1 ENS Live Breaking News

ఘనంగా అజాది కా అమృత్ మహోత్సవ్..

భారదేశానికి  స్వాతంత్య్రం వచ్చి 2022 స్వాత్రంత్య్ర దినోత్సవం నాటికి  75 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా " అజాది కా అమృత్ మహోత్సవ్ " వేడుకల్ని ఘనంగా  నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ పేర్కొన్నారు.  కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో  దేశంలో  ఎంపిక చేసిన 75 ప్రముఖ నగరాలు, ప్రదేశాల్లో చరిత్రాత్మక నగరంగా  విజయవాడ ను ఎంపిక చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.  రాష్ట్రంలో తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో కూడా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారని తెలిపారు.   స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా 75 వారాలుపాటు " అజాది కా అమృత్ మహోత్సవ్ " పేరిట ప్రత్యేక వేడుకలు ఘనంగా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.  " అజాది కా అమృత్ మహోత్సవ్ " వేడుకల్ని విజయవాడ వేదికగా ప్రజల్లో స్వాతంత్య్ర స్ఫూర్తి ని నింపేలా నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ తెలిపారు. మార్చి 12 శుక్రవారం నాడు సాయంత్రం 4 గంటలకు  పిడబ్ల్యూడి గ్రౌండ్స్ నుంచి  బాపూ మ్యూజియం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు.   సాయంత్రం 5 గంటల నుంచి ప్రభుత్వ ఘంటశాల సంగీత కళాశాల ప్రాంగణంలో  ఫోటో ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు , స్వాతంత్ర్య సమరయోధులు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర యువజన వ్యవహారాల విభాగం , ఎన్ ఎస్ ఎస్, ఎన్ ఎస్ ఓ, ఎన్ సి సి వాలంటీర్స్ ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు.   దేశంలోని చారితాత్మక, ప్రాముఖ్యత గల నగరాల్లో, పట్టణాల్లో,  ప్రాంతాల్లో ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తూన్నారు.   మార్చి 12 నుంచి ఏప్రిల్ 5 వరకు 25 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. దండి సత్యాగ్రహం   మార్చి 12 ప్రారంభం అయి  ఏప్రిల్ 5  న ముగిసింది. వాటిని గుర్తు చేసునేలా ర్యాలీలు, సైకిల్ ర్యాలీ లు, వివిధ కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు భారత దేశ స్వాతంత్ర్య కోసం స్వాతంత్ర్య సమరయోధులు పడిన ఇబ్బందులు   పై సమావేశాలు, చర్చలు,  సెమినార్ లు నిర్వహించడం జరుగుతుందని ఇంతియాజ్ తెలిపారు. విద్యార్థులకు వ్యాస రచన పోటీలను పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. అదేవిధంగా కళాశాల, యూనివర్సిటీ ల స్థాయి లో కూడా పోటీలు నిర్వహిస్తున్నారు. దేశ స్వాతంత్ర్య సమరయోధుల , జాతీయ నాయకులు మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ , నేతాజీ, తదితరులకు సంబంధించిన ఫోటో ప్రదర్శనలను రాష్ట్ర ప్రభుత్వాలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు.

Vijayawada

2021-03-11 19:31:06

Tadepalle

2021-03-11 19:08:14

Hyderabad

2021-03-11 18:23:08

మహిళా ఉద్యోగుల ప్రసూతి వేదన..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మహిళా ఉద్యోగులు కంటతడి పెడుతూ ప్రసూతి వేదన అనుభవిస్తున్నారు..ఇదేదో కాన్పు సమయంలో, బిడ్డను కనడానికి పడే వేదన కాదు..ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ప్రసూతి సమయంలో ఇచ్చే సెలవులను తిరిగి జీతంగా తెచ్చుకోవడానికి పడే ఇబ్బంది వేదన, నరకం ఇలా బాధ పెట్టడానికి ఎన్ని పదాలుంటే అన్నింటికీ ఈ సమయంలో ప్రభుత్వ అధికారులు గుర్తు చేసుకోవచ్చు.. మొన్నటి వరకూ ఆ ఇబ్బంది రెగ్యులర్ ఉద్యోగులకే అనుకుంటే కేవలం 15వేల రూపాయల జీతంతో పనిచేసే నేటి గ్రామ, వార్డు సచివాలయ మహిళా ఉద్యోగులు కూడా ఇదే ఇబ్బందులను ఎదుక్కోవాల్సి వస్తుంది. అవును మీరు చదవుతున్నది అక్షర సత్యం..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం చేసే ఆడపడుచు ఆవేదన. ఆరునెలల ప్రసూతి సెలవులు ప్రభుత్వం ఇచ్చినా, ఆపై ప్రసూతి రికార్డులు ప్రభుత్వానికి సంబంధిత శాఖ ద్వారా సమర్పిస్తే జీతం రావాలి. అలా ప్రభుత్వ శాఖల ద్వారా వస్తుంది కూడా. కానీ ఇక్కడే అసలైన చిక్కంతా మహిళా ఉద్యోగులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఆరునెలల జీతం బిల్లుగా మార్చాలంటే సంబంధిత శాఖలో పదిశాతం జీతం మామూలుగా సమర్పించాల్సి వస్తుంది. అలా సమర్పించిన వారికి మాత్రమే బిల్లులు క్షణాల్లో మంజూరవుతున్నాయి. లేదంటే వారు నెలల తరబడి జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇచ్చే జీతానికి వీరికెందుకు మామూళ్లు ఇవ్వాలంటే అది అనాదిగా వస్తున్న ఆచారమని చాలా ఠీవీగా చెబుతున్నారు ఆయా శాఖల్లో పనిచేసే సీనియర్ అసిస్టెంట్లు ఇతర అధికారులు. మాకు కూడా శాఖ పరమైన ఖర్చులుంటాయని కూడా శెలవిస్తున్నారు. ఇలాంటి ఇబ్బందులు పడే మహిళా ఉద్యోగులు ప్రభుత్వం ద్రుష్టికి ఈ సమస్యను తీసుకెళితే ఎవరైతే మహిళా ఉద్యోగులు ఆరు నెలలు ప్రసూతి సెలవులు పెట్టుకుంటారో అపుడే సంబంధిత జిల్లా శాఖల అధికారులు గానీ, లేదంటే సదరు జిల్లా కలెక్టర్ గానీ సెలవుతో కూడిన జీతం మంజూరు చేస్తున్నారు. ఆ విధంగా లేఖలు ఇస్తున్నారు. అలాంటి వారికి బాగానే ఉన్నా, ఆవిషయం తెలియని వారు మాత్రం ఆరు నెలల తరువాత సాలరీ బిల్లులతోపాటు, ఈ ఆరు నెలల ప్రసూతి సెలవులు బిల్లు పెట్టే సమయంలో సంబంధిత మండలశాఖ కార్యాలయంలో ఆమ్యామ్యాలు సమర్పించుకోవాల్సి వస్తుంది. లేదంటే ఆ బిల్లులు మాత్రం పాస్ కావడం లేదు. రెగ్యులర్ ఉద్యోగులతోపాటు..కేవలం రూ.15వేలతోనే ఉద్యోగం చేసుకునే గ్రామసచివాలయ  మహిళా ఉద్యోగుల నుంచి కూడా సంబంధిత శాఖ సిబ్బంది మామూళ్లకు పాల్పపడటం రాష్ట్రంలో చర్చనీయాంశం అయ్యింది. అందులోనూ అత్యధిక సిబ్బంది ఉన్న ఈ శాఖలో మహిళా ఉద్యోగిణిలు కూడా అధికంగా వుండటం చాలా మందికి అధికారులకు, సిబ్బందికి బాగా కలిసి వస్తుంది. ఈ విషయం జిల్లా కలెక్టర్ల వరకూ వెళ్లడంతో వారికి సెలవుతోపాటు, ప్రత్యేక లేఖ ద్వారా మానవతా ద్రుక్పదంతో జీతం కూడా వచ్చే ఏర్పాటు చేస్తున్నారు కొన్ని జిల్లాల కలెక్టర్లు. కాకపోతే ప్రభుత్వమే అధికారికంగా ఈ సర్ధుబాటు చేస్తే మధ్యలో ఈ దలారీ ప్రభుత్వశాఖల సీనియర్ అసిస్టెంట్లకు, ఇతర అధికారులకు మామూళ్లు ఇచ్చే బాధలు తప్పుతాయని ఆవేదన చెందుతున్నారు మహిళా ఉద్యోగులు.  ప్రభుత్వం ఈ విషయంలో మహిళా ఉద్యోగులందరికీ ప్రసూతి సెలవులు ఇచ్చే సమయం నుంచే జీతం ఇవ్వడంతోపాటు, సంబందిత ప్రసూతి పత్రాలు కూడా తిరిగి విధుల్లోకి చేరే సమయంలో తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ప్రభుత్వం తల్లీబిడ్డకోసం ప్రసూతి సెలవులు ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నా.. అయితే మాకేంటి అన్నట్టుగా పలుశాఖల అధికారులు, సీనియర్ అసిస్టెంట్లు పాల్పడే మామూళ్లకు కళ్లెం పడదని... మహిళా ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.  అదే సమయంలో ప్రభుత్వం ప్రసూతి సెలవులు ఇచ్చిన సమయంలో తిరిగి ఆ సెలవులకు సంబంధించిన లీవ్ జీతంగా మారడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీనితో మహిళా ఉద్యోగులు ప్రభుత్వం ద్రుష్టికీ ఈ విషయాన్ని తీసుకెళ్లాయి. ఆ విషయంపై సాంకేతిక సమస్యలపై రాష్ట్రప్రభుత్వం పరిశీలన జరుపుతున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయంతీసుకుంటే ప్రసూతి సెలవులపైనా మామూళ్లు వెతుక్కునే సిబ్బంది లంచావతారాలకు ముకుతాడు పడే అవకాశం కలుగుతుంది. ఈ విషయం తెలియజేసిన తరువాత ప్రభుత్వం ఇది తప్పుడు వార్త అనుకోవడానికి లేదు.. అలా లంచాలు తీసుకునే వారిపై ద్రుష్టిసారిస్తే గ్రామసచివాలయ శాఖ నుంచి అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ ప్రసూతి సెలవులపై కమిషన్లు మేసే లంచావతారులను పట్టుకోవచ్చు..ఈ సమాచారం కూడా ప్రభుత్వ మహిళా ఉద్యోగిణిలు కంట తడి పెట్టుకుంటూ చెప్పిన వివరాలు ఆధారంగానే ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారి మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ మరియు www.enslive.net న్యూస్ వెబ్ సైట్ ద్వారా ప్రత్యేక కధనాన్ని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకువస్తున్నామని కూడా ప్రభుత్వానికి, పలుశాఖల అధికారులకు తెలియజేస్తున్నాం. ఇంత సమాచారం ఇచ్చిన తరువాత ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి..!

Tadepalle

2021-03-11 11:46:06

మహిళా ఉద్యోగులకు శుభవార్త..

ఆంధ్రప్రదేశ్ లో మహిళా ఉద్యోగులకు రాష్ట్రప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఇప్పటివరకూ మహిళా ఉద్యోగులకు ఉన్న15 ప్రత్యేక సెలవుల(క్యాజువల్ లీవ్స్) ను మరో 5 సెలవులను కలిపి 20కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహరెడ్డికి మహిళా ఉద్యోగులకు ఈ వరం ప్రకటించారు. ప్రకటించిన రెండు రోజుల్లోనే అనగా ఈరోజే ప్రభుత్వం జీఓ నెంబరు 18ను తీసుకు వచ్చి అమలు చేయడానికి వీలుగా అన్ని ప్రభుత్వ శాఖలకూ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఇన్నేళ్ల తరువాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ద్వారా మాత్రమే మహిళా ఉద్యోగులకు ఈ అవకాశం కల్పించింది. దీనితో రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సెలవులకు సుమారు నాలుగు యూనియన్లు రాష్ట్ర ప్రభుత్వానికి  ముందస్తుగా లేఖలు సమర్పించాయి.

Tadepalle

2021-03-10 19:55:15

విశాఖ డీపీఓ పోస్టు బదిలీ జీఓకి తాక్కాలిక తెర..

విశాఖజిల్లా పంచాయతీ అధికారిణి క్రిష్ణకుమారి బదిలీ జీఓ అంశానికి తాత్కాలికంగా తెరపడినట్టు అయ్యింది.. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి విశాఖ డీపీఓను బదిలీ చేసిన జీఓని హైకోర్టు  నాలుగు వారాల పాటు సస్పెండ్ చేసింది. కోర్టు ఉత్తర్వులు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికార మొబైల్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ కి అందాయి.  విశాఖజిల్లాలో రెగ్యులర్ డీపీఓ  పనిచేస్తుండగా పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి పనిష్మెంట్ పై తూర్పుగోదావరి జిల్లా విఆర్ పురం ఎంపీడీఓగా పనిచేస్తున్న సుభాషిణిని విశాఖజిల్లా డిపీఓ(ఎఫ్ఏసీ)గా బదిలీ చేస్తూ పదిరోజుల క్రితం జీఓ జారీ చేశారు. అదే సమయంలో ఇక్కడ పనిచేస్తున్న డీపీఓని జిఏడీకి రిపోర్టు చేయాల్సిందిగా అందులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని హైకోర్టులో విశాఖజిల్లా డిపీఓ హైకోర్టులో సవాల్ చేశారు. దీనితో హైకోర్టు ఆ జీఓని  నాలుగు వారాల వరకూ ఆ జీఓని సస్పెండ్ చేసింది. వాస్తవానికి పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న అధికారులుగానీ, ఎంపీడీఓలు గానీ, డీపీఓలపై అవినీతి ఆరోపణలు, విజిలెన్సు విచారణలు, అధికారిక పనిష్మెంట్ వ్యవహారాలు జరుగుతున్న సమయంలో అలాంటి అధికారులను రెగ్యులర్ డిస్ట్రిక్ట్ కేడర్ పోస్టు లైవ్ లో ఉన్నచోటుకి బదిలీ చేయకూడదు. కానీ ఎంపీడీఓ సుభాషిణి విషయంలో ఆ నిబంధనలు ఏమీ పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులకు అడ్డు రాలేదు, సదరు అధికారిణిపై అవినీతి ఆరోపణలు, అభియోగాలు ఏమీ రుజువుకాకపోవడంతో ఆమెను అక్కడి నుంచి విశాఖకు బదిలీ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి జీఓ జారీచేశారు. విశాఖలో జివీఎంసీ ఎన్నికలు జరగడానికి ఎన్నికల కోడ్ అమలులో ఉండి.. అక్కడ డీపీఓ ఎన్నికల విధుల్లో ఉన్నప్పటికీ కనీసం ఎన్నికల సంఘం ద్రుష్టికి బదిలీ వ్యవహారం తీసుకెళ్లకుండానే పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఈ జీఓని జారీచేయడం కూడా చర్చనీయాంశం అయ్యింది. అంతేకాకుండా ఈ జీఓ  వ్యవహారం మొత్తం జిల్లా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావుకి తెలియకుండా కూడా ఆగమేఘాలపై జరిగిపోవడం కూడా జిల్లా యంత్రాంగానికి తెలియడంతో ఆమెను జాయిన్ చేసుకునే విషయంలో చుక్కెదురైంది. దానికి ప్రత్యక్ష కారణం జీవిఎంసీ మున్సిపల్ ఎన్నికలైతే రెండో కారణంగా ఆమె అవినీతి తారాస్థాయికి చేరుకోవడం మరొక కారణం. అదే సమయంలో ఇవన్నీ ఆరోపణలు, అభియోగాలు, విచారణలు పెండింగ్ లోనే ఉన్న విషయం కావడంతోనే తాము సుభాషిణి విషయంలో బదిలీతో కూడిన డిపీఓ(ఎఫ్ఏసీ)గా జీఓ జారీ చేశామని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యాలయ అధికారులు సమర్ధించుకున్న తరుణంలోనే ఈ కోర్టు ఉత్తర్వు విడుదల కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతస్థాయిలో నెట్వర్క్ నడిపినా, కొందరు ప్రజాప్రతినిధులు సపోర్టింగ్ లెటర్స్ ఇచ్చినా, సదరు అధికారిణిపై అవినీతి ఆరోపణలు, ప్రస్తుతం పెండింగ్ లో వున్న విజిలెన్స్ నివేదికలు, ఇతన ఫిర్యాదులన్నీ బటకు వచ్చి మీడియా హడావిడీ చేయడంతో విశాఖలో  సదరు ఎంపీడీఓ డీపీఓ(ఎఫ్ఏసీ)గా జాయిన్ కావడానికి అవకాశం లేకుండా పోయింది. ఇదే తరుణంలో అటు నాలుగు వారాల వరకూ కోర్టు జీఓను సస్పెండ్ చేయడంతో సదరు అధికారిణి కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నాలుగువారాల పాటు కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా జీఓని సస్పెండ్ చేసినా, పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇచ్చిన జీఓని రద్దు చేసినా, సదరు అధికారిణికి తిరిగి ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చారో ఆప్రాంతానికి తిరిగి పంపినా విషయం సద్దు మనుగుతుంది. అలాకాకుండా అటు ప్రభుత్వం కూడా డిపీఓ క్రిష్ణకుమారి కోర్టుని ఆశ్రయించినట్టుగా ప్రభుత్వంగానీ, సదరు ఎంపీడీఓ గానీ కోర్టువెళ్లినా తిరిగి ఈ విషయం మొదటికొస్తుంది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యాలయ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారు. ఈ క్రమంలోనే ఈ బదిలీ జీఓ రద్దు అవుతుందా, లేదంటే 4 నాలుగు వారాల తరువాత తిరిగి పునరుద్దరిస్తారానే అనేది కూడా ఇపుడు ఉత్కంఠగా మారింది. ఈలోగా ఇదే కేసుపై డిపీఓ క్రిష్ణకుమారి కోర్టు కేసుపై కెవియట్ కి వెళ్లినా మళ్లీ కోర్టులో వాదోపవాదాలు జరిగి అటు పంచాయతీరాజ్ శాఖకు, ఇటు విశాఖజిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులకు కాస్త గట్టిగానే పనికల్పించే అవకాశం ఏర్పడినా ఏర్పడవచ్చు.. ఎంతో ఆశక్తిని రేకెత్తించి, ప్రస్తుతానికి కోర్టు ఉత్తర్వులతో తాత్కాలికంగా తెరపడిన విశాఖజిల్లా డీపీఓ బదిలీ జీఓ విషయంలో ఏంజరుగుతుందనేది వేచి చూడాలి. కానీ డిపీఓ బదిలీ, అటు డీపీఓ(ఎఫ్ఏసీ) జాయినింగ్ విషయంలో ఏం జరిగినా వాటి వివరాలు లైవ్ అప్డేడ్స్ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ ద్వారా అందరికంటే ముందుగా అందిస్తామని ప్రకటిస్తున్నాం..! 

Visakhapatnam

2021-03-10 14:41:44

Tadepalle

2021-03-10 12:04:32

సచివాలయాల్లో స్పందన సరే సేవల మాటేమిటి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గ్రామసచివాలయ వ్యవస్థ ప్రజలకు అందుబాటులోలకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా..ఇక్కడ ఏ తరహా సేవలు అందుతున్నాయనే విషయం నేటికీ చాలా గ్రామాల్లోని ప్రజలకి తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం గ్రామసచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినపుడే ఇక్కడ పనిచేసే సుమారు 14శాఖల సిబ్బందికి వారి డ్యూటీలు ఏమీటో ఒక చార్టు ప్రకారం తెలియజేసింది. అయితే వారు ఆ విధంగా డ్యూటీలు చేస్తున్నారా అంటే లేదనే సమాధానం చెప్పాలి. ఇదేదో కావాలని చెబుతున్న మాటకాదు గ్రామస్థాయిలో తెలుసుకొని ప్రభుత్వానికి తెలియజేసేందుకు చేస్తున్న ప్రయత్నం. ప్రభుత్వ లెక్కట ప్రకారం ఏ గ్రామసచివాలయంలో ఎన్నిశాఖ సిబ్బంది ఇప్పటి వరకూ విధుల్లో చేరారో..ఆయా గ్రామాల్లో ప్రజలకు తెలియాలి. ఆపై వారు ఏరకమైన సేవలు అందిస్తారో కూడా తెలియాలి. అలా ఇప్పటి వరకూ ఎన్ని గ్రామసచివాలయాల కార్యదర్శిలు ప్రజలకు అవగాహన కలించారు అంటే సిబ్బందే నీళ్లు నములుతున్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సిబ్బంది, పంచాయతీ కార్యదర్శిలు తప్పా మిగిలిన ఏఏ శాఖల సిబ్బంది సచివాలయాల్లో ఉన్నారో నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తెలియలేదంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వం గ్రామాల్లో ప్రజలకు ఇంటిముంగిటే సేవలు అందాలని సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినటప్పటికీ ఆ విధంగా సేవలు అందటం లేదు. ప్రభుత్వం వాస్తవాలు నేరుగా నమోదు చేస్తే ఆ విషయం తేటతెల్లమవుతుంది. దానికి ప్రత్యక్ష కారణం కూడా లేకపోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు లక్షా 26వేల మందికి పైగా గ్రామ, వార్డు సచివాయాలకు సిబ్బందిని నియమించినా..నేటికీ జిల్లా కలెక్టర్ కార్యాలయం, పట్టణాల్లో నగరాపలక సంస్థ కార్యాలయాలకు నేటికీ స్పందన అర్జీలు వస్తూనే ఉన్నాయి. అంటే దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. గ్రామాల్లో ప్రజలకు సేవలు అందంటం లేదనేది తేటతెల్లమవుతుంది. ఈ తరుణంలో ప్రభుత్వం గ్రామసచివాలయాల్లో ప్రతినిత్యం స్పందన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటిచించింది. అయినప్పటికీ ప్రజల్లో చైతన్యం రావడం లేదు. ఒక వేళ గ్రామసచివాలయాల్లో స్పందన కార్యక్రమం పెడితే మనం ఏ సమస్యపై అక్కడ అర్జీ పెట్టాలని తెల్ల మొహం వేస్తున్నారు. దీనికి కూడా కారణం లేకపోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న గ్రామ, వార్డు సచివాలాయాల్లో ఇప్పటి వరకూ చాలా శాఖల్లో ఖాళీలు భర్తీ కాలేదు. భర్తఅయిన ప్రభుత్వ శాఖలేంటో, వారు ఎలాంటి సేవలు అందిస్తారో ప్రజలు తెలియపోవడం వలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది. ఈ విషయంలో జిల్లా పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు జోక్యం చేసుకొని గ్రామ సచివాలయాల పరిధిలో ప్రజలకు ఏ తరహా సేవలు అందుతాయనే విషయంపై చైతన్యం కల్పిస్తే తప్పా రాష్ట్రప్రభుత్వం అనుకున్నట్టుగా సచివాలయాల్లో స్పందనకు దరఖాస్తుల సంఖ్య పెరిగి జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు స్పందన దరఖాస్తులు తగ్గుతాయి. అలాకాకుండా జిల్లా అధికారులు, మండల అధికారలు తాము బాగా పనిచేసేస్తున్నామని ప్రకటనలు ఇచ్చి ప్రభుత్వాన్ని మభ్య పెట్టాలని చూస్తే మాత్రం గ్రామ, వార్డు సచివాలయాల్లో చాలాశాఖల సిబ్బందికి కూర్చోబెట్టి జీతాలు ఇచ్చినట్టే అవుతుంది. పైగా గ్రామస్వరాజ్యం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామసచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలు అందకుండా పోతాయి. ఈవిషయంలో ప్రభుత్వం వాస్తవాలను గుర్తిస్తే తప్పా ప్రభుత్వ సేవలు, ఖర్చు, విలువైన సమయం వ్రుధాకాకుండా ఉంటాయి. 

Tadepalle

2021-03-10 11:16:02

Tadepalle

2021-03-10 10:55:10

Tadepalle

2021-03-09 16:43:44

జర్నలిస్టులకు చేరువుగా ప్రెస్ అకాడమి..

గ్రామీణ జర్నలిస్ట్ లతో పాటు ఫోటో, వీడియో జర్నలిస్ట్ ల్లో వృత్తి నైపుణ్యాల అభివృద్ధి కోసం ప్రెస్ అకాడమీ క్రుషి చేస్తుందని ఛైర్మన్ శ్రీనాథ్ అన్నారు.  ఒక ప్రభుత్వ సంస్థగా కాకుండా ప్రెస్ అకాడమీ రాజ్యాంగ బద్ధమైన  విధులతో  నైతికత  కూడిన జర్నలిస్ట్ ల కోసం కృషి చేస్తానని ఆయన అన్నారు. ప్రెస్ అకాడమీ కార్యాలయంలో అకాడమీ ఏపీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ మంగళవారం ఉదయం పాత్రికేయుల సమావేశంలో అకాడమీ కార్యదర్శి ఎం. బాల గంగాధర్ తిలక్ తో కలిసి పాల్గొన్నారు.  చైర్మన్ పదవి చేపట్టినప్పటి నుండి వినూత్న పంధాలో కార్యక్రమాలను నిర్వహిస్తూ జర్నలిస్టులకు, ప్రజలకు మరింత  చేరువయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నామని ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ అన్నారు. కోవిడ్ లాంటి ప్రతికూల పరిస్థితిల్లో కూడ రాష్ట్రంలోని 13 జిల్లాలలో పర్యటించి స్వయంగా జర్నలిస్టులను కలుసుకుని, వారి సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు.  ప్రెస్ అకాడమీ విడతల వారీగా పాత్రికేయులకు  ఆన్ లైన్ శిక్షణ తరగతులను నిర్వహిస్తోందన్నారు. తద్వారా వారిలో జర్నలిజం లోని నైతికత విలువలపై అవగాహన పెంపొందించే దిశలో అకాడమీ కృషి చేయాలన్నా ధ్యేయం తో అడుగులు వేస్తున్నామన్నారు. తొలివిడత పునశ్చరణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాల జర్నలిస్టులకు శిక్షణ తరగతులు పూర్తయ్యాయి.                 తొలివిడత శిక్షణలో దాదాపు 4 వేల మంది జర్నలిస్టులు పాల్గొన్నారని, వారిని అభినందించడంతో పాటు కృతజ్ఞత వ్యక్తం చేస్తాన్నామని తెలిపారు.  30 మంది నిష్ణాతులైన సీనియర్ పాత్రికేయులు, జర్నలిజం అధ్యాపకులచే, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు తో కూడి శిక్షణ తరగతుల నిర్వహించామని తెలిపారు. 15 విలక్షణ అంశాలపైన శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. ముఖ్యంగా యువత జర్నలిజం పై ఆసక్తి చూపుతున్నారని,  ఔత్సాహిక జర్నలిస్ట్ లను అన్ని విధాలుగా అండగా నిలుస్తామన్నారు. జర్నలిజం కోర్సుల్లో ప్రావీణ్యం పెంపొందించే దిశగా ప్రెస్ అకాడమీ అడుగులు వేస్తోందని శ్రీనాథ్ తెలిపారు. పాత్రికేయుల నైపుణ్యాన్ని పెంచేలా రూపకల్పన చేసిన ఈ- పుస్తకాలను ఆన్ లైన్ లో 7 వేలకు పైగా జర్నలిస్టులు డౌన్ లోడ్ చేసుకున్నారని, ఇది వారిలోని జిజ్ఞాసకు ఉదాహరణ గా పేర్కొన్నారు.                జర్నలిజం కోర్సులను విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం, యోగి వేమన విశ్వవిద్యాలయం, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాలతో ప్రెస్ అకాడమీ ఒప్పందం చేసుకున్నామన్నారు.  జర్నలిజం కోర్సుల ఫీజుల రాయితీ విషయంలో ఫీజులు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.  యూనివర్సిటీ లు నిర్ధారించిన ఫీజుల్లో 40 నుంచి 50 శాతం అకాడమీ ద్వారా జర్నలిస్ట్ ల తరపున చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మరిన్ని యూనివర్సిటీలతో ఒప్పందాన్ని చేసుకునేందుకు ప్రెస్ అకాడమీ సిద్ధంగా వుందన్నారు.  ఇప్పటికే  వర్కింగ్ జర్నలిస్టులు ఒప్పందం చేసుకున్న యూనివర్సిటీల్లో జర్నలిజం కోర్సుల్లో ప్రవేశాలు తీసుకున్నామన్నారు. విక్రమ సింహాపురి విశ్వవిద్యాలయం ద్వారా ఆన్ లైన్ లో సర్టిఫికేషన్ డిప్లామో కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు.                 మలిదశ శిక్షణలో  గ్రామీణ విలేకరులు, ఫోటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులతో పాటు ఆయా బీట్ లు , అంశాల వారీగా అవసరమయ్యే  మెళకువలపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం ఆలోచన చేస్తోందని ఆయన అన్నారు.  కోవిడ్ సమయంలో మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాలను ఆదుకునే దిశలో రూ.5 లక్షల పరిహారం అందచేసే విషయంలో ప్రభుత్వం ఇప్పటికే సానుకూలంగా స్పందించింది అని తెలిపారు. అదేవిధంగా కోవిడ్ బారిని పడి, చికిత్స పొందిన వారిని కూడా ఆదుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు.   జర్నలిస్టులు సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్యులు సానూకూలంగా వున్నారని ఛైర్మన్ తెలిపారు. 

Vijayawada

2021-03-09 15:32:37

విశాఖ డిపీఓ బదిలీ జీఓని సస్పెండ్ చేసిన కోర్టు..

బ్రేకింగ్ న్యూస్ అందుతోంది..విశాఖజిల్లా పంచాయతీ అధికారి క్రిష్ణకుమారిని కదపకూడదని హైకోర్టు స్టే విధించింది. గద ఏడు రోజుల క్రితం విఖజిల్లా డిపీఓను బాదిలీ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాకుండా రాష్ట్రంలో చాలా జిల్లాల్లో డీపీఓ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ఈమెకు ఏ జిల్లాలోనూ పోస్టింగ్ ఇవ్వకుండా జిఏడి కి రిపోర్టు చేయాలని ఆ జీఓలో పేర్కొన్నారు. దీనితో తనకు అన్యాయం జరిగిందని భావించిన డిపిఓ క్రిష్ణకుమారి ప్రభుత్వ జీఓను సవాల్ చేస్తూ హై కోర్టు ఆశ్రయించారు. ఆమె వినతపై సోమవారం కోర్టు సదరు జీఓని సస్పెండ్ చేస్తూ స్టే విధించింది. దీనితో ప్రభుత్వం ఒక ఎంపీడీఓను డిపీఓ(ఎఫ్ఏసీ)గా బదిలీ చేస్తూ విడుదల చేసిన జీఓ నిలిచిపోయినట్టు అయ్యింది. భారీ స్థాయిలో అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న తూర్పుగోదావరి జిల్లా విఆర్ పురం ఎంపీడీఓ సుభాషిణికి కూడా పోస్టింగ్ విశాఖలో ఇవ్వకుండా వీలులేకుండా పోయింది. అయితే ఈ కోర్టు ఉత్తర్వులను అనుసరించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఈ ఉత్కంఠగా మారింది. మరోపక్క విశాఖజిల్లా డిపీఓను బదిలీ చేస్తున్న విషయం జిల్లా మంత్రికి తెలియకుండా జరగడం ఒక విషయమైతే, అవినీతి ఆరోపణలు ఎదర్కొంటున్న ఎంపీడీఓ విషయంలో చాలా కేసులపై విచారణలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. అయినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతో అధికారులను ప్రసన్నం చేసుకొని సదురు అధికారిణి తనపై విచారణలు అన్నీ పెండింగ్ లో ఉన్న ప్పటికీ  పదోన్నతితో పాటు బదిలీకి జీఓ తెప్పించుకునే విషయంలో సఫలీక్రుతులయ్యారు. కానీ విశాఖజిల్లా డీపీఓ క్రిష్ణకుమారి కోర్టును ఆశ్రయించడంతో అదికాస్త నీరుగారిపోయినట్టు అయ్యింది. విశాఖజిల్లా డీపీఓ ను బదిలీ చేస్తూ కోర్టు సస్పెండ్ చేసిన జడ్జిమెంట్ కాపీలు సాయంత్రానికి గానీ రేపు ఉదయానికి గానీ అటు పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి కార్యాలయానికి, విశాఖజిల్లా కార్యాలయానికి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది..!

Tadepalle

2021-03-08 14:53:03

Tadepalle

2021-03-08 14:09:19