1 ENS Live Breaking News

రాష్ట్రంలో 3 మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రులు..

రాష్ట్రంలో చిన్నారులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడానికి మూడూ పిడియాట్రిక్స్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. విశాఖలోని రాణి చంద్రమయి దేవీ గవర్నమెంట్ రిహాబిలిటేషన్ సెంటర్ పేరు మీదుగా 1965లో భూముల కేటాయించారన్నారు. వాటిలో రూ.200 కోట్ల వ్యయంతో 500 పడకల మల్టీ స్సెఫాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఏడాదిన్నర కిందట డీపీఆర్ రూపొందించారన్నారు. ఈ నిధులు వెంటనే మంజూరు చేసి ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీంతో పాటు రాయలసీమ రీజియన్ గా తిరుపతిలో, కోస్తాంధ్రా  రీజియన్ గా గుంటూరు/విజయవాడలో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైన భూములు, డీపీఆర్ సిద్ధం చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. 45 ఏళ్లు పైబడిన వారు, హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 55 శాతం మందికి కనీసం ఒక డోసు ఇచ్చామన్నారు. వారిలో 57,07,706 మందికి ఒక డోసు, 25,80,432 మందికి రెండు డోసులు వేశామని తెలిపారు. 
రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం(జూన్ 6) సాంయత్రం వరకూ 1,623 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయన్నారు. ఈ కేసుల నివారణకు కేంద్ర ప్రభుత్వం నుంచి 13,105 ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు వచ్చాయన్నారు. వాటిలో 1,225 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని, మిగిలినవి రోగులకు ఇంజక్షన్ చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం  91,650 ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్ల కొనుగోలుకు ఆర్డర్లిచ్చిందన్నారు. ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లను కేంద్ర ప్రభుత్వమే కోటా ప్రకారం రాష్ట్రాలకు కేటాయిస్తోందన్నారు. బ్లాక్ ఫంగస్ నివారణకు అవసరమైన పొసకొనజోల్ ఇంజక్షన్లను, మాత్రలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు. ఇప్పటి వరకూ 12,250 పొసకొనజోల్ ఇంజక్షన్లను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. వాటితో పాటు 1,01,980 పొసకొనజోల్ మాత్రలను కొనుగోలు చేయగా, ప్రస్తుతం 68,543 మాత్రలు అందుబాటులో ఉన్నాయన్నారు. 

Tadepalle

2021-06-07 17:16:08

థర్డ్ వేవ్ నివారణకు ప్రత్యేక చర్యలు..

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే రోజుల్లో కరోనా థర్డ్ వేవ్ వ్యాపించ వచ్చునంటూ నిపుణుల సూచనల మేరకు ముందుస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని  సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొవిడ్ సమీక్షా సమావేశంలో సూచించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఇప్పటికే థర్డ్ వేవ్ వస్తే చేపట్టే నివారణ చర్యలపై ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించిందన్నారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు, పిడియాట్రిక్  కేసులు వస్తే, నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేదానిపైనా సీఎం చర్చించారన్నారు. కరోనా రెండు వేవ్ ల ఆధారంగా తీసుకుని బాధితుల వయస్సు జాబితాను దేశ, రాష్ట్రం వారీగా చర్చించామన్నారు. దేశ వ్యాప్త డేటా చూస్తే... 0 నుంచి 10 ఏళ్ల లోపు దేశంలో 3.35 శాతం, ఏపీలో  2.72 శాతం, 11 నుంచి 20 ఏళ్ల లోపు దేశంలో8.38 శాతం, ఏపీలో 8,35, 21-30 ఏళ్ల లోపు 21.79 శాతం, ఏపీ లో 20.28 శాతం, 31-40 ఏళ్లలోపు దేశంలో 21.91 శాతం, ఏపీలో 21.29 శాతంగా నమోదయ్యిందన్నారు. మొత్తంగా ఏపీలో ఏపీలో 20 ఏళ్లలోపు 11 శాతం మందిగా గుర్తించామన్నారు. థర్డ్ వేవ్ లో పిడియాట్రిక్ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదయితే,  ఐసీయూ, పిడియాట్రిక్ బెడ్లు, వెంటిలేటర్లు, పిల్లలకు ఇచ్చే సిరప్ లు, మాస్కులు, మందులు ఎన్ని కావాలి..? వాటిని ముందుగానే కొనుగోలు చేసేలా కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. అన్ని టీచింగ్‌ ఆస్పత్రుల్లో పీడియాట్రిక్‌ వార్డులు ఏర్పాటు చేయాలని, పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో అవకాశం ఉన్నచోట పిల్లలకు చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని, చిన్న పిల్లల వైద్యులను రిక్రూట్ మెంట్ చేసుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి  ఆదేశించారన్నారు. 

Tadepalle

2021-06-07 16:09:17

రాష్ట్రంలో 3 మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రులు..

రాష్ట్రంలో చిన్నారులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడానికి మూడూ పిడియాట్రిక్స్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. విశాఖలోని రాణి చంద్రమయి దేవీ గవర్నమెంట్ రిహాబిలిటేషన్ సెంటర్ పేరు మీదుగా 1965లో భూముల కేటాయించారన్నారు. వాటిలో రూ.200 కోట్ల వ్యయంతో 500 పడకల మల్టీ స్సెఫాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఏడాదిన్నర కిందట డీపీఆర్ రూపొందించారన్నారు. ఈ నిధులు వెంటనే మంజూరు చేసి ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీంతో పాటు రాయలసీమ రీజియన్ గా తిరుపతిలో, కోస్తాంధ్రా  రీజియన్ గా గుంటూరు/విజయవాడలో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైన భూములు, డీపీఆర్ సిద్ధం చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. 45 ఏళ్లు పైబడిన వారు, హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 55 శాతం మందికి కనీసం ఒక డోసు ఇచ్చామన్నారు. వారిలో 57,07,706 మందికి ఒక డోసు, 25,80,432 మందికి రెండు డోసులు వేశామని తెలిపారు. 
రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం(జూన్ 6) సాంయత్రం వరకూ 1,623 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయన్నారు. ఈ కేసుల నివారణకు కేంద్ర ప్రభుత్వం నుంచి 13,105 ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు వచ్చాయన్నారు. వాటిలో 1,225 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని, మిగిలినవి రోగులకు ఇంజక్షన్ చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం  91,650 ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్ల కొనుగోలుకు ఆర్డర్లిచ్చిందన్నారు. ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లను కేంద్ర ప్రభుత్వమే కోటా ప్రకారం రాష్ట్రాలకు కేటాయిస్తోందన్నారు. బ్లాక్ ఫంగస్ నివారణకు అవసరమైన పొసకొనజోల్ ఇంజక్షన్లను, మాత్రలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు. ఇప్పటి వరకూ 12,250 పొసకొనజోల్ ఇంజక్షన్లను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. వాటితో పాటు 1,01,980 పొసకొనజోల్ మాత్రలను కొనుగోలు చేయగా, ప్రస్తుతం 68,543 మాత్రలు అందుబాటులో ఉన్నాయన్నారు. 

Tadepalle

2021-06-07 16:04:21

పిల్లల తల్లులకూ కోవిడ్ వాక్సిన్..

కరోనా థర్డ్ వేవ్ వస్తుందన్న నిపుణుల సూచనలతో ముందు జాగ్రత్తతో రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్లలోపు పిల్లలు ఉన్న తల్లులకు వ్యాక్సిన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్లలోపు పిల్లలు కలిగిన తల్లులు 15 లక్షల నుంచి 20 లక్షల వరకూ ఉండొచ్చునని, వారికి కూడా 45 ఏళ్లు పైబడిన వారితో కలిసి టీకాలు వేయనున్నామని, దీనికి సంబంధించిన విధివిధానాలను అన్నిజిల్లా కలెక్టర్లకు జారీచేయనున్నామని చెప్పారు. కరోనా చికిత్సల నిమిత్తం రాష్ట్రంలో 600లకు పైగా ప్రైవేటు ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతులిచ్చామన్నారు. థర్డ్ వేవ్ ను దృష్టిలో పెట్టుకుని వాటిలో పిడియాట్రిక్ కేసుల చికిత్స, వాటిలో పిడి యాట్రిక్ వార్డులు, ఇతర మౌలిక సదుపాయల కల్పనకు గల అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. చిన్న పిలల్లకు కరోనా పాజిటివ్ వస్తే, చికిత్స సమయంలో వారితో పాటు ఆసుపత్రుల్లో తల్లులు కూడా ఉండాల్సి ఉంటుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు సింఘాల్ వివరించారు..

తాడేపల్లి

2021-06-07 15:38:54

Tadepalle

2021-06-06 11:17:47

ఇక్కడా రోగనిర్ధారణ పరీక్షలు జరగవు..

డా.వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ ఈ పేరు వినగానే  దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయంగా వచ్చి వైద్యం చేసినంత అనుభూతి కలుతుంది.. కానీ ఏం సుఖం లక్షల ఖర్చుచేసి భవనం నిర్మించి, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు, ఏఎన్ఎంలతో సుమారు 100 రకాల మందులు ఏర్పాటు చేస్తున్నా ప్రభుత్వం నిర్ధేశించిన 12 వైద్యసేవల్లో ప్రధానంగా ఉండాల్సిన రోగ నిర్ధారణ పరీక్షలు(షుగరు,రక్తం, మూత్రం, మలం, జ్వరం) ఊసెత్తలేదు ప్రభుత్వం. రోగ నిర్ధారణ కాకుండా ఏ జబ్బుకి ఏ మందులిస్తారో కూడా తెలియని పరిస్థితి. తద్వారా గ్రామాల్లో క్లినిక్ లు ఏర్పాటు చేసినా రోగ నిర్ధారణ పరీక్షకోసం ప్రైవేటు ల్యాబ్ లను ఆశ్రయించక తప్పటట్టులేదు. అలా కాకుండా పీహెచ్సీల్లో అయినా పూర్తిస్థాయిలో పరీక్షలు చేయించుకుందామంటే ఆసుపత్రుల్లో మెడికల్ ల్యాబ్ లు సక్రమంగా లేవు. ల్యాబ్ లున్న ఉన్నచోట ల్యాబ్ టెక్నీషియన్ లేడు, టెక్నీషియన్ ఉన్నచోట ల్యాబ్ లు, పరికరాలు, మెడికల్ కిట్లు లేవు.. కనీసం విలేజ్ హెల్త్ క్లినిక్ లలో అయినా ప్రభుత్వం ప్రాధమిక వైద్యం అందించడానికి రోగ నిర్ధారణ గ్రామాల్లో చేస్తుందని ఆశపడ్డ రోగులకు నిరాసే ఎదురైంది.  ఏ రోజైతే గ్రామస్థాయిలో ప్రాధమిక వైద్యం రోగనిర్ధారణతో అందుబాటులోకి వస్తుందో ఆరోజే ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడినట్టు అనేవారు వైఎస్సార్ ఎప్పుడూ..ఆ మాటలను నిజం చేస్తూ ఏర్పాటవుతున్న విలేజ్ హెల్త్ క్లినిక్ లలో రోగ నిర్ధారణ పరీక్షలు కూడా ఏర్పాటు చేస్తే.. మెడికల్ టెస్టుల కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించే భారం తప్పేది. ప్రస్తుతం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 10032 విలేజ్ హెల్త్ క్లినిక్ లను అందుబాటులోకి తెస్తుంది. వీటికోసం గత ఏడాది 2920 పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం కొత్తగా మరో ఏడువేల పోస్టులను భర్తీ చేసి వారి ద్వారా ప్రజలకు సేవలు అందించాలనేది ప్రభుత్వ ఆలోచన. ప్రజలకు సేవలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యం బాగానే ఉన్నా దానిని అమలు చేసే విధానంలోనే ప్రధాన లోపాలు కనిపిస్తున్నాయి.. రోగి వ్యాధిని పరీక్ష చేసి నిర్ధారణ అయిన తరువాత మందులిస్తే రోగం నయం అవుతుంది..అంతే తప్పా రోగం లక్షణాలు తెలుసుకొని మందులిస్తే... చీకటిలో బాణం వేసినట్టుగా ఒక్కోసారి మాత్రమే పనిచేస్తాయి. తరువాత మళ్లీ మళ్లీ మందులివ్వాలి.. ఇక్కడ ప్రభుత్వానికి సూచనలు చేసిన అధికారులు కూడా ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. వైద్యమంటేనే రోగ నిర్ధారణ.. కేవలం ఆ ఒక్క విషయంతోనే ప్రైవేటు ఆసుపత్రులు లక్షల రూపాయలు రోగులకు వైద్యపరీక్షల పేరుతో బిల్లులు వేస్తాయి. అలాంటిది ప్రభుత్వం నిర్మించే ఆసుపత్రులు, విలేజ్ క్లినిక్ లలో రోగ నిర్ధారణ పరీక్షలు(మెడికల్ టెస్టులు, మెడికల్ ల్యాబ్ లు) చేసే అవకాశం కల్పించకపోతే... రోగ నిర్ధారణ ఎలా జరుగుతుందనే విషయాన్ని వైద్యఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఒక్క ఉన్నతాధికారి కూడా ప్రభుత్వానికి సూచింకపోవడం దురద్రుష్టకరం. అలాగని పీహెచ్సీల్లో ఇద్దరు వైద్యులు, ఇద్దరు స్టాఫ్ నర్సులను, ఇద్దరు ఏఎన్ఎంలను నియమించినట్టుగా ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు ప్రభుత్వం నియమించిందా అంటే అదీ లేదు. ఒక్క ల్యాబ్ టెక్నీషియన్ తో అరకొరగా సేవలు అందిస్తుంది. కనీసం ఒక్కో పీహెచ్సీ పరిధిలోనైనా రెండో ల్యాబ్ టెక్నీషయన్ ను పూర్తిస్థాయిలో మెడికల్ కిట్ల తో ఏర్పాటు చేసినా, విలేజ్ క్లినిక్ ల నుంచి రక్త పరీక్షల కోసం పీహెచ్సీలకు రోగులకు రోగనిర్దారణ కోసం పంపడానికి వీలుపడేది. అలాకాకుండా ఇప్పటికే ఒక్కో గ్రామ సచివాలయానికి ఒక ఆరోగ్య సహాయకులను ప్రభుత్వం నియమించినా మళ్లీ మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పేరుతో మరో పోస్టును క్రియేట్ చేసి మరీ ఇక్కడ భర్తీచేస్తున్నారు. వాస్తవానికి ఈ పోస్టు అవసరమనే చెప్పాలి. దానికి కారణం కూడా లేకపోలేదు.. ఎందుకంటే ఇప్పటికే ఒక్కో గ్రామసచివాలయ పరిధిలో ఒక్కో ఏఎన్ఎం నియమించబడ్డారు. ఇపుడు అదనంగా నియమించే వారి స్థానంలో ల్యాబ్ టెక్నీషియన్లను నియమిస్తే ప్రజలకు తొలుత రోగ నిర్ధారణ జరుగుతుంది. ఇప్పటికే గ్రామంలో విధి నిర్వహణలో వున్న సచివాలయ ఏఎన్ఎంను హెల్త్ క్లినిక్ అనుసంధానిస్తే ప్రాధమిక వైద్యం వారి ద్వారానే అందుతుంది. ముఖ్యంగా ల్యాబ్ టెక్నీషియన్లును నియమించడం ద్వారా వయస్సు మళ్లిన వారికి సుగరు పరీక్షలు, గర్భిణీ స్త్రీలు, పాఠశాల విద్యార్ధులకు రక్త పరీక్షలు చేయడానికి ఆస్కారం వుంటుంది. రోగ నిర్ధారణ చేసిన తరువాత సదరురోగానికి సరైన మందు ఇవ్వడం ద్వారా రోగాలను అనుకున్న స్థాయిలో నియంత్రించడానికి ఆస్కారం వుంటుంది. అంతేకాకుండా రోగ నిర్ధారణ కోసం ప్రైవేటు ల్యాబ్ లను ఆశ్రయించే భారం కూడా ప్రజలకు తప్పుతుంది. ఎంతో ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న విలేజ్ క్లినక్ లలో ల్యాబ్ టెక్నీషియన్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం ప్రజలకు అందించాలనుకున్న ప్రాధమిక వైద్యసేవలు పూర్తిగా అందించడానికి వీలుపడుతుంది. లేదంటే మేడిపండు చందంగానే తయారవుతాయి డా.వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు కూడా ఇదేదో కావాలని అంటున్నమాట కాదు 12 రకాల వైద్యసేవల్లో రోగ నిర్ధారణ పరీక్షలను చేర్చకపోవడంపై ప్రజల నుంచి వస్తున్న స్పందనే ఈ ప్రత్యేక కధనానికి పునాది అనే విషయాన్ని తెలియజేస్తున్నాం..వైద్యో నారాయణో హరి..!

Tadepalle

2021-06-06 04:14:14

నెల రోజుల్లో వేక్సినేషన్ పూర్తిచేస్తాం..

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే నెల రోజుల్లో 45 ఏళ్లు పైబడిన వారికి కోవిడ్ వేక్సినేషన్ పూర్తి చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అమరావతిలోని తన చాంబర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికే 50 శాతానికి 45ఏళ్లు నిండిన వారికి ఒక వ్యాక్సిన్ వేశామని, రాబోయే నెల రోజుల్లో మిగిలిన వారందరికీ పూర్తి స్థాయిలో టీకాలు వేస్తామని చెప్పారు.  సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు పెంచిన స్టయిఫండ్ ను గతేడాది సెప్టెంబర్ నుంచి వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 24 గంటల్లో 88,441 శాంపిళ్లు పరీక్షించగా, 10,373 కరోనా కేసులు నమోదయ్యాయని, 80 మంది మృతి చెందారని తెలిపారు. శుక్రవారం 85,311 శాంపిళ్లు పరీక్షించగా,, 10,413 కరోనా కేసులు నమోదయ్యాయని, 83 మంది మృతి చెందారని వెల్లడించారు. గత రెండ్రోజుల నుంచి రాష్ట్రంలో కరోనా కేసులు 10 వేలకు అటు ఇటుగా నమోదవుతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం మధ్యాహ్నానికి 1,774 ఐసీయూ బెడ్లు, 8,164 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. శుక్రవారం చూస్తే 1,664 ఐసీయూ బెడ్లు, 8,186 ఆక్సిజన్ బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలోనూ రోజు రోజుకూ కరోనా బాధితుల సంఖ్య తగ్గుతూ వస్తోందన్నారు. శనివారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొవిడ్ కేర్ సెంటర్లలో 12,247 మంది చికిత్స పొందుతున్నారన్నారు. 3,247 మంది డిశ్ఛార్జి కాగా, 1,248 మంది వివిధ ఆసుపత్రుల్లో అడ్మిషన్ పొందారన్నారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం రోజువారీగా 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించగా, కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో గడిచిన 24 గంటల్లో 406 మెట్రిక్ టన్నులు ఆక్సిజన్, శుక్రవారం 356 మెట్రిక్ టన్నులను డ్రా చేశామన్నారు. రాష్ట్రంలో 1,460 బ్లాక్ ఫంగస్ కేసులను గుర్తించామన్నారు. 104 కాల్ సెంటర్ కు వస్తున్న ఫోన్ కాల్స్ సంఖ్య కూడా రోజు రోజుకూ తగ్గుతోందన్నారు. గడిచిన 24 గంటల్లో 3,061 ఫోన్ కాల్స్ రాగా, శుక్రవారం 3,351 కాల్స్ వచ్చాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హోం ఐసోలేషన్ లో ఉన్న 24,706 మంది కరోనా బాధితులతో టెలీ కాల్ మెడిసిన్ సెంటర్ ద్వారా వైద్యులు ఫోన్ చేసి మాట్లాడారన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులతో పాటు మరణాల రేటు కూడా తగ్గుముఖం పడుతోందన్నారు.

Tadepalle

2021-06-05 14:36:44

వైద్యం ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది..

వైద్యఆరోగ్యశాఖలో కరోనాతో బాధపడే వారికి అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అమరావతిలోని తన చాంబర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు..  కరోనాతో కారంచేడు పీహెచ్సీ వైద్యులు డాక్డర్ ఎన్ భాస్కరరరావు తీవ్ర అస్వస్థతకు గురై, సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారన్నారు. డాక్టర్ భాస్కరరావుకు మెరుగైన వైద్యమందించడానికి రూ.1.50 కోట్లను సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సాయమందించారన్నారు. ఇటువంటి కేసులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు రూ.45 వేల నుంచి 70 వేల వరకూ పెంచిన స్టయిఫండ్ ను గతేడాది సెప్టెంబర్ నుంచి వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జనవరి నుంచి అమలు చేయాలని తొలుత భావించామని, సెప్టెంబర్ 2020 నుంచి పెంచిన స్టయిఫండ్ అందజేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారన్నారు. కొవిడ్ విధుల్లో పాల్గొంటున్న మూడో సంవత్సరం చదువుతున్న పీజీ విద్యార్థులకు కూడా పెరిగిన స్టయిఫండ్ ను అందించనున్నట్లు ఆయన తెలిపారు. పీజీ విద్యార్థులు ఏప్రిల్ 30 తరవాత విధుల్లోకి చేరారని, ఆనాటి నుంచి పెంచిన స్టయిఫండ్ అందిస్తామని తెలిపారు. వారి వార్షిక పరీక్షలను జులై లో నిర్వహించడానికి హెల్త్ యూనివర్శిటీ నిర్వహించనునందన్నారు. పరీక్షల్లో పాల్గొన్నా జులై 31 వరకూ పెంచిన స్టయిఫండ్ ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారన్నారు. రాష్ట్ర్ర స్థాయి కొవిడ్ కమాండ్ కంట్రోల్ కమిటీ సమావేశం శనివారం జరిగిందన్నారు. ఈ సమావేశంలో థర్డ్ వేవ్ వస్తుందన్న సూచనల మేరకు, ఎంతమంది కరోనా బారిన పడతారో అంచనా వేసి వైద్య పరికరాలు, మందులు కొనుగోలుపైనా, ఐసీయూ బెడ్లు ఏర్పాటుపైనా చర్చించామన్నారు. జిల్లాల వారీగా డేటా సేకరించిన తరవాత ఆ కమిటీ ఇచ్చే రిపోర్టును సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళతామన్నారు. 

Tadepalle

2021-06-05 14:31:20

రాష్ట్రంలో 1.64 కోట్ల వేక్సిన్లు పంపిణీ..

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ 1,06,47,444 డోసులు పంపిణీ చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అమరావతిలోని తన చాంబర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. శుక్రవారం సాయంత్రం వరకూ రాష్ట్ర వ్యాప్తంగా వాటిలో 25,65,162 మందికి రెండు డోసులు, 55,13,120 మందికి ఒక డోసు వేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద శుక్రవారం సాయంత్రానికి 3,22,220 డోసుల స్టాక్ ఉందని, వాటిని శనివారం పంపిణీ చేసినట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 45 ఏళ్లు పైబడిన వారికి 53.08 శాతం మేర కనీసం ఒక డోసు వ్యాక్సిన్ వేశామన్నారు. రాష్ట్రంలో 45 ఏళ్లు పైబడిన వారికి 1,33,07,889 మంది ఉండగా, వారిలో. 18,66,082 మందికి రెండు డోసులు, 47,91,032 మందికి ఒక డోసు వేశామన్నారు. 45 ఏళ్లు పైబడిన జనాభాలో 50 శాతం మందికి కనీసం ఒక టీకా వేసినట్లు ఆయన తెలిపారు. 

Tadepalle

2021-06-05 14:10:12

Tadepalle

2021-06-05 03:08:50

2021-06-05 01:58:44

20మంది ఐఏఎస్ అధికారులకు బదిలీ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ ఉత్తర్వులు జారీచేశారు.  రాష్ట్రప్రభుత్వం ఏర్పాటైన తరువాత పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం ఇది రెండవ సారి. అయితే చాలా జిల్లాల్లో సమర్ధవంతంగా పనిచేసిన ఐఏఎస్ అధికారులను బదిలీచేయడం విశేషం..కాగా రెండేళ్లు, మూడేళ్లు దాటిన ఐఏఎస్ అధికారుల పేర్లను ఈ బదిలీల్లో చేర్చపోవడం కూడా చర్చనీయాంశం అవుతుంది. మరోవైపు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన జేసి-4(హౌసింగ్) కి కొందరు ఐఏఎస్ అధికారులను నియమించింది. కీలకమైన ఏపీఈపిడిసిఎల్ లాంటి సంస్థకు అధికారిని నియమించకపోగా లోపల ఉన్న అధికారులకే అదనపు బాధ్యతలు అప్పగించడం విశేషం.

Tadepalle

2021-06-04 16:26:18

శ్రీ కనక దుర్గమ్మ సేవలు ఆన్ లైన్ లో..

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేయున్న శ్రీశ్రీశ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివర్ల దేవస్థానంలోని శ్రీ కనక దుర్గమ్మ తల్లి వారి ఆన్ లైన్ సేవలకు విశేషంగా స్పందన వస్తుందని ఈఓ డి.బ్రమరాంబ తెలియజేశారు.  శుక్రవారం ఈ మేరకు మీడియాకి ప్రకటన విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో  భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం లేకపోవడంతో దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏర్పాటు చేసి ఈ ఆన్ సేవల్లో పాల్గొనడానికి భక్తులు ముందుకి వస్తున్నారన్నారు. అమ్మవారి సేవలు గుగూల్ మీట్ లింక్ ద్వారా  google meet link (https://meet.google.com/nuw-kwsy-xsc)ద్వారా భక్తులు పాల్గొని తిలకించే విధంగా ఏర్పాట్లు చేసినట్టు ఆమె వివరించారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఈఓ కోరుతున్నారు.

Vijayawada

2021-06-04 02:55:41

ఆర్టీఐ కమిషనర్ల ప్రమాణ స్వీకారం..

ఎపి సమాచార కమీషన్ లో రాష్ట్ర సమాచార కమీషనర్లుగా నియమితులైన యు.హరిప్రసాద్ రెడ్డి, కె.చెన్నారెడ్డి లు శుక్రావారం ప్రమాణం చేయనున్నారని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (జిపియంఅండ్ ఎఆర్) కె.ప్రవీణ్ కుమార్ తెలియజేశారు.రేపు మధ్యాహ్నం 12గం.లకు అమరావతి సచివాలయం మొదటి భవనం సియం సమావేశ మందిరంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ చే హరిప్రసాద్ రెడ్డి,చెన్నారెడ్డిలతో రాష్ట్ర సమాచార కమీషనర్లుగా ప్రమాణం(Administered Oath)చేయించనున్నారని ఆయన తెలిపారు. సమాచార హక్కు చట్టం 2005 కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 53 తేది.25-5-2021 ద్వారా రాష్ట్ర సమాచార కమీషన్ కు కమీషనర్లుగా హరిప్రసాద్ రెడ్డిని,చెన్నారెడ్డిని నియమించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర సమాచార కమీషనర్ గా నియమితులైన కాకర్ల చెన్నారెడ్డి వైయస్సార్ కడప జిల్లా కలసపాడు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందినవారు.ఎంకామ్ ఎల్ఎల్బి విద్యార్హత కలిగి  రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం లోను,జిల్లా కోర్టుల్లోను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఈవృత్తిలో 15యేళ్ళకు పైగా అనుభవం కలిగి ఉన్నారు.ఆయన ముఖ్యంగా వివిధ సివిల్,క్రిమినల్ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులతో పాటు మానవ హక్కుల కమీషన్,ఆర్బిట్రేషన్,భూ,రెవెన్యూ, లేబర్,వినియోగదారుల,పరోక్ష పన్నులకు సంబంధించిన పలు కేసుల పరిష్కారంపై కృషి చేస్తుంటారు. అలాగే మరో సమాచార కమీషనర్ గా నియమితులైన యు.హరిప్రసాద్ రెడ్డి సీనియర్ జర్నలిస్టుగా జర్నలిజం రంగంలో విశేష అనుభవం కలిగి ఉన్నారు.ఆయన జర్నలిజం రంగంలో సుమారు 20యేళ్ల వరకూ అనుభవం కలిగి ఉన్నారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి చరిత్ర విభాగంలో మాస్టర్ డిగ్రీ పొందిన ఈయన ప్రధానంగా రాజ్యాంగ విలువలు,డెమోక్రాటిక్ కల్చర్,ప్రాధమిక హక్కులు వంటి అంశాల్లో అనుభవం కలిగి ఉన్నారు. తెలుగు డైలీలో 1000వరకూ ఎడిటోరియల్ పేజిలో ఆర్టికల్స్ వ్రాశారు.

Tadepalle

2021-06-03 16:38:43

పలు రాష్ట్రాల సీఎంలకు జగన్ లేఖ..

ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ వేయాలని గ్లోబల్ టెండర్లు పిలుస్తున్నా ఎవరూ ముందుకు రావడం లేదని  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ టీకా వేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారన్నారు. ఇదే విషయమై దేశంలోని ముఖ్యమంత్రులందరూ కేంద్రాన్ని కోరాలంటూ పలు రాష్ట్రాల సీఎంలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాసినట్లు సింఘాల్ వివరించారు. ఈ ఏడాది జనవరి 16 తేదీన చేపట్టినట్లు దేశ ప్రజలందరికీ కేంద్రమే వ్యాక్సిన్ వేయాలన్నారు.  దీనివల్ల దేశ ప్రజలకు మేలు కలుగుతుందని ఆ లేఖలో సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారన్నారు. కోవిడ్ విషయంలో ఎప్పటికప్పుడు సీఎం రాష్ట్ర అధికారులు, జిల్లా కలెక్టర్లతో సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారని వివరించారు.

Tadepalle

2021-06-03 16:36:32