1 ENS Live Breaking News

సచివాలయ ఉద్యోగులకు కొత్త విధులు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి శాఖల వారీగా ప్రత్యేక జీఓల ఆధారంగా వారికి అనంగా చేర్చిన విధులు, సేవలను తెలియజేస్తుంది. ఇప్పటికే  గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శిలుగా వున్న వారిని జీఓ నెంబరు 59 ద్వారా సాధారణ పోలీసులుగా మార్చడంతోపాటు కాఖీ యూనిఫారం ఇచ్చింది. దానిని అన్ని జిల్లా ఎస్పీలు అమలు చేస్తున్నారు. ఇపుడు మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డు పారిశుధ్య, పర్యావరణ కార్యదర్శిలకు జీఓనెంబరు 650ని విడుదల చేసింది. అందులో సచివాలయ ఉద్యోగులు ఏవిధంగా పనిచేయాలనే విషయం తెలియజేయడంతో వాటిని రాష్ట్రంలోని అన్ని పట్టణ పురపాలక శాఖల కమిషనర్లకు కూడా తెలియజేయడంతో ఉద్యోగులకు దిశా నిర్ధేశం చేస్తున్నారు. మిగిలిన ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు దశల వారీగా జీఓల ద్వారా విధులును తెలియజేసే పనిలో పడింది. గతంలో ఉద్యోగులు విధుల్లో చేరినపుడు వీరందరికీ ఒక జాబ్ చార్ట్ ప్రభుత్వం అధికారిక వెబ్ సైట్ ద్వారానే తెలియజేసింది. ఇపుడు ప్రత్యేకంగా శాఖల వారీగా జీఓల రూపంలో కొత్తగా రూపొందించిన విధులను తెలియజేయడం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో సేవలను 545కి పెంచిన నేపథ్యంలో ఉద్యోగుల విధులు కూడా ఆయా ప్రభుత్వ శాఖలకు అనుగుణంగా ఉండేందుకు వీలుగా కొత్తగా తయారు చేస్తుందని రాష్ట్ర అధికారి ఒకరు ఈఎన్ఎస్ కు ప్రత్యేకంగా తెలియజేశారు. ప్రభుత్వం సచివాలయాల ద్వారానే అన్ని సేవలు అందించాలనే లక్ష్యంతోనే కొత్తగా రూపొందించిన విధులను అధికారిక జీఓల ద్వారా తెలియజేస్తుందని వివరించారు. దానికితోడు, సమాచార హక్కుచట్టాన్ని కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయాలని భావించిన తరుణంలో సచివాలయ వ్యవస్థలో దాపరికంలేని సేవలు అందించాలనే ఉద్దేశ్యంలో ఉద్యోగులకు చెందిన విధులను ఆయాశాఖల ముఖ్య కార్యదర్శిల ద్వారా జీఓలు విడుదల చేయిస్తుందని చెబుతున్నారు. సచివాలయానికి వచ్చిన దగ్గర నుంచి శాఖల వారీగా ఎంతమంది సిబ్బంది ఎన్ని దరఖాస్తులను పరిష్కరించారనే విషయంలోనూ ఇకపై ప్రభుత్వం లెక్కలు తేల్చనుందని సమాచారం అందుతుంది. గ్రామ సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తరువాత చాలా సమస్యలు గ్రామస్థాయిలో పరిష్కారం కావడం లేదు. సచివాలయ సిబందే మండల, జిల్లా కార్యాలయాలకు పంపుతున్నారు. కొన్నింటిని సచివాలయాల్లో చేసే అవకాశం వున్నా సక్రమంగా చేయడం లేదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించే కొత్తగా జీఓల రూపంలో విధులు ఉటంకిస్తూ జీఓలు జారీచేస్తుందని అధికారులు చెబుతున్నారు.  ఇకపై రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వారీగా ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులెన్ని, పరిష్కరించినవి ఎన్ని అనే విషయాలను డాష్ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు నేరుగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రభుత్వంలోని ముఖ్యశాఖల అధిపతులే సమీక్షనున్నారని కూడా తెలుస్తుంది. ఇంకా వ్యవశాఖ, పట్టు పరిశ్రమశాఖ, ఉద్యానశాఖ, ఇంజనీరింగ్, సంక్షేమశాఖ, వీఆర్వోలు, సర్వేయర్లు, పంచాయతీ కార్యదర్శిలకు కూడా కొత్త విధులపై జీఓలు ప్రభుత్వం జారీచేయనుందని గ్రామ, వార్డు సచివాలయ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రజలకు పూర్తిస్థాయిలో గ్రామంలోనే సేవలు అందాలంటే ఉద్యోగులకు జాబ్ చార్ట్ లిఖిత పూర్వకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ ఏర్పాటు చేస్తుందని చెబుతున్నారు. అన్నిశాఖల సిబ్బందికి వారి వారి విధులు, సేవలపై ప్రత్యేక జీఓలు వస్తే తప్పా..కొత్తగా వారి విధుల్లో ఏఏ కొత్త సేవలు అదనంగా చేర్చారనే విషయం కొలిక్కిరాదు..! 

Tadepalle

2021-07-04 02:32:52

పచ్చరాతలు.. పచ్చికూతలు అన్నన్నా..

‘నవ్విపోదురుగాక..నాకేటి సిగ్గు...’అన్నట్టు మీకనిపించలేదా పచ్చరంగు పులుముకున్న వారందరికీ.. పచ్చ పచ్చని రాతాలు రాసేవారందరికీ.. నిన్నటి పుట్టిన రోజు వేడకలను ప్రశ్నించిన ఆచార్యులంతా చదువులమ్మ ఒడి ఆంధ్రాయూనివర్శిటీ మైదనాంలో నాడు మహానాడు జరుగుతున్న సమయంలో ఏం చేశారు..ఇంకేం పీకారు.. ఓహో సిగ్గుతో రాజకీయ ప్రశంగాలు వినకలేక చెవులు మూసుకున్నారా.. రాజకీయనాయలు నేరుగా వచ్చి చదువులమ్మ ఒడిలో సభలు పెడితే చూడలేక కల్లు కుట్టుకున్నారా.. నాడు చేయని ఆందోళనలు.. బాధ నేడేంటని మీకు అనిపించలేదా.. నేడు ఆ పచ్చ విద్యార్ధులే ఇపుడు ఎందుకు ప్రశ్నిస్తున్నట్టో కనీసం అర్ధం చేసుకోలేని ప్రజలున్నారంటారా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపడుతున్న అభివ్రుద్ధిని చూసి ఓర్వలేని వారంతా పుట్టిన రోజు వేడుకలను రాజకీయం చేయాలని చూస్తే.. ఏకంగా నాడు.. మహానాడుతో వారు చేసిన రాజకీయం మేము చేస్తే.. సంసారం.. మీరు చేస్తే వ్యభిచారం.. అన్నట్టుగా చిత్రీకరించే ఆ పక్షనేతలు.. ఈ పచ్చరాతలు.. నిజంగానే మాటల కందని అర్ధాలు తీసినట్టుగానే ఉన్నాయి. భావ ప్రకటన అభిమానాన్ని కేకు కట్ చేస్తే.. చూపిస్తే.. చదువులమ్మ తల్లి పరువుపోయిందా.. అన్నన్నా.. ఎంత మాట ఎంతమాట.. కలం కల్మషంగా రాయాలి తప్పా.. కలం కలుషితంగా మారి అక్షరాలు రాస్తే.. అవి వక్రభాష్యాన్నే చూపుతాయనడానికి ఎంపీ వి.విజయసాయిరెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఆంధ్రాయూనివర్శిటీలో జరిగినందుకు రాసిన పచ్చరాతలే నిదర్శనంగా కనిపిస్తున్నాయని ఆరోపిస్తున్నారు ఆంధ్రరాష్ట్ర ప్రజలు..నిజమైన ఆచార్యాలు..రాజకీయాలు చేయని విద్యార్ధులు..

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో వున్న వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులపై రాజకీయ బురద చల్లేందుకు చదువలమ్మ ఒడి.. ఆంధ్రాయూనిర్శిటీని వేదిక చేసుకోవడం నిజంగా సిగ్గుచేటని గుండెలు అవిసేలా బాధుకొని రాజకీయం చేసేవారంతా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి సూచిస్తున్నారు వాస్తవాలు తెలిసిన వారంతా.. ఒక వేల వారి వేలే ముందుకి చూపిస్తే నాలుగు వేళ్లు తప్పుచేసిన వారిపైనే చూపిస్తాయనే విషయం మరిచిపోకూడదు అలాంటపుడు అంటూ హితబోద చేస్తున్నారు. విసి చాంబర్ లో  రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసినందుకు..పెద్ద ఎత్తున  రాజకీయ బురదచల్లాలని చూసిన వారంతా ముందు వారేం చేశారో.. వర్శిటీ పరువుని ఏ విధంగా తీసేశారో గుర్తుచేసుకోవాలని నానా గడ్డి పెడుతున్నారు. పేరుపొందిన ఆంధ్రా యూనివర్శి పరువు పోతుందని గగ్గోలు పెట్టిన ఆ.. రంగు ఆచార్యులు.. ఏదో జరిగిపోయినట్టు గగ్గోలు పెట్టిన తెలుగు తమ్ముళ్లు ఒకే ఒక్కసారి ముక్కున వేలేసుకొని ఆలోచించాలి.. నాడు అధికారంలో ఆ తెలుగుదేశం పార్టీ.. ఏకంగా తన రాజకీయవేడుక మహానాడు కోసం ఆంధ్రాయూనివర్శిటీ మైదానాన్ని వాడుకొని రాజకీయం చేసిందో.. నాడు రాయని రాతలు...నాడు కనిపించని ద్రుశ్యాలు నేడే కనిపించాయా కొంపదీసి.. అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. నిన్న ఒక్క వీసి మాత్రమే తన చాంబర్ లో కేక్ కట్ చేసిన ఉండొచ్చుగాక.. మరీ మీ పార్టీ అధినేత సాక్షిగా ఎన్ని వేల మంది పచ్చ పార్టీ నేతలు ఆంధ్రాయూనివర్శిటీలో రాజకీయ సభలు పెట్టి పరువుతీశారో గుర్తుకు రాలేదా.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వారం రోజులు చదువుల తల్లి సరస్వతి సొంతింటిలాంటి ఆంధ్రాయూనివర్శిటీ సాక్షిగా రాజకీయం చేసినపుడు గుర్తుకి రాలేదేమో.. అపుడు లేని ఆలోచన..ఆపుడు రాయలేని రాతలు ఇపుడెందుకు గుర్తొచ్చాయో మరి.. వాస్తవాలు రాసేవారంతా ఎప్పుడూ వాస్తవాలనే రాయాలి..నాడు మన పార్టీ అని ఆహా ఓహో అని పొగిడితే..నేడు ఏదో జరిగిపోయిందని జనాలు నమ్మించే పచ్చరాతలు రాస్తే...జనం దేనితోనో నవ్వుతారని గుర్తెరగాలని ఆ వర్గం కానీ ఆచార్యులు...పచ్చపార్టీ బ్యాక్ చెందని విద్యార్ధులు సూచిస్తున్నారు. అవునంటారా కాదంటారా..!

Visakhapatnam

2021-07-03 09:34:34

ఏపీ రెవిన్యూ శాఖలో భారీగా ఖాళీలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రెవిన్యూశాఖలో భారీ ఖాళీలు ఏర్పడనున్నాయి. చాలా సంవత్సరాల నుంచి డిప్యూటీ తహశీల్దార్లకు పదోన్నతులు లేవు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే అత్యధిక సంఖ్యలో 152 మంది డిప్యూటీ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా పదోన్నతులు కల్పించేందుకు ఉత్తర్వులు జారీచేసింది. తహశీల్దార్లకు పదోన్నతులు ఇస్తే వారిని ఆర్డీఓలుగా చేయాల్సి వుంటుంది. కానీ దానిపై ఇంకా ప్రభుత్వం ప్రకటన విడుదల చేయాలేదు. అంటే ఇపుడు ఆ 152 డిటీలు ఖాళీ అయిపోయినట్టే. ఇదే సమయంలో రెవిన్యూ ఇనెస్పెక్టర్లుగా ఉన్నవారికి అందులో కొన్నింటిని పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మళ్లీ ఆర్ఐ పోస్టులు కూడా ఖాళీ అవుతాయి..ఆ స్థానంలోకి ఇప్పటికే సర్వే శిక్షణ పూర్తిచేసుకున్న 26 మంది జూనియర్ అసిస్టెంట్లకు ఆర్ఐ లుగా పదోన్నతి ఇవ్వాల్సి వుంటుంది. అలాగైనా 26 జూనియర్ అసిస్టెంట్లు  ఖాళీలు అవుతాయి. ఇలా చైన్ లింక్ ప్రమోషన్ సిస్టమ్ వారీగా చూసుకుంటే రెవిన్యూశాఖలో ఆర్డీఓ, తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, జూనియర్ అసిస్టెంట్లు ఇలా చాలా పోస్టులే రెవిన్యూశాఖలో ఖాళీలు ఏర్పడనున్నాయి. ప్రభుత్వం ప్రతీ ఏడాదీ జాబ్ కేలండర్ తీయడానికి నిర్ణయించుకున్న తరుణంలో వచ్చే జాబ్ కేలండర్ లో పెద్ద ఎత్తున రెవిన్యూ పోస్టులు జాబ్ కేలండర్ లో పెరగాల్సి వుంది. ఇవికాకుండా చైన్ మేన్ పోస్టులను చాలా కాలం నుంచి ప్రభుత్వం భర్తీ చేయలేదు. వాటితోపాటు వచ్చే ఏడాది చాలా మంది వీఆర్వోలు, తహశీల్దార్లు, డిటీలు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లతోపాటు అటెండర్లు, బిళ్ల బంట్రోతులు కూడా ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ విధంగా చూసుకున్నా రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఒక్క రెవిన్యూశాఖలోనే సుమారు 1000 ఉద్యోగాలకు పైగా వివిధ విభాగాల్లో ఖాళీలు ఏర్పడనున్నాయి.

Tadepalle

2021-07-03 03:27:16

Tadepalle

2021-07-03 02:27:42

Tadepalle

2021-07-03 02:25:57

Tadepalle

2021-07-03 02:25:29

తెరపైకి మహిళా పోలీస్ పేస్కేల్ అంశం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామాలు, నగరాల్లోని యువతులు, మహిళల రక్షణను ద్రుష్టిలో ఉంచుకొని గ్రామ, వార్డు మహిళా సంరక్షణా కార్యదర్శిలను జీఓ నెంబరు 59 ద్వారా సాధారణ మహిళా పోలీసులుగా మార్చారు. సచివాలయాల్లో మిగిలిన ఉద్యోగులతో పోల్చితే వీరితో 5 ప్రభుత్వం హోంశాఖ, ఐసిడిఎస్, ఈఎస్ఈబి, హెల్త్, మరియు కార్యాలయంలోల డిజిటల్ అసిస్టెంట్లకు సహాయకులుగా కూడా విధులు అప్పగించి పనులు చేయిస్తుంది. వీటితోపాటు సచివాలయాలకు నగదు తెచ్చేసమయంలోనూ, ప్రజాప్రతినిధులు వచ్చే సమయంలోనూ, అధికారుల పర్యటన సమయంలో ప్రత్యేక ఎస్కార్ట్ గా కూడా వీరినే వినియోగిస్తుంది ప్రభుత్వం. ప్రత్యేక జీఓ ద్వారా వీరిందరిని సాధారణ పోలీసులుగా మార్చినా.. వీరి పే స్కేలు, జీతాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. పైగా డిగ్రీ, ఆపై విద్యార్హతలున్న వీరి పదోన్నతుల విషయంలో కూడా సాధారణ పోలీస్ కానిస్టేబుల్స్ ఇచ్చినట్టుగా హెడ్ కానిస్టేబుల్ మాదిరిగా ఇస్తామని ప్రభుత్వం ఆ జీఓ 59లో పేర్కొంది. దీనితో ప్రభుత్వం తమ విద్యార్హతలను బట్టి పదోన్నతి ఎస్ఐగా కల్పించడంతోపాటు,  పేస్కేలు కూడా కానిస్టేబుల్ పేస్కేల్ కి మార్పు చేయాలనే డిమాండ్ ను తెరపైకి తీసుకు బలంగా తీసుకు వస్తున్నారు.  సాధారణ పోలీసు విధులతోపాటు, గతంలో ప్రభుత్వం కేటాయించిన ప్రభుత్వ శాఖల విధులు మహిళల సంరక్షణార్ధం దిశ యాప్, దిశ చట్టం చేసి మహిళలకు, యువతులకు ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని భావించిన ప్రభుత్వం ఒక్కో మెట్టు ఎక్కుతూ గ్రామ, వార్డు సంరక్షణకు ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. వీరికి త్వరలోనే కాకీ యూనిఫారం ఇచ్చి గ్రామాల్లో ఒక ప్రత్యేక వ్యవస్థను తయారు చేయనుంది ప్రభుత్వం. అయితే వీరికి స్టేషన్ కి వెళ్లి విధులు నిర్వహించేలా కాకుండా సచివాలయాల పరిధిలోనే ప్రజలకు, మహిళలకు రక్షణగా ఉంటూ వీరిద్వారానే పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదులు వెళ్లే విధంగా చేయాలని సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి డిజిపి గౌతం సవాంగ్ ను ఆదేశించారు. ఇంత వరకూ బాగానే వున్నా.. గ్రామ, వార్డు సంరక్షణా కార్యదర్శిలను సాధారణ పోలీసులుగా మార్చడాన్ని ప్రస్తుతం పోలీసు శాఖలో ఉన్నవారు(హోంగార్డు, పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్ఐలు) జీర్ణించుకోలేకపోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దానికి అనుగుణంగానే వీరి స్టేషన్ శిక్షణ సమయంలో కాస్త చులకన భావంగా మాట్లాడుతున్నారని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు పోలీసులంటే స్టేషన్ నుంచి గ్రామాలకు  వెళితే ఆ గౌరవం, భయం తమకే దక్కేదని అయితే ఇపుడు అవన్నీ మహిళా పోలీసుకు దక్కుతున్నాయని, పైగా వాళ్లకి యూనిఫారం కూడా ఇచ్చేశారని తెగ ఫీలైపోవడంలో అర్ధం లేదని మహిళా పోలీసులు వాపోతున్నారు. తమకేమీ ఉద్యోగాలు ఊరకనే  ప్రభుత్వం ఇవ్వలేదని.. ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా ఎంతో శ్రమించి పోటీపరీక్షలు రాసి ఈ ఉద్యోగాలు పొందినా, ప్రభుత్వం అప్పనంగా మహిళా పోలీసులకు ఉద్యోగాలు ఇవ్వడంతోపాటు తమతోపాటు సమానంగా చూస్తుందని, పదోన్నతుల విషయంలో కూడా తమతో పాటే సమానంగా ఇచ్చేయడానికి జీఓ కూడా ఇచ్చిందని తెగ మదన పడిపోవడంతో అర్ధం లేదని చెబుతున్నారు. అక్కడికీ వీరందరికీ జీతాలు, విధులు స్థానిక పోలీసు స్టేషన్ లోని సిబ్బందే తమ జేబుల్లో నుంచి ఇస్తున్నట్టుగా వ్యవహరించడం రాష్ట్రవ్యాప్తంగా మహిళా పోలీసు వర్గాల్లోని, వారి యూనియన్లలోనూ పెద్ద స్థాయిలో చర్చజరుగుతోంది. వాస్తవానికి మహిళా పోలీసులకు యూనిఫారం ఇవ్వడం చాలా మంది మహిళా పోలీసులకు ఇష్టం లేదు. కాకపోతే ప్రభుత్వం ఉద్యోగ ధర్మం మీది ఇచ్చిన జీఓలు, ఆదేశాలు, నిర్ణయాలు తూచ తప్పకుండా పాటించాలనే ఒక్క కారణంతోనే వీరంతా ప్రభుత్వ నిర్ణయాన్ని శిరసా వహిస్తున్నారు. అయితే ప్రభుత్వానికి ఈ విషయాలన్నీ తెలిసే నేరుగా డిజిపి ద్వారా ఈ ప్రత్యేక జీఓ ప్రభుత్వం జారీచేయించిందని చెబుతున్నారు. ఇంత చేసిన ప్రభుత్వం తమ ఉద్యోగాలను మార్పు చేన ప్రభుత్వం ఐదు ప్రభుత్వ శాఖలకు పైగా విధులు నిర్వహించే తమ పేస్కేలు కూడా మార్పుచేయాలని మహిళా పోలీసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వున్నతమలో 14వేలకు పైగా సిబ్బందిలో 25 నుంచి 30ఏళ్లు లోపు వున్న వారు సుమారు 60శాతం వున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం మహిళా పోలీసుల కోసం ప్రత్యేక వ్యవస్త ఏర్పాటుచేసి, దిశ యాప్, చట్టాన్ని అమలు చేస్తున్న తరుణంలో తమ జీత భత్యాల విషయంలో ప్రభుత్వం సముచిత మైన నిర్ణయం తీసుకోవడంతోపాటు పదోన్నతులు కూడా ఎస్ఐగా కల్పించడం ద్వారా తమ న్యాయపరమై డిమాండ్ ను పరిష్కరించినట్టు అవుతుందని మహిళా పోలీసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంతేకాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా విలేజ్ పోలీస్ వ్యవస్తను ఏర్పాటు చేయడంతోపాటు మంచి పదోన్నతులు కల్పించిన ప్రభుత్వంగా కూడా కీర్తి దక్కుతుందని మహిళా పోలీసులంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీరి డిమాండ్ పై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది వేచిచూడాల్సిందే..!

Tadepalle

2021-07-03 01:53:22

Tadepalle

2021-07-02 02:22:43

పదోన్నతులపై తొలగని సందిగ్ధత..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ఉద్యోగులకు చాలా మందికి తమ పదోన్నతులు ఎలా ఉండబోతాయనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. వాస్తవానికి రాష్ట్రప్రభుత్వంలోని కొన్ని ఉద్యోగాలకు ఇన్ సర్వీసులో రెండు రకాలుగా పదోన్నతులు కల్పిస్తారు..సర్వీసు ఆధారంగా ఇచ్చే పదోన్నతి ఒకటైతే..ఇదే ఇన్ సర్వీసులో ప్రభుత్వం వారి విద్యార్హతను మెరిట్ ప్రాతిపదిక ఎంపిక చేసి వారికి జీతంతో కూడి చదువు చెప్పించి..ఆపై మండల స్థాయి అధికారులుగా కల్పించే పదోన్నతులు.. కానీ ఏపీలో సచివాలయ ఉద్యోగుల భర్తీయే ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా జరగడంతో రెగ్యులర్ ఉద్యోగులకు, వీరికి మధ్య భారీ వ్యత్యాసాలు విధి నిర్వహణ దగ్గర నుంచి జీత భత్యాలలో కనిపిస్తున్నాయి.. ఇపుడు ఈ శాఖలోని ఉద్యోగులకు తమ పదోన్నతులు ఏవిధంగా ఉంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇటీవల గ్రామ, వార్డు సచివాలయాల్లోని గ్రామ మహిళా సంరక్షణా కార్యదర్శిలను సాధారణ మహిళా పోలీసులుగా మార్చుతూ జీఓ నెంబరు 59ని విడుదల చేసి.. వీరికి పదోన్నతి కూడా హెడ్ కానిస్టేబుల్ వుంటుందని పేర్కొంది. పేరుకి మహిళా పోలీస్ అయినప్పటికీ వీరు హోంశాఖలో పాటు, ఐసిడిఎస్, హెల్త్, కార్యాలయ సహాయకులు, ఇతర అన్ని రకాల విధులు నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి మిగిలిన శాఖల ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఇచ్చిన ఒక్కశాఖ ఉద్యోగంతో నాలుగైదు శాఖలు విధులు నిర్వహించే మహిళా పోలీసులకు డిగ్రీ కంటే అధిక విద్యార్హత ఉన్నప్పటికీ, కేవలం ఇంటర్ తో సమానమైన కానిస్టేబుల్స్ కి ఇచ్చే సాధారణ ప్రమోషన్ మాత్రమే ఇవ్వడంతో తమకు ఏవిధమైన పదోన్నతులు వస్తాయోనని అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్, ఏఎన్ఎం, ఇంజనీరింగ్ , హార్టికల్చర్, సెరీకల్చర్, అగ్రికల్చర్, వెటర్నరీ,శానిటేషన్ అసిస్టెంట్లకు తరువాత పదోన్నతులు ఏంటనే విషయంలో ప్రభుత్వం ద్వారా క్లారిటీరాలేదు. పంచాయతీ గ్రేడ్ 5 కార్యదర్శిలకు తరువాత పదోన్నతి గ్రేడ్4, అని డిజిటల్ అసిస్టెంట్లకు పంచాయతీ కార్యదర్శి గ్రేడ్5 ఇస్తారని అంతా భావిస్తున్నారు. కానీ వీరి ప్రమోషన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రత్యేక జీఓ ద్వారా ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వలేదు. ఉదాహరణకు వ్యవసాయ శాఖలో డిప్లమా విద్యార్హతతో చేరిన ఉద్యోగులకు ఇన్ సర్వీసులో ప్రభుత్వమే బిఎస్సీ అగ్రికల్చర్ చదివించి వారికి మండల వ్యవసాయ అధికారిగా పదోన్నతి కల్పిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యశాఖలో ఏఎన్ఎంలకు కూడా ఇన్ సర్వీసులో స్టాఫ్ నర్సు శిక్షణ ఇచ్చి వారికి నర్సులుగా పదోన్నతి కల్పిస్తుంది.  కానీ సచివాలయ ఉద్యోగులకు కూడా ఆవిధమైన పదోన్నతులు వాస్తాయా అనేది  క్లారిటీ లేకుండా ఉంది. ఇప్పటికే మహిళా పోలీసులంతా డిగ్రీ, పీజీ అంతకంటే అధికంగా పీహెచ్డీ విద్యార్హతతో కూడా మహిళా పోలీసు ఉద్యోగాల్లోకి చేరారు. అయితే ప్రభుత్వం వారికి తదుపరి పదోన్నతి హెడ్ కానిస్టేబుల్ అని జీఓ ద్వారా తెలియజేయడంతో అంతా ఇపుడు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ.. వారి వినతులను ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ప్రభుత్వ విప్ ల ద్వారా తీసుకెళుతున్నారు.  ఒక్కోశాఖలో ఒక్కోలా పదోన్నతులు ఇవ్వడమేమంటని వీరంతా ప్రశ్నిస్తున్నారు. అగ్రికల్చర్, వైద్యఆరోగ్యశాఖలో పదోన్నతులు ఇన్ సర్వీసులో ఇచ్చినట్టే మహిళా పోలీసులకు ఎస్ఐ లుగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తుంటే.. ఆపై  మిగిలిన శాఖలైన ఇంజనీరింగ్, సెరీకల్చర్, వెటర్నరీ, వెల్పేర్ అండ్ ఎడ్యుకేషన్ శాఖలతోపాటు అన్ని ప్రభుత్వ శాఖ సచివాలయ సిబ్బందికి పదోన్నతి విషయంలో క్లారిటీ ఇవ్వాలనే వాదన బలపడుతుంది. దీనికోసం రాష్ట్రవ్యాప్త సచివాలయ గ్రూపుల్లో పెద్ద పెద్ద డిబేట్లే జరుగుతున్నాయి. గ్రామస్థాయిలో ఎంతో ఎక్కువ సేవలు అందించే తమకు సాధారణ ఉద్యోగుల కంటే అతి తక్కువ జీతాలు ఇవ్వడంతోపాటు, పదోన్నతుల విషయంలో కూడా ఎటూ తేల్చి చెప్పకపోవడంపై ఉద్యోగులంతా ఆగ్రహంగా వున్నారు. ఇదే తరుణంలో ప్రభుత్వం సరైన మార్గం పదోన్నతుల విషయంలో చూపించకపోతే తదుపరి కార్యాచరణ ఏంటని కూడా జోరుగా తమ తమ ఆలోచనలు ఉద్యోగ సంఘాల గ్రూపుల్లో చర్చకు తెరలేపుతున్నారు. అంతేకాకుండా ప్రజాప్రతినిధులు దగ్గర కూడా ప్రస్తావిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరినీ ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినపుడు ఒక్కో శాఖకు ఒక్కోలా పదోన్నతులపై క్లారిటీ ఇవ్వడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదోన్నతులపై క్లారిటీ ఇస్తే..ఈ ఉద్యోగాల్లో ఉండాలా లేదంటే ఇంతకంటే మంచి ఉద్యోగాలకు వెళ్లిపోవాలా అనే కోణంలో సచివాలయ ఉద్యోగులు ఆలోచనలో పడ్డారు. ప్రభుత్వం ప్రకటించే జాబ్ కేలండర్ తోపాటు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చూసుకుంటే మంచిదనే వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. కారణం వీరికి సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు తేడా ఉండటం, విధులు, జీతాలు, పదోన్నతులు, ప్రొబిషన్ ఇలా ఏ కోణంలో చూసిన సాధారణ ఉద్యోగులతో వీరిని పరిగణించడానికి ఆస్కారం లేకుండా పోతుందని  చెబుతున్నారు. అటు చాలా జిల్లాల్లో వీరి ఉద్యోగాలు ఉంటాయో ఊడుతాయో తెలియకుండా ఉందని..ఇప్పటికే హైకోర్టు పంచాతీ కార్యాలయాలు ఉండగా సచివాలయాలు ఎందుకనే ఒక కేసు విషయంలో ప్రశ్నించింది.. ఏ ప్రభుత్వ శాఖలో లేని విధంగా కేవలం ప్రొభిషన్ లోనే 15వేలు మాత్రమే జీతం వస్తుంటే ఇక రెగ్యులర్ అయిన తరువా పెద్దగా జీత బత్యాలు ఏమొస్తాయోనని ఉద్యోగులంతా ఆలోచిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పదోన్నతులపై ప్రత్యేక జీవోల ద్వారా క్లారిటీ ఇవ్వకపోతే చాలా మంది ఇక్కడి ఉద్యోగాలను వదిలి ఇతర ఉద్యోగాలకు వెళ్లిపోయినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. ఈ ఏడాది చివరి నాటికి సచివాలయ ఉద్యోగుల ప్రొబిషన్ పూర్తయి వీరి ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయి. అప్పటికైనా ప్రభుత్వం వీరి పదోన్నతుల విషయంలో క్లారిటీ ఇస్తుందా లేదా అనేది వేచిచూడాలి..!

Tadepalle

2021-07-01 02:54:35

Tadepalle

2021-07-01 01:40:57

రాష్ట్ర సహాయ కార్యదర్శిగా నేమాల..

ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా నేమాల హేమసుందరరావు నియామకమయ్యారు. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చొప్పారపు సాంబశివ నాయుడు అధ్యక్షతన విజయవాడలో జరిగిన రాష్ట్ర కమిటీ ప్రతినిధుల సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, యూనియన్ జిల్లా అధ్యక్షుడు  హేమసుందరరావుకు రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించారు. ఈయన నియామకం పట్ల పలువురు జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.

Tadepalle

2021-06-30 15:24:14

రాష్ట్ర అధ్యక్షునిగా సాంబశివనాయుడు..

ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నికలు విజయవాడలో బుధవారం ఓ హోటల్ లో జరిగాయి. యూనియన్ ఏర్పాటై 2 సంవత్సరాలు దాటిన సందర్భంగా యూనియన్ రాష్ట్ర నూతన కమిటీని అధ్యక్షులుగా చొప్పారపు సాంబశివనాయుడు నాయకుల  ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. రాష్ట్ర  అధ్యక్షులుగా ఈయనను రెండవసారి ఎన్నుకున్నారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పి.ప్రసన్నకుమార్ రెడ్డి(కడప), సి. సంజీవరెడ్డి  (అనంతపురం)ప్రధాన కార్యదర్శిగా  జూపూడి గురుకాంతాచారి,(ప్రకాశం) పి.సాయికుమార్, కార్యదర్శులుగా(గుంటూరు) బి. షాలన్న,(కర్నూలు) కొయిలాడ పరశురామ్, (విశాఖపట్నం) ఏ. రాధ కృష్ణ,(కృష్ణా జిల్లా) 
సహాయ కార్యదర్శిలుగా  ఎండీ హుమైన్,(విజయవాడ),నేమాల.హేమసుందర రావు,( విశాఖపట్నం),రాఘవేంద్ర రావు (కర్నూలు ) కార్యనిర్వహక సభ్యులుగా వై. శ్రీనివాసరావు, (తూర్పుగోదావరి),సంతోష్,(శ్రీకాకుళం), కె.సుధాకర చారి,( చిత్తూరు  ), సత్యనారాయణ మూర్తి, (రాజమండ్రీ), టి. నరసింహం,(పశ్చిమ గోదావరి),సలహా  సభ్యులుగా కాకుమాను వెంకట వేణు,గరగ ప్రసాద్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Tadepalle

2021-06-30 15:18:42

Tadepalle

2021-06-30 14:30:18

ఒలింపిక్స్ లో దేశానికి పతకాలు సాధించాలి..

జపాన్‌ టోక్యో నగరంలో జులై 23,2021 నుంచి ఆగష్టు 8 వరకూ  జరిగే ఒలింపిక్స్‌లో భారతదేశానికి మంచి పథకాలు సాధించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆకాంక్షించారు. బుధవారం ఆంధ్రప్రదేశ్‌ నుంచి భారతదేశం తరపున పాల్గొంటున్న ఒలింపియన్స్‌ పి.వి సింధు, ఆర్‌. సాత్విక్‌ సాయిరాజ్, రజనీలకు సీఎం వైఎస్‌ జగన్‌  విషెష్‌ చెప్పి ఒక్కొక్కరికీ రూ. 5లక్షల చెక్‌ అందజేశారు. విశాఖలో బ్యాడ్మింటన్‌ అకాడమీ ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల భూమికి సంబంధించిన జీవోను పి.వి. సింధుకి అందజేసి అభినందనలు తెలియజేశీ ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, మరియు క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tadepalle

2021-06-30 14:28:49

అందరి సహకారంతో కరోనా నివారణ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రంణకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన  చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్-19 నివారణ చర్యలపై మంగళవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి సిఎస్ వెబ్ నార్ నిర్వహించారు. ఈ వెబ్ నార్ లో హెల్ప్ కమ్యూనిటీ, అవేర్ నెస్, రూరల్ కమ్యూనికేషన్, అప్రొప్రయేట్ బిహేవియర్, వ్యాక్సినేషన్ తదితర 5 అంశాలపై చర్చించారు. ఈసందర్భంగా సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ మాట్లాడుతూ,  రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2.16 కోట్ల కొవిడ్ టెస్టు నిర్వహించామని తెలిపారు.  వాటిలో ఆర్టీపీసీఆర్ ద్వారా 1,47,74,072 టెస్టులు,ర్యాపిడ్ యాంటిజనెన్ విధానం ద్వారా 68,63,534 టెస్టులు నిర్వహించడం జరిగిందని సిఎస్ పేర్కొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 18,75,622 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 18,16,930 మంది వ్యాధి నుండి కొలుకున్నారని తెలిపారు. కరోనా కారణంగా ఇంత వరకూ 12,566 మంది మృతి చెందారని సిఎస్ చెప్పారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 1,48,64,205 మందికి టీకాలు వేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ పేర్కొన్నారు. కాగా 1,19,54,827 మందికి ఒక డోసు, 29,09,378 మందికి రెండు డోసులు వేశామన్నారు.జర్వ పీడితుల గుర్తింపునకు చేపట్టిన ఇంటింటి సర్వేలో 1,42,55,516 కుటుంబాల నుంచి నమూనాల సేకరించామన్నారు. కరోనా నివారణలో భాగంగా ఒక వైపు కర్ఫ్యూ విధిస్తూనే,మరో వైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా కొనసాగిస్తున్నామన్నారు. ప్రభుత్వ ప్రవేట్ భాగస్వామ్యం ద్వారా మరింత వేగవంతంగా రాష్ట్రంలో కరోనా నివారణ సాధ్యమవుతుందన్నారు. ఈ వీడియో సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్ కె.భాస్కర్,కోవిడ్ టాస్కుఫోర్సు కమిటీ సభ్యులు బాబు ఎ తోపాటు గోద్రేజ్ అగ్రోవెట్,యూనిలివర్, ఓక్షఫామ్, యూనిసెఫ్, ఐటీసీ, ఓన్జీసీ, బెర్గర్, మారికో, టాటా ట్రస్టుతో పాటు ఆసంస్థలకు చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

Tadepalle

2021-06-29 13:56:12