1 ENS Live Breaking News

Tadepalli

2021-07-07 01:39:11

GO149పై గ్రేడ్-5 కార్యదర్శిలు తాడోపేడో..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి గ్రామ సచివాలయ వ్యవస్థను రాష్ట్రస్థాయిలో కమిషనర్లు, జిల్లా స్థాయిలో కలెక్టర్లు, గ్రామ సచివాలయాల కోసమే ప్రత్యేకంగా నియమితులైన జాయింట్ కలెక్టర్లు, డిపీఓలు, మండల స్థాయిలో ఎంపీడీఓలు కనీసం పట్టించుకోవడం లేదనే విషయం జిఓనెంబరు 149 సాక్షిగా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ జీఓ ప్రకారం పంచాయతీలో ఎన్ని సచివాలయాలుంటే అన్నింటికీ వారి పరిధిలోని రికార్డులను, సిబ్బందిని, అధికారాలను, నిధులను బదలాయించాల్సి వుంది. కానీ రెండేళ్లు దాటినా  సచివాలయ కార్యదర్శిలకు ఆ అధికారం రాలేదు.. కాదు కాదు జిల్లా అధికారులు గట్టిగా ఆదేశించకపోవడంతో గ్రేడ్-2 కార్యదర్శిలు ఇవ్వడం లేదు. దీనితో చేతికి అధికారం ఇవ్వకుండా విధులు నిర్వహిస్తున్న గ్రేడ్-5 కార్యదర్శిల తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఫలితంగా ప్రభుత్వం ఒక ఉన్నత ఆశయం, లక్ష్యంతో ఒక ప్రత్యేక నెంబరుతో ఇచ్చిన ఉత్తర్వులు ఇపుడు ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి. కోర్టు ద్వారా మొట్టికాయలు తినేలా చేస్తున్నాయి.. ఇటీవల ఏపీ హైకోర్టు కూడా ప్రభుత్వం ఇచ్చిన జీఓలు, అమలు చేయకుండా వదిలేసిన జీఓలు, పంచాయతీరాజ్ చట్టాలను పాటించని వైనంపై పంచాయతీలుండగా.. అసలు సచివాలయాలు ఎందుకు అనే స్థాయిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిందంటే ప్రభుత్వం జీఓల విషయంలో ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఇచ్చిన జీఓను అమలు చేయకుండా ఎందుకు మిన్నకుండిపోతుందో ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. విధుల వికేంద్రీకరణ కోసం ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో జారీ చేసిన జీఓనెంబరు 149 నేటికీ అమలు కాకపోవడం పై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జీఓ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మేజర్ పంచాయతీల్లో ఏర్పడిన గ్రామ సచివాలయ గ్రేడ్-5కార్యదర్శిలకు అధికారాలు ఇచ్చేయాలి.  కానీ ప్రభుత్వం వీరికి అధికారాలు ఇవ్వకుండా, వున్న గ్రేడ్-2 కార్యదర్శిల వద్దే నిధులు, రికార్డులు, అధికారాలు ఉంచేసింది. దీనితో గ్రామ సచివాలయాలు ఏర్పాటై రెండేళ్లు దాటుతున్నా గ్రేడ్-5 కార్యదర్శిలు ఏవిధంగా పనిచేయాలో, ఏ అధికారంతో పనిచేయాలో, తమ జాబ్ చార్ట్ ఏంటో తెలియక పంచాయతీ కార్యాలయాలవైపు అమాయకంగా చూస్తున్నారు. ఇదే విషయమై గత ఆరునెలల నుంచి వీరంతా మండల స్థాయిలో ఎంపీడీఓలకు, జిల్లా స్థాయిలో డీపీఓలకు, రాష్ట్రస్థాయిలో కమిషనర్ కు తమ అధికార బదలాయింపుపై వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. దీనితో మూడు నెలల క్రితం వీరి అధికారాలను లాగేస్తూ వీఆర్వోలకు డిడిఓ అధికారాలను కట్టబెట్టింది ప్రభుత్వం. అప్పటి వరకూ ఏదో తమకు అధికారాలు, తమ సచివాలయ పరిధిలోని రికార్డులు, నిధులు, పారిశుధ్య సిబ్బంది తమకి ఇస్తారనుకొని ఆశపడ్డారు.. ప్రభుత్వం ఇటీవల నియమించిన కార్యదర్శిలంతా. కానీ అదిజరగక పోగా మళ్లీ ఆ డిడిఓ అధికారాలు కార్యదర్శిలకే ఉంచాలని, అవి కూడా రెండు నెలలపాటు ఉండాలని ఉత్తర్వులు జారీచేశారు. ఇన్ని చేసిన ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీఓనెంబరు 149పై నేటి వరకూ కనీసం నోరు విప్పలేదు. దీనితో విసుగు చెందిన గ్రేడ్-5 కార్యదర్శిలంతా తమ ఆందోళనను ఉద్యమంగా మార్చాలని నిర్ణయించుకొని తమ న్యాయపరమైన డిమాండ్ ను నెరవేర్చాలంటూ ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా వున్న ఎమ్మెల్యేలను కలవడం మొదలు పెట్టారు. వీరిచ్చిన అర్జీలను పరిశీలించిన ఎమ్మెల్యేలు ఆ జీఓను అమలు చేయాల్సింది డీపీఓలు కదా..  ఎందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన గ్రామ సచివాలయ జాయింట్ కలెక్టర్లు ఆదేశించలేకపోతున్నారు.. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు ఎందుకు చొరవ చూపింలేకపోతున్నారు అని తిరిగి ప్రశ్నిస్తుండటంతో గ్రేడ్-5 కార్యదర్శిలంతా ఎమ్మెల్యేల ముందు బిక్క మొహం వేస్తూ... అదే మా దౌర్భాగ్య పరిస్థితి అంటూ వారి ముందే నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు. అసలు పంచాయతీ కార్యదర్శి అని విధుల్లో చేరిన మాకు ఏ విధులు ఉంటాయో నేటికీ ప్రభుత్వం తెలియజేయకపోవడం, ప్రభుత్వమే ఇచ్చిన 149 లాంటి జీఓలను అమలు చేయకపోవడం వలనే ఈ పరిస్థితి దాపురించిందని తమ గోడును వెల్లదీసుకుంటున్నారు కార్యదర్శిలు. ఇలా రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని అందరు ఎమ్మెల్యేలను కలిసి తమ పోరాటంలో తాడో పేడో తేల్చుకోవడానికి సచివాలయ కార్యదర్శిలు సిద్దమైనట్టు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే క్రిష్ణాజిల్లాలోని అవనిగడ్డ ఎమ్మెల్యేకి తమ సమస్యను విన్నవించి వినపతి పత్రం సమర్పించారు.  ఆ తరువాత అన్ని జిల్లాల్లోని గ్రేడ్-5 కార్యదర్శిలు తమ సమస్యలను స్థానిక ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లి ఒత్తిడి తేవాలని చూస్తున్నారు. అదే జరిగితే ప్రభుత్వం ఎంతో ఉన్నత లక్ష్యంతో ఏర్పాటైన గ్రామ సచివాలయ వ్యవస్థలో పంచాయతీ కార్యదర్శిల రూపంలో ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలవుతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రజాప్రతినిధుల ద్వారా తమ సమస్య పరిష్కారం కాకపోయినా, అమలు జరగక పోయినా.. న్యాయపరంగా వెళ్లి తమ న్యాయపరమైన డిమాండ్లను, జీఓ నెంబరు 149 ద్వారా వచ్చే అధికారాలను, జాబ్ చార్ట్ ను సాధించుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా వున్న సుమారు 8వేల మంది గ్రామ సచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిలు కార్యాచరణ సిద్దం చేసుకున్నారని తెలుస్తుంది. ఈ తరుణంలో పంచాయతీలను పట్టి వదలకుండా.. సచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిలకు వారి పరిధులను పంచకుండా, రికార్డులు ఇవ్వకుండా వారిదగ్గరే ఉంచుకొని జాబ్ చార్ట్ ను కూడా అమలు చేయకుండా.. పక్క పంచాయతీలకు సైతం ఇన్చార్జిలుగా వ్యవహరించే గ్రేడ్-2 కార్యదర్శిలను, వారి ద్వారా జీఓ 149 అమలు చేయని జిల్లా పంచాయతీ అధికారుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది కూడా తేలాల్సి వుంది. కలెక్టర్లు స్పందిస్తారా.. గ్రామ సచివాలయ జెసిలు ద్రుష్టిపెడతారా అసలేం జరుగుతుందనేది వేచి చూడాల్సిందే..!

Tadepalle

2021-07-07 01:17:45

ENSకధనాలకు CMజగన్ కార్యరూపం..

మరో సారి సగర్వంగా ప్రకటిస్తున్నాం.. ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ , www.enslive.net ద్వారా ఇప్పటి వరకూ  గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందే సేవలు, అందించడంలో ఎదురయ్యే లోపాలను, సమస్యలను, ప్రజలకు చేరువ చేసే విషయంలో అధికారులు ప్రదర్శించిన తీరుపై  అందించిన కధనాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కదిలిందనే అనుకుంటున్నాం. అంతేకాదు గ్రామస్థాయిలో లోపాలను అధికారులు వెళ్లి తెలుసుకుంటేనే మరింత సేవలు అందించవచ్చునని.. దానికోసం తాను వారానికి రెండు రోజులు గ్రామ సచివాలయాలను సందర్శిస్తానని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించడాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నాం. దానికి కారణం ఒక్కటే  గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటైన దగ్గర నుంచి చాలా మీడియా సంస్థలు భారతదేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థపై పనిగట్టుకొని బురదచల్లాలని చూశాయి.. అంతేకాదు ఒకా నొక దశలో విషయం చిమ్మి, ఈ వ్యవస్థను కుప్పకూల్చాలని మాష్టర్ ప్లానే వేశాయి.. ఒక్క ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ మాత్రం.. తమ నెట్వర్క్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయ శాఖ ద్వారా  జరగుతున్న అభివ్రద్ధి.. ప్రజలకు సేవలు ఏవిధంగా అందుతున్నాయ్.. ఏ లోపంతో అందలేదు.. సమస్యలు, ఉద్యోగుల డిమాండ్లు ఇలా అన్ని రకాల కోణాల్లోనూ ప్రత్యేక కధనాలు అందించింది. అందిస్తోంది.. వాటిని వివిధ సామాజిక మాద్యమాల ద్వారా ప్రభుత్వం ద్రుష్టికి, ప్రజా ప్రతినిధుల వరకూ తీసుకెళ్లేలా కూడా చేసింది. అందుకేనేమో ఏపీ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు,  గ్రామవార్డు సచివాలయశాఖ జెసిలు వారంలో రెండు రోజులు సచివాలయాలను సందర్శిస్తే అక్కడ ప్రజలకు ఏ విధంగా సేవలు అందుతున్నాయి..లోపాలు, అభివ్రుద్ధి చేయడానికి మార్గాలను కనుగొనవచ్చుననే సూచనను నేరుగా ఇవ్వడం ఒక శుభపరిణామంగా చెప్పుకోవాలి. వాస్తవానికి ఒక వ్యవస్థ ఏర్పాటైన దగ్గర నుంచి అది అభివ్రుద్ధి చెందాలంటే ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చాలి. ఆ సమయంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వుండే మీడియా రక రకాల కధనాలు అందరి కళ్లముందుంచుతుంది. వాటిని కొందరు అధికారులు ఛాలెంజ్ గా తీసుకుంటే మరికొందరు అధికారులు కక్ష గట్టి రాస్తున్నారనే కోణంలో ఆలోచిస్తారు. మరికొందర అధికారులు ప్రభుత్వంలో ఇది మామూలే కదా అన్నట్టు లెక్క గడతారు. కానీ ఏపీ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి మానస పుత్రికను దేశంలోనే ఒక ప్రత్యేక మైన ప్రజాసేవ వ్యవస్థగా తీర్చిదిద్దడం కోసం నేరుగా సమస్యలను, లోపాలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి వారంలో రెండు రోజులు సచివాలయానికి వస్తానని చెప్పిన మాట మా(ఈఎన్ఎస్ మీడియా హౌస్)కు ఎంతో ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని ఇచ్చింది. దానికి కారణం కూడా లేకపోలేదు.. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయిలో మంత్రలు, రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై ద్రుష్టి సారిస్తే ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు గుమ్మం ముందే సేవలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడానికి ఎంతో సమయం పట్టదు. పైగా ఈ విషయంలో ఎదురయ్యే సమస్యలు, లోపాలను నేరుగా అధికారులే గుర్తించడానికి ఆస్కారం వుంటుంది. నాటి నుంచి నేటి వరకూ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు, క్షేత్రస్థాయిలోని లోపాలు, సిబ్బంది విధులు, ప్రత్యేక జీఓలు, వాటి అమలు విషయంలో ఆది నుంచి ఏ ఒరవడితో అయితే పనిచేస్తున్నామో.. ఇదే ఉత్సాహాన్ని మరిన్ని వాస్తవాలు, ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రజల ముందుకి తీసుకెళ్లడానికి శక్తివంచన లేకుండా శ్రమిస్తామని ప్రకటిస్తున్నాం. గాంధీజి కలలు గన్న గ్రామ స్వరాజ్యం ప్రజలంతా ప్రభుత్వ సేవల ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా చూడాలని ఆశిస్తున్నాం. ఎప్పటిలాగే మంచి, చెడు, సమస్యలు, డిమాండ్లు, ప్రభుత్వ ఉత్తర్వులు, ప్రజా సమస్యలపై ప్రత్యేక కధనాలు అందిస్తామని ప్రకటిస్తున్నాం.. గ్రామ స్వరాజ్యమే దేశ సౌభాగ్యం..!

Tadepalle

2021-07-06 17:28:42

Tadepalle

2021-07-06 01:58:08

Tadepalle

2021-07-06 01:57:23

Tadepalle

2021-07-06 01:56:39

ఆదాయం కోల్పోతున్న సచివాలయాలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వం రోజూ లక్షల రూపాయల్లో ఆదాయాన్ని కోల్పోతుంది. ఈ విషయం మీకు కాస్త తేడాగా కనిపించొచ్చు.. కాని ఇదినిజం.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందించే సేవలు పూర్తిస్థాయిలో ప్రజలకు చేరితే.. ప్రభుత్వ ఖజనా గల్ గల్ మనడం ఖాయమని మీరే అంటారు.. కావాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రభుత్వం 15వేల 5 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. తొలుత  మీ-సేవా కేంద్రాల్లో అందించే 56 సేవలు సచివాలయాల ద్వారా పొందవచ్చునని ప్రకటించి ఆ సేవలు మొదలు పెట్టింది. అంతేకాకుండా ఆ.. సేవలను సచివాలయ సిబ్బంది, గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా అధికారులను సైతం అదేశించింది. కానీ ఆదేశాలు  జిల్లా కేంద్రాలకే పరిమితం అయిపోవడంతో సచివాలయాల్లోని సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి.. నేటికీ కుల, ఆధాయ, మరణ, జనన ద్రువీకరణ పత్రాల కోసం చాలా మంది గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మీ-సేవాల కేంద్రాలకే వెళుతున్నారంటే పరిస్థితి ఏవిధంగా వుందో అర్ధం చేసుకోవచ్చు. వున్న సేవలను ప్రజలకు వద్దకు తీసుకెళ్లలేని ప్రభుత్వం మళ్లీ ఇక్కడే మరో489 సర్వీలను గ్రామ,వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు గ్రామంలోనే అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఉన్న సేవలకే ప్రజలకు  అందే దిక్కులేకపోతే.. ఇక కొత్త సర్వీసులపై ప్రజలకు ఏం అవగాహన కలుగుతుందో అది ప్రభుత్వమే చెప్పాల్సి వుంది. ప్రభుత్వం ప్రజలకిచ్చే సంక్షేమ పథకాలపై పేజీలకు పేజీలు పత్రికల్లో ప్రకటనలివ్వడం తప్పితే ప్రజలకు సచివాలయాల ద్వారా అందే సేవల విషయంలో నేటికీ కనీసం ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఒక్క ప్రకటన జారీ చేయకపోవడం విశేషం. ఒక్కోసచివాలయంలో సుమారు 14 ప్రభుత్వశాఖల సిబ్బంది ద్వారా అందే సేవలతోపాటు, ఇతర ప్రభుత్వ సేవలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అందించేందుకు డిజిటల్ అసిస్టెంట్లను ఏర్పాటు చేసినా.. ఉపయోగం లేకుండా పోతుంది. సంక్షేమ పథకాలు ఇవ్వడానికి వారం పదిరోజుల ముందు సంబంధిత ద్రువీకరణ పత్రాలు అందించడం తప్పితే.. ఏ సచివాలయ పరిధిలో ఏఏ శాఖలకు చెందిన సేవలు అందిస్తున్నారో.. కనీసం సచివాలయాల డిస్ప్లే బోర్డుల్లో సైతం ప్రజలకు తెలిసేలా సేవల వివరాలు తెలియజేసే ఏర్పాటు చేయలేదు. మేజర్ పంచాయతీల్లో 3 గ్రామ సచివాలయాలు, వార్డుల్లో నాలుగు నుంచి 5 వార్డు సచివాలయాలు ఉన్నప్పటికీ ప్రజలకు మాత్రం అత్యవసర సేవలు కూడా అందడం లేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా వున్న గ్రామ, వార్డు సచివాలయాలన్నీ ఒకే సారి ప్రభుత్వం ప్రకటించిన సేవలను ప్రజల ముందుకు తీసుకెళ్లగలిగితే ప్రభుత్వ గళ్ల పెట్టి మోగే సౌండ్ రాష్ట్ర మొత్తం వినిపించాలి. ఈ శాఖకు చెందిన కమిషనర్ నుంచి గ్రామాల్లోని సచివాలయ కార్యదర్శి వరకూ నేటికీ ఏ ఒక్కవిషయంలోనూ ప్రోటోకాల్ ప్రకారంగా సేవల వివరాలు అందాయా వేళ్లపై మాత్రమే లెక్కెట్టి చెప్పేంత స్థాయిలో పరిస్థితి ఉన్నదంటే అతిశయోక్తి కాదేమో. విశేషమేమిటంటే గ్రామ, వార్డు సచివాలయాలను తనిఖీలు చేసే జాయింట్ కలెక్టర్లు, జిల్లా కలెక్టర్లు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఒక్క సచివాలయంలో కూడా ఏఏ రకాల సేవలు అందుబాటులో వున్నాయి.. ఇప్పటి వరకూ ఎన్ని రకాల సేవలు ఏఏ సచివాలయాల ద్వారా అందించారనే వార్త రాకపోవడమే నిదర్శనం. ఆదాయం వచ్చే మార్గాలున్నా.. ఇక్కడే వుండి సేవలు అందించాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు తప్పితే.. ప్రజలకు సేవలు అందిస్తూనే..వారికి పనికొచ్చే వివిధ ద్రువీకరణ పత్రాల ద్వారా ఆదాయ మార్గాలను పెంపొందంచుకోవాలని నేటికీ ఒక్క అధికారి కూడా హిత బోద చేసిన దాఖలాలు లేవు. ఒక్కో సచివాలయం మీద ప్రభుత్వం ఇపుడిచ్చే ప్రొభిషనరీ సర్వీసు జీతం కింద లెక్కేసినా ఒక్కో గ్రామ సచివాలయానికి రూ.2.25 లక్షలు జీతాలకే ప్రభుత్వం వెచ్చిస్తోంది.  కానీ ఒక్కో సచివాలయంపై రోజుకి రూ.2500 వరకూ కూడా ఆదాయం మాత్రం రావడంలేదు.. ఇప్పటికైనా గ్రామ, వార్డు సచివాలయశాఖ కమిషనర్, ముఖ్యకార్యదర్శిలు ఇక్కడ అందించే సేవల విషయంలో పూర్తిస్థాయిలో ద్రుష్టి సారిస్తే..ప్రజలకు గ్రామస్థాయిలోనే ప్రభుత్వ సేవలు అందడటంతో పాటు.. ప్రభుత్వానికి సమయానికి ఆదాయం కూడా అందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.. ముందు ముందు ఈ విషయంలో ఏం జరుగుతుందనేది వేచి చూడాలి..! 

Tadepalle

2021-07-06 01:33:07

తెరపైకి ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్లు అంశం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి, మెగా గ్రౌండింగ్ పేరుతో నిర్మాణాలు చేపడుతున్న వేళ  సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇచ్చిన ఇంటి స్థలాలు, ఇళ్లు కట్టించి ఇస్తానన్న హామీని ఉద్యోగులంతా తెరపైకి తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగ సంఘాలు సీఎం ఇచ్చిన హామీ అరిచేతిలో ఇంటిలాగే ఉంటుందా..అంటూ.. వారి యూనియన్ గ్రూపుల్లో పెద్ద చర్చకు తీసుకు వస్తున్నారు. దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం చూస్తాయని..వారు ఆనందంతో మరింత ఉత్సాహంగా పనిచేస్తే ప్రజలకు మరిన్ని సేవలు అందుతాయని ఆలోచిస్తాయని...కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దానికి విరుద్దంగా జరుగుతుందని బాధపడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదని, 8 డిఏలకు మోక్షం లేదని, పెండింగ్ లో ఉన్న పీఆర్సీ వస్తుందో రాతో తెలియడంలేదని, ఇపుడు ఎన్నికల హామీల్లో ఒకటిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తామన్న ఇంటి స్థలాలు, ఇల్లు కట్టించి ఇస్తామన్న హామీ కూడా నెరవేరేలా లేదని ఉద్యోగులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్రలో ప్రజలు చేసిన హామీలకంటే అధికంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం ఉద్యోగులను మాత్రం పక్కన పెట్టిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీకి పట్టండ కడితే కనీసం ఈ ప్రభుత్వ హయాయంలో నైనా తమ సొంతింటి కల నెరవేరుతుందనుకుంటే.. ప్రభుత్వంలోని నిధులన్నీ ప్రజలకు నగదు రూపంలో సంక్షేమ పథకాలకే వచ్చి..నేడు నెల నెలా జీతాలకు కూడా ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించే పరిస్థితి దాపురించిందని మదన పడుతున్నారు. నేటికి చాలా మందికి ప్రసూతి సెలవుల జీతాలు, గత పీఆర్సీ బకాయిలు, ఐఆర్ బకాయిలు ఇవ్వలేదని, చాలా ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులను రెగ్యులర్ చేయలేదని చెబుతన్నారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన సొంతింటి కల హామీ ఇంకెక్కడ నెరవేరుతుందని పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో నేటికీ చాలా భవనాలు శిధిల స్థితికి చేరుకున్నాయి. చాలా చోట్ల డిస్పెన్సరీలు, ఆసుపత్రులు పడిపోయాయి. వాటి స్థానంలో నాడు నేడు క్రింద వైద్య ఆరోగ్యశాఖలో ఆసుపత్రులు మాత్రమే కడుతున్నారు తప్పా ప్రభుత్వశాఖల ఉద్యోగులు 50ఏళ్ల క్రితం కట్టిన ప్రభుత్వ భవనాల్లోనే విధులు నిర్వర్తిస్తున్న విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం పక్కన పెట్టిందని వాపోతున్నారు. ఉన్న స్థలాలన్నీ నిరుపేదలకు ప్లాట్లు వేసి ఇచ్చేస్తుంటే ఇక ప్రభుత్వ ఉద్యోగులకు స్థలాలు ఎక్కడి నుంచి తెస్తారని..ఒక వేల ప్రైవేటు స్థలాలు కొనాలంటే ప్రభుత్వ ఖజానాలో సొమ్ములేదని చేతులెత్తేయడానికే ఈ విధంగా వ్యవహరిస్తుందని ఉద్యోగ సంఘాల్లో చర్చించుకుంటున్నారు. కనీసం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలనైనా రెగ్యులర్ చేస్తుందా అని అనుకుంటే అదీ జరలేదు. ఇలా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఉద్యోగులు తీవ్రంగా మదన పుడుతన్నారు. టిడిపిని కాదని వైఎస్సార్సీపీకి మద్దత్తు ఇచ్చినందుకు కనీసం ఒక్క హామీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేయకపోగా..ప్రధాన సమస్యలు, డిమాండ్లు కూడా నెరవేరలేదని అన్ని ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు మీడియా ముందుకి తమకి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తీసుకువస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఒక్క హామీ కూడా అమలు కాకపోవడం వలన రాబోయే రోజుల్లోనైనా అమలు చేస్తారో లేదోనని పెదవి విరుస్తూ నాటి వైజగ్ ఉద్యోగులకు ఇస్తామన్న ప్రచార వీడియోని వైరస్ చేస్తున్నారు..మరి ఈ విషయంలో ప్రభుత్వం ఏ విధంగా ఉద్యోగులకి ఇచ్చిన సొంతింటి హామీ, డిఏలు, పీఆర్సీ బకాయిలను తీరుస్తుందో లేదో వేచి చూడాల్సిందే..!

Tadepalle

2021-07-05 04:04:15

తాజంగిలో గిరిజన మ్యూజియం..

విశాఖజిల్లా, చింతపల్లి మండలం లంబసింగికి సమీపంలోని తాజంగిలో అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు చేసిన చారిత్రాత్మక గ్రామంలోనే అల్లూరి సీతారామరాజు ను శాశ్వతంగా స్మరించుకొనేలా ‘‘ గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియం’’ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టబోతోందని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. ఆదివారం కొమరాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.  21 ఎకరాల విస్తీర్ణంలో రూ.35 కోట్ల రుపాయల వ్యయంతో నిర్మించనున్న తాజంగి మ్యూజియం నిర్మాణానికి ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి త్వరలోనే శంకుస్థాపన కూడా చేయనున్నారని వెల్లడించారు. నిలువనీడ లేని పేద కుటుంబాలన్నింటికీ సొంతిళ్లను అందించే జగనన్న కాలనీల నిర్మాణం దేశానికంతటికీ ఆదర్శప్రాయమని అభివర్ణించారు. కాగా పుష్ప శ్రీవాణి రాజ్యలక్ష్మీపురంలో నిర్మించనున్న జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. అక్కడ మొక్కలు నాటే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఐటీడీఏ పిఓ కుర్మనాధ్, ఆర్డీఓ వెంకటేశ్వర్లు,గృహ నిర్మాణ శాఖ ఇఇ శ్రీనివాస్ రావు, డిఇఇ చెన్న రాయడు, మండలం ప్రత్యేక అధికారి శాంతిశ్వర్ రావు ఎంపీడీఓ గోపాలకృష్ణ, తహసీల్దార్ ఎస్ఎల్వి ప్రసాద్, వైసీపీ మండల పార్టీ కన్వీనర్ ద్వారపురెడ్డి జనార్ధన నాయుడు, వైస్సార్సీపీ సీపీ నాయకులు నంగిరెడ్డి శరత్ బాబు, సర్పంచ్ అంబటి వెంకటిలక్ష్మి,మండలం వ్యవసాయ సలహా మండలి చైర్మన్ చింతల సంఘం నాయుడు, శివిని సింగిల్ విండో అధ్యక్షులు దాసరి శ్రీధర్, అంబటి తిరుపతి నాయుడు, నాలి గుంపస్వామి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Komarada

2021-07-04 10:20:27

ప్రభుత్వ ఉద్యోగుల స్వరం మారుతోందా..

వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఉద్యోగులు, ఉపాధ్యాయుల స్వరం మారుతున్నట్టు కనిపిస్తుంది..ప్రతీనెలా ఒటకవ తేదీకి ప్రతీ ఇంటికీ పించనుతో పాటు సంక్షేమ పథకాలు నగదు రూపంలోనే టంచనుగా అందుతున్నాయి.. మాకు మాత్రం 8డిఏలు, ఒక పీఆర్సీ ఇవ్వడానికి నిధులు లేవు.. సీపిఎస్ రద్దు చేయడానికి ప్రభుత్వానికి చేతులు రావాడం లేదు అనే స్వరాన్ని ఉద్యోగులు బలంగా వినిపిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువా ఆర్టీసీ కార్పోరేషన్ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, పోలీసులకు వారాంతపు సెలవులు మంజూరు చేయడం తప్పా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మరే ఎన్నికల హామీలేవీ నెరవేరలేదు. ఇంకో రెండేళ్లు కాలం వెళ్లదీస్తే మరోసారి ఉద్యోగులకు కొత్తగా హామీలివ్వాలని ప్రభుత్వం చూస్తోందనే దోరణిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్న ప్రభుత్వం ఎందుకు వాటిని కావాలనే పక్కన పెట్టిందని  ఉద్యోగ సంఘాలన్నీ ప్రభుత్వ తీరుపై గుర్రుగా వున్నాయి. ఈ విషయాన్ని  నిఘా వర్గాలు గుర్తించి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేసినా ఫలితం మాత్రం కనిపించలేదనే వాదన కూడా వినిపిస్తుంది.. అంతేకాకుండా ప్రతిపక్షంలో ఉండగా పనికి తగ్గ వేతనం ఇవ్వాలని, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానాలను రద్దు చేయాలని ఉద్యమం చేసిన నేటి అధికారి ప్రభుత్వం సీట్లోకి రాగానే... నేరుగా రెగ్యులర్ ఉద్యోగాలకు మంగళం పాడటానికి ఏకంగా ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ ఏర్పాటు చేసిందని మండి పడుతున్నారు.  ప్రజలకి ఇచ్చిన హామీలే హామీలా...ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగులకు ఇచ్చినవి హామీలు కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాగే ఉంటే మరో రెండేళ్లు కాలయాపన చేసి..వచ్చే ఎన్నికలకు కూడా ఇవే హామీలు ఇవ్వాలని ప్రభుత్వం చూస్తోందనే కోణంలో ఉద్యోగ సంఘాల్లోని సామాజిక మాద్యమాల్లో విపరీతంగా చర్చకు తెరలేపారు. పైకి వ్యక్తం చేస్తే ప్రభుత్వం నేరుగా ఉద్యోగులను, ఉద్యోగ సంఘాల నేతలను టార్గెట్ చేస్తుందని భావించిన ఉద్యోగ సంఘాలు చాపకింద నీరులా తమ తదుపరి కార్యాచరణకు అంకురార్పణ చేసినట్టుగా తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు ప్రతిపక్ష పార్టీ ముఖ్య నేతలతో ఇదే విషయమై సంప్రదింపులు చేసినట్టుగా కూడా సమాచారం అందుతోంది. అటు ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్టు ఉద్యోగులకు మంచి ప్రతిపాదనలు వచ్చినట్టుగా చెబుతున్నారు. అదే నిజమైతే ఎన్నికలు సమీపించే నాటికి ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏకమై ప్రభుత్వానికి తెలియకుండా దెబ్బకొట్టే సూచనలు కూడా లేకపోలేదు. ఇప్పటికే చాలా ప్రభుత్వ శాఖల్లోని అధికారలు, ఉద్యోగులు ప్రభుత్వ తీరుపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. కొన్నిచోట్ల ఉద్యోగులు, సంఘాల నేతలపై ఏసీబీ దాడులు, బదిలీలు, ఇతర శాఖ పరమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవడంతో ఉద్యోగులంతా బయటపడకుండా రహస్య మంతనాలు చేస్తూ వ్యతిరేక కూటమికి బలం పెంచుతున్నారని తెలుస్తుంది. ఈ తరుణంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన సీపిఎస్ రద్దు హామీ, పీఆర్సీ, 8 డిఏల బకాయిలు, పదోన్నతులు, బదిలీలు విషయంలో చర్యలు ఉద్యోగులకు అనుకూలంగా తీసుకుంటుందా లేదంటే ప్రజలంతా మనవైపు వుంటే చాలన్నట్టు వ్యవహరిస్తుందానే అంశం తీవ్ర చర్చలకు దారితీస్తోంది..!

Tadepalle

2021-07-04 05:03:29

సచివాలయ ఉద్యోగులకు కొత్త విధులు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి శాఖల వారీగా ప్రత్యేక జీఓల ఆధారంగా వారికి అనంగా చేర్చిన విధులు, సేవలను తెలియజేస్తుంది. ఇప్పటికే  గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శిలుగా వున్న వారిని జీఓ నెంబరు 59 ద్వారా సాధారణ పోలీసులుగా మార్చడంతోపాటు కాఖీ యూనిఫారం ఇచ్చింది. దానిని అన్ని జిల్లా ఎస్పీలు అమలు చేస్తున్నారు. ఇపుడు మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డు పారిశుధ్య, పర్యావరణ కార్యదర్శిలకు జీఓనెంబరు 650ని విడుదల చేసింది. అందులో సచివాలయ ఉద్యోగులు ఏవిధంగా పనిచేయాలనే విషయం తెలియజేయడంతో వాటిని రాష్ట్రంలోని అన్ని పట్టణ పురపాలక శాఖల కమిషనర్లకు కూడా తెలియజేయడంతో ఉద్యోగులకు దిశా నిర్ధేశం చేస్తున్నారు. మిగిలిన ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు దశల వారీగా జీఓల ద్వారా విధులును తెలియజేసే పనిలో పడింది. గతంలో ఉద్యోగులు విధుల్లో చేరినపుడు వీరందరికీ ఒక జాబ్ చార్ట్ ప్రభుత్వం అధికారిక వెబ్ సైట్ ద్వారానే తెలియజేసింది. ఇపుడు ప్రత్యేకంగా శాఖల వారీగా జీఓల రూపంలో కొత్తగా రూపొందించిన విధులను తెలియజేయడం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో సేవలను 545కి పెంచిన నేపథ్యంలో ఉద్యోగుల విధులు కూడా ఆయా ప్రభుత్వ శాఖలకు అనుగుణంగా ఉండేందుకు వీలుగా కొత్తగా తయారు చేస్తుందని రాష్ట్ర అధికారి ఒకరు ఈఎన్ఎస్ కు ప్రత్యేకంగా తెలియజేశారు. ప్రభుత్వం సచివాలయాల ద్వారానే అన్ని సేవలు అందించాలనే లక్ష్యంతోనే కొత్తగా రూపొందించిన విధులను అధికారిక జీఓల ద్వారా తెలియజేస్తుందని వివరించారు. దానికితోడు, సమాచార హక్కుచట్టాన్ని కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయాలని భావించిన తరుణంలో సచివాలయ వ్యవస్థలో దాపరికంలేని సేవలు అందించాలనే ఉద్దేశ్యంలో ఉద్యోగులకు చెందిన విధులను ఆయాశాఖల ముఖ్య కార్యదర్శిల ద్వారా జీఓలు విడుదల చేయిస్తుందని చెబుతున్నారు. సచివాలయానికి వచ్చిన దగ్గర నుంచి శాఖల వారీగా ఎంతమంది సిబ్బంది ఎన్ని దరఖాస్తులను పరిష్కరించారనే విషయంలోనూ ఇకపై ప్రభుత్వం లెక్కలు తేల్చనుందని సమాచారం అందుతుంది. గ్రామ సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తరువాత చాలా సమస్యలు గ్రామస్థాయిలో పరిష్కారం కావడం లేదు. సచివాలయ సిబందే మండల, జిల్లా కార్యాలయాలకు పంపుతున్నారు. కొన్నింటిని సచివాలయాల్లో చేసే అవకాశం వున్నా సక్రమంగా చేయడం లేదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించే కొత్తగా జీఓల రూపంలో విధులు ఉటంకిస్తూ జీఓలు జారీచేస్తుందని అధికారులు చెబుతున్నారు.  ఇకపై రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వారీగా ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులెన్ని, పరిష్కరించినవి ఎన్ని అనే విషయాలను డాష్ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు నేరుగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రభుత్వంలోని ముఖ్యశాఖల అధిపతులే సమీక్షనున్నారని కూడా తెలుస్తుంది. ఇంకా వ్యవశాఖ, పట్టు పరిశ్రమశాఖ, ఉద్యానశాఖ, ఇంజనీరింగ్, సంక్షేమశాఖ, వీఆర్వోలు, సర్వేయర్లు, పంచాయతీ కార్యదర్శిలకు కూడా కొత్త విధులపై జీఓలు ప్రభుత్వం జారీచేయనుందని గ్రామ, వార్డు సచివాలయ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రజలకు పూర్తిస్థాయిలో గ్రామంలోనే సేవలు అందాలంటే ఉద్యోగులకు జాబ్ చార్ట్ లిఖిత పూర్వకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ ఏర్పాటు చేస్తుందని చెబుతున్నారు. అన్నిశాఖల సిబ్బందికి వారి వారి విధులు, సేవలపై ప్రత్యేక జీఓలు వస్తే తప్పా..కొత్తగా వారి విధుల్లో ఏఏ కొత్త సేవలు అదనంగా చేర్చారనే విషయం కొలిక్కిరాదు..! 

Tadepalle

2021-07-04 02:32:52

పచ్చరాతలు.. పచ్చికూతలు అన్నన్నా..

‘నవ్విపోదురుగాక..నాకేటి సిగ్గు...’అన్నట్టు మీకనిపించలేదా పచ్చరంగు పులుముకున్న వారందరికీ.. పచ్చ పచ్చని రాతాలు రాసేవారందరికీ.. నిన్నటి పుట్టిన రోజు వేడకలను ప్రశ్నించిన ఆచార్యులంతా చదువులమ్మ ఒడి ఆంధ్రాయూనివర్శిటీ మైదనాంలో నాడు మహానాడు జరుగుతున్న సమయంలో ఏం చేశారు..ఇంకేం పీకారు.. ఓహో సిగ్గుతో రాజకీయ ప్రశంగాలు వినకలేక చెవులు మూసుకున్నారా.. రాజకీయనాయలు నేరుగా వచ్చి చదువులమ్మ ఒడిలో సభలు పెడితే చూడలేక కల్లు కుట్టుకున్నారా.. నాడు చేయని ఆందోళనలు.. బాధ నేడేంటని మీకు అనిపించలేదా.. నేడు ఆ పచ్చ విద్యార్ధులే ఇపుడు ఎందుకు ప్రశ్నిస్తున్నట్టో కనీసం అర్ధం చేసుకోలేని ప్రజలున్నారంటారా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపడుతున్న అభివ్రుద్ధిని చూసి ఓర్వలేని వారంతా పుట్టిన రోజు వేడుకలను రాజకీయం చేయాలని చూస్తే.. ఏకంగా నాడు.. మహానాడుతో వారు చేసిన రాజకీయం మేము చేస్తే.. సంసారం.. మీరు చేస్తే వ్యభిచారం.. అన్నట్టుగా చిత్రీకరించే ఆ పక్షనేతలు.. ఈ పచ్చరాతలు.. నిజంగానే మాటల కందని అర్ధాలు తీసినట్టుగానే ఉన్నాయి. భావ ప్రకటన అభిమానాన్ని కేకు కట్ చేస్తే.. చూపిస్తే.. చదువులమ్మ తల్లి పరువుపోయిందా.. అన్నన్నా.. ఎంత మాట ఎంతమాట.. కలం కల్మషంగా రాయాలి తప్పా.. కలం కలుషితంగా మారి అక్షరాలు రాస్తే.. అవి వక్రభాష్యాన్నే చూపుతాయనడానికి ఎంపీ వి.విజయసాయిరెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఆంధ్రాయూనివర్శిటీలో జరిగినందుకు రాసిన పచ్చరాతలే నిదర్శనంగా కనిపిస్తున్నాయని ఆరోపిస్తున్నారు ఆంధ్రరాష్ట్ర ప్రజలు..నిజమైన ఆచార్యాలు..రాజకీయాలు చేయని విద్యార్ధులు..

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో వున్న వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులపై రాజకీయ బురద చల్లేందుకు చదువలమ్మ ఒడి.. ఆంధ్రాయూనిర్శిటీని వేదిక చేసుకోవడం నిజంగా సిగ్గుచేటని గుండెలు అవిసేలా బాధుకొని రాజకీయం చేసేవారంతా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి సూచిస్తున్నారు వాస్తవాలు తెలిసిన వారంతా.. ఒక వేల వారి వేలే ముందుకి చూపిస్తే నాలుగు వేళ్లు తప్పుచేసిన వారిపైనే చూపిస్తాయనే విషయం మరిచిపోకూడదు అలాంటపుడు అంటూ హితబోద చేస్తున్నారు. విసి చాంబర్ లో  రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసినందుకు..పెద్ద ఎత్తున  రాజకీయ బురదచల్లాలని చూసిన వారంతా ముందు వారేం చేశారో.. వర్శిటీ పరువుని ఏ విధంగా తీసేశారో గుర్తుచేసుకోవాలని నానా గడ్డి పెడుతున్నారు. పేరుపొందిన ఆంధ్రా యూనివర్శి పరువు పోతుందని గగ్గోలు పెట్టిన ఆ.. రంగు ఆచార్యులు.. ఏదో జరిగిపోయినట్టు గగ్గోలు పెట్టిన తెలుగు తమ్ముళ్లు ఒకే ఒక్కసారి ముక్కున వేలేసుకొని ఆలోచించాలి.. నాడు అధికారంలో ఆ తెలుగుదేశం పార్టీ.. ఏకంగా తన రాజకీయవేడుక మహానాడు కోసం ఆంధ్రాయూనివర్శిటీ మైదానాన్ని వాడుకొని రాజకీయం చేసిందో.. నాడు రాయని రాతలు...నాడు కనిపించని ద్రుశ్యాలు నేడే కనిపించాయా కొంపదీసి.. అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. నిన్న ఒక్క వీసి మాత్రమే తన చాంబర్ లో కేక్ కట్ చేసిన ఉండొచ్చుగాక.. మరీ మీ పార్టీ అధినేత సాక్షిగా ఎన్ని వేల మంది పచ్చ పార్టీ నేతలు ఆంధ్రాయూనివర్శిటీలో రాజకీయ సభలు పెట్టి పరువుతీశారో గుర్తుకు రాలేదా.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వారం రోజులు చదువుల తల్లి సరస్వతి సొంతింటిలాంటి ఆంధ్రాయూనివర్శిటీ సాక్షిగా రాజకీయం చేసినపుడు గుర్తుకి రాలేదేమో.. అపుడు లేని ఆలోచన..ఆపుడు రాయలేని రాతలు ఇపుడెందుకు గుర్తొచ్చాయో మరి.. వాస్తవాలు రాసేవారంతా ఎప్పుడూ వాస్తవాలనే రాయాలి..నాడు మన పార్టీ అని ఆహా ఓహో అని పొగిడితే..నేడు ఏదో జరిగిపోయిందని జనాలు నమ్మించే పచ్చరాతలు రాస్తే...జనం దేనితోనో నవ్వుతారని గుర్తెరగాలని ఆ వర్గం కానీ ఆచార్యులు...పచ్చపార్టీ బ్యాక్ చెందని విద్యార్ధులు సూచిస్తున్నారు. అవునంటారా కాదంటారా..!

Visakhapatnam

2021-07-03 09:34:34

ఏపీ రెవిన్యూ శాఖలో భారీగా ఖాళీలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రెవిన్యూశాఖలో భారీ ఖాళీలు ఏర్పడనున్నాయి. చాలా సంవత్సరాల నుంచి డిప్యూటీ తహశీల్దార్లకు పదోన్నతులు లేవు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే అత్యధిక సంఖ్యలో 152 మంది డిప్యూటీ తహశీల్దార్లకు తహశీల్దార్లుగా పదోన్నతులు కల్పించేందుకు ఉత్తర్వులు జారీచేసింది. తహశీల్దార్లకు పదోన్నతులు ఇస్తే వారిని ఆర్డీఓలుగా చేయాల్సి వుంటుంది. కానీ దానిపై ఇంకా ప్రభుత్వం ప్రకటన విడుదల చేయాలేదు. అంటే ఇపుడు ఆ 152 డిటీలు ఖాళీ అయిపోయినట్టే. ఇదే సమయంలో రెవిన్యూ ఇనెస్పెక్టర్లుగా ఉన్నవారికి అందులో కొన్నింటిని పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మళ్లీ ఆర్ఐ పోస్టులు కూడా ఖాళీ అవుతాయి..ఆ స్థానంలోకి ఇప్పటికే సర్వే శిక్షణ పూర్తిచేసుకున్న 26 మంది జూనియర్ అసిస్టెంట్లకు ఆర్ఐ లుగా పదోన్నతి ఇవ్వాల్సి వుంటుంది. అలాగైనా 26 జూనియర్ అసిస్టెంట్లు  ఖాళీలు అవుతాయి. ఇలా చైన్ లింక్ ప్రమోషన్ సిస్టమ్ వారీగా చూసుకుంటే రెవిన్యూశాఖలో ఆర్డీఓ, తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, జూనియర్ అసిస్టెంట్లు ఇలా చాలా పోస్టులే రెవిన్యూశాఖలో ఖాళీలు ఏర్పడనున్నాయి. ప్రభుత్వం ప్రతీ ఏడాదీ జాబ్ కేలండర్ తీయడానికి నిర్ణయించుకున్న తరుణంలో వచ్చే జాబ్ కేలండర్ లో పెద్ద ఎత్తున రెవిన్యూ పోస్టులు జాబ్ కేలండర్ లో పెరగాల్సి వుంది. ఇవికాకుండా చైన్ మేన్ పోస్టులను చాలా కాలం నుంచి ప్రభుత్వం భర్తీ చేయలేదు. వాటితోపాటు వచ్చే ఏడాది చాలా మంది వీఆర్వోలు, తహశీల్దార్లు, డిటీలు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లతోపాటు అటెండర్లు, బిళ్ల బంట్రోతులు కూడా ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ విధంగా చూసుకున్నా రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఒక్క రెవిన్యూశాఖలోనే సుమారు 1000 ఉద్యోగాలకు పైగా వివిధ విభాగాల్లో ఖాళీలు ఏర్పడనున్నాయి.

Tadepalle

2021-07-03 03:27:16

Tadepalle

2021-07-03 02:27:42

Tadepalle

2021-07-03 02:25:57