1 ENS Live Breaking News

2021-01-20 11:51:34

అడ్డగోలు అక్రిడిటేషన్ లపై సహచట్టం..5

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖల్లో సమాచార పౌరసంబధాల శాఖ వేరయ..ఈ శాఖలో ప్రభుత్వ మీడియా సలహాదారులు జర్నలిస్టులకిచ్చిన హామీలు.. మంత్రుల సూచనలు.. జర్నలిస్టు వ్యతిరేకతను పట్టించుకోకుండా వీరు మొండిగా కోర్టులకు సమాధానాలు చెబుతారయ..ఏంటి ఇవేవో సినిమా డైలాగులు అనుకుంటున్నారా.. అలా అనుకుంటే ఎడిటింగ్ చేయని వార్తలో కాలుపెట్టినట్టే.. మీరు చదువుతున్నదంతా అక్షర సత్యం..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అబాసు పాలుచేయాలని చూస్తున్నారో..లేదంటే అత్యుత్సాహం ప్రదర్శించి జర్నలిస్టులంతా ప్రభుత్వంపై తిరగబడేలా చేస్తున్నారో.. అదీకాదంటే దేశం మొత్తం ఏపీలోని సమాచరశాఖనే తొంగిచూసేలా మీడియాను నియంత్రించేలా చేయాలని ప్రత్యేక పథకం వేశారో తెలీదు గానీ.. సమాచారశాఖలో ఉన్నతాధికారులు జర్నలిస్టులు ఏమైపోయినా తాము అనుకున్నదే చేస్తూ ముందుకు వెళుతూ వార్తల్లో నిలుస్తున్నారు.. మీడియాలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడిటేషన్ల విషయంలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని నిబంధనలు అమలు చేసి వేలల్లో వున్న అక్రిడేటెడ్ జర్నలిస్టులను వందల్లోకి తెచ్చే ప్రయత్నం గట్టిగా చేస్తున్నామనే సంకేతాలను పంపుతున్నారు.. నిబంధనలు ఎవరికైనా ఒకేలా వర్తింపచేసే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సమాచారశాఖ మాత్రం డైనమిక్ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నిబద్దతగావున్నా..మంత్రులు ముక్కుసూటిగా వున్నా..మీడియా సలహాదారులు సూచనలు చేస్తున్నా అవేమీ తమకు పట్టవన్నట్టు వ్యవహరిస్తున్నారు. జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడిటేషన్ల వ్యవహారంలో ఇటు మంత్రులు, మీడియా సలహాదారులు జర్నలిస్టు సంఘాలకు పత్రికా ముఖంగా ఎవరికీ అన్యాయం జరగకుండా అక్రిడిటేషన్లు ఇస్తామని, ఆందోళన చెందవద్దని హామీలిస్తూ అదే మీడియాలో ప్రకటిస్తున్నా..తాము మాత్రం ఇచ్చిన జిఓ నెంబరు 142 ఆధారంగానే వ్యవహరిస్తామంటూ మొండిగా వ్యవహరిస్తున్నారు. జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడిటేషన్లపై కెనీసం అవగాహన లేని అధికారులను అక్రిడిటేషన్ కమిటీలో సభ్యులుగా చేర్చి, జర్నలిస్టుల సంఘాలను పక్కకు పెట్టిన విషయమై ఇప్పటికే కోర్టుకి వివరణ ఇచ్చేపనిలో పడినా..నేటికీ అధికారుల తీరులో మార్పు రాలేదు సరికదా..  ప్రభుత్వం తరపున ఇచ్చిన జీఓ ప్రకారం అయినా అక్రిడిటేషన్లు సక్రమంగా ఇస్తున్నారా అంటే దానికీ సరైన సమాధానం ఇవ్వడంలేదు.. పెద్ద పత్రికలకు వారి సొంత న్యూస్ ఏజెన్సీల ద్వారా ప్రచురితమైన క్లిప్పింగులను అనుసరించి పత్రిక పేరుతో అక్రిడిటేషన్లు మంజూరు చేశారు సమాచారశాఖ అధికారులు. అసలు ఒక పత్రికకు పత్రికపేరుతో వచ్చే క్లిప్పింగులతో కాకుండా న్యూస్ ఏజెన్సీ క్లిప్పింగులతో దరఖాస్తు చేస్తే ఆ పత్రికలకు పత్రికల పేరుతో అక్రిడిటేషన్లు ఎలా ఇస్తారు..దానికి ఏదైనా ప్రత్యేక జీఓ వుందా..అలాని సదరు పత్రికలు న్యూస్ ఏజెన్సీ ఫార్మాట్ లో అక్రిడిటేషన్లకు దరఖాస్తు చేశాయా అంటే దీ లేదు.. కానీ జీఓలో ఉన్నట్టుగా సంబంధిత అధీక్రుత పత్రాలు, క్లిప్పింగులు, ఇతరత్రా అన్నీ ఆన్ లైన్ సమర్పిస్తే తప్పా అక్రిడిటేషన్లు ఇవ్వమని తెగేసి చెబుతున్న అధికారులు పెద్ద పత్రికలు న్యూస్ ఏజెన్సీ క్రెడిట్ లైన్ తో పెట్టిన క్లిప్పింగులకు ఎలా అక్రిడిటేషన్లు ఇచ్చారనే విషయమై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. ఇదే విషయమై విశాఖజిల్లాలోని మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ కు దాఖలైన 15 అంశాల సమాచారహక్కు చట్టం దరఖాస్తులో ప్రస్తావించిన అంశాలను ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు, ప్రభుత్వంలోని పెద్దలకు తెలిసే విధంగా ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ యాప్, www.enslive.net న్యూస్ వెబ్ సైట్ల ద్వారా అడ్డగోలు వ్యవహారాన్ని బహిర్గతం చేసే పనిలో పడ్డాయి. ప్రస్తుతం ఈ విషయమే రాష్ట్రంలో హాట్ టాపిక్. విశాఖజిల్లాలో దాఖలైన సమాచారహక్కు చట్టంలోని అంశాలకు సమాధానం చెప్పకపోయినా, నిబంధనలను అతిక్రమించి ఇచ్చిన అక్రిడిటేషన్ల వ్యవహారంలో ఖచ్చితమైన సమాచారం మొక్కుబడిగా ఇచ్చినా సదరు దరఖాస్తు దారుడు సమాచారశాఖ ఇచ్చిన ఆధారాలు, ప్రభుత్వ నిబంధనలు, దేశరాజధాని న్యూఢిల్లీలోని పీఐబీ(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) అమలు చేసే నిబంధనలతో కోర్టుకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. అదే జరిగితే పుండుపై కారం చల్లినట్టుగా, ఇప్పటికే అత్యుత్సాహంతో కోర్టులకు వివరనిస్తూ వస్తున్న సమాచారశాఖ ఇపుడు మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ ను కూడా ఇరకాటంలోకి నెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. దానికి కారణం కూడా లేకపోలేదు. ముఖ్యంగా విశాఖజిల్లాలో జరిగే అక్రిడిటేషన్ కమిటీలో జరిగిన సమావేశ అంశాలు(మినిట్స్)ను సమాచారశాఖ అధికారులు ఎప్పుడూ సమావేశంలో రాయరు. ఇదే విషయమై గతంలో కూడా గొడవులు జరిగాయి. ఇలా చాలా తప్పులు చేసిన సమాచారఖను ఏదోలా ఒడ్డున పడేయాలని చూస్తున్న మీడియా సలహాదారుల సూచనలు కూడా సమాచారశాఖ అధికారులు పెడచెవిన పెడుతున్నారనే ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. కోర్టు మెట్లెక్కి కౌంటర్లైనా దాఖలు చేస్తున్నారు తప్పితే తాము ఇచ్చిన జీఓని మార్చేది లేదంటూ వివిధ శాఖల అధికారులతోనే అక్రిడిటేషన్ కమిటీలు నిర్వహిస్తూ వచ్చారు. అందులో కొన్ని పెద్ద పత్రికలకు న్యూస్ పేపర్ ఫార్మాట్ లోనూ, ఇటు న్యూస్ ఏజెన్సీ ఫార్మాట్ లోనూ కాకుండా దాఖలు చేసిన అక్రిడిటేషన్ ఫైలును ఆమోదించి ఇచ్చిన అక్రిడిటేషన్ల వ్యవహారానికి ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. సమాచారశాఖకు, జర్నలిస్టులకు మధ్య జరుగుతున్న వార్ ను తగ్గించడానికి ప్రభుత్వంలోని మీడియా సలహాదారులు జర్నలిస్టులకు ఇచ్చే హామీలను సమాచారశాఖ పట్టించుకోకుండా తాము అనుకున్నట్టే చేస్తూ ముందుకు వెళుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉత్తర్వులో గౌరవ ప్రధమైన స్థానంలో వున్న రాష్ట్ర మీడియా సలహాదారులు, జాతీయ మీడియా సలహాదారుల సూచనలు, సలహాలు మాకు పట్టవన్నట్టు వ్యవహరిస్తోంది. ఇదేదో కావాలని ప్రభుత్వాన్ని తప్పుపడుతూ రాస్తున్న ప్రత్యేక కధనాలు కావనే విషయాన్ని ప్రభుత్వంలోని పెద్దలు గమనించాలి. కేవలం సమాచారశాఖ జర్నలిస్టులకిచ్చే అక్రిడిటేషన్ల విషయంలో నిబందనలు ఒక్కొక్కరికి ఒక్కోలా అమలు చేస్తున్న విషయాన్ని మాత్రమే ఇటు ప్రభుత్వానికి, ఇటు జర్నలిస్టులకు ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ యాప్, ఈఎన్ఎస్ లైవ్.నెట్ న్యూస్ వెబ్ సైట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అదీకాకుండా సమాచార హక్కుచట్టం 2005 ఆధారంగా ధాఖలైన దరఖాస్తులోని అంశాలను ప్రస్తావిస్తూ, అక్రిడిటేషన్లు మంజూరు చేసిన విషయాన్ని, ప్రభుత్వానికి సమాచారశాఖ అధికారులు తెస్తున్న చెడ్డపేరుని ప్రజలకు, పాఠకులకు తెలియజేయడానికి, దేశ రాజధాని న్యూఢిల్లీ  పీఐబీలోనే లేని నిబంధనలను ఒక్క ఆంధ్రప్రదేశ్ లోని అమలు చేయడాన్ని బహిర్గతం చేయాలని...ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మాటలను, సూచనలను, ప్రతీసారి నిబంధనలు పాటించని ఏ ప్రభుత్వ శాఖ అయినా, అధికారులైనా ప్రభుత్వానికి ఒక్కటే..తప్పు జరిగితే ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటాం.. మీడియా వాస్తవాలను రాయాలని పదే పదే ప్రజలను చైతన్యం చేయడానికి సీఎం చెబుతున్న తరుణంలో ఈ విషయాలను దారావాహికంగా బయటకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే అవినీతిలేని, నిబంధనలు తప్పకుండా అన్ని వర్గాలకు ఒకేలా పాటించాలనే సూచనను పాటిస్తూనే ఈ విధమైన వార్త కధనాలను అందిస్తున్నామనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలి..రేపటి ప్రత్యేక కధనం అడ్డగోలు అక్రిడిటేషన్ లపై సహచట్టం..6 లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని మీడియా సంస్థలు వేజ్ బోర్డు జీతాలు అమలు చేస్తున్నాయి..ఎన్ని మీడియా సంస్థలు కనీసం లేబర్ లైసెన్సులు కూడా తీసుకోకుండా పత్రికల నిర్వహణ చేస్తున్నాయి.. ఎన్ని న్యూస్ ఏజెన్సీలు అక్రిడిటేషన్ల దరఖాస్తు చేసినపుడు అన్ని రకాల ద్రువీకరణ పత్రాలు ఇచ్చాయి..ఇవ్వకుండానే ఎన్ని సంస్థలకు అక్రిడిటేషన్లు జారీచేశారు తదితర వివరాలతో రేపటి ప్రత్యేక కధనంతో మళ్లీ కలుద్దాం..!

Visakhapatnam

2021-01-20 10:27:02

2021-01-19 12:57:14

అడ్డగోలు అక్రిడిటేషన్ లపై సహచట్టం..4

ఆంధ్రప్రదేశ్ లోని వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇచ్చే విషయంలో దేశ రాజధాని పీఐబీలో కూడా లేని నిబంధనలు పెట్టిన సమాచాశాఖ.. ఈ శాఖలోని అటెంటడర్లుకు, వాచ్ మెన్ లకు కూడా ప్రభుత్వ అక్రిడిటేషన్లు ఎలా ఇచ్చిందో అధికారులే సమాధానం చెప్పాల్సి వుంది. సమాచారశాఖలో ప్రభుత్వ కార్యక్రమాల కవరేజికి వెళ్లే డిడి, ఏడి, డిపిఆర్వో, ఏపీఆర్వో, ఫోటోగ్రాఫర్, సినిమా ఆపరేటర్, మైక్ సెట్ ఆపరేటర్లకు సమాచారశాఖ విధినిర్వహణలో భాగంగా అక్రిడిటేషన్లు మంజూరు చేస్తుంది. కానీ విశాఖజిల్లాలోని సమాచారశాఖలో మాత్రంలో అటెండర్లుకు, వాచ్ మెన్లకు కూడా సమాచారశాఖ అక్రిడిటేషన్లు మంజూరు చేసేసింది. దానికి కారణం కూడా లేకపోలేదు. జర్నలిస్టులతో సహా సమాచారశాఖలోని అక్రిడిటేడెస్ సిబ్బందికి కూడా ఆర్టీసీ బస్సు పాసులు మంజూరు చేయడంతో ఇబ్బడి ముబ్బడిగా కార్యాలయంలోని ఉన్న సిబ్బందికి మొత్తం అక్రిడిటేషన్లు ఇచ్చేసింది. ఈ విషయాన్ని బహిర్గతం చేయాలని కోరుతూ విశాఖజిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ కు సమాచారహక్కుచట్టం 2005 ప్రకారం సమాచారశాఖలోని అడ్డగోలు అక్రిడిటేషన్ల వ్యహారం ఆధారాలతో సహా బయటకు తీసే ఉద్దేశ్యంతో దరఖాస్తు దాఖలైంది. అంతేకాదు సమాచారశాఖలోని కొందరు సిబ్బంది, అక్రిడిటేషన్ కమిటీలోని సభ్యుల అండ దండలతో నచ్చిన వారికి నచ్చినట్టుగా పరిమితికి మించి అక్రిడిటేషన్లు మంజూరు చేశారు. అందులోకొన్ని పెద్ద పత్రికలు కూడా ఉన్నాయి. సమాచారశాఖ జర్నలిస్టులకి అమలు చేసే నిబంధనలు ఎందుకు ప్రభుత్వశాఖ అయిన సమాచారశాఖలోని అధికారులు, సిబ్బంది, కార్యాలయ ఉద్యోగుల విషయంలో పాటించలేదో అధికారులే సమాధానం చెప్పాల్సి వుంది. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి తదితర అతిముఖ్యమైన వారు వచ్చినపుడు సమాచారశాఖ లోని సిబ్బంది అవసరం అవుతారని, అందుకే వారికి అక్రిడిటేషన్లు ఇచ్చారని ఇక్కడి అధికారులు సమర్ధించుకున్నా ప్రభుత్వ నిబంధనల మేరకు పనిచేసే అటెండర్లకు పదో తరగతి అర్హతున్న ఉద్యోగులకు అక్రిడిటేషన్లు ప్రభుత్వం ఇవ్వకూడదు. కానీ సమాచారశాఖ వరకూ వస్తే ఒక నిబంధన, జర్నలిస్టులకు మాత్రం మరోలా కఠినతరమైన నిబంధనలు ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నిస్తే...మేమిచ్చిందే జీఓ దానిని ఎవరైనా పాటించాల్సిందేనని అధికారులు బల్లగుద్ది చెబుతున్నారు. పైగా తమ కమిషనర్ ఇచ్చిన జీఓ ప్రకారం అన్ని అనుబంధ పత్రాలు లేకపోతే అక్రిడిటేషన్ వచ్చే పరిస్థితి లేదని తెగేసి చెప్పేస్తున్నారు కూడా. ఇలాంటి సమయంలో విశాఖజిల్లాలో అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ కు దాఖలైన సమాచారహక్కుచట్టం దరాఖాస్తులోని పలు అంశాలను ఇపుడు అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ ను ఇరకాటంలో పెట్టేలా ఉన్నాయి. ఇప్పటికే అటు న్యూస్ ఏజెన్సీ, ఇటు దిన పత్రికా కాని పెద్ద మీడియా సంస్థలకు ఇబ్బడి ముబ్బడిగా మొదటి విడతలో అక్రిడిటేషన్లు ఇచ్చేసిన సమాచారశాఖ తమను తాము సమర్ధించుకునే పనిలో పడింది. గత మూడేళ్లుగా సమాచారశాఖలోని కొందరు అధికారులు అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ ను సైతం తప్పుదోవ పట్టిస్తూ వస్తూ, తమ అనుకూల మీడియాకి కూడా అక్రిడిటేషన్లు ఇచ్చేస్తూ వచ్చాయి. అయితే ఇపుడు వాటిని సమాచారహక్కు చట్టం ద్వారా కోరిన సందర్భంలో సమాచారశాఖ అధికారులు అపుడే జర్నలిస్టు సంఘాల నేతలను రంగంలోకి దించాయి. సమాచార హక్కుచట్టం క్రింద కోరిన సమాచారం మొత్తం అందినట్టుగా దరఖాస్తు దారుడితో చెప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఎన్నిచేసినా ప్రస్తుతం దాఖలైన సమాచారహక్కుచట్టం క్రింద దాఖలైన దరఖాస్తులోని విషయాలతో దరఖాస్తు దారు, సమాచారశాఖ ఇచ్చిన సమాచారంతో కోర్టుకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే జీఓ నెంబరు 142 ద్వారా అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్టు సంఘాలను లేకుండా కేవలం అధికారులతోనే కమిటీ వేయడానికి కోర్టు ద్వారా స్టేటస్ కో ఇచ్చిన నేపథ్యంతో సమాచారహక్కుచట్టం దరఖాస్తుతో అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ ఇచ్చిన సమాచారంతో పరిస్థితి, అధికారులు అడ్డగోలుగా ఇచ్చిన అక్రిడిటేషన్ల వ్యవహారం ఆధారాలతో సహా బహిర్గతం కానుంది. అంతేకాదు ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని సమాచారశాఖలోని రాష్ట్ర కమిషనర్ తో పాటు, అన్ని జిల్లా సమాచారశాఖ అధికారులకు జరుగుతున్న తంతు వార్తల రూపంలో ముందుగానే తెలుస్తుంది. ఈరోజు మీడియా సలహాదారుల విషయాన్ని తెలియజేయాల్సి వుండగా, దానికంటే ముందు సమాచారశాఖలోని అందరు సిబ్బందికి డిపార్టమెంటల్ అక్రిడిటేషన్లు మంజూరు చేసిన విషయాన్ని ముందుగా తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ కధనాన్ని ముందు ఇచ్చేస్తున్నాం. ఇదేదో కావాలని ప్రభుత్వాన్ని తప్పుపడుతూ రాస్తున్న ప్రత్యేక కధనాలు కావనే విషయాన్ని ప్రభుత్వంలోని పెద్దలు గమనించాలి. కేవలం సమాచారశాఖ జర్నలిస్టులకిచ్చే అక్రిడిటేషన్ల విషయంలో నిబందనలు ఒక్కొక్కరికి ఒక్కోలా అమలు చేస్తున్న విషయాన్ని మాత్రమే ఇటు ప్రభుత్వానికి, ఇటు జర్నలిస్టులకు ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ యాప్, ఈఎన్ఎస్ లైవ్.నెట్ న్యూస్ వెబ్ సైట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అదీకాకుండా సమాచార హక్కుచట్టం 2005 ఆధారంగా ధాఖలైన దరఖాస్తులోని అంశాలను ప్రస్తావిస్తూ, అక్రిడిటేషన్లు మంజూరు చేసిన విషయాన్ని, ప్రభుత్వానికి సమాచారశాఖ అధికారులు తెస్తున్న చెడ్డపేరుని ప్రజలకు, పాఠకులకు తెలియజేయడానికి, దేశ రాజధాని న్యూఢిల్లీ  పీఐబీలోనే లేని నిబంధనలను ఒక్క ఆంధ్రప్రదేశ్ లోని అమలు చేయడాన్ని బహిర్గతం చేయాలని...ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మాటలను, సూచనలను, ప్రతీసారి నిబంధనలు పాటించని ఏ ప్రభుత్వ శాఖ అయినా, అధికారులైనా ప్రభుత్వానికి ఒక్కటే..తప్పు జరిగితే ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటాం.. మీడియా వాస్తవాలను రాయాలని పదే పదే ప్రజలను చైతన్యం చేయడానికి సీఎం చెబుతున్న తరుణంలో ఈ విషయాలను దారావాహికంగా బయటకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అంటే అవినీతిలేని, నిబంధనలు తప్పకుండా అన్ని వర్గాలకు ఒకేలా పాటించాలనే సూచనను పాటిస్తూనే ఈ విధమైన వార్త కధనాలను అందిస్తున్నామనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలి..రేపటి ప్రత్యేక కధనం అడ్డగోలు అక్రిడిటేషన్ లపై సహచట్టం..5 లో ప్రభుత్వ మీడియా సలహా దారులు జర్నలిస్టు సంఘాలకు ఇచ్చిన హామీలేంటి, సమాచారశాఖ అధికారులు వాటిని పట్టించుకోకుండా ఎలా వ్యవహరిస్తున్నారు...కావాలనే మొండిగా వెళుతూ, కోర్టులో కౌంటర్లు ఎందుకు దాఖలు చేస్తున్నారు..తదితర అంశాలతో మళ్లీ కలుద్దాం..! 

Visakhapatnam

2021-01-19 12:35:00

2021-01-18 16:21:21

ఎమ్మెల్యేల హక్కులను కాపాడాల్సిందే..

రాష్ట్రంలోని శాసన సభ్యుల హక్కులను కాపాడవలసిన భాద్యత ప్రివిలేజస్ కమిటీ  మీద ఉందని ఆంధ్రప్రదేశ్ శాసన సభ  ప్రివిలేజస్ కమిటీఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం తిరుపతి పద్మావతీ అతిధి గృహంలో ఆంధ్రప్రదేశ్ శాసన సభ ప్రివిలేజస్ కమిటీ సభ్యులు  మల్లాది విష్ణు, ఎస్.వెంకట చిన్న అప్పల నాయుడు, వి.వరప్రసాద్ రావు, శిల్పా చక్రపాణి రెడ్డి మరియు ఎ పి ఐ ఐ సి చైర్ పర్సన్ రోజా లతో కలసి  ఛైర్మన్ జిల్లాలో ప్రోటోకాల్ అమలు తీరు పై జిల్లా కలెక్టర్ డా.నారాయణ్ భరత్ గుప్తా, జిల్లా ఉన్నతాదికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ శాసన సభ్యులకు రాష్ట్ర  ప్రభుత్వ  ప్రోటోకాల్ నియమావళిని  అనుసరించాలని, శాసన సభ్యులు సమస్యల పరిష్కారం కొరకు ఇచ్చే లేఖలకు తీసుకున్న చర్యలకు సంబందించి తగు సమాచారం వెంటనే అందివ్వాలని , అధికారులు  సంక్షేమ కార్యక్రమాలకు సంబందించిన పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు  అందివ్వాలని తెలిపారు. చిత్తూరు జిల్లాకు సంబందించి ఇప్పటి వరకు ప్రివిలేజస్ కమిటీకి ఎటువంటి ఫిర్యాధులు అందలేదని ఈ పద్ధతిని ఇలాగే కొనసాగించాలని తెలిపారు.  అనంతరం ప్రివిలేజస్ కమిటీ ఛైర్మన్  కాకాణి గోవర్ధన్ రెడ్డి , సభ్యులు  మల్లాది విష్ణు, ఎస్.వెంకట చిన్న అప్పల నాయుడు, వి.వరప్రసాద్ రావు, శిల్పా చక్రపాణి రెడ్డి లతో కలసి  విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, శాసనసభ ప్రివిలేజస్  కమిటీ 175 మంది శాసనసభ్యుల హక్కులను కాపాడటం, కీలకమైన శాసనసభ్యుల హక్కులకు భంగం వాటిల్లకుండా జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న  చర్యలపై  ప్రివిలేజస్ కమిటీ దృష్టి పెడుతుందన్నారు. సాధారణంగా ప్రోటోకాల్ లో  శాసన సభ్యుల  హక్కులకు భంగం వాటిల్లినప్పుడు  ప్రివిలేజస్ కమిటీకి ఫిర్యాదులు  అందుతాయని వాటిని కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోవడం  జరుగుతుందని తెలిపారు. స్పీకర్ రిఫర్ చేసిన ఫిర్యాదులకు  సంబందించి తొలి సమావేశం అమరావతిలో నిర్వహించామని తెలిపారు. జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించడం జరుగుతుందని, తొలి సమావేశం తరువాత రెండవ సమావేశం తిరుపతిలో నిర్వహించడం జరుగుచున్నదని తెలిపారు.   చిత్తూరు జిల్లాకు సంబందించి ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని, ఈనెల 19న టీటీడీ అధికారులతో ప్రివిలేజస్ కమిటీ సమావేశం అవుతుందని  తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి 175  మంది శాసనసభ్యులకు ఒక్కొక్కరికీ కోటి రూపాయల చొప్పున సిఏండిఎఫ్ కింద నిధులు విడుదల చేయడం జరిగిందని ముఖ్యమంత్రి శాసనసభ్యులకు గౌరవించడంలో భాగంగా నిధులు విడుదలచేయడం జరిగిందని దీనిని అధికార యంత్రాంగం దృష్టిలో పెట్టుకుని శాసనసభ్యులు ప్రతిపాదించిన అంశాలను పరిగనలోకి తీసుకుని వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో మదనపల్లి సబ్ కలెక్టర్ జాహ్నవి, జిల్లా సంయుక్త కలెక్టర్ (సంక్షేమం) రాజశేఖర్, డిఆర్ ఓ మురళి ,  తిరుపతి , చిత్తూరు ఆర్డీఓ లు కనకనరసారెడ్డి, రేణుక,  తిరుపతి కార్పొరేషన్ ఇంచార్జి  కమీషనర్  హరిత, డ్వామా , డీఆర్డీఎ పిడి లు  చంద్రశేఖర్, తులసి వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2021-01-18 16:16:49

ఇకపై గ్రామాలు రాత్రులు వెలగనున్నాయి..

ఆంధ్రప్రదేశ్ లో గ్రామాలు ఇకనుంచి రాత్రులు వెలగనున్నాయి. మీరు చదువుతున్నది నిజమే గ్రామాలు వెలగడం ఏంటి అనుకుంటున్నారా? అవునండీ గ్రామాల్లోన్ని వీధి దీపాల నిర్వహణ ఇకపై గ్రామసచివాలయాలు చూడనున్నాయి. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకూ పారిశుధ్య నిర్వహణతో పలు కార్యక్రమాలు, సేవలు, విధులను ప్రభుత్వం గ్రామసచివాలయాలకు అప్పగించింది. ఇపుడు ఆ సేవల్లో వీధి దీపాల నిర్వహణ కూడా చేరింది. ఇకపై గ్రామాంలో ఎక్కడ వీధిపాలు వెలగకపోయినా, పాడైనా తక్షణమే గ్రామసచివాలయాల ద్వారా వాటిని నిర్వహణ చేపట్టనున్నారు. దీనికోసం ఉన్నతాధికారులు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తున్నారు. గ్రామసచివాలయాల్లో సుమారు 14 ప్రభుత్వ శాఖల ద్వారా సేవలు అందిస్తున్న ప్రభుత్వం ఇపుడు వీధి దీపాల నిర్వహణ కూడా చేపట్టడంతో ప్రజలకు మరింతగా రాత్రి సమయంలో వీధుల్లో వెలుగులు నిండనున్నాయి. అదే సమయంలో వీటి నిర్వహణకు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేస్తారా, లేదంటే కాంట్రాక్టు పద్దతిపై సిబ్బందిని తీసుకుంటారా అనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ ఉన్నతాధికారులు ఇవ్వలేదు. కాకపోతే గ్రామాల్లో ఎల్ఈడీ వీధి దీపాల నిర్వహణ మాత్రం చేపట్టనున్నాయని మంత్రి ప్రకటించడం శుభపరిణామంగా కనిపిస్తోంది. దీంతో వీధి దీపాలు లేని గ్రామాలు, వీధులకు కూడా వీధి దీపాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది.

Amaravati

2021-01-18 15:58:00

2021-01-18 15:41:26

2021-01-18 15:05:40

పెట్టుబడుల కోసం ఉత్తరాంధ్రా పర్యటన..

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మరో కొత్త ఒరవడికి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న మూడు ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధి, సమానాభివృద్ధి దిశగా సాగుతున్నారు. దీనికోసం 19వ తేదీ మంగళవారం, 20తేదీ బుధవారం ఆయన ఉత్తరాంధ్ర పర్యటనకు సన్నద్ధమయ్యారు.  ముఖ్యమంత్రి ఆలోచనలను ఆచరణలో పెడుతూ ఉత్తరాంధ్రలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ఆకర్షణకు ప్రాధాన్యతనిస్తూ విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్నారు. అందులో భాగంగా ఆయా జిల్లాలకు సంబంధిచిన ఇన్ ఛార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల శాఖ అధికారులందరితో కలిసి సమావేశమై 'ఈజ్  ఆఫ్ డూయింగ్ బిజినెస్' చర్చించనున్నారు. స్థానికంగా పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు, భూముల కేటాయింపులో పారదర్శకత, పారిశ్రామికవేత్తలకు క్షేత్రస్థాయిలో  ఎదురయ్యే సమస్యలన్నింటిపై సమగ్ర చర్చ జరపనున్నారు. అన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చి..వేగం, పారదర్శకతకు పెద్దపీట వేసే వ్యూహంతో పరిశ్రమల శాఖ మంత్రి ముందుడుగు వేస్తున్నారు.

Amaravati

2021-01-18 15:01:32

2021-01-18 14:00:32

2021-01-18 13:53:16

అడ్డగోలు అక్రిడిటేషన్ లపై సహచట్టం..3

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏ శాఖలోనైనా నిబంధనలకు విరుద్ధంగా ఏస్థాయి అధికారి వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటాం..వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ప్రజలతోపాటు, ప్రభుత్వ శాఖలు కూడా ముఖ్యం..ప్రభుత్వ శాఖల సేవలు దేశానికే ఆదర్శంగా నిలవాలి..ఇవీ తరచుగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి చెబుతున్న మాటలు.. కానీ ముఖ్యమంత్రి మాటలుగానీ, ఉన్నత ఆశయాలుగానీ సమాచారశాఖలోని ఉన్నతాధికారులకు పట్టడం లేదు.. కాదు కాదు పట్టించుకోవడం లేదు.. సీఎం గొంతుచించుకొని పదే పదే ఆ మాటలు ప్రతీ సభలోనూ, సమావేశంలోనూ చెబుతున్నా సమాచారశాఖ అధికారుల తీరులోగానీ, వ్యహారంలోని ఎలాంటి మార్పులేదనే విషయం ఇపుడు జీఓనెంబరు 142 ద్వారా వర్కింగ్ జర్నలిస్టులకు జారీచేసే అక్రిడిటేషన్ల విషయంలో(న్యూస్ ఏజెన్సీలకు ఇచ్చే అక్రిడిటేషన్లు) రుజువైంది. మీడియా నియంత్రణే లక్ష్యంగా దేశరాజ ధాని పీఐబీలోని అక్రిడిటేషన్ల మంజూరులోకూడా లేని నిబంధనలన్నీ ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసి, వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని పదే పదే కోర్టు మెట్లు ఎక్కేలా చేస్తున్నారు సమాచారశాఖలోని ఉన్నతాధికారులు.. చేసిన తప్పులకు కోర్టుల్లో కౌంటర్లు వేసుకుంటూ ప్రతిపక్షాలతో నానా మాటలు, కామెంట్లు పడేలా చేస్తున్నారు. ఇక సమాచారశాఖ న్యూస్ ఏజెన్సీలకిచ్చే అక్రిడిటేషన్ల విషయానికి వచ్చేద్దాం.. భారతదేశంలో ఏ ప్రభుత్వమైనా పత్రికలు, న్యూస్ ఏజెన్సీలు, టీవీ ఛానళ్లు ఎరికైనా కేంద్ర, రాష్ట్ర సమాచారశాఖ అధికారులు నిబంధనలు పాటించే అక్రిడిటేషన్లు మంజూరు చేయాలి. కానీ నిబంధనలను పక్కనపెట్టి నేషనల్ న్యూస్ ఏజెన్సీలకు కేవలం ఒక్క లెటర్ ఇచ్చారనే కారణంతో యూఎన్ఐ, ఏఎన్ఐ, పీటిఐ, డిఎన్ఎస్ వంటి న్యూస్ ఏజెన్సీలకు అక్రిడిటేషన్లు ఇచ్చేశారు సమాచారశాఖ అధికారులు. అదే విశాఖజిల్లాలోని న్యూస్ ఏజెన్సీలకు మాత్రం మీడియా అక్రిడిటేషన్ కమిటీలో అప్రూవల్ చేసినా నిబంధనల పేరుతో దరఖాస్తులను బుట్ట దాఖలు చేశారు. సమాచారశాఖ నిబంధనల ప్రకారం జిల్లా న్యూస్ ఏజెన్సీలకు మూడేళ్లు కాలపరిమితి నిండాలి, అదే రాష్ట్రస్థాయి న్యూస్ ఏజెన్సీలకు ఐదేళ్లు, జాతీయ న్యూస్ ఏజెన్సీలకు పదేళ్లు కాలపరితి నిండితే అందులో పనిచేసే జర్నలిస్టులు అక్రిడిటేషన్లు పొందేందుకు అర్హులు అదీ ప్రభుత్వం న్యూస్ ఏజెన్సీ ఫార్మాట్ ప్రకారం అనుబంధ ప్రభుత్వ అనుమతి పత్రాలు, ప్రొప్రైటర్ ఐటి రిటర్న్స్, లేబర్ లైసెన్స్, షాప్ష్ అండ్ ఎస్టాబ్లిస్ మెంట్ లైసెన్స్, సదరు న్యూస్ ఏజెన్సీ నుంచి చందాదారులుగా జాబితా, పత్రికు, టీవీ ఛానళ్లు, న్యూస్ వెబ్ సైట్లు యొక్క క్లిప్పింగులు సమాచారశాఖకు అందించిన తరువాత వాటిని అక్రిడిటేషన్ కమిటీ ముందుంచాలి. కానీ అలా కాకుండా విశాఖలోని సమాచారశాఖ అధికారులు నేరుగా ఒక జర్నలిస్టు సంఘం సిఫారసు చేసిన లెటర్ హెడ్ తో సదరు న్యూస్ ఏజెన్సీలన్నింటికీ అక్రిడిటేషన్లు ఇచ్చేశారు. ఇదేమంటే అక్రిడిటేషన్ కమిటీ సిఫారసు చేసిందని అటు కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ ను కూడా తప్పుదారి పట్టించారు. అధికారులను అయితే నమ్మించారు గానీ, సమాచారహక్కు చట్టం క్రింద దాఖలైన దరఖాస్తుకు మాత్రం విశాఖలోని సమాచారశాఖ అధికారులు సమాధానం చెప్పలేదు. దీనితో గత మూడేళ్ల నుంచి న్యూస్ ఏజెన్సీలకు ఏ ప్రాతిపదికన అక్రిడిటేషన్లు మంజూరు చేశారు, సదరు న్యూస్ ఏజెన్సీలు సమాచారశాఖకు దాఖలు చేసిన అనుబంధ పత్రాలు అన్నీ ఎలక్ట్రానిక్ రూపంలో కావాలని ఆర్టీఐ  దరఖాస్తు దారు విశాఖ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ కు దరఖాస్తు దాఖలు చేశాడు. దీనితో దరఖాస్తుతో సమాచారశాఖ అధికారులు రుజువులు చూపించడానికి మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ దరఖాస్తుకి సమాచార శాఖ అధికారులు గానీ, అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ గానీ రుజువులు చూపించకపోతే అధికారులు చేసిన తప్పులకు, నిబంధనలు పక్కన పెట్టి మంజూరు చేసిన అక్రిడిటేషన్లకు సమాధానం చెప్పాల్సి వుంటుంది. అంతేకాదు ప్రస్తుతం కొత్త అక్రిడిటేషన్లు కూడా పెద్ద పత్రికలకు న్యూస్ ఏజెన్సీ క్లిప్పింగులతో పెద్ద పత్రికలు అక్రిడిటేషన్ కి దరఖాస్తు చేస్తే పత్రికల పేరుతో సమాచారశాఖ అక్రిడిటేషన్లు మంజూరు చేసింది. అంటే ఇక్కడ సమాచారశాఖ అధికారులు కావాలనే నిబంధనలు పక్కన పెట్టినట్టుగా ఒప్పుకున్నట్టు అయ్యింది. విచిత్రం ఏంటంటే పెద్ద పత్రికల క్లిప్పింగులన్నీ న్యూస్ ఏజెన్సీ ఫార్మాట్ లో సమర్పించి, ఇతర అనుబంధ పత్రాలన్నీ ఆర్ఎన్ఐ, పత్రికలకు సంబంధించిన ఫార్మాట్ లో పత్రికలు సమర్పించినా వాటికి సమాచారశాఖ అక్రిడిటేషన్లు మంజూరు చేసింది. అంటే ఇక్కడ జీఓనెంబరు 142 నిబంధనలన్నీ పక్కన పెట్టినట్టుగానే అధికారులే ఇచ్చిన అక్రిడిషన్ల సాక్షిగా దొరికిపోయినట్టు అయ్యింది. అలా న్యూస్ ఏజెన్సీల క్లిప్పింగులు సమర్పించినపుడు సమాచారశాఖ సదరు న్యూస్ ఏజెన్సీ పేరుతోనే అక్రిడిటేషన్లు కూడా మంజూరు చేయాలి...అదీ న్యూస్ ఏజెన్సీ ఫార్మాట్ లో అక్రిడిటేషన్ కు దరఖాస్తు చేస్తే. కానీ ఇక్కడ పెద్ద పత్రికలన్నీ అటు న్యూస్ ఏజెన్సీ కాకుండా, ఇటు న్యూస్ పేపర్ ఫార్మాట్ లో కాకుండా దరాఖాస్తు చేసినా సమాచారశాఖ మాత్రం పత్రికల పేరుతోనే అక్రిడిటేషన్లు మంజూరు చేసింది. పైగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇపుడు న్యూస్ ఏజెన్సీలు కూడా అన్ని రకాల పత్రాలు ఆన్ లైన్ లో సమర్పిస్తే తప్పా అక్రిడిటేషన్లు మంజూరు చేసేది లేదని, ఇవి కమిషనర్ కార్యాలయం నుంచి తమకు వచ్చిన ఉత్తర్వులనీ విశాఖలోని సమాచారశాఖ అధికారులు చెబుతున్నారు. అలాగని న్యూస్ ఏజెన్సీ ఫార్మాట్ లో విశాఖ జిల్లాలోని న్యూస్ ఏజెన్సీలు ఆన్ లైన్ లో అన్ని రకాల పత్రాలు సమర్పించి, వివిధ పత్రికల క్లిప్పింగులు నేరుగా పత్రికలు తీసుకెళ్లి సమాచారశాఖ కార్యాలయంలో అందిస్తే... అలా అందించినా ఆన్ లైన్ లో పత్రికల క్లిప్పింగులు సమర్పించాల్సిందేనని మెలిక పెట్టి జిల్లా స్థాయి న్యూస్ ఏజెన్సీల అక్రిడిటేషన్ దరఖాస్తులను పెండింగ్ లో పెట్టాయి. వాస్తవానికి న్యూస్ ఏజెన్సీలకు సంబంధించిన వందల సంఖ్యలో వున్న క్రెడిట్ లైన్ క్లిప్పింగులు అన్ లైన్ లో సమర్పించడానికి వీలుపడదు. కానీ ఏదోవిధంగా న్యూస్ ఏజెన్సీలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న సమాచారశాఖ అధికారులు దరఖాస్తుతోపాటు, వివిధ పత్రికలకు చెందిన ప్రెస్ క్లిప్పింగ్ పత్రికలను భారీ సంఖ్యలో తీసుకొని, ఇపుడు ప్రెస్ క్లిప్పింగులు కూడా ఆన్ లైన్ లో సమర్పించాలని చెబుతోంది. ఒకేసారి పత్రికలన్నీ నేరుగా సమాచారశాఖ కార్యాలయంలో అందిస్తే ఇపుడెలా సమర్పిస్తామని ప్రశ్నిస్తే దానికి తాము ఏమీ చేయలేమని, ఖచ్చితంగా ఆన్ లైన్ అన్ని రకాల అనుబంధ పత్రాలతోపాటు, క్లిప్పింగులు కూడా సమర్పిస్తే తాము ఏమీ చేయలేమని చెబుతున్నారు.  అలా అయితే న్యూస్ ఏజెన్సీ ఫార్మాట్ లో పత్రికలు సమర్పించిన దరఖాస్తులకు ఎలా అక్రిడిటేషన్లు మొదటి విడతలో ఎలా మంజూరు చేశారని సమాచారహక్కు చట్టం ద్వారా విశాఖ జిల్లా మీడియా కమిటీకి దాఖలు చేసిన 15 అంశాలపై అటు కమిటీ చైర్మన్ గానీ, ఇటు సమాచారశాఖ గానీ సమాచారం ఇవ్వడానికి తడబడుతున్నాయి.  అదేసమయంలో అక్రిడిటేషన్ కమిటీ విషయంలో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత చర్యను ప్రెస్ కౌన్సిల్ కూడా సుమోటాగా స్వీకరించడం ప్రభుత్వ పనితీరును ప్రశ్నించినట్టు అయ్యింది. మరోపక్క అక్రిడిటేషన్ కమిటీ విషయమై, నిబందనలు, జీఎస్టీ తదితర అంశాలపై సమాచారశాఖ కోర్టుల్లో కౌంటర్ దాఖలు చేయనుంది. కావాలని సమాచారశాఖ అధికారులు తమ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జర్నలిస్టుల విషయంలో కోర్టు మెట్లు ఎక్కించేలా చేసినా ప్రభుత్వ పెద్దలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం కూడా చర్చనీయాంశం అవుతోంది.  ఇదేదో కావాలని ప్రభుత్వాన్ని తప్పుపడుతూ రాస్తున్న ప్రత్యేక కధనాలు కావనే విషయాన్ని ప్రభుత్వంలోని పెద్దలు గమనించాలి. కేవలం సమాచారశాఖ జర్నలిస్టులకిచ్చే అక్రిడిటేషన్ల విషయంలో నిబందనలు ఒక్కొక్కరికి ఒక్కోలా అమలు చేస్తున్న విషయాన్ని మాత్రమే ఇటు ప్రభుత్వానికి, ఇటు జర్నలిస్టులకు ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ యాప్, ఈఎన్ఎస్ లైవ్.నెట్ న్యూస్ వెబ్ సైట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అదీకాకుండా సమాచార హక్కుచట్టం 2005 ఆధారంగా ధాఖలైన దరఖాస్తులోని అంశాలను ప్రస్తావిస్తూ, అక్రిడిటేషన్లు మంజూరు చేసిన విషయాన్ని, ప్రభుత్వానికి సమాచారశాఖ అధికారులు తెస్తున్న చెడ్డపేరుని ప్రజలకు, పాఠకులకు తెలియజేయడానికి, దేశ రాజధాని న్యూఢిల్లీ  పీఐబీలోనే లేని నిబంధనలను ఒక్క ఆంధ్రప్రదేశ్ లోని అమలు చేయడాన్ని బహిర్గతం చేయాలని...ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మాటలను, సూచనలను అంటే అవినీతిలేని, నిబంధనలు తప్పక అన్ని వర్గాలకు ఒకేలా పాటించాలనే సూచనను పాటిస్తూనే ఈ విధమైన వార్త కధనాలను అందిస్తున్నామనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలి..రేపటి ప్రత్యేక కధనం అడ్డగోలు అక్రిడిటేషన్ లపై సహచట్టం..4 లో ప్రభుత్వ మీడియా సలహా దారులు జర్నలిస్టు సంఘాలకు ఇచ్చిన హామీలేంటి, సమాచారశాఖ అధికారులు వాటిని పట్టించుకోకుండా ఎలా వ్యవహరిస్తున్నారు...కావాలనే మొండిగా వెళుతూ, కోర్టులో కౌంటర్లు ఎందుకు దాఖలు చేస్తున్నారు..తదితర అంశాలతో మళ్లీ కలుద్దాం..!

Visakhapatnam

2021-01-18 12:43:50

అడ్డగోలు అక్రిడిటేషన్ లపై సహచట్టం..2

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి ఒక పక్క తమ ప్రభుత్వం అన్నిపనులు ముక్కుసూటిగా చేస్తుందని, నిబంధనలు ఎవరు అతిక్రమించినా క్షమించేది లేదని, అలాంటివారెవరైనా ఉపేక్షించేది లేదని.. పదేపదే ప్రతీ సమావేశంలోనూ గొంతు చించుకొని మరీ చెబుతుంటే..  సమాచారశాఖలోని ఉన్నతాధికారులు సీఎం మాటలు సీఎంవే...మా పనులు మావే అన్నట్టు వర్కింగ్ జర్నలిస్టులకు జారీచేసే ప్రెస్ అక్రిడిటేషన్ల విషయంలో పెద్ద పత్రికల విషయంలో నిబంధనలను తుంగలోకి తొక్కి మరీ అక్రిడిటేషన్లు జారీ చేసి తమ ఆదిపత్యాన్ని..అత్యుత్యాహాన్ని ప్రదర్శిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.. ఫలితంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ కేసును సుమోటాగా స్వీకరించడం, కోర్టులో కేసులు ఇలా అన్ని విధాలుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టుతున్నా..సమాచారశాఖ అధికారులు మాత్రం తాము ఇచ్చిందే జీఓ..తాము అమలు చేసేవే నిబందనలు అంటున్నారు..ఇక వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వం సమాచారశాఖ వెబ్ సైట్ ద్వారా అక్రిడిటేషన్ల కోసం పెద్ద పత్రికల నుంచి దరఖాస్తులు కోరినపుడు ఈనాడు పత్రిక కొన్ని అక్రిడిటేషన్లకు ఈనాడు పేరుతోనూ, మండల అక్రిడిటేషన్లకు న్యూస్ టుడే పేరుతోనూ, సాక్షి న్యూస్ లైన్ పేరుతోనూ, కొన్ని క్లిప్పింగులు సాక్షిపేరుతోనూ, ఆంధ్రజ్యోతి ఆన్ లైన్ పేరుతోనూ, కొన్నింటినీ ఆంధ్రజ్యోతి పేరుతోనూ, వార్త  ప్రభాతవార్త, ఆంధ్రప్రభ ప్రభన్యూస్ పేరుతోనూ, అదేవిధంగా ఇంగ్లీషు పత్రికలు కూడా, క్లిప్పింగ్లులు తమ సొంత న్యూస్ ఏజెన్సీల పేరుతో క్లిప్పింగులు సమర్పించాలి(న్యూస్ ఏజెన్సీ పేరుతో సమర్పిస్తే).. అలా కాకపోతే, పత్రిక పేరుతోనే నేరుగా క్లిప్పింగులు సమర్పించాలి. అలా కాకుండా అటు న్యూస్ ఏజెన్సీ పేరులేకుండా, ఇటు పత్రిక పేరు(క్రెడిట్ లైన్ లేదా డేట్ లైన్) లేకుండా క్లిప్పింగులు సమర్పిస్తే సదరు పత్రికలు సమర్పించిన న్యూస్ క్లిప్పింగులకు ఆధారం ఏమిటి..? ఒక వేళ సదరు పెద్ద పత్రికల సొంత న్యూస్ ఏజెన్సీల పేరుతో క్లిప్పింగులు సమర్పిస్తే సమాచారశాఖ జారీచేసిన జిఓనెంబరు 142 ఆధారంగా న్యూస్ ఏజెన్సీల క్లిప్పింగులు సమర్పించాలంటే కనీసం 5 ఎంపానల్ కలిగిన పత్రిక క్లిప్పింగులను, ఒక్కోఅక్రిడిటేషనకు 200 క్లిప్పింగులు చొప్పున సమర్పించాలి... అవి పెద్ద పత్రికలు ఎక్కడ సమర్పించాయి..? అదే  సదరు న్యూస్ ఏజెన్సీ షాప్ప్ అండ్ ఎస్టాబ్లిస్ మెంట్ నిబంధనల ప్రకారం ఫర్మ్ సర్టిఫికేట్, ఇతర ప్రొప్రైటర్ ఆడిట్ రిపోర్టు, లేబర్ లైసెన్సు, ఇతరత్రా అన్ని ద్రువీకరణ పత్రాలుసమర్పించాలి..కనీసం ఆ విధంగానైనా ఒక్క పత్రికైనా సమర్పించిందా..?  కొన్ని ప్రధాన పత్రికలు ఇటు న్యూస్ ఏజెన్సీకి కాకుండా అటు పత్రిక పేరుతో కాకుండా క్రెడిట్ లైన్ లేని క్లిప్పింగులు సమర్పిస్తే సమాచారశాఖ వారందరికీ తొలివిడతలో అక్రిడిటేషన్లు మంజూరు చేసేసింది. దీనితో సదరు పెద్ద పత్రికలకు ఈ రకంగా అంటే న్యూస్ ఏజెన్సీ కాకుండా పత్రిక కాకుండా ఏదైనా తమకి నచ్చినట్టు సమర్పించడానికి ఏదైనా ప్రత్యేక జీఓ ఇస్తేనే ఆ రకంగా పత్రికలు తమకి నచ్చినట్టు క్లిప్పింగులు ఇతర అనుబంధ పత్రాలు సమర్పించాలి.. అలా కాకుండా సదరు పెద్ద పత్రికల కోసం ప్రత్యేకంగా ఎలాంటి జీఓలు ఇవ్వకపోయినా.. సమాచారశాఖ అధికారులు అక్రిడిటేషన్లు మంజూరు చేయడాన్ని అనేవిషయాన్ని సమాచారహక్కు చట్టం ద్వారా దరఖాస్తు దారుడు సుమారు 15 అంశాలను ఈ కోణంలోనే ప్రస్తావిస్తూ, విశాఖజిల్లాలోని మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ కు సమర్పించాడు. గతంలో కూడా ఇదే విధంగా సమాచార హక్కుచట్టం ద్వారా దరఖాస్తు చేసినా విశాఖజిల్లాలోని సమాచారశాఖ అధికారులు సమారాచాన్ని ఇవ్వలేదు సరికదా దరఖాస్తును బుట్టదాఖలు చేసింది. అదేమంటే ఇవిమాకు ప్రభుత్వ నిబంధనలని ఇక్కడి పౌర సమాచార అధికారి నొక్కి వక్కానించారు. పక్కాగా నిబంధనలు పాటించి, ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసిన వారికి అక్రిడిటేషన్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, సమాచారశాఖ ఉన్నతాధికారులు ఈ ప్రధాన పత్రికల విషయంలో ఏదైనా ప్రత్యేక జీఓ జారీచేశారా అంటే అదే లేదు. విశేషం ఏంటంటే ఏ సంస్థ అయినా ఐదుగురు ఉద్యోగులు, అంతకంటే అధికంగా సిబ్బంది పనిచేస్తే లేబర్ యాక్టు ప్రకారం లేబర్ లైసెన్సు పొందాల్సి వుంది. కానీ సమాచారశాఖ ప్రస్తుతం మొదటి విడతలో జారీచేసిన ఏ పత్రిక కూడా లేబర్ లైనెస్స్ సమర్పించలేదు. వేజ్ బోర్డు జీతాలు అమలు చేయడం లేదు.. ఉన్న అధికారిక ఉద్యోగులకు సంబంధించిన పే స్లిప్పులు గానీ, పీఎఫ్, ఈఎస్ఐ తదితర సమాచారాన్ని కూడా సమాచారశాఖకు అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసినపుడు సమర్పించలేదు. కేవలం జీఎస్టీ ఒక్కటి పెద్ద పత్రికలు కట్టాయన్న నెపంతో మాత్రం వారికి అక్రిడిటేషన్లు తొలివిడతలో మంజూరు చేసేసింది. అంటే ముఖ్యమంత్రి తన మట్టుకు తాను సభలు, సమావేశాల్లో అవినీతికి, నిబంధనల ప్రకారంమే పనిచేస్తామని చెప్పుకుంటూ పోయినా...సమాచారశాఖ అధికారులు మాత్రం తమకి నచ్చినట్టు చేసుకుపోతామని చెప్పకనే చెప్పారు తొలివిడదలో కొన్ని ప్రధాన పత్రికలకు నిబంధనల ప్రకారంగా కాకుండా వారికి నచ్చినట్టుగా అక్రిడిటేషన్లు మంజూరు చేసి. ఓహో అంటే ఇక్కడ తమకు ఒకలా, మిగిలిన వారికి మరోలా చేస్తారని ఇతర పత్రికలు, న్యూస్ ఏజెన్సీలు అర్ధం చేసుకోవాలన్నమాట. అలా అర్ధం చేసుకున్నా సమాచారశాఖ చేసిన తప్పును ఏవిధంగా కప్పిపుచ్చుకునే విషయంలో ఏ ఉన్నతాధికారి కూడా నేటికీ సమాధానం చెప్పలేదు. అంటే ఇక్కడ ఖచ్చితంగా అర్ధం చేసుకోవాల్సింది ఏమిటింటే తమకు కావాల్సిన పత్రికలు అటు న్యూస్ ఏజెన్సీకి కాకుండా, ఇటు పత్రికలకు కాకుండా తమకు నచ్చినట్టు ఏ విధంగా అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసినా వారికి అక్రిడిటేషన్లు ఇచ్చేస్తారు..కానీ జీఓలో ఇచ్చిన నిబంధనలన్నీ మాత్రం ఇతర మీడియా సంస్థలకు పాటించాలి. అలా పాటించకపోతే అక్రిడిటేషన్లు ఇవ్వమని అధికారులు తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీఓ ప్రకారం మాత్రమే సంబంధిత పత్రాలు ఆన్ లైన్ లో అప్లోడ్ చేసి, సదరు కాపీలన్నీ మళ్లీ డీపీఆర్వో కార్యాలయంలో అందజేస్తేనే అక్రిడిటేషన్ వస్తుందని డిడిలు, డిపీఆర్వోలు తెగేసి చెబుతున్నారు. మరి ఎటూ కాకుండా పెట్టిన పత్రికలకు అక్రిడిటేషన్లు ఎలా ఇచ్చారని అడిగితే దానికి మా కమిషనర్ మాత్రమే సమాధనం చెప్పాలని, దానికి తాము బాధ్యులం కాదని చేతులెత్తేస్తున్నారు. ఇక రేపటి ఈఎన్ఎస్ ప్రత్యేక కధనంలో ఏ ఆధారాలున్నాయని గతంలో యూఎన్ఐ, పీఐటి, ఏఎన్ఐ, డిఎన్ఎస్, తదితర న్యూస్ ఏజెన్సీలకు అక్రిడిటేషన్లు మంజూరు చేశారు? ఎలాంటి ప్రెస్ క్లిప్పింగులు, ఇతర సంబంధిత ద్రువీకరణలు లేకుండానే నేషనల్ న్యూస్ ఏజెన్సీలకు అక్రిడిటేషన్లు ఎలా ఇచ్చారు? వారికి విశాఖలోని సమాచారశాఖ అధికారులు ప్రత్యేక మినహాయింపులు ఏమైనా ఇచ్చారా తదితర వ్యవహారాలన్నీ ప్రస్తావిద్దాం..ఇదేదో కావాలని ప్రభుత్వాన్ని తప్పుపడుతూ రాస్తున్న ప్రత్యేక కధనాలు కావనే విషయాన్ని ప్రభుత్వంలోని పెద్దలు గమనించాలి. కేవలం సమాచారశాఖ జర్నలిస్టులకిచ్చే అక్రిడిటేషన్ల విషయంలో నిబందనలు ఒక్కొక్కరికి ఒక్కోలా అమలు చేస్తున్న విషయాన్ని మాత్రమే ఇటు ప్రభుత్వానికి, ఇటు జర్నలిస్టులకు ఈఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ యాప్, ఈఎన్ఎస్ లైవ్.నెట్ న్యూస్ వెబ్ సైట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అదీకాకుండా సమాచార హక్కుచట్టం 2005 ఆధారంగా ధాఖలైన దరఖాస్తులోని అంశాలను ప్రస్తావిస్తూ, అక్రిడిటేషన్లు మంజూరు చేసిన విషయాన్ని, ప్రభుత్వానికి సమాచారశాఖ అధికారులు తెస్తున్న చెడ్డపేరుని ప్రజలకు, పాఠకులకు తెలియజేయడానికి, దేశ రాజధాని న్యూఢిల్లీ  పీఐబీలోనే లేని నిబంధనలను ఒక్క ఆంధ్రప్రదేశ్ లోని అమలు చేయడాన్ని బహిర్గతం చేయాలని...ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మాటలను, సూచనలను అంటే అవినీతిలేని, నిబంధనలు తప్పక అన్ని వర్గాలకు ఒకేలా పాటించాలనే సూచనను పాటిస్తూనే ఈ విధమైన వార్త కధనాలను అందిస్తున్నామనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలి..రేపటి ప్రత్యేక కధనం అడ్డగోలు అక్రిడిటేషన్ లపై సహచట్టం..3తో మళ్లీ కలుద్దాం..!

Visakhapatnam

2021-01-17 19:27:16

అడ్డగోలు అక్రిడిటేషన్ లపై సహచట్టం..1

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సమాచారశాఖ వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ల కోసం జారీ చేసిన జీఓనెంబరు 142 ద్వారా బడా పత్రికలకు  సదరు పత్రికలు దాఖలు చేసిన న్యూస్ ఏజెన్సీ  పేరుతో ఇచ్చిన క్లిప్పింగులతో సదరు పత్రికల పేరుతో అడ్డగోలుగా మంజూరు చేసిన అక్రిడిటేషన్ల వ్యవహారంపై సమాచారహక్కు చట్టం దరఖాస్తు దాఖలైంది. విశాఖజిల్లాలోని మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టరు పేరుతో దాఖలైన ఈ సమాచారహక్కుచట్టం దరఖాస్తులో కీలక అంశాలను దరఖాస్తు దారుడు ప్రస్తావిస్తూ, సమాచారం మొత్తం ఎలక్ట్రానిక్ రూపంలో కావాలని దాఖలు చేశారు. దానికి కారణం ప్రభుత్వం ప్రస్తుతం అక్రిడిటేషన్లన్నీ అన్ లైన్ లోనే దరఖాస్తు చేయడం దానికి ముఖ్య కారణం. ఒక్క విశాఖజిల్లానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పలువురు జర్నలిస్టులు సమాచారశాఖ పెద్ద పత్రికలకు జారీచేసిన అక్రిడిటేషన్ల వ్యవహారంలో అటు పత్రికల నిబంధనలనూ, ఇటు న్యూస్ ఏజెన్సీల నిబంధనలనూ అమలు చేయకుండా అక్రిడిటేషన్లను మంజూరు చేసింది. ఆ విషయం ఇపుడు చర్చనీయాంశ అయ్యింది. విశాఖలో దాఖలైన సహచట్టం దరఖాస్తులోని 15 అంశాలను ఒక్కసారి పరిశీలిస్తే... 1)సమాచారశాఖ ఇచ్చిన జీఓ142 నెంబరు ఆధారంగా ఎన్ని మీడియా సంస్థలు విశాఖజిల్లాలో అక్రిడిటేషన్ కోసం సమాచారశాఖ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్నాయి? ఎందుకు పాత జీఓ కాకుండా కొత్తజీఓను అమలు చేశారు? దానికి గల కారణాలు, మీడియా సంస్థల పేర్లు..ఇచ్చిన అక్రిడిటేషన్లు, సమాచారం..ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సివున్నది.. 2)ఎన్ని మీడియా సంస్థలు సమాచారశాఖ నిబంధనల ప్రకారం ఆన్ లైన్లో దరఖాస్తులు సపోర్టింగ్ డాక్యుమెంట్లు సమర్పించాయి? వాటి వివరాలు, సమర్పించిన పత్రాల పీడీఎఫ్ సమాచారం(ఆన్ లైన్లో వున్నదే కనుక పెద్దగా ఖర్చు వుండదు డౌన్ లోడ్ చేసి ఇవ్వడానికి వీలుపడుతుంది) ..ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) కావాల్సి వున్నది.. 3)దేశవ్యాప్తంగా న్యూస్ ఏజెన్సీలన్నింటికీ ఒకే ఫార్మాట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నది అలా అయిన పక్షంలో జాతీయ న్యూస్ ఏజెన్సీలు ఎన్ని ఆన్ లైన్ లో అక్రిడిటేషన్ల కోసం దరఖాస్తులు చేశాయి..చేసిన సమయంలో నిబంధనల ప్రకారం ఎన్ని పత్రికలు, ఛానళ్లు, చందారుల వివరాలు పొందు పరిచాయి..ఎన్ని పత్రికలకు సంబంధించిన ప్రెస్ క్లిప్పింగులు అప్లోడ్ చేశాయి..అదీ ఎంపానల్ మెంట్ అయిన వివరాలతో కూడినవి అవి కూడా ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది.. 4)పెద్ద పత్రికలు తమ సంస్థ నుంచి అక్రిడిటేషన్ల కోసం సమాచారశాఖ ఆన్ లైన్ వెబ్ సైట్ లో దరఖాస్తు చేస్తే పత్రిక పేరుతో దరఖాస్తు చేశాయా?..లేదంటే పత్రికకు సొంతంగా ఏర్పాటు చేసుకున్న న్యూస్ ఏజెన్సీ నుంచి దరఖాస్తు చేశాయా?...అలా న్యూస్ ఏజెన్సీ ద్వారా దరఖాస్తు చేసే ఒక పత్రికకే న్యూస్ సొంత ఏజెన్సీ ద్వారా వార్తలు అందిస్తే...ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివిధ పత్రికల వార్తల క్లిప్పింగులు జతచేశారా? లేదంటే జత చేయలేదా..? జత చేయకపోతే సదరు పత్రిక పేరుతో లేని ప్రెస్ క్లిప్పింగ్ తో ఆ పత్రికకు ఏ ప్రభుత్వ జీఓ ప్రకారం అక్రిడిటేషన్లు మంజూరు చేశారు? వాటితో పాటు జర్నలిస్టుల నియామకపత్రాలు, లేబర్ యాక్టు ప్రకారం లేబర్ లైసెన్సు సదరు పెద్ద పత్రికలకు ఎన్ని అక్రిడిటేషన్లు జారీ చేశారు వాటి సంఖ్య.. అవి కూడా ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది.. 5)గత ఐదేళ్లుగా ఏఎన్ఐ, పీటిఐ, యూఎన్ఐ, డిఎన్ఎస్ వార్త సంస్థలకు ఏ ప్రాతిపధికన అక్రిడిటేషన్లు మంజూరుచేశారు? ప్రభుత్వ నిబంధనల ప్రకారం సదరు న్యూస్ ఏజెన్సీలు వివిధ పత్రికల చందారుల వివరాలు, ప్రెస్ క్లిప్పింగులు, లేబర్ లైసెన్సు, షాప్స్ అండ్ ఎస్టాబ్లెస్ మంట్ సర్టిఫికేట్, ఉద్యోగుల జీతబత్యాలు, ఇతర ఖర్చులకు సంబంధించిన ప్రొప్రైటర్ యొక్క ఆదాయపు పన్ను, ఈ ఫైలింగ్ సర్టిఫికేట్,  చార్టెట్ అకౌంటెంట్ ఇచ్చిన సర్టిఫికేట్లు పొందుపరిచాయా? పొందుపరిస్తే అవి ఎక్కడున్నాయి వాటిని అక్రిడిటేషన్ కమిటీలో పెట్టి ప్రస్తావిస్తే వాటియొక్క మినిట్స్ కాపీలు... విశాఖజిల్లా సమాచారశాఖ అధికారులకు సమర్పించాయా..? సమర్పిస్తే వాటి నకళ్లు కూడా  ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది.. 6)పత్రికలకైతే ఒక జర్నలిస్టుకి నెలకి 10 క్లిప్పింగులు చొప్పున 30 క్లిప్పింగులు అప్లోడ్ చేయాలి...కానీ సమాచారశాఖ న్యూస్ ఏజెన్సీలకు ఇచ్చిన మార్గ దర్శకాల ప్రకారం ఒక్కో అక్రిడిటేషన్ కు 200 క్లిప్పింగులు జతచేయాలి...అది పీడిఎఫ్ చేసి అప్లో చేయడానికి వీలుపడని సమయంలో ఎలా సమాచారశాఖ అధికారులు న్యూస్ ఏజెన్సీలకు ఈ నిబంధన వర్తింప చేశారు?. దానికి సాంకేతిక కారణాలకు సంబంధించిన ఆధారాలు, సదుపాయాలు, ఉంటే తెలియజేయ గలరు వాటిని కూడా ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది.. 7)పెద్ద పత్రికలు సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త దిన పత్రికలతో పాటు ఇతర పత్రికల క్లిప్పింగులు అక్రిడిటేషన్ కోసం ఆన్ లైన్ లో సమర్పించినవి సదరు పత్రిక పేరుతో కాకుండా..ఆ పత్రిక యొక్క సొంత న్యూస్ ఏజెన్సీ పేరుతో ప్రచురితం అయిన క్లిప్పుంగులు జతజేస్తే...సదరు పత్రికలకు పత్రిక పేరుతో అక్రిడిటేషన్ ఎలా మంజూరు చేశారు?.. అలా మంజూరు చేయడానికి పెద్ద పత్రికల కోసం ప్రత్యేక నియమ నిబంధనలు, జీఓలు  ఏమైనా ఉన్నాయా ? పత్రిక నుంచి అక్రిడిటేషన్ కి దరఖస్తు చేస్తే క్రెడిట్ లైన్ పత్రిక పేరుతోనే ఉండాలి అది ప్రభుత్వ నిబంధన, అలా కాకుండా ఈనాడు పత్రిక న్యూస్ టుడే, అని ఆంధ్రజ్యోతికి ఆన్ లైన్ అని, సాక్షి న్యూస్ లైన్ అని, వార్తకి ప్రభాతవార్త అని వార్తల క్లిప్పింగులు సమర్పిస్తే ప్రభుత్వం వాటిని సదరు పత్రిక వార్తలుగా ఎలా పరిగణిస్తుంది? అలా ప్రచురితం అయిన వార్తలు న్యూస్ ఏజెన్సీ వార్తలుగా పరిగణించాలి కదా..? అలా పరిగణించకపోయినా..వారికికోసం ఏదైనా ప్రత్యేక జీఓ గానీ, నియమ నిబంధనలు గానీ ఏమైనా ఉంటే వాటిని తెలియజేయగలరు.. ..అదే సమయంలో మిగిలిన పత్రకలకు కూడా ప్రభుత్వ సమాచారశాఖ ఏ న్యూస్ ఏజెన్సీ వార్తలు పెద్ద పత్రికల్లో ప్రచురణ జరిగినా వాటికి మాత్రం సదరు పేరుతోనే, అక్రిడిటేషన్లు మంజూరు చేయాలనే పత్రికలకే వర్తిస్తుందా? అలా వర్తించినపుడు ఒక జర్నలిస్టు నెలకు పది వార్త క్లిప్పింగులు కాకుండా, న్యూస్ ఏజెన్సీ లెక్కలో పరిగణిస్తే సదరు పత్రికల నుంచి కూడా నెలకు 50 క్లిప్పింగులు ఆన్ లైన్ లోనే అప్లోడ్ చేయాల్సి వుంటుంది... ప్రస్తుతం సమాచారశాఖ మంజూరు చేసి అక్రిడిటేషన్లు ఆ నిబంధనలను అనుసరించి ఇచ్చారా..? ప్రస్తుతం ఇచ్చిన అక్రిడిటేషన్లకు సంబంధించిన నకలు, సదరు పత్రికలు అన్లైన్ లో సమర్పించిన ప్రెస్ క్లిప్పింగులు కూడా ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది.. 8)అక్రిడిటేషన్ కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న పత్రికలు పత్రిక పేరుతో అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేశాయా?..లేదంటే ఆ పత్రిక కోసం సొంతంగా ఏర్పాటు చేసుకున్న న్యూస్ ఏజెన్సీల పేరుతో దరఖాస్తు చేశాయా..? న్యూస్ ఏజెన్సీల క్లిప్పింగులను ఎలా పత్రిక పేరుతో ప్రమాణికంగా తీసుకుంటున్నారో దానికి సాంకేతిక కారణలు, ఆ పత్రికల కోసం ప్రత్యేక నియమ నిబంధనలు ప్రభుత్వ జీఓల రూపంలో జారీ చేస్తేవాటియొక్క నకలు పీడిఎఫ్ లేదా ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది.. 9)ప్రభుత్వం ఇచ్చిన మార్గ దర్శకాల ప్రకారం ఆదాయ పన్ను చెల్లించిన మీడియా సంస్థలు, న్యూస్ ఏజెన్సీల నిర్వాహకులకు రేషన్ బియ్యం కార్డు రద్దు చేశారు...అలాగని అన్ని నిబంధనల ప్రకారం న్యూస్ ఏజెన్సీలు నడుపుతున్నా వారికి అక్రిడిటేషన్లు మంజూరు విషయంలో ప్రత్యేక జీఓ ద్వారా కొర్రీలు వేస్తున్నారు. అయితే రేషన్ కార్డు కేన్సిల్ చేసినందుకు, సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా అమలు ఆదాయపన్ను రూపంలో కట్ చేసినందుకు మీ న్యూస్ ఏజెన్సీలకు అక్రిడిటేషన్లు అయినా ఇవ్వండి...లేదంటే ఇప్పటి వరకూ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఫార్మాట్ లో అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు పొందిన న్యూస్ ఏజెన్సీలకు అయిన నష్టాన్ని భర్తీ చేయండి.. ఒక వేళ రెండూ చేయడానకి కుదరదు అనుకుంటే ఎందుకు కుదరదో తెలియజేసే నిబంధనలనైనా లిఖిత పూర్వకంగా తెలియజేయండి.. అది కూడా ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది.. 10)న్యూస్ ఏజెన్సీల నిర్వహణకు కంప్యూటర్లు, ఏసిలు, కరెంటు బిల్లులు, ఇంటర్నెట్ చార్జీలు, సిబ్బంది జీతాలు, ఇంటి అద్దెలు, సాఫ్టు వేర్లు, ఫ్యాక్స్ మిషన్లు, ప్రింటర్లు, స్కానర్లు,  ప్రభుత్వ అనుమతి పత్రాలు, బ్యాంకు కరెంటు అకౌంట్లు, చార్టెడ్ అకౌంట్ ఛార్జీలు, మొబైల్ ఫోన్లు, న్యూస్ యాప్ లు, న్యూస్ వెబ్ సైట్లు, లేబర్ లైసెన్సులు, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ పత్రాలు నిర్వహణకు అయిన ఖర్చును, న్యూస్ ఏజెన్సీలు నిర్వహిణ ఏ స్థాయిలో వినియోగిస్తున్నారో ప్రభుత్వం అర్ధం చేసుకోవాలి. లేదంటే గత నాలుగేళ్లుగా చేసిన లక్షల రూపాయల ఖర్చు మొత్తం వ్రుధా పోయినట్టేనని అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, సమాచారశాఖ అధికారులు తెలుసుకోవాల్సి వుంది. ఇవేమీ మాకు పట్టవు మాకు నిబంధనలు మాత్రమే అమలు చేస్తాము అని ఖరాఖండీగా చెబితే నియమ నిబంధనలన్నీ అన్ని మీడియా సంస్థలకు ఒకేలా అమలు చేయాలి..అలా ఎక్కడ అమలు చేశారో కూడా లిఖిత పూర్వకంగా పెద్ద పత్రికలు, లోకల్ కేబుల్ టివి ఛానళ్లు, శాటిలై ఛానళ్లు విషయంలో లిఖిత పూర్వకంగా అది కూడా ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది.. 11)విశాఖ జిల్లాలో ఎన్ని మీడియా సంస్థలు వేజ్ బోర్డు నియమ నిబంధనలు పాటిస్తున్నాయో, వాటి వివరాలు కూడా లిఖిత పూర్వకంగా ఆధారాలు, సదరు సంస్థలు సిబ్బందికి ఇచ్చిన జీతాల యొక్క ఆడిట్ రిపోర్టులు, లేదంటే సదరు పత్రికలకు సొంతంగా ఏర్పాటు చేసుకున్న న్యూస్ ఏజెన్సీల యొక్క ఆడిట్ రిపోర్టులు, పత్రికలు సమర్పించిన ఆడిట్ రిపోర్టులు, సదరు పత్రిక న్యూస్ ఏజెన్సీ కోసం తీసుకున్న లేబర్ లైసెన్స్, షాప్ష్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ ద్రువీకరణ, ప్రొప్రైటర్ ఆదాయపన్ను ఈఫైలింగ్ పత్రాలు కూడా ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది.. 12)ఏదైనా మీడియా సంస్థకు పత్రికగానీ, టివి గానీ, న్యూస్ ఏజెన్సీ గానీ దేనికైనా ఎడిటర్, జర్నలిస్టు, ఫోటో గ్రాఫర్, సబ్ ఎడిటర్ లేకుండా ఒక న్యూస్...న్యూస్ ఫార్మాట్ లోకి రాదు. అలా అందరూ జర్నలిస్టులుగానే పరిగణింప బడతారు. అదే సమయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం పదిలక్షల లోపు టర్నోవర్ దాటిన న్యూస్ ఏజెన్సీలకు, ఇతర మీడియా సంస్థలకు ఇచ్చే అక్రిడిషన్ల సంఖ్య విషయంలో నిబంధలు ఎందుకు, ఏ జీఓ ప్రకారం మార్చారో కూడా తెలియజేయాలి... వాటికి గల కారణాలను మీడియా సంస్థలకు వివరించాలి..దానికి సంబంధించిన పత్రాలు వుంటే అవి కూడా ఎలక్ట్రానిక్ రూపంలోనూ ఇవ్వాలని కోరుతున్నాం.. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ పీఐబి అక్రిడిటేషన్ మంజూరులోని లేని నియమ నిబంధనలు ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు అమలు చేశారో కూడా లిఖిత పూర్వకంగా కావాల్సిన్నది. ఉంటే అది కూడా ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది.. 13)సమాచారశాఖలోని అటెండరు దగ్గర నుంచి డిప్యూటీ డైరెక్టర్ వరకూ డిపార్ట్ మెంట్ అక్రిడిటేషన్లు మంజూరు చేసే ప్రభుత్వం ఏ నిబంధనలను అనుసరించి వారికి అక్రిడిటేషన్లు మంజూరు చేస్తుంది? సమాచారశాఖలోని అక్రిడిటేషన్లు పొందిన ప్రభుత్వ ఉద్యోగులంతా ప్రభుత్వ సమాచారం సేకరించి మీడియాకి అందిస్తున్నారా? అలా అయితే సమాచార శాఖలో ఎంతమంది ఉద్యోగులు అక్రిడిటేషన్ తీసుకొని ప్రభుత్వ శాఖల సమాచారం, ప్రభుత్వ పథకాల సమాచారం అందిస్తున్నారు వారి వివరాలు, వారి విద్యా అర్హత వివరాలు కావాల్సి వుంది.. ఎందుకంటే ప్రభుత్వం పత్రికల్లో పనిచేసిన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కోసం పెట్టిన విద్యార్హత నిబంధనలు సమాచారశాఖలని అధికారులు, సిబ్బందికి కూడా అమలు చేయాల్సివుంటుంది.. వారికి లెక్కకు మించి అక్రిడిటేషన్లు ఎందకు మంజూరు చేస్తున్నారు..చేస్తే ఎన్ని అక్రిడిటేషన్లు ఏఏ కేడరలో ఉన్నవారికి మంజూరు చేశారు ఆ సమాచారం కూడా లిఖిత పూర్వకంగా కానీ ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది.. 14)సమాచారశాఖలో అధికారులు జర్నలిస్టుల అక్రిడిటేషన్ల విషయంలో నిబంధనలకు దేశంలో లేని నిబంధనలు పెట్టడంతోపాటు గవర్నర్, ముఖ్య మంత్రి, ఇతర మంత్రులు కార్యక్రమాలకు అక్రిడేటెడ్ జర్నలిస్టులంతా కార్యక్రమాలకు హాజరు కాకపోయినా.. కార్యక్రమాలకు అత్యధిక మంది జర్నలిస్టులు హాజరైనట్టుగా,  అక్కడ వారికి టీలు, టిఫెన్లు, భోజనాలు, మంచినీరు బాటిళ్లలో కొనుగోలు చేసినట్టుగా.. ప్రత్యేక వాహనాలకు సంబంధించి చేసిన ఖర్చుల వివరాలు, గత మూడు సంవత్సరాలకు సంబంధించిన పూర్తి ఖర్చుల వివరాలు, ఆడిట్ రిపోర్టులు లిఖిత పూర్వకంగా కానీ ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది.. 15)గత ఐదేళ్లుగా అక్రిడిటేషన్ కమిటీ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు కాకుండా, సమాచారశాఖ సమావేశం పూర్తయిన తరువాత వాళ్లకి అనుగుణంగా రాసిన జిల్లా అక్రిడిటేషన్ కమిటీ మినిట్స్ వివరాలు కూడా  ఎలక్ట్రానిక్(సిడి,డివిడి, పెన్ డ్రైవ్) రూపంలో కావాల్సి వున్నది.. పైన పేర్కొన్న అంశాలన్నీ అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ వివరాలు అందజేస్తే..ఆ వివరాలతో ప్రత్యేక వార్త కధనాలను బాహ్య ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశ్యంతోనూ, విశాఖజిల్లాలో సమాచారశాఖలోని జరిగిన కొన్ని అక్రమాలను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లడానికి పైన పేర్కొన్న సమాచారం ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతోనే సమాచార హక్కుచట్టం 2005 ప్రకారం..నిబంధనలు అనుసరించి కోర్టుఫీ స్టాంపు అతికించి మరీ ఇవ్వడంతోపాటు, దానికి సంబంధించిన రిసీవ్ కాపీని కూడా తీసుకుంటున్నామని తెలియజేయడమైనది. గడువులోపల అడిగిన సమాచారం ఇవ్వకపోయినా ఇదే అంశాలను అప్పిలేట్ అధికారికి దరఖాస్తు చేస్తామని కూడా ఈ దరఖాస్తులోనే తెలియజేస్తున్నాము. అంతేకాకుండా సమాచారశాఖ ఇచ్చిన సమాచారంతోనూ, మా దగ్గర వున్న సమాచారం, ప్రభుత్వం జారీ చేసిన జీఓల పూర్తివివరాలతో కోర్టును కూడా ఆశ్రయిస్తామని కూడా మిక్కిలి గౌరవంతో తెలియజేయడమైనది. ప్రభుత్వం దాపరికం లేని వివరాలు మీడియాకి ఇవ్వడానికి, సమాచార హక్కు చట్టాన్ని అమలు చేస్తూ, అవినీతి రహిత సమాజ నిర్మాణానికి నడుంబిగించి ఉన్నందున కోరిన సమాచారం కోరినట్టుగా సకాలంలో ఇవ్వాలని, ప్రభుత్వ గౌరవానికి సమాచారశాఖ ద్వారా ఎక్కడా భంగం వాటిల్లకుండా చేయాలని కూడా మిక్కిలి గౌరవంతో కోరడమైనది. 

విశాఖపట్నం

2021-01-16 19:15:20