1 ENS Live Breaking News

పంట రుణాలపై స్కేలుపై 15% అదనంగా రుణం

రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సాగు కొరకు ముందస్తుగా సాగునీరు విడుదల చేస్తోందని ఆదిశగా 3పంటలు పండించు కునేందుకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ 15% పెంచి పంట రుణాలు మంజూరు చేసేందుకు జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ నిర్ధారించిందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు శుక్రవారం కోనసీమ కలెక్టరేట్లో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించి వివిధ పంటల రుణాలకు సంబం ధించి స్కేల్ ఆప్ ఫైనాన్స్ పెంచుతూ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డెల్టా ప్రాంతంలో మూడు పంటలు సమృద్ధిగా పండించాలనే సంకల్పం తో సాగునీరు ముందుగా విడుదల చేయడంతో పాటు బ్యాంకు ద్వారా పంట రుణాలను పెంచుతూ నిర్ణ యాలు గైకొనడం జరుగుతుందని రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్త నాలు ఎరువులు పురుగు మందులు సకాలంలో అందించడం జరుగు తుందని కావున రైతాంగం మూడో పంటకు సిద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు.

 వ్యవసాయ శాఖ ,మత్స్యశాఖ ఉద్యాన శాఖ పశుసంవర్ధక శాఖలు వివిధ రుణాల కొరకు ప్రతిపాదిం చిన రుణాలను పెంచుతూ నిర్ణయా లు తీసుకున్నామన్నారు. ముఖ్యం గా వరి పంట రుణాల కొరకు ఎకరాకు ఖరీఫ్లో 38 వేల నుంచి 42 వేల వరకు, రబి సీజన్లో 40 వేల నుంచి 46 వేలు వరకు పెంచు తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు మొక్కజొన్న సాగుకు ఎకరాకు 32 వేల నుండి 38 వేల పెంచుతున్నట్లు ప్రకటించారు. అరటి పంట రుణాల ను 75,500 నుండి 80 వేల 900 వరకు పెంచుతున్నామన్నారు. కొబ్బరి సాగులో అంతర్ పంటల సాగును  ప్రోత్సహిస్తూ రుణ పరప తిని పెంచడం జరిగిందన్నారు కూరగాయల సాగు సంబంధించి 30,000 నుండి 40 వేల వరకు స్కేల్  ఆప్ ఫైనాన్స్ను, మత్స్య సాగుకు సంబంధించి 75% రుణ పరపతిని పెంచినట్టు చెప్పారు. పీతల సాగు సంబంధించి మరింతగా రుణపరిమితిని పెంచామన్నారు. 

 పశుసంవర్ధక శాఖ ద్వారా గేదెలు ఆవులు చేయూత లబ్ధిదారులకు లక్ష్యాలకు అనుగుణంగా గ్రౌండింగ్ చేస్తూ జగనన్న పాల విలువ కార్యక్రమం పై ప్రత్యేక దృష్టికి సారించాలన్నారు. కొబ్బరిలో అంతర పంటలుగా పోకచేక్క అరటి కోకో సాగును ప్రోత్సహించాలని సూచించారు డిసిసిబి చైర్మన్ ఎ వీర్రాజు మాట్లాడుతూ అన్ని పంట రుణాలను ఆయా శాఖల అధికా రులు ప్రతిపాదించిన విధంగా పెంచేందుకు పూర్తిగా ఎక్సర్సైజ్ చేయడం జరిగిందన్నారు. 20 23-24 సంవత్సరానికి సంబంధించి మొట్టమొదటి సారిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో డిసిసిబి సీఈవో నరసింహారాజు డిఆర్ఓ సిహెచ్ సత్తిబాబు వ్యవసాయ అనుబంధ శాఖల జిల్లా అధికారులు బ్యాంకర్లు అభ్యుదయ రైతులు ఎన్జీవోలు తదితరులు పాల్గొన్నారు.

Amalapuram

2023-01-06 14:09:48

చివరితేది10రోజుల ముందు వరకూ ఓటు నమోదు

శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్ల  జాబితాల డీ-నోవో తయారీలో సహ కరించవలసిందిగా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి రాజకీయ పార్టీలను కోరారు. RP చట్టం 1950లోని సెక్షన్ 22 మరియు 23 నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితాలు రోల్ కోసం ఉద్దేశించిన ఎన్నికలకు నామినేషన్లు పూరించడానికి చివరి తేదీ వరకు నిరంతర నవీకరణ చేయాలని చెప్పారు. అర్హులైన వ్యక్తులు ఎవరైనా నమో దు చేసుకోలేకపోయిన వారు ఫారం-18లో తమ దరఖాస్తులను దాఖలు చేసుకోవచ్చని, అభ్యంతరాలు ఉంటే  ఫారం-7, సవరణల కోసం ఫారం-8లో దాఖలు చేయవచ్చని తెలిపారు. నామినేషన్ల  చివరి తేదీకి 10 రోజుల ముందు వరకు నమోదు కోసం వచ్చిన దరఖాస్తులు బడతాయన్నారు.తుది ఓటర్ల జాబితాలు CEO ఆఫీస్ వెబ్‌సైట్  www.ceoandhra.nic.inలో  అందుబాటులో ఉంటాయన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పి.వెంకటరమణ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Anakapalle

2023-01-06 13:04:38

శ్రీకాకుళం జిల్లాలో గ్రూప్-1 పరీక్షకు 5600మంది

గ్రూప్-I పరీక్షలు నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎపిపిఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్-I పరీక్షలు ఈ నెల 8న జరుగుతున్న పరీక్షలు పై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 5600 మంది అభ్యర్ధులు పరీక్షలు రాస్తున్నారన్నారు. లైజన్ ఆఫీసర్లు గా సీనియర్ జిల్లా అధికారులను నియామకం చేశామన్నారు. పరీక్షాలను సందర్శించిన ప్రాంతాల్లో సమస్యలను లైజన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.   పరీక్ష ఉదయం 10 గంటలు నుండి 12 వరకు, మధ్యాహ్నం 2  నుండి 4 వరకు జరుగు తుందన్నారు. పరీక్ష కేంద్రాలు వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని పోలీసు అధికారుల ఆదేశించారు. ఈ సమావేశంలో డిఎస్పీ మహేంద్ర, ఎపిపిఎస్సీ సెక్షన్ ఆఫీసర్లు ప్రశాంత్ పాల్గొన్నారు.


Srikakulam

2023-01-06 11:14:28

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు..

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదిన నిర్వహించబోయే గ్రూపు-1 ప్రిలిమినరి పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని డిఆర్వో జి. నరశింహు లు సంబంధిత అధికారులకు సూచించారు.  కలెక్టరేట్లో శుక్రవారం ఏపిపిఎస్ ఎగ్జామ్స్ నిర్వహణ పై సర్వీఎస్ కమీషన్ అధికారులు, లైజనింగ్ అధికారులు, ఛీఫ్ సూపరింటెండెంట్లుతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించి సూచనలు చేశారు.  ఈ సందర్బంగా డిఆర్వో మాట్లాడుతూ, జిల్లాలో 342 పరీక్షా కేంద్రాల్లో 7946 మంది అభ్యర్ధులు హాజరు కానున్నారన్నారు.  ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పేపరు-1 తిరిగి మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు పేపరు-2 పరీక్ష ఉంటుందన్నారు. ఉదయం జరిగే పరీక్షకు ఉ. 9.45లోపు, మధ్యాహ్నం జరిగే పరీక్షకు మ. 1.45 లోపు అభ్యర్ధులు ఖచ్చితంగా పరీక్షా కేంద్రానికి హాజరు కావాలన్నారు. 

Rajamahendravaram

2023-01-06 09:12:34

గీతం యూనివర్శిటీ ఆక్రమించిన ప్రభుత్వ స్థంలో కంచె

గీతం యూనివర్శిటీ ఆక్రమించిన ప్రభుత్వ స్థలంలో రెవిన్యూ అధికారులు శుక్రవారం పక్కాగా కంచెవేశారు. జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున ఆదేశాల మేరకు ఆర్డీఓ భాస్కరరెడ్డి పోలీసుల సిబ్బంది సహకారంతో సర్వేనెంబరు 37, 38 ప్రభుత్వ భూముల్లో ఫెన్సింగ్ వేశారు. ప్రభుత్వ భూమిగా ఉన్న ఇక్కడ గతంలో ఫెన్సింగ్ లేదు. ఇపుడు 5.72 ఎకరాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్టు ఆర్డీఓ మీడియాకి వెల్లడించారు. మొత్తం 14 ఎకరాల 62 సెంట్లు ప్రభుత్వ భూమి ఉండగా ప్రభుత్వ భూములకు కేవలం పెన్సింగ్ మాత్రమే వేశామన్నారు. ఒక వైపు మాత్రమే ఫెన్సింగ్ వేశామని రెండవ వైపు ప్రభుత్వ భూమి ఉన్నదన్నారు. కోర్టు పరిశీలనలో 40 
ఎకరాల్లో వుంది. ప్రస్తుతం దానిజోలికి వెళ్లలేదని పేర్నొ్న్నారు. కాగా ప్రభుత్వ పనులన్నీ తెల్లవారుజామునే చేస్తామని. ఆ క్రమంలోనే ఈరోజు ఉదయం పనిపూర్తిచేశామన్నారు. ఉదయం అయితేనే కార్మికులు అలసిపోకుండా పని సులువు అవుతుందని ఆర్డీఓ మీడియాకి వివరించారు. 

Visakhapatnam

2023-01-06 05:54:19

సభలు, సమావేశాలకు పోలీసు అనుమతి కావాల్సిందే

బహిరంగ సభలు, సమావేశాలకు ఖచ్చితంగా పోలీసులు అనుమతి పొందిన తరువాత ఏర్పాటు చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జిఆర్.రాధిక ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా ఏపి 30 పోలీస్ చట్టం అమలులో ఉందని, గుంపులుగా ఒకే చోట ఏర్పడటం, ర్యాలీలు మొదలైన వాటిని నిషేధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. నిబంధనలను మేరకు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా జిల్లావ్యాప్తంగా అన్ని స్టేషన్లు, సర్కిళ్లు, సబ్ డివిజనల్ పోలీసు అధికారులు కూడా ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. అనుమతి లేనిదే సభలు జరగకూడదని ఆ ప్రకనటలో పేర్కొన్నారు.

Srikakulam

2023-01-05 15:13:58

విశాఖపట్నం జిల్లాలో సెబ్ స్టేషన్ పరిధి మార్పు

విశాఖపట్నం జిల్లా పరిధిలోని కొన్ని సెబ్ స్టేషన్ ల పరిధి మారిందని విశాఖపట్నం స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ జాయింట్ డైరెక్టర్  బమ్మిడి శ్రీనివాసరావు తెలిపారు.  కొత్త జిల్లాలకు అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం నగరంలోని సెబ్ స్టేషన్ లలో కొన్ని మార్పులు జరిగాయన్నారు. ఇందులో భాగంగా నగర పరిధిలోని 4 సెబ్ స్టేషన్ స్ధానంలో 3 స్టేషన్ లు పనిచేయనున్నాయి.  జిల్లా లో 7 స్టేషన్ ల స్థానం లో 6 స్టేషన్ వచ్చాయి. సర్కిల్ వన్, టు , త్రీ, ఫోర్ పేరు స్ధానంలో ఇకపై  మహారాణిపేట, సీతమ్మధార, గోపాలపట్నం గా పేరు మారాయి.  సర్కిల్ వన్ పరిధిలోని రెల్లి వీధి, హార్బర్ తదితర ప్రాంతాలు మహారాణి పేట పరిధిలోనికి వచ్చాయి. దాంతో పాటు ఇప్పటి వరకు సెబ్ స్టేషన్ సర్కిల్ ఫోర్ పరిధిలోని మల్కాపురం,  గాజువాకలోనూ,  93 వార్డు ఆర్ ఆర్ వెంకటాపురం పరిసర ప్రాంతాలు, పెందుర్తిలోనూ కలిసాయి. పెందుర్తి సెబ్ స్టేషన్ పరిధిలోని 92 వ వార్డు గోపాలపట్నం సెబ్ స్టేషన్ పరిధిలోకి వచ్చింది. ఈ మార్పులు  జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయని  సెబ్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలియజేశారు.

Visakhapatnam

2023-01-05 13:02:02

విజయవంత మైన జర్నలిస్టుల ఉచిత వైద్యశిరం

విశాఖలోని అక్కయ్యపాలెం పోర్ట్ మైదానము లో గురువారం వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ సభ్యులకు ఏబీ గ్రూప్, ఓయస్జి ఫౌండేషన్, వి బి హ్యూమానిటీ ఫౌండేషన్, సౌజన్యంతో మెడికవర్ హాస్పిటల్, వీ డెంటల్, విజన్ ట్రీ ఐ హాస్పిటల్ లు నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ విజయవంతం అయ్యింది. ఈ క్యాంప్ లో  బిపి, షుగర్, గుండె, సంబంధిత వ్యాధులు, కేన్సర్ నిర్ధారణ పరీక్షలు అలాగే దంత సమస్యకు సంబంధించి తనిఖీలు చేశారు. చాలామందికి కంటికి అవసరమైన తనిఖీలు చేపట్టారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఏబీ గ్రూప్ చైర్మన్ డాక్టరేట్ అవార్డు గ్రహీత యం.స్వరూప్ ఈ క్యాంపును  ప్రాంభించారు. విజేఎఫ్ ప్రెసిడెంట్ గంట్ల  శ్రీనుబాబు  మాట్లాడుతూ జర్నలిస్ట్  సోదరుల కోసం మంచి మనసుతో శిబిరం నిర్వహించారన్నారు. వి జె ఎఫ్ ఉపాధ్యక్షులు నాగరాజు పట్నాయక్ తో పాటు వెబ్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు రామకృష్ణ, శివ దళాయి, వెంకట్,భార్గవ్ వంశీ లను  సభాముఖంగా అభినందించారు.

Visakhapatnam

2023-01-05 12:22:17

అనారోగ్య బాధితులకు చెక్కులు అందజేసిన ఆర్డీఓ

ఎలమంచిలికి చెందిన కొండమంచి వాణి అనే బాలికకు, ఎస్. రాయవరం మండలం సైతారు పేట గ్రామానికి చెందిన కలగా శివాజీ లకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి రూ లక్ష చొప్పున చెక్కులను జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి మంజూరు చేశారు. ఆ చెక్కులను అనకాపల్లి ఆర్డీవో ఏ.జి.చిన్ని కృష్ణ స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో బాధితులకు అందజేశారు. కొండమంచి వాణికి పుట్టిన దగ్గరనుంచి మాటలు రాలేదు, చెవులు వినపడలేదు. ఎస్.రాయవరం మండలం సైతాలు పేట గ్రామానికి చెందిన కలగా శివాజీ మూడు సంవత్సరాల క్రిందట మోటార్ బైక్ ప్రమాదంలో తీవ్ర గాయాల బారిన పడి చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ ఆయన అవయవాలు ఏమి పని చేయడం లేదు.  ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వెంటనే జిల్లా కలెక్టర్ చెక్కులను పంపించగా అనకాపల్లి రెవిన్యూ డివిజనల్ అధికారి చిన్ని కృష్ణ వారికి చెక్కులను అందజేశారు. 

Anakapalle

2023-01-05 11:34:53

నాడు – నేడుతో విద్యాలయాల్లో ఉన్నత ప్రమాణాలు

నాడు-నేడు పథకం ద్వారా పాఠశాలలు, రెసిడెన్సియల్ స్కూల్స్ మరియు రెసిడెన్సియల్ కాలేజీలకు నూతన భవనాలతో పాటు అనేక మౌళిక వసతులు అందుబాటులోకి వచ్చాయని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. గురువారం ఉదయం ఆయన ప్రభుత్వ అతిథి గృహంలో విలేకురుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ హాస్టళ్లు , ఎస్.సి కార్పొరేషన్, రెసిడెన్సియల్ పాఠశాలలు, కళాశాలల్లో విద్య, మధ్యాహ్న భోజనం, వసతి తదితర  అంశాల గురించి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు.  విద్యాసంస్థల్లో నాడు-నేడు ద్వారా అనేక మౌలిక వసతులు, నూతన భవనాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. విద్యార్దులు ఆయా సదుపాయాలను సద్వినియోగం చేసుకునేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు. సాంఘిక సంక్షేమ శాఖను మరింత బలోపేతం చేయటానికి ప్రభుత్వం మరింత కృషి చేస్తుందన్నారు. సీఎం వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశ పెట్టి విద్యా వ్యవస్ధలో  దేశ చరిత్రలోనే 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి సంస్కరణలు తెచ్చి అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు.
 అంతకు ముందు శ్రీకాకుళం జిల్లాకు చెందిన సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్  రమణమూర్తి, శ్రీకాకుళం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటి డైరెక్టర్ గెడ్డమ్మ, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామారావు, రెసిడెన్సియల్ పాఠశాలల ప్రిన్సిపల్స్, జిల్లా కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు.


Visakhapatnam

2023-01-05 11:09:45

విద్యార్ధలకు విష్ణు సహస్రనామ స్తోత్రం కంఠస్థ పోటీలు

తిరుపతి నగరంలోని విద్యార్థినీ, విద్యార్థులకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అచ్యుతాష్టకం, విష్ణు సహస్రనామ స్తోత్రం కంఠస్థ పోటీలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1 వతేదీ ఉదయం 9 గంటలకు తిరుపతిలో ని అన్నమాచార్య కళామందిరంలో ఈ పోటీలు జరుగుతాయి.  పదేళ్ళ లోపు విద్యార్థినీ, విద్యార్థుల కు ''అచ్యు తాష్టకం" పై నిర్వహిస్తారు. 10 నుంచి 15 ఏళ్ళ లోపు వయసు గల విద్యార్థినీ, విద్యార్థులకు  "విష్ణు సహస్ర నామ స్తోత్రం" మీద పోటీలు జరుగుతాయి. ఆసక్తి ఉన్న విద్యార్థిని విద్యార్థులు ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 9 గంటలకు అన్నమాచార్య కళామందిరంలో హాజరై పేర్లు నమోదు చేయించుకోవాలి. విజేతలకు అదే రోజు అక్క డే బహుమతులు ప్రదానం చేస్తారు. మరిన్ని వివరాలకు 9676615643 మొబైల్ నంబర్ లో కార్యాలయ పనివేళల్లో సంప్రదించవచ్చు.

Tirupati

2023-01-05 06:45:59

రేపు యలమంచిలికి సీఎం వైఎస్.జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి అనకాపల్లి జిల్లా యలమంచిలిలో పర్యటిస్తున్నారు. విశాఖ డెయిరీ చైర్మన్ బుధవారం  మృతిచెందారు. విషయం తెలుసుకున్న సీఎం రేపు ఇక్కడి వస్తున్నారు. యలమంచిలిలోని ఆడారి తులసీరావు ఇంటికి వెళ్లి ఆయన నివాళులు అర్పిస్తారు. కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఆడారి తులసీరావు సుదీర్ఘకాలం పాటు విశాఖ డెయిరీకి చైర్మన్ గా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విశాఖడెయిరీని పేరు మార్చాలని ప్రయత్నించిన తరుణంలో కూడా తులసీరావు దైర్యంగా పోరాడి డెయిరీని అదేపేరు ఉంచేలా పోరాడారు. 

yalamanchili

2023-01-04 16:19:49

వైజాగ్ లో జి-20సదస్సుకి పక్కాగా ఏర్పాట్లు చేయాలి

విశాఖపట్నం లో మార్చి 28, 29 తేదీలలో విశాఖ వేదికగా జరుగనున్న ప్రతిష్టాత్మక జి-20 సదస్సుకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. బుధవారం విశాఖలో  జి -20 సదస్సు ఏర్పాట్లు , నిర్వహణపై జీవీఎంసీ, రెవెన్యూ, టూరిజం, విఎంఆర్డీఏ సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ విశాఖపట్నం వేదికగా జరిగే జి –20 సదస్సుకు 20 దేశాల నుండి అతిధులు రానున్నారని, వారికి అన్ని ఏర్పాట్లు ప్రణాళిక ప్రకారం పకడ్బందీగా చేయాలని ఆదేశించారు.

Visakhapatnam

2023-01-04 15:30:30

తుది ఓటరు జాబితా పక్కాగా తయారుచేయాలి.

ఫారం-7 ద్వారా ఓటరు నమోదు  అప్లికేషన్ ను రిజక్టు చేసినట్లయితే అందుకు తగిన కారణాలను ఓటరు కు తెలియజేయడం తో పాటు ఆన్లైన్ లో కూడా  అప్లోడ్ చేయాలని మేనేజింగ్ డైరక్టర్, ఎ.పి.డి.డి.సి.ఎఫ్ మరియు స్పెషల్ సమ్మరి రివిజన్ 2023 రోల్ అబ్జర్వర్ ఎ.బాబు తెలిపారు. మంగళంవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో జిల్లా కలెక్టర్ తో కలిసి ఇ ఆర్ ఓ లు,  ఎ.ఇ.ఆర్.ఓలతో సమీక్షా సమావేశం నిర్విహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుది ఓటరు జాబితా ముద్రణలో ఎటువంటి పొరపాటు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.  ఇప్పటి వరకు జరిగిన పరిణామాలతో  పాటు పాపులేషన్ రేషియో,  పోలింగ్ కేంద్రాల లోకేషన్స్ వివరాలు, సర్వీసు ఓటరు వివరాలు, మైగ్రేటెడ్ ఓటర్ల వివరాలు, ఒకే వ్యక్తి పొటో తో రెండు  లేదా అంతకంటే ఎక్కువ ఓటరు నమోదు జరిగినట్లయిటే అటువంటి వాటి  వివరాలు మరియు ఫారం-6బి (ఆధార్ లింక్) వివరాలపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున మాట్లాడుతూ తుది ఓటరు జాబితా ఎటువంటి పొరపాట్లలకు తావు లేకుండా రూపొందిస్తామన్నారు.
 ఈ సమీక్షా సమావేశంలో  జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాధన్ , జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి,  ఇ ఆర్ ఓ లు,  ఎ.ఇ.ఆర్.ఓ లు, వివిద బి.ఎల్.ఓలు  పాల్గొన్నారు. 

Visakhapatnam

2023-01-03 15:40:03

12న రణస్థలంలో పవన్ కళ్యాణ్ "యువశక్తి"

రాష్ట్రాన్ని వెఎస్సార్సీపీ కబంధహస్తాల నుండి కాపాడి, నిరుద్యోగ యువతకు దిశా నిర్దేశం చేయడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 12న శ్రీకాకుళంలోని రణస్థలంలో యువశక్తి పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తు న్నట్టు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తెలిపారు. మంగళవారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఇందుకోసం తమ పార్టీ ప్రాంతాలవారీగా సభ ను విజయవంతం చేయడానికి జనసేన యువశక్తి మీడియా కమిటీ సభ్యులుగా దూలం గోపి, నాగలక్ష్మి, గండి దుర్గాప్రసాద్, గురు ప్రసాద్, మిడతాన రవికుమార్, దాసరి జ్యోతి రెడ్డి నియమించామన్నారు.

Visakhapatnam

2023-01-03 15:36:19