1 ENS Live Breaking News

శ్రీభగవద్గీత పారాయ‌ణంతో జ్ఞానం..

శ్రీ కృష్ణ ప‌ర‌మాత్ముడు ఉప‌దేశించిన భగవద్గీతకు సమానమయిన గ్రంధం ఈ లోకంలో మరొకటి లేదని, గీతా పారాయ‌ణంతో జ్ఞానం, స‌త్‌ప్ర‌వ‌ర్త‌న, ప్ర‌సాదిస్తాయ‌ని కంచి కామ‌కోటి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి తెలిపారు. కంచి స్వామి తిరుమ‌ల‌లోని నాద నీరాజ‌నం వేదిక‌పై శనివారం సాయంత్రం గీతా పారాయ‌ణంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా స్వామివారు అనుగ్రహభాషణం చేస్తూ సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పిన  శ్రీభగవద్గీత ప్రపంచంలోని  సర్వ మానవాళికి అన్ని సమస్యలకు మార్గం చూపిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు ధర్మాన్ని అనుసరిస్తే ధర్మమే అందరిని కాపాడుతుందన్నారు. జప, హోమ, దానాల ద్వారా జ్ఞాన జ్యోతిని పొంద‌వ‌చ్చ‌న్నారు. కంచి పీఠం ఆధ్వర్యంలో 1966వ సంవత్సరం నుండి భగవత్ గీతను ముద్రించి దేశ విదేశాల‌లో ప్రచారం చేస్తున్న‌ట్లు తెలిపారు. టిటిడి ప్రతి రోజు తిరుమల శ్రీవారి సన్నిధిలో గీతా పారాయణం నిర్వహించడాన్ని అభినందించారు. ఈ  కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా కోట్లాది మంది భ‌క్తులు వీక్షిస్తున్నార‌ని, త‌ద్వారా గీతా సారాంశాన్ని తెలుసుకుంటున్న‌ట్లు వివ‌రించారు. లోక కల్యాణార్థం సెప్టెంబర్ 10వ తేదీ నుండి ప్రతి రోజు సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు టిటిడి తిరుమలలో గీతా పారాయణం నిర్వహిస్తున్న విషయం విదితమే. టిటిడి ఛైర్మన్  వైవి.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి , బోర్డు సభ్యులు  డి.పి.అనంత,  గోవింద‌హరి,  కృష్ణమూర్తి వైద్య‌నాధ‌న్‌ తదితరులు  ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

Tirumala

2020-11-28 20:47:43

2020-11-28 19:11:15

తుపాను మ్రుతులకు రూ.5లక్షలు నష్టపరిహారం..

ఆంధ్రప్రదేశ్ లో తుపాను కారణంగా మ్రుతిచెందిన కుటుంబాలకు రూ.5లక్షలు నష్టపరిహారం అందించాలని సీఎం జిల్లా కలెక్టర్లును ఆదేశించారు. నివర్‌ తుపాన్‌ తీవ్ర ప్రభావం చూపిన ప్రాంతాలైన చిత్తూరు, కడప, నెల్లూరు ప్రాంతాల్లో శనివారం ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం పంట నష్టాలను స్వయంగా చూశారు. ఈ సందర్భంగా తుపాను ప్రభావిత జిల్లాల్లోని ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం మాట్లాడుతూ, తుపాను ప్రాంతాల్లోని వారికి తక్షణ సహాయం కింద రూ.500 ఇవ్వాలని ఆదేశించారు. మూడు జిల్లాల్లోని పంట నష్టాలపై తక్షణమే అంచాలు వేసి ప్రతిపాదనలు పంపించాలన్నారు. తుపానుకి దెబ్బతిన్న ప్రాంతాలను మంత్రులు,ఎంపీలు, ఎమ్మెల్యే పర్యటించి వారికి దైర్యం చెప్పాలన్నారు. పునరావస కేంద్రాల్లో ఉన్నవారికి కూడా రూ.599 చొప్పున అందజేయాలన్నారు. వరద ప్రాంతాల్లో సహయక చర్యలు జరుగుతూనే ఉండాలన్నారు. ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా ఆహారం, మంచినీరు, మందులు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.

Velagapudi

2020-11-28 16:26:08

ఆ ఐటిడిఏ పీఓ కొడుకు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతాడు..

ఆయనొక ఐటిడిఏకి ప్రాజెక్టు అధికారి..వ్రుత్తిరీత్యా జాయింట్ కలెక్టర్ కేడర్ ఉద్యోగి.. చుట్టూ మందీ మార్భలం..చిటికేస్తే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తమ పిల్లాడిని చదివించడానికి క్యూ కడతాయి..నచ్చిన కార్పోరేట్ పాఠశాలల్లో ఇంగ్లీషు మాద్యమంలో ఠీవిగా చదివించుకోవచ్చు..తన హుందాతనానికి అనుగుణంగా కాసుల పందిరి కింద పాఠాలు చెప్పించుకోవచ్చు..  కాని ఆ అధికారికి మాత్రం ప్రభుత్వ పాఠశాలలంటే అమిత మైన గౌరవం..ప్రైవేటు పాఠశాలలొద్దు..ప్రభుత్వ పాఠశాలలే ముద్దు అని భావిస్తారు..ఆయన ఏ జిల్లాకి అధికారిగా బదిలీపై వెళ్లినా తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తారు..ఆయనే విజయనగరం జిల్లా, పార్వతీపురం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్.కూర్మనాధ్.. ప్రభుత్వ కార్యాలయాల్లోని అటెండర్లు, వాచ్ మెన్లు సైతం తమ పిల్లలను కార్పోరేట్ విద్యాసంస్థల్లో చదివిస్తున్న ఈ రోజుల్లో తమ పిల్లాడిని మాత్రం ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ ప్రభుత్వ ఉన్నతాధికారి. వేల మంది విద్యార్ధులను తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల కంటే డబ్బుని బట్టీ విద్యార్ధుల బాగోగులు చూసే ప్రైవేటు విద్యాసంస్థల్లో పిల్లకు ఏం చదువొస్తుంది అంటారాయన.. ప్రపంచంలోనే ఒక్క ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే ప్రతిభకు పట్టం కడతారని, ఆ విధానం ప్రైవేటు పాఠశాలల్లో ఉండదని చెబుతారు. పిల్లల్లో చదువుపై పోటీ తత్వం పెరిగేలా ఒక్క ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు మాత్రమే చేయగలరని బలంగా నమ్మే ఈ అధికారి తాను ఏ ప్రాంతానికి బదిలీ అయినా అక్కడి ప్రభుత్వ పాఠశాలలో తన కుమారుడిని చదివిస్తున్నారు. పార్వతీపురంలోని కొత్తపోలమ్మ పురపాలక పాఠశాలలో తన కుమారుడిని చదివిస్తున్నారు. ఈయన పాఠశాలకు వెళ్లిన సందర్భంలో ఉపాధ్యాయులకు చెప్పే మాట ఒక్కటే. మా వాడ్ని ఒక అధికారి కొడుకుగా కాకుండా చదువులో ఏ విధంగా రాణిస్తున్నాడనే కోణంలోనే చూడండి అంటూ ఉపాధ్యాయులకు సైతం తన వ్యక్తిత్వాన్ని అర్ధమయ్యేలా చెబుతుంటారు. దీనితో తండ్రి ఆశయాలకు అనుగుణంగా కుమారుడు కూడా ప్రభుత్వ పాఠశాలలోనే తన విద్యాబ్యాసాన్ని కొనసాగిస్తున్నాడు. రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారులంతా ఒక్కసారి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే.. కాసుల పందిరి కింద విద్య నేర్పే ప్రైవేటు విద్యాసంస్థలకు చరమ గీతం పాడటం పెద్ద పనేం కాదు. అయినా ఇపుడు ప్రభుత్వమే ఆంగ్లమాద్యంలో పాఠ్యాంశాలు బోధిస్తున్న తరుణంలో ఇక ప్రైవేటు పాఠశాలతో పనేముందనే విషయాన్ని పార్వతీపురం ఐటిడిఏ అధికారి కూర్మనాధ్ లా అందరూ ఆలోచిస్తే ప్రభుత్వ పాఠశాలల వైభవం దేశానికే ఆంధ్రప్రదేశ్ ని మార్గదర్శిని చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందులోనూ ఉన్నతంగా ఆలోచించే అధికారుల ఆలోచనలు కూడా ఇంతే మంచిగా ఉంటాయనడానికి పార్వతీపురం ఐటిడిఏ పీఓ నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నారు. 

Parvathipuram

2020-11-28 14:01:37

మంత్రి వర్యా గురునానక్ జయంతికి రండి..

విజయవాడ గురునానక్ కాలనీ లో జరిగే 551వ జయంతోత్సవం లో పాల్గొనాలని  రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గురు సింగ్ సభ సభ్యులు విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 30వ తేదీన గురునానక్ జయంతి సందర్భంగా జరిగే గురుపూరబ్ ఉత్సవాలకు హాజరు కావాలని మంత్రిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా హర్ మహిందర్ సింగ్ మాట్లాగడుతూ, ముఖ్యమంత్రి  వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి  ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశముందని, ఆరోజు తమ సామాజిక వర్గంలోని పెద్దలంతా వస్తారి సింగ్ లు మంత్రికి వివరించారు. మంత్రి సానుకూలంగా స్పందించారని సింగ్ లు తెలిపారు. మంత్రి ముత్తంశెట్టిని  కలిసిన వారిలో  కాన్వాల్జిట్ సింగ్, గురుజీత్ సింగ్, జె.జె.సింగ్, రాజసహాని సింగ్ వున్నారు.

Vijayawada

2020-11-27 20:28:09

ఎస్పీ బాలు పేరు ఇక చిరస్థాయిగా..

నెల్లూరులోని మ్యూజిక్‌, డ్యాన్స్‌ ప్రభుత్వ పాఠశాలకు డాక్టర్‌ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పేరు పెట్టడం పట్ల ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ హర్షం వ్యక్తం చేశారు. తన తండ్రికి దక్కిన గొప్ప గౌరవమని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఏపీ ప్రభుత్వానికి ట్విటర్‌ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. కాగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాలకు గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరును చేరుస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్వీట్ చేశారు. కాగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మ్రుతిచెందిన తరువాతన ఆయన పేరుతో ఒక మ్యూజిక్, డాన్స్ పాఠశాల ఉంటే ఆయన చిరస్థాయిగా నిలిచిపోతుందని సంగీత అభిమానులు, ప్రజల డిమాండ్ రావడం, దానికంటే ముందుగానే వైఎస్సార్పీపీ ప్రభుత్వం ఈ నిర్ణయంతీసుకోవడం కూడా ఎస్పీ నిజమైన నివాళి అర్ఫించినట్టు అయ్యింది..

నెల్లూరు

2020-11-27 15:21:13

2020-11-27 15:01:50

న‌వంబ‌రు 29న కార్తీక ప‌ర్వ‌దీపోత్స‌వం..

తిరుమల శ్రీవారి ఆలయంలో న‌వంబ‌రు 29వ తేదీన సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవం జ‌రుగ‌నుంది. శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు.ఈ సందర్భంగా సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనందనిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు. ఆతర్వాత వరుసగా గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారిమేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణమండపం, సభఅర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగనరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండివాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద దీపాలను ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవను టిటిడి రద్దు చేసింది.

Tirumala

2020-11-27 14:51:44

2020-11-26 19:51:00

ఆచార్య టు వైస్ చాన్సలర్@ ప్రసాదరెడ్డి..

ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి ఆచార్యునిగా, పరిపాలనా దక్షునిగా, కంప్యూటర్‌ ‌సైన్స్, ఇన్ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ నిపుణుడిగా ఆంధ్రాయూనివర్శిటీలో ఎందరో విద్యార్ధులకు సుపరిచితులు. ఆయన ఏయూ కంప్యూటర్‌ ‌సైన్స్ ‌విభాగంలో అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌గా 1987లో ఉద్యోగ బాధ్యతలను చేపట్టి సీనియర్‌ ‌ప్రొఫెసర్‌గా నేడు సేవలు అందిస్తున్నారు. గతంలొ ఆచార్య ప్రసాద రెడ్డి 2008-2011 వరకు రిజిస్ట్రార్‌గా, 2011-2012 వరకు వర్సిటీ రెక్టార్‌గా, కంప్యూటర్‌ ‌సైన్స్ ‌విభాగాధిపతిగా, వర్సిటీలో పలు పరిపాలనా పరమైన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించారు. ఆచార్య ప్రసాదరెడ్డి వేలాది మంది విద్యార్థులను మలచిన స్ఫూర్తిదాయక ఆచార్యునిగా పేరుగాంచారు. ఆయన 33 సంవత్సరాలుగా బోధన వృత్తిలో కొనసాగుతున్నారు. ఆచార్య ప్రసాద రెడ్డి పర్యవేక్షణలో 47 మంది డాక్టరేట్‌లు అందుకున్నారు. ఆయన 195కిపైగా పరిశోధన పత్రాలను జాతీ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురించారు. రెండు పేటెంట్లను,  వీటికి పలు అవార్డులు సైతం రావడం జరిగింది. ఇన్ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ, డేటా సైన్స్ ‌రంగాలలో అత్యంత ప్రముఖ పరిశోధకుల్లో ఆయన ఒకరుగా నిలచారు. ఆచార్య ప్రసాద రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2011 సంవత్సరంలో ఉత్తమ ఆచార్యునిగా అవార్డును స్వీకరించారు. ఆచార్య ప్రసాదరెడ్డి బోధన, పరిశోధన రంగాలతో పాటు పరిపాలనా రంగంలో సైతం తనదైన సమర్ధతను ఆయన చాటుకున్నారు. వర్సిటీ రిజిస్ట్రార్‌, ‌రెక్టార్‌గా పదవులను పూర్తిచేసిన అనంతరం, విభాగాధిపతిగా కొనసాగడం ఆయన ప్రత్యేకత. నిత్యం బోధన చేస్తూ విద్యార్థులకు మార్గదర్శకం చేస్తూ పూర్తిస్థాయిలో ఉపాదిని కల్పించే దిశగా కృషిచేసారు. నేడు ఆంధ్రాయూనివర్శిటీ పూర్తిస్థాయి కులపతిగా బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ యాప్, www.enslive.net న్యూస్ వెబ్ సైట్ టీమ్ నుంచి అభినందనలు తెలియజేస్తుంది.

ఆంధ్రాయూనివర్శిటీ

2020-11-26 17:53:43

లోక‌క‌ల్యాణం కోసం తుల‌సి వివాహం..

 విశ్వంలోని స‌క‌ల‌జీవులు సుభిక్షంగా ఉండాల‌ని, లోక‌క‌ల్యాణం కోసం తుల‌సి వివాహం కార్య‌క్ర‌మాన్ని టిటిడి చేప‌ట్టింద‌ని కంచి కామ‌కోటి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి ఉద్ఘాటించారు. కార్తీక మాసంలో టిటిడి త‌లపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా గురు‌వారం తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో శ్రీ తులసి ధాత్రి స‌హిత దామోద‌ర పూజ‌ ఘనంగా జరిగింది. ఉద‌యం 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ పూజా కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.  ఈ పూజ‌లో పాల్గొన్న శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి అనుగ్ర‌హ భాష‌ణం చేస్తూ స‌నాత‌న ధ‌ర్మంలో తుల‌సి వివాహానికి విశేష ప్రాధాన్యం ఉంద‌న్నారు. జీవిత‌చ‌క్రంలో వివాహం ముఖ్య‌మైన ఘ‌ట్ట‌మ‌న్నారు. తుల‌సి భ‌క్తికి, ఆరోగ్యానికి ప్ర‌తీక అన్నారు. ప్ర‌తి ఇంట్లో తుల‌సి మొక్క ఉంటుంద‌ని, మ‌హిళ‌లు త‌మ సౌభాగ్యం కోసం తుల‌సికి పూజ‌లు చేస్తార‌ని చెప్పారు. స‌నాత‌న ధ‌ర్మ ప్ర‌చారంలో భాగంగా ప‌విత్ర‌మైన కార్తీక మాసంలో టిటిడి చేప‌ట్టిన కార్తీక దీక్ష కార్య‌క్ర‌మాల‌ను అభినందించారు.  అంత‌కుముందు ఉద‌యం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని వ‌సంత మండ‌పానికి వేంచేపు చేశారు. ఈ సంద‌ర్భంగా వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ మోహ‌న రంగాచార్యులు మాట్లాడుతూ శ్రీ తుల‌సీ ధాత్రి స‌హిత దామోద‌ర పూజ విశిష్ట‌త‌ను తెలియ‌జేశారు. అనంత‌రం కార్తీక విష్ణుపూజా సంక‌ల్పం చేసి ప్రార్థ‌నా సూక్తం, తుల‌సి,  ధాత్రి(ఉసిరి) క‌ల్యాణం, శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి తిరువారాధ‌న చేశారు. ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం, హార‌తి స‌మ‌ర్పించారు. అనంత‌రం క్షమా ప్రార్థ‌న‌, మంగ‌ళంతో ఈ పూజ ముగిసింది. అదేవిధంగా, రాత్రి ... 7.15 నుంచి 7.45 గంటల వరకు తిరుమల నాదనీరాజనం వేదికపై  డా.మారుతి 'కార్తీక పురాణం - విష్ణువైభవం' పారాయణం చేయనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు  వేణుగోపాల దీక్షితులు,  కృష్ణ‌శేషాచ‌ల దీక్షితులు, వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు  ఎన్ఎకె.సుంద‌ర‌వ‌ద‌నాచార్యులు‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తిరుమల

2020-11-26 16:20:52

2020-11-26 11:16:25

2020-11-26 10:41:23

2020-11-26 10:23:14