1 ENS Live Breaking News

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సర్పంచ్ అయ్యాడు..

ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి నెలకు లక్షల్లో జీతం..పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం..కారు బంగ్లా, మంచి హోదా,ఆస్తి అంతస్తు..కానీ ఇవేమీ అతగాడికి నచ్చలేదు. సుదీర్ఘ కాలం సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేసి దేశ విదేశాలు తిరిగి తిరిగి ఆ కార్పోరేట్ ఉద్యోగాన్ని, జీతాలను ఏమీ కాకుండా వదిలేసి సేవచేయడానికి సొంత గ్రామానికి వచ్చేశాడు.. సర్పంచ్ బరిలో నిలబడి ముగ్గురు ప్రత్యర్ధులను మట్టికరిపించి మరీ సర్పంచ్ అయిపోయాడు ఆయన పేరే పందిరి సత్యన్నారాయణ, ఇతగాడిని అంతా చిన్ననాటి నుంచి సత్యంనాయుడు అని ముద్దుగా పిలుస్తుంటారు. ఈయన తండ్రి పందిరి అప్పారావు 30ఏళ్లు పాతూరుగా పిలబడే క్రిష్ణదేవీపేట గ్రామానికి సర్పంచ్ గా సేవలు అందించారు. పుట్టిన గ్రామానికి తనవంతు సహకారం అందించాలని, గ్రామాన్ని జిల్లాలోనే బెస్ట్ గ్రామంగా అభివ్రుద్ధి చేయాలని నిర్ణయించుకొని సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి ప్రజలు యువత మద్దతులో సర్పంచ్ అయిపోయాడీ యువకుడు. విశాఖజిల్లా, గొలుగొండ మండలం, క్రిష్ణదేవిపేట(అల్లూరి సీతారామరాజు బ్రిటీషు సేనలను ఎదిరించి మన్యం పితూరీ నడిపిన పోరాటాల పురిటిగడ్డ)లో పంచాయతీ పోరులో అల్లూరి సాక్షిగా నిలబడి అందరినీ ఓడించి వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా సర్పంచ్ సీటుకు కైవసం చేసుకున్నాడు. యువత, మహిళలు మొత్తం ఈ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కే మద్దతు పలకడం ఈయన గెలుపునకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకపోయింది. గ్రామంలో ప్రధాన సమస్యలను గుర్తించి వాటికి ప్రత్యేక కార్యాచరణ కూడా తయారు చేసి ఒక క్రమబద్ధంగా గ్రామాన్ని అభివ్రుద్ధి చేయడాని పూనుకుని అదే విషయాన్ని ప్రజలకు చెప్పాడు.. అసలే సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేశాడేమో...గ్రామంలోని సమస్యలన్నింటినీ ఫోటోలు, వీడియోలతో సహా అన్ని ప్రాంతాలను కంప్యూటరీకరణ చేసిమరీ మొత్తం సిద్ధం చేసి అన్ని వార్డుల్లోనూ తిరుగుతూనే ప్రజలందరికీ వివరించాడు. గ్రామంలోని అన్ని వర్గాలకు అనుగుణంగా అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రత్యేక ప్రోగ్రామ్ షీట్ నే తయారు చేసుకుని మరి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాడు. ఇంట్లోనే రెండు కంప్యూటర్లు, ప్రింటర్లు, జెరాక్సు మిషన్లు పెట్టి ప్రభుత్వ పథకాలకు స్థానికులు దరఖాస్తు చేసుకునే ప్రతీ కార్యక్రమానికి తనవంతుగా సహాయం చేయడం మొదలు పెట్టి ప్రజల మనసులను గెలుచుకున్నాడు. అన్ని దగ్గరుండి అన్ని పథకాలకు దరఖాస్తులు చేయిస్తూ గ్రామస్తులకు సహాయ పడుతూ వచ్చాడు. ఒక వేళ మండల కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చినా తానే దగ్గరుండి మరీ వారిని తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడంలో తనవంతుగా చేయూతనిచ్చేవాడు. దీనితో.. ప్రజల మనిషిగా గుర్తింపు పడటం, అదే సమయంలో తన తమ్ముడు పందిరి వెంకటరమణ(ఆర్ఎంపీ బుజ్జి) కూడా ప్రజలకు తనవంతుగా ప్రాధమిక వైద్యం అందించడం, ప్రజలకు చిన్న చిన్న సేవలు చేయడంతో గ్రామస్తులంతా ఏకమై మళ్లీ మరోసారి ఈ కుటుంబం నుంచే సత్యంనాయుడుని సర్పంచ్ గా ఎన్నుకున్నారు. గ్రామంలో వాలంటీర్లు ఉన్నప్పటికీ వారికంటే ఎక్కువగా సేవలదించడంలో ముందుంటడంతో ముఖ్యంగా మహిళలకు, యువతకు బాగా చేరువయ్యాడు ఈ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. మరో విశేషం ఏంటంటే కరోనా సమయంలో గ్రామస్తులకు సేవ చేయడానికి ప్రాధమిక వైద్యం(ఫ్టస్ట్ ఎయిడ్ సర్వీస్) అందించడానికి విశేషంగా క్రుషిచేశారు.. గ్రామంలో ఎవరికి జర్వం వచ్చినా, దగ్గొచ్చినా తక్షణమే  ప్రాధమిక వైద్యం చేస్తూ, ఎవ్వరికీ లేదు అనిపించుకోకుండా వైద్యసేవలు చేశారు. కరోనా సమయంలోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లోకే జనాలను రానీయని సమయంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, గ్రామంలోని ప్రజలందరికీ ప్రత్యేకంగా సేవలదించింది ఈ కుటుంబం. పైగా ఆ సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో ఒకసారి కూరగాయలు, మరోసారి మాస్కులు, ఇంకోసారి సబ్బులు పంపిణీ కూడా చేశారు. వీరి కుటుంబం మొత్తం ప్రజాసేవలోనే ఉంటూ గ్రామస్తుల నోట్లో నానుతూ రావడంతో ఈ కుటుంబం నుంచే మరోసారి సత్యంనాయుడు సర్పంచ్ కావడానికి అవకాశం వచ్చింది.. ఒక కుటుంబం మొత్తం ప్రజాసేవకు పూనుకోవడం విశాఖజిల్లాలోనే ఇపుడు హాట్ టాపిక్..అందులోనూ బరిలో నిలబడి కులరాజకీయం చేయాలని చూసినా.. వారందరినీ తోసిరాజని సర్పంచ్ సీటు కైవసం చేసుకున్నాడు సత్యంనాయుడు.. ఎంత చదువు చదువుకున్నా లక్షల జీతం కోసం అంతా అర్రులు చాస్తున్న ఈ రోజుల్లో అదే లక్షల రూపాయల జీతాలన్ని, మంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని సైతం వదులుకొని, గ్రామాభివ్రుద్ధికోసం పంచాయతీ సర్పంచ్ గా బరిలో నిలబడి గెలిచి తన పట్టుని నిరూపించుకున్నాడు. గెలవగానే గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానని అందరికి తెలియజేశాడు కూడా. సాఫ్ట్ వేర్ ఇంజనీర్..హార్డ్ వేర్ లాంటి రాజకీయంలో నెగ్గి ఆ విజయాన్ని తమ నియోజకవర్గ ఎమ్మెల్యేతో కూడా పంచుకోవడం కూడా ఇపుడు జిల్లాలోనూ, పార్టీలోనూ హాట్ టాపిక్ మారుతోంది. మంచి ఆలోచనతో, గ్రామాభివ్రుద్ధికి  నడుంబిగించి సర్పంచ్ అయిన సాఫ్ట్ వేర్ఇంజనీర్ ని మనమూ అభినందిద్దాం..!

Krishnadevipeta

2021-02-16 12:10:12

2021-02-15 22:34:45

2021-02-15 22:27:44

ఎన్నికల జరగనున్న మున్సిపాలిటీలు ఇవే

ఆంధ్రప్రదేశ్ లోని  అన్నిమున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్న వాటిని ఎన్నికల సంఘం ప్రకటించింది. వివరాలు వారీగా చూసుకుంటే..శ్రీకాకుళం జిల్లా: ఇచ్చాపురం, పలాస-కాశీబుగ్గ, పాలకొండ , విజయనగరం జిల్లా: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, నెలిమర్ల,  విశాఖపట్నం జిల్లా: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, నర్సీపట్నం, యలమంచిలి , తూర్పుగోదావరి జిల్లా: అమలాపురం, తుని, పిఠాపురం, సామర్లకోట, మండపేట, రామచంద్రాపురం, పెద్దాపురం, యేలేశ్వరం, గొల్లప్రోలు, ముమ్మిడివరం, పశ్చిమ గోదావరి జిల్లా: ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్, నరసాపురం, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, కృష్ణాజిల్లా: విజయవాడ, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లు, నూజివీడు, పెడన, ఉయ్యూరు, నందిగామ, తిరువూరు ,గుంటూరు జిల్లా: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్, తెనాలి, చిలకలూరిపేట, రేపల్లె, మాచర్ల, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల, ప్రకాశం జిల్లా: ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్, మార్కాపురం, అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు,చీరాల. నెల్లూరు జిల్లా: వెంకటగిరి, ఆత్మకూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట,  అనంతపురం జిల్లా: అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్, హిందూపూర్, గుంతకల్లు, తాడిపజ్రి, ధర్మవరం, కదిరి, రాయదుర్గం, గుత్తి, కల్యాణదుర్గం, పుట్టపర్తి, మడకశిర , కర్నూలు జిల్లా: కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్, ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు, గూడురు, ఆళ్లగళ్ల, ఆత్మకూరు, కడప జిల్లా: కడప మున్సిపల్ కార్పొరేషన్, ప్రొద్దటూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, రాయచోటి, మైదకూరు, యర్రగుంట్ల , చిత్తూరు జిల్లా: తిరుపతి, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లు, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, నగరి, పుత్తూరు, షెడ్యూల్ విడుదల కావడంతో ఆయా ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ పథకాలు, పార్టీల పోస్టర్లు, విగ్రహాలపై ముసుగులు వేయాల్సిందిగా ఎస్ఈసీ ఆదేశించింది. అలాగే ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఇవాళ్టి నుంచి మార్చి 15 వరకు కోడ్ అమల్లో ఉండనుంది.

తాడేపల్లి

2021-02-15 22:21:02

వసంత పంచమి ఎందకు మంచిదో తెలిస్తే..

వసంత పంచమి పర్వదినం మాఘ శుద్ధ పంచమి రోజున వస్తుంది. శ్రీ పంచమి అని కూడా దీన్ని అంటారు. ఈ పర్వదినాన్ని ఉత్తర భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు. వసంత పంచమి రోజున లక్ష్మీదేవిని పూజచేస్తే సర్వ శుభాలు కలుగుతుంది. రతీ మన్మథులను పూజించి మహోత్సవం నిర్వహించాలని, దానం చేయాలని, దీని వల్ల వసంతుడు సంతోషిస్తాడని నిర్ణయాత్మకారుడు తెలిపాడు. అందువల్ల దీనిని వసంతోత్సవం అని కూడా అంటారు. ‘మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. ఆ రోజున విష్ణువును పూజించాలి.  చైత్ర శుద్ధ పంచమి రోజు మాదిరిగానే బ్రాహ్మణులకు సంతర్పణ చేయాలి’ అని వ్రత చూడామణిలో ఉంది. వసంత ఋతువు రాకను భారతదేశమంతటా వసంతపంచమి పండుగగా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ మాఘ శుక్ల పంచమినాడు వస్తుంది. తూర్పు భారతదేశంలో దీనిని సరస్వతీ పూజగా జరుపుకుంటారు. జ్ఞానానికి అధిదేవత సరస్వతి. ఆమె జ్ఞానస్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైన వాటిని చదువులతల్లి సరస్వతి అంశాలుగా మన పెద్దలు భావించారు. సృజనాత్మక శక్తికీ, స్ఫూర్తికీ కూడా వీణాపాణి అయిన సరస్వతిని సంకేతంగా చెప్పడం మన సంప్రదాయం. సరస్వతీం శుక్లవర్ణాం సుస్మితాం సుమనోహరామ్‌ కోటిచంద్ర ప్రభా ముష్ట పుష్ట శ్రీయుక్త విగ్రహమ్‌ వహ్ని శుధ్ధాంశుకాధానం వీణా పుస్తక ధారిణీమ్‌ రత్న సారేంద్ర నిర్మాణ నవ భూషణ భూషితామ్‌ జ్ఞానశక్తికి అధిష్టాన దేవత- సరస్వతీమాత. జ్ఞాన, వివేక, దూరదర్శిత్వ, బుద్ధిమత్తత, విచార శీలం తదితరాలను శ్రీవాణి అనుగ్రహిస్తుందంటారు. సత్వ రజస్తమో గుణాలను బట్టి అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాతను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా కీర్తిస్తారు. ఈ ముగ్గురిలో సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి. అహింసాదేవి. ఆమెకు యుద్ధంచేసే ఆయుధాలు ఏమీ ఉండవు. బ్రహ్మ వ్కెవర్త పురాణం సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా పేర్కొంటోంది. ధవళమూర్తిగా పద్మంపై ఆసీనురాల్కె ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతులీనుతూ ఆశ్రిత వరదాయినిగా దర్శనమిస్తుంది. మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమిగా, మదన పంచమిగా, వసంత పంచమిగా, సరస్వతీ జయంతిగా జరుపుకొంటారు. వసంత పంచమి నామాన్ని బట్టి దీన్ని ఋతు సంబంధమైన పర్వదినంగా భావించాలి. మకర సంక్రమణం తరవాత, క్రమక్రమంగా వసంత ఋతువు లక్షణాలు ప్రకృతిలో కనిపిస్తాయి. మాఘమాసం వసంత ఋతువుకు స్వాగత గీతం ఆలపిస్తుంది. ఆ వసంత ఋతువు శోభకు ‘వసంత పంచమి’ వేడుక శ్రీకారం చుడుతుంది. సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. ప్రవాహం చ్కెతన్యానికి ప్రతీక. జలం జీవశక్తికి సంకేతం. నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తుంది. ఉత్పాదకతను పెంపొందిస్తుంది. ఈ ఉత్పాదకత వసంత ఋతువు నుంచి ఆరంభమవుతుంది. ఆ ఉత్పాదకశక్తికి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడ్కెన, సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదామాతే శక్తిదాయిని.ఉత్పాదకతను పెంపొందిస్తుంది. ఈ ఉత్పాదకత వసంత ఋతువు నుంచి ఆరంభమవుతుంది. ఆ ఉత్పాదకశక్తికి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడ్కెన, సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదామాతే శక్తిదాయిని. కాబట్టి వసంత పంచమి వసంతానికి ఆరంభ సూచకమైతే, ఈ రోజున సరస్వతీ పూజను నిర్వహించుకోవడం సహేతుకం. శ్రీ అంటే సంపద. జ్ఞాన సంపత్ప్రద అయిన సరస్వతిని ఈ రోజున పూజించడం విశేష ఫలప్రదమని చెబుతారు. అందుకే ఈ పర్వదినానికి శ్రీ పంచమి అని కూడా పేరు. శ్రీ పంచమినే రతి కామ దమనోత్సవంగా వ్యవహరిస్తారు. మాఘ శుక్ల పంచమినాడు రతీదేవి కామదేవ పూజ చేసినట్లు పౌరాణికులు చెబుతారు. ఋతురాజు అయిన వసంతానికి కామదేవునికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. వసంతుడు సస్యదేవత, కాముడు ప్రేమదేవత, రతీదేవి అనురాగదేవత. ఈ ముగ్గురినీ వసంత పంచమినాడు పూజించడం వల్ల వ్యక్తుల్లో పరస్పర ప్రేమానురాగాలు పరఢవిల్లుతాయని లోకోక్తి. ఇలాంటి ఎన్నో ఆంతర్యాల సమ్మేళనం- వసంత పంచమి పర్వదినం. చదువులతల్లి సరస్వతి పుట్టిన రోజైన వసంత పంచమి వేడుకలను ఆదిలాబాద్‌ జిల్లాలోని బాసరలో వెలసిన శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో ప్రతి ఏటా జరుపుతారు. వేకువజాము నుండే మంగళవాద్యసేవ, సుప్రభాత సేవలతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అనంతరం అమ్మవారికి మహాభిషేకం నిర్వహించి అలంకరణ, నివేదన, హారతి ఉంటాయి. రోజంతా చండీవాహనం, వేదపారాయణం, అమ్మవారికి మహాపూజ జరుగుతుంది. సాయంత్రం పల్లకీలో అమ్మవారిని ఊరేగిస్తారు. వసంత పంచమి రోజు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి శ్రేష్టమైన దినంగా భక్తులు భావిస్తారు. మన రాష్ట్రం నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తారు.

Visakhapatnam

2021-02-15 21:42:19

2021-02-15 19:23:11

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రవాహం..

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రవాహం కొనసాగుతుంది..గత ప్రభుత్వంలో జరగని స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్ల ఎన్నికలు నిర్వహించడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం యమ స్పీడుతో ఉంది. తొలుతగా గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీల ఎన్నికలను పూర్తి చేస్తున్న ప్రభుత్వం, ఎన్నికల సంఘం తరువాత మండల పరిషత్ లు, జిల్లా పరిషత్ లు నిర్ణయానికి వచ్చింది. ఆపై మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పోరేషన్లకు కూడా ఇదే గెలుపు ప్రవాహంలోనే నిర్వహించాలని భావిస్తోంది. కరోనా వలన చాలా కాలం ఎన్నికలు జరపడానికి ప్రభుత్వం నిరాకరించినా తరువాత మాత్రం అన్నింటికి ఓకేసారి ఎన్నికలు నిర్వహించి రికార్డు స్రుష్టించే పనిలో వుంది. ఇప్పటికే తొలి రెండు విడదల ఎన్నికల్లో భారీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇపుడు అదే జోష్ తో అన్ని ప్రాంతాల్లోనూ ఎన్నికలు ఏర్పాటు చేసి ప్రజల్లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి కార్యాచరణ రూపొందించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. టిడిపి అధికారంలో ఉన్న సమయంలో చాలా కార్పోరేషన్లకు చైర్మన్లను నియమించని అప్పటి ప్రభుత్వానికి ధీటుగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చాలా కార్పోరేషన్లకు చైర్మన్లను, డైరెక్టర్లను నియమించి ఫుల్ జోష్ ఎన్నికలను నిర్వహిస్తోంది. ఇదే సమయంలో అన్నింటికి ఎన్నికలు నిర్వహించేస్తే..ఓ పనైపోతుందని భావించిన ప్రభుత్వం...ఎన్నికల ప్రవాహాన్ని కొనిసాగించేయడం విశేషం.

Velagapudi

2021-02-15 12:50:18

2021-02-14 16:26:59

2021-02-13 13:46:14

2021-02-12 09:31:01

Hyderabad

2021-02-11 09:25:48

Velagapudi

2021-02-10 21:50:05