1 ENS Live Breaking News

Cyberabad Police

2021-03-01 13:18:02

సర్పంచ్ లు రెడీ సచివాలయాలు అన్ రెడీ..

ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ ప్రాంతాల్లో పదేళ్ల తరువాత పరిపాలన అందించేందుకు  గ్రామ పంచాయతీ సర్పంచ్ లు రెడీ అయిపోయారు.. కానీ వారు పరిపాలన అందించేందుకు గ్రామసచివాలయాలే ఇంకా నిర్మాణ దశలోనే ఉండిపోయాయి. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తయ్యేనాటికి గ్రామసచివాలయాల్లోని భవనాలను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఎంత యుద్ధ ప్రాతిపదికన పనులు చేయించినప్పటికీ చాలా చోట్ల కొత్త భవనాల నిర్మాణాలు పూర్తికాలేదు. దీనితో పాత భవనాల్లోనే నూతన సర్పంచ్ లు ప్రమాణ స్వీకారాలు చేశారు. కొన్ని చోట్ల మాత్రం నూతన సచివాలయాలు పూర్తయ్యాయి. పూర్తయిన చోట సర్పంచ్ లు తమ కార్యదర్శిలతో నూతన భవనాల్లోనే తమ కార్యకలాపాలు ప్రారంభించగా, మిగిలిన నేటికీ అద్దెకు తీసుకున్న భవానాల్లోనూ, పాత భవనాల్లోనే తమ పాలనకు శ్రీకారం చుట్టారు. పంచాయతీ ఎన్నికల ముందు వరకూ గ్రామసచివాలయాల్లో సర్పంచ్ కు గదులనే సిద్ధం చేయలేదు. ప్రభుత్వం ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత గ్రామ సర్పంచ్ కి ప్రత్యేక గదులను తయారు చేశారు. అప్పటి వరకూ ఆ గదలను చాలా చోట్ల స్టోర్ రూమ్ లుగా నినియోగించాల్సి వచ్చింది. పదేళ్లుగా గ్రామపంచాయతీలకు సర్పంచ్ లు లేరేమో కార్యదర్శిల రాజ్యమే చెల్లింది. చాలా చోట్ల ప్రభుత్వ రికార్డులకు లెక్కా పత్రం లేదు. ప్రభుత్వం షడెన్ గా పంచాయతీలకు ఎన్నికలు పెట్టేసి సర్పంచ్ లను నియమించేయడంతో తేడా కార్యదర్శిల గొంతులో పచ్చివెలక్కాయ్ పడినట్టు అయ్యింది. ఈసారి చాలా వరకూ గ్రామపంచాయతీలకు చదువుతున్న యువత సర్పంచ్ లు గా ఎన్నిక కావడంతో అపుడే వారి ద్రుష్టి తేడాగా వ్యవహరించే  పంచాయతీ కార్యదర్శి నిర్వహించే రికార్డులుపై పడింది.  చాలా చోట్ల పంచాయతీల్లో అపుడే తేడా కార్యదర్శిల్లో ఆందోళన మొదలైంది. పదేళ్ల తరువాత మళ్లీ సర్పంచ్  ల పాలన రాష్ట్రంలో అమలులోకి రావడంతో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించే పనిలో పడ్డారు కొత్త సర్పంచ్ లు. ఈసారి సర్పంచ్ లకు ప్రభుత్వ శాఖల వారీగా సిబ్బంది, గ్రామ వాలంటీర్లు కూడా తోడయ్యారేమో వారి లక్ష్యాలు చేరుకోవడానికి మార్గం సుగమం అయ్యింది. ఇదే సమయంలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ గ్రామ సచివాలయ భవనాలు పూర్తయితే ప్రజలకు కొత్త భవనాల నుంచే సచివాలయ సేవలు పూర్తిస్థాయిలో అందనున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ సచివాలయ భవన నిర్మాణ పనులు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నిలకలు, ఎంపీటీసీ, జెడ్పీటీసి ఎన్నికలు కూడా పూర్తయిపోతే గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిస్థాయి సచివాలయ పాలన అందుబాటులోకి వస్తుంది. గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్ లు, వెటర్నరీ కేంద్రాలు, మల్టీపర్పస్ కేంద్రాల నిర్మాణాలు కూడా ప్రారంభమైపోతే సర్పంచ్ లకు, సిబ్బందికి చేతి నిండా పనిదొరుకుంది. ఈలోగా సచివాలయ సిబ్బంది ఉద్యోగాలు కూడా రెగ్యులర్ అవుతాయేమో గ్రామ స్వరాజ్య పాలను అంతా ఒకేసారి సిద్ధమవుతారు.

Tadepalle

2021-03-01 10:46:02

ఏపీలో బీటెక్ నిరుద్యోగులకు శుభవార్త..

ఆంధ్రప్రదేశ్ లో వేల కోట్ల రూపాయల విలువైన భూములు తీసుకుంటూ స్థానికులకు ఉద్యోగాలిచ్చే విషయంలో  టెక్నాలజీ సాకు చూపి తప్పించుకునే సాఫ్ట్ వేర్ కంపెనీల ఆగడాలకు కాలం చెల్లింది. ఏపీలో సాఫ్ట్ వేర్ కంపెనీలు పెట్టేవారు 75శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలనే నిబంధనను ప్రభుత్వం ఇకపై పూర్తిస్థాయిలో అమలు చేయాలని సంకల్పించింది. దీనికోసం రాష్ట్ర ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్రుష్టికి ఒక ప్రత్యేక ప్రతిపాదన తీసుకెళ్లినట్టు సమాచారం. ఆ ప్రతిపాదన ప్రకారం సాఫ్ట్ వేర్ కంపెనీల్లో వినియోగించే టెక్నాలజీలు ప్రభుత్వానికి ముందుగానే కంపెనీ స్థాపనకు ముందుగానే తెలియజేస్తాయి. లేదంటే ప్రభుత్వంలోని ఐటీశాఖ రాష్ట్రంలోని అన్ని సాఫ్ట్ వేర్ కంపెనీల నుంచి టెక్నాలజీ వినియోగంపై డాటాను సేకరింస్తుంది. తద్వారా నైపుణ్యాభివ్రుద్ధి కేంద్రాలు,  వ్రుత్తి నైపుణ్య విద్యాలయాల ద్వారా విద్యార్ధులకు చదువుకునే సమయంలోనే ప్రత్యేకంగా సదరు సాఫ్ట్ వేర్ టెక్నాలజీలపైనా, ఇంగ్లీష్ నైపుణ్యం పెంపు పై పూర్తిస్థాయి శిక్షణ ఇస్తారు. విద్యార్ధుల డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువతున్న సమయంలోనే రాష్ట్రంలో కంపెనీలకు స్థలాలు తీసుకున్న యాజమాన్యాలు ఆయా వ్రుత్తి నైపుణ్య విద్యాలయాల్లో కేంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. తద్వారా విద్యార్ధులకు డిగ్రీ పూర్తయ్యేనాటికే సాఫ్ట్ వేర్ ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఇలా చేయడం ద్వారా రాష్ట్రంలోని ఐటీ పరిశ్రమను అభివ్రుద్ధి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన.  అన్ని ఐటీ కంపెనీలకు ఈ నిబంధన వర్తింపజేసి రాష్ట్రంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలను అధిక సంఖ్యలో నిరుద్యోగ యువతకు కల్పించాలనేది ప్రభుత్వ ఆలోచన. కొత్తగా పెట్టబోయే కంపెనీలు స్థానికులకు ఉద్యోగ అశకాశాలు కల్పించకపోతే వారికి నిబంధనల ప్రకారం ఏపీఐఐసి ద్వారా స్థలాల కేటాయింపు జరగదని తెలుస్తుంది. ఇంత వరకూ సాఫ్ట్ వేర్ కంపెనీలు ఏర్పాటుకి స్థలాలు తీసుకున్న కంపెనీలన్నీ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే వారు మా కంపెనీలు వినియోగించే టెక్నాలజీలు నేర్చుకోలేదని, వారు నేర్చుకుంటే తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు కేటాయిస్తామ చెప్పి తప్పించుకుంటూ వస్తున్నాయి. అదే సమయంలో కొన్ని కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించినా అవి రెండు లేదా మూడేళ్లు మాత్రమే  ఉంచి తీసేస్తున్నాయి. ఇకపై అలా ఉద్యోగాలిచ్చి తీసేయడానికి వీలుపడదు. కంపెనీలో చేరిన ఉద్యోగి ఆ ఉద్యోగానికి పనికారడని సాంకేతికంగా రుజువు అయినపుడు మాత్రమే ఉద్యోగులను కంపెనీ నుంచి తొలగించాలి. అలాకాకుండా ఎడాపెడా తీసుకున్న ఉద్యోగులను తీసేస్తామన్నా ఆ పనిజరగకుండా ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను అమలుచేయబోతుందట. అలాకాకుండా ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగికి కావాల్సిన టెక్నాలజీ, ఇంగ్లీష్ లాంగ్వేజి డెవలెప్ మెంట్ అన్నీ ప్రభుత్వం నిర్మించే నైపుణ్యాభివ్రుద్ధి కేంద్రాలు,  వ్రుత్తి నైపుణ్య విద్యాలయాల ద్వారా శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేకంగా శిక్షకులను భారీ జీతాలతోనే నియమించనుంది. వీరికి టార్గెట్లు కూడా పెట్టి ఎంత ఎక్కువ మంది నిరుద్యోగులకు ప్రభుత్వం ఐటి ఉద్యోగాలిప్పించే స్థాయికి శిక్షణ ఇచ్చారనే కోణంలో వారిని పరిశీలిస్తుందని సమాచారం.  ఇదే జరిగితే సాఫ్ట్ వేర్ కంపెనీల ఆగడాలకు కాలం చెల్లడంతోపాటు, బీటెక్ కంప్లీట్ చేసి ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా ఉన్నవారికి సైతం సాఫ్ట్ వేర్ ఉద్యోగ అవకాశాలు మెండుగా దొరికే చాన్సు వుంది. సాఫ్ట్ వేర్ పార్కులు ఏర్పాటు చేసే జిల్లాల వారీగా ఈ నైపుణ్యశిక్షణ కేంద్రాలు, వ్రుత్తి నైపుణ్య విద్యాలయాలను వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలుస్తుంది. ఐటీలో శిక్షణ తీసుకోవాలంటే ఇంజనీరింగ్ చదివిన వారికి ఆరునెలల సమయం పడుతుంది. అలాకాకుండా ప్రభుత్వం శిక్షణ ఇచ్చే కేంద్రాల్లో అయితే చదువుతోపాటు శిక్షణ తీసుకుంటారు కనుక ప్రత్యేకంగా వారికి శిక్షణ ఇచ్చే పనుండదు. ఇటీవల ఐటీశాఖ మంత్రి సాఫ్ట్ వేర్ కంపెనీలతో నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించి దానిపై నివేదికను ముఖ్యమంత్రికి అందించినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేంతగా సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ లో భారీ ఉద్యోగాలతోపాటు, మంచి ప్రాజెక్టులు కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువవుతాయి..!

Tadepalle

2021-03-01 09:15:35

ఈఎన్ఎస్ కధనంపై స్పందించిన ప్రభుత్వం..బయో మెట్రిక్ లేకపోతే జీతం నిల్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామసచివాలయ వ్యవస్థలో సిబ్బందిలోపాలపై ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ యాప్  ఈఎన్ఎస్ లైవ్ న్యూస్ యాప్ లో ప్రచురితమైన న్యూస్ కార్డ్ పై ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలోని సుమారు 15వేల వార్డు, గ్రామసచివాలయ సిబ్బంది టైమ్ కి బయోమెట్రిట్ వేస్తేనే జీతం ఇస్తామని లేదంటే ఆరోజు జీతం కట్ చేస్తామని ప్రకటించింది. గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటైన దగ్గర నుంచి కొందరు సచివాలయ సిబ్బంది ఆడుతూ పాడుతూ విధులు నిర్వహిస్తూ వచ్చారు. వారికి కొందరు తేడా గ్రామకార్యదర్శిలు వంతపాడుతూ, వారి లోపాలను కప్పిపుచ్చుకుంటూ వచ్చారు. అయితే దేశానికే దిక్సూచిగా నిలిచిన గ్రామసచివాలయ వ్యవస్థలో  సిబ్బంది, అధికారులు చేస్తున్న తేడా విధులపై ఈఎన్ఎస్ లైవ్ యాప్ వరుస కధనాలు ప్రచురిస్తూ వస్తోంది. ఇటీవల ప్రచురించిన న్యూస్ కార్డ్...తేడా సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం ద్రుష్టి అనే వార్తకు స్పందించిన ప్రభుత్వం బయోమెట్రిక్ అటెండెన్సు, టూర్ డైరీ, విధినిర్వహణలో చేరినపుడు ఇచ్చిన డ్యూటీ చార్టు ఖచ్చితంగా అమలు చేస్తేనే జీతాలు ఇస్తామని లేదంటే జీతం ఇచ్చే పరిస్థితి లేదని తెగేసి చెప్పింది. దీనితో గ్రామసచివాలయ వ్యవస్థ విషయంలో ఈఎన్ఎస్ లైవ్ యాప్ ప్రచురిచిన న్యూస్ కార్డ్ లోని వాస్తవాలను గుర్తించిన ప్రభుత్వం తనదైన స్టైల్ లో విధినిర్వహణ ప్రతీ ఒక్క ఉద్యోగి సక్రమంగా చేసేలా ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు ప్రజల గుండె చప్పుడు ట్యాగ్ లైన్ తో ప్రజల్లోకి వచ్చిన ఈఎన్ఎస్ లైవ్ యాప్ కధనాలన్నీ అక్షర సత్యాలని మరోసారి రుజువైంది.  అంతేకాదు ప్రభుత్వంలో చాలా మంది ఉన్నతాధికారులు ఈఎన్ఎస్ లైవ్ యాప్, www.enslive.net న్యూస్ వెబ్ సైట్ ని ఫాలో అవుతున్నారని తాజా సంఘటనలు రుజువుచేస్తున్నాయి. దీనితో బాగా పనిచేసు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ ఈఎన్ఎస్ లైవ్ యాప్  కార్యాలయానికి అభినందనలు తెలియజేయడానికి ఉదయం నుంచి కాల్స్ చేస్తునే ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు స్థితిగతులు, మంచి, చెడులపై ఎప్పటికప్పుడు విశ్లేషనాత్మక కధనాలను న్యూస్ కార్డ్ గా అందిస్తున్న ఈఎన్ఎస్ లైవ్ యాప్ మరిన్ని వార్తలతో ప్రభుత్వం అన్నిశాఖలపై ద్రుష్టిపెట్టేలా చేయాలని సూచిస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. అదేవిధంగా ప్రజలకు గ్రామసచివాలయ సేవలు మరింతగా ఏ విధంగా అందాలోకూడా ప్రజలను చైతన్యం చేస్తూ కధనాలు అందించాలని కోరారు. అశేష పాఠక లోకానికి తాజావార్తలు అందించే ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ ప్రజల పక్షాన నిలవడమే కాకుండా ప్రభుత్వ వ్యవస్థల పనితీరుకు, వారి మంచి విధులను ప్రజలకు తెలియజేస్తూ, అదే స్థాయిలోని తేడా విధులను ఎండగడుతూ ముందుకి సాగుతుందని తెలియజేస్తుంది ఈఎన్ఎస్ లైవ్ యాప్ టీమ్..

తాడేపల్లి

2021-02-28 22:23:12

ఆ జీఓ విషయంలో కలెక్టర్లూ చేతులెత్తేశారు..

భారతదేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామసచివాలయ వ్యవస్థ నాటి పంచాయతీ కార్యదర్శిలకు చాలా ఇబ్బందులను, నొప్పులను తెచ్చిపెడుతోంది. గ్రామసచివాలయాలు ఏర్పాటై 16 నెలలు పూర్తవుతోంది. మరో 8నెలల్లో రెండేళ్లు పూర్తిచేసుకోబోతుందికూడా అంటే ఆ సమయానికి కార్యదర్శిల ఉద్యోగాలు కూడా ప్రొబిషన్ పూర్తిచేసుకొని రెగ్యులర్ కూడా కాబోతున్నాయి. అంతవరకూ బాగానే వున్న సచివాలయాల సేవలను ప్రజలకు అందించే విషయంలో జిల్లా కలెక్టర్లు, ఈ శాఖకోసం ప్రభుత్వం నియమించిన జెసిలు ప్రభుత్వం విడుదల చేసిన జీఓల అమలు విషయంలో చేతులెత్తేస్తున్నారు. అవును నిజమే ప్రభుత్వం మేజర్ పంచాయతీలు ఉన్నచోట రెండు నుంచి మూడు సచివాలయాలను జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేస్తూ..ఏ సచివాలయ పరిధిలోని ప్రజలు ఆ సచివాలయంలోకే వస్తారని విభజన కూడా చేసి సేవలు అక్కడి నుంచే అందిస్తోంది. దానికి కార్యరూపం తీసుకురావడానికి జీఓ నెంబరు 149ను విడుదల చేసింది. దీని ప్రకారం మేజర్ పంచాయతీగా ఉన్న కార్యాయంలోని అన్ని అంశాలు విభజన చేయాల్సి వుంది. అంటే బ్యాంకు అకౌంట్లు, కార్యాలయం, సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, వాహనాలు ఇలా అన్ని రకాల అధికారాలు ఆ జీఓ ప్రకారం విభజన చేయాలి. జీఓ వచ్చి రెండేళ్లు దాటి, దానిపై సర్క్యులర్ వచ్చి 8 నెలలు దాటుతున్నా ఆ జీఓ రాష్ట్రంలో ఏ ఒక్క జిల్లాలోనూ అమలు కాలేదు.. కాదు కాదు ఏ జిల్లా కలెక్టరు గానీ, డీపీఓగానీ, జిల్లా పరిషత్ సీఈఓ గానీ దాని అమలు విషయంలో ఎంపీడీఓలకు దిశా నిర్ధేశం చేయలేదు. ఫలితంగా మేజర్ పంచాయతీల్లో సచివాలయాలు అయతే ఉన్నాయి తప్పితే  వాటి ద్వారా ప్రజలకు సేవలు అందడటం లేదు. కార్యదర్శిలు అధికారాలు లేని ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం పంచాయతీలకు సర్పంచ్ లు వచ్చిన తరుణంలో ఆ ఇబ్బందులు ఇపుడు మరింత ఎక్కువ కానున్నాయి.  ప్రభుత్వం జీఓ విడుదల చేసినంత మాత్రాన తాము విభజన చేయాలా అనుకున్నారో ఏమో అటు జిల్లా పంచాయతీ అధికారులు ఈ జీఓపై ఎంపీడీఓలకు సైతం ఆదేశాలు జారీ చేయలేదు. వాస్తవానికి ప్రభుత్వం ఒక జీఓ విడుదల చేస్తే దానిని జిల్లా అధికారులు తూచా తప్పకుండా పాటించాలి..కాకపోతే ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా పరిషత్ సీఈఓలు ప్రభుత్వం విడుదల చేసే జీఓల అమలు విషయంలో భిన్నంగా ఉంటారు. ఇపుడు వారిని గట్టిగా ఆదేశించలేరని స్థాయిలో జిల్లా కలెక్టర్లుకూడా ఉంటారనే విషయం జిఓనెంబరు 149 మరోసారి రుజువు చేసింది. మీరు చదువుతున్నది నిజమే.. జీఓ నెంబరు 149పై సర్క్యులర్ వచ్చి సుమారు 8నెలలు అవుతున్నా దీనిపై ఆంధ్రప్రదేశ్ లోని ఏ ఒక్క జిల్లాలోనూ గ్రామసచివాలయాల విభజన జరగలేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వాస్తవానికి ప్రభుత్వం అమలు చేసే జీఓల విషయంలో జిల్లా కలెక్టర్లుగానీ, గ్రామసచివాలయ వ్యవస్థకు ఏర్పాటైన జాయింట్ కలెక్టర్లు గానీ చాలా ముక్కుసూటిగా ఉంటారు. కానీ విచిత్రం ఏంటో ఈ జీఓ విషయంలో అందరూ ఏకమై జీఓని అమలు చేయకుండా వదిలేశారు. కడప జిల్లాలో గ్రామసచివాలయ శాఖ జెసి గట్టిగా పట్టుబట్టి సచివాలయాలను విభజన చేయిస్తున్నప్పటికీ మిగిలిన జిల్లాల్లో కనీసం చలనం రావడంలేదు. ఈ క్రమంలో అధికారం లేని ఉద్యోగం తాము ఎలా చేస్తామంటూ సచివాయ కార్యదర్శిలు వాపోతున్నారు. ప్రభుత్వం ఏ విధంగా విధులు చేయమంటే తాము ఆవిధంగా పనిచేస్తున్నామని, కాకపోతే సత్వర నిర్ణయం తీసుకోవాలంటే మాత్రం సచివాలయాల విభజన జరగకపోతే మాత్రం ప్రజలకు తమ సచివాలయాల పరిధిలో సేవలు అందించే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఈ విషయంలో తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ అధికారికి ద్రుష్టికి జీఓ విషయమై కార్యదర్శిలు తీసుకెళ్లినప్పటికీ, జిల్లా పంచాయతీ అధికారి ఒక అర్జెంట్ సర్క్యులర్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్పితే.. ఫలితం ఏమీ లేకుండా పోయింది. ప్రభుత్వం విడుదల చేసిన జీఓ అమలు కానప్పుడు ప్రభుత్వం ఆ జీఓను ఎందుకు విడుదల చేసిందనే ప్రశ్నకూడా ఉత్పన్నమవుతుంది. గ్రామ సచివాలయాల కోసమే ప్రభుత్వం నియమించిన గ్రామసచివాలయాల శాఖ జాయింట్ కలెక్టర్లు కూడా దీనిపై చర్యలు తీసుకోకపోవడం అశ్చర్యానికి, అనుమానాలకు తావిస్తుంది. మరోవైపు ప్రస్తుతం విభజన చేయని గ్రామసచివాలయల సీనియర్ కార్యదర్శిలు, ఈఓపీఆర్డీలు కొత్తగా వచ్చిన సచివాలయ కార్యదర్శిలు తమ కిందే పనిచేయాలని, వారితో మమ్మల్ని ఎలా సమానంగా చూస్తారని వాపోతున్నారు. వెరసీ జీఓనెంబరు 149 అమలుకి నోచుకోలేదు. ఒక ప్రక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దేశానికే గ్రామసచివాలయ వ్యవస్థ ఆదర్శంగా నిలువాలని పదే పదే ప్రతీ సమావేశంలోనూ చెబుతున్నా.. ఇదే సచివాలయశాఖ జారీచేసిన జీఓని అమలు చేయకుండా గాలితీసేస్తున్న పరిస్థితిలో ఉన్నతాధికారులు ఉండటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో 13జిల్లాల్లో ప్రభుత్వ జీఓలు అమలు చేసే జిల్లా కలెక్టర్లు కొంతమంది ఉన్నప్పటికీ వారు కూగా ఈ జీఓ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇన్ని నెలలు దాటుతున్నా నేటివరకూ ఆ జీఓ 149ని ఎంతమంది అమలు చేశారని ప్రశ్నించలేదంటే అధికారులు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇదే విషయాన్ని అటు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిగానీ, మంత్రి బొత్సా సత్యన్నారాయణలు వంటి వారు కూడా పట్టించుకోలేదు.  భవిష్యత్తులోనైనా పట్టించుకుంటారో లేదో వేచి చూడాలి మరి..!

Tadepalle

2021-02-28 11:21:44

TTD ఎక్స్‌ అఫిషియోగా డాజి.వాణీమోహన్..

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి డా.జి.వాణి మోహన్  శనివారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్‌ అఫిషియో సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. టిటిడి అదనపు ఈవో ఎ.వి.ధ‌ర్మారెడ్డి  డా.జి.వాణి మోహన్ తో ప్రమాణం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆ తరువాత అదనపు ఈవో  స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని, డైరీ, క్యాలెండర్ ను వారికి అందించారు. ఈ కార్యక్రమంలో బోర్డు సెల్‌ డెప్యూటీ ఈఓ సుధారాణి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తిరుమల

2021-02-27 21:38:31

ఉన్నత ప్రమాణాలే లక్ష్యంగా మండలి..

రాష్ట్రంలో ఉత్తమ విద్యా ప్రమాణాలు పెంపు, విద్యా విధానంలో దేశంలోనే  రాష్ట్రం ఆగ్ర స్థానంలో నిలవాలన్న రాష్ట్ర  ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి  ఆశయం మేరకు ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రూపు దిద్దుకున్నదని  రాష్ట్ర విద్యా  శాఖా మంత్రి  ఆదిమూలపు  సురేష్ అన్నారు.  శనివారం ఉన్నత విద్యా  మండలి  మొదటి  సమావేశం ఏర్పేడు వద్ద గల ఐ ఐ టి ఆతిధ్యంతో   విద్యా మండలి అధ్యక్షులు  ప్రొ. హేమచంద్రా రెడ్డి , విద్యా శాఖ ప్రధాన కార్యదర్శి  సతీష్ చంద్ర ల తో కలసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాష్ట్రంలోని అన్ని  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విద్యాలయాలు,  విశ్వ విద్యాలయాల విసి లతో, ప్రొఫెసర్లతో  నిర్వహించారు.  రాష్ట్ర విద్యా శాఖ మంత్రి మీడియా తో మాట్లాడుతూ,   రాష్ట్ర ముఖ్యమంత్రి  ప్రణాళిక బోర్డు  ఏర్పాటు  తో విద్యావిధానంలో సమూల సంస్కరణలు చేపట్టడానికి,  దేశంలోనే  రాష్ట్ర విద్య విధానం   ఉన్నత  స్థాయిలో    నిలపాలన్న కృత నిశ్చయంతో వున్నారని అన్నారు.  విద్యా మండలి ఏర్పాటుతో కేంద్ర విశ్వ విద్యాలయాలు,  విద్యాలయాలు  రాష్ట్ర విశ్వ  విద్యాలయాలతో అనుసంధానం చేసి సమన్వయంతో  చర్చలు జరిపి,  రీసర్చ్,  ఫాకల్టీ, సాంకేతిక  అనుసంధానం, అవసరాలు వంటివి గుర్తించి  రాష్ట్ర విద్యా శాఖలో  సమూల మార్పులు చేయనున్నామని అన్నారు. అందులో భాగంగా  రాష్ట్ర  ఉన్నత విద్యా మండలి  పలు కేంద్ర, రాష్ట్ర  విశ్వ విద్యాలయాలతో   చర్యలు జరిపి  నాలెడ్జ్  ఎక్స్ ఛేంజ్ , సాంకేతిక అనుసంధానం, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వంటి అవసరాలు   గుర్తించడం జరుగుతుందని అన్నారు.  ఇప్పటికే విద్యాశాఖ లో  సంక్షేమ పథకాలు అమ్మ ఒడి, నాడు-నేడు వసతుల కల్పన,  వై ఎస్సార్ ప్రైమరీ  పాఠశాలలు ఏర్పాటు, విద్యాదీవెన,  వసతి  దీవెన వంటివి అమలు  చేస్తున్నారని అన్నారు.  ఉన్నత విద్యకు సంబంధించి  కోవిడ్ -19  కారణంగా ఈసారి   అడ్మిషన్లు రూల్ ఆఫ్ రిజర్వేషన్ మేరకు  డిగ్రీ  కళాశాలలో ఇబ్బందులు లేకుండా జరిపామని, రాబోవు సంవత్సరమునకు ఇంటర్ మీడియట్ కు వర్తింప చేస్తామని తెలిపారు.  బి ఏ,  బి కామ్, , బి టెక్  కోర్సులకు 10 నెలల  ఇంటర్న్ షిప్ అమలు చేయబోతున్నామని  తెలిపారు.  కోవిడ్ కారణం  గా ఆలస్యం ప్రారంభమయిన ఈ విద్యా సవత్సరం  విద్యా సంస్థల ను గాడి పెట్టి  సిలబస్ పూర్తి చేయనున్నామని తెలిపారు.  పరిశోధనలకు ప్రాధాన్యత నిస్తూ, స్మూల మార్పులు తీసుకువచ్చి   విద్యా సంస్థలను సెంటర్ ఆఫ్  ఎక్సలెన్స్ గా తీర్చి దిద్దనున్నామని  అన్నారు.ప్రతి పార్లమెంటు పరిధిలో స్కిల్ డెవెలప్ మెంట్ సెంటర్లు, తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ రూపుదిద్దుకొనున్నదని తెలిపారు. బి.ఎడ్.  కోర్సు కు సంబంధించి ప్రత్యేక స్పెషలైజేషన్ అమలు చేస్తూ 4 సంవత్సరాలకు పెంచనున్నామని అన్నారు.    ఆన్ లైన్ క్లాసులకు  వంద శాతం హాజరు కోసం పేద, బలహీన వర్గాల వారు   అమ్మ ఒడి   లబ్దిదారులు తమ సమ్మతి  తెలియజేస్తే బదులుగా లాప్  టాప్  అందించే యోచనలో గౌరవ ముఖ్యమంత్రి   వున్నారని వివరించారు.  ఈ సమావేశం లో  రాష్ట్ర ఉన్నత   విద్యా మండలి అధ్యక్షులు ప్రొ. హేమ చంద్రా రెడ్డి, ఐ. ఐ. టి. డైరెక్టర్  సత్యనారాయణ తదితరులు  పాల్గొన్నారు. 

Tirupati

2021-02-27 20:11:21

తప్పుడు ప్రచారంపై సైబర్ క్రైమ్ కేసు..

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన సెలవులపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసినట్టు విద్యాశాఖ మంత్రి డా.ఆదిమూలపు సురేష్ చెప్పారు. శుక్రవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా సాకు చూపి మార్చి 1 నుంచి ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు అంటూ ఒక పత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని వాటిని ఎవరూ నమ్మవద్దన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలైనా నేరుగా ప్రభుత్వ పాఠశాలలు లేదా డిఈఓ, ఎంఈఓల ద్వారా మాత్రమే ప్రభుత్వం ప్రటిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు యధావిధిగానే నడుస్తాయన్నారు. ఈమేరకు అన్ని జిల్లాల డిఈఓలకు ఆదేశాలు జారీ చేసినట్టు మంత్రి వివరించారు.

Tadepalle

2021-02-26 19:27:58

ఫిబ్ర‌వ‌రి 27న మాఘపూర్ణిమ స్నానం..

తిరుమల తిరుపతి దేవస్థానం త‌ల‌పెట్టిన మాఘమాస‌ మ‌హోత్స‌వంలో భాగంగా ఫిబ్ర‌వ‌రి 27న మాఘపూర్ణిమ‌ను పుర‌స్క‌రించుకుని తెలంగాణ రాష్ట్రం కాళేశ్వ‌రంలోని త్రివేణి సంగ‌మంలో మాఘపూర్ణిమ పుణ్య‌స్నానం కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి పాలు, పెరుగు, తేనె, చంద‌నం, ప‌సుపు త‌దిత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో స్న‌ప‌న‌తిరుమంజ‌నం, ఆ త‌రువాత చ‌క్ర‌స్నానం నిర్వ‌హిస్తారు. ద‌క్షిణ కాశీగా ప్ర‌సిద్ధి చెందిన కాళేశ్వ‌రంలో గోదావ‌రి, ప్రాణ‌హిత‌, అంత‌ర్లీనంగా స‌ర‌స్వ‌తి న‌దులు ప్ర‌వ‌హిస్తున్నాయి. ఈ మూడు న‌దుల సంగ‌మ స్థాన‌మైన శ్రీ కాళేశ్వ‌ర ముక్తేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం వ‌ద్ద ఈ కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది. ఉద‌యం 9 నుంచి 11 గంటల వ‌ర‌కు జ‌రుగ‌నున్న ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది.

Tirumala

2021-02-26 19:19:10

Tadepalle

2021-02-26 16:35:36

విశాఖలో 9 ఎకరాల్లో ఐటిపార్కు..

విశాఖలో త్వరలోనే మిలీనియం టవర్ పక్కన భారీ ఐటి పార్కు ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చెప్పారు. ఈమేరకు సచివాలయంలో శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎక్కువ ఉద్యోగాలందించేందుకు అవకాశం ఉన్న ఏకైక శాఖ ఐ.టీ శాఖ మాత్రమేనన్నారు. ప్రతీ ఏటా బయటకు వస్తున్న ఇంజనీరింగ్ పట్టభద్రులే కాకుండా, డిగ్రీ చదివిన నిరుద్యోగులకు కూడా ఐటీ లో మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తుందన్నారు. దీనికోసం  విశాఖపట్నంలోని మిలీనియం టవర్ సమీపంలో ఐ.టీ పార్కు ఏర్పాటుకు అధ్యయనం చేస్తున్నామని అన్నారు. తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో హైదరాబాద్ లోని రహేజా మైండ్ స్పేస్ తరహాలో ఐ.టీ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఆ మేరకు అధికారులను ఆదేశించినట్టు మంత్రి వివరించారు. యువత గర్వంగా చెప్పుకునే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ  ఆధారిత ఉద్యోగాలందించాలన్నదే  తమ ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి ఐటి ఉద్యోగాలకు అనుగుణంగా ముందస్తుగానే ఇంజనీరింగ్ విద్యార్ధులకు ఆయా టెక్నాలజీలపై శిక్షణ ఇచ్చే అంశాన్ని కూడా ఆలోచిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఏ టెక్నాలజీల్లో ఉద్యోగాలొస్తున్నాయో గుర్తించి నిరుద్యోగ యువతకు అందులో శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి ఐటీ ఉద్యోగాలు సత్వరమే రావడానికి ఆస్కారం వుంటుందని చెప్పారు. దానికోసం నైపుణ్యాభివ్రుద్ధి సంస్థ ద్వారా శిక్షణలు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని అధికారులను కోరామన్నారు.. ఐ.టీ పార్కు అభివృద్ధితో వీలైనన్ని ఎక్కువ నాణ్యమైన ఉద్యోగాలందింస్తామని  రాష్ట్ర పరిశ్రమలు, ఐటిశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వివరించారు.

Tadepalle

2021-02-26 14:54:13

మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్‌..

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు లైన్‌ క్లియర్‌ అయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన 16 మధ్యంతర పిటిషన్లను హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. కాగా, 12 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 75 మున్సిపల్‌, నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గతంలో షెడ్యూల్‌ విడుదలైంది. షెడ్యూల్‌ ప్రకారం మార్చి 10న మున్సిపల్‌ ఎన్నికలు..14న ఓట్ల లెక్కింపు జరగనుంది. మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువుగా నిర్ణయించారు. అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. మార్చి 8వ తేదీ సాయంత్రంతో అభ్యర్థుల ప్రచారం ముగుస్తుంది. అవసరమైతే మార్చి 13న రీ  పోలింగ్‌  నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభమవుతుంది. కోర్టు తీర్పుమేరకు రాష్ట్రంలో అన్ని పనులు చక చకా జరిగిపోతున్నాయి..

Vijayawada

2021-02-26 14:40:53

27న‌ శ్రీ కుమార‌ధార‌ తీర్థ ముక్కోటి ర‌ద్దు..

తిరుమ‌ల‌లో ఫిబ్ర‌వ‌రి 27వ తేదీన జ‌ర‌గాల్సిన శ్రీ కుమార‌ధార తీర్థ ముక్కోటి కార్య‌క్ర‌మాన్ని టిటిడి ర‌ద్దు చేసింది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల కోవిడ్‌-19 మార్గ‌ద‌ర్శ‌కాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈ ప‌ర్వ‌దినం నాడు ఎక్కువ మంది భ‌క్తులు విచ్చేసి ఈ తీర్థంలో స్నానాలు చేసే సంప్ర‌దాయం ఉన్నందువ‌ల్ల, భ‌క్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ముక్కోటి పూజా కార్య‌క్ర‌మాల‌ను టిటిడి ర‌ద్దు చేసింది. ఈ కార‌ణంగా కుమార‌ధార‌ తీర్థంలోకి భ‌క్తుల‌కు అనుమ‌తి లేద‌ని టిటిడి స్ప‌ష్టం చేసింది. కరోనా కేసులు మళ్లీ పుంజుకుంటున్నందున ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

Tirumala

2021-02-26 14:15:32

Tadepalle

2021-02-26 12:22:05