1 ENS Live Breaking News

రాష్ట్ర అధ్యక్షునిగా సాంబశివనాయుడు..

ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నికలు విజయవాడలో బుధవారం ఓ హోటల్ లో జరిగాయి. యూనియన్ ఏర్పాటై 2 సంవత్సరాలు దాటిన సందర్భంగా యూనియన్ రాష్ట్ర నూతన కమిటీని అధ్యక్షులుగా చొప్పారపు సాంబశివనాయుడు నాయకుల  ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. రాష్ట్ర  అధ్యక్షులుగా ఈయనను రెండవసారి ఎన్నుకున్నారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పి.ప్రసన్నకుమార్ రెడ్డి(కడప), సి. సంజీవరెడ్డి  (అనంతపురం)ప్రధాన కార్యదర్శిగా  జూపూడి గురుకాంతాచారి,(ప్రకాశం) పి.సాయికుమార్, కార్యదర్శులుగా(గుంటూరు) బి. షాలన్న,(కర్నూలు) కొయిలాడ పరశురామ్, (విశాఖపట్నం) ఏ. రాధ కృష్ణ,(కృష్ణా జిల్లా) 
సహాయ కార్యదర్శిలుగా  ఎండీ హుమైన్,(విజయవాడ),నేమాల.హేమసుందర రావు,( విశాఖపట్నం),రాఘవేంద్ర రావు (కర్నూలు ) కార్యనిర్వహక సభ్యులుగా వై. శ్రీనివాసరావు, (తూర్పుగోదావరి),సంతోష్,(శ్రీకాకుళం), కె.సుధాకర చారి,( చిత్తూరు  ), సత్యనారాయణ మూర్తి, (రాజమండ్రీ), టి. నరసింహం,(పశ్చిమ గోదావరి),సలహా  సభ్యులుగా కాకుమాను వెంకట వేణు,గరగ ప్రసాద్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Tadepalle

2021-06-30 15:18:42

Tadepalle

2021-06-30 14:30:18

ఒలింపిక్స్ లో దేశానికి పతకాలు సాధించాలి..

జపాన్‌ టోక్యో నగరంలో జులై 23,2021 నుంచి ఆగష్టు 8 వరకూ  జరిగే ఒలింపిక్స్‌లో భారతదేశానికి మంచి పథకాలు సాధించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఆకాంక్షించారు. బుధవారం ఆంధ్రప్రదేశ్‌ నుంచి భారతదేశం తరపున పాల్గొంటున్న ఒలింపియన్స్‌ పి.వి సింధు, ఆర్‌. సాత్విక్‌ సాయిరాజ్, రజనీలకు సీఎం వైఎస్‌ జగన్‌  విషెష్‌ చెప్పి ఒక్కొక్కరికీ రూ. 5లక్షల చెక్‌ అందజేశారు. విశాఖలో బ్యాడ్మింటన్‌ అకాడమీ ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల భూమికి సంబంధించిన జీవోను పి.వి. సింధుకి అందజేసి అభినందనలు తెలియజేశీ ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, మరియు క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tadepalle

2021-06-30 14:28:49

అందరి సహకారంతో కరోనా నివారణ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రంణకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన  చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్-19 నివారణ చర్యలపై మంగళవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి సిఎస్ వెబ్ నార్ నిర్వహించారు. ఈ వెబ్ నార్ లో హెల్ప్ కమ్యూనిటీ, అవేర్ నెస్, రూరల్ కమ్యూనికేషన్, అప్రొప్రయేట్ బిహేవియర్, వ్యాక్సినేషన్ తదితర 5 అంశాలపై చర్చించారు. ఈసందర్భంగా సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ మాట్లాడుతూ,  రాష్ట్రంలో ఇప్పటి వరకూ 2.16 కోట్ల కొవిడ్ టెస్టు నిర్వహించామని తెలిపారు.  వాటిలో ఆర్టీపీసీఆర్ ద్వారా 1,47,74,072 టెస్టులు,ర్యాపిడ్ యాంటిజనెన్ విధానం ద్వారా 68,63,534 టెస్టులు నిర్వహించడం జరిగిందని సిఎస్ పేర్కొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 18,75,622 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 18,16,930 మంది వ్యాధి నుండి కొలుకున్నారని తెలిపారు. కరోనా కారణంగా ఇంత వరకూ 12,566 మంది మృతి చెందారని సిఎస్ చెప్పారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 1,48,64,205 మందికి టీకాలు వేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ పేర్కొన్నారు. కాగా 1,19,54,827 మందికి ఒక డోసు, 29,09,378 మందికి రెండు డోసులు వేశామన్నారు.జర్వ పీడితుల గుర్తింపునకు చేపట్టిన ఇంటింటి సర్వేలో 1,42,55,516 కుటుంబాల నుంచి నమూనాల సేకరించామన్నారు. కరోనా నివారణలో భాగంగా ఒక వైపు కర్ఫ్యూ విధిస్తూనే,మరో వైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా కొనసాగిస్తున్నామన్నారు. ప్రభుత్వ ప్రవేట్ భాగస్వామ్యం ద్వారా మరింత వేగవంతంగా రాష్ట్రంలో కరోనా నివారణ సాధ్యమవుతుందన్నారు. ఈ వీడియో సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్ కె.భాస్కర్,కోవిడ్ టాస్కుఫోర్సు కమిటీ సభ్యులు బాబు ఎ తోపాటు గోద్రేజ్ అగ్రోవెట్,యూనిలివర్, ఓక్షఫామ్, యూనిసెఫ్, ఐటీసీ, ఓన్జీసీ, బెర్గర్, మారికో, టాటా ట్రస్టుతో పాటు ఆసంస్థలకు చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

Tadepalle

2021-06-29 13:56:12

SCSP నిధులు 100% ఖర్చుచేయాలి..

రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి వారికి సంక్షేమానికై ఎస్సి కాంపొనెంట్ కింద పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఆదేశించారు. ఈమేరకు ఎస్సి కాంపొనెంట్ కు సంబంధించి మంగళవారం అమరావతి సచివాలయం 5వ బ్లాకులో 27వ నోడలు ఏజెన్సీ ఆఫ్ షెడ్యూల్డ్ కులాల కాంపొనెంట్ (SCSP) సమావేశం మంత్రి విశ్వరూప్ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్సి కాంపొనెంట్ కింద కేటాయించిన నిధులను నూరు శాతం ఖర్చు చేయాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.ఈనిధుల వినియోగంలో ఎంతమాత్రం జాప్యం లేదా అలసత్వం ప్రదర్శించవద్దని ఆయన స్పష్టం చేశారు.2020-21లో షెడ్యూల్ కులాల కాంపోనెంట్ కింద 44 శాఖలకు(HOD's) 19430 కోట్లు కేటాయించగా 13672 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని పేర్కొన్నారు.ఎస్సి కాంపొనెంట్ కింద కేటాయించిన నిధుల్లో 76%కంటే ఎక్కువ 12శాఖలు ఖర్చు చేయగా,25నుండి 51% 23శాఖలు ఖర్చు చేశాయని 9శాఖలు మాత్రం ఏవిధమైన నిధులు ఖర్చు చేయలేదని మంత్రి విశ్వరూప్ పేర్కొన్నారు. 

2021-22 ఆర్థిక సంవత్సరానికి షెడ్యూల్ కులాల కాంపోనెంట్ (SCSP) కింద 42 శాఖలకు 17403 కోట్లు కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు.ఇది గత ఆర్థిక సం.రం.కంటే 1667కోట్లు(10.06శాతం)అదనమని,2019-20 కంటే 2402కోట్లు(16%) అదనమని మంత్రి విశ్వరూప్ పేర్కొన్నారు.కాగా మే 2021 నాటికి ఎస్సి కాంపొనెంట్ కింద కేటాయించిన నిధుల్లో 4641 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని చెప్పారు.2021-22 ఆర్థిక సం.రం.లో ఎస్సిఎస్పి కింద అధిక నిధులు కేటాయించిన శాఖల్లో ప్రధానంగా సాంఘిక సంక్షేమ శాఖకు 8059కోట్లు, వ్యవసాయ శాఖ 1680కోట్లు,గృహ నిర్మాణ శాఖ కు 1020కోట్లు, ఇంధన శాఖకు 810కోట్లు కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు.

ఎస్సి కులాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్ననేపధ్యంలో ఇందుకై కేటాయించిన నిధులను నూరు శాతం ఖర్చు చేసేందుకు అన్ని శాఖలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఆదేశించారు.కొన్ని శాఖలకు కేటాయించిన నిధులను సక్రమంగా ఖర్చు చేయలేక పొవడం,కొన్ని శాఖలు అసలు నిధులేమీ ఖర్చు చేయడం పోవడానికి గల కారణాలను విశ్లేషించి పూర్తి స్థాయిలో ఖర్చు చేసేలా చూడాలని వివిధ శాఖల అధికారులను మంత్రి ఆదేశించారు.తదుపరి త్రైమాసికంలో జరిగే సమావేశం సియం అధ్యక్షతన జరుగుతుందని కావున ఆలోగా వివిధ శాఖలన్నీ పూర్తి స్థాయిలో నిధులు ఖర్చు చేసేందుకు కృషి చేయాలని మంత్రి పినిపే విశ్వరూప్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.

సమావేశానికి తొలుత సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సునీత స్వాగతం పలికారు.అనంతరం వివిధ శాఖల వారీగా ఎస్సిఎస్పి కింద కేటాయించిన నిధులు ఆయా శాఖలు ఖర్చు చేసిన నిధులు వివరాలను శాఖల వారీ సమీక్షించారు.
ఈసమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ కమీషనర్ హర్ష వర్ధన్,ఎపి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సోసైటీ కార్యదర్శి నవ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tadepalle

2021-06-29 12:55:13

ఎమ్మెల్యేలు చైర్మన్లగా అసైన్డ్ కమిటీలు..

 రాష్ట్రంలో నిరుపేదలకు భూ పంపిణీ నిమిత్తం ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చైర్మన్లు గా  అసైన్ మెంట్ కమిటీలు ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ) ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. సమగ్ర భూ రీ సర్వేతో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ వివాదాలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. వెలగపూడిలోని అసెంబ్లీ భవనంలో లో ఉన్న కాన్ఫరెన్స్ హాలులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి అసైన్డ్ భూములు, అసైన్ మెంట్ కమిటీల ఏర్పాటుపై మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో నిరుపేదలకు భూ పంపిణీ చేయడానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారన్నారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యే అధ్యక్షతన నియోజకవర్గ స్థాయిలో అసైన్ మెంట్ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యేల అధ్యక్షతన అసైన్ మెంట్ కమిటీలు ఉండేవన్నారు. తరవాత కాలంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి చైర్మన్ గా జిల్లా స్థాయి అసైన్ మెంట్ కమిటీలు ఏర్పాటయ్యాయన్నారు. ఎమ్మెల్యేల నేతృత్వంలో అసైన్ మెంట్ కమిటీలు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ కమిటీలు ఆయా నియోజకవర్గాల్లోని నిరుపేదలను గుర్తించి భూ పంపిణీకి అర్హులుగా వారి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారన్నారు. రాష్ట్ర చరిత్రలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే అత్యధికంగా నిరుపేదలకు భూములు పంపిణీ చేశారన్నారు. 2014 నుంచి గత ప్రభుత్వ హయాంలో భూ పంపిణీ చేయలేదన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి భూ పంపిణీకి శ్రీకారం చుడుతున్నారన్నారు. దీనిలో భాగంగా ఎమ్మెల్యేల నేతృత్వంలో అసైన్ మెంట్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారన్నారు. సమగ్ర భూ రీ సర్వే ద్వారా శాశ్వత భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 62 వేల ఎకరాల్లో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇళ్ల స్థలాల కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ.9,900 కోట్లు వెచ్చించి 25 వేల ఎకరాలకు పైగా కొనుగోలు చేశామన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, నిరుపేదలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారన్నారు. అర్హులను గుర్తించి రెండున్నర ఎకరాల మెట్ట గాని, 5 ఎకరాల మాగాణి గాని ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. భూ పంపిణీ సమగ్ర భూ రీ సర్వేతో సీఎం జగన్ హయాంలో భూ వివాదాలన్నీ పరిష్కారమయ్యాయనే సంతృప్తి ప్రజల్లో కలుగుతుందన్నారు. అంతకుముందు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి మాట్లాడుతూ, రాష్ట్రంలో గతంలో జరిపిన భూ పంపిణీ విధానంపైనా, అసైన్డ్ చట్టాలపైనా, అసైన్ మెంట్ కమిటీల రూపకల్పనపైనా వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా 1954లో పేదలకు భూములు పంపిణీ చేశారన్నారు. అప్పటి నుంచి 2014 వరకూ 33,29,908 ఎకరాలు పంపిణీ చేశారన్నారు. సమీక్షా సమావేశానికి హాజరైన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ తమ నియోజకవర్గాల్లోని భూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, సీసీఎల్ఎ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, , రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి, లాండ్ సర్వే కమిషనర్ సిద్ధార్థ జైన్, ప్రభుత్వ చీఫ్ విప్ జి.శ్రీకాంత్ రెడ్డి, విప్ లు దాడిశెట్టి రాజ, కాపు రామచంద్రారెడ్డి, పలువురు ఎమెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. 

Tadepalle

2021-06-29 12:27:26

Tadepalli

2021-06-29 04:29:40

ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పక్కాగా జాబ్ చార్ట్..

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పక్కాగా జాబ్ చార్ట్ అమలుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు ఏపీ హయ్యర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ డా.పోలా భాస్కర్ చెప్పారు. మంగళవారం ఆయన ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ప్రధాన ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఉన్నతవిద్యలో సమూల మార్పులు తేవడంతోపాటు, కాలేజీల్లోని అద్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది జాబ్ చార్ట్ ను కూడా ఇకపై పూర్తిస్థాయిలో అమలు చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇటీవలే ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాల్లకు చెందిన కాలేజీ ప్రిన్సిపాళ్లతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశామని. ఇక ప్రతీ నెల ఒక్కో జోన్ లో ఈ తరహా సమీక్షలు జరుపుతామన్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్ధులు ఆన్ లైన్ విద్యకు దూరమవుతున్న విషయాన్ని గుర్తించి దానిని గాడిలో పెట్టేందుకు యాప్ ప్రవేశపెట్టామని, వాటి నుంచి ఫలితాలు ప్రారంభమయ్యాయన్నారు. అదేవిధంగా ఈ ఎకడమిక్ ఈయర్ లో రాష్ట్రవ్యాప్తంగా వున్న 154 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 84 పాలిటెక్నిక్ కాలేజీలు, 140 ఎయిడెడ్ డిగ్రీకాలేజీల్లో 72వేల సీట్లు అందుబాటులో ఉంటే కేవలం 42వేల మంది విద్యార్ధులు మాత్రమే చేరుతున్నారని, అలాకాకుండా శతశాతం  విద్యార్ధులను చేర్పించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. దానికోసం అద్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ కు దగ్గర్లోని ఇంటర్ కాలేజీలను మ్యాపింగ్ చేసుకొని వారిని డిగ్రీకాలేజీల్లో చేర్పించే ప్రణాళికలు సిద్దం చేసినట్టు ఆయన వివరించారు. ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కాలేజీలు, ఎయిడెడ్ కాలేజీలకు సమానంగా నిధులు కేటాయిస్తున్నందున ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అద్యాపకులు, ప్రిన్సిపాల్స్ తమ విధులను పక్కాగా జాబ్ చార్ట్ ఆధారంగా నిర్వహించాల్సి వుందన్నారు. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రశక్తిలేదని, ఉన్నత విద్యలో విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్న కమిషనర్ ఆ స్థాయిలో ఫలితాలు రాబట్టే భాద్యతను పెంచుతున్నట్టు వివరించారు.

Tadepalle

2021-06-29 02:08:01

రాష్ట్రంలో రెండు కేటగిరీలుగా కర్ఫ్యూ..

ఈ నెలాఖరుతో కర్ఫ్యూ గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రెండు కేటగిరీలుగా కొత్తగా కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు మరో మూడు జిల్లాల్లో సాయంత్రం ఆరు గంటల తరవాత కర్ఫ్యూ అమల్లోకి వస్తుందన్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో 8 జిల్లాల్లో జూలై 1 నుంచి రాత్రి 10 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లోకి వచ్చి, ఉదయం 6 గంటల వరకూ కొనసాగుతుందన్నారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ కర్ఫ్యూ సడలింపు ఉంటుందన్నారు. రాత్రి తొమ్మిది గంటల తరవాత అన్ని దుకాణాలు, ఇతర సముదాయాలు మూసివేయాలన్నారు. ఇలా వారం రోజుల పాటు కొత్త కర్ఫ్యూ నిబంధనలు అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Tadepalle

2021-06-28 15:30:33

అందుబాటులో పూర్తిస్థాయి ఆక్సిజన్..

రాష్ట్రంలో అవసరమైన మేర ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.  మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొవిడ్ పరిస్థితులపై అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారన్నారు. గడిచిన 24 గంటల్లో 71,758 శాంపిళ్లను పరీక్షించగా, 2,224 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 31 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. కరోనా పాజిటివిటీ రేటు 3.1 శాతంగా నమోదైందన్నారు. కడప, కర్నూల్, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎటువంటి మరణాలు చోటు చేసుకోలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 322 ఆసుపత్రుల్లో కొవిడ్ ట్రీట్ మెంట్ అందిస్తున్నారన్నారు. 322 ఆసుపత్రుల్లో 2,786 ఐసీయూ బెడ్లు, 14,545 ఆక్సిజన్ బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రస్తుతం కొవిడ్ కేర్ సెంటర్లలో 5,311 మంది చికిత్స పొందుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం...ఏపీకి రోజువారీగా ఆక్సిజన్ 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయిస్తుండగా, కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో తక్కువ మొత్తం ఆక్సిజన్ ను డ్రా చేస్తున్నామన్నారు. ఈ నెల 24న 196 మెట్రిక్ టన్నులు, 25న 169 టన్నులు, 27న 170 టన్నుల ఆక్సిజన్ డ్రా చేశామన్నారు. అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బ్రహ్మాండంగా అందుబాటులో ఉందన్నారు. ఆక్సిజన్ అందకపోవడం వల్ల పేషంట్లు మృతి చెందారని వార్తలు వచ్చాయని, వాస్తవాలను సంబంధిత జిల్లా కలెక్టర్ తెలిపారని తెలిపారు. అవరమైన ఆక్సిజన్ అందుబాటులో ఉన్నా తప్పుడు వార్తలతో ప్రజల, అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీయకూడదన్నారు. అలా చేసిన వారిపై చట్టపరంగా సంబంధిత జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం నిర్వహించే సమీక్షా సమావేశాలపై అవాస్తవాలు ప్రచురించడం తగదన్నారు. 

రాష్ట్రంలో 35 బ్లాక్ ఫంగస్ కేసులు..
 రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 35  బ్లాక్ ఫంగస్ నమోదయ్యాయన్నారు. కొవిడ్ కేసులతో పాటు బ్లాక్ ఫంగస్ కేసుల నమోదు కూడా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయన్నారు.. ఇప్పటి వరకూ 3,364 బ్లాక్ ఫంగస్  కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 1,418 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. 1,184 మందికి వైద్యులు సర్జరీ చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వ నుంచి 63,395 ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు రాగా, ప్రస్తుతం 9644 అందుబాటులో ఉన్నాయన్నారు. వచ్చే వారం రోజుల్లో మరో 15 వేల ఆంపోటెరిసిన్ బి ఇంజక్షన్లు రానున్నాయన్నారు. 49,250 పొసకొనజోల్ ఇంజక్షన్లను రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేయగా, ప్రస్తుతం వివిధ జిల్లాల్లో 32,197 అందుబాటులో ఉన్నాయన్నారు. 1,39,980 పొసకొనజోల్ మాత్రలు కొనుగోలు చేయగా, ప్రస్తుతం అన్ని జిల్లాల్లో 51,792 అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పొసకొనజోల్ మాత్రలు, ఇంజక్షన్ల కొరత లేదన్నారు. 

5,515 సచివాలయాల్లో జీరో కేసులు...
ప్రస్తుతం రాష్ట్రంలో 42,252 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. ప్రస్తుతం 5,515 గ్రామ, వార్డు సచివాయాల్లో ఒక్క యాక్టివ్ కేసు కూడా లేదన్నారు. 3,110 సచివాలయాల్లో ఒకే కేసు, 1,891 సచివాలయాల్లో రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. 12,545 సచివాలయాల్లో సున్నా నుంచి 5 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. ఒక సచివాలయంలో 50 కేసులు, మూడు సచివాలయాల్లో 40 నుంచి 50 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. 690 సచివాలయాల్లో పది కంటే ఎక్కువ కరోనా కేసులు ఉన్నాయన్నారు. ఈ సచివాలయాలపై  దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారన్నారు. మండలాల వారీగా చూస్తే... 105 మండలాల్లో 10 లోపల యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు.  మండలాలు, సచివాలయాల వారీగా చూసినా కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. వారంతపు డేటాను గమనిస్తే ఎనిమిది జిల్లాల్లో 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు నమోదైందన్నారు. 

Tadepalle

2021-06-28 15:28:52

త్వరలో రానున్న 53,14,740 డోసులు..

రాష్ట్రానికి జూలై నెలకు సంబంధించి ఏపీకి 53,14,740  కోవిడ్ డోసులు అందజేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సమాచారమిచ్చిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జూలై నెలాఖరు నాటికి 31 లక్షల మందికి సెకండ్ డోసు ఇవ్వాల్సి ఉందన్నారు.  24,36,787 మందికి కొవిషీల్డ్, 6,88,190 మంది కొవాగ్జిన్ సెకండ్ డోసు తీసుకోవాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వమిచ్చే 53.14 లక్షల టీకాల్లో 31 లక్షల మందికి సెకండ్ డోసుగా వేయనున్నామన్నారు. కాగా 
రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నాటికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో  7,998 మంది ఉండగా, వారిలో 7,488 మంది ఆరోగ్య శ్రీ పథకం కింద ఉచిత వైద్య సేవలు పొందుతున్నారన్నారు.  93.62 శాతం మంది ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఉచిత వైద్య సేవలు పొందుతున్నారన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 2266  మంది చికిత్ప పొందుతుండగా, 1.756 మంది (77.49 శాతం) ఆరోగ్య శ్రీ పథకం కింద వైద్య సేవలు పొందుతున్నారన్నారు.  ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1,16,90,837 మందికి టీకాలు వేశామన్నారు. ఇందులో ఫస్ట్, సెకండ్ డోసులు వేసుకున్నవారున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అయిదేళ్లలోపు పిల్లలు కలిగిన 45 ఏళ్ల లోపు వయస్సు తల్లులు 18,75,866 మంది ఉండగా, నేటి వరకూ 12,99,500 మందికి టీకా మొదటి డోసు వేశామన్నారు. జూన్ నెలకు సంబంధించి సెకండ్ డోసు వేసుకోవాల్సిన వారు  3 లక్షల మంది ఉన్నారన్నారు. వారందరికీ రాబోయే మూడ్రోజుల్లో రెండో డోసు వేస్తామని తెలిపారు. వారిలో 1,30,000 మంది కొవిషీల్డ్, 1,92,000 మంది కొవాగ్జిన్ సెకండ్ డోసు వేసుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,41,000 డోసులు అందుబాటులో ఉన్నాయని, వాటిని మంగళవారం నాటికి వినియోగించే అవకాశముందని తెలిపారు. 

Tadepalle

2021-06-28 15:24:24

కన్ఫర్డ్ వద్దు.. డైరెక్టు ఐఏఎస్ ముద్దు..

ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అత్యంత కీలకమైన పరిపాలన వ్యవస్థలో భారీ మార్పులకు తెరలేపింది.. యుపీఎస్సీ నుంచి నేరుగా సెలక్ట్ అయిన ఐఏఎస్ లతోపాటు ఇతర సివిల్స్ సర్వీస్ కేడర్ అధికారులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. ఈ క్రమంలో కన్ఫర్డ్ ఐఏఎస్ లను పక్కనపెట్టి వారికి ప్రాధాన్యతలేని ప్రభుత్వ శాఖలను కట్టబెడుతున్నట్టు తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. అంతేకాదు గతంలో ఎన్నడూలేని విధంగా జిల్లా కలెక్టర్ హోదా అయిపోయి ఏదో శాఖకు కమిషనర్ గా వెళ్లిన వారిని సైతం మళ్లీ జిల్లా కలెక్టర్లుగా వెనక్కి తీసుకొచ్చి కలెక్టర్ సీట్లోనే కూర్చోబెడుతోంది.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గతంలో కొందరు కన్ఫర్డ్ ఐఏఎస్ అధికారులు కూడా జిల్లా కలెక్టర్లుగా ఉండేవారు.. వీరంతా డైరెక్టు ఐఏఎస్ లకంటే అద్భుతమైన పనితీరు కనబరుస్తూ, ప్రజలకు విశేషంగా సేవలందిస్తూ.. ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు కూడా తీసుకొచ్చారు.. అయితే ప్రస్తుతం ప్రభుత్వంలోని పరిపాలనను మొత్తమంతా డైరెక్టు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లకు కట్టబెట్టి కన్ఫర్డ్ ఐఏఎస్ లను ఇతర శాఖల్లో నియమించడం ద్వారా నేరుగా వచ్చేవారిని మాత్రమే జిల్లాలకు కలెక్టర్లుగా, జాయింట్ కలెక్టర్లుగా పంపాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తుంది.. గతంలో ఐఏఎస్ అధికారి అంటే ఏశాఖకు పంపినా చక్కగా వెళ్లి అక్కడ పనిచేస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు సేవలు అందించేవారు. కానీ ఇపుడు కొందరు ఐఏఎస్ లు తమదైన స్టైల్ లో మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను, ముఖ్యమంత్రి కుటుంబాలకు సన్నిహితంగా వుండేవారిని ప్రశన్నం చేసుకుంటూ నచ్చిన జిల్లాలకు కలెక్టర్లు, మున్సిపల్ కార్పోరేషన్లకు కమిషనర్లుగా వెళ్లిపోతుండటం, రెండు మూడేళ్లు పూర్తయిపోయినా కదలకుండా పైరవీలు చేస్తూ అక్కడే తిష్టవేసుకొని కూర్చోవడం కూడా ప్రస్తం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఇందుకోమే ఇటీవల భారీగా జరిగిన ఐఏఎస్ ల బదిలీల్లో కన్ఫర్డ్ ఐఏఎస్ లను జిల్లా కలెక్టర్ల నుంచి తప్పించి వారి స్థానంలో డైరెక్టు ఐఏఎస్ లను నియమించింది ప్రభుత్వం. గతంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అజాయ్ కల్లాం పనిచేస్తున్న సమయంలో ఎంతో మంచి అనుభవం వున్న కన్ఫర్డ్ ఐఏఎస్ లను కూడా జిల్లా కలెక్టర్లుగా నియమించారు.. ఆ ప్లేస్ లోకి ప్రవీణ్ ప్రకాష్ వచ్చిన తరువాత  ఒక్కో కన్ఫర్డ్ ఐఏఎస్ లను జిల్లా కలెక్టర్ల భాద్యతల నుంచి తప్పిస్తూ వస్తుండటం ఐఏఎస్ వర్గాలనే విస్మయానికి గురిచేస్తుంది. అలా తప్పించడంతో ఇపుడు రాష్ట్రంలో ఇద్దరు కన్ఫర్డ్ ఐఏఎస్ లు మాత్రమే విజయనగరం, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్లుగా మిగిలారు. వీరిని కూడా త్వరలో జరగబోయో ఐఏఎస్ ల బదిలీల్లో జిల్లా కలెక్టర్ల స్థానం నుంచి మార్చేస్తారనే ప్రచారం జరగుతుంది. వాస్తవానికి డైరెక్టుగా యుపీఎస్సీ నుంచి ఐఏఎస్ గా వచ్చినా, ఇన్ సర్వీసులు ఐఏఎస్ హోదా పొందినా.. రాష్ట్ర, కేంద్రం ప్రభుత్వం ద్రుష్టలో ఒకే విధాంగా ఉండాలి. కానీ ఎందుకనో రాష్ట్రప్రభుత్వం ఆ విధానానికి కొత్త భాష్యం చెబుతూ.. కన్ఫర్డ్ ఐఏఎస్ లను పక్కపెట్టాలని చూడటం ఏ రకమైన సంకేతాలు ఇస్తుందో అర్ధం కాకుండా వుంది. డైరెక్టుగా వచ్చిన ఐఏఎస్ లకైనా.. కన్ఫర్డ్ ఐఏఎస్ ల కైనా జిల్లా కలెక్టర్లుగా చేయాలనేది ఒక కల... అదే ఐఏఎస్ సర్వీసులో కీలకమైన ఘట్టం కూడా.. మొన్నటి వరకూ ఏ ఐఏఎస్ అయిన తన సర్వీసులో ఒక్కసారైనా జిల్లా కలెక్టరుగా ఓ రెండు మూడేళ్లు పనిచేస్తాననే నమ్మకం ఉండేది. ఇపుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో కన్ఫర్డ్ ఐఏఎస్ లకు జిల్లా కలెక్టర్లుగా పనిచేసే అవకాశం రాకపోవచ్చుననే బలమైన సంకేతాలు ఇవ్వడానికే రాష్ట్రప్రభుత్వం అలాంటి వారిని మిగిలిన ప్రభుత్వశాఖలకు కమిషనర్లుగా పంపుతుందని చెబుతున్నారు. ఎంతో అనుభవం వున్న కన్ఫర్డ్ ఐఏఎస్ లు డైరెక్టుగా వచ్చిన ఐఏఎస్ ల కంటే ఎంతో చక్కగా, సమయస్పూర్తితో పనిచేస్తారు.. దారికి కారణం వారంతా ముందుగా గ్రౌండ్ లెవల్ రియాలిటీపై పనిచేసి, వివిధ శాఖలపై పట్టు పెంచుకొని ఉంటారు.. ప్రభుత్వం ఇన్ సర్వీసులో ఇచ్చిన అవకాశం ద్వారా వారు ఐఏఎస్ హోదా పొందుతారు. వాస్తవానికి అలాంటి వారిని జిల్లా కలెక్టర్లుగా ప్రభుత్వం నియమిస్తే అనుకున్న లక్ష్యాలను చేరుకోడానికి మార్గం సుగమం అవుతుంది. అదే డైరెక్టు ఐఏఎస్ లకు ప్రభుత్వం ఇచ్చిన శిక్షణతో, వారి పనిచేసే సమయంలో తీసుకున్న నిర్ణయాలు మాత్రమే పనిచేస్తాయి.. అలాగని డైరెక్టుగా వచ్చిన ఐఏఎస్ బాగాపనిచేయరని ఇక్కడ ఉద్దేశ్యం కాదు. వీరైనా.. వారైనా.. ఒకేలా పనిచేస్తారు.. ఒక సారి ఐఏఎస్ అయిన తరువాత ఎవరినైనా ఒకే చూడాలన్న నిబంధనను పక్కన పెడితే జరిగే అభివ్రుద్ధి పక్కదారి పడుతుందనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ఇలా రాష్ట్రప్రభుత్వం కన్ఫర్డ్ ఐఏఎస్ లను వేరే రకంగా చూస్తే అలాంటి వారంతా కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయినా.. ఇదే విషయం అందరూ ఒకేలా ఆలోచిస్తే ఏదో ఉద్యోగమంటే ఉద్యోగంలా చేశాం తప్పా..అభివ్రుద్ధికోణంలోనూ.. ప్రజలకు మరిన్ని సేవలు అందించే కోణంలోనూ చేయడానికి ముందుకు రాకపోతే అనుకున్న అభివ్రుద్ధి ఆగిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.. ప్రస్తుత ఈ పరిస్థితులు మున్ముందు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో వేచిచూడాల్సిందే..!

Tadepalli

2021-06-28 05:12:58

విద్యార్ధులకు onlineక్లాసులు చెప్పాల్సిందే..

ఆంధ్రప్రదేశ్ లో డిగ్రీ విద్యలో పెను మార్పులు తీసుకు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన హయ్యర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్, సీనియర్ ఐఏఎస్ అధికారి డా.పోలాభాస్కర్ ఆదేశాలతో ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా వున్న 154 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 84 పాలిటెక్నిక్ కాలేజీలు, 140 ఎయిడెడ్ డిగ్రీకాలేజీల ప్రిన్సిపాళ్లు  దారిలోకి వచ్చారు. ప్రభుత్వం విద్యార్ధుల ఆన్ లైన్ విద్యకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా ప్రతీ అధ్యాపకుడు ఆన్ లైన్ లో పాఠాలు చెప్పాల్సిందే. ఇదేదో ఉత్తుత్తి మాటలతో ఊరకనే ఊరకనే ఇచ్చే ఆదేశాలు కావు..  ఖచ్చితంగా ఏ అధ్యాపకుడు యాప్ లోకి లాగిన్ అయి ఎంత సేవు విద్యార్ధులకు పాఠాలు చెబుతున్నారు.. ఎంత మేరక సిలబస్ పూర్తి చేస్తున్నారు.. విద్యార్ధులు ఏ మేరకు స్పందిస్తున్నారు.. అనే అంశాలన్నీ రాజధానిలోకి కమిషనరేట్ లో ఒక్క మీట నొక్కి తెలుసుకునే విధంగా పక్కాగా రూపొందించిన ప్రత్యేక వ్యవస్థ( మొబైల్ యాప్ విత్ డేష్ బోర్డ్) తో అద్యాపకులంతా ఆన్ లైన్ లోకి వచ్చి పాఠాలు చెబతున్నారు.. కరోనా సమయంలో విద్యార్ధులు కాలేజీకి వచ్చే పరిస్థితి లేదు..అలాగని వారికి పాఠాలు చెప్పకపోతే వారి విద్యమధ్యలోనే ఆగిపోతుంది..మీకు ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా జీతాలిస్తోంది.. దానిని ద్రుష్టిలో పెట్టుకొనైనా ఖచ్చితంగా ఆన్ లైన్ లో పాఠాలు చెప్పాల్సిందే..లేదంటే చర్యలు తప్పవు అంటూ ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాళ్లకు హయ్యర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఇచ్చిన హెచ్చరికతో మూడు రోజుల్లో 50శాతానికంటే తక్కువగా వుండే ఆన్ లైన్ ఎడ్యుకేషన్ అటెండెన్సు ఒక్కసారిగా 20శాతానికి పెరిగింది. విద్యార్ధులకు ఆన్ లైన్ పాఠాలు చెప్పడానికి ప్రతీ లెక్చరర్ ఖచ్చితంగా ల్యాప్ ట్ ప్ వినియోగించాలని ఆదేశాలు జారీచేయడంతో చక చకా పాఠ్యాంశాలు బోధించడానికి అద్యాపకులు ఒక్కొక్కరుగా ఆన్ లైన్ లోకి వస్తున్నారు. విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించాలంటే ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆన్ లైన్ ద్వారానైనా పాఠాలు చెప్పించి వారిని సబ్జెక్టు పరంగా అభివ్రుద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్షమని..దానికోసమే విద్యావిధానంలో సమూల మార్పులు తీసుకొస్తున్నట్టు కమిషనర్ పోలాభాస్కర్ ఈఎన్ఎస్ కి ప్రత్యేకంగా వివరించారు. ఆన్ లైన్ విద్యకోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించామన్నారు. అందులో ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపాల్స్ తోపాటు, ఆర్జేడీలు, రాష్ట్రస్థాయిలో కమిషనర్ లో డాష్ బోర్డులో ఎంత మంది విద్యార్ధులకు పాఠ్యాంశాలు చెప్పారో ఎప్పటి కప్పుడు తెలుసుకునే వీలుపడేలా ఎంతో ఉపయుక్తంగా ఈ యాప్ రూపొందించినట్టు ఆయన వివరించారు. అటు ఎయిడెడ్ డిగ్రీకాలేజీలకు ప్రభుత్వమే నిధులు కేటాయిస్తున్నందున వారికి కూడా ఈ అదేశాలు, నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎంతో ద్రుడ సంకల్పంతో వుందని ఎవరు ఆ నిబంధనలను అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోయేది లేదని కూడా కమిషనర్ చెప్పారు. చాలా సంవత్సరాల తరువాత రాష్ట్రప్రభుత్వం కూడా ఎంతో ఉన్నతంగా ఆలోచించడంతో విద్యార్ధుల భవిష్యత్తుకి బంగారు బాటలు వేయడానికి కమిషనర్ తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు ఇచ్చేదిశగా కనిపిస్తున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో..!

Tadepalle

2021-06-28 03:04:13

గ్రామ సచివాలయ సెలవులకి మంగళం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఆదివార సెలవులకు మంగళం పాడాలని చూస్తున్నట్టు కోవిడ్ వేక్సిన్ ద్వారా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కరోనా సమయంలో అన్ని ప్రభుత్వ శాఖలకూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకూ పనిచేయాలని అవకాశం కల్పించిన సమయంలో కూడా సచివాలయ ఉద్యోగులకు ఆ సౌకర్యం అమలు చేయకపోగా.. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకూ పనిచేయించింది. ఇపుడు తాజాగా వారంలో ఒక్కరోజు వచ్చే ఆదివారం సెలవులకు మంగళం పాడి ఆరోజు కరోనా వేక్సిన్ టీకా కార్యక్రమాలు పెడుతోంది ప్రభుత్వం. సెలవురోజుల్లో వేక్సినేషన్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతోపాటు ఉదయం 8గంటల నుంచి సాయంత్ర ఆరు, ఏడు గంటల వరకూ వేక్సినేషన్ కేంద్రాల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తుందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధామని ప్రశ్నించిన ఉద్యోగులకు చెప్పింది చేయకపోతే మీ ఉద్యోగాలు పోతాయని, పైకి రాసేస్తామని మండల అధికారులు బెదిరస్తున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదేశించడంతో  భయం భయంగా  కేంద్రాల వద్ద కోవిడ్ డ్యూటీలు చేస్తున్నామని చెబుతున్నారు. కేంద్రాల వద్ద కనీస శానిటేషన్ లేకపోగా, శానిటైజర్లు గానీ, డెటాల్ గానీ, హేండ్ గ్లౌజులు గానీ, హైపో సోడియం పిచికారీ కూడా  ప్రభుత్వం చేపట్టడం లేదంటే అతిశయోక్తి కాదు..  మాస్కులు, శానిటైజర్లు, హేండ్ గ్లౌజులు ఇలా అన్నీ విధులకు వచ్చే సచివాలయ సిబ్బందే కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే మూడు దఫాలు ఆదివారం రోజులు కరోనా వేక్సినేషన్ డ్యూటీలు వేసి వారి సెలవులను కోల్పోయోలా చేసింది ప్రభుత్వం. కనీసం ఆదివారం సెలవురోజు డ్యూటీలు చేసినందకు మరో రోజైనా సెలువులు ప్రభుత్వం మంజూరు చేస్తుందా అదీకనిపించడం లేదని సచివాలయ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారానికి ఒక్కరోజు దొరికే సెలవు రోజున వారాంతం నిండిపోయిన బట్టలు ఉతుక్కోవడానికి కూడా సమయం దొరకడం లేదని సచివాలయ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికితోడు కరోనా వేక్సినేషన్ లక్ష్యాలను కూడా వైద్య ఆరోగ్యశాఖలో ఆశ, ఏఎన్ఎం, హెల్త్ అసిస్టెంట్లు, రెండవ ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తులు ఉన్నప్పటికీ వారికి ఏమీ చెప్పకుండా తమకే ప్రజలను వేక్సిన్ వేక్సిన్లు వేయించే టార్గెట్లు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రజలు కోవిడ్ వేక్సినేషన్ కు ముందుకి రాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఏ విధంగా పరిగణిస్తో అర్ధం కావడం లేదని వీరాంతా కన్నీటి పర్యంతం అవుతున్నారు. సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు, తమకు జీతాలు, విధుల్లోనే కాకుండా ప్రభుత్వం పరిగణించే విషయంలోనూ చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. 
 సచివాలయ ఉద్యోగులు రెండు కోవిడ్ టీకాలుు పూర్తిచేసుకున్నా..కోవిడ్ కేంద్రాల వద్ద డ్యూటీలు చేసేవారే కరోనా భారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేటికీ పత్రీ పది గ్రామ, వార్డు సచివాలయాల్లో కనీసం సచివాలయానికి ముగ్గురు సిబ్బంది చొప్పున ఇపుడు పాజిటివ్ భారిన పడి వైద్యం పొందడం కూడా తమకు భయాన్ని కలిగిస్తోందని చెబుతున్నారు. చాలా మంది ప్రజలు వారికి కరోనా ఉన్నా పరీక్షలు చేయించుకోకుండా నేరుగా కోవిడ్ వేక్సినేషన్ కు రావడ వలన, వారికి ఇచ్చే టోకెన్లు తాము అలా తీసుకోవడం వలన వారి కరోనా వైరస్ తమకు సోకుతుందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం మండల అధికారులకు తెలియజేసినా ఫలితం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కరోనా వేక్సిన్ కార్యక్రమం ఆదివారం, సెలవురోజుల్లో ఏర్పాటు చేస్తే అపుడు విధుల్లో పాల్గొన్నా వారికి ప్రత్యేకంగా సెలవులు ఇవ్వాల్సిందేనని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. తమ ఆదివారాల సెలవులు, విధులు, ఇబ్బందులు, సమస్యల కోసం ఎవరితో మాట్లాడాలనుకున్నా మండలస్థాయి అధికారుల నుంచి బెదిరింపులే ఎదురవుతున్నాయి తప్పితే తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని చెబుతున్నారు. పైగా మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన ప్రభుత్వం కోసం ఆ మాత్రం కూడా ఆదివారాలు పనిచేయలేరా అని తిరిగి ప్రశ్నిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల ఆదివారాల సెలవు రోజుల్లో వారితో కరోనా వేక్సిన్ విధులు నిర్వహించినందుకు వారికి ప్రత్యామ్నాయ సెలవులు ఇస్తుందా...వాటిని పరిగణలోకి తీసుకోకుండా అలానే వదిలేస్తుందా అనేది వేచి చూడాలి..!

Tadepalli

2021-06-28 01:17:41

ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కోర్సులపై అధ్యయనం..

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డ్రిగీ కాలేజీల్లో ప్రస్తుతం నడుస్తున్న కోర్సులపై అధ్యయనం చేసి కొత్తకోర్సులు ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నది. దీనికోసం ఉన్నతవిద్య, సాంకేతిక విద్యా కమిషనర్ డా.పోలా భాస్కర్ ప్రత్యేకంగా ద్రుష్టిసారించారు. సాధారణ డిగ్రీ కోర్సుల వలన కేవలం డిగ్రీలు మాత్రమే చేతికొస్తున్నాయని, అలా కాకుండా డిగ్రీ పూర్తికాగానే ఉపాది, ఉద్యోగ అవకాశాలు కలిగే కోర్సులను ప్రవేశ పెట్టడం ద్వారా విద్యార్ధుల భవిష్యత్తుకు మార్గాలు వేసేందుకు సత్వర చర్యలు చేపట్టారు. ప్రస్తుతం 70శాతం ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కేవలం బిఏ, బీకాం, బిఎస్సీ కోర్సులు మాత్రమే నిర్వహిస్తున్నారు. కొన్ని కాలేజీల్లో మాత్రం సిబిజెడ్, బిఎస్సీ ఎంపీసి కోర్సులు నడుస్తున్నాయి. ఇలా కాకుండా హార్టికల్చర్, సెరీకల్చర్, బిఎస్సీ ఎలక్ట్రానిక్స్,  కంప్యూటర్ సైన్స్ కోర్సులతోపాటు ప్రత్యేక ల్యాబ్ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చూస్తుంది. తద్వారా విద్యార్ధులకు డిగ్రీ పూర్తయిన తరువాత ఉపాది, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చూస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ పరిధిలోని పరిశ్రమలు, కంపెనీలు, పెద్ద పెద్ద ప్రభుత్వ శాఖల్లో విద్యార్ధులకు అవగాహన కల్పించేలా ప్రత్యేక టూర్లను ఏర్పాటు చేయాలని చూస్తుంది. ఇటీవల విశాఖలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసిన కమిషనర్ ఈ దిశగా ఆదేశాలు జారీచేశారు. ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో చదివితే ఖచ్చితంగా ఉపాది, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయనే విధంగా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురాడానికి అన్ని చర్యలు చేపడుతున్నట్టు ప్రకటించిన ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో ఏ తరహా కోర్సులు నడుస్తున్నాయి, కొత్తగా ఏ తరహా కోర్సులు ఏర్పాటు చేస్తే విద్యార్ధులకు ఉపయోగం ఉంటుందనే విషయమై అధ్యయనం చేసి ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళతామని అన్నారు. అంతేకాకుండా అన్ని డిగ్రీ కాలేజీలు ఖచ్చితంగా నాక్ గుర్తింపులో ఏదో ఒక సర్టిఫికేట్ కలిగి ఉండేలా సదుపాయాలు కల్పించాలన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు ఎలాంటి ఆటంకం రాకుండా ఇపుడు ఆన్ లైన్ పేమెంట్లకు, ఈ-ఆఫీస్,  ప్రత్యేక మొబైల్ యాప్ లను అభివ్రుద్ధి చేసినట్టు కమిషనర్ పోలాభాస్కర్ వివరించారు. డిగ్రీ కాలేజీలో చేపట్టే నూతన అంశాలను ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీకి ఆయన ప్రత్యేకంగా వివరిస్తున్నారు. కమిషనర్ చెప్పిన విధంగా ప్రాధమిక మార్పులు చేసినా, చాలా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కొత్త డిగ్రీ కోర్సులు అందుబాటులోకి రావడంతోపాటు, లైబ్రెరీలు, ఇంగ్లీషు ల్యాబ్ లు, ఉపాది, ఉద్యోగ శిక్షణలు అన్నీ విద్యార్ధులకు అందుబాటులోకి రానున్నాయి.  

Tadepalli

2021-06-27 04:16:19