1 ENS Live Breaking News

గణతంత్ర వేడుకలు విజయవంతం చేయాలి

గణతంత్రదినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించడానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అమలాపు రం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోజిల్లా అధికారుల తో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ, స్థానిక బాలయోగి స్టేడియం నందు జిల్లా స్థాయి  గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు చేపట్ట వలసి న ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ పెరేడ్ మైదానాన్ని, వేదికను స్థానిక ఆర్డిఓ పురపాలక సంఘ అధికారులు సిద్ధం చేయాలని జిల్లా పోలీసు యంత్రాంగం, సాంప్రదాయ కవాతు దళాలను వివిధ కంపార్ట్మెంట్ల వద్ద శాంతిభద్రతలు బందోభస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ శాఖకు సూచించారు.  వేదిక, గ్యాలరీలను సుందరీకరించాలని కోరారు. 

సిపిఓ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖల సమన్వయంతో జిల్లా ప్రగతి సమాచారంతో ప్రసంగం తయారు చేసి ముఖ్య అతిథులకు ముందు గానే అందజేయాలని మీడియాకు ఆహ్వానం పంపాలని డిఆర్ఓ సిహెచ్ సత్తిబాబును ఆదేశించారు. వేడుకలలో వివిధ ప్రభుత్వ శాఖలు తమ తమ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల సమాచారంతో శకటాలను, సుందరంగా తయారుచేయాలని శకటాల పర్యవేక్షణకు ప్రోటోకాల్ పాటించేందుకు  లైజన్ అధికారిని నియమించామన్నారు. గణతంత్రదినోత్సవ వేడుకల సందర్భంగా విధినిర్వహణ లో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులను సత్కరించేందుకు శాఖల వారీగా నిర్థేశిత నమూనాలో ప్రతిపాదన లను ఈ నెల 20వ తేదీ లోపున సమర్పించాలని తెలిపారు.

  ఈ సమావేశంలో , ఎఎస్పి  కె లతామాధురి, ఆర్డిఓ వసంత రాయుడు, డిపిఓ, కృష్ణకుమారి , సిపిఓ వెంకటేశ్వర్లు, ఈ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కే నాగేశ్వరరావు ఉద్యాన అధికారి ఎన్ మల్లికార్జునరావు, డి సి హెచ్ ఎస్ పద్మశ్రీ రాణి,వివిధ శాఖల జిల్లా సాయి అధికారులు పాల్గొన్నారు.

Amalapuram

2023-01-12 09:54:51

తెలుగుజాతి ఐక్యం కావాల్సిన సమయొచ్చింది

కులాల ఔన్నత్యం పెరుగుతున్న తరుణంలో 675 కులాలుగా ఉండి భౌగాళికంగా విడిపోయిన తెలుగుజాతిని ఐక్యం చేసేందుకు సాంస్కృతిక తెలుగు సేన ముందుకు రావడం శుభపరిణామమని  విప్లవ కవి, గాయకుడు ప్రజాయుద్ధ నౌక గద్దర్ అన్నారు. తెలుగుసేన పేరుతో తెలుగు సాంస్కృతిక సైన్యంగా ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. తెలుగుసేన ఆధ్వర్యంలో వైజాగ్ జర్నలిస్టు ఫోరంలో గురువారం  నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలుగుసేన అధ్యక్షుడు సత్యారెడ్డి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10న  హైదరాబాదులో బస్సు యాత్ర ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దేశంలో పది రాష్ట్రాలలో భారీ బహిరంగ సభలు, బస్సు యాత్రలు, రోడ్ షో లు కొనసాగుతాయన్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని ప్రాంతాలలో సాగుతుందన్నారు. 

ప్రస్తుతం కులాలవారీగా విడిపోతున్న తరుణంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా ఒక జాతిగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శబ్దాన్ని అక్షరంగా మలుస్తూ ఉత్పత్తి, జ్ఞాన పదం, అభ్యుదయపదంగా అక్షరాన్ని విప్లవపదంగా మార్చగల అక్షర శిల్పి జర్నలిస్టులని కొనియాడారు. నేడు సమాజంలో కులాలుగా విడిపోయిన  తెలుగు వారిని ఐక్యం చేయడమే తమ లక్ష్యం అన్నారు. కాస్ట్ ఐడెంటిటీ ఎదుర్కోవడానికి తెలుగుజాతి ఐడెంటిటీ తీసుకువద్దామని కోరారు. స్మార్ట్ ఫోన్ గ్లోబలైజేషన్ తో ప్రపంచమంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని అన్నారు. అనంతరం అమ్మ నీకు వందనం.. ఓ తెలుగు తల్లి నీకు వందనం అంటూ... గద్దర్ తన గలాన్ని విలపించారు. గౌరవ అతిథిగా హాజరైన సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు,
వైజాగ్ జర్నలిస్టు ల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ  దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు జాతిని ఒక తాటిపైకి తీసుకురావడం కోసం తెలుగు సేన అధ్యక్షుడు సత్యారెడ్డి ఆధ్వర్యంలో మంచి సంకల్పంతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి గద్దర్ ముందుండి నడిపించడం అభినందనీయమన్నారు. తెలుగువారి గొప్పతనాన్ని విశిష్టతను, అందరికీ తెలియజేయాలన్న లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో గద్దర్ ప్రాధాన్యత అందరికీ తెలిసిన విషయమేనన్నారు. ఆయన పాట రూపంలో అనేక సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం, ఆయన గళం అనేక సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపిందన్నారు. ఇటువంటి భారీ కార్యక్రమం విశాఖలో ప్రకటించడం సంతోషదాయకమన్నారు. తెలుగు వారు ఎక్కడ ఉన్నా సుఖసంతోషాలతో ఉండాలని, సంక్రాంతి పండుగ ముందు ఇటువంటి మంచి కార్యక్రమం వివరాలు తెలియజేయడం శుభ సూచకమన్నారు. దేశభక్త కార్యక్రమంలో భాగంగా చివరగా విశాఖ వచ్చినప్పుడు సాగర స్వాగతం పలుకుతామని శ్రీనుబాబు తెలిపారు. కార్యక్రమ నిర్వాహకుడు తెలుగు సేన జాతీయ అధ్యక్షుడు పి సత్యారెడ్డి మాట్లాడుతూ ప్రజా యుద్ధనౌక గద్దర్ ముఖ్యఅతిథిగా ఫిబ్రవరి 10 హైదరాబాదులో భారీ ఎత్తున ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. చిన్నారులు తెలుగు భాష కోసం చేసిన చిన్నారులు చేసిన నృత్యం మాకు మరింత ఉత్తేజాన్ని ఇచ్చిందన్నారు. 

దశాబ్దం కాలంగా తెలుగు సేన దేశంలోనే పలు రాష్ట్రాలలో వివిధ కార్యక్రమాలు కొనసాగిస్తుందన్నారు. నేటికీ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగుతున్నాయని చెప్పారు. అలాగే స్కూల్ ఆఫ్ థియేటర్స్ కొరియోగ్రాఫర్ నాగరాజు పట్నాయక్ ఆధ్వర్యంలో చిన్నారులు ఆర్. హెచ్.టినా, పూజిత చందన, నిత్యసంతోషిని వైష్ణవి, చేసిన జ్ఞానపద, తెలుగు నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'పాడన తెలుగు పాట...' కు చేసిన నృత్యం పట్ల గద్దర్ చిన్నారులను ప్రశంసించారు. ఈ సమావేశంలో వీజేఎఫ్ ఉపాధ్యక్షుడు, స్కూల్ ఆఫ్ థియేటర్ కొరియోగ్రాఫర్ నాగరాజు పట్నాయక్, మెడిటేషన్ టీం 
ఎన్. రమేష్ కుమార్, జీ వరప్రసాద్, ఏయూ స్టూడెంట్ యూనియన్ ప్రతినిధులు బి అశోక్ కుమార్, ఎస్.పి.ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-01-12 09:33:22

ప్రాధాన్యత, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను పూర్తిచేయాలి

ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలతో పాటు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రత్యేకంగా కృషిచేయాలని జిల్లాకలె క్టర్ హిమాన్షుశుక్లా జిల్లాస్థాయి అధికారులను ఆదేశించారు. గురువారం ప్రభుత్వ సిఎస్ కె.ఎస్. జవహర్ రెడ్డి  సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, గర్భిణీలు చిన్నారులలో రక్తహీనత ,తీవ్ర పోషకాహార లోపాలు, మనబడి నాడు నేడు, నరేగా ద్వారా వేతన జీవులకు పని దినాలు కల్పన, జగనన్న గోరుము ద్ద, మధ్యాహ్న భోజన పథకం లో నాణ్యత, జగనన్న స్వచ్ఛ సంకల్పం వంటి కార్యక్రమాలు పురోగతిపై  అన్ని జిల్లాల కలెక్టర్లతో అమరావతి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి జిల్లా కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అ నంతరం జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి అధికారులు ఉద్దేశించి మాట్లాడుతూ. గర్భిణీ స్త్రీలకు, కిశోరబాలిక‌లు, విద్యా ర్థులు రక్తహీనత పరీక్షలు నిర్వహించి ఆయా  లోపాలను సరిదిద్దడం అదేవిధంగా, చిన్నారులలో బరువు తక్కువ లోపాలు గుర్తించి సరి చేయడం, పాఠశాలల్లో పారిశుద్ధ్యం, మరుగు దొడ్ల సౌకర్యాలు మెరు గుపరచడం, డ్రాపౌట్ విద్యార్థుల సంఖ్య, తగ్గించడం  వంటి అంశాలలో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

జిల్లాక‌లెక్ట‌ర్ల‌కు దిశానిర్దేశం చేశారు.  సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు అధికారులు ప్రత్యేక కృషి సల్పాలన్నారు. రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు నిర్దేశించిన గడువు లోగా ఎస్‌.డీ.జీ గోల్స్ సాధించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టరు అధికారులకు సూచించారు మనబడి నాడు నేడు ద్వారా బడిబయట డ్రైనేజీ, అప్రోచ్ రోడ్ల నిర్మాణాలను గ్రామపంచాయితీ నిధులు తో చేపట్టాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖలు పూర్తి సమన్వయం తో పనిచేస్తూ రక్తహీనత పోషకాహార లోపాలను సరిదిద్దుతూ మాతా శిశు మరణాలను అరికట్టడంతో పాటుగా ఆరోగ్యకర సమాజ స్థాపన దిశగా పాటుపడాలన్నారు  ఈ. స‌మావే శంలో డిఆర్ఓ సిహెచ్ సత్తిబాబు ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్లు కృష్ణారెడ్డి చంటిబాబు డిపిఓ వి కృష్ణకుమారి, సిపిఓ వెంకటేశ్వర్లు డిసిహెచ్ఎస్ పద్మశ్రీ రాణి డి ఎం అండ్ హెచ్ ఓ దుర్గారావు దొర,డ్వా మా పీడీ ఎస్ మధుసూదన్, జిల్లా వ్యవసాయ అధికారి కాకి నాగేశ్వర రావు గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు సిహెచ్ బాబురావు, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Amalapuram

2023-01-12 09:28:17

13న‌ విజయనగరం శిల్పారామంలో సంక్రాంతి సంబ‌రాలు

సంక్రాంతి సంబ‌రాల‌ను ఈ నెల 13వ తేదీన శిల్పారామం వేదిక‌గా అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించేందుకు జిల్లా యంత్రాంగం స‌న్న‌ద్ధంగా ఉండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి పేర్కొన్నారు. తెలుగు సంప్ర‌దాయా లు ఉట్టిప‌డేలా సంబ‌రాల‌ను నిర్వ‌హించాల‌ని సంబంధిత ఏర్పాట్లు చురుగ్గా చేయాల‌ని జిల్లా అధికారుల‌ను ఆమె ఆదేశించారు. సంక్రాంతి సంబ‌రాల ఏర్పాట్లు, వివిధ పోటీల నిర్వ‌హ‌ణ త‌దిత‌ర అంశాల‌పై ఆమె బుధ‌వారం సాయంత్రం జిల్లాస్థాయి అధికారుల‌తో జూమ్ ద్వారా ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండే శిల్పారామం వేదిక‌గా  జ‌రిగే సంబ‌రాల‌ను దృష్టిలో ఉంచుకొని త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. అన్ని విభాగాల అధికారులు స‌మ‌న్వ‌యంగా వ్య‌వ‌హ‌రించి సంబ‌రాల‌ను విజ‌య‌వంతం చేయాల‌ని పేర్కొన్నారు. రంగ వ‌ల్లుల పోటీలు, తెలుగు వ‌స్త్ర‌ధార‌ణ పోటీలు నిర్వ‌హించాల‌ని చెప్పారు. 

ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వ‌ర‌కు సంబ‌రాల‌ను నిర్వ‌హించాల‌ని దానికి త‌గిన ముంద‌స్తు ఏర్పాట్లు చేసుకోవాల‌ని సూచించారు. పండ‌గ శోభ సంత‌రించుకునేలా శిల్పారామాన్ని ముస్తాబు చేయాల‌ని, ఆకర్ష‌ణీయంగా ఉండేలా రంగురంగుల ముగ్గులు వేయించాల‌ని చెప్పారు. పిల్ల‌లు, పెద్ద‌లు వ‌చ్చి ఆనందంగా గడిపేలా సంగీత‌ క‌చేరీలు, ప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. భోగి మంట‌లు వేసి ఆడిపాడేలా, హ‌రిదాసు వేషాల‌తో అల‌రించేలా, ఎడ్ల‌బండి ప్ర‌ద‌ర్శ‌న‌తో ఉత్సాహ ప‌రిచేలా.. తెలుగు సంప్ర‌దాయాలు ఉట్టిపడేలా త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. నగ‌ర ప్ర‌జ‌లు అధిక సంఖ్య‌లో విచ్చేసి సంబ‌రాల‌ను విజ‌య‌వంతం చేయాల‌ని ఆమె ఈ సంద‌ర్భంగా విజ్ఞ‌ప్తి చేశారు.

12న ముగ్గుల పోటీలు, 13న వ‌స్త్ర‌ధార‌ణ‌, వంట‌ల పోటీలు
సంక్రాంతి సంబ‌రాల నేప‌థ్యంలో ఈ నెల 12వ తేదీ మ‌ధ్యాహ్నం 2.00 నుంచి 4.00 గంట‌ల వ‌ర‌కు శిల్పారామంలో ముగ్గుల పోటీలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. అలాగే సంబ‌రాల రోజు అన‌గా 13వ తేదీ ఉద‌యం నుంచి వ‌స్త్ర‌ధార‌ణ‌, వంట‌ల పోటీలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు సమావేశంలో వెల్ల‌డించారు. ఈ పోటీల్లో విజేత‌ల‌కు ప్ర‌థ‌మ‌, ద్వితీయ‌, తృతీయ బ‌హుమ‌తులు అంద‌జేయ‌నున్న‌ట్లు వివ‌రించారు. పోటీల్లో పాల్గొనే వారు సంబంధిత మెటీరియ‌ల్ వారే తెచ్చుకోవాల‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. పోటీల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ‌, మ‌హిళా స‌మాఖ్య‌, డీఆర్డీఏ విభాగాలు బాధ్య‌త‌లు తీసుకొని విజ‌య‌వంతం చేయాల‌ని పేర్కొన్నారు.

Vizianagaram

2023-01-11 13:20:01

ధాన్యం కొనుగోలులో మ‌రింత పురోగ‌తి సాధించాలి

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో కొన‌సాగుతున్న ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ‌లో మ‌రింత పురోగ‌తి సాధించాల‌ని, ఆ దిశ‌గా సంబంధిత శాఖ‌ల అధికారులంద‌రూ స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ కె. మయూర్ అశోక్ ఆదేశించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 2.42 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొనుగోలు జ‌రగ‌టం హ‌ర్ష‌ణీయ‌మ‌ని పేర్కొన్నారు. అయితే అక్క‌డ‌క్క‌డా చిన్న‌చిన్న స‌మ‌స్య‌లు త‌లెత్తుతు న్నాయ‌ని.. వాటిని ప‌రిష్క‌రించి మ‌రింత పురోగ‌తి సాధించాల‌ని నిర్దేశించారు. ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ, ఇత‌ర‌ అంశాల‌పై బుధ‌వారం త‌న ఛాంబ‌ర్లో వివిధ విభాగాల అధికారుల‌తో ఆయ‌న‌ స‌మీక్షించారు.
కొనుగోలు ప్ర‌క్రియ పూర్త‌యిన తర్వాత స‌మీపంలో ఉన్న మిల్లుల‌కు ధాన్యం చేరుకొనేలా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, స‌రిప‌డా వాహ‌నాల‌ను అందుబాటులో ఉంచాల‌ని చెప్పారు.

 ఎక్క‌డా అవ‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌కుండా కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి వ‌ర‌కు పూర్తి ప‌ర్య‌వేక్ష‌ణ అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు. మిల్లుల‌కు చేరిన వాహ‌నాల తాలూక ట్రక్ షీట్ల జాబితాల‌ను ప‌రిశీలించుకోవాల‌ని, వారి నుంచి ర‌సీదు తీసుకోవాల‌ని ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యాల మేర‌కు ధాన్యం సేక‌రించేలా మండ‌ల‌, గ్రామ స్థాయి సిబ్బందిని అప్ర‌మ‌త్తం చేయాల‌ని జిల్లా స్థాయి అధికారులకు సూచించారు. త‌క్కువ సేక‌ర‌ణ జ‌రిగిన చోట్ల ప్ర‌త్యేక దృష్టి సారించి ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని చెప్పారు. ధాన్యం, ర‌వాణా భ‌త్యానికి సంబంధించిన బిల్లుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చెల్లించాల‌ని పేర్కొన్నారు. అలాగే కాల్ సెంట‌ర్ ద్వారా మ‌రిన్ని మెరుగైన సేవ‌లందించాల‌ని జేసీ సూచించారు. అధికారులు క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ ఆర్‌.బి.కె.ల‌ను, మిల్లుల‌ను త‌నిఖీ చేయాల‌ని చెప్పారు. స‌మావేశంలో సివిల్ స‌ప్లై డీఎం మీనాకుమారి, డీఎస్వో సుద‌ర్శన్ రావు, జిల్లా వ్య‌వసాయ అధికారి త్రినాథ స్వామి, హార్టిక‌ల్చ‌ర్ డీడీ జ‌మ‌ద‌గ్ని, ర‌వాణా శాఖ ఉప క‌మిష‌న‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Vizianagaram

2023-01-11 13:12:54

పౌరసరఫరాల టోల్ ఫ్రీ నెంబరు వినియోగించుకోండి

పౌరసరఫరాలకు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసి సమస్యలను వివరించవచ్చని జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ తెలిపారు. టోల్ ఫ్రీ నంబరు 1967కు ఫోన్ చేయాలన్నారు. ప్రజాపంపిణి వ్యవస్థ, దాన్యం కొనుగోళ్లు, లీగల్ మెట్రాలజీ, కన్స్యూమర్ ప్రొటెక్షన్, తదితర సమస్య లపై ఫోన్ ద్వారా పిర్యాదు చేయవచ్చన్నారు. ప్రభుత్వం ప్రజలు, రైతులు, వ్యాపారుల కోసం ఏర్పాటు చేసిన ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోని సమస్యలు ఉంటే తెలియజేసి పరిష్కహారం పొందాలన్నారు.

Srikakulam

2023-01-11 13:00:54

12న శ్రీత్యాగరాజస్వామివారి 176వ ఆరాధనోత్సవం

 ప్రముఖ వాగ్గేయకారుడైన కర్ణాటక సంగీత సామ్రాట్‌ శ్రీత్యాగరాజస్వామివారి 176వ ఆరాధనోత్సవం జనవరి 12వ తేదీ గురువారం తిరుపతిలోని ఎస్వీ సంగీత కళాశాలలో జరుగనుంది. శ్రీత్యాగరాజస్వామివారు పుష్యబహుళ పంచమి నాడు పరమపదించిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా కళాశాలలోని ఓపెన్ ఆడిటోరియంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఘనరాగ పంచరత్న కృతులు, ఉత్సవ సంప్రదాయ, దివ్యనామ సంకీర్తనలను తిరువయ్యార్ పద్ధతిలో బృందగానం చేస్తారు. కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Tirupati

2023-01-11 12:50:26

పౌష్టికాహారం పంపిణీలో లోపాలు ఉండకూడదు

అంగన్ వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు అందించే పౌష్టికాహారంలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమీషన్ సభ్యులు బి.కాంతారావు అన్నారు. మంగళవారం ప్రభుత్వ పాఠశాలలు అంగన్ వాడీ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా ఫుడ్ కమీషన్ మెంబర్ చిన వాల్తేరులోని  కెడిపియమ్ హైస్కూల్ ను సందర్శించారు. అక్కడ విద్యార్ధులతో మాట్లాడి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. స్కూల్ విద్యార్ధులతో పాటు వారికి అందిస్తున్న భోజనాన్ని స్వీకరించారు. అనంతరం ఎంవిపి కాలనీ, సెక్టార్-9 లో గల అంగన్ వాడీ సెంటర్ ను సందర్శించి అటెండెన్సు రిజిస్టర్ ను పరిశీలించారు. పౌష్టికాహార సరఫరాలో ఎటువంటి పొరపాట్లు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామనిహెచ్చరించారు. అనంతరం అడవివరం జిల్లా పరిషత్ హైస్కూల్ తనిఖీ చేసి అక్కడ విద్యార్ధులతో మాట్లాడారు.

ఫోర్టిఫైడ్ రైస్ లో గల పోషక విలువల సమాచారాన్ని, ఆవస్యకతను విద్యార్ధులకు అవగాహన కలిగించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. తోటగరువు వద్ద గల జిల్లా పరిషత్ హైస్కూల్ తో పాటు అంగన్ వాడీ కేంద్రాన్ని సందర్శించి గర్భణీ, బాలింతలకు మధ్యాహ్న భోజన పథకంతో పాటు పిల్లలకు కోడి గుడ్లు సరఫరా తదితర అంశాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 
ఈ కార్యక్రమంలో డీఎస్ఓ సూర్యప్రకాష్ రావు, డీఈఓ చంద్రకళ, ఐసిడిఎస్ పిడి, ఫుడ్ సేప్టీ అధికారులు, సిడిపిఓ లు, తదితరులు పాల్గొన్నారు. 

Anakapalle

2023-01-10 13:13:18

మీడియాకంటే నేడు సోషల్ మీడియానే పవర్ ఫుల్

ప్రస్తుతం మీడియా కంటే సోషల్ మీడియా పవర్ ఫుల్ గా ఉందని..దానినే వేదికగా చేసుకొని కేంద్రం ఏపీ అంది స్తున్న నిధులు, సహాయంపై పెద్దఎత్తున ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. మంగళవారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో బిజెపి సరల్ మొబైల్ యాప్ పై నిర్వహిం చిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీకి ఏపీకి వందేభారత్ రైలు ప్రారంభించారని అన్నారు. జాతీయ నాయకులు, శిక్షణ పర్యవేక్షకులు లాల్ సింగ్ ఆర్య మాట్లాడుతూ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని సూచించారు. సోషల్ మీడియా ద్వారా పార్టీ కార్యక్రమాలు సత్వరమే ప్రజల్లో కి వెళతాయనే విషయాన్ని ప్రతీ బీజేపీ నాయకుడు, కార్యకర్త గుర్తించాలన్నారు. పార్టీ, ప్రభుత్వకా ర్యక్ర మాలు జనాల్లోకి తీసుకెళ్లాలన్నారు.  ఈకార్యక్రమంలో బిజెపి ఐటీ రాష్ట్ర కన్వీనర్ శివ మకుటం తదితరులు పాల్గొన్నా రు.

Visakhapatnam

2023-01-10 12:03:26

విజయనగరంజిల్లా డిఆర్సీ సమావేశం వాయిదా

విజయనగరం జిల్లా సమీక్షా సమావేశం వాయిదా పడినట్లు జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి తెలిపారు. ఈ మేరకు జిల్లా మీడియాకు ఒక ప్రటకన విడుదల చేశారు.  6వ విడత జగనన్న తోడు కార్యక్రమం ఈనెల 11న ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి  ప్రారంభిస్తున్న దృష్ట్యా అదే రోజున జరగాల్సిన జిల్లా సమీక్షా సమావే శం వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. సదరు కార్యక్రమం అయిన తరువాత డిఆర్సీ జరిగే తేది ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు, జిల్లాశాఖల అధికారులు గమనించాలన్నారు. వచ్చే సమావే శానికి సిద్ధం చేయాల్సిన నివేదికలు ఈలోగా సిద్దం చేసుకోవాలని సూచించారు.

Vizianagaram

2023-01-10 10:49:09

మార్చినాటికి తొలిదశ గృహాలు సిద్దంకావాలి

నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా తొలిదశలో ప్రారంభించిన గృహాలన్నిటినీ రానున్న మార్చినాటికి  సిద్దం చేయాలని జిల్లా కలెక్టరు డా.కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు.  మంగళవారం కాకినాడ కలెక్టరేట్ నుంచి హౌసింగ్, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, మండల ప్రత్యేక అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో గృహ నిర్మాణాల పురోగతిపై అన్ని మండలాల అధికారులు, మున్సిపల్ కమిషనర్లుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు కృతికా శుక్లా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన గృహ నిర్మాణాలు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పనుల్లో పురోగతి చూపాలన్నారు. తొలి దశలో జిల్లాలో 18,003 గృహ నిర్మాణాలు ప్రారంభించడం జరిగిందన్నారు. 

ఇందులో ఇప్పటి వరకు10,300 గృహాలు పూర్తి అయ్యాయని ఇంకా మిగిలిన గృహాలన్నిటిని మార్చి నెల ఉగాది నాటికి గృహప్రవేశాలకు సిద్దం చేయాలని జిల్లా కలెక్టరు ఆదేశించారు. ఇందుకు సమన్వయ శాఖల అధికారులు, మండల ప్రత్యేక అధికారులు కృషి చేయాలన్నారు. త్వరితగతిన స్టేజ్ కన్వర్షన్ జరిగే చూడాలన్నారు. నిర్మాణానికి అవసరమైన   ఇసుక, సిమెంట్ ఇతర మెటీరియల్ ను అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. స్వయం సహాయక సంఘాలలో ఉన్న మహిళా లబ్ధిదారులకు రుణాల మంజూరు వేగవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. రూప్ లెవెల్ దశలో ఉన్న గృహాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తిచేసే విధంగా చూడాలని గృహాలు పూర్తయిన వాటికి తాగునీరు, విద్యుత్ కనెక్షన్లు తక్షణమే అందించాలని కలెక్టరు కృతికా శుక్లా అధికారులకు స్పష్టం చేశారు.

Kakinada

2023-01-10 10:21:22

ఆరోగ్యశాఖ అధికారుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

అనకాపల్లి జిల్లాలోని ఆరోగ్యశాఖ అధికారుల సంఘం క్యాలెండర్ ను మంగళవారం డిఎంఅండ్ హెచ్ఓ డా.ఏ.హేమంత్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ, ప్రజా సేవలో కూడా ఈవిధంగా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య విద్య, మీడియా అధికారుల సంఘం 2023 కేలండర్ను ఇటీవలే ముద్రించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ కెవి. జ్యోతి, పి.స తీష్, బి.భాస్కరరావు, డి.ఝాన్సీ రాణి, చంద్రదేఖర్,  అబ్బుల్ రషీద్, ఎమ్మెస్వీ.ప్రసాద్,  జిల్లా  కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2023-01-10 10:15:05

పౌర సరఫరాల శాఖ సమీకృత టోల్ ఫ్రీ నెంబరు1967

పౌర సరఫరాల శాఖ అంశాలకు సంబంధించి విజయవాడలో సమీకృత కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశారని పార్వతీపురం మన్యం జిల్లా జెసి ఓ.ఆనంద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం మీడియాకి ఒక ప్రకటన విడుదల చేశారు. కాల్ సెంటర్ లో 10 మంది కాల్ సెంటర్ ఎక్జిక్యూటివ్ లు ఉంటారని ఆయన పేర్కొన్నారు. కాల్ సెంటర్ మంగళ వారం నుండే పని చేయడం ప్రారంభించిందని ఆయన చెప్పారు. ప్రజా పంపిణీ వ్యవస్థ (పి.డి.ఎస్), ధాన్యం కొనుగోలు, తూనికలు - కొలతలు, వినియోగదారుల రక్షణ తదితర పౌర సరఫరాల సంబంధ అంశాల పట్ల సమస్యలను పరిష్కరిస్తుందని, అవసరమగు సమాచారం అందిస్తుందని ఆయన వివరించారు. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన సమీకృత కాల్ సెంటర్ సేవలను ప్రజలు వినియోగించు కోవాలని ఆయన కోరారు.

Parvathipuram

2023-01-10 07:05:40

విజయనగరం స్పందనకు 151 వినతులు

విజయనగరం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన వినతుల కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించి 151 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ విభాగానికి సంబంధించి అత్యధికంగా 77  ఉన్నాయి. డి.ఆర్.డి.ఎ కు 28, హౌసింగ్ కు 8,  మున్సిపల్ శాఖ కు 7, వైద్య శాఖ కు 13, మిగిలినవి ఇతర శాఖలకు చెందిన వినతులు .  పింఛన్ల కోసం, రేషన్ కార్డుల జారీ, ఉపాధి కల్పన, ఉపాధి హామీ బిల్లుల చెల్లింపు ఇతర  సమస్యలపై మిగిలిన వినతులు అందాయి. జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి,  డి.ఆర్.ఓ గణపతి రావు,  ప్రత్యేక ఉప కలెక్టర్లు పద్మావతి, సూర్యనారాయణ, దొర పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ. స్పందన లో  అందిన వినతులు పెండింగ్ పెట్టకుండా  గడువు లోగా పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. 

Vizianagaram

2023-01-09 13:51:35

పోస్టాపీసులు, బ్యాంకుల్లోనే పొదుపు చేసుకోవాలి

ప్రజలు తమ కష్టార్జితంతో,  పొదుపు చేసుకున్న డబ్బును మదుపు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు పాటించాలని  జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి కోరారు. బ్యాంకులు, పోస్టాఫీసులు, రిజిష్ట‌ర్ అయిన సంస్థ‌ల్లో మాత్ర‌మే మదుపు చేయాల‌ని సూచించారు. జిల్లాలో 44 రిజిస్టర్ అయిన సంస్థలు ఉన్నాయని తెలిపారు.  రిజిష్ట‌ర్ చిట్‌ఫండ్ కంపెనీల్లో క‌ట్టిన చిట్టీల‌కు మాత్ర‌మే భద్రత ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. ప‌ప్పుల చిట్టీలు, ఇత‌ర ప్ర‌యివేటు చిట్టీల‌వ‌ల్ల మోస‌పోయే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉంటాయ‌ని, ఇలాంటివాటిప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఒక ప్ర‌క‌ట‌న‌లో హెచ్చ‌రించారు. ఇటీవ‌ల కాలంలో జిల్లాలో ప‌ప్పుల చిట్టీవ‌ల్ల భారీగా మోస‌పోయిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఇలాంటి వారు, ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం క‌ల్గించేందుకు కొంత‌కాలం పాటు స‌జావుగా చిట్టీ నిర్వ‌హిస్తార‌ని, అనంత‌రం ప‌రార‌వుతార‌ని చెప్పారు. 

గ‌తంలో కూడా ఇలాంటి సంఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయ‌ని తెలిపారు. ఇలాంటి అన‌ధికార చిట్టీలు, ప‌ప్పుల చిట్టీల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండి, ముందుగానే అధికారుల‌కు, పోలీసులకు ఫిర్యాదు చేయాల‌ని సూచించారు. ప్ర‌భుత్వ అనుమ‌తి లేకుండా, రిజిష్ట‌ర్ చేయ‌కుండా చిట్టీల‌ను నిర్వ‌హించే అన‌ధికార వ్య‌క్తులు, సంస్థ‌ల‌పై క‌ఠిన చ‌ర్య‌ల‌ను తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇటువంటి అన‌ధికార‌ సంస్థ‌ల‌పై చిట్‌ఫండ్ చ‌ట్టం 1982,లోని 76,79 నిభందల మేరకు,  సెక్ష‌న్లు  4,5,8,9,11,12,13,14,19,20,22,24,30,31, సెక్ష‌న్ 33లోని స‌బ్‌సెక్ష‌న్ 4, సెక్ష‌న్ 46,47, సెక్ష‌న్ 61లోని స‌బ్ సెక్ష‌న్ 5 ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు.

Vizianagaram

2023-01-09 13:48:36