తెలుగు భాష, సాహిత్యాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని తెలుగు అకాడమి చైర్‌పర్సన్ ఎన్.లక్ష్మీపార్వతి అన్నారు. శనివారం ఉదయం ఆమె ఏయూ తెలుగు విభాగాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.ముందుగా తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాల వేసి నమస్కరించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పరిశోధనల్లో నాణ్యత, ప్రమాణాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రాచీన సాహిత్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. తెలుగు అకాడమి ఆధ్వర్యంలో పరిశోధనలు నిర్వహించే విధంగా కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ విశిష్ట పరిశోధనలు జరపాలని తెలిపారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, ప్రిన్సిపాల్ ఆచార్య పి.రాజేంద్ర కర్మార్కర్, తెలుగు విభాగాధిపతి ఆచార్య జర్రా అప్పారావు, విశ్రాంత ఆచార్యులు యోహాన్ బాబు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీపార్వతిని విభాగం తరపున సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఫైబర్ గ్రిడ్‌ను విస్తరించుట ద్వారా ప్రజలందరికీ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోనికి తీసుకువస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపియస్‌యఫ్‌యల్) ఛైర్మన్ పునూరి గౌతమ్‌రెడ్డి అన్నారు. విజయవాడ ఏపియస్ఆర్ టిసి అడ్మినిస్ట్రేటివ్ 3వ బ్లాక్‌లో గల ఏపియస్‌యఫ్‌యల్ కార్యాలయంలో శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్‌గా పునూరి గౌతమ్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సర్వమత ప్రార్ధనల అనంతరం ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పునూరి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏఒక్కరూ ఇవ్వలేనివిధంగా ఏ.పి. ఫైబర్ నెట్ ద్వారా నాణ్యమైన ఇంటర్నెట్, కేబుల్ ప్రసారాలు ప్రజలకు అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపియస్‌యఫ్‌యల్) ఛైర్మన్ పునూరి గౌతమ్‌రెడ్డి అన్నారు. ఫైబర్ గ్రిడ్‌ను విస్తరించుట ద్వారా రాష్ట్రంలో 660 మండలాల్లో, 6300 గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఫైబర్ నెట్ సేవలను తీసుకువచ్చామని దీనిలో భాగంగా త్రిపుల్ ప్లే సర్వీసెస్ అందిస్తున్నామని, రూ. 599/- లకే అన్‌లిమిటెడ్ ప్లాన్‌తో కేబుల్ కనెక్షన్, ఇంటర్నెట్, టెలిఫోన్ సౌకర్యం అందిస్తున్నామని గౌతమ్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామానికీ ఇంటర్నెట్ సౌకర్యం అందాలనే ఉద్ధేశ్యంతో ప్రతీగ్రామంలోనూ ఇంటర్నెట్ పార్క్‌లను ఏర్పాటుచేస్తున్నామని ఆయన అన్నారు. మారుమూల గిరిజన గ్రామాలకు సైతం ఫైబర్ నెట్ ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్, టివి, టెలిఫోన్ సర్వీసులు అందిస్తున్నామని ఇప్పటివరకు ఐటిడిఏ పాడేరు, ఐటిడిఏ రంపచోడవరం పరిధిలో రిమోట్ గిరిజన గ్రామాలకు సైతం ఫైబర్ నెట్ సేవలు అందించామని ఆయన అన్నారు. ఫైబర్ నెట్‌కు ప్రజల నుండి మంచి ఆదరణ ఉన్నదని, రాష్ట్రంలో ఇప్పటికే 10 లక్షల కేబుల్, ఇంటర్నెట్, టెలిఫోన్ కనెక్షన్లు పనిచేస్తున్నవని ఆయన అన్నారు. విద్యార్ధులకు ప్రభుత్వం ఇప్పటికే ల్యాప్‌టాప్‌లను అందించిందని, ఫైబర్ గ్రిడ్ ద్వారా విద్యార్ధులకు ఉచితంగా ఇంటర్నెట్ అందిస్తామని ఆయన అన్నారు. కేబుల్, ఇంటర్నెట్, టెలిఫోన్ ప్రజలకు విడిగా అందించడానికి కూడా చర్యలు తీసుకున్నామని అన్నారు. రూ. 499/- లకే అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ అందిస్తున్నామని, రూ. 300/- లకే కేబుల్ కనెక్షన్ అందిస్తామని, రూ. 99/- లకే టెలిఫోన్ ల్యాండ్ కనెక్షన్‌ను అందిస్తున్నామని గౌతమ్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం, రాబోయే తరాలకు కూడా ఇంటర్నెట్ అవసరం ఎ ంతో ఉందని దీన్ని దృష్టిలోపెట్టుకుని రానున్న రోజుల్లో ఫైబర్ గ్రిడ్‌ను మరింత విస్తరించి సులభతరమైన సేవలను ప్రజలకు అందుబాటులోనికి తీసుకువస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఏపి ఫైబర్ నెట్ ద్వారా సాంకేతిక విప్లవం మొదలైందని గ్రామగ్రామాన ఫైబర్ గ్రిడ్ ద్వారా సేవలు అందిస్తున్నామని గౌతమ్‌రెడ్డి అన్నారు. గ్రామ, మండల స్ధాయిలో అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేస్తున్నామని, త్వరలో క్రొత్త సెట్ టాప్ బాక్స్‌లు తీసుకువస్తున్నామని గౌతమ్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రానున్న 3 సంవత్సరాల్లో ఫైబర్ నెట్ ద్వారా 70 లక్షల కుటుంబాలకు ఇంటర్నెట్ సౌకర్యం అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని గౌతమ్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సాంకేతిక సామాజిక విప్లవానికి నాందిపలికిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆశయాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ సంస్ధ నెట్ వర్క్ సేవలను మరింత పటిష్టపరిచి, రాష్ట్రంలో ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా డిజిటల్ సేవలను అందించేవిధంగా ఈసంస్ధను తీర్చిదిద్దుతున్నామని ఛైర్మన్ గౌతమ్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ఫైబర్ నెట్ సర్వీస్‌లను నిర్వీర్యం చేసిందని, గత ప్రభుత్వం చేసిన అవినీతిని కూడా వెలికితీస్తామని, సిబిఐ విచారణ చేస్తున్నదని, అవినీతికి పాల్పడిన ఏఒక్కరినీ ప్రభుత్వం వదలబోదని గౌతమ్‌రెడ్డి అన్నారు. ఈసమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ యండి యం. మధుసూధనరెడ్డి, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలోని గుబ్బా సత్రం 33వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గుబ్బా ట్రస్టు ఛైర్మన్ అశ్వనీకుమార్, మేనేజింగ్ ట్రస్టీ జీవన్‌కుమార్ శనివారం బర్డ్ ట్రస్టుకు రూ.5 లక్షల విరాళాన్ని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డికి అందించారు. అనంతరం సత్రం వార్షికోత్సవానికి టిటిడి ఛైర్మన్‌ను ఆహ్వానించారు. సత్రంలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బర్డ్ ట్రస్టుకు తమవంతుగా విరాళం అందించడం ఆనందంగా వుందన్నారు. తిరుమల గిరులపై ఏ సహాయం చేసినా అది శ్రీవారికే చెందుతుందనే భావనతో ఈ మంచి కార్యక్రమానికి పూనుకున్నట్టు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు చిప్పగిరి ప్రసాద్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోపంచాయతీ ఎన్నికల పోరులో వార్తలను కవర్ చేసే అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చే కవరేజీ పాసుల విషయంపై ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక యాప్ ఈఎన్ఎస్ లైవ్ ప్రచురించిన ప్రత్యేక కథనంపై ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించాయి. గాల్లో జర్నలిస్టుల ఎలక్షన్ కమిషన్ పాసులు శీర్షికన వచ్చిన న్యూస్ కార్డ్ అంశం ఎన్నికల కమిషన్ వరకూ చేరడంతో, కాలం చెల్లిన అక్రిడిటేషన్ల ఆధారంగానే ఎలక్షన్ కమిషన్ పాసులు జారీచేయాలని ప్రభుత్వం సమాచారశాఖకు ఆదేశాలిచ్చింది.. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్నిజిల్లాల డిపీఆర్వోలకు ఆదేశాలు జారీచేసింది. దీనితో జర్నలిస్టుల వివరాలు సమాచారశాఖ సేకరిస్తోంది. స్టేట్ రిపోర్టర్లకు జిల్లా పాసులు, మండల విలేకరులకు మండలస్థాయి ఎలక్షన్ కమిషన్ పాసులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి ఎన్నికల వార్తలను కవర్ చేయడానికి అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు మాత్రమే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వం పాసులు జారీచేస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లోని వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ల కాలపరిమితి తీరిపోయి 2021వ సంవత్సరంలో రెండవ నెల వచ్చినా నేటికీ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు మంజూరు చేయలేదు. దీనితో ఎన్నికల వార్తలు కవర్ చేసే జర్నలిస్టులకు ఎలక్షన్ కమిషన్ పాసుల విషయమై సందిగ్దత ఏర్పడింది. అదే సమయంలో జర్నలిస్టుల సమస్యలను, అక్రిడిటేషన్ లేకపోతే ఎలక్షన్ కమిషన్ పాసులు రావనే విషయాన్ని ప్రత్యేక కథనం ద్వారా ఈఎన్ఎస్ లైవ్ న్యూస్ యాప్ ద్వారా న్యూస్ కార్డు ప్రచురించింది. దీంతో ఈ విషయాన్ని అన్నిజిల్లాల రిటర్నింగ్ అధికారులు ప్రభుత్వ ద్రుష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం స్పందించి. అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు ఎలక్షన్ కమిషన్ పాసులు జారీ చేయాలని నిర్ణయించి ఆ మేరకు పాలసును సిద్ధం చేస్తున్నారు. ఈ ఎన్నికల కమిషన్ పాసులు లేకపోతే ఎన్నికల ప్రక్రియ, ఓట్ల లెక్కింపును జర్నలిస్టులు కవర్ చేయడానికి గానీ, అక్కడ జరిగే విషయాలను తెలుసుకోవడానికి గానీ వీలుపడదు. అదే సమయంలో ఎన్నికల సిబ్బంది కూడా పోలింగ్ స్టేషన్ల దగ్గరకు రానీయరు సరికదా, జర్నలిస్టులని కూడా చూడకుండా పోలీసులు చాలా దారుణంగా వ్యవహరిస్తారు. వర్కింగ్ అక్రిడేటెడ్ జర్నలిస్టుల విధులకు ఎక్కడా ఆటంకం రాకుండా ప్రభుత్వమే ఎలక్షన్ కమిషన్ పాసులను మంజూరు చేయాలని నిర్ణయించడం విశేషం. ప్రభుత్వానికి సంబందించిన విషయాలను కవర్ చేసే జర్నలిస్టులకు, ప్రాధాన్యతను గుర్తించి కొత్త అక్రిడిటేషన్లు ప్రభుత్వం తక్షణమే మంజూరు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి శుక్రవారం తిరుమలలో పలు విభాగాలను ఆకస్మిక తనిఖీ చేశారు. కోవిడ్ నిబంధనల సడలింపు అనంతరం భక్తులకు అందుతున్న సేవలను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనేకమంది భక్తులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలు, సమస్యల గురించి తెలుసుకున్నారు. అన్న ప్రసాదం భవనంలోని భోజన శాలల్లోకి వెళ్లి భోజనం చేస్తున్న భక్తులతో మాట్లాడారు. భక్తులు తిరుమలకు ఎప్పుడు వచ్చారు? వసతి సులువుగానే దొరికిందా? దర్శనంలో ఇబ్బందులు ఉన్నాయా? అన్న ప్రసాదం నాణ్యత, రుచి ఎలా ఉందని అనేకమంది మంది భక్తులతో మాట్లాడి వారి నుంచి సమాచారం తెలుసుకున్నారు. సుమారు గంట పాటు తనిఖీలు చేసిన ఛైర్మన్ శ్రీవారి సేవలో పాల్గొని భక్తులకు అన్నం వడ్డించారు. శ్రీవారి సేవకులతో ప్రత్యేకంగా మాట్లాడి వారికి అందుతున్న వసతి, భోజనం, ఇతర సదుపాయాల గురించి తెలుసుకున్నారు. భక్తులు అన్న ప్రసాదం పారేయకుండా జాగ్రత్తగా వడ్డించేలా చర్యలు తీసుకువాలని అన్నదానం డిప్యూటీ ఈవో శ్రీ నాగరాజును ఆదేశించారు.
భోజనశాలల్లో వడ్డించేప్పుడు అన్నం కింద పదుతోందనీ, భక్తులు అన్నం తొక్కుతున్నారని ఛైర్మన్ అధికారులకు చెప్పారు. అన్నం కింద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుమలలో తమకు అందుతున్న సేవల గురించి భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. అన్న ప్రసాదం రుచి,నాణ్యత బాగున్నాయని చెప్పారు. అన్న ప్రసాదం నాణ్యతను పరిశీలించడానికి అకస్మాత్తుగా అక్కడే భోజనం చేశారు. వసతి, ఇతర సదుపాయాలకు సంబంధించి తిరుమలలో సూచిక బోర్డులు లేనందువల్ల ఇబ్బంది పడ్డామని వరంగల్లు కు చెందిన యజ్ఞం శ్రీను చైర్మన్ కు చెప్పారు. తగిన చర్యలు తీసుకుంటామని సుబ్బారెడ్డి చెప్పారు.
మాడ వీధుల్లో....
ఈ నెల 19వ తేదీ రథ సప్తమి సందర్భంగా మాడ వీధుల్లో శ్రీవారి వాహన సేవలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాడ వీధుల్లో భక్తులను భౌతిక దూరం పాటిస్తూ ఎలా అనుమతించాలి ? గ్యాలరీల్లో ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే అంశాలను పరిశీలించారు.
లడ్డూ ప్రసాదం పంపిణీ కౌంటర్లను చైర్మన్ తనిఖీ చేశారు. భక్తులతో మాట్లాడి లడ్డూలు సిఫారసు లేకుండా దొరుకుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. లడ్డూల పంపిణీకి పేపర్, బట్ట కవర్లను ఉపయోగిస్తున్న తీరు గమనించారు. కవర్లు ఎంతకు విక్రయిస్తున్నారని భక్తులను అడిగారు. అనంతరం బూందీ పోటులో ప్రమాదాలు జరక్కుండా, పోటు కార్మికులకు ఇబ్బంది లేకుండా ఉండటానికి అధునాతన " థర్మో ఫ్లూయిడ్" టెక్నాలజీతో నిర్మించిన బూందీ పోటును చైర్మన్ సుబ్బారెడ్డి పరిశీలించారు. ఇండియా సిమెంట్స్ సంస్థ విరాళం కింద నిర్మించిన నూతన పోటులో ట్రయల్ రన్ చేశారని, త్వరలోనే పూర్తి స్థాయిలో కొత్త పోటు ప్రారంభిస్తామని చైర్మన్ మీడియాతో చెప్పారు. శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్ర నాథ్, పోటు పేష్కార్ శ్రీనివాస్, విజివో బాలిరెడ్డి, ఏవి ఎస్వో గంగరాజు చైర్మన్ వెంట ఉన్నారు.
గుంటూరు జిలా తాడేపల్లి మండలం చిర్రావూరు కు చెందిన కాటూరి రాము టీటీడీ కి 2 టన్నుల వివిధ రకాల ఊరగాయలను శుక్రవారం బహూకరించారు. అన్నదానం భవనంలో ఆయన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ద్వారా ఊరగాయలను అందించారు. స్వామివారి అన్న ప్రసాదంలో భక్తులకు వీటిని వడ్డించాలని దాత కోరారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, భక్తులకు శ్రీవారి అన్నప్రసాదంలో వడ్డించడానికి ఈ పచ్చడి ఎంతగానో సహాయ పడుతుందన్నారు. ఇటీవల కాలంలో భక్తులు శ్రీవారిపై భక్తిని అన్నదానంలోకి పనికివచ్చే వాటిని వితరణ చేసి ప్రదర్శించుకోవడం శుభపరిణామన్నారు. అశేష భక్తకోటికి జరిగే అన్నదాన కార్యక్రమంలో ఖచ్చితంగా వీటిని అందిస్తామని దాతలకు హామీ ఇచ్చారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సలహా మండలి సభ్యులు పి. పెంచలయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారతదేశంలో వేలంటైన్స్ డేని జనజాగ్రుతి సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని...పాశ్చాత్య సంస్క్రుతి పేరుతో ఆ ఒక్కరోజే కోట్ల రూపాయల కండోమ్ ల వ్యాపారం చేసుకుంటున్నారని సంస్థ ప్రతినిధులు మండిపడ్డారు. విశాల భారత దేశంలో విచ్చలవిడి శ్రుంగారానికి జనజాగ్రుతి సమితి వ్యతిరేకమన్నారు...
మీడియారంలో జర్నలిస్టుగా కెరీర్ పదిలంగా ఉండేలా చూసుకోవునే వారికి పర్శనల్ రిలేషన్స్ చాలా బాగా వుండాలి. అలా ఏ జర్నలిస్టు అయితే ఆ తరహా సత్సంబంధాలు అన్ని వర్గాల ప్రజలతోపాటు, ప్రభుత్వ అధికారులతోనూ జర్నలిస్టు అనేవాడు మెయింటేన్ చేయాలి. అలా చేయాలంటే ఏంచేయాలనే ప్రశ్న జర్నలిస్టు అయిన ప్రతీ ఒక్కరికీ మదిలో తొలిచేస్తూ వుంటుంది. మనం ఏ ప్రాంతంలో అయితే పనిచేస్తున్నామో, లేదంటే ఏ ప్రభుత్వ శాఖలపై మనం వార్తలు రాస్తుంటామో సంబంధిత అధికారులతో మంచి పరిచియాలు వుండాలి. ఆయా శాఖలకు సంబంధించిన ప్రతీ అంశాన్నీ ముందుగా మనమే వార్తల్లా రాస్తుండాలి. చేసిన పనుల్లో తేడాలు వచ్చినా, అలసత్వం ప్రదర్శించినా, తక్కు పనిచేసి ఎక్కువడా చూపుకున్నట్టు ప్రయత్నాలు చేసినా, అసలు చేయకుండా చేసినట్టు కాగితాలపై లెక్కలు చూపాలని ప్రయత్నం చేసినా వాటిని కూడా ఆధారాలతో అటు ప్రభుత్వానికి ఇటు పాఠకులకు కళ్లకు కట్టేలా మంచి వార్తా కధనాలు రాయాలి. అంతేకాకుండా ఆయా ప్రభుత్వశాఖల్లో చేయబోయే పనులను ప్రత్యేక కథనాలుగా రాయడానికి ప్రయత్నం చేయాలి. మధ్య మధ్యలో మంచి అధికారులు, విధినిర్వహణలో సేవా భావంతో పనిచేసే అధికారులపై స్పూర్తిదాయకమైన కధనాలు, డిఫరెంట్ స్టోరీలు రాస్తుండాలి. అలా మంచి మంచి కధనాలు రాయడం ద్వారా ఆయాశాఖల అధికారులు మనల్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు. అదే సమయంలో జరుగుతున్న అవినీతిపైనా, ఉద్యోగం పేరుతో వివిధ పనులపై తరచూ బయటకు వెళ్లపోవాలని చూసే అధికారులను, సిబ్బందిని ఓ కంట కనిపెడుతూ అప్పుడప్పుడు చురకలు అంటించే విధంగా ఆధారాలతో పాటు వార్తలు రాస్తుండాలి. అలా రాయడం ద్వారా జర్నలిస్టులంటే మంచి గౌరవంతోపాటు, అ విలేఖరికి తెలిస్తే తేడా వ్యవహారాలను కూడా తడుముకోకుండా రాసేస్తారాయన అనే విధంగా మనం వ్యవహరించాలి. అలా చేయడం ద్వారా సమాజంలో మనం మంచి జర్నలిస్టుగా గుర్తింపు తెచ్చుకోవడాని వీలుపడుతుంది. అవికూడా తరచుగా ఆయాశాఖల కోసం రాస్తూనే ఉండాల్సి వస్తుంది. లేదంటే మనల్ని అధికారులు కూడా మరిచిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. చాలా మంది జర్నలిస్టులు అవసరం వుంటే తప్పా అధికారులతో మాట్లాడటానికి ఇష్టపడరు. కానీ మనకి అవసరం వున్నా, లేకపోయినా అధికారులతో ఏదో ఒక విషయంలో మాట్లాడుతుండటం వంటివి చేస్తుండాలి. అలా చేయడం ద్వారా సదరు అధికారులు జర్నలిస్టులను గుర్తుంచుకోవడానికి వీలుంటుంది. మనం ఏ జిల్లాలో పనిచేసినా మనం చూసే ప్రభుత్వశాఖలు, రాజకీయపార్టీల నాయకులు, అటెండరు దగ్గర నుంచి ఐఏఎస్ అధికారుల వరకూ మనల్ని గుర్తుంచుకోవాలంటే మనం ఏవిధంగా వారితో వ్యవహరించాలి, ఏ విధమైన వార్త కధనాలు రాయాలి, ఏ తరహా అభివ్రుద్ధి కార్యక్రమాలను, చేయబోయే పనులను, చేసిన పనులకు అధికారులకు వచ్చే గుర్తింపు ఒక జర్నలిస్టు ఏవిధంగా మంచి కధనాలు రాస్తే సదరు అధికారులకు ఆ జర్నలిస్టు చిరస్థాయిగా గుర్తుంటాడు తదితర విషయాలు రేపటి పాఠంలో చర్చిద్ధాం.. ఔత్సాహిక యువత జరలిస్టులుగా తమ కెరీర్ మీడియాలో ప్రారంభించాలనుకునే వారికి, నిరుపేద విద్యార్ధులకు, డబ్బు ఖర్చుచేసి జర్నలిజంలో శిక్షణ పొందలేని వారికి ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా మరియు www.ensliv.net న్యూస్ వెబ్ సైట్ ద్వారా ఉచితంగా అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఉచిత ఆన్ లైన్ పాఠాలను ప్రారంభించింది. జర్నలిజం కోసం ఉచితంగా అన్ని అంశాలపై పాఠాలు పూర్తయిన తరువాత ఉచితంగానే వెబినార్ల ద్వారా లైవ్ గా శిక్షణ ఇవ్వాలని కూడా సంకల్పించాం. దానికోసం జర్నలిజం పట్ల ఆశక్తి ఉన్నవారు ఎవరైనా ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా ఈ పాఠాలన్నీ ఉచితంగానే చూసే వీలుంది. వెంటనే యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని ఉచిత పాఠ్యాంశాలు చదివి అవగాహన పెంచుకుంటారని ఆశిస్తున్నాం. అంతేకాదు బాగా అవగాహన పెంచుకున్న వారికి నేరుగా లైవ్ లో శిక్షణ ఇవ్వడానికి కూడా ఈఎన్ఎస్ లైవ్ యాప్ సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా ఔత్సాహికులు గుర్తించాలి. ఈ ట్రైనింగ్ ఎపిసోడ్ లో బాగా అన్ని అంశాలపై శిక్షణ తీసుకున్నవారు, ఆశక్తి పెంచుకున్నవారు జర్నలిస్టులుగా మారడానికి ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా అవకాశం కల్పిస్తాం. ఒక వార్తను న్యూస్ ఫార్మాట్ లో ఏ విధంగా రాయాలో కూడా శిక్షణ ఇస్తాం. మంచి జర్నలిస్టులుగా తీర్చిదిద్దుతాం. భారతదేశానికి వైద్యులు, ఇంజనీర్లు, మేధావులు, ప్రభుత్వాలు ఎంత అవసరమో...వాస్తవాలను వెలికి తీసే మంచి జర్నలిస్టుల అవసరం నానాటికీ పెరుగుతూ వస్తుంది. ఆ లోటును భర్తీచేయడానికి మీరూ ముందుకి రావాలనుకుంటే ఈఎన్ఎస్ లైవ్ యాప్ తో చేతులు కలపండి. మంచి జర్నిలిస్టుగా కెరీర్ ప్రారంభించి దేశానికి మీవంతు సహాయం అందించండి..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులలో తిరుమల వెళ్ళి దైవ దర్శనం చేసుకునే ప్రయాణికుల సౌకర్యార్థం, ప్రతి రోజు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో రూ.1000 దైవ దర్శనం టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో తిరుమలకు విచ్చేయు ప్రయాణికులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ అమూల్యమైన అవకాశం కల్పించారు. ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ఛార్జీతోపాటు 300 రూపాయలు అదనంగా చెల్లించి బస్సులోనే శీఘ్ర దర్శనం టికెట్ పొందవచ్చు. ప్రతి రోజు ఉదయం 11. 00 గంటలకు మరియు సాయంత్రం 4.00 గంటలకు ఈ శీఘ్ర దర్శనం ఏర్పాటువుంటుంది. తిరుమల బస్సు స్టేషన్ చేరుకున్న తర్వాత శీఘ్ర దర్శనం చేసుకొనుటకు ప్రయాణికులకు RTC సూపర్ వైజర్లు దర్శన నిమిత్తం సహాయం చేస్తారు. తిరుపతి వెళ్లే ప్రయాణికులు ముందుగా RTC బస్సులలో శీఘ్ర దర్శనం టికెట్ పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని టిటిడి, APSRTC అధికారులు కోరుతున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రతి రోజు తిరుపతికి 650 బస్సులు నడుపుతున్నది. ప్రతి డిపో నుంచి తిరుపతికి బస్సు సౌకర్యం ఉంది. బెంగుళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుండి దైవ దర్శనం కొరకు వచ్చు ప్రయాణికులకు ఇది చాలా మంచి సౌకర్యంగా వుంటుంది.
మీడియా రంగంలో జర్నలిస్టుగా కెరీర్ మొదలు పెట్టేవారంతా మంచి జర్నలిస్టుగా రాణించాలన్నా, పాఠకుల్లో గుర్తింపు తెచ్చుకోవాలన్నా ప్రధానంగా పంచ సూత్రాలు పాటించాల్సి వుంటుంది. ముందుగా చక్కనైన భాషను మనం రాసే వార్తల్లో వినియోగించాలి, పాఠకుడిని వార్త మొత్తం చదివించేలా చక్కటి వాడుక బాష పదాలను వార్తాలో రాయాలి, రాసే వార్తలో కొత్తదనం కనిపిస్తూ వైవిధ్యభరితంగా ఉండాలి, వార్తకు అనుగుణంగా మంచి ఫోటోలను వినియోగించాలి, చూడగానే గుర్తుండిపోయేలా మంచి శీర్షికను రాసే జర్నలిస్టే పెట్టే సామర్ధ్యం సంపాదించాలి. ఈ పంచసూత్రాలు ఒక జర్నలిస్టు ఏరోజైతే చక్కగా వినియోగించి పాటించడం మొదలు పెడతాడో అపుడు ఆ జర్నలిస్టుకి మంచి గుర్తింపు వస్తుంది. అంతేకాదు మనం ఏదైతే డేట్ లైన్ తో వార్తలు రాస్తామో, ఆయా మీడియా సంస్థలు మనకి ఇచ్చే గుర్తింపుకి వన్నె తీసుకు రావాలి. అది ఏ స్థాయిలో ఉండాలంటే ఈరోజు పలానా డేట్ లైన్ వార్త కోసం పాఠకుడు పత్రికను చూడాలి, అదే మీడియా రంగంలో అయితే ఆ జిల్లాల వార్తకోసం ఛానల్ చూస్తూ వుండాలి, న్యూస్ ఏజెన్సీలు నిర్వహించే వెబ్ సైట్ అయితే మంచి వార్తల నోటిఫికేషన్ కోసం పాఠకులు ఎదురు చూడాలి, మొబైల్ యాప్ విషయానికొస్తే ఆ రిపోర్టర్ ఇచ్చే న్యూస్ కార్డ్ కోసం ఆత్రుతగా వేచిఉండాల.. ఇలా ఒక జర్నలిస్టు పంచసూత్రాలతో ఎపుడైతే వార్త కధనాలను పాఠకులకు అందిస్తాడో ఆ రోజున మంచి గుర్తింపు వస్తుంది. ఏడాదికో శివరాత్రి అన్నట్టు ఒకటీ అరా మంచి వార్తలు రాసినంత మాత్రన ఆ గుర్తింపు రాదు. అనునిత్యం మనం రాసే వార్తల్లో కొత్తదనం కనిపిస్తూనే ఉండాలి. దానికోసం నిరంతరం శ్రమించి పనిచేస్తే తప్పా మంచి జర్నలిస్టు అనే గుర్తింపుని నిలబెట్టుకోవడం కష్టం అవుతుంది. ఉదాహరణకు ఒక్కో పత్రికలో ప్రముఖంగా భూ ఖబ్జాలు వార్తలు మాత్రమే వస్తుంటాయి. మరికొన్ని పత్రికల్లో ప్రముఖుల జీవిత చరిత్రలు, వారు చేసిన సేవలు మాత్రమే వస్తుంటాయి. ఇంకొన్ని పత్రికల్లో సినిమాలు, సాధారణ, ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు సంబంధించిన వార్తలు వస్తుంటాయి. ఇక ప్రధాన పత్రికలైతే అన్ని రకాల వార్తలను తమ పత్రికలో వివిధ పేజీల్లో ప్రత్యేక కథనాలుగా పాఠకుడికి అందిస్తాయి. ఒక అవినీతివార్త మనకి తెలిస్తే తెలిసింది అని రాయడం వలన ఆ వార్తకు గుర్తింపు రాదు. పలాన చోట ఇంత మొత్తంలో అవినీతి జరిగిందని ఎపుడైతే ఆ జర్నలిస్టు ఆధారాలతో సహా వార్తలు రాస్తాడో అపుడు ఆ వార్తకు పాఠకుల నుంచి మంచి స్పందన వచ్చి ఆ వార్త రాసిన వ్యక్తికి గుర్తింపు వస్తుంది. అలా మనకి అవినీతి వార్తలు, విషయలు మనకి డైరెక్టుగా తెలుస్తాయా? మనం పెద్ద పత్రికలు, టీవీ ఛానళ్లు, న్యూస్ ఏజెన్సీలు, న్యూస్ యాప్స్ లో పనిచేస్తున్నామని అందరూ మనదగ్గరకి వచ్చి చెప్పేస్తారా? అంటే అవేమి జరగవనే చెప్పాలి. దానికోసం మనం ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాలి. అన్ని వర్గాల వారితో ఎప్పుడూ మాట్లాడుతూ, వారి సాదక బాధలను వార్తలుగా రాస్తూ ఉండాలి, ఎపుడైనా వారికి సహాయం కావాల్సి వస్తే ఒక జర్నలిస్టుగా సహాయం చేస్తూ రావాలి. ఆ విధంగా చేయడం ద్వారా మనకి వివిధ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అలా అందిన ప్రాధమిక సమాచారంతో మనకున్న నెట్వర్క్ ను వినియోగించి వార్తకు కావాల్సిన ఆధారాలు సేకరించి ప్రత్యేక కధనం రాస్తే ఆ వార్తకు మంచి ఆదరణ వస్తుంది. అదే ప్రభుత్వ శాఖలో జరిగిన అవినీతి వార్త అయితే సదరు ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం వుంటుంది. అసలు ప్రభుత్వ శాఖల నుంచి మనకి సమాచారం ఎలా అందుతుంది? ఎవరు ఇస్తారు? ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఏ విధంగా చోటుచేసుకుంటుంది? ప్రభుత్వ శాఖల్లో ప్రజలకు సేవ చేసేవారు ఉంటారా? అలా ఉంటే వారికోసం ఏ విధమైన వార్త కధనాలు రాయాలి? ఎలా రాస్తే మనం అనుకున్న సమాచారం మనకి అందుతుంది? అది ప్రభుత్వశాఖల్లోని సిబ్బంది, అధికారుల ద్వారా ఎలా వైరల్ అవుతుంది? తదితర అంశాలను రేపటి పాఠంలో చర్చిద్దాం.. ఔత్సాహిక యువత జరలిస్టులుగా తమ కెరీర్ మీడియాలో ప్రారంభించాలనుకునే వారికి, నిరుపేద విద్యార్ధులకు, డబ్బు ఖర్చుచేసి జర్నలిజంలో శిక్షణ పొందలేని వారికి ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా మరియు www.ensliv.net న్యూస్ వెబ్ సైట్ ద్వారా ఉచితంగా అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఉచిత ఆన్ లైన్ పాఠాలను ప్రారంభించింది. జర్నలిజం కోసం ఉచితంగా అన్ని అంశాలపై పాఠాలు పూర్తయిన తరువాత ఉచితంగానే వెబినార్ల ద్వారా లైవ్ గా శిక్షణ ఇవ్వాలని కూడా సంకల్పించాం. దానికోసం జర్నలిజం పట్ల ఆశక్తి ఉన్నవారు ఎవరైనా ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా ఈ పాఠాలన్నీ ఉచితంగానే చూసే వీలుంది. వెంటనే యాప్ ని డౌన్ లోడ్ చేసుకొని ఉచిత పాఠ్యాంశాలు చదివి అవగాహన పెంచుకుంటారని ఆశిస్తున్నాం. అంతేకాదు బాగా అవగాహన పెంచుకున్న వారికి నేరుగా లైవ్ లో శిక్షణ ఇవ్వడానికి కూడా ఈఎన్ఎస్ లైవ్ యాప్ సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా ఔత్సాహికులు గుర్తించాలి. ఈ ట్రైనింగ్ ఎపిసోడ్ లో బాగా అన్ని అంశాలపై శిక్షణ తీసుకున్నవారు, ఆశక్తి పెంచుకున్నవారు జర్నలిస్టులుగా మారడానికి ఈఎన్ఎస్ లైవ్ యాప్ ద్వారా అవకాశం కల్పిస్తాం. ఒక వార్తను న్యూస్ ఫార్మాట్ లో ఏ విధంగా రాయాలో కూడా శిక్షణ ఇస్తాం. మంచి జర్నలిస్టులుగా తీర్చిదిద్దుతాం. భారతదేశానికి వైద్యులు, ఇంజనీర్లు, మేధావులు, ప్రభుత్వాలు ఎంత అవసరమో...వాస్తవాలను వెలికి తీసే మంచి జర్నలిస్టుల అవసరం నానాటికీ పెరుగుతూ వస్తుంది. ఆ లోటును భర్తీచేయడానికి మీరూ ముందుకి రావాలనుకుంటే ఈఎన్ఎస్ లైవ్ యాప్ తో చేతులు కలపండి. మంచి జర్నిలిస్టుగా కెరీర్ ప్రారంభించి దేశానికి మీవంతు సహాయం అందించండి..!
హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండో విడతలో 500 ఆలయాల నిర్మాణానికి సమరసత సేవా ఫౌండేషన్, సంస్కృతి సంవర్ధిని సంస్థల ద్వారా శ్రీకారం చుట్టాలని టిటిడి నిర్ణయించింది. ఆయా సంస్థల ప్రతినిధులు, హెచ్‌డిపిపి అధికారులతో టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి తిరుపతి పరిపాలనా భవనంలోని తమ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఎపిలో సమరసత సేవా ఫౌండేషన్ కార్యక్రమాలు చక్కగా ఉన్నాయని ప్రశంసించారు. ఆ సంస్థ నిర్వహిస్తున్న బాలవికాస కేంద్రాలకు ఆధ్యాత్మిక, దేశభక్తిని పెంపొందించే పుస్తకాలు పంపాలని అధికారులను ఆదేశించారు. ఈ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లకు శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. మారుమూల గ్రామాల్లోని ఎస్సి, ఎస్టీ మత్స్యకార కాలనీల్లో అర్చక వృత్తిపై ఆధారపడ్డవారికి షోడశ సంస్కారాలపై ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించాలని హెచ్‌డిపిపి అధికారులను ఆదేశించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇదివరకే టిటిడి నిర్మించిన 500 ఆలయాల్లో కల్యాణోత్సవం ప్రాజెక్టు ద్వారా శ్రీనివాస కల్యాణాలు నిర్వహించాలన్నారు. ఈ ఆలయాల కోసం టిటిడి ఇప్పటికే కొనుగోలుచేసిన మైక్‌సెట్లు, గొడుగులు, భజన సామగ్రి, పెన్‌డ్రైవ్‌ల ద్వారా అన్నమయ్య సంకీర్తనలు అందించాలని ఆదేశించారు.
ఎపిలో సమరసత సేవా ఫౌండేషన్, తెలంగాణలో సంస్కృతి సంవర్ధిని సంస్థల ద్వారా 500 ఆలయాల నిర్మాణానికి అనుమతి కోసం రాబోయే హెచ్‌డిపిపి కార్యవర్గ సమావేశానికి ప్రతిపాదనలు సమర్పించాలని ఈవో చెప్పారు. నూతనంగా నిర్మించే ఒక్కో ఆలయానికి టిటిడి రూ.10 లక్షల వరకు సమకూర్చనుందని ఈవో వెల్లడించారు. ఆలయాల నిర్మాణానికి అనువైన స్థలం ఎంపిక చేసే బాధ్యతను ఆ రెండు సంస్థలకు అప్పగించారు. గ్రామ గ్రామాన హిందూ ధర్మ విస్తృత ప్రచారం కోసం టిటిడి ధర్మరథాలు సిద్ధం చేస్తోందన్నారు. ఇవి రాగానే ఇప్పటికే నిర్మించిన 500 ఆలయాలకు వెళ్లేలా రూట్‌మ్యాప్ తయారు చేయాలన్నారు. ఆయా గ్రామాల్లోని శ్రీవారి భక్తులకు తిరుమలలో శ్రీవారిసేవ చేసే అవకాశం కల్పిస్తామని ఈవో చెప్పారు. జిల్లా కేంద్రాల్లో ఉన్న టిటిడి కల్యాణమండపాలను ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో ఎఫ్ఏ అండ్ సిఏవో బాలాజి, చీఫ్ ఇంజినీర్ రమేష్‌రెడ్డి, హెచ్‌డిపిపి కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్, సమరసత ఫౌండేషన్ కార్యదర్శి త్రినాథ్, సంస్కృతి సంవర్ధిని ప్రతినిధి అమరలింగన్న పాల్గొన్నారు.