1 ENS Live Breaking News

2021-01-28 13:07:56

జర్నలిస్టు కావాలంటే ఏం తెలియా(రావా)లి..?-3

మీడియా రంగంలో జర్నలిస్టు కావాలనుకునే ప్రతీ ఒక్కరూ మీడియా కోసం పూర్తిగా ముందు అవగాహన పెంచుకున్న తరువాత మాత్రమే ఆయా విభాగాల్లో కెరీర్ బాగా వున్న విభాగాన్ని ఎంచుకోవాల్సి వుంటుంది. సాధారణంగా చాలా మందికి ఉన్న అవగాహన ఏంటంటే ఒక జర్నలిస్టు ఏం వార్త రాస్తే అది అలాగే ప్రింటింగ్ అయి పేపర్ రూపంలో మరుసటిరోజు వచ్చేస్తుందని అనుకుంటారు. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఒక వార్త జర్నలిస్టు రాసి పత్రిక, టివి, న్యూస్ ఏజెన్సీ, మొబైల్ యాప్ లకు పంపిన తరువాత ఎన్ని విభాగాలు దాటితే వార్తగా వస్తుందనే విషయం తెలిస్తే ఆశ్చర్యం వేయక మానదు. ముందు ఒక పత్రికలో ఎన్ని విభాగాలు ప్రస్తుత కాలంలో పనిచేస్తున్నాయో అనే విషయం తెలుసుకుందాం. అపుడు ఒక జర్నలిస్టు రాసి పంపిన వార్త ఒక న్యూస్ ఫార్మాట్ లోకి రావడానికి ఎంత సమయం పడుతుంది, న్యూస్ లా ఎలా మారుతుంది అనే విషయాలు తెలుస్తాయి. పత్రికా కార్యాలయంలో ప్రధాన భూమిక పోషించేది డెస్క్..ఇక్కడ చాలా విభాగాలు జర్నలిస్టు రాసిన వార్తను, ఫోటోగ్రాఫర్ పంపిన ఫోటోని వార్తకు అనుకి అనుగుణంగా తయారు చేయడానికి అన్ని విభాగాలు కష్టపడాల్సి వుంటుంది. ముఖ్యంగా డెస్క్ లో ప్రధాన ఉద్యోగి ఎడిషన్ ఇన్చార్జి, తరువాత డెస్క్ ఇన్చార్జి, ఆ తరువాత సబ్ ఎడిటర్, ఫోటో ఎడిటర్, ఫ్రూఫ్ రీడర్, పేజి డిజైనర్, ఫోటోషాప్ ఎడిటర్ ఇలా 7 విభాగాలు పనిచేస్తాయి. అదే టివి ఛానల్ అయితే న్యూస్ కోర్డినేటర్, ఇన్ పుట్ ఎడిటర్, వీడియో ఎటిడర్, సబ్ ఎడిటర్, గ్రాఫిక్ డిజైనర్, ఔట్ పుట్ ఎడిటర్, న్యూస్ రీడర్, పీసీఆర్ అనే 8 విభాగాలు ఉంటాయి. ఇక న్యూస్ ఏజెన్సీకి వస్తే ఎడిటర్, సబ్ ఎడిటర్, ఫోటో ఎడిటర్, వీడియో ఎడిటర్, మెసెంజర్, 5విభాగాలు ఉంటాయి. స్థూలంగా మూడు రకాల మీడియా సంస్థల్లో పనిచేసే విభాగాలు ఇవి. ఈ విభాగాల్లో పనిచేయడానికి ప్రాధమిక విద్య మాత్రం జర్నలిజం చదివి ఉండాలి. ఆ తరువాత విభాగాన్ని బట్టి కాస్త సాంకేతిక విద్య, శిక్షణ కూడా మనం శిక్షణ పొందాల్సి వుంటుంది.  అలా శిక్షణ పొందినపుడు మాత్రమే మనం మంచి విభాగాన్ని ఎంచుకొని మీడియాలో మంచి కెరీర్ ను ప్రారంభించడానికి అవకాశం వుంటుంది. అయితే ప్రస్తుత తరుణంలో తెలుగు మీడియా కంటే జాతీయ మీడియాలో జర్నలిస్టులకు మంచి గుర్తింపు వస్తోందిదనేది నిపుణుల మాట. అలాని స్థానిక, రాష్ట్రీయ మీడియాలో అవకాశాలు లేక అనేం కాదు. ఇక్కడ కూడా ఉంటాయి, కాకపోతే జాతీయ స్థాయి మీడియాలో మరిన్ని అవకాశాలు మన నైపుణ్యాన్ని బట్టి మనం అందిపుచ్చుకోవడానికి అవకాశాలు అధికంగా వుంటాయి. జాతీయ స్థాయిలో జర్నలిస్టు కావాలనుకున్నా కూడా మీడియాకోసం తెలుసుకోవడం తోపాటు, దానికి అనుబంధ చదువు, శిక్షణ, అవగాహన ఉంటే తప్పా ఏమీ చేయలేని పరిస్థితి  అంటే డిగ్రీలో జర్నలిజం లేదా, పీజీలో జర్నలిజం చేయాలి. అదీకాదనుకుంటే మనం ముందుగా ఇంగ్లీషు, హిందీ, తెలుగులో మంచి ప్రావీణ్యం సంపాదిస్తే ఆయా మీడియా సంస్థలు నిర్వహించే జర్నలిజం స్కూలు ద్వారా ప్రవేశ పరీక్షలు రాసి, ఉత్తీర్ణత సాధించి ఆపై మంచి ఉద్యోగాలు పొందడానికి కూడా అవకాశం వుంటుంది. అలా జర్నలిజం స్కూలుకి ఎంపికైన వారికి పైన పేర్కొన్న అన్నివిభాగాల్లో శిక్షణ ఇస్తాయి ఆయా జర్నలిజం పాఠశాలలు. ఒక పూర్తిస్థాయి జర్నలిస్టుగా మారాలంటే మాత్రం ముందు డిగ్రీ చదువుకున్న తరువాత మూడు భాషలపై ప్రావీణ్యం ఖచ్చితంగా తెచ్చుకోవాలి.  ఆపై జర్నలిజంలో శిక్షణ తీసుకుంటే మంచి జర్నలిస్టుగా ఉద్యోగం దొరుకుతుంది. తరువాత మీ మనం నేర్చుకున్న అంశాలకు మెరుగుపెట్టుకోవడం ద్వారా మంచి జర్నలిస్టుగా గుర్తింపు పొందే అవకాశాలుంటాయి..జర్నలింలో శిక్షణ పొందడానికి  ఇబ్బంది పడేవారికి, ఉచితంగా శిక్షణ కల్పించాలని, అవగాహన కల్పించాలని, ప్రాధమిక శిక్షణ ఇవ్వడం ద్వారా ఔత్సాహిక జర్నలిస్టులకు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా తమవంతుగా ఈ సర్వీసు అందిస్తున్నాం. ఈ అవకాశాన్ని ఆశక్తి వున్నవారం సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాం..  అసలు మీడియాలోని ఏఏ విభాగాల్లో పనిచేయాలంటే ఏం నేర్చుకోవాలి, ఏ విభాగంలో ఉద్యోగం బాగుంటుంది, దానికోసం డిగ్రీ తరువాత ఏం చేయాలి, ఏం శిక్షణ తీసుకోవాలని అనే అంశాలు రేపటి పాఠంలో చర్చిద్దాం..!

Visakhapatnam

2021-01-28 12:58:37

2021-01-27 17:19:25

2021-01-27 16:45:06

జర్నలిస్టు కావాలంటే ఏం తెలియా(రావా)లి..?-2

జర్నలిస్టు కావాలనుకునేవారు నేరుగా జర్నలిస్టు అయిపోదామని అనుకోవడానికి ముందు అసలు మీడియా ఎలా వుంటుంది? ..ఎన్ని విభాలుగా వుంటుంది?.. ఎన్నిరకాలుగా వుంటుంది?.. ఏ రకం మీడియాలో అయితే ఉపాది లభిస్తుంది?..ఏ మీడియాలో అయితే మంచి గుర్తింపు వస్తుంది?..ఎలా పనిచేస్తే మంచి జర్నలిస్టుగా రాణించవచ్చు?.. అనే అంశాలను ముందు తెలుసుకుంటే మీడియా రంగంలో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి  వేదికను ఏర్పాటు చేసుకోవడానికి వీలుపడుంది. దానితో పాటు మీడియాలోని ఏ విభాగంలో జర్నలిస్టుగా కెరీర్ మొదలు పెడితే బాగుంటుందనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సి వుంటుంది. జర్నలిస్టు అయిపోతే ఏ విభాగంలోనైనా పనిచేసేయొచ్చు కదా అనుకోవడానికి లేదు. ఒక్కో విభాగంలో జర్నలిజం ఒక్కోలా వుంటుంది. దానికోసం మనం జర్నలిజంలో ఉన్న వివిధ విభాగాల్లో మనకి అనుకూలంగా వున్న విభాగాన్ని ఎంచుకోవడం ద్వారా మన భవిష్యత్తు కూడా ఉజ్వలంగా వుంటుందని గమనించాలి. లేదంటే మధ్యలోనే మనం మీడియాని వదిలిపెట్టే పరిస్థితులు కూడా రావొచ్చనే ఇబ్బందులు కూడా ఎదురు పడొచ్చు. ఏదోలా బతికేద్దామంటే మీడియా రంగంలోకి రావడం దండగనే చెప్పాలి. దమ్ము, దైర్యం, సమయస్పూర్తి, ఒక మంచి విజన్, ఇన్విస్టెగేషన్, సర్వీస్, జస్టిస్, జాబ్ సాటిస్ఫేక్షన్ ఉండేలా అయితేనే మీడియా రంగంలోకి అడుగు పెట్టాలి. లేదంటే సాధారణ జర్నలిస్టులకూ మీకూ పెద్దగా తేడా ఏమీ ఉండదు. దానికోసం ముందుగానే మీడియా కోసం తెలుసుకోవాల్సి వుంటుంది. అసలు మీడియాకోసం మీకు ఎవరు చెబుతారు...ప్రస్తుతం జర్నలిస్టులుగా పనిచేస్తున్నవారందరికీ మీడియాకోసం తెలుసా అంటే తెలియదనే చెప్పాలి. మరేం తెలుసునని చాలా మంది జర్నలిస్టులు మాకు తెలియంది ఏముంటుందని అంటారని మీకు సందేహం రావచ్చు. చాలా మంది జర్నలిస్టులకు తెలిసింది కేవలం వార్తలు రాయడం, రాసిన వార్త ఏవిధంగా వచ్చింది, కార్యాలయంలో దానికి ఎలా తుది మెరుగులు దిద్దుతారు, పత్రిక అయితే ప్రింట్ అయి, టివి అయితే టెలీకాస్ట్ అయి, న్యూస్ యాప్ అయితే పబ్లిష్ అయి, వీడియో అయితే ప్లే అయినంత వరకూ మాత్రమే వారికి తెలుస్తుంది. దాని వెనుక ఎన్ని విభాగాలు పనిచేస్తే ఒక న్యూస్ ఫార్మాట్ లో మీరు రాసిన న్యూస్ బయటకొస్తుందో చెప్పమంటే చాలామంది తెల్లమొహం వేస్తారు. మరి ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయి అంటే... మనం జర్నలిజం కోసం ప్రాధమిక శిక్షణ తీసుకున్న తరువాత ఆయా మీడియా సంస్థల్లోని విభాగాలు పనిచేసే తీరుపై ద్రుష్టి సారిస్తే తప్పా మనకి మీడియాలోని విభాగాల కోసం తెలియదు. తెలుసుకునే అవకాశం కూడా ఉండదు. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ మీడియా తప్పితే స్థానిక మీడియాలో ఉపాది, ఉద్యోగాలు గాల్లో దీపం లానే ఉన్నాయి. దానికోసం జర్నలిజం కెరీర్ ను ఎంచుకునేవారు పెద్ద మీడియా సంస్థల్లో ఉపాది లభించేలా శిక్షణ పొందాల్సి వుంటుంది. అలా పెద్ద మీడియా సంస్థల్లో ఉద్యోగాలు పొందాలంటే ఏంచేయాలనేది ముందు ముందు పాఠాల్లో నేర్చుకుందాం. రేపటి పాఠంలో మీడియా ఎన్నిరకాలుగా వుంటుంది, ఎన్ని విభాగాలు ఉంటాయి? ఆయా విభాగాల్లో పనిచేయాలంటే ఏం నేర్చుకోవాలి, విద్యార్హతలేంటి, ఉద్యోగాలు ఎలా వుంటాయి, జీతాలు ఎలా ఉంటాయి, కెరీర్ ఏ విభాగంలో అయితే బాగుంటుంది, ఏ విభాగంలో ఉద్యోగమైతే ఎన్ని ఇబ్బందులొచ్చినా భరోసా ఉంటుంది, తదితర అంశాలు చర్చిద్దాం..!

Visakhapatnam

2021-01-27 10:14:01

జర్నలిస్టు కావాలంటే ఏం తెలియా(రావా)లి..?-1

నేల నలు చెరగుల్లో(News-North, East, West, South) ఏం జరుగుతోందో తెలుసుకొని ఏరి,కోరి, కూర్చి, ఒక అంశాన్ని విషయంగా పాఠకుడికి అర్ధమయ్యే రీతిలో రాయడాన్నే వార్త అంటారు. అసలు మనకి వచ్చినట్టు ఏదో ఒక విషయాన్ని ఏదోలా రాసేస్తే అదివార్త..అదేనండి మీ పరిభాషలో న్యూస్ అయిపోతుందా..అంటే కాదనే చెప్పాలి. ఒక వార్తను మనం రాసేటపుడు ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఎలా అనే అంశాలను ప్రామాణికంగా తీసుకొని రాసినపుడు మాత్రమే అది నిర్ధిష్టమైన న్యూస్ ఫార్మాట్ న్యూస్(వార్త) అవుతుంది. ప్రధాన మీడియా సంస్థలు, పేరున్న న్యూస్ ఏజెన్సీలు అన్నీ న్యూస్ ఫార్మాట్ లో మాత్రమే వార్తలను ప్రజలకు అందిస్తాయి. అలా న్యూస్ ఫార్మాట్ లో ఒక వార్త రాయడానికి పైన పేర్కొన్న ఐదు అంశాలపై అవగాహన మాత్రమే కాదు వాటిని ఎలా ఉపయోగించాలనే విషయంపై పట్టు కూడా  రావాలి. అలా పట్టు రావాలంటే ప్రతినిత్యం కాస్త గట్టిగానే శ్రమించాల్సి వుంటుంది. చాలా మంది అనుకోవచ్చు. డిగ్రీలో జర్నలిజం చేసినా, పీజీలో జర్నలిజం చేసినా జర్నలిస్టు అయిపోవచ్చు గదండీ అంటారు  చాలా మంది నాలాంటి తెలివైనోళ్లు..? అదెలా వుంటుందంటే వైట్ అండ్ వైట్ డ్రస్సు వేసిన ప్రతీవాడు రాజకీయ నాయకుడు ఎలా కాలేడో.. డిగ్రీ, పీజీల్లో జర్నలిజం చేసినంత మాత్రన జర్నలిస్టు అనుకోవడానికి లేదు. మనం ఎంత చదువు చదువుకున్నా ఎపుడైతే ఒక విషయాన్ని పాఠకుడికి అర్ధమయ్యే రీతిలో చక్కగా న్యూస్ ఫార్మాట్ లో  రాయగలిగామో అపుడే మనం నిజమైన జర్నలిస్టు అయినట్టు లెక్క. డిగ్రీ తరువాత మనం పీజి ఒక సబ్జెక్టులో మాస్టర్స్ ఎలా చేస్తామో..అలాగే జర్నలిస్టుగా అయిన తరువాత కూడా చాలా మంది తమ ప్రావీణ్యాన్ని వివిధ విభాగాల్లో పెంచుకోవడానికి, పనిచేయడానికి, గుర్తింపు తెచ్చుకోవడానికి ఉపయోగ పడుతుంది. ప్రస్తుతం కాలంలో ఒక్కో దిన పత్రిక ఒక్కో న్యూస్ ఫార్మాట్ ను వినియోగిస్తుంది. ఒక పత్రిక విషయాన్ని మాత్రమే పాఠకుడికి తెలియజేస్తుంది. మరో పత్రిక విషయంతో పాటు ఒక రెండు అంశాలను కూడా తెలియజేయాలని అనుకుంటుంది. మరో పత్రిక ఆ రెండు విషయాలతోపాటు జరగబోయే క్రమాన్ని కూడా పాఠకులకు తెలియజేసే ప్రయత్నం చేస్తుంది. వివిధ అంశాలపై మనకున్న పట్టును బట్టీ మీడియా సంస్థలు ఆయా విభాగాలు, ప్రభుత్వ శాఖలు మనకి జర్నలిస్టుగా పనిచేయడానికి అవకాశాలు కేటాయిస్తాయి అదీ మీరు పూర్తిస్థాయి జర్నలిస్టుగా అయిన తరువాత.. అదేంటండీ న్యూస్ అని మొదలు పెట్టి అపుడే శిక్షణ మొత్తం అయిపోయి జర్నలిస్టుగా బాధ్యతలు చేపట్టినట్టుగా ముగించేస్తున్నారే అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. జర్నలిస్టు అనే వ్యక్తి ఎపుడైతే నిత్య విద్యార్ధిగా ఉన్నానని భావిస్తాడో అపుడే మంచి అంశాలను శోధించి వాటిని పాఠకుడికి వార్తలు, వార్తా కధనాలుగా, ప్రత్యేక కధనాలుగా అందించగలుగుతాడు. అలా జర్నలిస్టుగా మారాలంటే దానికి ముందు చాలా శ్రమపడి అన్ని విషయాలను నేర్చుకుంటే తప్పా జర్నలిస్టుగా మారడం కష్టం. మాకు ఇవన్నీ వద్దుకానీ మేము డైరెక్టుగా ఏదైనా పత్రికలోనో, టీవీలోనో, న్యూస్ ఏజెన్సీలోనో చేరిపోతే జర్నలిస్టు అనరా? అంటే అంటారని చెబుతాను. కానీ పూర్తిగా శిక్షణ తీసుకుని రాసే జర్నలిస్టుకి, ఏమీ రాకుండా పెన్నూ పేపరు పట్టుకొని ఫీల్డులోకి వెళ్లి, ఆ తరువాత సేకరించిన సమాచారాన్ని ఆఫీసుకో కూర్చొని ఒక సింగిల్ కాలమ్ వార్త రాయడానికి పడే కష్టం, పట్టే చెమటలు, చిరిగే పేపర్లు, అంతా రాసిన తరువాత స్వీకరించే పేపరు ఆఫీసువాళ్లు తిట్టే తిట్ల దండకం ఏ స్థాయిలో వుంటుందో ఏమీ తెలియకుండా నేనూ జర్నలిస్టుననే తెగఫీలైపోయిన వారిని అడిగితే చెబుతారు...కాదు కాదు ఎపుడైనా అలాంటి వారు పత్రికా కార్యాలయంలో వార్తలు రాస్తున్న సమయంలో వెళ్లిచేస్తే తెలుస్తుంది. కానీ ఎవరికీ వెళ్లి చూసే అవకాశం వుండదు. కానీ ఇది వాస్తవం. తాము సీనియర్ జర్నలిస్టులమని చెప్పుకునే వారు సైతం నేటికీ న్యూస్ ఫార్మాట్ లో వార్తలు రాయలేరంటే అతిశయోక్తి కాదు..ఇలాంటి ఇబ్బందులు, అవమానాలు పడకుండా ఉండాలనుకునే వారు మాత్రమే జర్నలిజంలో శిక్షణ తీసుకున్న తరువాత మాత్రమే జర్నలిస్టుగా మారతూ ఉంటారు. ఒకప్పుడు చాలా మంది జర్నలిజం స్కూళ్లు, కాలేజీల్లో వేలకు వేలు ఖర్చు చేసి జర్నలిజంలో శిక్షణ తీసుకునేవారు. అలాంటి ఇబ్బందులు లేకుండా ఉచితంగా మంచి జర్నలిస్టుగా మారదామనుకునే వారిని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ యాప్ జర్నలిజంలో ప్రాధమిక శిక్షణ మొబైల్ యాప్ ద్వారా ప్రత్యేక కధనాల ద్వారా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది.  ఆ కార్యక్రమంలో భాగంగానే గణతంత్ర దినోత్సవం రోజు నుంచి ఈ కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం. అంతేకాదు విశాఖలో ఎవరైనా ఔత్సాహికులు జర్నలిజం పట్ల ఆశక్తి వుంటే నేరుగా ఫీల్డులోనే వారికి లైవ్ లో శిక్షణ కూడా ఇవ్వాలని సంకల్పించాం. ఈ ప్రత్యేక శిక్షణ ద్వారా మంచి జర్నలిస్టులను సమాజానికి అందించాలనే లక్ష్యంతో పైసా ఖర్చులేకుండా జర్నలిజంలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం. కాకపోతే మీరు ఈ జర్నలిజం పాఠాలను నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా గుగూల్ ప్లే స్టోర్ నుంచి ఈఎన్ఎస్ లైవ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి వుంటుంది. రేపటి పాఠంలో మళ్లీ కలుద్దాం..

Visakhapatnam

2021-01-26 09:57:16

తప్పుడు పోస్ట్ లపై పోలీసు కేసులు నమోదు..

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్  ప్రతిష్ట దిగజార్చేందుకు సోషల్ మీడియా వేదికగా కొందరు చేసిన కుట్ర పై  సుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించారు. వ్యక్తి గతంగా తనపై దుష్ప్రచారం చేయడంతో పాటు భక్తుల్లో ఆందోళన చెలరేగేలా జరిగిన ఈ చర్యపై పోలీసు కేసు నమోదు చేయాలని ఆయన టీటీడీ విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. రాజమండ్రి లో ఇటీవల జరిగిన ఇంటిపట్టాల పంపిణీ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభ తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఆలయాల మీద జరిగిన దాడుల గురించి విలేకరులు శ్రీ సుబ్బారెడ్డిని ప్రశ్నించారు. ప్రజలందరినీ భగవంతుడు ( శ్రీ వేంకటేశ్వర స్వామి) జీసస్, అల్లా కాపాడుతున్నారనీ, వారి మీదే దాడులు చేసే వారు ఎవరైనా ప్రభుత్వం ఉపేక్షించబోదని సుబ్బారెడ్డి చెప్పారు.ఇది ముఖ్యమంత్రి మీద కొన్ని పార్టీలు చేస్తున్న కుట్ర అని చెప్పారు. కొంత మంది వ్యక్తులు ఈ వీడియోను కట్ చేసి ఆయన మాటల్లోని ఉద్దేశం మార్చేలా వీడియో అతికించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే శ్రీ సుబ్బారెడ్డి స్పందించి టీటీడీ అధికారులతో మాట్లాడారు. ఈ దుష్ప్రచారం, కుట్రపై పోలీసు కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tirumala

2021-01-25 22:03:25

2021-01-25 22:01:12

2021-01-25 19:55:05

2021-01-25 14:18:47

2021-01-24 14:22:29

జర్నలిస్టు కావాలంటే ఏం తెలియా(రావా)లి..?-1

మీరు జర్నలిస్టు కావాలనుకుంటున్నారా...అలా అయితే  మీకు ఏం తెలియాలి..ఏం రావాలి..? అనే ప్రశ్న చాలా మంది ఉత్సాహవంతమైన పట్టభద్రుల్లో కలుగుతుంది.. జర్నలిస్టుగా మారాలంటే మీరు ఏం నేర్చుకోవాలి.? ఖచ్చితంగా ఒక పూర్తిస్థాయి జర్నలిస్టుగా మారాలంటే ఎంత సమయం పడుతుంది.? మీరు సాధారణ జర్నలిస్టుగా కావాలనుకుంటున్నారా..? క్రైమ్ జర్నలిస్టు కావాలనుకుంటున్నారా..? ఇన్వెస్టిగేటింగ్ జర్నలిస్టు కావాలనుకుంటున్నారా..? ఫ్రీలాన్స్ జర్నలిస్టు కావాలనుకుంటున్నా, ఆన్ లైన్ కంటెంట్ జర్నలిస్టు కావాలనుకుంటున్నా..? న్యూస్ ఏజెన్సీ జర్నలిస్టు కావాలనుకుంటున్నారా..? ప్రెస్ కార్డు మెడలో వేసుకొని ఏదో మొక్కబడి జర్నలిస్టు కావాలనుకుంటున్నారా...? అసలు మీకు ఏమీ రాకపోయినా ఏదో పత్రికలోనో, టివీలోనో, వెబ్ సైటులోనో, న్యూస్ ఏజెన్సీలోనో, మొబైల్ యాప్ లోనో చేరిపోయి నేనూ జర్నలిస్టునని చెప్పుకుంటే జర్నలిస్టు అయిపోతారా..? అసలు ఏం నేర్చుకొని, ఏం రాసి,  ఎలా రాస్తే మీరు జర్నలిస్టు అవుతారు?.. ఏమీ రాకపోయినా వచ్చీరాని తెలుగు పదాలతో నేనూ జర్నలిస్టుగా మారిపోతానని ఒక పెన్నూ, పుస్తకం పట్టుకొని, బైక్ పై ప్రెస్ అనే స్టిక్కర్ వేసుకుంటే మీరు జర్నలిస్టు అయిపోయాతారా? అసలు జర్నలిజం అంటే ఏంటి? జర్నలిజంలో ఏముంటుంది. పెద్ద పత్రికలు, న్యూస్ ఛానళ్లు, న్యూస్ ఏజెన్సీలో పనిచేవారు కొంతమంది మాత్రమమే  ప్రముఖ జర్నలిస్టులుగా సంఘంలో ఎలా ప్రాచుర్యం పొందుతున్నారు..? అందరు జర్నలిస్టులకంటే భిన్నంగా వారు చేసేదేమిటి?.. నిర్ధిష్టమైన వార్త ఒక వార్త ఎలా రాయాలి..? ఏం నేర్చుకుంటే అలాంటి వార్త మనం ఒక జర్నలిస్టుగా రాయగలం? దీనికి ప్రత్యేక మైన శిక్షణ తీసుకోవాలా? ఒక సారి తీసుకున్న శిక్షణ సరిపోతుందా? మనకి ఎన్ని సంవత్సరాల్లో ఒక మంచి జర్నలిస్టుగా గుర్తింపు వస్తుంది..? ఇవన్నీ జర్నలిస్టుగా మారాలి అనుకున్నవారు అవగాహన పెంచుకోవాలని చూస్తారు..కానీ ఒక ప్రత్యేక విధానం, మరో ప్రత్యేక శిక్షణ, ప్రధాన పత్రికలు, మీడియా సంస్థలు నిర్వహించే జర్నలిజం కళాశాలలు తప్పితే మరెవరూ శిక్షణ ఇచ్చే పరిస్థితి లేదు..ఇదంతా ఒకప్పటి మాట. ఇపుడు మీరే ఆరు నెలల నుంచి ఏడాదిలోపు ఒక మంచి జర్నలిస్టుగా మారవచ్చు...ఏంటి నమ్మసఖ్యంగా లేదా.. దానికి మేము గేరంటీ.. దానికోసం ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఒక వేదికను కల్పిస్తోంది.. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి జర్నలిస్టులుగా మారాలనుకునే వారందరికీ ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. దానికోసం ఉత్సాహవంతులైన పట్టభద్రులు చేయాల్సిందల్లా ఒక్కటే ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని ప్రతీరోజూ ఒక ప్రత్యేక కధనం జర్నలిస్టుగా మారాలంటా ఏం చేయాలనే అంశంపై మీరు తెలుసుకోవాల్సి వుంటుంది...వాటితో యాప్ లో వచ్చే వార్తలు ఏ విధమైన న్యూస్ ఫార్మాట్ లో వస్తున్నాయో గమనిస్తూ..శిక్షణ పొందుతూ, మీరే జర్నలిస్టుగా మారి మీ యొక్క నైపుణ్యాన్ని ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా పెంచుకోవచ్చు.. తద్వారా మీరు మంచి జర్నలిస్టుగా తయారు కావడంతోపాటు, మీరు జర్నలిస్టుగా మారితే ఎలావుంటుందో బాహ్య ప్రపంచానికి తెలియజేయవచ్చు. జర్నలిజంలోని వివిధ అంశాలను, ప్రస్తావిస్తూ సాగే శిక్షణా కధనాలను ప్రతీరోజూ తెలుసుకోవడం తోపాటు అదే రోజు మీరు కూడా వార్తలు రాయడం మొదలు పెట్టి అనతి కాలంలో మంచి జర్నలిస్టుగా మారవచ్చు.. ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా మీరు పొందిన జర్నలిజం శిక్షణ నిజమైన న్యూస్ ఫార్మాట్ విధానంలో వుంటుంది కనుక. ఇక్కడ నేర్చుకున్న శిక్షణతో మీరు ఎక్కడైనా ఏ మీడియా సంస్థలో అయినా పనిచేయడానికి ఎంతో దోహద పడుతుంది... ఇది తొలిరోజు ప్రోమో లెసన్ మాత్రమే..ఇంకెందుకు ఆలస్యం మీకు ఆండ్రాయిడ్ ఫోను ఉంటే మీరు ఆరునెలల్లో పెర్ ఫెక్ట్ జర్నలిస్టుగా మారిపోవచ్చు.. వెంటనే మీ మొబైల్ లో ఈఎన్ఎస్ లైవ్ యాప్ ని డౌన్ లోడ్ చేసుకోండి. జర్నలిస్టుగా మారి మీ ఆదాయాన్ని వార్తలు రాయడం ద్వారా సంపాదించుకోండి..బెస్టాఫ్ లక్..! 

విశాఖపట్నం

2021-01-24 14:04:39

2021-01-23 14:48:33

పంచాయతీ ఎన్నికలకు నిబంధనలివే..

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు నగరా మోగింది. ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు, అర్హతలు, రాజకీయపార్టీలకు అనుకూలంగా ఉన్నచోట ఆశావహులు పంచాయతీ పోరుకు  సన్నద్ధమవుతున్నారు. సర్పంచ్‌ పదవికి పోటీ చేసే అభ్యర్థులకు, వార్డు అభ్యర్థులకు అర్హతలు, అనర్హతలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ విధంగా ఉన్నాయి. వీటిని అనుసరించి మాత్రమే అభ్యుర్ధులు పంచాయతీ ఎన్నికల్లో నిలబడాలి..అవేంటో ఒక్కసారి తెలుసుకుంటే సాధారణ ప్రజలకు కూడా ఈ ఎన్నికలపై ఒక అవగాహన వస్తుంది.. వివరాలివే.. ➡️పోటీ చేసే గ్రామ పంచాయతీ ఓటరు జాబితాలో తప్పని సరిగా ఓటరుగా నమోదై ఉండాలి. ➡️పరిశీలన నాటికి అభ్యర్థి వయస్సు 21 ఏళ్లు పూర్తయి ఉండాలి. ➡️ఒక వ్యక్తి ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ఎన్నికలలో పోటీ చేయడానికి వీలు లేదు. ➡️ఒక వేళ ఆ వ్యక్తికి 31-5-1995 కంటే ముందే ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్నట్లయితే ఆమె, అతడు ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హత కలిగి ఉంటారు. ➡️01.06.1995 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉంటే ఆ వ్యక్తి పోటీ చేయడానికి అనర్హుడు. ➡️ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు ఉత్తర్వులు డబ్ల్యూపీ నంబర్‌ 17947/2005లో తేది 19-7-2006 తీర్పు ప్రకారం దత్తత ఇచ్చిన పిల్లలను స్వంత తల్లిదండ్రులకు చెందిన పిల్లలుగానే పరిగణిస్తారు. వారిని దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు చెందిన పిల్లలుగా పరిగణించరు. ఒక వ్యక్తికి ముగ్గురు పిల్లలు ఉంటే వారిలో ఒకరిని దత్తత ఇచ్చినా అనర్హుడిగానే పరిగణిస్తారు. ➡️ఒక వ్యక్తి తన మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలు కలిగి ఉండి భార్య చనిపోయిన తరువాత రెండో భార్య ద్వారా ఇంకో సంతానాన్ని పొందితే అతనికి ముగ్గురు సంతానంగా పరిగణిస్తారు. అతని రెండో భార్య ఒక్క సంతానం కలిగి ఉన్నందున ఆమె పోటీ చేయడానికి అర్హురాలు. ➡️ముగ్గురు పిల్లలు ఉన్న వ్యక్తికి నామినేషన్‌ పరిశీలనకు ముందు ఒకరు చనిపోతే ప్రస్తుతం ఉన్న పిల్లలను లెక్కలోకి తీసుకుని అతని అర్హతలను నిర్ణయిస్తారు. ➡️ఇద్దరు పిల్లలు ఉన్న తరువాత భార్య గర్భవతి అయినా పోటీకి అనర్హులు. ➡️కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారు పోటీకి అర్హులు కారు. ➡️ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్‌ చట్టం 1994 ప్రకారం నామినేషన్‌ పరిశీలన తేది నాటికి పోటీ చేస్తున్న వారు తమ ఉద్యోగానికి రాజీనామా చేసి అది ఆమోదించిన తరువాత మాత్రమే పోటీకి అర్హులుగా పరిగణించి నామినేషన్‌ పరిశీలన చేస్తారు. ➡️రేషన్‌ దుకాణం డీలర్‌ ఎన్నికల్లో పోటీచేయడానికి అర్హులు. ఉమ్మడి హైకోర్టు డబ్ల్యూపీ నంబర్‌ 14189/2006లో సోమ్‌నాథ్‌ వి విక్రం, కె అరుణ్‌కేసులో సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకుని రేషన్‌ షాప్‌ డీలర్‌ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు అని తీర్పు చెప్పింది. ➡️అంగన్‌వాడీ వర్కర్లు ఎన్నికల్లో పోటీచేయడానికి అర్హులు కారు. ➡️నీటి వినియోగదారుల సంఘం సభ్యులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేదు. ➡️సహకార సంఘాల సభ్యులు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కలిగి ఉంటారు. సహకార సంఘాల చట్టం 1954 కింద సహకార సంస్థలు రిజిష్టర్‌ అవుతాయి.వారు ప్రత్యేక శాసనసభ ద్వారా చేసిన చట్టం ద్వారా నియమించలేదు కాబట్టి వారికి అవకాశం ఉంది. ➡️స్వచ్ఛంద, మత సంబంధ సంస్థల చైర్మన్లు, సభ్యులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేదు. 1987 హిందూ మత సంస్థల చట్టం, దేవాదాయ శాఖ సెక్షన్‌ ప్రకారం సంస్థలు ఏర్పాటయ్యాయి. ➡️ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థయందు పని చేయువారు కూడా అనర్హులు. ➡️ అభ్యర్థికి ప్రతిపాదకుడుగా ఉన్న వ్యక్తి అదే వార్డు, ప్రాదేశిక నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చు. అభ్యర్థి తప్పడు సమాచారం ఇచ్చినప్పటికి నామినేషన్‌ తిరస్కరించరు. ➡️అభ్యర్థి పై ఇతరులు ఫిర్యాదు చేస్తే దానికి రిటర్నింగ్‌ అధికారి అభ్యర్థి ఇచ్చిన నామినేషన్‌ పత్రాలలో ఇచ్చిన సమాచారం తప్పు అని భావించినట్లయితే ఐపీసీ సెక్షన్‌ 177, క్రిమినల్‌ పోసీసర్‌ కోడ్‌ 195 ప్రకారం అదే ప్రాంతానికి చెందిన న్యాయస్థానంలో ఫిర్యాదు చేయాలి. కానీ నామినేషన్‌ తిరస్కరించవద్దు. ➡️మతిస్థిమితం లేని వ్యక్తి పోటీకి అనర్హుడు. ➡️నామినేషన్‌ వేస్తున్న వ్యక్తి ఎలాంటి దృవీకరణ పత్రాలు అదే రోజు ఇవ్వకపోయినా నామినేషన్‌ తీసుకుంటారు. ➡️చెక్‌లిస్టులో ఎలాంటి పత్రాలు సమర్పించలేదని నమోదు చేయాలి. ఆ తర్వాత ఇతర డాక్యుమెంట్లు నామినేషన్ల చివరి తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలి. ఆ తర్వాత ఇచ్చినా స్వీకరించరు. నామినేషన్‌ తిరస్కరణ అనేది పరిశీలనలో నిర్ణయిస్తారు. ➡️పోటీ చేస్తున్న అభ్యర్థికి ప్రతిపాదకుడు నామినేషన్‌ పత్రాలపై సంతకం పెట్టకుంటే అఫిడవిట్‌ సమర్పించాలి. కానీ దానికి రిటర్నింగ్‌ అధికారి తనంతటతాను సంతృప్తి పొందాలి. ➡️ప్రతిపాదనకుడి సంతకం ఫోర్జరీ అని తేలితో దానికి రిటర్నింగ్‌ అధికారి క్షుణ్ణంగా పరిశీలించి విచారణ తర్వాత నిర్ధారించి ఆ నామినేషన్‌ తిరస్కరించవచ్చు. ➡️ఒక వ్యక్తి పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం గరిష్టంగా నాలుగు నామినేషన్లను వేయవచ్చు. ➡️ఒక అభ్యర్థి ఎక్కువ నామినేషన్లను వేసినా చెల్లుబాటు జాబితాలో అతని పేరు ఒక్కసారి మాత్రమే రాస్తారు. ➡️అభ్యర్థి తన నామినేషన్‌ ఉపసంహరణకు చెల్లుబాటు జాబితా ప్రకటించే వరకు నిరీక్షించి ఉపసంహరించుకోవాలి. ➡️నామినేషన్‌ వేయడానికి అభ్యర్థి, ప్రతిపాదకుడితోపాటు మరో ముగ్గురిని రిటర్నింగ్‌ అధికారి తన గదిలోకి అనుమతి ఇస్తారు. ➡️నామినేషన్‌లో అభ్యర్థి సంతకం మర్చిపోతే దానిని తిరస్కరించవచ్చు. ఒక్కసారి నామినేషన్‌ వేసిన తర్వాత మార్పులు, చేర్పులకు అవకాశం లేదు. ➡️అభ్యర్థి నామినేషన్‌ ఉపంసహరణ నోటీసుపై స్వయంగా సంతకం చేసి నమూనాలో సమయంలోపు రిటర్నింగ్‌ అధికారికి ఇవ్వాలి. అభ్యర్థి ఇవ్వలేని సమయంలో రాతపూర్వకంగా అధికారం ఉన్న ప్రతిపాదకుడు ఎన్నికల ఏజెంట్‌ ద్వారా రిటర్నింగ్‌ అధికారికి సమర్పించవచ్చు. ➡️అభ్యర్థి ఒక్కసారి నామినేషన్‌ ఉపంసహరణ తర్వాత దానిని రద్దు చేసుకోవడానికి వీలు లేదు. ➡️రిటర్నింగ్‌ అధికారి నామినేషన్‌ తిరస్కరిస్తే దానికి పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం మరుసటిరోజు సబ్‌ కలెక్టర్‌, ఆర్డీవోకు అభ్యర్థి రిటర్నింగ్‌ అధికారి నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్‌ చేయవచ్చు. ➡️ఒక వ్యక్తి ఎక్కువ ప్రాదేశిక నియోజకవర్గాల్లో, వార్డుల్లో పోటీ చేయకూడదని పంచాయతీరాజ్‌ చట్టంలో ఎక్కడా లేదు. ➡️ ఓటు హక్కు ఒక్కసారి మాత్రమే వినియోగించుకోవాలి. ➡️పోటీ చేస్తున్న వ్యక్తిపై నేరారోపణపై శిక్షపడి దోషిగా నిర్ధారిస్తే పోటీ చేయడానికి అనర్హుడు అవుతాడు. ➡️శిక్ష అనుభవించకుండా బెయిల్‌పై ఉంటే అనర్హత నుంచి బయటపడినట్లు భావించారు. ఇలా అభ్యర్థులు నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది. డిపాజిట్ల ఈ విధంగా.. ➡️వార్డు సభ్యుడి పదవికి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల నామినేషన్‌ రుసుం కింద 250. ➡️ఇతరులు 500 రూపాయలు చెల్లించాలి. ➡️సర్పంచ్‌ పదవికి పోటీచేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1000,ఇతరులు రూ. 2 వేలు చెల్లించాలి.

Tadepalle

2021-01-23 13:35:28

అధిక ఫీజుల వేధింపులపై ఏకమవ్వండి..

ఆంధప్రదేశ్‌ లో ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజుల కోసం యాజమాన్యాలు పీడిస్తున్న సమయంలో తల్లిదండ్రులంతా ఏకం కావాలని  ‌పాఠశాల విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్‌ పిలుపునిచ్చింది. కమిషన్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా వివిధ పాఠశాలలు, కళాశాలలు తనిఖీ చేస్తున్నట్టు ఏపి ఎస్‌హెచ్‌ ఆర్‌ అం‌డ్‌ ‌యం ఛైర్మన్‌ ‌జస్టిస్‌ ఆర్‌. ‌కాంతారావు తెలిపారు. స్థానిక ఆర్‌ అం‌డ్‌ ‌బి భవనాల సముదాయంలో శుక్రవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో  ఛైర్మన్‌ ‌జస్టిస్‌ ఆర్‌. ‌కాంతారావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ కనీస స్థాయిలో నిర్వహణ లేని 25 పాఠశాలలు, 50 కళాశాలలు పై కఠినమైన చర్యలు తీసుకోవలసిందిగా ప్రభుత్వానికి సిఫార్సు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం కేవలం 70 శాతం ట్యూషన్‌ ‌ఫీజులు వసూలు చేయవలసి ఉండగా, కోవిడ్‌ ‌నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఏడాది గత ఏడాది ఫీజులు ఆధారంగా 70 శాతం ఫీజులు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చిందన్నారు. అయితే కొన్ని యాజమాన్యాలు గత ఫీజులను అధికంగా పెంచి వసూలు చేస్తున్నాయన్నారు.  ఫీజుల వసూల విషయంలో ట్యూషన్‌ ‌ఫీజులు, ఇతర ఫీజులు అన్ని కలిపి విద్యార్థుల తల్లిదండ్రులపై విపరీతమైన ఒత్తిడి తీసుకువచ్చి మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. యాజమాన్యాలు తల్లిదండ్రులను భయపడుతున్న సంఘటనలను కూడా తమ దృష్టికి వచ్చాయన్నారు. కళాశాలలు, పాఠశాలలు ప్రభుత్వ మార్గదర్శకాలు పట్టించుకోకుండా తల్లిదండ్రులపై విద్యార్ధులపై ఇబ్బందులకు గురి చేసే సంఘటనలు జరిగితే వాటి గుర్తింపును రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అటువంటి సంఘటనలపై క్రిమినల్‌ ‌కేసులు కూడా ఆయా యాజమాన్యాలపై తీసుకునేందుకు వెనుకాడబోమన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులందరు సంఘటతమై ఇంతకంటే ఎక్కువ ఫీజులు చెల్లించలేమని యాజమాన్యాలకు తెలియజేస్తూ సందేశం పంపాలన్నారు.  కమిషన్‌ ‌పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి 70 శాతం వరకు మాత్రమే ఫీజు వసూలు చేసేందుకు అనుమతించామని ఇది సముచితమైన సిఫార్సు అని  ఛైర్మన్‌ ‌జస్టిస్‌ ఆర్‌. ‌కాంతారావు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 360 కళాశాలలు, పాఠశాలలు తనిఖీలు చేశామన్నారు. ఎటువంటి మౌలిక వసతులు కల్పించకుండా అన్నీ ఇస్తున్నట్లు పేర్కొంటూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. తమ తనిఖీ బృందానికి పలు పాఠశాలలు, కళాశాలలు తనిఖీ సందర్భంగా విద్యార్థులు తమ బాధలు తెలియజేయడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు ఏకమై అధిక ఫీజుల విషయమై ఒక త్రాటి పైకి వచ్చి ఇంతే చెల్లిస్తామని ఆయా యాజమాన్యాలకు తెలియజేయాలని  ఛైర్మన్‌ ‌జస్టిస్‌ ఆర్‌. ‌కాంతారావు కోరారు.  వైస్‌ ‌ఛైర్మన్‌ ‌విజయశారదరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పలు పిర్యాదులు వస్తున్నందున క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టామన్నారు. మొదటి సంవత్సరంలోనే రెండు సంవత్సరాల ఫీజులు వసూలు చేస్తూ బోధన , ఇతర వసతులు లేకపోయినా ఒత్తిడి తీసుకువస్తున్నారన్నారు. వేరే కళాశాలకి వెళ్ళే ఆలోచనా ఉన్న టిసీలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నరన్నారు. పశువుల దొడ్డి కన్న హీనంగా తరగతిగదులు హస్టల్స్ ‌నిర్వహణ ఉంటోందన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలు చదివే కళాశాలలు, పాఠశాలలు, వసతిగృహాలను తనిఖీ చేయలన్నారు. చాలా యాజమాన్యాలు ఫీజుల వసూలు సంబంధించి రికార్డులను సమర్పించడం లేదని ఈ విషయంపై ఏదోరకంగా దాటవేసే ధోరణి అవలంభిస్తూన్నారన్నారు. ఎక్కౌంటెంట్లును అందుబాటులో ఉంచడం లేదన్నారు. తనిఖీ బృందాలకు యాజమాన్యాలు సహకరించడం లేదన్నారు. కమిటి సభ్యులు మాట్లాడుతూ కొన్ని క్యాంపస్‌‌లో రూ.2లక్షల నుండి 5 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలను ముమ్మరంగా చేపడతామన్నారు. ఇంటర్‌ ‌బోర్డు ద్వారా ప్రభుత్వం నిర్ధేశించిన కోర్సులు బొధించవలసి ఉండగా అనుమతి లేని వాటిని కూడా పాఠ్యాంశాలుగా చేరుస్తున్నారన్నారు. కమిషన్‌ ‌సూచనలమేరకు ఫీజుల వసూల విషయంపై వాటి వివరాలు గ్రామ సచివాలయలు వద్ద ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే తగిన సిఫార్సులు చేస్తూ కమిషన్‌ ‌ప్రభుత్వానికి  నివేదిక అందించేందుకు సిద్దంగా ఉందని సభ్యులు తెలిపారు. వాటి వివరాలను కూడా కమిషన్‌ ‌వెబ్‌ ‌పోర్టల్‌ ‌లో ప్రదర్శిస్తామన్నారు.  ఈ సమావేశంలో ఏపి ఎస్‌హెచ్‌ ఆర్‌ అం‌డ్‌ ‌యం కమిటి సభ్యులు, వివి నారాయణ రెడ్డి, సిఏఈ ప్రసాద్‌ ఈశ్వరయ్య, అజయ్‌కుమార్‌లు పాల్గొన్నారు. 

Vijayawada

2021-01-22 15:36:25