1 ENS Live Breaking News

31న విజ‌య‌న‌గ‌రం జిల్లా స‌మీక్ష స‌మావేశం

విజయనగరం జిల్లా స‌మీక్ష స‌మావేశం జ‌న‌వ‌రి 31న జిల్లా ఇన్ ఛార్జి మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి బూడి ముత్యాల నాయుడు అధ్య‌క్ష‌త‌న జ‌రుగుతుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్య‌కుమారి తెలిపారు. క‌లెక్ట‌ర్ కార్యాల‌య ఆడిటోరియంలో జరిగే సమావేశంలో  ధాన్యం సేక‌ర‌ణ‌, గృహ‌నిర్మాణం, వైద్య ఆరోగ్యం, తాగునీటి స‌ర‌ఫ‌రా, సంక్షేమ ప‌థ‌కాలు - డి.ఆర్‌.డి.ఏ., వ్య‌వ‌సాయం, ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌, మ‌హిళా శిశు సంక్షేమ‌, ఉపాధిహామీ, జ‌ల‌వ‌న‌రులు, విద్య‌, గ‌డ‌ప‌గ‌డ‌పకు మ‌న ప్ర‌భుత్వం త‌దిత‌ర అంశాల‌పై ఈ స‌మావేశంలో చ‌ర్చిస్తామన్నారు.

Vizianagaram

2023-01-23 14:55:23

ప్రతిఉద్యోగికి ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి

ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులందరూ ముఖ ఆధారిత హాజరు యాప్ నందు తమ వివరాలు నమోదు చేసుకొని, ప్రతిరోజు  తప్పకుండా ఆ యాప్ నందు 
హాజరు వేయాలని విశాఖజిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ లో జిల్లా అధికారులకు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ 
వినియోగంపై దిశా నిర్దేశం చేశారు.. ప్రతి శాఖ విభాగాధిపతులు ఉద్యోగుల యొక్క హాజరు వివరాలను యాప్ నందు నమోదు చేసేటట్లు చూడాలని ఆదేశించారు. 
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రతీరోజూ మూడు సార్లు హాజరు నమోదు చేయాల్సిందేనన్నారు. ఎవరికీ మినహాయింపులు లేవన్నారు.

Visakhapatnam

2023-01-23 14:47:18

24న అనకాపల్లి పాలిటెక్నిక్ లో మినీ జాబ్ మేళా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్, సీడాప్ ఆధ్వర్యంలో ఈ నెల 24న అనకాపల్లి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో మినీజాబ్ 
మేళా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి జిల్లా అధికారి టి.చాముండేశ్వరరావు ఒక ప్రకటనలో తెలియజేశారు.యోకోహమా కంపెనీతో  మినీ  జాబ్ మేళా    
నిర్వహిస్తున్నామని ఈ ఇంటర్వ్యూలకు డిప్లొమా, బి.ఎస్.సి చేసి 5.3 ఎత్తు ఉన్న యువతులు మాత్రమే పాల్గొనాలని సూచించారు. మరిన్ని వివరాలకు 
8247505171, 7036363272లో సంప్రదించాలన్నారు.

Anakapalle

2023-01-23 14:42:19

ఉద్యోగుల ఆధార్ మార్పులకు ప్రత్యేక కేంద్రం

ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఆధార్ లో మార్పులు చేర్పులు చేసుకోవటానికి కలక్టరేట్ లో నేటి నుండి3రోజులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తు్న్నట్టు 
జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున తెలియజేశారు. ఈ కేంద్రాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆధార్ ప్రత్యేక డ్రైవ్  కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ 
కె.యస్.విశ్వనాథన్ ప్రారంభించారు. ప్రభుత్వం ఆధార్ లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించినందున ప్రతీ ఉద్యోగి మార్పులను నమోదు చేసుకోవాలని 
జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా జిల్లాశాఖల సిబ్బందికీ ఈ విషయాన్ని తెలియజేయాలన్నారు.

Visakhapatnam

2023-01-23 14:30:53

ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్, జి20 సదస్సులు

విశాఖలో ఈ ఏడాది మార్చిలోజరగనున్న రెండు అంతర్జాతీయ సదస్సులను విజయవంతం చేసేందుకు వివిధ పరిశ్రమల యాజమాన్యాలు సహకరించాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి, విశాఖ జిల్లాలలోని భారీ పరిశ్రమల ప్రతినిధులతో సోమవారం విశాఖ జిల్లా పరిషత్ లో ఏర్పాటు చేసిన కన్సల్టెంట్ కం ఇంట్రాక్షన్ మీటింగ్లో మంత్రి మాట్లాడారు.  మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు విశాఖపట్నంలో నిర్వహించనున్నామని, అదే నెల 28,29,30వ తేదీలలో భారతదేశం నాయకత్వం వహిస్తున్న జీ-20 సదస్సు విశాఖలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నామని చెప్పారు. ఈ సమావేశానికి 45 దేశాలకు చెందిన సుమారు 250 మంది ప్రతినిధులు పాల్గొననున్నారని అని చెప్పారు. ఇటువంటి జి20 సదస్సులు దేశంలోని 50 ప్రాంతాలలో నిర్వహించనున్నారని, మౌలిక సదుపాయాల అంశంపై విశాఖ నగరంలో జీ 20 సదస్సు జరగబోతుందని మంత్రి అమర్నాథ్ తెలియజేశారు.

 ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన ఈ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యమివ్వటం మనమంతా గర్వంగా భావించాలని, ఈ సదస్సును విజయవంతం చేయడం ద్వారా రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయని ఆయన చెప్పారు. ప్రపంచ ఆర్థిక రంగంలో 75% ఆదాయాన్ని సమకూర్చుతున్న దేశాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కావడం గమనార్హమని మంత్రి అమర్నాథ్ తెలియజేశారు. గతంలో విశాఖ నగరంలో అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సులు జరిగాయని, ఆయా సదస్సులను దృష్టిలో పెట్టుకుని నగరంలో తాత్కాలిక సుందరీ కారణ పనులు చేపట్టారని, ఈసారి ఆ విధంగా కాకుండా శాశ్వత ప్రాతిపదికన పనులు జరగాలని మంత్రి అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. పనుల నాణ్యత కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని ఆయన సూచించారు. నగర సుందరీకరణకు సంబంధించి ఏ పనులు చేయాలో ఇప్పటికే ఒక జాబితా సిద్ధం చేశామని వీటిలో ఏ పనులునైనా పరిశ్రమల యాజమాన్యాలు తీసుకుని పూర్తి చేయవచ్చని ఆయన సూచించారు. 

ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఉన్న బీచ్ రోడ్డును అభివృద్ధి చేయడం, నగరంలో ఉన్న పర్యాటక కేంద్రాలను విదేశీయులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దడం వంటి పనులు శరవేగంగా చేపట్టాలని ఆయన సూచించారు. అలాగే అరకు కాఫీ మ్యూజియం వంటి అనేక పర్యాటక ప్రదేశాలను సుందరీకరించాలని అమర్నాథ్ కోరారు.
కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి తెలిసే విధంగా సుందరీకరణ పనులు జరగాలని పరిశ్రమల యాజమాన్య ప్రతినిధులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, జీవీఎంసీ కలిసి సుమారు 200 కోట్ల రూపాయలతో ఈ సుందరీకరణ పనులు చేయబోతున్నాయని ఆయన చెప్పారు .నగరం మొత్తం మీద సుమారు 148 కిలోమీటర్ల రోడ్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనున్నామని, విద్యుదీకరణ, సుందరీకరణకు సంబంధించి సుమారు 150 పనులు చేపట్టనున్నామని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా విశాఖ సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో వివిధ పరిశ్రమల యాజమాన్యాలు నగరాభివృద్ధి పనులలో కీలకపాత్ర పోషించాలని కలెక్టర్ మల్లికార్జున విజ్ఞప్తి చేశారు.

Visakhapatnam

2023-01-23 14:23:58

జిల్లా కలెక్టర్ కు రూ.25 లక్షల చెక్కు అందజేత

ప్రధాన మంత్రి టి.బి.ముక్తా భారత్ అభియాన్ క్రింద డా.రెడ్డీస్ లేబరేటరీస్ జిల్లాలో 595 మంది  టి.బి వ్యాధి గ్రాస్థులకు ఫుడ్ బాస్కెట్ నెలకు రూ.700/-లు చొప్పున 6 నెలలపాటు అందజేయు నిమిత్తం 25 లక్షల రూపాయల చెక్కును జిల్లా టి. బి. కొంట్రోల్ అధికారిణి  డా. అనురాధ జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ కి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో స్పందన కార్యక్రమంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో జెసి ఎం. నవీన్, డీఆర్వో రాజేశ్వరి, డా.రెడ్డీస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ బి. సురేష్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ కిరణ్,జిల్లా పరిషత్ సి.ఇ.ఓ వెంకట్ రామన్, డ్వామా పీడీ జి.వి.చిట్టిరాజు, డీపీఓ రవికుమార్, డి.ఎస్.ఓ వెంకట రమణ, అగ్రీ ఏడీ శ్రీధర్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2023-01-23 13:29:39

ఏయూలో జయహో జనగణమన ప్రోమో ఆవిష్కరణ

స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహిస్తున్న జయహో జనగణమన వారోత్సవాలు ప్రోమోను ఏయూ విసి ఆచార్య పివిజిడి ప్రసాదరెడ్డి సోమవారం ఆవిష్కరించారు. జనగణమన గీతారాపన ప్రతి భారతీయుడి భాద్యత అన్నారు. గతంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్లాటినం జూబ్లీ గ్రౌండ్స్ లో ఏయూ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ సంయుక్త భాగస్వామ్యంతో జనగణమన శత వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారని గుర్తు చేసారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షులు, ఏయూ సైకాలజీ పరిశోధక విద్యార్థి గంట్ల శ్రీనుబాబు  పాల్గొన్నారు.

Visakhapatnam

2023-01-23 13:23:41

వ్యవసాయాధికారుల సంఘం డైరీ ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అధికారుల సంఘం విశాఖపట్నం జిల్లా యూనిట్ ప్లాంట్ డాక్టర్స్ డైరీ - 2023, ప్లానర్ లను జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున  ప్రారంభించారు. సోమవారం కలెక్టరేట్లో అధికారుల సమక్షంలో వీటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా వ్యవసాయ అధికారి అప్పలస్వామి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డా.బొడ్డేపల్లి విజయ ప్రసాద్, జిల్లా కార్యదర్శి డా.నవీన్ జ్ఞానమణి  మరియు జిల్లాలో ఉన్న పలువురు సహాయ వ్యవసాయ సంచాలకులు మరియు వ్యవసాయ అధికారులు  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Visakhapatnam

2023-01-23 12:54:01

ఓటు హ‌క్కుపై అవ‌గాహ‌న కోసం సెల్పీ పాయింట్

జ‌న‌వ‌రి 25న జాతీయ ఓట‌ర్ల దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ఓటు హ‌క్కుపై అవ‌గాహ‌న క‌ల్పిస్తూ స్థానిక క‌లెక్ట‌రేట్ స‌మీపంలోని మ‌హాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్ర‌హాల కూడ‌లి వ‌ద్ద‌ ప్ర‌త్యేక‌ సెల్పీ పాయింట్ ఏర్పాటు చేశారు. జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి మొదటి ఫొటో తీసుకోవ‌టం ద్వారా సంబంధిత సెల్పీ పాయింట్‌ను సోమ‌వారం ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ క్ర‌మంలో ఆమె వృద్ధులు, హిజ్రాలు, యువ ఓట‌ర్ల‌తో ఫొటోలు దిగారు. స్థానిక రెవెన్యూ అధికారులు, ఎన్నిక‌ల విభాగం అధికారులు ఓట‌ర్లు సెల్పీ ఫొటోలు దిగ‌డానికి అనువుగా చిన్న వేదిక‌, థ‌ర్మోకోల్ సీట్ల‌తో డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేశారు. కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ స‌హాయ క‌మిష‌న‌ర్ ప్ర‌సాద‌రావు, స్థానిక త‌హ‌శీల్దారు బంగార్రాజు, ఎల‌క్ష‌న్ సెల్ సూప‌రింటెండెంట్ మ‌హేశ్ ఇత‌ర అధికారులు, స‌చివాల‌య సిబ్బంది తదిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-01-23 12:39:19

జ‌న‌వ‌రి 27 నుంచి విశాఖ‌లో చ‌తుర్వేద హ‌వ‌నం

టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్‌, శ్రీ‌ వేంక‌టేశ్వ‌ర ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ సంయుక్త ఆధ్వ‌ర్యంలో జ‌న‌వ‌రి 27 నుంచి 31వ‌ర‌కు విశాఖ‌ప‌ట్నం పెందుర్తిలో గ‌ల శ్రీశార‌దా పీఠంలో చ‌తుర్వేద హ‌వ‌నం జ‌రుగ‌నుంది. శ్రీ శార‌దా పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర మ‌హాస్వామి,  ఉత్త‌ర పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వాత్మానందేంద్ర స‌ర‌స్వ‌తి స్వామి ఆశీస్సుల‌తో లోక క‌ల్యాణం కోసం 5 రోజుల పాటు ఈ చ‌తుర్వేద హ‌వ‌నం నిర్వ‌హిస్తారు. ఈ కార్య‌క్ర‌మంలో 32 మంది వేద పండితులు, శాస్త్ర పండితులు పాల్గొంటారు. జనవరి 31న పూర్ణాహుతితో చ‌తుర్వేద హ‌వ‌నం ముగుస్తుంది. ఈ హ‌వ‌నంలో పాల్గొనే భ‌క్తుల‌కు సుఖ‌శాంతులు, ధ‌న‌ధాన్యాలు, దీర్ఘాయుష్షు చేకూరుతాయ‌ని పండితులు తెలిపారు. 
 టీటీడీ జేఈవో  సదా భార్గవి ఆదివారం విశాఖ శారదా పీఠంలో శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర మ‌హాస్వామిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం చతుర్వేద హవనం ఏర్పాట్లను పరిశీలించారు. యజ్ఞ వేదిక, సాంస్కృతిక కార్యక్రమాల వేదిక, భక్తుల కోసం చేపడుతున్న ఇతర ఇంజనీరింగ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జెఈఓ వెంట ఇఇ  సుధాకర్, ధార్మిక ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి  విజయలక్ష్మి, ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ తదితరులు ఉన్నారు.

Pendurthi

2023-01-23 10:11:27

విశాఖలోపద్మశాలి సంఘానికి స్థలం కేటాయించాలి

విశాఖజిల్లాలో పద్మశాలి కులస్తులకు అన్ని రాజకీయ పార్టీల్లో సముచితస్థానం కల్పించాలని, పద్మశాలి సంఘానికి సామాజిక భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని కోరుతూ  విశాఖ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైన రాజకీయ ప్రముఖులకు సంఘం నేతలు వినతిపత్రం అందజేశారు. ఆదివారం శంకరమఠం రోడ్ లో ఉన్న పద్మశాలి భవనంలో విశాఖజిల్లా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వందలాదిమంది కుల బంధువులు హాజరైన ఈవేడుకల్లో  ప్రమాణ స్వీకారం మహోత్సవానికి అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి, కోస్తాంధ్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు జీవి నాగేశ్వరరావు, ఆప్కోస్ చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు, రాష్ట్ర చేనేత విభాగ అధ్యక్షులు గంజి చిరంజీవి,  అఖిల భారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శులు గడ్డం జగన్నాథం, వానపల్లి వెంకట్రావు, ఉపాధ్యక్షులు వద్ది నరసింహులు, జీవీఎంసీ కో ఆప్షన్ సభ్యురాలు కొప్పల ప్రభావతి, కోస్తాంధ్ర పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి అందే జగదీష్, మహిళా అధ్యక్షురాలు కాపు కళ్యాణి, ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా నూతన కమిటీ కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకార మహోత్సవం చేయించారు.

 ఈ కార్యక్రమానికి విశాఖ నగర మేయర్ గోలగాని హరి వెంకట కుమారి, వైసీపీ నాయకులు గోలగాని శ్రీనివాస్,  రాజ్యసభ సభ్యులు జీవియల్ నరసింహరావు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్,  నెడ్ క్యాప్ చైర్మన్, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె కె రాజు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి,  బిమిలీ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి కోరాడ రాజబాబు,  వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్, 14 వార్డు  కార్పొరేటర్ అనిల్ కుమార్ రాజుతోపాటు వావిలాల సరళ దేవి ఇతర ముఖ్య నాయకులు పాల్గొని పద్మశాలి కులస్తులంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో పద్మశాలి కులస్తులకు సముచిత స్థానం కల్పించాలని, రాష్ట్రంలో కనీసం ఐదు ఎమ్మెల్యే సీట్లు కేటాయించేలా డిమాండ్ చేయాలని, ఆ దిశగా పద్మశాలి కులస్తులంతా ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. చేనేత వృత్తి పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని, ఆర్థికంగా వెనుకబడి ఉన్న పద్మశాలి కులస్తులను ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు.



నూతన కార్యవర్గం...
 గౌరవ అధ్యక్షులుగా కొప్పల రమేష్, అధ్యక్షులుగా వానపల్లి ఈశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ సూరిశెట్టి సూరిబాబు, ప్రధాన కార్యదర్శిగా వానపల్లి సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా పెంటపల్లి సత్యనారాయణ, పప్పు శ్రీనివాసరావు, నీలి రవి, కోశాధికారిగా నామాల అనేష్ కుమార్, మహిళా విభాగ అధ్యక్షురాలుగా గాయత్రి ఫణి కుమారి, యువత అధ్యక్షులు గా కొండపల్లి సతీష్ లు తోపాటు గౌరవ సలహాదారులుగా కులపాక సన్యాసిరావు, కరణం వెంకటేశ్వరరావు, చిక్కా సత్యనారాయణ, రాపర్తి సుబ్బారావు, కల్లూరి రామూర్తి వ్యవహరించనున్నారు.

Visakhapatnam

2023-01-22 17:22:05

అరసవిల్లి రథసప్తమికి విఐపిలకు రూ.500తో పాసులు

ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి ఉత్సవాల్లో  విఐపిలకు ప్రత్యేకంగా రూ.500 పాసులను అందుబాటులోకి తీసుకొచ్చిన్టటు ఈవో వి.హరి సూర్య ప్రకాష్ ప్రకటించారు. ఈ మేరకు మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఈ పాసులను అరసవల్లి యూనియన్ బ్యాంక్ లో రూ.500 చెల్లించి పొందవచ్చనన్నారు. ఈ పాసులను శ్రీకాకుళం ఆర్డిఓ  బి.శాంతి అనుమతి పత్రం పొందిన వారికి మాత్రమే అందజేస్తారని.. ఒక్కో విఐపి టిక్కెట్ తో ఇద్దరకు మాత్రమే అనుమాతిస్తారని పేర్కొ్న్నారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో డోనార్ పాసులు పంపిణీ జరుగుతుందన్నారు. అదే రోజు ఆలయ దాతలకు  ఆలయ కార్యాలయం వద్ద అందజేస్తామన్నారు. ఈ నెల 26సాయంత్రం లోపు రూ.లక్ష  రూపాయలు వరకు విరాళాలు ఇచ్చిన వారి నుంచి   స్వీకరించేందుకు అవకాశం ఇస్తున్నామని ఇలా ఇచ్చే దాతలకు కూడా డోనార్ పాసులను అందజేస్తామన్నారు. అలాగే ఈనెల 23నుండి ఇంతవరకు ఆలయంలో విరాళాలు ఇచ్చిన దాతలకు ఆలయ సిబ్బంది ద్వారా ఫోన్లో దాతల పాసులకు సంబంధించిన వివరాలను తెలియజేస్తామని తెలియజేశారు. నేరుగా దాతలు వారి అనుమతి తో వచ్చిన సంబంధికులుకు మాత్రమె డోనార్ పాసులను అందజేస్తామని ఈవో స్పష్టం చేశారు.

Arasavilli

2023-01-22 17:09:33

భద్రతకు ఆర్టీసీ ప్రయాణీకులకు భరోసానివ్వాలి

ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టిసి ద్వారా అత్యధికంగా ప్రజలను ఒక చోట నుంచి మరొక చోటుకు చెర్చే సేవలో ఆర్టిసి ఉద్యోగుల సేవలు ఆదర్శంగా ఉండాలని జిల్లా రవాణా అధికారి కె వి కృష్ణా రావు పేర్కొన్నారు. రాజమండ్రి ఆర్టిసి  కార్యాలయంలో ఆదివారం 34 వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా ఆర్టిసి  డ్రైవర్లకు, సిబ్బందికి నిర్వహించి అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో  మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. వాహనాల నిర్వహణ పై అవగాహన, ఎప్పటి కప్పుడు మరమ్మత్తు చర్యల ద్వారా  జరుగుతున్న ప్రమాదాలు మరియు మరణాల సంఖ్యను తగ్గించడం సాధ్యం అవుతుందని అన్నారు.

 బ్లాక్‌స్పాట్‌ల వద్ద అప్రమత్తత, రహదారి సూచికలను పాటించడం, ట్రాఫిక్ అనుగుణంగా రోడ్ల విస్తరణ ఆవశ్యకత, డ్రైవర్లను అప్రమత్తం చేసేందుకు జీపీఎస్ సిస్టమ్,  డ్రైవింగ్ శిక్షణ (ఇప్పటికే ఉన్న మరియు ఔత్సాహిక డ్రైవర్లకు) అందించడం ద్వారా నిరంతరం నైపుణ్యం పెంచు కావాలని అన్నారు. కంటి పరీక్షలను క్రమ పద్ధతిలో చేసుకోవడం చాలా అవసరం అన్నారు. ఆర్టిసి ఆర్ఎం ఎస్కే షబ్నం మాట్లాడుతూ, ఆర్టిసి డ్రైవర్లు ప్రజా రవాణాలో విశిష్ట సేవలు అందిస్తు అత్యధిక ప్రయాణికులను వారి వారి గమ్య స్థానాలకు చేరవేస్తు గొప్ప సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు, అంకిత భావంతో విధులు నిర్వహిస్తు ట్రాఫిక్ నియమాలపై సంపూర్ణ అవగాహన కలిగి వుండి వాటిని కచ్చితంగా పాటించాలన్నారు. ఒక ఆర్టీసీ డ్రైవర్ చేతిలో 50 మందికి పైన ప్రయాణికుల ప్రాణాలు ఉంటాయియని ఎంతో నిబద్ధతతో విధులు నిర్వహించాలని తెలిపారు.

జిల్లా ఆర్టిసి అధికారి కే.షర్మిలా అశోక  కొంతమంది డ్రైవర్లు కంటి చూపు మందగించినప్పటికి నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నారని, దృష్టిలోపాలతో వాహనాలు నడుపుట వలన దూరంగా వచ్చే వాహనాల రాకపోకలను గుర్తించ లేకపోవడం చాల ప్రమాదాలకు దారి తిస్తున్నాయని  అన్నారు. దృష్టి లోపం ఉన్న డ్రైవర్లు కంటి పరీక్షలను తరచుగా చేయించుకొంటు అవసరమైన మందులను వాడటం, కంటి అద్దాలను పెట్టుకోవడం చేయాలన్నారు. ఆరోగ్యం పట్ల ఎప్పుడు నిర్లక్ష్యం వహించవద్దని కోరారు.  రహదారి భద్రత పై అవగాహన అవసరం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంపత్, ఆర్టిసి, రవాణా శాఖ అధికారులు,  డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


Rajamahendravaram

2023-01-22 16:06:05

వివేకానంద మాట-బాట మనందరికీ ఆదర్శం

స్వామి వివేకానంద చెప్పిన మాట, ఆయన నడిచిన బాట మనందరికీ ఆదర్శమని, ముఖ్యంగా యువత ఆ దిశగా నడవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ యువతకు పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా గురువారం సూర్యమహల్ కూడలి వద్ద  వివేకానంద విగ్రహానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,  స్వామి వివేకానంద జయంతిని దేశవ్యాప్తంగా నేడు జరుపుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. అతి చిన్న వయసులో పెద్ద సందేశాన్ని మనకు అందించిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని కొనియాడారు. నరేంద్ర నాథ్ దత్త అనే పేరు బహుశా చాలామందికి తెలియకపోవచ్చు కాని వివేకానందగా ప్రపంచం మొత్తం ఆయనను గుర్తిస్తారని తెలిపారు. చాలా చిన్నవయసు నుండి స్వాభిమానం, దేశభక్తి ఉన్న ఆయన నిస్వార్ధ భావనతో ప్రజల కోసం, సమాజం కోసం, దేశం కోసం యువత ఎలా కష్టపడాలన్న సందేశాన్ని మనకు అందించారని అన్నారు. ఆయన మాటలు మనందరికీ స్పూర్తిగా ఉంటాయని,  స్వామి వివేకానంద మాట, బాట మనందరికీ ఆదర్శమని, ఆ దిశగా యువత ముందుకుసాగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

Srikakulam

2023-01-12 10:20:27

వ్యవసాయ యంత్ర పరికరాల ధరలు ఖరారు

వివిధ రకాల వ్యవసాయ యంత్ర పరికరాలకు సంభందించి, విజయనగరం జిల్లా ధరల నిర్ణాయక కమిటీ సమావేశం, కలెక్టరేట్ సమావేశ మందిరంలో  జరిగింది. కమిటీ ఛైర్మెన్, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, వివిధ పరికరాల ధరలపై అధీకృత డీలర్లు, తయారీదారులతో చర్చించారు. ట్రాక్టర్ తో కలిపి ఉపయోగించే 9 పళ్ళ నాగలి సెట్, దమ్ము సెట్ హాఫ్ కేజ్ వీల్, హాఫ్ కేజ్ వీల్, చదును చేసే బ్లేడ్, గుంటక బ్లేడ్, రెండు పళ్ళ నాగలి, పది పళ్ళ దంతి తదితర పరికరాల ధరల నిర్ణయం పై వారితో చర్చించారు.  వేర్వేరు కంపెనీల డీలర్లు, తయారీదారులు కోట్ చేసిన ధరలను, ఖరారు చేయడానికి  ప్రభుత్వానికి పంపిస్తామని జెసి తెలిపారు. కంబైన్డ్ హార్వెస్టర్స్, టార్పాలిన్లు, స్ప్రేయర్లు, ట్రాక్టర్ల ధరలను ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో నిర్ణయించిందని చెప్పారు.  ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి త్రినాథస్వామి, ఉద్యాన శాఖాధికారి జమదగ్ని, అగ్రోస్ డిఎం ప్రసాదరావు, డాట్ సైంటిస్ట్ తేజేశ్వరరావు, వ్యవసాయ శాఖ ఎడి ప్రకాష్, ఇతర అధికారులు, 24 మంది డీలర్లు పాల్గొన్నారు.

Vizianagaram

2023-01-12 10:12:08