1 ENS Live Breaking News

న‌వంబ‌రు 29న కార్తీక ప‌ర్వ‌దీపోత్స‌వం..

తిరుమల శ్రీవారి ఆలయంలో న‌వంబ‌రు 29వ తేదీన సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవం జ‌రుగ‌నుంది. శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు.ఈ సందర్భంగా సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనందనిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు. ఆతర్వాత వరుసగా గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారిమేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణమండపం, సభఅర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగనరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండివాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద దీపాలను ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవను టిటిడి రద్దు చేసింది.

Tirumala

2020-11-27 14:51:44

2020-11-26 19:51:00

ఆచార్య టు వైస్ చాన్సలర్@ ప్రసాదరెడ్డి..

ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి ఆచార్యునిగా, పరిపాలనా దక్షునిగా, కంప్యూటర్‌ ‌సైన్స్, ఇన్ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ నిపుణుడిగా ఆంధ్రాయూనివర్శిటీలో ఎందరో విద్యార్ధులకు సుపరిచితులు. ఆయన ఏయూ కంప్యూటర్‌ ‌సైన్స్ ‌విభాగంలో అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌గా 1987లో ఉద్యోగ బాధ్యతలను చేపట్టి సీనియర్‌ ‌ప్రొఫెసర్‌గా నేడు సేవలు అందిస్తున్నారు. గతంలొ ఆచార్య ప్రసాద రెడ్డి 2008-2011 వరకు రిజిస్ట్రార్‌గా, 2011-2012 వరకు వర్సిటీ రెక్టార్‌గా, కంప్యూటర్‌ ‌సైన్స్ ‌విభాగాధిపతిగా, వర్సిటీలో పలు పరిపాలనా పరమైన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించారు. ఆచార్య ప్రసాదరెడ్డి వేలాది మంది విద్యార్థులను మలచిన స్ఫూర్తిదాయక ఆచార్యునిగా పేరుగాంచారు. ఆయన 33 సంవత్సరాలుగా బోధన వృత్తిలో కొనసాగుతున్నారు. ఆచార్య ప్రసాద రెడ్డి పర్యవేక్షణలో 47 మంది డాక్టరేట్‌లు అందుకున్నారు. ఆయన 195కిపైగా పరిశోధన పత్రాలను జాతీ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురించారు. రెండు పేటెంట్లను,  వీటికి పలు అవార్డులు సైతం రావడం జరిగింది. ఇన్ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ, డేటా సైన్స్ ‌రంగాలలో అత్యంత ప్రముఖ పరిశోధకుల్లో ఆయన ఒకరుగా నిలచారు. ఆచార్య ప్రసాద రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2011 సంవత్సరంలో ఉత్తమ ఆచార్యునిగా అవార్డును స్వీకరించారు. ఆచార్య ప్రసాదరెడ్డి బోధన, పరిశోధన రంగాలతో పాటు పరిపాలనా రంగంలో సైతం తనదైన సమర్ధతను ఆయన చాటుకున్నారు. వర్సిటీ రిజిస్ట్రార్‌, ‌రెక్టార్‌గా పదవులను పూర్తిచేసిన అనంతరం, విభాగాధిపతిగా కొనసాగడం ఆయన ప్రత్యేకత. నిత్యం బోధన చేస్తూ విద్యార్థులకు మార్గదర్శకం చేస్తూ పూర్తిస్థాయిలో ఉపాదిని కల్పించే దిశగా కృషిచేసారు. నేడు ఆంధ్రాయూనివర్శిటీ పూర్తిస్థాయి కులపతిగా బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ యాప్, www.enslive.net న్యూస్ వెబ్ సైట్ టీమ్ నుంచి అభినందనలు తెలియజేస్తుంది.

ఆంధ్రాయూనివర్శిటీ

2020-11-26 17:53:43

లోక‌క‌ల్యాణం కోసం తుల‌సి వివాహం..

 విశ్వంలోని స‌క‌ల‌జీవులు సుభిక్షంగా ఉండాల‌ని, లోక‌క‌ల్యాణం కోసం తుల‌సి వివాహం కార్య‌క్ర‌మాన్ని టిటిడి చేప‌ట్టింద‌ని కంచి కామ‌కోటి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి ఉద్ఘాటించారు. కార్తీక మాసంలో టిటిడి త‌లపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా గురు‌వారం తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో శ్రీ తులసి ధాత్రి స‌హిత దామోద‌ర పూజ‌ ఘనంగా జరిగింది. ఉద‌యం 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ పూజా కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.  ఈ పూజ‌లో పాల్గొన్న శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి అనుగ్ర‌హ భాష‌ణం చేస్తూ స‌నాత‌న ధ‌ర్మంలో తుల‌సి వివాహానికి విశేష ప్రాధాన్యం ఉంద‌న్నారు. జీవిత‌చ‌క్రంలో వివాహం ముఖ్య‌మైన ఘ‌ట్ట‌మ‌న్నారు. తుల‌సి భ‌క్తికి, ఆరోగ్యానికి ప్ర‌తీక అన్నారు. ప్ర‌తి ఇంట్లో తుల‌సి మొక్క ఉంటుంద‌ని, మ‌హిళ‌లు త‌మ సౌభాగ్యం కోసం తుల‌సికి పూజ‌లు చేస్తార‌ని చెప్పారు. స‌నాత‌న ధ‌ర్మ ప్ర‌చారంలో భాగంగా ప‌విత్ర‌మైన కార్తీక మాసంలో టిటిడి చేప‌ట్టిన కార్తీక దీక్ష కార్య‌క్ర‌మాల‌ను అభినందించారు.  అంత‌కుముందు ఉద‌యం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని వ‌సంత మండ‌పానికి వేంచేపు చేశారు. ఈ సంద‌ర్భంగా వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ మోహ‌న రంగాచార్యులు మాట్లాడుతూ శ్రీ తుల‌సీ ధాత్రి స‌హిత దామోద‌ర పూజ విశిష్ట‌త‌ను తెలియ‌జేశారు. అనంత‌రం కార్తీక విష్ణుపూజా సంక‌ల్పం చేసి ప్రార్థ‌నా సూక్తం, తుల‌సి,  ధాత్రి(ఉసిరి) క‌ల్యాణం, శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి తిరువారాధ‌న చేశారు. ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం, హార‌తి స‌మ‌ర్పించారు. అనంత‌రం క్షమా ప్రార్థ‌న‌, మంగ‌ళంతో ఈ పూజ ముగిసింది. అదేవిధంగా, రాత్రి ... 7.15 నుంచి 7.45 గంటల వరకు తిరుమల నాదనీరాజనం వేదికపై  డా.మారుతి 'కార్తీక పురాణం - విష్ణువైభవం' పారాయణం చేయనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు  వేణుగోపాల దీక్షితులు,  కృష్ణ‌శేషాచ‌ల దీక్షితులు, వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు  ఎన్ఎకె.సుంద‌ర‌వ‌ద‌నాచార్యులు‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తిరుమల

2020-11-26 16:20:52

2020-11-26 11:16:25

2020-11-26 10:41:23

2020-11-26 10:23:14

2020-11-26 08:50:46

ఏయూ వీసిగా ఆచార్య పివిజిడి ప్రశాదరెడ్డి..

అనుకున్నదే అయ్యింది..కొందరు పనిగట్టుకొని ఆయన వీసిగా అర్హులు కారని  ప్రచారం చేసినా ఫలితం లేకపోయింది.. ప్రభుత్వం మాత్రం ఆయనే ఏయూ విసీగా అర్హుడంటూ గుర్తించింది. ఆపై గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ దస్త్రంపై సంతకం చేశారు.. దీనితో ఆర్తనాదాలు చేసిన వారి గొంతులో పచ్చివెలక్కాయ్ తోపాటు అన్నీ పడ్డట్టు అయ్యింది. అందరి కోరిక, ఆకాంక్ష మేరకు చదువులమ్మ ముద్దుబిడ్డ ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సతీష్‌ ‌చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర గవర్నర్‌ ‌బిశ్వబూషన్‌ ‌హరిచందన్‌ ఆమోదంతో నూతన వీసీగా ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి నియమితులయ్యారు. మూడేళ్ల కాలం ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. 2019 జూలై మాసం నుంచి ఆచార్య ప్రసాద రెడ్డి ఏయూకు ఇంచార్జి వీసీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పూర్తిస్థాయిలో వీసీగా బాధ్యతలను చేపట్టనున్నారు.

ఆంధ్రాయూనివర్శిటీ

2020-11-26 08:22:51

అసంపూర్తి రహదారులపై దృష్టి సారించాలి..

అసంపూర్తిగా మిగిలిపోయిన రహదారి పనులను వచ్చే ఏడాది మార్చి 31 వ తేదీ లోపున నిధులు మురిగిపోకుండా పూర్తి చేస్తే బాగుంటుందని రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) సూచించారు. బుధవారం తాడేపల్లిలో పంచాయితీరాజ్ శాఖ కమీషనర్ కార్యాలయం నుంచి  రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో  రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో  మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి  హామీ పథకం అమలు తీరుపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా  మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఇళ్ల స్థలాలు, నాడు-నేడు, వ్యక్తిగత మరుగుదొడ్లు, సి.సి. రోడ్లు నిర్మాణం, గ్రామ సచివాలయాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రానున్న ఆరు వారాలలో ప్రతీ వారం చేపట్టవలసిన పనులపై  ముందస్తు ప్రణాళికను తయారు చేసుకొని నిర్ధేశించిన లక్ష్యాలను శతశాతం పూర్తిచేయాలని ఆయన అధికారులను కోరారు. మంత్రి పేర్ని నాని మచిలీపట్నం లోని తన కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ, ఈ ఏడాది జులై , అక్టోబర్ మాసాల్లో పేమెంట్లు ఇచ్చారని ప్రతి నెల ఆయా మొత్తం మంజూరైతే , ఆయా పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవచ్చన్నారు. అదే విధంగా సిమెంట్ కావాలని ఇండెంట్ సమర్పించి ఎఫ్ టి ఓ  జనరేట్  కాబడి పేమెంట్ జాప్యం అవుతుందన్నారు. కృష్ణాజిల్లాలో ఒక చిన్న సిమెంట్ కంపెనీకు  పంపిణీ అప్పచెప్పడం వలన సిమెంట్ త్వరితగతిన అందడం లేదన్నారు. తమ జిల్లాలో ఇప్పటకీ  6 వేల టన్నుల సిమెంట్ పంపిణీ కావాల్సి ఉందని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ విధానంలో జాప్యం నివారించడానికి పంచాయితీరాజ్ శాఖ నంచి నగదు నేరుగా సిమెంట్ సరఫరా చేసే కాంట్రాక్టర్ ఖాతాలోకి జమ చేస్తే, సిమెంట్ త్వరితగతిన సరఫరా అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయేమో పరిశీలించాలని ఆయన కోరారు.  5 లక్షల లోపు నగదు ఒక వారం లోపున పేమెంట్ అవుతుందని అదే కనుక 5 లక్షల రూపాయలు డబ్బు దాటితే, అవి పేమెంట్ కావడానికి రెండు మూడు నెలల జాప్యం ఏర్పడుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ మాట్లాడుతూ జిల్లాలో యస్ఆర్ ఇజియస్ క్రింద 120 లక్షల పనిదినాలు సాధించాలని లక్ష్యంగా తీసుకున్నప్పటికీ మార్చినాటికి 150 లక్షల పనిదినాలు కల్పించే దిశగా ప్రణాళిక అములు చేస్తున్నానున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 107.95 లక్షల పనిదినాలు సాధించగా, డిశంబరులో ఈ లక్షలు. జనవరిలో 10 లక్షలు, ఫిబ్రవరిలో 12 లక్షలు. మార్చిలో 14 లక్షలు పాధించేదికగా వెళుతున్నామన్నారు. మెటీరియల్ కాంపోనెంట్ క్రింద రూ. 188.85 లక్షలకు గాను. రూ. 93.32 లక్షలు ఖర్చు చేయడం జరిగిందన్నారు అదేవిధంగా జిల్లాలో 809 గ్రామ సచివాలయాలు. 796 రైతులరోపాకేంద్రాలు, 658 వైయస్ఆర్ హెల్త్ క్లినిక్లు, 1069 ప్రహరీ గోడల నిర్మాణం, 367 అంగన్ వాడీ కేంద్రాల నిర్మాణాలను మార్చి 2021 నాటికి పూర్తి చేస్తామని గ్రామీదాలివృద్ధి శాఖా మంత్రికి కలెక్టరు వివరించారు. ప్రతినెలా 150 గ్రామసచివాలయాలు. 200 రైతుభరోసా కేంద్రాలు, 170 దైయస్ఆర్ హెల్త్ క్లినిక్ నిర్మాణాలు పూర్తి చేసేలా ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. ఈ లక్ష్యసాధనకు నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. గత ఏడాది స్టేట్ కన్వర్టెన్సీ ఫంగ్ క్రింద రూ. 100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినందుకు కలెక్టరు కృతజ్ఞతలు తెలియజేస్తూ అందులో రూ.10 కోట్ల మేర రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరారు.

Vijayawada

2020-11-25 19:29:56

27న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి ఆస్థానం..

కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నవంబరు 27వ తేదీన శుక్ర‌వారం శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం జ‌రుగ‌నుంది. ఈ ఉత్సవ నేపథ్యంలో స్వామివారికి ప్రాతఃకాలంలో నిర్వహించే సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.  వేంకటతురైవార్‌, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు, తెల్లవారుజామున 4.45 నుంచి 5.45 గంట‌ల లోపు తిరుమాడ వీధులలో ఊరేగిస్తారు. అనంతరం ఆలయం లోపల ఉదయం 6 నుంచి ఉదయం 7.30 గంట‌ల వరకు కైశికద్వాదశి ఆస్థానాన్ని పురాణపారాయణం ద్వారా ఘనంగా నిర్వహిస్తారు.  పురాణాల ప్ర‌కారం కైశిక ద్వాదశిని ప్రబోధోత్సవం అని, ఉత్తానద్వాదశి అని కూడా వ్యవహరిస్తారు. వివిధ గ్రంథాల్లో పేర్కొన్న విధంగా స్థితికారుడైన శ్రీమహావిష్ణువును మేల్కొల్పే పర్వదినాన్ని కైశికద్వాదశిగా వ్యవహరిస్తారు. శ్రీమహావిష్ణువు ఆషాఢశుక్ల ఏకాదశినాడు గాఢ నిద్రలోకి వెళ్లారు. కైశికద్వాదశినాడు ఆయన్ను మేలుకొల్ప‌డం రివాజు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైవున్న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి మహోత్సవాన్ని ప్రతిఏటా టిటిడి ఘనంగా నిర్వహిస్తుంది. కైశికద్వాదశి పౌరాణిక నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకుంది. శ్రీనంబదువాన్‌ అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. తాను ప్రస్తుతం శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని, తప్పక తిరిగివచ్చి క్షుద్బాధ‌ను తీరుస్తానని నంబదువాన్‌ ప్రమాణం చేశాడు. అన్నమాట‌ ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్‌ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారట‌. ఈ విధంగా ఉత్తానద్వాదశికి కైశికద్వాదశి అనే పేరు వ‌చ్చింది.

Tirumala

2020-11-25 18:40:32

2020-11-25 17:09:55

2020-11-25 16:39:14

శాస్త్రోక్తంగా అమ్మవారి రాట ముహూర్తం..

ఉత్తరాంధ్రా ప్రజల ఇలవేలుపు శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాల రాట ముహూర్తం విశాఖలోని ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, ఈఓ జె.మాధవి, ఏఈఓ వి.రాంబబులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ.. కోవిడ్ నిబంధనలను ద్రుష్టిలో ఉంచుకొని అమ్మవారి మార్గశిర మాసోత్సవాలను నిర్వహించాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శానిటైజర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కారోనా వైరస్ సూచనలు భక్తులకు తెలియజేస్తూ, అమ్మవారి దర్శనాలు కల్పించాలన్నారు. ఈఓ మాధవి మాట్లాడుతూ, అమ్మవారి రాట కార్యక్రమం సందర్భంగా స్థానిక మహిళలకు తీర్ధ ప్రసాదాలతోపాటు జాకెట్టు ముక్కలు, తాంబూలం పంపిణీచేసినట్టు వివరించారు. అంతేకాకుండా అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు వైభంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో త్రిమూర్తులు, శ్రీనివాస్, రాంబాబు, రామారావు, రాజు తదితరులు పాల్గొన్నారు.

KANAKAMAHALAKXHMIGUDI

2020-11-25 16:13:46