ఒక జిల్లా మంత్రికి తెలియకుండా ఒక అవినీతి అధికారి నేరుగా పంచాయతీరాజ్ శాఖ నుంచి రెగ్యులర్ పోస్టు కోసం పైరవీలు చేసి మరీ జీఓ తెచ్చుకుంటే అది అమలు కావడానికి మాత్రం క్షేత్రస్థాయిలో నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది తూర్పుగోదావరి జిల్లా విఆర్ పురం ఎంపీడీఓ సుభాషిణికి.. అవును మీరు చదువుతున్నది నిజమే విశాఖజిల్లా పంచాయతీ అధికారిణిగా వున్న క్రష్ణకుమారిని బదిలీల చేస్తూ జిఏడీఓ రిపోర్టుచేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ఐదురోజుల క్రితం జీఓ జారీచేశారు. అదే సమయంలో వీఆర్ పురం ఎంపీడీఓకి ఇదే స్థానాన్ని మంజూరు చేస్తూ డిపీఓ(ఎఫ్ఏసీ)గా చేరాలన్నది ఆ జీఓలోని సారాంశం. అయితే ఒక జిల్లాలో ఏ అధికారికి బదిలీ జిరిగినా, పోస్టింగ్ ఇచ్చినా ఆ జిల్లాలోని ప్రజాప్రతినిధులకు మంత్రులకు, ఆ అధికారియొక్క ట్రాక్ రికార్డ్ ను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ద్వారా తమ జిల్లాలోకి తీసుకొచ్చి పచేయిస్తారు. విచిత్రంగా ఈ ఎంపీడీఓ మాత్రం జిల్లా మంత్రికి తెలియకుండా తాను డిపీఓగా చేరడానికి జీఓ రప్పించుకోవడంలో సఫలీక్రుతారాలయ్యారు. ఆవిషయం కాస్త మంత్రికి, జిల్లా కలెక్టర్ కు తెలియడంతో జిల్లా కలెక్టర్ ఉదయం ఆమెను విధుల్లోకి చేర్చుకోవడానికి విముఖ చూపించారు. పైగా ప్రస్తుతం వున్న అధికారిణి మున్సిపల్ ఎన్నికల్లో అధికారిణిగా ఉండటం, బాగాపనిచేసిన మంచిపేరు సంపాదించారు. అదే సమయంలో ఆ వచ్చే ఎంపీడీఓపై అవినీతి అభియోగాలతోపాటు, క్రిమినల్ కేసులు కూడా కోర్టులో పెండింగ్ లో ఉండటంతో అధికారులు ఈమెను విధుల్లోకి చేర్చుకోవడానికి వెనుకడుగు వేశారు. దీనితో ఉదయమంతా జిల్లా కలెక్టర్ ను కలవడానికి విఫలయత్నం చేసి, ఇక లాభం లేదనుకొని ఏ మంత్రికైతే తెలియకుండా జీఓ తెచ్చుకున్నారో అదే మంత్రి ముత్తంశెట్టిశ్రీనివాసరావును ప్రసన్నం చేసుకోవడానికి మధ్యాహ్నం నుంచి ఆయన వెంట తిరుగుతున్నారు. అందులోనూ ప్రతిష్టాత్మక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో జిల్లా మంత్రి పెద్ద ఎత్తున రాష్ట్ర బంద్ లో పాల్గొన్నా, ఎలాగైనా మంత్రిని కలిసి విధుల్లో చేరిపోవాడానికి విఫల యత్నాలు చేస్తున్నారు అ అధికారిణి. వాస్తవానికి జిల్లా కలెక్టర్ సదరు అధికారిణిని తిరస్కరించారంటే దానికి కారణం ఎన్నికల విధులు ఒక కారణమైతే, మరొక కారణం ఆమె విశాఖజిల్లాకు వస్తున్నారని తెలిసి మీడియా మొత్తం ఆమె అవీనిపై కోడై కూయడం రెండో కారణంగా కనిపిస్తోంది. దానికి తోడు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ యాప్ ఆది నుంచి అవినీతి అధికారిణి సుభాషిణి విషయంలో వాస్తవాలు, ప్రభుత్వ అధికారిక అవినీతి విచారణలు, క్రిమినల్ కేసులు, తూర్పుగోదావరి జిల్లా జెసి, ప్రస్తుత విచారణ అధికారి డిపీఓ ఎంక్వైరీ రిపోర్టులు ఇలా అన్నింటిని అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజాప్రతినిధులకు తెలిసేలా లైవ్ అప్డేట్స్ న్యూస్ కార్డ్స్ గా ఇస్తూ వస్తోంది. ఈ తరుణంలో ఆ అవినీతి అధికారిణిని విశాఖజిల్లా పంచాయతీ అధికారిణి(ఎఫ్ఏసీ)గా చేర్చుకోవడానికి ఎవరూ సముఖ చూపించలేదు. ఇటు జిల్లా కలెక్టర్ దగ్గర ప్రయత్నంచి విఫలమై, అటు ప్రజా ప్రతినిధులను ప్రసన్నం చేసుకుంటూనే జిఓ అమలు కోసం అటు పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చే విషయంలోనూ సదరు అధికారిణి ముందుంటూ వచ్చారు. కానీ పనిమాత్రం జరగలేదు. అసలు ఇన్ని అవినీతి అభియోగాలు, ప్రభుత్వ విచారణలు ఎదుర్కొంటున్న ఒక ప్రభుత్వ అధికారిణి ఎలా మరోచోటికి జిల్లా మంత్రికి కూడా తెలియకుండా బదిలీ చేశారనే విషయం ఇపుడు హాట్ టాపిక్ గామారింది. ఎలాగైనా తనకు తెలిసిన మరో ఎమ్మెల్యే ద్వారా మంత్రితో మంచి అనిపించుకొని విధుల్లోకి చేరాలన్నది ఆమె యొక్క లక్ష్యం.. అసలు ఇన్ని కారణాల నేపథ్యంలో ఆ అవినీతి అధికారిణిని విశాఖజిల్లా డీపీఓగా చేర్చుకుంటారా లేదా అనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. ఈ ఆశక్తి కర జిల్లా పంచాయతీ అధికారిణి అడ్డగోలు పోస్టింగ్ ఆర్డర్ విషయంలో ఆ అవినీతి అధికారిణికి జీఓ ప్రకారం పోస్టింగ్ విశాఖలో ఇచ్చేస్తారా..ఇపుడు జరిగే పని కాదని తిరస్కరిస్తారా..లేదంటే న్యాయ పరమైన చిక్కులొస్తాయని నచ్చజెప్పి పంపుతారా..మరికొంత సమయం వేచి ఉండమంటారా అనే తాజా సమాచారాన్ని ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా మీకు తాజా సమాచారం అందిస్తామని తెలియజేస్తున్నాం.
విశాఖజిల్లా పంచాయతీ అధికారి పోస్టు భర్తీ విషయంలో ఆశక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అవినీతి ఆరోపణలు, విజిలెన్సు విచారణలు పెండింగింగ్ లో ఉన్న తూర్పుగోదావరి జిల్లా విఆర్ పురం ఎంపీడీఓ సుభాషిణికి పంచాయతీరాజ్ శాఖ విశాఖజిల్లా డిపిఓ(ఎఫ్ఏసి)గా బదిలీచేసింది. దీనితో ఆమె శుక్రవారం విధుల్లో చేరిపోవడానికి విశాఖ వచ్చారు. జిల్లా కలెక్టర్ కలవడానికి కార్యాలయానికి వెళితే అక్కడ కలెక్టర్ లేరు. విశాఖజిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా వున్న కలెక్టర్ విధినిర్వహణపై క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నారు. అయితే ఎలాగైనా కలెక్టర్ ను కలిసి తాను విధుల్లోకి చేరిపోవాలన్నట్టుగా సదరు అధికారిణి కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఆమెకు చుక్కెదురైంది. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది ఆమెను మున్సిపల్ ఎన్నికలు తరువాత రావాలని చెప్పేశారు. అయినప్పటికీ ఆమె అక్కడి వుంటే తన నెట్వర్క్ మొత్తాన్ని యాక్టివేట్ చేస్తూ...కలెక్టర్ చక్కెర్లు కొడుతున్నట్టు సమాచారం అందుతుంది. విశాఖజిల్లా డిపీఓగా చేరాలని ప్రభుత్వం జీఓ జారీచేసిన తరుణంలో సదరు అధికారిణి సుభాషిణి ఆరు నెలలుగా విధుల్లోకి చేరకుండా, కేవలం డీపీఓగా చేరిపోవడానికి ఐదురోజుల క్రితం విధుల్లోకి చేరారు. అదీ తన ట్రాన్సఫర్ కమ్ ఇన్చార్జి డిపీఓ పోస్టు కి జీవో వస్తుందని కన్ఫార్మ్ అయిన తరువాత. అంత పెద్ద భారీ నెట్వర్క్ నడిపిన తరువాత జీఓ రావడంతో ఆఘమేఘాలపై ఆమె తన పోస్టు నుంచి రిలీవ్ అయిపోయారు. ఆమె రిలీవ్ అవుతున్నవిషయం తెలుసుకున్న తూర్పుగోదావరి జిల్లా మీడియా ఎంపీడీఓపై అవినీతి ఆరోపణలు, జరుగుతున్న విచారణలు, పెండింగ్ లోవున్న విచారణలు, ప్రభుత్వం ఇచ్చిన మెమో కాపీలను ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక యాప్ ఈఎన్ఎస్ లైవ్ కి సకాలంలో అందించారు. దీనితో ఈఎన్ఎస్ లైవ్ యాప్ వాస్తవాలను న్యూస్ కార్డ్ గా తీసుకురావడంతో, ఎలాగైనా అడ్డంకులు పెరిగిపోతున్నాయని, తక్షణమే విధుల్లోకి చేరిపోతే అన్నింటికి పులుస్టాఫ్ పెట్టాలని భావించిన అధికారిణి విశాఖ వచ్చేశారు. తీరా విశాఖ వచ్చిన తరువాత జిల్లా కలెక్టర్ ని కలవడం కుదరలేదు. పైగా ఈరోజు ప్రభుత్వం అధికారికంగా బంద్ నిర్వహించమని చెప్పడంతో అధికారులంతా నల్ల బ్యాడ్జిలు తగిలించుకొని విధుల్లో ఉన్నారు. అయినప్పటికీ తనకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి నుంచి జీఓ రావడంతో దానినైనా అధికారులు పాటిస్తారని, తనపై అవినీతి ఆరోపణలు, విచారణలు ఉన్నప్పటికీ జీఓ ప్రకారం విధుల్లోకి చేర్చుకుంటారని విశాఖ వచ్చేసినా ఫలితం లేకపోయింది. దీనితో ఆమె కలెక్టర్ క్యాంపు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, ఇటు రాజకీయంగా, అటు అధికారింగా పైరవీలు మొదులు పెట్టినట్టు సమాచారం అందుతుంది. కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఎంపీడీఓకి చెప్పినప్పటికీ ఎలాగైనా కలెక్టర్ ను కలిసి, విశాఖజిల్లా డిపీఓగా చేరిపోవాలని పట్టుదలతోనే అక్కడే వుండిపోయినట్టు చెతున్నారు. దానికితోడూ, ఒక ప్రజాప్రతినిధికి తెలియకుండా లేఖలు తీసుకొని వెళ్లి, చాలా పెద్ద నెట్వర్క్ వినియోగించి జీఓ తెచ్చుకున్నతరువాత, ఈమె అవినీతి ఆరోపణలు తెరమీదకు రావడం, ఆపై తూర్పుగోదావరి జిల్లా నుంచి రాష్ట్రవ్యాప్తంగా వైరల్ కావడమూ జరిగిపోయాయి. ఇంతజరిగిన్పటికీ తమ శాఖ జారీ చేసిన జీఓ పై ఉన్న నమ్మకంతో విశాఖ వచ్చి ప్రస్తుతం గాల్లో ఉన్నారు ఎంపీడీఓ సుభాషిణి. ఈ ఆశక్తికర ఎపిసోడ్ లో తూర్పుగోదావరి జిల్లాలోనే అత్యధిక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ వార్తల్లో నిలిచిన ఈ ఎంపీడీఓ విశాఖజిల్లా డిపీఓగా(ఎఫ్ఏసీ)గా బాధ్యతలు స్వీకరిస్తారా, లేదంటే ఎన్నికల తరువాత ఈ తతంగానికి శుభం కార్డు పడుతుందా, ఈ లోగా ఈమెపై వున్న అవినీతి ఆరోపణ ఫైల్స్ ను ప్రభుత్వంలోని అధికారులు మళ్లీ తెరపైకి తెస్తారా, తెచ్చినా, తేకపోయినా ఆమెకి పోస్టింగ్ విశాఖలోనే ఇచ్చేస్తారా, ఇచ్చిన తరువాత న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటారా అనే విషయమై ఆశక్తికర చర్చ నడుస్తుంది. వాటిటి ఎప్పటికప్పుడు ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ మీకు అందజేస్తుందని తెలియజేస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామసచివాలయ వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఇపుడు ఆ సేవలను మరింతగా పెంచాలని, గ్రామస్థాయిలో సమస్యలన్నీ సచివాలయాల్లోనే పరిష్కరించాలని యోచించి ప్రతినిత్యం స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించే సరికొత్త కార్యక్రమానికి తెరతీసింది. దీనితో ఇప్పటి వరకూ ఆడుతూపాడుతూ పనిచేసిన సచివాలయ సిబ్బంది ఉదయం 10 గంటల నుంచి ఆయా శాఖలకు చెందిన వారు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను గుర్తించాలి. ఆతరువాత ప్రతీరోజూ మూడు గంటల నుంచి ఐదు గంటల వరకూ సచివాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి ఆ సమస్యలను పరిష్కరించాలి. ఇలా ఏ సచివాయలం నుంచి ఎన్ని సమస్యలు పరిష్కరించారో కూడా ప్రభుత్వం దగ్గర డేష్ బోర్డులో నమోదు అవుతాయి. గతంలో మాదిరిగా తాము చాలా కష్టపడి పనిచేసేశామని సచివాలయ సిబ్బంది చెప్పడానికి వీలుండదు. వారు ఎంతలా పనిచేశారు..గ్రామంలో ఎన్ని సమస్యలు పరిష్కరించారనే దానిపై కంప్యూటర్ మొత్తం లెక్కలు తేలుస్తుంది. గతంలో సచివాలయాల్లో ప్రతీ సోమవారం మాత్రమే స్పందన నిర్వహించేవారు. అయినప్పటికీ సమస్యలు పరిష్కారం అయ్యేవి కాదు. దీనితో గ్రామస్తులంతా జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి తమ సమస్యలపై కలెక్టర్ కు అర్జీ పెట్టుకుంటే అదే దరఖాస్తు సచివాలయం వరకూ వచ్చేది. ఓ పనికి రెండు పనులు అయ్యేవి. దీనిపై కాస్త గట్టిగా ద్రుష్టి పెట్టిన ప్రభుత్వం గ్రామసచివాలయ పరిధిలోనే సమస్యలు పరిష్కరించేలా నిత్య స్పందన కార్యక్రమం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ప్రతీరోజూ స్పందన కార్యక్రమం నిర్వహించాల్సి వుంటుంది. ఆ విషయాన్ని గ్రామవాలంటీర్లు వారికి కేటాయించిన 50 కుటుంబాల వారికి తెలియజేయాల్సి వుంటుంది. ఎవరికైనా సమస్యలపై దరఖాస్తు పెట్టడం రాకపోయినా వారికి వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తెలియజేయాలి. ఆవిధంగా గ్రామంలోని సమస్యలను నేరుగా సచివాలయ సిబ్బంది పరిష్కరించాలి. వారి పరిధిలో పరిష్కారం కాని సమస్యలను మండల కేంద్రానికి పంపాలి. అలా అక్కడ కూడా పరిష్కారం కాకపోతే జిల్లా కలెక్టర్ ద్రుష్టికి సమస్య వెళుతుంది. అక్కడ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం అధికారులు చర్యలు తీసుకుంటారు. తద్వారా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమానికి వినతులు తగ్గించి, వారిని పరిపాలన, అభివ్రుద్ధిపై ద్రుష్టి పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గ్రామంలో సచివాలయాలు ఉన్నా నేటికీ జిల్లా కార్యాలయాలకు అత్యధిక స్థాయిలో స్పందన దరకాస్తులు రావడమే దీనికి కారణంగా కనిపిస్తుంది. ఈ విషయంలో ఏ సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినా, సమస్య పరిష్కారంలో చేయి తడిపే వ్యవహారాలకు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని జిల్లాల గ్రామసచివాలయాల జాయింట్ కలెక్టర్లకు ఈ మేరకు ఉత్తర్వులు వచ్చాయి. వాటి అపుడే జెసిలంతా జిల్లాలో స్పందన కార్యక్రమాలు ప్రారంభించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో స్పందన కార్యక్రమం గ్రామసచివాలయాల్లో జరగడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతుండగా, కొన్ని సచివాలయాల్లో ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి స్పందన కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా విశేషం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా సచివాలయ సిబ్బంది ప్రతీరోజూ చేతినిండా పనిదొరకడంతోపాటు, గ్రామస్థాయిలోనే సమస్యల పరిష్కారినికి మార్గం చూపించడానికి వీలుపడుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిత్య స్పందన కార్యక్రమం ఏ స్థాయిలో విజయవంతం అవుతందనేది ఆరునెలల కాలలో తేలిపోతుంది.
తూర్పుగోదావరి జిల్లా చరిత్రలోనే అత్యధిక మొత్తంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ పనిష్మెంట్ పై రాజమండ్రి రూరల్ నుంచి వీర్ పురం బదిలీపై వెళ్లిన ఎంపీడీఓ సుభాషిణి ఆరు నెలలు విధుల్లో చేరకపోయినా విశాఖజిల్లాలో డిపీఓ(ఎఫ్ఏసి)గా చేరిపోవడానికి మాత్రం ఆగమేఘాలపై గురువారం రిలీవ్ అయిపోయారు. ప్రభుత్వం విడుదల చేసిన జీఓ ప్రకారం ఆమె శుక్రవారం విశాఖ జిల్లా కలెక్టర్ ను కలిసి డిపీఓగా ఆమె విధుల్లోకి చేరిపోవడానికి వచ్చేస్తున్నారు. ఈ అవినీతి ఆరోపణలు, మినిస్టీరియల్, విజిలెన్స్ విచారణలు ఎదుర్కొంటూ రిపోర్టులు పెండింగ్ లోవున్న ఈ అధికారి నియామకాన్ని ఎలాగైనా ఆపాలని జిల్లా యంత్రాంగం ప్రయత్నిస్తున్నప్పటికీ తన నెట్వర్క్ మొత్తం స్టేట్ లెవల్ లో వినియోగించి, జిల్లా మంత్రికి ఆమె పోస్టింగ్ విషయం తెలియజేయకుండానే
ఆమె విశాఖ వస్తున్నారు. ప్రస్తుతం విశాఖలో జీవిఎంసీ ఎన్నికల విధినిర్వహణలో ఉన్న ప్రస్తుతం డిపీఓ క్రిష్ణకుమారిని కదిపే పరిస్థితిలేదు. కొత్తగా అధికారి వచ్చి చేరడానికి కూడా ఇక్కడ అధికారులు సముఖంగా లేరని సమాచారం. అయినప్పటికీ పంచాయతీరాజ్ శాఖలోని ముఖ్య అధికారులు జారీ చేసి జీఓ ప్రకారం విశాఖలో ఎఫ్ఏసీ డిపిఓగా విధుల్లో చేరిపోవడానికి మాత్రం వచ్చేస్తున్నారు. ఈమె అవినీతి విషయంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ఆధారాలతో సహా న్యూస్ కార్డ్స్ ప్రచురిస్తూ వస్తోంది. ఆపై తూర్పుగోదావరి జిల్లా మీడియా ఇచ్చిన సమాచారంతో విశాఖజిల్లాలోని మీడియా కూడా ప్రత్యేక కధనాలు అందిస్తోంది కూడా. అవి విశాఖ పట్నం నుంచి రాజధాని అమరావతి వరకూ గత నాలుగు రోజులుగా వైరల్ అవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఒక్కపూటలో జీఓ రప్పించుకోవడమే కాకుండా అధికారులు ఉత్తర్వుల ప్రకారం తన నియామకాన్ని ఏఒక్కరూ నిలుపుదల చేయలేరని భావించిన ఆ అధికారిణి శుక్రవారం విధుల్లో చేరడానికి సిద్దమయ్యారు. ఈ అధికారిణి పట్టుబట్టిన స్థానం కోసం విశాఖ జిల్లా అధికారులు సముఖంగా లేకపోయినా, పంచాయతీరాజ్ శాఖ నుంచి రాష్ట్ర అధికారులు ఆదేశిస్తే ఆ అధికారిణి విశాఖజిల్లా డిపీఓగా చేరడానికి ఆస్కారం వుంటుంది. లేదంటే ప్రస్తుతం వున్న డిపీఓ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక, ప్రభుత్వ నిబంధనలు, అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ ను ఇటు విశాఖజిల్లా అధికారులు కూడా అమలు చేస్తే ఆ అధికారిణి విశాఖజిల్లాలో చేరడానికి మాత్రం ఆస్కారం వుండదు. ఒక వేళ అప్పటికీ రాష్ట్ర అధికారులు ఒత్తిడితో విధుల్లోకి చేరినా, ఆపై న్యాయపరమైన ఇబ్బందులు సదరు అధికారిణి, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, విచారణలు మధ్యలో వున్న సమయంలో పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చినందుకు రాష్ట్ర అధికారులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తుంది. శుక్రవారం పదిగంటలు దాటితే ఏం జరుగుతుందనేది తేలిపోనుంది. ఉత్కంఠగా సాగుతున్న ఎ ఎపిసోడ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఈఎన్ఎస్ లైవ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉంటుందని తెలియజేస్తున్నాం..!
గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటై సుమారు 16 నెలలు కావొస్తున్నా..ఇంకా ఇక్కడ అందే సేవలపై గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన లేదు.. కాదు కాదు సచివాలయ సిబ్బంది అవగాహన పెంచలేదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది, వాలంటీర్లు ఉన్నా వాంతా పించన్లు ఇచ్చిన తరువాత కార్యాలయాల్లో పిచ్చాపాటి కబుర్లే పరిమితం అవుతున్నారు తప్పితే ప్రజలకు గ్రామసచివాలయాల్లో ఎన్ని ప్రభుత్వశాఖల సిబ్బంది ఉన్నారు, ఏ తరహా సేవలు అందుబాటులో ఉన్నాయి, ఏ సేవకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనే విషయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లలేదంటే అతిశయోక్తి కాదు. వాస్తవానికి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం అందించే సేవల వివరాలు ప్రజలకు తెలిసేలా చైతన్యం తీసుకు వస్తే.. జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమానికి 50శాతనికి పైగా అర్జీలు తగ్గుతాయి. కానీ ఆదిశగా ప్రభుత్వం ముందడుగు వేయలేదు. రాష్ట్రంలో కొన్ని కొన్ని గ్రామసచివాలయాల్లో తప్పితే మరెక్కడా సచివాలయ సేవలపై కనీసం ప్లెక్సీలుగానీ, బోర్డులు గానీ ఏర్పాటు చేయలేదు. చాలా సచివాలయాల్లో నేటికీ ఏ పనికి ఎంత మొత్తం చెల్లించాలో తెలియకపోవడంతో ప్రజలు ప్రభుత్వానికి, అక్కడ పనిచేసే సిబ్బందికి ఇద్దరికీ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు పెళ్లి ద్రువీకరణ పత్రానికి సచివాలయం ద్వారా ప్రభుత్వానికి చెల్లించే మొత్తం రూ.100 ఉంటే దానికి గ్రామసచివాలయాలు, దేవస్థానాల వద్ద ఉండే సచివాలయాల్లో తక్కువలో తక్కువ 3వేల నుంచి 5వేల రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. అదేవిధంగా ఆస్తి సర్వేకి రూ.700 ఛలానా వుంటే 2వేల నుంచి 5వేల వరకూ వసూలు చేస్తున్నారు. వీధిలైట్ల రిపేరుకి, కుళాయిల రిపేరికి అదే పరిస్థితి. చాలా పంచాయతీల్లో నేటికీ శానిటేషన్ సబ్బంది లేదక చెత్తను ఎత్తే నాధుడే లేడు. ఉన్న ఒక్క వ్యక్తి ఎంతో కొంత ఇస్తే తప్పా ఆ చెత్తను కూడా తీసుకెళ్లడం లేదు. అనుకున్న, అడిగిన మొత్తం ఇవ్వకపోవే ఆ పని పూర్తి కావడానికి, చేయడానికి ప్రభుత్వ నిబంధనలు అడ్డువచ్చి చివరాఖరి రోజు గానీ చేయడం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే గ్రామసచివాలయాల్లో ప్రభుత్వం నియమించిన 14శాఖల సిబ్బంది డ్యూటీ చార్టు ప్రకారం వారంతా ప్రజల్లోనే ఉండి, ప్రభుత్వ సేవల కోసం ప్రజల్లో చైతన్యం తీసుకు రావాల్సిన పరిస్థితి. కానీ చాలా చోట్ల సిబ్బంది మొత్తమంతా కార్యాలయాలకే పరిమితం అవుతున్నారు. అందులో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, మహిళా సంరక్షణా కార్యదర్శిలు, ఆరోగ్య సహాయకులు మాత్రం వారికి కేటాయించిన ప్రాంతాల్లో ప్రభుత్వ సేవలకు వెళుతున్నట్టు కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో సర్వేయర్లకు కూడా చేతినిండి పని దొరికింది. గ్రామ కార్యదర్శిలు గ్రామాల్లో పారిశుధ్యాన్ని తరచుగా పరిశీలిస్తూ ఉండాలి. కానీ అధికారులు వచ్చినపుడు, ప్రజాప్రతినిధులు వచ్చినపుడు తప్పితే వీరు బయటకు వచ్చే పరిస్థితే కనిపించదు. మరికొందరు కార్యదర్శిలు వాలంటీర్లను సైతం వారికి కేటాయించిన ఇళ్లకు వెళ్లకుండా కార్యాలయంలోనే మీటింగుల పేరుతో ఉంచేస్తున్నారు. ఇంత జరుగుతున్న సమయంలో ప్రభుత్వం ప్రజలకు గ్రామసచివాలయాల ద్వారా అందించే సేవలు ఎలా తెలుస్తాయో అధికారులే సమాధానం చెప్పాల్సి వుంటుంది. ఇక వెల్పేర్ అసిస్టెంట్లు విషయానికొస్తే వారికి 1వ తేది నుంచి 15 వతేదీ వరకూ నిరంతరం పనిలో ఉంటారు. డిటిటల్ అసిస్టెంట్ కార్యాలయాలకే పరిమితం అవుతారు. వీఆర్వోలు ఉంటే సచివాలయంలో లేదంటే తహశీల్దార్ కార్యాలయంలోనూ ఉంటున్నారు. ఇలా ఎవరికి వారు ఎమునా తీరే అన్నట్టుగా ఉండటం, సమయం వచ్చినపుడు పనిచేసి మిగిలిన సమయాల్లో కార్యాలయాలకే పరిమితం కాకుండా అప్పుడప్పుడు గ్రామసభలు ఏర్పాటు చేసిన సందర్భంలో నైనా ఏ గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఎన్నిశాఖల సిబ్బంది ఉంటున్నారు, వారి ద్వారా ప్రజలకు ఎలాంటి సేవలు అందుతాయి, దానికి ప్రభుత్వానికి ఎంత ఛలానా కట్టాల్సివుంటుంది అనే కోణంపై నేటికీ ఒక్కసారికి కూడా ప్రజా చైతన్యం తీసుకొచ్చిన పాపన పోలేదు. సిబ్బంది ప్రొబిషన్ సమయంలోనే ఇలా వుంటే మరో ఆరు నెలల్లో వీరి ఉద్యోగాలన్నీ రెగ్యులర్ అయిన తరువాత మరింతగా వారికి నచ్చినట్టు విధులు నిర్వహించే అవకాశం వుంది. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కేటాయించిన విధులతోపాటు, సచివాలయం ద్వారా ఏ ఏ ప్రభుత్వ సేవలు అందిస్తున్నారో తెలియజేస్తే స్పందన కార్యక్రమానికి అర్జీలు పెరుగుతాయి. లేదంటే యదా రాజా తధా ప్రజా అన్నట్టుగా స్పందన అర్జీ పట్టుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లక తప్పదు. ఈ విషయంలో ప్రభుత్వంగానీ, సచివాలయాల శాఖ జెసిలుగానీ, జిల్లా పంచాయతీ అధికారులు గానీ, మండల స్థాయిలో ఎంపీడీఓలుగాని ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి..!