అనుకున్నదే అయ్యింది..కొందరు పనిగట్టుకొని ఆయన వీసిగా అర్హులు కారని ప్రచారం చేసినా ఫలితం లేకపోయింది.. ప్రభుత్వం మాత్రం ఆయనే ఏయూ విసీగా అర్హుడంటూ గుర్తించింది. ఆపై గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ దస్త్రంపై సంతకం చేశారు.. దీనితో ఆర్తనాదాలు చేసిన వారి గొంతులో పచ్చివెలక్కాయ్ తోపాటు అన్నీ పడ్డట్టు అయ్యింది. అందరి కోరిక, ఆకాంక్ష మేరకు చదువులమ్మ ముద్దుబిడ్డ ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వబూషన్ హరిచందన్ ఆమోదంతో నూతన వీసీగా ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి నియమితులయ్యారు. మూడేళ్ల కాలం ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. 2019 జూలై మాసం నుంచి ఆచార్య ప్రసాద రెడ్డి ఏయూకు ఇంచార్జి వీసీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పూర్తిస్థాయిలో వీసీగా బాధ్యతలను చేపట్టనున్నారు.
అసంపూర్తిగా మిగిలిపోయిన రహదారి పనులను వచ్చే ఏడాది మార్చి 31 వ తేదీ లోపున నిధులు మురిగిపోకుండా పూర్తి చేస్తే బాగుంటుందని రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) సూచించారు. బుధవారం తాడేపల్లిలో పంచాయితీరాజ్ శాఖ కమీషనర్ కార్యాలయం నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తీరుపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఇళ్ల స్థలాలు, నాడు-నేడు, వ్యక్తిగత మరుగుదొడ్లు, సి.సి. రోడ్లు నిర్మాణం, గ్రామ సచివాలయాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రానున్న ఆరు వారాలలో ప్రతీ వారం చేపట్టవలసిన పనులపై ముందస్తు ప్రణాళికను తయారు చేసుకొని నిర్ధేశించిన లక్ష్యాలను శతశాతం పూర్తిచేయాలని ఆయన అధికారులను కోరారు. మంత్రి పేర్ని నాని మచిలీపట్నం లోని తన కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది జులై , అక్టోబర్ మాసాల్లో పేమెంట్లు ఇచ్చారని ప్రతి నెల ఆయా మొత్తం మంజూరైతే , ఆయా పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవచ్చన్నారు. అదే విధంగా సిమెంట్ కావాలని ఇండెంట్ సమర్పించి ఎఫ్ టి ఓ జనరేట్ కాబడి పేమెంట్ జాప్యం అవుతుందన్నారు. కృష్ణాజిల్లాలో ఒక చిన్న సిమెంట్ కంపెనీకు పంపిణీ అప్పచెప్పడం వలన సిమెంట్ త్వరితగతిన అందడం లేదన్నారు. తమ జిల్లాలో ఇప్పటకీ 6 వేల టన్నుల సిమెంట్ పంపిణీ కావాల్సి ఉందని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ విధానంలో జాప్యం నివారించడానికి పంచాయితీరాజ్ శాఖ నంచి నగదు నేరుగా సిమెంట్ సరఫరా చేసే కాంట్రాక్టర్ ఖాతాలోకి జమ చేస్తే, సిమెంట్ త్వరితగతిన సరఫరా అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయేమో పరిశీలించాలని ఆయన కోరారు. 5 లక్షల లోపు నగదు ఒక వారం లోపున పేమెంట్ అవుతుందని అదే కనుక 5 లక్షల రూపాయలు డబ్బు దాటితే, అవి పేమెంట్ కావడానికి రెండు మూడు నెలల జాప్యం ఏర్పడుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ మాట్లాడుతూ జిల్లాలో యస్ఆర్ ఇజియస్ క్రింద 120 లక్షల పనిదినాలు సాధించాలని లక్ష్యంగా తీసుకున్నప్పటికీ మార్చినాటికి 150 లక్షల పనిదినాలు కల్పించే దిశగా ప్రణాళిక అములు చేస్తున్నానున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 107.95 లక్షల పనిదినాలు సాధించగా, డిశంబరులో ఈ లక్షలు. జనవరిలో 10 లక్షలు, ఫిబ్రవరిలో 12 లక్షలు. మార్చిలో 14 లక్షలు పాధించేదికగా వెళుతున్నామన్నారు. మెటీరియల్ కాంపోనెంట్ క్రింద రూ. 188.85 లక్షలకు గాను. రూ. 93.32 లక్షలు ఖర్చు చేయడం జరిగిందన్నారు
అదేవిధంగా జిల్లాలో 809 గ్రామ సచివాలయాలు. 796 రైతులరోపాకేంద్రాలు, 658 వైయస్ఆర్ హెల్త్ క్లినిక్లు, 1069 ప్రహరీ గోడల నిర్మాణం, 367 అంగన్ వాడీ కేంద్రాల నిర్మాణాలను మార్చి 2021 నాటికి పూర్తి చేస్తామని గ్రామీదాలివృద్ధి శాఖా మంత్రికి కలెక్టరు వివరించారు. ప్రతినెలా 150 గ్రామసచివాలయాలు. 200 రైతుభరోసా కేంద్రాలు, 170 దైయస్ఆర్ హెల్త్ క్లినిక్ నిర్మాణాలు పూర్తి చేసేలా ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. ఈ లక్ష్యసాధనకు నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. గత ఏడాది స్టేట్ కన్వర్టెన్సీ ఫంగ్ క్రింద రూ. 100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినందుకు కలెక్టరు కృతజ్ఞతలు తెలియజేస్తూ అందులో రూ.10 కోట్ల మేర రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరారు.
కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నవంబరు 27వ తేదీన శుక్రవారం శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం జరుగనుంది. ఈ ఉత్సవ నేపథ్యంలో స్వామివారికి ప్రాతఃకాలంలో నిర్వహించే సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు, తెల్లవారుజామున 4.45 నుంచి 5.45 గంటల లోపు తిరుమాడ వీధులలో ఊరేగిస్తారు. అనంతరం ఆలయం లోపల ఉదయం 6 నుంచి ఉదయం 7.30 గంటల వరకు కైశికద్వాదశి ఆస్థానాన్ని పురాణపారాయణం ద్వారా ఘనంగా నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం కైశిక ద్వాదశిని ప్రబోధోత్సవం అని, ఉత్తానద్వాదశి అని కూడా వ్యవహరిస్తారు. వివిధ గ్రంథాల్లో పేర్కొన్న విధంగా స్థితికారుడైన శ్రీమహావిష్ణువును మేల్కొల్పే పర్వదినాన్ని కైశికద్వాదశిగా వ్యవహరిస్తారు. శ్రీమహావిష్ణువు ఆషాఢశుక్ల ఏకాదశినాడు గాఢ నిద్రలోకి వెళ్లారు. కైశికద్వాదశినాడు ఆయన్ను మేలుకొల్పడం రివాజు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైవున్న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి మహోత్సవాన్ని ప్రతిఏటా టిటిడి ఘనంగా నిర్వహిస్తుంది. కైశికద్వాదశి పౌరాణిక నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకుంది. శ్రీనంబదువాన్ అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. తాను ప్రస్తుతం శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని, తప్పక తిరిగివచ్చి క్షుద్బాధను తీరుస్తానని నంబదువాన్ ప్రమాణం చేశాడు. అన్నమాట ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారట. ఈ విధంగా ఉత్తానద్వాదశికి కైశికద్వాదశి అనే పేరు వచ్చింది.
ఉత్తరాంధ్రా ప్రజల ఇలవేలుపు శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాల రాట ముహూర్తం విశాఖలోని ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఈఓ జె.మాధవి, ఏఈఓ వి.రాంబబులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ.. కోవిడ్ నిబంధనలను ద్రుష్టిలో ఉంచుకొని అమ్మవారి మార్గశిర మాసోత్సవాలను నిర్వహించాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శానిటైజర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కారోనా వైరస్ సూచనలు భక్తులకు తెలియజేస్తూ, అమ్మవారి దర్శనాలు కల్పించాలన్నారు. ఈఓ మాధవి మాట్లాడుతూ, అమ్మవారి రాట కార్యక్రమం సందర్భంగా స్థానిక మహిళలకు తీర్ధ ప్రసాదాలతోపాటు జాకెట్టు ముక్కలు, తాంబూలం పంపిణీచేసినట్టు వివరించారు. అంతేకాకుండా అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు వైభంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో త్రిమూర్తులు, శ్రీనివాస్, రాంబాబు, రామారావు, రాజు తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలో జరిగే అత్యంత ప్రముఖమైన ఉత్సవాలలో ఒక్కటైన చక్రతీర్థ ముక్కోటి నవంబరు 26న గురువారం జరుగనుంది. పౌరాణిక నేపథ్యంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వెలసివున్న శేషగిరులమీద దక్షిణభాగంలో మహా పవిత్రతీర్థమైన చక్రతీర్థం ఉంది. ప్రతి ఏడాదీ కార్తీక మాసం శుద్ధద్వాదశినాడు ఈ చక్రతీర్థ ముక్కోటి తిరుమలలో జరుగుతుంది. ఆరోజున ఉదయం 9 గంటలకు స్వామివారు అర్చకులు, పరిచారకులు మంగళవాయిద్యాలతో స్వామివారు ఆలయం నుండి ప్రదక్షిణంగా చక్రతీర్థానికి వెళతారు. చక్రతీర్థంలో వెలసివున్న శ్రీ చక్రత్తాళ్వారువారికి, శ్రీ నరసింహస్వామివారికి, శ్రీ ఆంజనేయస్వామివారికి అభిషేకం, పుష్పాలంకారం, పూజలు చేస్తారు. అనంతరం హారతి నివేదించి తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. స్కంద పురాణం ప్రకారం పద్మనాభ మహర్షి చక్రతీర్థంలో 12 సంవత్సరాలు తపస్సు చేశారు. అందుకు సంతసించి శంఖచక్రగధాభూషితుడైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై కల్పాంతం వరకు తనకు పూజలు చేయాలని చెప్పి అంతర్థానమయ్యారు. స్వామి ఆజ్ఞానుసారం పద్మనాభ మహర్షి చక్రతీర్థంలో తపస్సు చేశారు. అయితే ఒకనాడు ఓ రాక్షసుడు అతనిని భక్షించడానికి రాగా మహర్షి తిరిగి స్వామివారిని ప్రార్థించారు. అప్పుడు స్వామి తన చక్రాయుధాన్ని పంపి ఆ రాక్షసుని సంహరించారు. ఆ సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉంచి భక్తులకు రక్షణ కల్పించాల్సిందిగా స్వామివారిని మహర్షి కోరారు. భక్తవల్లభుడైన స్వామివారు తన సుదర్శన చక్రాన్ని ఆ ప్రాంతంలోనే ఉండేలా ఆజ్ఞాపించడంతో ఈ తీర్థం చక్రతీర్థంగా ప్రసిద్ధిగాంచింది. వరాహ పురాణ నేపథ్యంలో తిరుమలలోని శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల తీర్థాలలో అత్యంత ముఖ్యమైనవిగా ఉన్న సప్త తీర్థాలలో చక్ర తీర్థం ప్రముఖ తీర్థంగా వెలుగొందుతోంది.
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని, తిరుమల శ్రీవారిని దర్షించికుని మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు చెన్నై తిరుగు ప్రయాణం సందర్భంగా రేణిగుంట విమానాశ్రయం లో భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ వారికి సాదర వీడ్కోలు లభించింది. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, జిల్లా ఇంచార్జీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, పుట్టపర్తి శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్త, అడిషనల్ డిజిపిలు చంద్రశేఖర్ ఆజాద్, హరీష్ కుమార్, జెసి మార్కండేయులు, తిరుపతి ఆర్బన్ ఎస్.పి.రమేష్ రెడ్డి, , అడిషనల్ ఎస్.పి. సుప్రజ జెసి (సంక్షేమం) రాజశేఖర్ , డిఆర్ఓ మురళి, ఆర్డీఓ కనక నరసా రెడ్డి , ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఎస్. సురేష్, సివిఎస్ ఓ రాజశేఖర్ రెడ్డి, డిప్యూటీ కమాండెంట్ సిఐఎస్ ఎఫ్ శుక్ల రేణిగుంట తహసీల్దార్ శివప్రసాద్ వీడ్కోలు తెలిపిన వారిలో వున్నారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ ప్రత్యేక విమానంలో రా.6.50 గంటలకు గన్నవరం బయలుదేరగా సాదర వీడ్కోలు లభించింది..
బంగాళాఖాతంలో ఏర్పాడిన ‘నివార్’ సైక్లోన్‌తో ప్రభుత్వం అప్రమత్తమైంది. నివార్ తుపాన్‌పై జిల్లాకలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను నేరుగా ఏపీని తాకకపోయినా, సమీప ప్రాంతంలో దాని ప్రభావం ఉంటుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలిని సూచించారు. ఈ తుపాను ప్రభావం బుధ వారం నుంచి గురువారం వరకు ఉంటుందని, సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. ‘నెల్లూరు, చిత్తూరు, కడపలోని కొన్ని ప్రాంతాలు, ప్రకాశం జిల్లాలో తీర ప్రాంతం, కర్నూలు, అనంతపురం జిల్లాలపై 11-20 సెంటీమీటర్ల మేర వర్షాలు కురిసే అవకాశం ఉంది. 65 నుంచి 75 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. పంటలు దెబ్బతినకుండా వాటి రక్షణకోసం చర్యలు తీసుకోవాలి. ఆర్బీకేల ద్వారా రైతులకు సూచనలు పంపాలి. కోతకోసిన పంటలను రక్షించేందుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలి. ఒకవేళ ఇంకా పొలంలోనే పంటలు ఉంటే... వాటిని కోయకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాని ఆదేశించారు. అక్టోబరు వరకూ పడ్డ వర్షాలతో చెరువులు, రిజర్వాయర్లు అన్నీ నిండి ఉన్న నేపథ్యంలో మళ్లీ భారీ వర్షాలు పడితే... చెరువులు గండ్లు పడే అవకాశాలు ఉంటాయి. ఈ గండ్లు పడకుండా నిరంతరం మానిటరింగ్ చేసి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. కోస్తా ప్రాంతంలో ప్రాణ నష్టం లేకుండా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా చూసుకోండి. గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారికి దశ, దిశ చూపండి. వీరి సేవలను పెద్ద స్థాయిలో వినియోగించుకోండి. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంచేసుకోండి. అలాగే కరెంటు సరఫరాకు ఇబ్బందులు వచ్చిన సమక్షంలో వెంటనే పునరుద్ధరణకు కరెంటు స్తంభాలను సిద్ధంచేసుకోండి.ప్రతిజిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకోండి. మండల కేంద్రాల్లో కూడా కంట్రోల్‌రూమ్స్‌ఉండాలి.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని మంగళవారం మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీరితోపాటు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా ఉన్నారు. రాష్ట్రపతి మంగళవారం మధ్యాహ్నం తిరుమల శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం నుంచి బయలుదేరి క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీ వరాహస్వామివారి దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈఓ ఎవి.ధర్మారెడ్డి అహ్వానం పలికారు. అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకస్వాములు వారికి స్వామివారి శేషవస్త్రం అందజేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఛైర్మన్, ఈవో కలిసి శ్రీవారి తీర్థప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని, 2021 క్యాలెండర్, డైరీని రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా, డిఐజి క్రాంతిరాణా టాటా, టిటిడి సివిఎస్వో గోపీనాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్‌పి రమేష్‌రెడ్డి, డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. రాష్ట్రపతి వెంట రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉన్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న రాష్ట్రపతి దంపతులకు టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, జెఈవో పి.బసంత్‌కుమార్, ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, అర్చక బృందంతో కలిసి ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వస్త్రం, తీర్థప్రసాదాలను వారికి ఛైర్మన్ అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్తా, ఇంటెలిజెన్స్ ఐజి శశిధర్ రెడ్డి, టిటిడి సివిఎస్‌వో గోపినాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్‌రెడ్డి, అదనపు సివిఎస్వో శివకుమార్ రెడ్డి, విజివో మనోహర్, డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన కడపజిల్లాలోని గండికోట ప్రాంతం. ఇక్కడ కోట, పెన్నానదీ ప్రవాహక ప్రాంతం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈప్రాంతాన్ని సందర్శించిన వారంతా ఏదో విదేశాల్లోని కౌ బాయ్ సినిమాను చూసినట్టుగా అనుభూతి పొందుతారు. గండికోట కూడా చూడ ముచ్చటగా వుంటుంది. అదే సమయంలో పెన్నా నదీ ప్రాంతం నుంచి చూస్తున్న ప్రాంతంలో కొండలు కూడా చాలా చక్కగా కనిపిస్తాయి. గండికోటను గ్రాండ్ కెన్యన్ గా అభివర్ణిస్తారంటే ఇక్కడి పర్యాటక అందాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. పెన్నా నదీ ప్రవాహం ఇక్కడి కొండల మధ్య లోతైన గండిని ఏర్పరచడం వల్ల ఈ కోటకు గండికోట అని పేరు వచ్చింది. రెండు మూడు వందల అడుగుల ఎత్తున నిటారుగా ఉండే ఇసుకరాతి కొండల గుండా ఈ ప్రవాహం చూడటానికే చాలా అందంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని చూడాల్సిన ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో గంటి కోట ఒకటి.
భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కి రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని, తిరుమల శ్రీవారిని దర్శనానికి వచ్చిన గవర్నర్ కు మంగళవారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర పతి భిశ్వభూషణ్ హరిచందన్ లుస్వాగతం పలికారు. వీరితోపాటు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, జిల్లా ఇంచార్జీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఎపిఐఐసి ఛైర్మన్ రోజా, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి, పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి, రెడ్డెప్ప, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి , ఎం.ఎల్.సి. యండపల్లి శ్రీనివాసులురెడ్డి, శాసన సభ్యులు ఆదిమూలం, బియ్యపు మధుసూధన రెడ్డి, భూమన కరుణాకర రెడ్డి, చింతల రామచంద్రా రెడ్డి, నవాజ్ బాషా , వెంకటే గౌడ, పెద్దిరెడ్డి ద్వారకానాధ రెడ్డి, జంగాలపల్లి నివాసులు, బాబు , డిసీసీబీ చైర్మన్ రెడ్డెమ్మ, జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్త,టిటిడి ఇఓ జవహర్ రెడ్డి, జెసి మార్కండేయులు, నగరపాలక కమిషనర్ గిరీషా, ఐజి శశిధర్ రెడ్డి, డిఐజి కాంతిరణా టాటా, తిరుపతి ఆర్బన్ ఎస్.పి.రమేష్ రెడ్డి, సివి అండ్ ఎస్ ఓ గోపినాధ్ జెట్టి,ఎయిర్ పోర్టు డైరెక్టర్ సురేష్, డిప్యూటీ కమాండెంట్ శుక్లా, చిత్తూరు ఎస్.పి.సెంధిల్ కుమార్ , జెసి (సంక్షేమం) రాజశేఖర్ , డిఆర్ఓ మురళి, ఆర్డీఓ కనక నరసా రెడ్డి, స్వాగతం పలుకగా విమానాశ్రయంలో ఏర్పాట్లను పర్యవేక్షించిన తహశీల్దార్లు శివప్రసాద్ , ఉదయ్ సంతోష్, డిఎస్ పి లు గంగయ్య, చంద్రశేఖర్ లు పర్యటనలో వి వి పి ల లైజన అధికారులు తుడ సెక్రటరీ లక్ష్మి, సెట్విన్ సి ఈ ఓ మురళీకృష్ణ , తహశీల్దార్ సురేష్ బాబు, సిడిపిఓ శాంతి దుర్గా , రెవెన్యూ ,పోలీస్ అధికారులు, సిబ్బంది వున్నారు.
ప్రభుత్వం తమను ప్రతిష్టాత్మక గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలోకి ఉద్యోగులుగా తీసుకుంది.. ఆడుతూ పాడుతూ పనిచేసినా ఎవరూ పట్టించుకోరు..ఒక వేళ వచ్చినా వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతున్నారు.. పెద్దగా అధికారుల పర్యటనలు..డ్యూటీ చార్ట్ పట్టించుకోవాల్సిన పనిలేదు..దిల్ ఖుష్ రాజా అంటూ విధులు నిర్వహించేయొచ్చు.. అనుకునే వారికి ఇది నిజంగా చేదు వార్తే. రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కలెక్టర్ ఏకంగా 9 మంది గ్రామసచివాలయ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఇపుడు రాష్ట్రంలోనే సంచనలంగా మారింది. గ్రామసచివాలయ వ్యవస్థను ప్రజలకు చేరువ చేయడానికి, అక్కడి ఉద్యోగుల్లో జవాబుదారీ తనాన్ని పెంపొందించడానికి జిల్లా కలెక్టర్లు, జెసి, ఇతర ప్రత్యేక అధికారులు గ్రామ, వార్డు సచివాలయాల్లో పర్యటనలు చేస్తున్నా... ఇప్పటి వరకూ ఎక్కడా ఎవరినీ సస్పెండ్ చేయలేదు. అదే కొందరు గ్రామసచివాలయ ఉద్యోగులకు, సిబ్బందికి అలుసుగా మారింది. అదే సమయంలో కర్నూలు జిల్లాలో కూడా ఇదే విధంగా సిబ్బంది విధినిర్వహణలో అలసత్వం వహించి కలెక్టర్ వీరపాండియన్ సచివాలయం సందర్శించే సమయానికి ఉద్యోగులు లేకపోవడంతో వెంటనే 9 మంది సచివాలయ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కర్నూలు జిల్లాయే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల సచివాలయ ఉద్యోగులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒక్కమాటలో చెప్పాలంటే హడలి చస్తూ(ఒకటీ, రెండూ పోసుకుంటున్నారు) పైగా కర్నూలు జిల్లా వీరపాండియన్ సస్పెండ్ చేసిన ఉత్తర్వులను సోషల్ మీడియాలో పెడుతూ, అన్ని జిల్లాల సచివాలయ సిబ్బందిని అలెర్ట్ చేస్తున్నారు. కొత్తగా చేరిన ఉద్యోగులతో ఇంతకాలం ప్రజలకోసం పనిచేయాలని చెప్పి పనిచేయిస్తున్న అధికారులకు కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తీసుకున్న చర్యలతో బలమొచ్చింది. ఇకపై తాము కూడా ఈ విధంగానే వ్యవహించాలనే ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అటు ప్రభుత్వం కూడా జిల్లా కలెక్టర్లు, ప్రత్యేకంగా సచివాలయాల కోసం నియమించిన జెసిలకు పూర్తిస్థాయి అధికారాలు ఇవ్వడంతో ఇక పూర్తిస్థాయిలో రంగంలోకి దిగేందుకు సిద్ధపడుతున్నారు రాష్ట్రంలోని కలెక్టర్లు, జెసిలు. ఇక పనిచేయకుండా పబ్బం గడిపేద్దామనుకునే సచివాలయ ఉద్యోగులందరూ జాగ్రత్తగా ఇంటికెళ్లిపోవడం ఖాయంగానే కనిపిస్తుంది.