1 ENS Live Breaking News

ప్రభుత్వ లక్ష్యాన్ని వైద్యులు పరిపూర్ణం చేయాలి

ప్రతి ఒక్కరు  ఆరోగ్యంగా వుండాలి అన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆ మేరకు జిల్లాలో  ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమంలో ప్రజారోగ్య భద్రతకు పటిష్టమైన చర్యలు చేపట్టామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రి కలెక్టరేట్ లో ఉత్తమ వైద్య సేవలు అందచేసిన వైద్యులను జిల్లా కలెక్టర్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ డా.కె.మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమం క్రింద గర్భిణీ, బాలింతలు, ధీర్ఘకాలికా వ్యాధులతో బాధపడే వారు,  ఆరోగ్యశ్రీ, శస్త్ర  చికిత్సల రోగులకు , స్కూల్ మరియు అంగన్వాడీ స్కూల్ లో ఆరోగ్య పరీక్షలు చేసి ఉత్తమ వైద్య సేవలు అందించిన  5గురు  వైద్యులను సన్మానించామన్నారు.

 జిల్లాలో  ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు. ఇందులో భాగంగా కోరుకొండ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం డా.రవిచంద్ర, సీతానగరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం డా. రాజు, కల్లవాలపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం డా.సౌజన్య, డా.అవినాష్ మరియు  దోసకాయలపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం డా. ఈషా జ్యోతి లు  తమకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేశారని తెలిపారు.  ఈ కార్యక్రమంలో డా. కే. వెంకటేశ్వర్రావు, డిసిహెచ్ఒ డా. ఎమ్. సనత్ కుమారి, డా. ఎన్ వసుందర , వైద్యులు డా.మౌనిక, డా.అబిషేక్, ఇతర వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. 

Rajamahendravaram

2023-01-09 13:42:06

ప.గో.జి రెడ్ క్రాస్ సహాయనిధికి రూ.1.67లక్షలు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పశ్చిమ గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సహాయ నిధికి ఉపాది హామీ పథకం భీమవరం క్లస్టర్ తరపున రూ.1.67లక్షలు నిధి సమకూరిందని డ్వామా పీడీ ఎస్టీవి రాజేశ్వర్రావు తెలియజేశారు.  ఈ మొత్తాన్ని భీమవరం క్లస్టర్ ఎపిడి  వి. విజయ లక్ష్మి, ఇ. సి కె. శ్రీనివాస్, జె.ఇ ఆనంద్ వివిధ మండలాల టి.ఏ లు,సి.ఓ లు ద్వామ సిబ్బంది డ్వామా పీడి అందచేశారు.  ఇటీవల తణుకు క్లస్టర్ మండలాల సిబ్బంది అందచేసిన రూ:67,000/- తో కలిపి రూ:1,67,000/- మొత్తాన్ని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్  జిల్లా కలెక్టర్ కి అందజేయనున్నట్టు డ్వామా పీడీ తెలియజేశారు.

Bhimavaram

2023-01-09 13:36:33

భూ హక్కుదారులకే కొనుగోలు పత్రాలు అందించాలి


భూ హక్కు పత్రాలు  భూమిని కొనుగోలు చేసిన వారికి మాత్రమే అందేలా చర్యలు తీసుకోవాలని పశ్చిమగోదా వరి జెసి జె.వి మురళీ  తాసిల్దార్ లను ఆదేశించారు.సోమవారం భీమవరం  కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై  రెవెన్యూ అధికారులు, సిబ్బందితో  సమీక్షించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ భూమిని అమ్మకం జరిపిన కేసులకు సంబంధించి భూమిని కొనుగోలు చేసిన వారికే భూ హక్కు పత్రాలను అందజేయాలని సూచించారు.  వారితో ముటేషన్స్ కి దరఖాస్తు చేయించి ఈకేవైసీ ద్వారా పేరు మార్పును చేయాల్సిందిగా సూచించారు. పేదలకు స్థలాలు కేటాయించిన చోట ఇళ్ల పట్టాలు పొందడానికి సుముఖంగా లేని వారి కారణాలను పొందుపరచి సమర్పించాలన్నారు.

  ఇళ్ల పట్టాలకు అవసరమైన భూమిని గుర్తించే ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్నారు.  స్మశాన వాటిక లకు స్థల కేటాయింపులలో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు, అభ్యంతరం ఉన్న పోరంబోకు  స్థలాలకు ప్రత్యామ్నాయంగా వేరే స్థలాలను గుర్తించాలన్నారు.  భూ రీసర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు,  పొరపాట్లకు తావులేని విధంగా రికార్డులను రూపొందించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి దాసిరాజు, నరసాపురం సబ్ కలెక్టర్ సూర్య తేజ, తాసిల్దార్ లు, ఎంపీడీవోలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Bhimavaram

2023-01-09 13:30:51

టిటిడి ఆలయాల్లో రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు

టిటిడి ఆలయాలు, అనుబంధ ఆలయాల్లో ఈనెల 28న రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని జెఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఆలయాల అధికారులు, ఇతర విభాగాల అధికారులతో సోమవారం ఉదయం జెఈవో వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా జెఈవో మాట్లాడుతూ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ కోదండరామాల యం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరాలయం, నారాయణవనం, నాగలాపురం, దేవుని కడప తదితర అలయాల్లో రథసప్తమి సందర్భంగా వాహనసేవలతో పాటు చక్కగా మూలమూర్తి దర్శనం కల్పించా లని ఆదేశించారు. అన్ని ఆలయాల్లో వాహనాల పటిష్టతను ముందస్తుగా పరీక్షించాలని డిఎఫ్‌వోకు సూచించా రు. దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రథోత్సవానికి గాను రథం పటిష్టతను పరిశీలించాలన్నారు. ఆయా ఆలయాల్లో వివిధ విభాగాల అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి పెండింగ్‌ పనులు వేగవంతం చేయాలన్నారు.

అదేవిధంగా, జమ్మూ, చెన్నై, రంపచోడవరం, సీతంపేట ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయిన ఆలయాల్లో మహాసంప్రోక్షణకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఆయా ఆలయాలకు అవసరమైన ఆభరణాలు, శిలా విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు, అర్చక సిబ్బంది, ఇతర డెప్యుటేషన్‌ సిబ్బంది, పారిశుద్ధ్య ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. ఈ ఆలయాలకు సంబంధించి పనుల పురోగతిపై ఇంజినీరింగ్‌ అధికారులు నివేదిక సమర్పించాలన్నారు. మహాసంప్రోక్షణ కార్యక్రమాలకు విచ్చేసే భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు అందించాలని, ఆకట్టుకునేలా విద్యుద్దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టాలని ఆదేశించారు. 

అంతకుముందు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాల వారీగా చేపట్టిన ఏర్పాట్లు, భవిష్యత్తులో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారుల నుండి సూచనలు, సలహాలు స్వీకరించారు.  వర్చువల్‌ సమావేశంలో ఎస్‌ఇలు  సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, డెప్యూటీ ఈవోలు గుణభూషణ్‌రెడ్డి, గోవిందరాజన్‌, ట్రాన్స్‌పోర్టు జిఎం శేషారెడ్డి, విజివో మనోహర్‌, డిఎఫ్‌వో శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2023-01-09 13:15:32

అంకిత భావంతో విధులు నిర్వహణ చేయండి

అంకిత భావంతో విధులు నిర్వహించి ప్రభుత్వానికి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. శ్రీకాకుళం రోడ్డు రవాణా సంస్థలో విధులు  నిర్వహిస్తు మరణించిన 12 మంది ఉద్యోగుల కుటుంబాల సభ్యులకు జిల్లాలో సచివాలయాల్లో ఉద్యోగ అవకాశం కల్పిస్తూ సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విధుల పై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సకాలంలో అందజేయాలని హితవు పలికారు. ఈ నియామక పత్రాల పంపిణి కార్యక్రమంలో ఆర్.టి.సి, ఆర్.ఎం  ఎ.విజయ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరీ, జిల్లా పరిషత్ సి.ఇ.ఓ వెంకట్ రామన్, జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయదేవి, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2023-01-09 09:50:25

గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు చేయండి..

బాపట్ల జిల్లాలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  ఈనెల26వ తేదీన పోలీసు పెరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేసే శకటాలు,స్టాల్స్ ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీసు గ్రౌండ్స్ లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.గణతంత్ర దినోత్సవ వేడుకలకు వచ్చే వారికీ ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలన్నారు. వేడుకలకు వచ్చే పిల్లలకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలని ఆమె చెప్పారు. పోలీసు పెరేడ్ గ్రౌండ్స్ లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు.

 స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గడువులోగా అర్జీలను పరిష్కరించని అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.గత వారం లో వచ్చిన అర్జీలను పరిష్కరించాలన్నారు. ఒకే సమస్య పై పదే పదే అర్జీలు వస్తే  సహించేది లేదని అధికారులను ఆదేశించారు.  మండల ప్రత్యేక అధికారులు పారిశుద్ధ్య కార్యక్రమాలు తనిఖీ చేయాలన్నారు. జిల్లాలో అన్ని మండల,గ్రామ పంచాయతీ స్థాయిల్లో గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసులు,     జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మీ శివ జ్యోతి, పశుసంవర్ధక శాఖ జె.డి హనుమంతరావు, వ్యవసాయ శాఖ జె.డి అబ్దుల్ సత్తార్,మత్స్య శాఖ జె.డి సురేష్, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రసాద్ ,  సి.పి.ఓ భరత్  కుమార్,డి.ఎం. హ్.ఓ డ్రా.విజయమ్మ, పౌర సరఫరాల శాఖ డి.ఎస్.ఓ వీలీమ్స్, డి.ఎం శ్రీలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.   

Bapatla

2023-01-09 09:42:10

బాధిత వర్గాలకు ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తుంది

బాధిత వ‌ర్గాల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఎల్ల‌ప్ప‌డూ అండ‌గా నిలుస్తుంద‌ని రాష్ట్ర శాస‌న స‌భ డిప్యూటీ స్పీక‌ర్ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి పేర్కొన్నారు. ప్ర‌తి ఒక్క‌రికీ ప‌థ‌కాలు వ‌ర్తించేలా, ఆర్థిక స‌హాయం అందించేలా ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌లు తీసుకుందని గుర్తు చేశారు. సోమ‌వారం త‌న ఇంటి వ‌ద్ద ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక కార్య‌క్రమంలో న‌గ‌రానికి చెందిన ముగ్గురికి రూ.6.45 ల‌క్ష‌ల విలువ గ‌ల‌ సీఎం రిలీఫ్ చెక్కులు, విభిన్న ప్ర‌తిభావంతుల శాఖ ఆధ్వ‌ర్యంలో మంజూరు చేసిన రూ.2.76 లక్ష‌ల విలువ గ‌ల మూడు త్రిచ‌క్ర స్కూటీల‌ను విభిన్న ప్ర‌తిభావంతుల‌కు అంద‌జేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌త మూడేళ్ల‌లో పేద‌ల సంక్షేమం కోసం చేప‌ట్టిన ప‌థ‌కాల గురించి వివ‌రించారు. జిల్లాలో సుమారు 70 స్కూటీల‌ను ప్ర‌భుత్వం మంజూరు చేసింద‌ని అందులో విజ‌య‌న‌గ‌రం నియోజ‌వ‌ర్గానికి చెందిన ముగ్గురికి స్కూటీల‌ను కేటాయించటం హ‌ర్ష‌ణీయ‌మ‌ని పేర్కొన్నారు.
 అలాగే అనారోగ్యాల కార‌ణంగా ఇబ్బంది ప‌డిన స్థానికుల‌కు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక స‌హాయం అందజేసి మెరుగైన చికిత్స అంద‌జేశామ‌ని ఆయ‌న గుర్తు చేశారు. ఆరుగురికి రూ.9.21 ల‌క్ష‌ల ఆర్థిక చేయూత‌
ఒక్కొక్క స్కూటీ విలువ రూ.92 వేలు కాగా రూ.2.76 ల‌క్ష‌లు వెచ్చించి న‌గ‌రానికి చెందిన‌ ముచ్చ ల‌క్ష్మీ, దాసిరెడ్డి ఉమామహేశ్వ‌రి, రౌతు ధ‌న‌ల‌క్ష్మిల‌కు డిప్యూటీ స్పీక‌ర్ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామి చేతుల మీదుగా సంబంధిత తాళాలు అంద‌జేశారు. అలాగే అశోక్ న‌గ‌ర్ కు చెందిన సారిక అఖిల‌కు రూ.2 ల‌క్ష‌లు, చిక్కాల వీధికి చెందిన కిల్లంపూడి సాయి ఈశ్వ‌ర్ మోహ‌ణ్ కుషాల్‌కు రూ.45 వేలు, కె.ఎల్‌. పురానికి చెందిన నడింప‌ల్లి వెంక‌ట రామ‌కృష్ణ రాజుకు రూ.4ల‌క్ష‌ల చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల‌ను పంపిణీ చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో న‌గ‌ర మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయ‌ర్ కోల‌గ‌ట్ల శ్రావణి, విభిన్న ప్ర‌తిభావంతుల విభాగం స‌హాయ సంచాల‌కులు జ‌గ‌దీష్‌, స్థానిక‌ ప్ర‌తినిధులు, ఇత‌ర అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.
 

Vizianagaram

2023-01-09 08:24:43

శ్రీవారిని దర్శించుకున్న మాజీ సీజె జస్టిస్ ఎన్వీ రమణ

భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ.రమణ కుటుంబ సమేతంగా శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న మాజీ ప్రధాన న్యాయమూర్తికి టిటిడి ఈవో ఎవి ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం  వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.  అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా శ్రీవారి తీర్థప్రసాదాలు, 2023 టిటిడి క్యాలెండర్, డైరీని ఈఓ అందజేశారు.

Tirumala

2023-01-07 11:13:48

స్టీల్‌ప్లాంట్‌ సీఎండీతో ఐఎస్‌టీడీ బృందం భేటీ

వైజాగ్‌ స్టీల్‌ సీఎండీ, ఐఎస్‌టీడీ అడ్వయిజరీ కమిటీ చైర్మన్‌ అతుల్‌ భట్‌తో విశాఖపట్నం చాప్టర్‌ మేనేజింగ్‌ కమిటీ సభ్యులు(ఐఎస్‌టీడీ) సభ్యులు శనివారం భేటీ అయ్యారు. ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. హెచ్‌ఆర్‌ నిపుణుల ప్రయోజనం కోసం ఆర్‌ఐఎన్‌ఎల్‌తో కలిసి నిర్వహించగల కార్యక్రమాలపై చర్చించారు. త్రైమాసిక మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లు, ఇతర హెచ్‌ఆర్‌ సంబంధిత కార్యకలాపాలను నిర్వహించాలని చాప్టర్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఓఆర్‌ఎం.రావు ప్రతిపాదించారు. ఎండీపీలకు సంబంధించిన అంశాలు, కార్యకలాపాలపై చర్చించారు. తదుపరి కార్యాచరణ ప్రణాళిక గురించి సలహా ఇచ్చేందుకు ఆర్‌ఐఎన్‌ఎల్‌లో ఎంసీ సభ్యుల కోసం సమావేశానికి అధ్యక్షత వహించాల్సిందిగా సీఎండీని అభ్యర్థించారు. ఐఎస్‌టీడీ గౌరవ కార్యదర్శి డాక్టర్‌ హేమ యడవల్లి విశాఖపట్నం చాప్టర్‌ ద్వారా ఈ-జర్నల్‌ను ప్రారంభించడం గురించి వివరించారు. జర్నల్‌ మొదటి సంచికకు సందేశం ఇవ్వాలని ఆమె అభ్యర్థించగా సీఎండీ దానికి అంగీకరించారు. కార్యక్రమంలో ఐఎస్టీడీ ప్రతినిధులు పాల్గొన్నారు.


Gajuwaka

2023-01-07 10:25:49

అర్హతే ప్రమాణంగా పేదలకు కొత్త పించన్లు మంజూరు

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలను  ఎంతో నిజాయతీగా,  నిస్పక్షపాతంగా అర్హులైన లబ్ధిదారులందరికీ  అందిస్తూ వారికి ఆర్థికంగా భరోసాను అందిస్తున్నారని పార్లమెంట్ సభ్యులు మార్గాన్ని భరత్ రామ్ పేర్కొన్నారు.  వైఎస్ఆర్  పెన్షన్ కానుక  వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక  శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఎం.పి భరత్ రామ్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రుడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిళ, మున్సిపల్ కమీషన కె. దినేష్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర మున్సిపల్ అధికారులు,  లబ్దిదారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపి. భరత్ రామ్ మాట్లాడుతూ   రాజమహేంద్రవరం అర్బన్ ప్రాంతంలో నూతనంగా 1324 మంది లబ్దిదారులుకు పెన్షన్లు అందించగా ఇప్పటి వరకు 29917 మంది లబ్దిదారులుకు రూ. 8,36,16,750 రూపాయలు పెన్షన్ అందిస్తున్నామన్నారు. 

అర్హత ఉన్న ప్రతి వానికి ఫింఛను అందించాలన్నదే ప్రభుత్వ నిర్ణయం అన్నారు. గతంలో 39 లక్షల మందికి వెయ్యి రూపాయలు చొప్పన అందించే వారని అదికూడా ఎండనక, వాననక క్యూలైన్లో నుంచో వలసిన పరిస్థిలు ఉండేవన్నారు. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అర్హతే ప్రామాణికంగా తీసుకొని ప్రతి పేదవానికి ఫించను అందించగా నేడు రాష్ట్రంలో 64.64 లక్షల మందికి ఫించన్లు అందిస్తూ వారికి ఆర్థిక భరోసాను కల్పించారన్నారు.  ప్రభుత్వం ఇంత చేస్తుంటే ప్రతి ప్రక్షాలు పెన్షన్లు తీసేస్తారనే దుష్పప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.  ఈ సందర్బంగా అర్హులైన పలువురికి పెన్షన్లు పంపిణీ చేసారు.
మున్సిపల్  కమీషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ అర్హులై ఉండి దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందిస్తునామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు నగరంలో వారం  రోజులు పాటి పింఛను కానుక వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.  అర్హత ఉన్న వారేవరు పింఛను రాలేదని బయపడనవసరం లేదని, సంవత్సరంలో ప్రతి ఆరుమాసాలకు ఒకసారి జూన్, డిసెంబరు మాసాల్లో  అర్హులను గుర్తించి ఫింఛను అందిస్తామన్నారు. 

నూతనంగా మంజూరు అయిన వారందరికీ ఈ వారం రోజులు పాటు కార్యక్రమాలు నిర్వహించి వారికి పెన్షన్ అందిస్తామన్నారు. రుడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిలా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ట్రాత్మకంగా  అర్హులైన ప్రతి పేదవానికి పెన్షన్ మంజూరు చేస్తున్నారన్నారు.  గతంలో పెన్షన్ తీసుకోవాలంటే ప్రభుత్వం కార్యాలయాలు చుట్టూ నాలుగైదు రోజులు తిరగాల్సిన పరిస్థితులు ఉండేవన్నారు. నేడు అటువంటి పరిస్థిలు లేకుండా 1 వ తేదీ తెల్లవారు ఝూమునే వాలంటీరీ వచ్చి తలుపు తట్టి మరీ పెన్షన్ అందిస్తున్నారన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా, ఆరోగ్యంగా బాగుండాలన్నదే సీయం లక్ష్యం అన్నారు. విద్యాభివృద్ది ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని ఇందులో భాగంగా ఫీజురియంబర్స్ మెంట్, అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన్ వంటి అనేక పథకాలను ప్రభుత్వం అమల  చేస్తుందన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు అడపా శ్రీహరి, వార్డు కార్యదర్శులు, వార్డు ఇన్చార్జులు, పెన్షన్ నూతనంగా మంజూరు లైన పలువురు లబ్దిదారులు పాల్గొన్నారు. 

Rajamahendravaram

2023-01-06 15:47:51

గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కోసం కాల్ సెంటర్

ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించే గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిలిమ్స్ పరిక్షల కోసం ప్రత్యేక  కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు సూచించారు. ఈ సందర్భంగా కాల్ సెంటర్ల నంబర్లు:
8309000534, 8333813468 ను మీడియాకి ప్రకటన ద్వారా తెలియజేశారు. అభ్యర్ధులకు సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చినా ఈ నెంబర్ల ద్వారా నివ్రుత్తి చేసుకోవచ్చునన్నారు. ఇప్పటికే పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఆయన మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.

Vizianagaram

2023-01-06 15:11:25

లోకాయుక్తా కేసులపై నివేదికలు సమర్పించాలి

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని వివిధ శాఖ‌ల్లో త‌లెత్తిన స‌మ‌స్య‌ల‌పై న‌మోదైన లోకాయుక్త కేసుల‌కు సంబంధించి నిర్ణీత కాలంలో పూర్తి వివ‌రాల‌తో కూడిన నివేదిక‌లు త‌యారు చేసుకోవాల‌ని వివిధ శాఖ‌ల అధికారుల‌కు జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గ‌ణ‌ప‌తిరావు సూచించారు. జిల్లాలో న‌మోదైన లోకాయుక్త కేసుల తాజా ప‌రిస్థితిపై వివిధ విభాగాల అధికారుల‌తో ఆయ‌న గురువారం త‌న ఛాంబ‌ర్లో స‌మావేశ‌మ‌య్యారు. కేసుల పూర్వాప‌రాలు, తాజా స్థితుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఇరు వ‌ర్గాల‌కు ఇబ్బందులు లేకుండా పార‌ద‌ర్శ‌క‌మైన జాబితాల‌ను త‌యారు చేసుకొని అందుబాటులో ఉంచుకోవాల‌న్నారు. ఆయా విభాగాల ప‌రిధిలో నమోదైన కేసుల‌పై సంబంధిత విభాగాధిప‌తుల‌పై సంప్రదించి పూర్తి వివ‌రాలు స‌మ‌ర్పించాల‌ని పేర్కొన్నారు. స‌మావేశంలో క‌లెక్ట‌రేట్ ఏవో శ్రీ‌కాంత్‌, వివిధ విభాగాల అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-01-06 15:02:05

చిట్టిగురువులు కార్యక్రమం దేశం లోనే ప్రత్యేకం

నిరక్షరాశ్యులైన వయోజనులను అక్షరాస్యులుగా  మార్చడానికి పిల్లలే పెద్దలకు పాఠాలు చెప్పే చిట్టి గురువులు కార్యక్రమం దేశం లోనే ప్రత్యేకతను సంతరించుకుందని ఉప సభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి పేర్కొన్నారు.  ఏడాది క్రితం ప్రారంభించి పరీక్షలు నిర్వహించుకొని   కొత్తగా 87 వేల మంది అక్షరాస్యులుగా తీర్చిదిద్దిన  సందర్భంగా చిట్టిగురువులు విజయోత్సవ  కార్యక్రమాన్ని  కలెక్టరేట్ ఆడిటోరియం లో శుక్రవారం నిర్వహించారు. ఈ ముఖ్య అతిధి గా ఉప సభాపతి హాజరైనారు.  కార్యక్రమానికి  జిల్లా కలెక్టర్  ఎ. సూర్య కుమారి అధ్యక్షత వహించగా  జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, శాసన మండలి సభ్యులు డా. సురేష్ బాబు, పాకలపాటి రఘు వర్మ, ఇందుకూరి రఘురాజు, ఎమ్మెల్యే కంబాల జోగులు, వయోజన విద్య  శాఖ సంచాలకులు సూర్యనారాయణ,  డి.డి కోట్ల సుగుణాకర రావు హాజరైనారు. 

ఈ సందర్భంగా చిట్టి గురువులు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజా ప్రతినిధులకు  మండల బృందాలకు, ప్రత్యేకాధికారులకు , సర్పంచ్ లకు చిట్టి గురువులకు ఘనంగా సన్మానించి మేమెంటోలను , సర్టిఫికేట్లను అందజేసారు. అంతకు ముందు  ముఖ్య అతిధి ఉపసభాపతి కోలగట్ల మాట్లాడుతూ  చదువు ప్రాధాన్యతను గుర్తించి చదువులేని వయోజనులకు చిట్టి గురువులతో చదువు చెప్పించడం  గొప్ప ఆలోచన అని కొనియాడారు.  చదువు తోనే అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గుర్తించి విద్య కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. పని లో కాకుండా పిల్లలు బడి లో ఉండాలని, ప్రతి పేద వాడు చదువుకోవాలని అమ్మ వొడి, జగనన్న గోరు ముద్ద , వై.ఎస్.ఆర్ కంటి వెలుగు  వంటి పధకాలను అమలు చేస్తున్నారని అన్నారు. పిల్లవాడు ఇష్టంగా బడికి వెళ్ళాలని, శ్రద్ధగా చదువుకోవాలనే ఉద్దేశ్యం తో నాడు-నేడు ద్వారా పాఠశాలలను అన్ని వసతులను ఉండేలా  అభివృద్ధి చేసారని పేర్కొన్నారు.   జిల్లా కలెక్టర్ చురుకుగా పని చేయడమే కాకుండా అధికార యంత్రాంగాన్ని పని చేయించడం వలన  ఈ కార్యక్రమం ఇంతటి విజయవంతం అయ్యిందని కలెక్టర్ ను అభినందించారు. 

 అధికారుల కృషి కి ప్రజా ప్రతినిధుల సహకారం తోడైతే మంచి ఫలితాలను సాధించగలమని నిరూపితమైందని ఉద్ఘాటించారు.  ఇలాంటి సామజిక కార్యక్రమాలకు తానూ సైతం ముందుంటానని తెలిపారు. 
సభాధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ సూర్య కుమారి మాట్లాడుతూ  మనస్పూర్తిగా పని చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు అనడానికి ఇదే ఒక ఉదాహరణ గా పెర్కొనవచ్చని అన్నారు. జిల్లా అక్షరాస్యత  ప్రస్తుతం 94 శాతానికి  చేరిందని, ఇది ఇక్కడితో ఆగిపోకూడదని, ఈ కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు.  గుర్ల, నెల్లిమర్ల మండలాలు శత శాతం సాధించాయని, మిగిలిన మండలాలు కూడా ఆ దిశగా నడవాలని ఆకాంక్షించారు.  ఈ కార్యక్రమం విజయవంతం కావడం వెనుక ప్రజా ప్రతినిధుల సహకారమే ముఖ్యమైనదని అన్నారు. ధన, వస్తు రూపేణా అనేక మంది సహకారాన్ని అందించారని, వారందరికీ పేరు పేరున ధన్యవాదాలని అన్నారు.  ప్రజా ప్రతినిధులు అధికారులను చిన్నారులను భుజం తట్టి ప్రోత్సహించారని, ఈ ప్రోత్సాహం ఇలాగె కొనసాగితే శత  శాతం త్వరలో సాధించగలమనే నమ్మకం కలుగుతుందన్నారు.

 
జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు మాట్లాడుతూ  ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టినపుడు అనేక సందేహాలు ఉండేవని, కానీ 94 శాతం అక్షరాస్యతను సాధింఛి అంచనాలను తిరగ రాసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలను ఆపకుండా కొనసాగించాలని, జిల్లా పరిషత్ నుండి  విద్యా కార్యక్రమాలకు నిధుల సహకారం అందిస్తామని అన్నారు.  27 మండలాల్లో సంపూర్ణ అక్షరాస్యత సాధించేలా కార్యాచరణ ప్రణాళికను తయారు  చేయాలనీ కలెక్టర్ కు సూచించారు. 
ఈ సందర్భంగా చదువు గొప్పతనం,  ప్రాధాన్యతను తెలిపేలా ఆలపించిన గీతాలు, చిన్నారులు చేసిన నృత్యాలు అలరించడమే కాకుండా ఆలోచింపజేసాయి. అన్ని మండలాలకు చెందినా చిట్టి గురువులను కార్యక్రమం లో సన్మానించారు. 

Vizianagaram

2023-01-06 15:00:09

ప్ర‌తి ఒక్క‌రూ కోవిడ్ -19 నిబంధ‌న‌లు పాటించాలి

ప్ర‌తి ఒక్క‌రూ కోవిడ్ ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కోవిడ్ -19 నిబంధ‌న‌లు పాటించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి హెచ్చ‌రించారు. అన్ని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు కార్యాల‌యాల్లో కోవిడ్ నిబంధ‌న‌లు విధిగా పాటించాల‌ని, ప్ర‌తి ఒక్క‌రూ మాస్కు ధ‌రించేలా ఆయా విభాగాధిప‌తులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని శుక్రవారం జారీ చేసిన ఉత్త‌ర్వుల్లో ఆమె పేర్కొన్నారు. నాలుగో వేవ్ పై ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయ‌టంలో కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి వ‌ర‌కు అన్ని శాఖ‌ల అధికారులు భాగ‌స్వామ్యం కావాల‌ని ఆదేశించారు. ప్ర‌జా ప్రతినిధులు, ప్ర‌జాసంఘాల స‌భ్యులు, స్వ‌చ్చంద సేవా సంస్థ‌ల నిర్వాహ‌కుల నుంచి స‌హాయం పొందాల‌ని సూచించారు. స‌ఖి గ్రూపుల స‌భ్యుల సేవ‌ల‌ను సద్వినియోగం చేసుకోవాల‌న్నారు.

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు ప్ర‌తి ఒక్క‌రూ కోవిడ్ నాలుగో ద‌శ ప్ర‌మాదంపై ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని పేర్కొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని సూచించారు. ఆరు మీట‌ర్ల భౌతిక దూరం పాటించాల‌ని, గుమిగూడ‌రాద‌ని హిత‌వు ప‌లికారు. ప్ర‌తి ఒక్క‌రూ మాస్కు ధ‌రించాల‌ని, శానిటైజ‌ర్ వినియోగించాల‌ని సూచించారు. వైద్య సిబ్బంది త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌జ‌లు భ‌య‌భ్రాంతుల‌కు గురికాకుండా ధైర్యం నింపాల‌ని పేర్కొన్నారు. 

Vizianagaram

2023-01-06 14:57:33

ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్

ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందని, ఆర్గానిక్ ఉత్పత్తులపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మిజోరం రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. విశాఖలోని గాదిరాజు ప్యాలెస్ లో గో-ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో4 రోజులపాటు జరిగే ఆర్గానిక్ మేళాకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రకృతి, గో ఆధారిత వ్యవసాయం గురించి రైతుల్లో అవగాహన కల్పించడం ఎంతైనా అవసరం ఉందని అన్నారు. ఎరువులు, క్రిమిసంహారక మందులు అవసరం లేకుండా కేవలం గో పేడతో పంటలు పండించడం ద్వారా అనారోగ్యాల బారిన పడకుండా ఉంటామని అన్నారు. గతంలో మిద్దె వ్యవసాయం జరిగేదని, దీనిపై కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన కోరారు. వ్యర్థాలను ఎరువులుగా మార్చి పంటలు పండించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. ఐక్యరాజ్యసమితి ఈ సంవత్సరాన్ని మిల్లెట్ ఇయర్ గా ప్రకటించడం ముదావహమని అన్నారు.
 

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలు ఇక్కడ నిర్వహించిన ఆర్గానిక్ మేళా విజయవంతం కావడంతో ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం సంతోషకరమని అన్నారు. కోవిడ్ అనారోగ్య సమస్యలను ఆర్గానిక్ పదార్థాలతో అధిగమించగలుగుతున్నామని చెప్పారు. వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పులు వస్తున్నాయని, కానీ ఎరువులు, క్రిమిసంహార మందులు లేకుండా పూర్వపు పద్ధతుల్లోనే వ్యవసాయం చేస్తే పోషకాలతో కూడిన ఆహారం అందుబాటులోకి వస్తుందని, తద్వారా మనుషుల జీవన ప్రమాణం పెరుగుతుందని మంత్రి అమర్నాథ్ అన్నారు. ప్రకృతి, గో ఆధారిత వ్యవసాయానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందని అమర్నాథ్ చెప్పారు.ఈ సందర్భంగా మేళాలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను గవర్నర్ హరిబాబు మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిశీలించారు.

Visakhapatnam

2023-01-06 14:27:40