1 ENS Live Breaking News

మాతా శిశుమరణాలను శతశాతం తగ్గించాలి

డా.బి.ఆర్.అంబేత్కర్ కోనసీమ జిల్లాలో మాతాశిశు మరణాలు తగ్గించేం దుకు వైద్య ఆరోగ్యశాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా వైద్యసేవల సమన్వయ అధి కారులతో సమీక్ష సమావేశం  నిర్వహించి ఆర్ సి హెచ్ నమోదు, మాతా శిశు మరణాలు గర్భిణీలు నమోదు బాలింతలు గర్భిణీలు చిన్నారులలో పోషకాహార లోపాలు ఆసుపత్రులలో పరిసరాల పరిశుభ్రత తదితర అంశాల పురోగతి పై సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతా శిశు మరణాల రేటును తగ్గించడంలో వైద్యులు కీలకంగా వ్యవహరించి తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మహిళ గర్భం దాల్చిన నాటి నుండి ఏఎన్ఎం సంబంధిత వైద్యాధికారి ప్రతి నెల రెగ్యులర్గా గర్భిణీ ఇంటికి వెళ్లి వైద్య సేవలు అందించడం తోపాటు ప్రసవ ప్రణాళిక కొరకు నివేదిక రూపొందించి సుఖ ప్రసవం జరిగేట్టు జాగ్రత్తలు పాటించాలన్నారు. కాన్పు ప్రమాదకరమైన భావించిన కేసుల పట్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.

 ఒక్కొక్క వైద్యుడు 15 మంది గర్భిణీలను ఆరోగ్య పరిరక్షణ సేవలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. గర్భం దాల్చిన మహిళ తమ పుట్టింటికి కాన్పు నిర్వహించు కునేందుకు వెళ్లిన సందర్భంలో స్థానిక వైద్యులతో కూడా రెగ్యులర్గా ఆమె ఆరోగ్య స్థితిగతులపై మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. తల్లులు చిన్నారులకు పాలు పట్టే విధానంపై కూడా తగు సూచనలు వైద్యులు ఏఎన్ఎంలు చేయాలన్నారు. గర్భిణీలు కాన్పు నిర్వహణ సందర్భంలో చనిపోయినట్లయితే చనిపోవడానికి గల కారణాలను అన్వేషించి  నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇకపై తరచుగా ఆసుపత్రులలో తనఖి నిర్వహిం చడం జరుగుతుందని తనిఖీలకు వెళ్లిన సందర్భంలో పెనాయిల్ వాసన తప్ప వేరే వాసన రాకూడ దని పరిసరాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత నివ్వాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్ర మంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎం.దుర్గారావు దొర డి సి హెచ్ ఎస్ పద్మశ్రీ రాణి ఇతర వైద్య అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Amalapuram

2023-01-25 11:25:09

మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాల విక్రయంపై నిఘా

యువత మత్తు పదార్ధాలకు, మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా తగుచర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు.  సిగరెట్లు, పొగాకు సంబంధిత వస్తువులను అమ్మే వారిపై,  మందులు అమ్మే దుకాణాలు, ఇతర బడ్డీ కొట్లు  పై గట్టి నిఘా ఉంచాలని తెలిపారు.  జాతీయ బాలల హక్కుల కమిషన్  మాదక   ద్రవ్యాల నిరోధక శాఖలు సంయుక్తంగా రూపొందించిన  జాయింట్ ఆక్షన్ ప్లాన్ పై  బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు  అనుమానం ఉన్న ప్రాంతాలలో ప్రత్యెక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలల  దగ్గరలో బడ్డీ కోట్లు ఉండకుండా చూడాలని, 18 సంవత్సరాల లోపు వారికీ సిగరెట్లు, మందు వంటివి విక్రయించకుండా చూడాలని,  చట్టం లోని అంశాలను దుకాణాల వద్ద ప్రదర్శించాలని సూచించారు. పాఠశాలలు,  కాలేజీల వద్ద,  సి సి కెమెరాలను ఏర్పాటు చేయాలనీ సూచించారు. 

 అదే విధంగా మందుల షాప్ వద్ద కూడా సిసి కెమెరాల ను ఏర్పాటు చేయడమే కాకుండా మాదక ద్రవ్యాల నిరోధక చట్టం లోని అంశాల పై అవగాహన కలిగించి, 
నిబంధనలను డిస్ప్లే చేయించాలని తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం వలన శరీర అవయవాల పై పడే చెడు ప్రభావాన్ని యువతకు తెలిసేలా విద్యా సంస్థల్లో  
అవగాహనా తరగతులను నిర్వహించాలని సూచించారు. మహిళా పోలీస్ కు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ముందుగా చట్టం పై పూర్తిగా అవగాహన కలిగించాలని, 
వారు  గ్రామాల్లో, విద్యా సంస్థల్లో సమావేశాల్లో  అవగాహన కలిగిస్తారన్నారు. మత్తును కలిగించే మందులు వైద్యుల  చీటీ లేకుండా విక్రయించ  రాదనే నిబంధన 
పటిష్టంగా అమలు జరపాలన్నారు. యువత ఎక్కువగా గుమిగూడి ఉన్న ప్రాంతాలను గుర్తించి  ఆ ప్రాంతాల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగకుండా చూలన్నారు. 
ఈ సమావేశంలో ఎక్షైజ్ సూపరింటెండెంట్ వి.సుదీర్,  దిశా డి.ఎస్.పి  వెంకటేశ్వర్లు,  సి.డబ్లు.సి ఛైర్పర్సన్ హిమ బిందు,  డ్రగ్స్ కంట్రోల్ ఏ.డి  కే. రజిత,  
డి.ఈ.ఓ లింగేశ్వరరెడ్డి, సర్వసిక్షా అభియాన్ పి.ఓ డా.స్వామి నాయుడు, జిల్లా పరిషత్ సి.ఈ.ఓ  డా.అశోక్  కుమార్,  డి.ఎం.హెచ్.ఓ డా.రమణ కుమారి,  
ఐ.సి.డి.ఎస్. పి.డి శాంత కుమారి,  తదితరులు పాల్గొన్నారు. 

Vizianagaram

2023-01-25 10:51:28

బర్డ్ ఆస్పత్రిలో తక్కువ ఖర్చుతో రక్త పరీక్షలు


తిరుపతి బర్డ్ ఆస్పత్రిలో తక్కువ ఖర్చుతో రోగులకు రక్త పరీక్షలు నిర్వహించనున్నట్లు టిటిడి ఈవో  ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. బర్డ్ లో అత్యాధునిక నూతన కేంద్రీయ రక్త పరీక్ష కేంద్రాన్ని బుధవారం ఉదయం ఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ, బర్డ్, శ్రీ పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రికి వచ్చే రోగులకు రక్త పరీక్షలు నిర్వహించేందుకు రూ. 80 లక్షలతో టీటీడీ అత్యాధునిక నూతన కేంద్రీయ రక్త పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇందులో హేమటాలజీ, సేరాలజి , కోయా గూలేషన్, బయో కెమిస్ట్రీ వంటి రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. స్విమ్స్, రుయా, బయట ఆసుపత్రుల నుండి  వచ్చే రోగులకు కూడా తక్కువ ఖర్చుతో రక్త పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో పెథలాజికల్, మైక్రో బయోలాజికల్ టెస్టులు  కూడా చేయడానికి అవసరమైన అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

 బర్డ్ ఆసుపత్రిలో ప్రతిరోజు 400 ఓపి, 20 సర్జరీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిరోజు 5 ట్రామా (ప్రమాదాలకు గురైన వారు) కేసులు, ప్రతినెల కోలియోసిస్ (గూని ఆపరేషన్లు) 5,  సెరిబ్రల్ పాలసీ మరియు పోలియో వికలాంగులకు  200 నుండి 250 ఆపరేషన్లు చేస్తున్నట్లు చెప్పారు. బర్డ్ లో అత్యాధునిక పరికరాలతో కూడిన బ్లడ్ బ్యాంక్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామన్నారు. ఇందులో అత్యధికంగా  ప్రతిరోజు 40 నుండి 45 యూనిట్ల బ్లడ్ స్విమ్స్, రుయా, మెటర్నటీ, బయట ఆసుపత్రులకు అందిస్తున్నట్లు వివరించారు. అంతకుముందు బర్డ్ ఆసుపత్రి ప్రాంగణంలో ఇటీవల ఆధునికరించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన రక్త  పరీక్షలు నిర్వహించే కేంద్రాన్ని, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ, క్లినికల్ పేటాలజీ, బ్లడ్ బ్యాంక్ విభాగాలను పరిశీలించారు. అనంతరం శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం సందర్శించారు. ఇటీవల గుండె మార్పిడి చికిత్స చేయించుకున్న రోగిని పలకరించారు. ఈ కార్యక్రమంలో జెఈవో సదా భార్గవి, బర్డ్ ఆసుపత్రి ప్రత్యేక అధికారి డాక్టర్ రెడ్డప్ప రెడ్డి, పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, ఇఇ  కృష్ణారెడ్డి, ఇతర అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.

tirupati

2023-01-25 10:35:52

స్వదేశీ మేలుజాతి గోవుల ద్వారా పిండమార్పిడి చేయాలి

దేశీయ గోవుల పాల ఉత్పత్తిని పెంచేందుకు, మేలుజాతి దేశవాళీ గోవులను జన్యుపరంగా అభివృద్ధి చేసేందుకు టిటిడి చేపట్టిన పిండ మార్పిడి ప్రాజెక్టుపై ఈవో ఏవి.ధర్మారెడ్డి, ఎస్వీ పశువైద్య వర్సిటీ ఉపకులపతి ఆచార్య వి.పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సమీక్ష జరిగింది. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల ఈవో కార్యాలయంలో ఈ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గోశాల‌లో సంతానోత్ప‌త్తి సామ‌ర్థ్యం గ‌ల గోవుల‌కు మేలుజాతి స్వ‌దేశీ గోజాతుల పిండాల‌ను మార్పిడి చేసి కృత్రిమ గ‌ర్భ‌ధార‌ణ క‌లిగించి, ఆశించిన ఫ‌లితాలు పొందేందుకు పిండ‌మార్పిడి విధానం దోహ‌ద‌ప‌డుతుందన్నారు. దీనివ‌ల్ల అంత‌రించిపోతున్న భార‌తీయ గోజాతుల ప‌రిర‌క్ష‌ణ‌, అభివృద్ధి సాధ్య‌మ‌వుతుందని చెప్పారు. ఇందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని పశువైద్య వర్సిటీ అందించాలని కోరారు. ఈ ప్రాజెక్టు కాల పరిమితి ఐదేళ్లు కాగా, దీనిని నాలుగేళ్లకు తగ్గించాలని కోరారు. ఈ సందర్భంగా పిండ మార్పిడి ప్రాజెక్టు పురోగతిపై ఎస్వీ పశువైద్యవర్సిటీ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం గోశాలలో జరుగుతున్న ఫీడ్ ప్లాంట్ నిర్మాణంపై ఈఓ సమీక్షించారు. ఈ సమీక్షలో  జెఈఓ సదా భార్గవి, ఎఫ్.ఏ సియేవో  బాలాజీ, ఎస్వీ గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ్ రెడ్డి, ఎస్వీ పశువైద్య వర్సిటీ డీన్, పిండమార్పిడి ప్రాజెక్టు ఇన్చార్జి ఆచార్య వీరబ్రహ్మయ్య, రిజిస్ట్రార్  రవి, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్ టెన్షన్ ఆచార్య వెంకటనాయుడు, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఆచార్య సర్జన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Tirupati

2023-01-25 10:29:39

లోకేష్ పాదయాత్ర.. టిడిపికి పాడేయాత్ర

లోకేశ్‌ పాదయాత్ర టీడీపీకి  పాడెయాత్ర  కావడం త్వరలోనే ఖాయం అయిపోతుందని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి జోస్యం చెప్పారు. మంగళవారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. లోకేశ్‌ పాదయాత్రకు వైఎస్సార్‌సీపీ భయపడుతోందని టీడీపీ నేతలు అనిత, బోండా, అయ్యన్న లు ప్రగల్భాలు పకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబుకే మా పార్టీ భయపడలేదు. లోకేశ్‌ పాదయాత్రకు మాకో లెక్కా అంటూ తీసి పడేశారు. అయినా టిడిపీ ఏ మొహం పెట్టుకొని పాదయాత్ర చేస్తుందని ఆమె ప్రశ్నించారు. యువగళం కాస్త ప్రజలకు గరళంగా మారుతుందనే విషయంలో పాదయాత్రలో తేలిపోతుందన్నారు.

Visakhapatnam

2023-01-24 14:02:52

ఆడపిల్లలు స్వయం శక్తితో అభివృద్ది చెందాలి

ఆడపిల్లలు స్వయం శక్తితో అన్ని రంగాలలో అభివృద్ది చెందాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. మంగళవారం జిల్లా  పరిషత్ లో జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భ:గా చైర్ పర్సన్ మాట్లాడుతూ, 2009లో అప్పటి రాష్ట్రపతి  ప్రతిభా పాటిల్ మొట్టమొదటిగాఈ దినోత్సవాన్ని ప్రారంభించగా.. అప్పటినుంచి జనవరి 24 జాతీయ బాలికల దినోత్సవం గా జరుపుకుంటున్నామన్నారు.  కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు బాలికల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకొచ్చాయని, ప్రస్తుత భారత  ప్రధాని “బేటి బచావో బేటి పడావో” అనే పథకాన్ని ప్రారంభించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ ప్రాంతీయ సంచాలకులు  మాదవి, శిశు సంక్షేమ శాఖ ప్రోగ్రాం డైరెక్టర్  వెంకటేశ్వరి, చైల్డ్ వెల్పేర్ కమిటీ మెంబరు రాధా, బాలల హక్కు కమిషన్ మెంబెర్స్ జి సీతారాం, హైమావతి, 5వ స్దాయి సంఘం స్త్రీ సంక్షేమ, రక్షణ చైర్ పర్సన్ అనురాధ,  జిల్లా బాలల సంరక్షణాధికారి మోకర రమేష్,  డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ప్రసాద్, కార్పొరేటర్ నారాయణరావు, వివిధ పాఠశాల నుంచి బాలికలు, ఉపాధ్యాయులు, తదితర అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-01-24 13:16:13

బెస్ట్ ఎలెక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డుకి విశాఖజిల్లా కలెక్టర్

జాతీయ 13వ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పెషల్ సుమ్మరి రివిజన్-2023లో  ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఉత్తమ  విధానాలు అవలంబించిన అధికారులకు అవార్డ్స్ ప్రకటించింది. యువ ఓటర్ల నమోదు ఓటరు జాబితా సవరణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు   బెస్ట్ ఎలెక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డ్స్ కి జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లికార్జున ఎన్నికయ్యారు. ఈనెల 25న విజయవాడ లో తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా జరుగు జాతీయ ఓటరు దినోత్సవంలో  రాష్ట్ర గవర్నర్ ఈ అవార్డు కలెక్టర్ కు ప్రధానం చేస్తారు. అదేవిధంగా గాజువాక నియోజక వర్గం ఎన్నికల నమోదు అధికారి డి. లక్ష్మారెడ్డి, ఉత్తమ ఎన్నికల నమోదు అధికారిగా, గాజువాక పోలింగ్ కేంద్రం నెంబర్ 159 బూత్ లెవెల్ అధికారి సునీతలు కూడా అవార్డు అందుకోనున్నారు. కలెక్టర్ అవార్డుకి ఎంపికవడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.

Visakhapatnam

2023-01-24 13:03:02

విజయనగరంలో 13వ‌ జాతీయ ఓట‌ర్ల దినోత్స‌వ వేడుక‌లు

జ‌న‌వ‌రి 25, జాతీయ ఓట‌ర్ల దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని క‌లెక్ట‌ర్ ఆడిటోరియంలో బుధ‌వారం 13వ జాతీయ ఓట‌ర్ల దినోత్స‌వ వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి తెలిపారు. కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా సెంచూరియ‌న్ యూనివ‌ర్శిటీ వైస్ ఛాన్స్‌ల‌ర్ డా. జి.ఎస్‌.ఎన్‌. రాజు హాజ‌రుకానున్నార‌ని పేర్కొన్నారు. క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో మ‌ధ్యాహ్నం 1.00 గంటకు కార్య‌క్ర‌మం ప్రారంభ‌మ‌వుతుంద‌ని దీనిలో భాగంగా ముందుగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసిన సందేశాన్ని మైక్ ద్వారా స‌భికుల‌కు వినిపిస్తామ‌ని వివ‌రించారు. 

Visakhapatnam

2023-01-24 12:11:28

తిరుపతిలో గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

తిరుపతి టిటిడి పరిపాలన‌ భవనంలో జనవరి 26వ తేదీ గురువారం నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.  పరిపాలన‌ భవనం వెనక వైపున గల ప‌రేడ్‌ మైదానంలో టిటిడి ఈఓ ఏవి ధర్మారెడ్డి ఉదయం 8.30కి జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. విధినిర్వ‌హ‌ణ‌లో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన‌ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు. ఈ సందర్భంగా టిటిడి  భద్రతా విభాగంలోని బెటాలియన్ల ప‌రేడ్, విద్యాసంస్థల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు.

Tirupati

2023-01-24 11:24:25

బాలికలు మన జాతీయ సంపదగా పరిగణించాలి

సమాజంలో బాలబాలికలు ఇద్దరూ సమానమే అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బగాది జగన్నాథ రావు అన్నారు. బాలికలు జాతీయ సంపద అని ఆయన అభివర్ణించారు. బాలికలు లేని ఇల్లు ఆనందాల హరివిల్లు కాదని ఆయన పేర్కొన్నారు.  జాతీయ బాలికా దినోత్సవం స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో మంగళ వారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో బాలబాలికలు ఇద్దరూ సమానమే అని అన్నారు. రకాల అపోహలు, సామాజిక రుగ్మతలను అనుసరించే వారు బాలురకు పెద్ద పీట వేయడం జరుగుతోందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా బాలికా పరిరక్షణ ప్రతిజ్ఞను చేశారు.

Parbatipur

2023-01-24 11:07:20

ప్రభుత్వ సేవల పర్యవేక్షణ కు కంట్రోల్ రూమ్

ఏ.పి.సేవాపోర్టల్ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు మరింత మెరుగ్గా అందించడానికి కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ చేయడం జరుగుతుందని కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను సందర్శించిన కలెక్టర్  అక్కడి సిబ్బంది కి  పలు సూచనాలను జారీ చేశారు. టీడ్కో, ఐ.సి.డి.ఎస్, పౌర సరఫరాల, నాడు నేడు, సర్వ శిక్షా అభియాన్, విద్యా, మద్యాహ్న భోజనం, ఆరోగ్య శ్రీ , హౌసింగ్  తదితర శాఖల ద్వారా అమలవుతున్న పథకాలు, పనుల పురోగతి పై డైలీ నివేదికలను కలెక్టర్ కు ప్రతి రోజు అందించాలని సూచించారు.  దీని ద్వారా ఎక్కడైనా అందవలసిన సేవలు ఆలస్యంగా అందినా, సరిగ్గా అందకపోయినా  సరిదిద్దే వ్యవస్థ ఏర్పడుతుందని తెలిపారు. ప్రభుత్వ శాఖల నుండి   అనేక యాప్ ల ద్వారా అందిన  సమాచారాన్ని క్రోడీకరించి నివేదికలను తయారు చేయడం జరుగుతుందని,  దీనివలన పని తీరును  రియల్ టైం లో పర్యవేక్షించి, ఆయా శాఖలకు తగు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కంట్రోల్ రూమ్ సిబ్బంది అన్ని పథకాలు, కార్యక్రమాల పై అవగాహన కలిగించుకోవలన్నారు. కలెక్టర్ వెంట సి.పి.ఓ బాలాజీ, సచివాలయ సమన్వయాధికారి అశోక్ ఉన్నారు.

Vizianagaram

2023-01-24 11:03:51

శ్రీ పద్మావతి అమ్మవారికి 8 పరదాలు విరాళం

 హైదరాబాదుకు చెందిన శ్రీనివాసులు అనే భ‌క్తుడు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి  8 పరదాలు  విరాళంగా ఇచ్చారు.  వాటిని ఆలయ సిబ్బందికి అందజేశారు. కోయిల్ ఆల్వార్ కార్యక్రమం అనంతరం వాటిని దాతల నుంచి ఆలయ డెప్యూటీ  ఈవో లోకనాథం స్వీకిరించారు. అనంతరం దాత అమ్మవారిని దర్శనం చేసుకొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.  ఈ కార్యక్రమంలో , ఏఈవో ప్ర‌భాక‌ర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌  మధు, ఆర్జితం ఇన్స్పెక్టర్  దాము, అర్చ‌కులు బాబుస్వామి, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

Tiruchanur

2023-01-24 10:54:51

విశాఖకలెక్టర్ ను కలిసిని డిసేబులిటీ ఏడీగా మాదవి

విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్సజెండర్స్, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులుగా జె.మాధవి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆమె 
విశాఖజిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జునను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆమె ఇటీవలే డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి పొందారు. విధుల్లోకి చేరిన 
అనంతరం కలెక్టర్ ను కలిసి పరిచియం చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్  మల్లిఖార్జున మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలకు పెద్ద పీట 
వేయాలని, సంక్షేమ కార్యక్రమాలు విభిన్న ప్రతిభావంతులకు సక్రమంగా అందేలా చూడాలన్నారు.

Visakhapatnam

2023-01-24 10:31:14

విజయనగరం జిల్లాలో 26నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీ బేనర్లు నిషేదం

విజయనగరం జిల్లాలో ఈ నెల 26 నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యాన‌ర్ల నిషేదం అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి స్ప‌ష్టం చేశారు. ప్ర‌తీఒక్క‌రూ  ప్లాస్టిక్ నిషేదాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్ర‌త్య‌మ్నాయాల‌ను వినియోగించాల‌ని సూచించారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యాన‌ర్ల నిషేదంపై నిర్వ‌హించిన‌ అవ‌గాహ‌నా ర్యాలీని స్థానిక ఎత్తుబ్రిడ్జివ‌ద్ద‌, మంగ‌ళ‌వారం క‌లెక్ట‌ర్ ప్రారంభించారు. జిల్లా కాలుష్య నియంత్ర‌ణా మండ‌లి, విజ‌య‌న‌గ‌రం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ భారీ ర్యాలీ క‌లెక్ట‌రేట్ వ‌ర‌కు సాగింది.  ఈ సంద‌ర్భంగా మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఆర్‌.శ్రీ‌రాముల నాయుడు మాట్లాడుతూ, ప్లాస్టిక్ బ్యాన‌ర్లు, ఫ్లెక్సీల నిషేదాన్ని ఉల్లంఘించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌ల‌ను తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు. ప‌బ్లిష‌ర్లు, ప్రింట‌ర్లు ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల‌ని, అవ‌స‌ర‌మైన వారికి ప్ర‌భుత్వ‌ప‌రంగా స‌బ్సిడీ, బ్యాంకుల‌నుంచి రుణాలు మంజూరు చేస్తున్నారన్నారు.

 నిషేదాన్ని ప‌క్కాగా అమ‌లు చేయ‌డానికి, ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్లాస్టిక్ బ్యాన‌ర్ల నిషేదంపై ఇప్ప‌టికే మున్సిప‌ల్‌ కౌన్సిల్ తీర్మాణాన్ని కూడా చేసింద‌ని చెప్పారు. నిషేదాన్ని ఉల్లంఘించిన వారికి జ‌రిమానా విధించేందుకు, స‌చివాల‌య కార్య‌ద‌ర్శులకు, మున్సిప‌ల్ ప్ర‌జారోగ్య‌శాఖ అధికారుల‌కు అధికారం ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు. అదేవిధంగా 120 మైక్రాన్ల కంటే త‌క్కువ మందం ఉన్న ప్లాస్టిక్ వినియోగంపై నిషేదం ఇప్ప‌టికే అమ‌ల్లో ఉంద‌ని చెప్పారు. దీనిని పాటించి, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌తీఒక్క‌రూ స‌హ‌క‌రిచాల‌ని క‌మిష‌న‌ర్ కోరారు. ఈ ర్యాలీలో జిల్లా కాలుష్య నియంత్ర‌ణా మండ‌లి ఇఇ సుద‌ర్శ‌న్‌, వివిధ శాఖ‌ల అధికారులు, ప‌రిశ్ర‌మ‌ల ప్ర‌తినిధులు, పెద్ద సంఖ్య‌లో విద్యార్థులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-01-24 07:37:01

విశాఖ బురుజుపేటలో 24న శ్రీమార్కండేయ జయంతి

మాఘ శుద్ధ తదియ ఈనెల జనవరి 24వ తారీఖు న శ్రీశ్రీశ్రీ మార్కండేయ జయంతిని విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్ బురుజు పేట నందుగల శ్రీ భావన ఋషి 
స్వరూల దేవాలయంలో ఘనంగా నిర్వహించనున్నట్టు ఆలయ కమిటి తెలియజేసింది. శ్రీ మార్కండేయ జయంతి సందర్భంగా స్వామివారికి అభిషేకములు మహా 
మృత్యుంజయ హోమములు చేస్తారని పేర్కొన్నారు. ఈ పూజల వలన అకాలం మృత్యు దోషములు నివారణ జరుగుతాయని తెలియజేశారు. స్వామివారికి చేపట్టే 
కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్ధ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయకమిటీ కోరింది.

Visakhapatnam

2023-01-23 16:09:28