1 ENS Live Breaking News

10న ఫైలేరియా నివారణ మాత్ర‌ల పంపిణీ

జాతీయ ఫైలేరియా నియంత్ర‌ణ కార్య‌క్ర‌మంలో భాగంగా ఫైలేరియా నిర్మూల‌న‌కు ఫిబ్ర‌వ‌రి 10వ తేదీన పెద్దఎత్తున ప్ర‌జ‌ల‌కు ఉచితంగా మాత్ర‌లు పంపిణీ చేసి, వేయించే కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా తెలిపారు. మంగ‌ళ‌వారం కాకినాడ క‌లెక్ట‌రేట్ నుంచి క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా అధ్య‌క్ష‌త‌న ఫైలేరియా నియంత్ర‌ణ‌పై జిల్లా స‌మ‌న్వ‌య క‌మిటీ (డీసీసీ) స‌మావేశం వ‌ర్చువ‌ల్‌గా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా మాట్లాడుతూ రెండేళ్ల‌కు పైబ‌డిన వారికి ఫైలేరియా నివార‌ణ మాత్ర‌లు (డై ఇథైల్ కార్బ‌మెజైన్‌-డీఈసీ, ఆల్‌బెండ‌జోల్‌) పంపిణీ చేసి, వేసుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మం ఆవ‌శ్య‌క‌త‌పై ప్ర‌జ‌ల‌కు గ్రామ‌, వార్డు స‌చివాల‌య స్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు.

 స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు ఆయా శాఖ‌ల క్షేత్ర‌స్థాయి సిబ్బందికి శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌న్నారు. వ‌య‌సు ఆధారంగా ఇవ్వాల్సిన మాత్ర‌లు, డోస్ త‌దిత‌రాల‌పై అవ‌గాహ‌న పెంపొందించాల‌న్నారు. తిన్న త‌ర్వాతే మాత్ర‌లు వేసుకోవాల్సి ఉంటుంద‌ని, ఈ విష‌యంపై సిబ్బందికి అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మం జ‌రిగే రోజున పీహెచ్‌సీ స్థాయిలో వైద్య అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశించారు. స‌మావేశానికి జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, డీఎంహెచ్‌వో డా. ఎం.శాంతిప్ర‌భ‌, డీసీహెచ్ఎస్ డా. పీబీవీ విష్ణువ‌ర్ధిని, జిల్లా మ‌లేరియా అధికారి ఎస్‌.భాస్క‌ర్, జిల్లా పంచాయ‌తీ అధికారి ఆర్‌.విక్ట‌ర్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2023-01-31 15:07:38

వృత్తిని ఆస్వాదిస్తూ ఉత్త‌మ సేవ‌లందించండి

 వైద్యవృత్తి చాలాప‌విత్ర‌మైన‌ద‌ని.. ఆవృత్తిని ఆస్వాదిస్తూ ప్రజ‌ల‌కు మెరుగైన రీతిలో సేవ‌లందించాల‌ని మెడిక‌ల్ ఆఫీస‌ర్ల‌ను ఉద్దేశించి జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి అన్నారు. చ‌క్క‌టి చిరున‌వ్వుతో ప‌ల‌క‌రించ‌టం ద్వారా రోగుల మ‌న‌సును తేలిక చేయాల‌ని త‌ర్వాత చికిత్స అంద‌జేయాల‌ని హిత‌వు ప‌లికారు. వైద్య‌ప‌ర‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకొనేలా ఆరోగ్యాన్ని కాపాడుకునేలా ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న  క‌ల్పించాల‌ని సూచించారు. ఇటీవ‌ల నియ‌మితులైన మెడిక‌ల్ ఆఫీస‌ర్ల నిమిత్తం స్థానిక డీఎం & హెచ్‌వో కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం ఒన్ డే ఓరియంటేష‌న్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజ‌రైన క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి వైద్యుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. 

ప‌నిని భారంగా కాకుండా ఇష్టంగా చేయాల‌ని, పేద ప్ర‌జ‌ల‌కు వైద్య‌ప‌ర‌మైన సేవ‌లందించటం అదృష్టంగా భావించాల‌ని.. మ‌న‌సుకు సంతృప్తి క‌లిగేలా ప‌ని చేయాల‌ని పేర్కొన్నారు. వైద్య వృత్తిలో ఉన్న‌వారికి ముఖ్యంగా స‌మ‌య‌పాల‌న‌, ప్ర‌శాంతత అవ‌స‌ర‌మ‌ని వాటిని ప్ర‌తి ఒక్క‌రూ పాటించాల‌న్నారు. ప్ర‌జ‌ల‌తో ప్రేమ పూర్వ‌కంగా మాట్లాడి త‌మ స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవాల‌ని, మెరుగైన రీతిలో చికిత్స అంద‌జేయాల‌ని చెప్పారు. సాధ్య‌మైనంత మేర‌కు చిన్న‌చిన్న కేసుల‌ను రిఫ‌ర‌ల్ చేయొద్ద‌ని సూచించారు. నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను పెంపొందించుకోవాల‌ని, ప్ర‌జ‌లు, ఇత‌ర విభాగాల అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను భాగ‌స్వామ్యం చేసుకొని ముందుకెళ్లాల‌ని కలెక్ట‌ర్ సూచించారు. 

స్థానిక ప‌రిస్థితులు, వాత‌వర‌ణాన్ని దృష్టిలో ఉంచుకొని అవ‌స‌ర‌మైన మందుల‌ను అందుబాటులో ఉంచుకోవాల‌న్నారు. చేసిన ప‌నికి సంబంధించిన నివేదిక‌లు స‌మ‌ర్పించేట‌ప్పుడు సాంకేతిక త‌ప్పిదాలు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త వ‌హించాల‌ని చెప్పారు. క్షేత్ర స్థాయిలో గ్రామీణ ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించే అవ‌కాశం రావ‌టం అదృష్టంగా భావించాల‌ని వైద్యుల‌కు సూచించారు. స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, ఇత‌ర విభాగాల అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ప్ర‌జ‌ల‌కు ఉత్త‌మ సేవ‌లందించాల‌ని హిత‌వు ప‌లికారు.కార్య‌క్ర‌మంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డా. ఎస్‌.వి. ర‌మ‌ణ కుమారి, జిల్లా మలేరియా అధికారిణి డా. తుల‌సి, ఇత‌ర వైద్యులు, డెమో సెక్ష‌న్ అధికారులు, సిబ్బంది, అధిక సంఖ్య‌లో మెడిక‌ల్ ఆఫీస‌ర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-01-31 10:38:58

ఫిబ్రవరి5న నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో లెక్కింపు

తిరుమలలో నిర్మించిన నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో ఫిబ్రవరి 5న కానుకల లెక్కింపు ప్రారంభంకానుంది. ఉదయం 9 గంటల నుండి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పుణ్యాహవచనం, గోమాత ప్రవేశం, గోపూజ, సుదర్శన హోమం నిర్వహిస్తారు. అనంతరం కానుకలను వేరుచేయడం, లెక్కించడం చేపడతారు. తిరుమ‌లలో స్వామివారి హుండీ కానుక‌లు లెక్కించ‌డానికి బెంగళూరుకు చెందిన దాత  మురళీకృష్ణ అందించిన రూ.23 కోట్ల విరాళంతో అధునాత‌న సౌక‌ర్యాల‌తో కూడిన నూత‌న పరకామణి భవనం నిర్మించారు. శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల సందర్భంగా 2022 సెప్టెంబరు 28న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఈ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం అభివృద్ధి పనులు పూర్తి చేసి సిద్ధం చేశారు.

Tirumala

2023-01-31 09:57:53

అల్లూరి చరిత్రను పట్టించుకోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్లవ జ్యోతి, అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు చరిత్రను పెడచెవిన పెట్టిందని జనసేన అరకు పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్రజి  వంపూరు గంగులయ్య ఆరోపించారు. మంగళవారం ఆయన అరకులో మీడియాతో మాట్లాడారు. జిల్లాల పునర్విభజనలో అల్లూరి పేరుని పాడేరు జిల్లాకు పెట్టిన ప్రభుత్వం ఆయన చరిత్రను పట్టించుకోవడం మానేసిందన్నారు. అల్లూరి సంచరించిన ప్రదేశాలను ఒక సెంట్రల్ థీమ్ ప్రాజెక్టుగా చేయడం ద్వారా అల్లూరి కోసం భావితరాల గిరిజనులకు తెలుస్తుందని, అంతేకాకుండా ఈప్రాంతం పర్యాటక పరంగా అభివ్రుద్ధి చెందుతుందన్నారు. అల్లూరి సీతారామరాజు ఉమ్మడి విశాఖజిల్లాలోని మన్యం వేదికగా తన పోరాటం చేశారని, ఆయన పోరాటాలు చేసిన ప్రతీప్రదేశాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక గిరిజన యువతకు ఉపాది దొరుకడంతోపాటు, అల్లూరి చరిత్ర భాహ్య ప్రపంచానికి తెలుస్తుందని, ఈవిషయమై ప్రభుత్వం తక్షణమే నిర్ధిష్ట ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

Araku Valley

2023-01-31 05:06:49

గిరిపుత్రుల నాడి, వాడి, వేడి.. జనసేన గంగులయ్య..!

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76ఏళ్లు గడుస్తున్నా మన్యంలోని గిరిజనుల బతుకులు మాత్రం మారలేదు. ఆ ప్రాంతాలు అసలే అభివృద్ధి చెందలేదు.. పాలకు లు  పట్టించుకోలేదు..ఐటిడిఏలు ముందుకి రాలేదు. అనాదిగా గిరిజనుల వేదన అరణ్య రోధనే అవుతున్నది. జనసేన పార్టీ ఆవిర్భవించిన తరువాత ఏజెన్సీలో ని గిరిపు త్రుల సమస్యలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి..ప్రభుత్వం దృష్టికి వెళుతున్నాయి..దానికి అంతటికీ కారణం ఒకే ఒక్కటే వంపూరు గంగులయ్య అరకు పార్లమెం టు నియోజవర్గం ఇన్చార్జిగా గిరిజనుల సమస్యలపైనే అలుపెరగకుండా పోరాటం చేస్తున్న ఏకైన ప్రజానాయకుడు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ, ప్రజల కష్టాలను చూస్తూ తనవంతుగా సహాయం అందిస్తూ..ప్రభుత్వం చేపట్టాల్సిన పనులను ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని కదిలిస్తున్న నాయకుడు. ఇపుడు అతనే గిరిపుత్రుల 
నాడి, వాడి, వేడి అయ్యాడు. అరకు పార్లమెంటు రథసారధిగా గిరిపుత్రుల మద్దతుతో ముందుకి సాగుతున్నాడు.

ARAKU VALLEY

2023-01-30 14:36:20

ఉక్కు ఉద్యమానికి ప్రభుత్వ మద్దతు..అమర్నాధ్

విశాఖపట్నం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ఉంటుందని, ఉక్కు కర్మాగార పరిరక్షణ కోసం భవిష్యత్తులో జరిగే ఉద్యమాల ను ప్రభుత్వం ముందుండి నడిపిస్తుందని.. ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటగా చెబుతున్నానని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు సోమవారం ప్లాంట్ ఆవరణలో నిర్వహించిన ఉక్కు ప్రజా గర్జన సభలో మంత్రి అమర్నాథ్ ప్రసంగించారు. విశాఖ హుక్కు.. ఆంధ్రుల హక్కు.. అన్న నినాదంతో ప్రారంభించిన ఆయన ప్రసంగం ఆద్యంతం కార్మికులకు భరోసాను కల్పిస్తూ.. ఉద్యమానికి మరింత ఊతమిస్తూ సాగింది.
 

విశాఖ స్టీల్ ప్లాంట్ మీద లక్షలాదిమంది ఆధారపడి పని చేస్తున్నారని, లాభాలలో కొనసాగుతున్న స్టీల్ ప్లాంట్ ను దొంగ చాటుగా ప్రైవేటు పరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వం ఆలోచనను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు 700 రోజులకు పైగా కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు అని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. 60వ దశకంలో తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు అనేక పోరాటాలు, ప్రాణత్యాగాలు చేసి, అప్పటి ప్రధానుల మెడలు వంచి ఉక్కు కర్మాగారాన్ని సాధించుకున్నారని ఆయన తెలియజేశారు.
అదేవిధంగా దేశంలో పలు రాష్ట్రాల్లో సముద్ర తీర ప్రాంతాలు ఉన్నప్పటికీ, విశాఖపట్నంలో ప్లాంటును ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉత్పత్తి అయ్యే స్టీల్ ప్రపంచంలోని వివిధ దేశాలకు సులభంగా రవాణా చేయొచ్చన్న ఉద్దేశంతోనే దేశంలోనే మొట్టమొదటి సముద్ర తీర ఉక్కు కర్మాగారాన్ని విశాఖలో ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు.

 
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయటానికి గత రెండు సంవత్సరాలుగా కేంద్రం ప్రయత్నిస్తోందని, దానిని అడ్డుకోవడానికి కార్మిక సంఘాలు ప్రజాసంఘాలు పోరాడుతున్న సమయంలో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కార్మిక సంఘాల నాయకులు కలిసి సుదీర్ఘంగా చర్చించారని అమర్నాథ్ చెప్పారు. అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి కార్మికులకు మద్దతు తెలియజేశారని, ఇటీవల ప్రధాని మోదీ విశాఖపట్నం వచ్చినప్పుడు జరిగిన సభలో తమకు ప్రజాప్రయోజనాలు తప్ప మరే ప్రయోజనాలు లేవని స్పష్టం చేయడంతోపాటు, ప్రైవేటీకరణను నిలిపివేయాలని ప్రధానికి పలు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి లేఖలు కూడా రాశారని అమర్నాథ్ తెలియజేశారు. స్టీల్ ప్లాంట్ కోసం వేలాది ఎకరాల భూమిని ఇక్కడ ప్రజలు వదులుకున్నారని, అనేకమంది నిర్వాసితులయ్యారని ఇప్పటికి వారికి ప్లాంట్ లో ఉద్యోగాలు లభించలేదని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.

 
కోవిడ్ సమయంలో ఆక్సిజన్ అందక అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, అటువంటి సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఆక్సిజన్ ని సరఫరా చేసి, 'ఉక్కు కాదు.. ఊపిరి' అని కూడా నిరూపించుకుందని అమర్నాథ్ చెప్పారు. ఇటువంటి స్టీల్ ప్లాంట్ ను విక్రయించాలన్న ఆలోచనకు వ్యతిరేకంగా ఏ సభలోనైనా ముఖ్యమంత్రి ప్రతినిధిగా గళమెత్తి మాట్లాడుతానని అమర్నాథ్ స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఇంతకాలంగా చేస్తున్న ఉద్యమానికి ప్రభుత్వ మద్దతు ఉందన్న విషయాన్ని అమర్నాథ్ గుర్తు చేశారు.

Gajuwaka

2023-01-30 14:05:53

కుష్టువ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

కుష్టు వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రి జిల్లా 
కలెక్టర్ సమావేశం మందిరంలో నిర్వహించిన కుష్టు వ్యాధి నిర్మూలనపై అవగాహన పక్షోత్సవ కార్యక్రమాన్ని  కలెక్టర్ ప్రారంభించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ 
డాక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ కుష్టు వ్యాధి నిర్మూలన పై ఈ నెల 30వ తేదీ నుండి ఫిబ్రవరి  13వ తేదీ వరకు  జిల్లాలో వైద్యాధికారులు వారి సిబ్బంది ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని నిర్వహించి  కుష్టు వ్యాధి నిర్మూలన పై  ప్రజలకు అవగాహన కల్పించిన ఉన్నారని పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహించుకుంటున్న ఈ తరుణం లో జిల్లా ప్రజలు, జిల్లా పరిపాలన విభాగానికి చెందిన అందరు కుష్టు  వ్యాధి నుంచి వ్యాధి గ్రస్తులను విముక్తి చేయడానికి వున్న ఏ అవకాశాన్ని వదులుకోమని ఈ సందర్భంగా ప్రకటించారు.  కుష్టు వ్యాధి విముక్తి కొరకు పోరాడి , కుష్ఠు వ్యాధిని గత చరిత్రగా మార్చేద్దామని పేర్కొన్నారు.

 ఈ సందర్భంగా పలువురు కుష్టు  వ్యాధిగ్రస్తులకు జిల్లా కలెక్టర్ మాధవీలత స్టీలు బిందెలు, దుప్పట్లు , పండ్లు పంపిణీ చేశారు. జిల్లా లెప్రసీ , ఎయిడ్స్ టీవీ కంట్రోల్ అధికారిణి డా.ఎన్. వసుంధర మాట్లాడుతూ  జిల్లాలో ఇప్పటివరకు  70 కేసులు గుర్తించామని, చికిత్స పొందుతున్న  740 డిఫార్మటీ కేసెస్ ( కాళ్లు చేతులు లేని ) వారు ఉన్నారన్నారు. వీరందరికీ ప్రభుత్వ పరంగా ప్రతినెలా పెన్షన్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. కుష్టు వ్యాధిని సులభంగా గుర్తించ వచ్చునని, దీనిని చికిత్స ద్వారా పూర్తిగా నయం చేయవచ్చు అన్నారు.  జిల్లాలో వున్న అన్ని కుష్ఠు వ్యాధి కేసులను ప్రారంభ దశలోనే కనుగొనుటకు పూర్తిగా కృషి చేస్తామన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి జిల్లాలో వున్న అన్ని వనరులను వినియోగించుకుంటా మన్నారు. 

సమాజములో కుష్టు వ్యాధిగ్రస్తుల పట్ల వున్న వివక్షను, చిన్న చూపును తొలగించి వారిని ప్రధాన జన జీవన స్రవంతిలోకి తీసుకురావడానికి అన్ని విధాలా కృషి 
చేస్తామన్నారు.కుష్టు వ్యాధికి కారకమైన బ్యాక్టీరియా పేరు మైకోబ్యాక్టీరియం లెప్రే (Mycobacterium leprae) ద్వారా వ్యాధి వ్యాప్తి చెందుతుందన్నారు. అంత 
సులభంగా అంటుకునే అంటువ్యాధి కాదన్నారు. దాప్ సొన్ రిఫాంప్సిలిన్ టబ్లెట్, ఇతర మందులు చాలా ఉన్నాయి. ప్రభుత్వం ఉచితంగా మందులు  ఇవ్వడం జరుగుతుందని డి ఎల్. ఓ  డా .వసుంధర పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డిఆర్ఓ జి. నరసింహులు,  జిల్లా వైద్య అధికారులు, కుష్ఠు వ్యాధి పీడితులు, పలువురు అధికారులు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Rajamahendravaram

2023-01-30 10:33:35

విజయనగరం జిల్లా డి.ఆర్.సి. వాయిదా

విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జనవరి 31న జరగాల్సిన జిల్లా సమీక్ష సమావేశం వాయిదా పడినట్లు జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్న దృష్ట్యా సమీక్ష సమావేశం వాయిదా వేస్తూ జిల్లా ఇన్ చార్జి మంత్రి నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ సమావేశం జరిగే తదుపరి తేదీని తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈలోగా జిల్లా అధికారులు సమస్త సమాచారంతో సిద్దంగా ఉండాలన్నారు.

Vizianagaram

2023-01-30 10:12:40

సత్యదేవుని ఆలయంలో డయల్ యువర్ ఈఓ

అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో  సోమవారం డయల్ యువర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఈఓ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈఓ కార్యాలయంలో ఉదయం 10:30 నుంచి 11. 30 నిమిషాల వరకు కార్యక్రమం జరుగుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమయంలో భక్తులు తమ విలువైన సూచనలు, సలహాలు, ఆలయంలో అందుతున్న సేవలు తదితర విషయాలపై నేరుగా ఈఓతో మాట్లాడవచ్చునని పేర్కొన్నారు. దానికోసం భక్తులు ఈ ఫోన్ నంబర్ : 08868-238127 లో సంప్రదించాల్సి వుంటుందని ఆ ప్రకటనలో ఈఓ తెలియజేశారు.

Annavaram

2023-01-29 16:07:22

తిరుపతిలో వైభవంగా భజనమండళ్ల శోభాయాత్ర

టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనమండళ్ల శోభాయాత్ర ఆదివారం సాయంత్రం వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరుగనున్న శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాల ప్రారంభంలో భాగంగా ఈ  కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి  రైల్వేస్టేషన్‌ వెనక వైపు గల మూడో సత్ర ప్రాంగణంలో ఉదయం 5 నుంచి 7 గంటల వరకు భజన మండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 8.30 నుండి 10.30 గంటల వరకు సంకీర్తనాలాపన జరిగింది. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ధార్మిక సందేశం అందించారు. సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వద్ద టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీఆనందతీర్థాచార్యులు పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా పి.ఆర్‌.ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ, హరినామసంకీర్తన ప్రజల్లో అశాంతిని దూరం చేస్తుందన్నారు. కలియుగంలో స్వామివారిని సేవించడం ఎంతో పుణ్యఫలమన్నారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి విచ్చేసిన 3500 మందికిపైగా భజనమండళ్ల సభ్యులు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి శోభాయాత్రగా రైల్వేస్టేషన్‌ వెనకవైపు గల మూడో సత్రం ప్రాంగణానికి చేరుకున్నారు. దారి పొడవునా వారు చేసిన భజనలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి.
 సాయంత్రం 6 గంటల నుండి సంగీత విభావరి,సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జనవరి 31న ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాలమండపం వద్ద ప్రముఖులతో మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండలి సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చేరుకుంటారు.

Tirupati

2023-01-29 14:19:26

గ్రామ సచివాలయం ఉద్యోగం మీ లక్ష్యమైతే కేరాఫ్ కీర్తి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో తీయబోయే గ్రామవార్డు సచివాలయ ఉద్యోగాలు సాధించడం మీ లక్ష్యమైతే..మీరు కాకినాడ కీర్తి కాంపిటేటివ్ ఇనిస్టిట్యూట్ లో చేరడం ద్వారా మీ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. 2019లో సచివాలయ ఉద్యోగ నోటిఫికేషన్ లో సుమారు 140 మందిని సచివాలయ ఉద్యోగులుగా మార్చింది కీర్తి కాంపిటేటివ్ ఇనిస్టిట్యూట్. ఉద్యోగాలు పొందిన వారే మళ్లీ గ్రూప్-2, ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు మళ్లీ కీర్తి ఇనిస్టిట్యూట్ లోనే చేరుతున్నారు. అత్యుత్తమ శిక్షణ, సుదీర్ఘ అనుభవం కలిగిని ఫ్యాకల్టీతో విద్యాభోధన. డైలీ, వీక్లీ, మంత్లీ మోడల్ టెస్టులు, క్లాస్ లోనే లైవ్ క్వశ్చన్ సెషన్లు. వివరాలకు పవన్ సర్-9032228708

Kakinada

2023-01-29 14:01:30

ఐఐఎంలో ప్ర‌సంగించిన కలెక్టర్ సూర్యకుమారి

విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌తిష్టాత్మక  విద్యాసంస్థ ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో  జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.సూర్యకుమారి ప్ర‌సంగించారు. మ‌హాత్మాగాంధీ నేష‌న‌ల్ ఫెలోస్ నుద్దేశించి, ఆమె స్ఫూర్తిదాయ‌క ప్ర‌సంగం చేశారు. ఈ సందర్భంగా సిటిజెన్ చార్టర్ అమలుకు సంబంధించిన అంశాలను వివ‌రించారు. ప్రభుత్వ శాఖల పనితీరు, కలెక్టర్, జిల్లా ఉన్నతాధికారుల పాత్ర, పరిశోధనా విద్యార్థుల పాత్ర, వారు దృష్టి కేంద్రీకరించాల్సిన అంశాలను, వాటి ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.  ఐఐఎం ఎంజిఎన్ఎఫ్ ఛైర్‌ప‌ర్స‌న్ ప్రొఫెస‌ర్ మొహ్మ‌ద్ ష‌మీమ్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు, జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంజీఎన్ఎఫ్ ఫెలో సుశాంత్ తో పాటు సుమారు 60 మంది సహచర  విద్యార్ధులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-01-29 13:46:41

శారదా పీఠాధి పతిని దర్శించుకున్న మంత్రి చెల్లుబోయిన

ఆంధ్రప్రదేశ్ బి.సి సంక్షేమ, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రాఫీ, శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ ఆధివారం సాయంత్రం చినముషిడి వాడ, శారదా పీఠాదిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భముగా మంత్రి స్వామికి పండ్లు అందజేశారు.  శారదా పీఠం వార్షికోత్సవాలలో భాగంగా మంత్రి స్వామిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అంతకు ముందు మంత్రి పీఠంలో దేవతామూర్తులను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో  సమాచార శాఖ జాయింట్ డైరక్టర్  వి.మణిరామ్, బి.సి సంక్షేమ  అధికారిణి శ్రీదేవి కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Pendurthi

2023-01-29 13:17:36

మాద‌క ద్య‌వ్యాల నియంత్ర‌ణ‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు

కాకినాడ‌ జిల్లాలో మాద‌క ద్ర‌వ్యాల నివార‌ణ‌, నియంత్ర‌ణ‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవాలని.. వాటి వాడ‌కం దుష్ప‌రిణామాల‌పై అవ‌గాహ‌న ప్రజల్లో క‌ల్పించాల‌ని కలెక్ట‌ర్ డా. కృతికా శుక్లా అధికారుల‌ను ఆదేశించారు. శ‌నివారం జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా అధ్యక్ష‌త‌న మాద‌క ద్ర‌వ్యాల నివార‌ణ‌, చిన్నారులు వాటి బారిన‌ప‌డ‌కుండా తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, కార్యాచ‌ర‌ణ‌పై వ‌ర్చువ‌ల్‌గా స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ మాద‌క ద్ర‌వ్యాలు వ్య‌క్తితో పాటు వారి కుటుంబాల‌ను చిన్నాభిన్నం చేస్తాయ‌ని.. వాటి నివార‌ణ‌తో పాటు వినియోగం జ‌ర‌క్కుండా చూసేందుకు గ‌ట్టి నిఘా ఏర్పాటు చేయాల‌న్నారు. పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో మాద‌క ద్ర‌వ్యాల దుష్ప‌రిణామాల‌పై ప్ర‌త్యేక అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని సూచించారు. ఎవ‌రివ‌ద్ద‌నైనా డ్ర‌గ్స్ ఉన్న‌ట్లు తేలితే వారికి కౌన్సెలింగ్ ఇవ్వాల‌న్నారు.

 ఆ డ్ర‌గ్స్  ఎక్క‌డి నుంచి వ‌స్తున్నాయో తెలుసుకొని చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. దుష్ప‌రిణామాలు, కౌన్సెలింగ్, చ‌ట్ట‌ప‌ర శిక్ష‌లు త‌దిత‌రాల‌కు సంబంధించిన స‌మాచారాన్ని గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో ప్ర‌ద‌ర్శించాలని, ఫోన్ నంబ‌ర్ల‌ను అందుబాటులో ఉంచాలని సూచించారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఎక్కువ‌గా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని.. ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో హోర్డింగ్స్ ఏర్పాటు చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. స‌మావేశంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌; క‌మిటీ క‌న్వీన‌ర్‌, ఐసీడీఎస్ పీడీ కె.ప్ర‌వీణ‌; విద్యాశాఖ‌, సాంఘిక సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖ‌, శిశు సంక్షేమం, ఎక్సైజ్ త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌తో పాటు ఛైల్డ్ లైన్ 1098, ఛైల్డ్ ఫండ్ స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2023-01-28 13:18:18

దరఖాస్తులను నెలలోగా గ్రౌన్డింగ్ చేయించాలి

పరిశ్రమల స్థాపనకు అందిన దరఖాస్తులను నెల రోజుల్లోగా గ్రౌన్డింగ్ జేరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఆదేశించారు.  సంబంధిత శాఖల అధికారులు  దరఖాస్తులను గడువు లోగానే పరిష్కరించాలని అన్నారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియం లో  జిల్లా స్థాయి  పరిశ్రమల ప్రోత్సాహక  కమిటీ సమావేశం  కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ  ఫుడ్  ఉద్యాన శాఖ, మత్స్య శాఖల ద్వారా  పి.ఎం.జి.ఎస్.వై క్రింద యువత కు  అవకాశాలు కల్పించాలని సూచించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం అక్టోబర్ నుండి జనవరి వరకు 104 దరఖాస్తులు  అందగా 82  దరఖాస్తులను ఆమోదించడం జరిగిందని, కాలుష్య నియంత్రణ శాఖ వద్ద 19 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని,  3 దరఖాస్తులు తిరష్కరించడం జరిగిందని పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పాపా రావు  వివరించారు.

 కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను నేరుగా తిరష్కరించవద్దని,దరఖాస్తు లోని లోపాలను సవరించి తిరిగి సమర్పించమని చెప్పి, అందుకు తగు సలహాలను  అందించాలని సూచించారు.  ఎస్.సి., ఎస్.టి, మహిళల కు సబ్సిడీ 35 నుండి 45 శాతం వరకు ఉందని, అవగాహన కలిగించి ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించాలని తెలిపారు. మాల్స్ , దుకాణాల్లో భద్రతా తనిఖీలు:  వినియోగదారులకు కనీస భద్రత ఉండేలా  దుకాణాల్లో మాల్స్ లో భద్రతా అంశాలను తనిఖీ చేసి ఆడిట్ నివేదిక నందించాలని ఆదేశించారు. అగ్నిమాపక, లేబర్, మున్సిపల్ శాఖల వారు సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించాలన్నారు. ఎంట్రీ, ఎగ్జిట్  ద్వారాలు వేర్వేరుగా ఉండాలని, ఫైర్ సామాగ్రి, అత్త్యవసర ద్వారాలు  ఉండాలని, నిబంధనలను పాటించని వాటి లైసెన్స్ రద్దు చేయాలనీ అన్నారు. సమావేశం లో డి.ఆర్.డి.ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కళ్యాణ చక్రవర్తి, లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస రావు, జిల్లా అధికారులు, ఎపిఐఐసి సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. 

Vizianagaram

2023-01-28 12:28:46