1 ENS Live Breaking News

2021-01-04 11:57:37

సమాచారశాఖకి పూర్తిస్థాయి వెబ్ సైట్ ఎక్కడ..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సమాచార పౌర సంబంధాల శాఖ నేటికీ పూర్తిస్థాయి వెబ్ సైట్ కి నోచుకోలేదు..కేంద్రంలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పిఐబీ) మాదిరి అన్ని రాష్ట్రాల్లోనూ సమాచారశాఖ అన్ని జిల్లాలు, అన్ని ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖల సమాచారం, జీఓలు తెలియజేయడానికి రాష్ట్రప్రభుత్వం సమాచారశాఖకు ఒక పూర్తిస్థాయి వెబ్ సైట్ ఉండాలి. సదరు వెబ్ సైట్ నుంచే మీడియా, పత్రికలు విషయాన్ని తీసుకోవాలి. రాష్ట్రంలో జరిగే అభివ్రుద్ధి కార్యాక్రమాలు, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రుల పర్యటనలు ప్రభుత్వ శాఖల తాజా సమాచారాన్ని ఆ వెబ్ సైట్ లో పొందుపరచాలి. ఈ విధంగానే కేంద్ర ప్రభుత్వం అన్నిప్రభుత్వ శాఖలు, ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ఇతర మంత్రిత్వ శాఖలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని పీఐబీ వెబ్ సైట్ లో అందుబాటులో వుంచుతుంది. దానిని అన్ని మీడియా సంస్థలు తీసుకొని, వాటికి కొంత సమాచారాన్ని జోడించి ప్రజలకు వార్తల రూపంలో తెలియజేస్తాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఏం చేస్తుందనే విషయం అటు విద్యావంతులు, ప్రజలు తెలుసుకోవడానికి వీలుపడుతుంది. ప్రభుత్వ శాఖల అధికారులు, మంత్రులు, సీనియర్ ఐఏఎస్ ల సమాచారం ఈ వెబ్ సైట్ లో పెట్టడం ద్వారా  మీడియా సంస్థలు కూడా రాష్ట్ర అభివ్రుద్ధికి సంబంధించిన సమస్త సమాచారాన్ని ఈ వెబ్ సైట్ నుంచి సేకరించి ప్రజలకు తెలియజేసే ఆస్కారం వుంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖలకు వెబ్ సైట్లు పెట్టినప్పటికీ, ప్రత్యేకంగా రాష్ట్రప్రభుత్వానికి, అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ శాఖలు, జిల్లా కలెక్టర్ల పర్యటనలు, ఇతర అభివ్రుద్ధి కార్యక్రమాల సమాచారం తెలియజేసేందుకు సమాచారశాఖకు మాత్రం నేటికీ పూర్తిస్థాయి వెబ్ సైట్ ను అందుబాటులోకి తేలేదు. అన్నిజిల్లాల్లో జిల్లాకి సంబంధించిన వెబ్ సైట్లు ఉన్నప్పటికీ కనీసం అందులో సైతం సమాచారశాఖ ప్రభుత్వ శాఖలకు చెందిన రోజువారీ సమాచారం గానీ, ప్రెస్ నోట్లుగానీ అందుబాటులో ఉంచడం లేదు. సీఎంఓ ప్రెస్ నోట్లు సైతం కొన్ని మీడియా సంస్థలకే సమాచారం అందుతోంది మంత్రులు పీఆర్వోలు ఉన్నా లేనట్టే.. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అందరు మంత్రులకు వేలకు వేలు జీతాలు వెచ్చించి పీఆర్వోలను ఏర్పాటు చేసింది. వాళ్లంతా మంత్రుల పర్యటనలు, కార్యక్రమాలను టీవి ఛానళ్లకు స్క్రోలింగ్ పాయింట్స్ ఇస్తున్నారు తప్పితే  ప్రతీరోజూ ప్రజల ముంగిటకు వెళ్లే పత్రికలకు న్యూస్ ఫార్మాట్ లో ప్రెస్ నోట్లు మాత్రం పంపడం లేదు. కాదు కాదు పంపడం వచ్చే పీఆర్వోలు లేరు. మంత్రులు ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాలోని పత్రికలు, మీడియా సంస్థల రిపోర్టర్లను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి అందులో స్క్రోలింగ్ పాయింట్లును మాత్రమే అందిస్తున్నారు. ఇలా చేయడంతో పత్రికలకు సమాచారం పూర్తిస్థాయిలో అందడటం లేదు. వాస్తవంగా రాష్ట్రానికి ఒక శాఖకు మంత్రి అంటే ఆ మంత్రికి సంబంధించిన సమస్త సమాచారం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పంపించాల్సిన అవసరం ప్రభుత్వం మంత్రి దగ్గర ఏర్పాటు చేసిన పీఆర్వోపై వుంది. కానీ మంత్రుల దగ్గర పనిచేసే కొందరు పీఆర్వోలు ఆ నియోజకవర్గానికి, జిల్లాకే పరిమితం అవుతున్నారు. తమకు సంబంధించిన పత్రికల్లో వార్తలొస్తే చాలులే అన్నట్టుగానే మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వంలోని సమాచారశాఖకి పూర్తిస్థాయి వెబ్ సైట్ లేని కొరత, ఇబ్బంది మీడియా సంస్థలకు కొట్టొచ్చిన్నట్టు కనిపిస్తుంది. అదే రాష్ట్రంలో సమాచారశాఖ వెబ్ సైట్ వుంటే అపుడు ఖచ్చితంగా అన్నిశాఖల మంత్రులకు చెందిన సమాచారాన్ని ఇటు డీపీఆర్వోలు, అటు మంత్రుల దగ్గర పీఆర్వోలు ఆ వెబ్ సైట్ లో న్యూస్ ఫార్మాట్ రూపంలో ప్రెస్ నోట్లు పొందు పరచడం వలన రాష్ట్రంలోని అన్ని మీడియా సంస్థలకు సమాచారం తెలిసే అవకాశం వుంది. అటు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సొంత పీఆర్వోలను ఏర్పాటు చేసుకొని వారికి తమ ప్రాంతంలోని నచ్చిన మీడియా సంస్థలకే తమ నేతల సమాచారాన్ని పంపుతుండటం కూడా విశేషం. ప్రభుత్వ శాఖల సమాచారం ఇవ్వని డీపీఆర్వోలు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ శాఖల సమాచారాన్ని మీడియాకి ఇచ్చే సమాచారశాఖ అధికారులు రాష్ట్ర విభజన తరువాత జిల్లాలకే పరిమితం అయిపోయారు. వాస్తవానికి పక్కజిల్లాల మీడియా సంస్థలకు సమాచారాన్ని మెయిల్ రూపంలో పంపడం ద్వారా అధికారులు ఒక్క రూపాయి కూడా  ఖర్చు అవదు. కానీ మాజిల్లా అధికారుల సమాచారం మా జిల్లాల్లో వస్తే చాలు పక్కజిల్లాలకు కూడా ఎందుకు అన్నట్టు మాట్లాడుతున్నారు సమాచారశారశాఖ అధికారులు. ఒక్కముక్కలో చెప్పాలంటే మేము పక్కజిల్లాల మీడియాకి ప్రెస్ నోట్లు పంపంమని తెగేసి చెబుతున్నారు. రాష్ట్రంలో రెండు మూడు జిల్లాలకు చెందిన డీపీఆర్వోలు మాత్రం తమ జిల్లా అధికారుల సమాచారాన్ని అన్ని జిల్లాలకు పంపుతున్నారు. తద్వారా సదరు జిల్లాల్లో జరిగిన అభివ్రుద్ధి కార్యక్రమాలు పక్కజిల్లాలకు కూడా తెలుస్తున్నాయి. ఇదే సమయంలో సమాచారశాఖ ఉన్నతాధికారులు సైతం ఈ విషయం తమకేమీ పట్టదన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఎందుకు పక్కజిల్లాల మీడియా సంస్థలకు ప్రభుత్వ శాఖల సమాచారం పంపించలేదనే విషయాన్ని ప్రశ్నించకపోవడంతో అధికారులు తాము అనుకున్నదే సాధించినట్టు ఫీలైపోతున్నారు. అందులోనూ సిబ్బంది కొరత కూడా సమాచారశాఖను వేధిస్తోంది. కొత్తగా 13 జిల్లాల్లోనూ ఏపీఆర్వోలను ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నా అందులో ఏ ఒక్కరికీ ప్రెస్ నోట్లు రాయడం చేతకకపోవడంతో వారిని డిపీఆర్వోలు కార్యాలయ పనులకి వినియోగిస్తున్నారు. సమాచారశాఖ ఎలాగూ అన్ని జిల్లాలకు సంబంధించిన వెబ్ సైట్ రూపొందించలేదు. కనీసం జిల్లాల డీపీఆర్వోలను ఆదేశిస్తే..ఆ వెబ్ సైట్ వచ్చేంత వరకైనా రాష్ట్రంలోని అన్ని జిల్లాల సమాచారం అన్ని జిల్లాల్లో ఉండే మీడియాకి తెలుస్తుందనే కోణంలో ఆలోచించకపోవడం గమనార్హం.  అన్ని ప్రభుత్వశాఖలకు ప్రత్యేకంగా వెబ్ సైట్లు, యాప్ లను నిర్మించిన ప్రభుత్వం ఒక్క సమాచారశాఖ విషయంలోనే అన్ని జిల్లాల సమాచారం రాష్ట్రంలోని అన్ని మీడియా సంస్థలకు అందించాలనే కోణంలో ఎందుకు ఆలోచించడం లేదో తెలియడం లేదు.. ఈ విషయంలో రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి మరి..! 

Tadepalle

2021-01-04 10:33:38

2021-01-03 19:50:04

2021-01-03 19:34:33

2021-01-03 12:49:54

2021-01-03 10:40:32

2021-01-03 09:43:21

2021-01-03 09:31:01

ఏపీలో ప్రముఖ వెబ్సైట్ లు హ్యాకింగ్..

ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ న్యూస్ వెబ్ సైట్లు, ప్రభుత్వ శాఖల వెబ్ సైట్లు హ్యాకింగ్ కి గురవుతున్నాయి. ఎంత గట్టిగా సెక్యూరిటీలు, యాంటీ వైరస్ లు వినియోగిస్తున్నా చాలా న్యూస్ వైబ్ సైట్లు, ముఖ్యమైన కంపెనీలకు చెందిన వెబ్ సైట్లు, ప్రభుత్వ శాఖలోని శాఖలకు చెందిన వెబ్ సైట్లు హాకర్ల బారిన పడకుండా ఎవరూ ఆపలేకపోతున్నారు. కొందరు అదేపనిగా న్యూస్ వెబ్ సైట్లను చెడగొట్టే పనిలో ఉన్నారని సమాచారం. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే హ్యాకింగ్ అయిన న్యూస్ వెబ్ సైట్ లలో కంటెంట్ మాత్రమే పోతుంది. దానికి నిర్వాహకులు ప్రత్యేకంగా సొంత హోస్టింగ్ సర్వర్ లను తీసుకుంటున్నారు. గతంలో గ్రూపు హోస్టింగ్ పద్దతిలో న్యూస్ వెబ్ సైట్లు హోస్టింగ్ జరిగేవి. అలా గ్రూపు వెబ్ సైట్లు హోస్టింగ్ ఇచ్చే సర్వర్లు కూడా డేటా సెక్యూరిటీ విషయంలో ప్రత్యేకంగా డేటాను భద్రం చేయడంలో విఫలం అవుతున్నాయి. కొద్ది మొత్తానికి డేటాను కూడా ఎలా దాచిపెట్టి ఉంచాలా అన్నట్టు మాట్లాడుతున్నారు ప్రైవేటు హోస్టింగ్ సర్వర్ నిర్వాహకులు. దీనితో ఈ సమయంలోనే కొన్ని వెబ్ సైట్లకు వచ్చిన రేటింగ్ ను చెడగొట్టడానికి హ్యాకర్లు వ్యూవర్ షిప్ అధికంగా వున్న న్యూస్ వెబ్ సైట్లపై కన్నేసి వాటిని పక్కదారి పట్టిస్తున్నారు. ఫలితంగా సదరు న్యూస్ వెబ్ సైట్ ను గుగూల్ లో సెర్చ్ చేస్తుంటే వేరొక వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. దానికోసం హ్యాకర్లు న్యూస్ వెబ్ సైట్ కి ట్యాగ్ లైన్లను కోడింగ్ తోనే మార్చేస్తున్నారు. అలాంటి హ్యాకర్ల బారి నుంచి తప్పించుకోవడానికి చిన్న చిన్న న్యూస్ వెబ్ సైట్లకు చాలా ఖర్చుతో కూడుకున్న పని. దీనితో ఒక వెబ్ సైట్ హ్యాకింగ్ కి గురైతే మరోక వెబ్ సైట్ ను రూపొందించుకంటున్నారు నిర్వాహకులు. మరికొందరు ముందడుగు వేసి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా, ఉపయోగం అయితే పెద్దగా ఏమీ కనిపించడం లేదు. న్యూస్ వెబ్ సైట్లను కాపాడుకోవడానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. మరికొందరు ఇదే హ్యాకింగ్ ను వ్రుత్తిగా చేసుకొని కొన్ని కేసుల్లో పోలీసులకు, సైబర్ క్రైమ్ విభాగానికి ఊచలు లెక్కిస్తున్నా..బయటకు వచ్చి కూడా మళ్లీ హ్యాకింగ్ లు చేస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సెక్యూరిటీ సిస్టమ్ ఏర్పాటు చేస్తే న్యూస్ వెబ్ సైట్లకే కాదు, ప్రభుత్వ శాఖల వెబ్ సైట్లకు కూడా రక్షణ ఉండదనే విషయాన్ని గుర్తించాలి..!

Tadepalle

2021-01-03 09:29:52

2021-01-02 20:09:28

2021-01-02 19:53:04

2021-01-02 19:49:15

2021-01-02 19:40:47

భక్తిభావాన్ని పంచిన పారాయ‌ణం..

ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై శ‌ని‌‌వారం ఉద‌యం సుందరకాండలోని 31వ సర్గ నుంచి 35వ సర్గ వరకు ఉన్న 196 శ్లోకాలను దాదాపు 200 మంది వేద పండితులు అఖండ పారాయ‌ణం చేశారు. ఈ కార్యక్రమం ఆద్యంతం భక్తిభావాన్ని పంచింది. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు తమ ఇళ్ల నుంచే పారాయణంలో పాల్గొన్నారు. ఈ 8వ‌ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయణం ఉద‌యం 7 నుండి 9 గంటల వరకు జరిగింది. ఈ సందర్భంగా తిరుమ‌ల‌ ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్  కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని మాట్లాడుతూ, రామనామం ఎక్కడ పలికితే అక్కడ హనుమంతుడు ప్రత్యక్షమవుతాడని, హనుమంతుని అనుగ్రహం ఉంటే సకల కార్యాలు నెరవేరుతాయని చెప్పారు. రాముడు ఆచ‌రించిన ధ‌ర్మం లోకానికి ర‌క్ష అని, వేదోక్త‌మైన ధ‌ర్మా‌న్ని ఆచ‌రించ‌డం వ‌ల‌న ప్ర‌పంచంలోని మానవులు సిరిసంపదలు, ఆయురారోగ్యాల‌తో ఉంటార‌ని వివరించారు.            ఇప్ప‌టివ‌ర‌కు ఏడు విడ‌త‌ల్లో అఖండ పారాయ‌ణం జ‌రిగింది. జూలై 7న‌ మొద‌టి విడ‌త‌లో మొద‌టి స‌ర్గ‌లోని 211 శ్లోకాలు, ఆగ‌స్టు 6న రెండో విడ‌త‌లో 2 నుండి 7వ స‌ర్గ వ‌ర‌కు 227 శ్లోకాలు, ఆగ‌స్టు 27న మూడో విడ‌త‌లో 8 నుండి 11వ స‌ర్గ వ‌ర‌కు 182 శ్లోకాలు, సెప్టెంబ‌రు 12న నాలుగో విడ‌త‌లో 12 నుండి 14వ స‌ర్గ వ‌ర‌కు 146 శ్లోకాలు, అక్టోబ‌రు 4న ఐద‌వ విడ‌త 15వ సర్గ నుంచి 19వ సర్గ వరకు 174 శ్లోకాలను, నవంబరు 3న ఆరో విడ‌త 20వ సర్గ నుంచి 24వ సర్గ వరకు185 శ్లోకాలు, డిసెంబ‌రు 6న ఏడ‌వ విడ‌త 25వ‌‌ సర్గ నుంచి 30వ సర్గ వరకు ఉన్న మొత్తం 194 శ్లోకాలను  అఖండ పారాయ‌ణం జ‌రిగింది.             కాగా టిటిడి అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు  సుష్మ బృందం  " ఎదురా ర‌ఘుప‌తికి ...... " ‌, అనే సంకీర్త‌న‌ను కార్య‌క్ర‌మం ప్రారంభంలో,  ర‌ఘునాథ్ బృందం " శ్రీ హ‌నుమ జ‌య హ‌నుమ శ్రీ హ‌నుమ జ‌య హ‌నుమ‌......" అనే  సంకీర్త‌న‌ను కార్య‌క్ర‌మం ముగింపులో సుమ‌ధురంగా అల‌పించారు.        ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అదనపు ఈవో  ఏ.వి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, జాతీయ సంస్కృత వర్సిటి ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ దంప‌తులు, అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు  ద‌క్షిణామూర్తి, ఎస్వీ ఉన్న‌త వేదాధ్యయ‌న‌ సంస్థ ప్రాజెక్టు అధికారి  విభీష‌ణ శ‌ర్మ‌ తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2021-01-02 14:11:58

సీఎం వైఎస్ జగన్ కు వేదపండితుల ఆశీర్వచనం..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. నూతన సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్ సీఎంకి పూల బొకె ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ సీఎంతో కేక్ కట్ చేయించారు. అదేసమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి టిటిడి చైర్మన్ వైవిసుబ్బారెడ్డి తిరుమల అర్చకులతో వచ్చి సీఎంకి శుభాకాంక్షలు తెలియజేయడంతోపాటు శ్రీవారి ఫోటో, డైరీ, ప్రసాదం అందజేయడంతోపాటు ఆశీర్వచనం అందజేశారు. అదే విధంగా విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్ధానం వేద పండితులు, అధికారులు కూడా విచ్చేసి అమ్మవారి ప్రసాదాలు సీఎంకి అందజేసి ఆశీర్వచనాలు అందజేశారు. సిఎంఓలోని అన్ని శాఖల ప్రధాన కార్యదర్శిలు, సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా సీఎంకి నూతన సంత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారు, క్యాంపు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Tadepalle

2021-01-01 18:24:14