరకూ వినియోగించేవారమన్నారు. 

రాష్ట్రంలో తగ్గుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు..
రాష్ట్రంలో ప్రస్తుతం 1,307 బ్లాక్ ఫంగస్ యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ తో 138 మంది మృతి చెందారన్నారు. బ్లాక్ ఫంగస్ కేసులను దాచిపెడుతున్నారనే ఆరోపణలు సరికాదన్నారు. కేసులు దాచిపెట్టడం వల్ల నష్టమే కలుగుతుందన్నారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి బ్లాక్ ఫంగస్ నివారణకు రావాల్సిన ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు రాకుండా పోతాయన్నారు. కరోనా కేసులు మాదిరిగా బ్లాక్ ఫంగస్ కేసులు కూడా తగ్గుతున్నాయన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఉన్నది ఉన్నట్లుగా... ఏపీలో కరోనా కేసులు, బ్లాక్ ఫంగస్ కేసులు, వాటి వల్ల సంభవించే మరణాల సంఖ్య ఎప్పటికప్పుడు చెబుతున్నామన్నారు. 

Mangalagiri

2021-06-11 14:28:48

రాష్ట్రంలో చురుగ్గా కోవిడ్ వేక్సినేషన్..

రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతందని, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న టీకాలు ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో 1,01,863 శాంపిళ్లు పరీక్షించగా 8,239 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 61 మంది మృతి చెందారని తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు తగ్గుతున్నా శాంపిళ్లు ఎక్కువగా నిర్వహిస్తున్నామన్నారు. జూన్ 10న పాజిటివిటీ రేట్ 8.29, జూన్ 11న 8.09గా నమోదైందన్నారు. రికవరీ రేటు 94 శాతంగా నమోదవుతోందన్నారు. అదే సమయంలో మరణాలు కూడా తగ్గుముఖం పడుతున్నాయన్నారు. కరోనా కారణంగా జూన్ 10న 67 మంది మృతి చెందగా, జూన్ 11న 61 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 96,100 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు.  25 రోజుల కిందట 2,11,000 వరకూ కరోనా కేసులు నమోదయ్యాయన్నారు. వివిధ ఆసుపత్రుల్లో 15,951 చికిత్స పొందుతున్నారన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో 8,963 మంది, హోం ఐసోలేషన్ లో 71,186 మంది వైద్య సేవలు పొందుతున్నారన్నారు.  టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ద్వారా 20,500 మంది తో వైద్యలు మాట్లాడారన్నారు. గడిచి,న 24 గంటల్లో 104 కాల్ సెంటర్ కు 2,592 ఫోన్ కాల్స్ వచ్చాయని, వాటిలో వివిధ సమాచారాలకు 1,387 కాల్స్, అడ్మిషన్ల కోసం 319 ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు. 

Mangalagiri

2021-06-11 14:27:19