ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసిన వేళ ఉద్యోగ సంఘాలు ఒక్కసారిగా ప్రెస్ మీట్లకు ఉపక్రమించాయి. రాష్ట్రంలో ఏక కాలంలో అన్ని ప్రభుత్వ సంఘాలు ప్రెస్ ముందుకి వచ్చి కరోనా సమయంలో ఎన్నికలేంటంటూ తమ బాధను వెల్లగక్కుతున్నాయి. వారితో పాటు ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగ సంఘాలు కూడా ఎన్నికలకు సిద్దంగా లేమని చెప్పడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అవసరం అనుకుంటే మూకుమ్మడిగా సెలవులు పెట్టడానికి సైతం ఉద్యోగ సంఘాలు సిద్దమవుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఎన్నికల సంఘం చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ ఎప్పుడు ఎన్నికలు నిర్వహిద్దామని ముందుకు వస్తున్నా దానికి ముందుగా ప్రభుత్వమే ముఖ్య కార్యదర్శి నుంచి తాము ఎన్నికలకు సిద్దంగా లేమని ఒక లేఖ విడుదల చేస్తుంది. ఏపీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి లేఖను చూసిన ఉద్యోగ సంఘాలు కూడా తమ ప్రకటనను మీడియా ద్వారా వెల్లగక్కుతున్నాయి. ప్రత్యేక ప్రెస్ మీట్లు పెట్టి మరీ కరోనా, సెకెండ్ వేవ్ కరోనా విషయంపైనే మాట్టాడటంతో పాటు, అన్ని అసోసియేషన్లు ముందస్తుగానే తమ అసమ్మతిని లేఖల ద్వారా ఎన్నికల సంఘానికి పంపుతున్నాయి. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు ఏకమైపోవడం, కరోనా పరిస్తితులు తగ్గకపోవడం, ఇటు కోవిడ్ వ్యాక్సిన్ కు పంపిణీ ఏర్పాట్లు చేస్తున్న వేళ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడానికి ప్రభుత్వం కూడా కోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల మద్దతు గట్టిగా ఉండటంతో ఈ సమయంలో ఎన్నికలను వాయిదా వేయించుకునే విషయంలో సఫలీ క్రుతం అయ్యేట్టుగానే కనిపిస్తున్నాయి. వాస్తంగా కూడా ఏపీలో కరోనా కేసులు మళ్లీ అధికం అవడమే ఉద్యోగ సంఘాలు వెనుకడుగు వేయడానికి కారణంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఒకే మాట మీదికి రావడం కూడా చర్చనీయాంశం అవుతోంది..
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల విధుల్లో పాల్గొనే ధైర్యం మాకు లేదంటూ ఏపీ ఉద్యోగుల సంఘం తేల్చేసింది. ఈ మేరకు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత ఇంకా తగ్గలేదన్న అయన కరోనా సమయంలో ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని ప్రభుత్వాన్ని కోరామని అన్నారు. 64 సంఘాలు కూడా ఇదే అంశాన్ని వెల్లడించాయన్న ఆయన, అయినా నిన్న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిందని అన్నారు. అంత అత్యవసరంగా ఇప్పుడు ఎన్నికల నిర్వహణ ఎందుకు ? అని ప్రశ్నించారు. మరి ఐదేళ్లకాల పరిమితిలో ఎన్నికలు ఎందుకు నిర్వహించ లేదు అని అయన ప్రశ్నించారు. మీ ప్రయోజనాల కోసం.. మా బతుకులను బలి పెట్ట వద్దన్న ఆయన ఇప్పుడు వ్యాక్సిన్ వస్తున్న సమయంలో ఎన్నికల ప్రక్రియ ఎందుకు ? ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న వారికి ముందుగా వ్యాక్సిన్ వేయాలని అన్నారు. కరోనా విధుల్లో ప్రజల కోసం ఎంతో రిస్క్ తో పని చేశాం, ఎన్నికల కోసం కూడా మా ప్రాణాలు ఫణంగా పెట్టలేమని అన్నారు. ఒక వ్యక్తి ఇగో ను సంతృప్తి పరచాలని ఇలా చేయడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. రాజ్యాంగ బద్ద పదువుల్లో ఉన్న వారు.. బాధ్యత కు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.
కరోనా సమయంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ధైర్యం మాకు లేదన్న ఆయన కాదని బలవంతం చేస్తే.. న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని అన్నారు. వేసవి సమయంలో అయితే... ఎన్నికల నిర్వహణ కు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని అన్నారు. వ్యాక్సినేషన్ మాకువేసిన తరవాత అయినా ఎన్నికలు పెడితే బాగుండేదని ఆయన అన్నారు. మా ప్రాణాల మీదకు వచ్చింది కాబట్టే...నేడు ఇలా మాట్లాడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం ఇప్పుడు అయినా పునరాలోచన చేయాలని అన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగష్టు 2019 న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భముగా ప్రారంభించిన ఫిట్ ఇండియా ఉద్యమం లో భాగంగా వయస్సుకి తగ్గ ఆరోగ్యనియమాలు మరియు మార్గదర్శకాలు తెలుగు భాషలో విడుదల చేస్తున్నట్లు పర్యాటక, యువజన సంక్షేమ, క్రీడా శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం క్యాంపు కార్యాలయం నుండి మార్గదర్శకాలు వర్చువల్ లాంచ్ చేసి వీడియో కాన్పరెన్స్ ద్వారా క్రీడా శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దైనందిన జీవన శైలిలో భాగంగా వయస్సుకు తగిన వ్యాయామం మరియు యోగాసనాలు అవలంభించడంలో మనల్ని ప్రేరేపించడానికి ఫిట్ ఇండియా ఉద్యమం దారి తీస్తుందని అన్నారు. .ఫిట్ ఇండియా ఉద్యమములో భాగముగా పాఠశాల పిల్లలు ,స్కూల్ వీక్ ,ఫిట్ ఇండియా స్కూల్ సర్టిఫికేషన్ మరియు ఫిట్ ఇండియా ఆక్టివ్ డే సిరీస్లు భాగముగా వున్నాయి అని తెలిపారు. సుమారు 2.5 లక్షల పాఠశాలలు ఫిట్ ఇండియా స్కూల్ సర్టిఫికేషన్ కోసం రిజిస్టర్ చేయ బడివున్నవని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వతహాగా క్రీడాకారులని, ఆయన ప్రతి నిత్యం వ్యాయామం చేస్తారని తెలిపారు. క్రీడారంగ అభివృద్దికి ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని తెలిపారు.
మనిషి జీవితంలో ఒత్తిడి పెరిగిపోయిందని, పిల్లలు స్వల్ప కారణాలకే ఆత్మహత్యా చేసుకుంటున్నారని, దీనిని అధిగమించడానికి మన ప్రాచీన వారసత్వాలైన యోగా , ప్రాణాయామం ఆచరించాలని కోరారు.
ప్రతిరోజూ 30-60 నిముషాలు పాటు విస్తృతంగా శారీరకంగా పని చేయడాన్ని నిర్ధారించే సాధారణ మార్గదర్శకాలు నియమాలు ఇందులో రూపొందించ బడ్డాయని తెలిపారు. ప్రస్తుత సమయంలో దీర్ఘకాల వ్యాధులు, సంక్రమితం కానీ వ్యాధుల వలన మారుతున్న ప్రజల లక్షణాల వివరాలు,వ్యాధుల భారం మరియు పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ వ్యాయామాలతో మరింత సమగ్రమయిన ప్రాధమిక ఆరోగ్య సంరక్షణని అందించే దిశగా ఫిట్ ఇండియా ఉద్యమం దోహదం చేస్తుందని తెలిపారు.
వయస్సుకి తగ్గ ఈ ఆరోగ్య నియమాలు మరియు మార్గదర్శకాలు మూడు రకాల వయస్సులకు చెందిన సమూహాలు అనగా 5-18 సంవత్సరాలు, 18-64 సంవత్సరాలు మరియు 65సంవత్సరాలు పైబడిన వారి కి ఉద్దేశించినవని తెలిపారు.
సామాన్య పౌరుడు సైతం ఆరోగ్యాన్ని ఒక అంతర్భాగముగా చేయటానికి సరళమైన, సులభమైన ఆరోగ్య నియమాలు పాటించడానికి ఈ ఫిట్ ఇండియా ఉద్యమం ద్వారా శారీరక ఆరోగ్యాభివృధి చేసుకొనుటకు మార్గదర్శకం అవుతుందని అన్నారు.
కుమారసంభవం, శాకుంతలం కావ్యాలలో మహాకవి కాళిదాసు వివరించిన విధముగా అన్ని మంచి పనులకు శరీరమే ఒక సాధనమని అన్నారు. అటు వంటి శరీర పరిరక్షణే లక్ష్యంగా ఈ ఉద్యమం సాగుతుందని తెలిపారు.
విజయవాడ నుండి క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శి కె.రాంగోపాల్ మాట్లాడుతూ ఆరోగ్య నియమాలు, మార్గదర్శకాలను తెలుగులో ముద్రించి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని అన్నారు.
స్పోర్ట్స్ ఆథారిటి మేనేజింగ్ డైరక్టర్ బి.రామారావు మాట్లాడుతూ విశాఖ నగరంలోని కొమ్మాది స్టేడియం ను త్వరలో అభివృద్ది చేస్తామని తెలిపారు.
ఇంకా డిల్లీ నుండి ఫిట్ ఇండియా మిషన్ డిప్యూటి డైరక్టర్ విష్ణు సుధాకరన్, బెంగుళూరు నుండి స్పోర్ట్స్ ఆథారిటి ఆఫ్ ఇండియా దక్షణ ప్రాంత అసిస్టెంట్ డైరక్టర్ ఎస్. హిమబిందు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో విశాఖపట్నం నుంచి డి ఇ ఓ లింగేశ్వరరెడ్డి, సెట్విస్ సి ఇ ఓ శ్రీనివాసరావు, చీఫ్ కోచ్ సూర్యారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. శుక్రవారం ముఖ్యమంత్రి ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొని పనులను ప్రారంభించారు. వీటిలో విజయవాడలోని దక్షిణముఖ ఆంజనేయస్వామి, సీతమ్మవారి పాదాలు, రాహు-కేతువు, బొడ్డుబొమ్మ, గోశాల కృష్టుడి ఆలయం, కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. వీటితో పాటు 77 కోట్ల రూపాయల వ్యయంతో ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులకు కూడా సీఎం వైయస్ జగన్ మోహన రెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కి దుర్గ గుడి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా, మంత్రులు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్, పురపాలక శాఖ బోత్స సత్యనారాయణ, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, రక్షణ నిధి, వంశీ, దేవినేని అవినాస్ తదితరులు పాల్గొన్నారు.
రాప్ట్రంలో పర్యాటక రంగం పురోగతికి కార్యాచరణ ప్రణాళికను వారం రోజుల్లో రూపొందించాలని రాప్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు కోరారు. శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ కారణంగా పర్యాటక రంగం తీవ్ర సంక్షోభానికి గురి అయిందని, ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్నందున పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్యాకేజీలను తయారుచేయాలని కోరారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వసతి సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఎపిటిడిసి ద్వారా అరసవెల్లి, శ్రీకూర్మం తదితర పుణ్యక్షేత్రాలకు టూర్ ప్యాకేజీలను రూపొందించి ప్రచారం చేయాలని తెలిపారు. విశాఖ నగరంలో రామకృష్ణా బీచ్ రోడ్డులో పర్యాటక సమాచార కేంద్రాన్ని , జివియంసి అధికారులతో సమన్వయంతో సత్వరమే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జి.వి.ఎం .సి , జిల్లా పరిషత్, వి ఎం ఆర్ డి ఎ అధికారులతో సంప్రదించి పర్యాటకులకు ఆహ్లదం కలిగించే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. ఎ పి టి డి సి హోటళ్ల గురించి విస్తృత ప్రచారం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ది సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యనారాయణ, ఆర్ డి రాం ప్రసాద్, డి వి ఎం ప్రసాద్ రెడ్డి, ఈఈ రమణ, డి టి ఓ లు, డిఈ, ఎఈ లు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సపాలిటీల సమాచారం అందించడంలో ఉన్నతాధికారులు విఫలం అవుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రాజెక్టులు, అభివ్రుద్ధి పనులు, కేంద్ర, రాష్ట్ర ప్రాజెక్టుల సమాచారం కార్పోరేషన్లలో కమిషనర్లు ప్రజలకు మీడియా ద్వారా తెలియజేయాలి. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పోరేషన్లలో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ల(పీఆర్వో) కొరత భారీగా వుంది. కొన్ని చోట్ల కార్పోరేషన్లలో పనిచేసే జోనల్ కమిషనర్లను పీఆర్వోలుగా వినియోగిస్తున్నారు. దీనితో వారికి సమాచారం మీడియాకి ఎలా ఇవ్వాలో తెలీక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అదేసమయంలో వీరు విధినిర్వహణలో భాగంగా ఇచ్చే సమాచారం అటు మీడియాకి ప్రతినిత్యం పెద్ద పెద్ద పరీక్షలు పెడుతున్నాయి. స్మార్ట్ సిటీ పథకంలో చేసే అభివ్రుద్ధిని నిత్యం మీడియాకి తెలియజేయాల్సిన అధికారులు ఆ దిశగా ఎలాంటి సమాచారమూ ఇవ్వడం లేదు. ఒక్క ముఖ్కలో చెప్పాలంటే స్మార్ట్ సిటీ పథకంలో ఎంతమంది పనిచేస్తున్నారు..ఏఏ ప్రాజెక్టులు చేపడుతున్నారనే విషయాన్ని ఏడాది ఒకసారి కమిషనర్ ప్రెస్ మీట్లో తప్పా ఇతర సమయాల్లో మీడియాకి తెలియజేడం లేదు. అదీకాకుండా అధికారులుగా విధులు నిర్వహించేవారికి పీఆర్వో పని చేయడం రాకపోవడంతో.. కార్పోరేషన్లలోని సమాచారం న్యూస్ ఫార్మాట్ లో తెలియజేయడం ఇబ్బంది కరంగా మారుతోంది. కొంత సమాచారం అధికారులు ఇచ్చింది ఇచ్చినట్టుగా ఇచ్చేయడం, అన్నీ పీడీఎఫ్ ఫార్మాట్ లోనూ, కొన్ని విషయాలు పూర్తిస్థాయిలో తెలియజేకపోవడం వంటి లోపాలు ప్రభుత్వం చేసే కార్యక్రమాలు మీడియా ద్వారా ప్రజలకు తెలియడం లేదు. ఎందుకిలా చేస్తున్నారని ఆరా తీస్తే అన్నివిషయాలు మీడియాకి తెలిస్తే..పనికొగట్టుకొని వార్తలు రాస్తారని కావాలనే చాలా కార్పోరేషన్లలో పీఆర్వోలను నియమించలేదనే వాదన కార్పోరేషన్లలలోని అధికారుల నుంచే వస్తుంది. ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ద్వారా కార్పోరేషన్లలో పీఆర్వోలను నియమించుకునే అవకాశం వున్నప్పటికీ రాష్ట్రంలోని ఒకటి అరా కార్పోరేషన్లు మినహా మరెక్కడా పీఆర్వోలు లేరు. కొన్ని చోట్ల సమాచారశాఖలోని ఏపీఆర్వోలే కార్పోరేషన్ పీర్వోలుగా డిప్యూటేషన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదేసమయంలో సమాచారశాఖ నుంచి డిప్యూటేషన్ కావాలని కార్పోరేషన్లకు వేయించుకవోడంతో సమాచారశాఖలోని సిబ్బంది కొరత ఏర్పడుతుంది. అయితే వాస్తవాలు, లోపాలు, ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతి మీడియా ద్వారా బయటకు రాస్తే మాత్రం రాష్ట్రంలోని పలు కార్పోరేషన్ల కమిషనర్లకు ఎక్కడలేని ఇబ్బందులు వచ్చేస్తున్నాయి. కార్పోరేషన్ల ద్వారా సమాచారం రావడం లేదని ప్రశ్నిస్తే...మేము బాగానే పంపిస్తున్నాం కదా..దానిని మీకు అనుకూలంగా మార్చుకోండని ఉచిత సలహాలు మాత్రం ఇస్తున్నారు. ఇలా అయితే స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రంలోని ప్రజలకు ఎలా తెలుస్తాయో అర్ధం కాని పరిస్థితి నెలకొంది..!
అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రెడిటేషన్ దక్కేవరకూ గళం తగ్గించేది లేదని ఏ.పి.యు.డబ్ల్యు.జే. అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం సమాచారశాఖ కార్యాలయంలో బైటాయించి తీవ్ర స్థాయిలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో అనేక వర్గాల ప్రజలకు ఏన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జర్నలిస్టుల దగ్గరకు వచ్చేసరికి నిర్లక్ష్యం చేస్తున్నదన్నారు. రాజన్నరాజ్యం తెస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ ఆనాడు వై.ఎస్.రాజశేఖర రెడ్డి అమలుచేసిన అక్రెడిటేషన్ విధానాన్ని ఎందుకు మారుస్తున్నారో చెప్పాలన్నారు. 142 జీఓ లోని నియమాలన్నీ వై.ఎస్. విధానానికి విరుద్ధమైనవని అన్నారు. వై.ఎస్. విధానం తప్పని చెప్పదలచుకున్నారా అని సూటిగా ప్రశ్నించారు. అక్రెడిటేషన్ విధానాన్ని సరళతరం చేసి నిజంగా పనిచేస్తున్న జర్నలిస్టులు అందరికీ గుర్తింపుఇవ్వాలన్నారు. ఐ.జే.యు. జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ కరోనా నేపథ్యం లో పత్రికా రంగం ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుత్వం పాత్రికేయుల పై సానుభూతి తో వ్యవహరించాలని కోరారు.
ఐ.జే.యు.జాతీయ కార్యవర్గ సభ్యుడు డి.సోమసుందర్ మాట్లాడుతూ 142 జీఓ పత్రికా రంగంలోని వాస్తవిక స్తితిగతులకు విరుద్ధంగా ఉందన్నారు. జి.ఎస్.టి., సర్క్యు లేషన్ వంటి వ్యాపార అంశాలతో పాత్రికేయ వృత్తిని కొలవడం సమంజసం కాదని అన్నారు.
ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో జర్నలిస్టులలో వ్యక్తమవుతున్న ఆందోళనను దృష్టిలో ఉంచుకొని అక్రెడిటేషన్ విధానాన్ని మార్చాలని కోరారు. కమిషనర్ టి.విజయకుమార్ రెడ్డి తన చాంబరునుండి కారిడార్ లోకి వచ్చి యూనియన్ నాయకులు అందచేసిన వినతిపత్రాన్ని తీసుకున్నారు. చర్చలకు రావాల్సిందిగా నాయకులను కోరారు. చర్చలఅనంతరం అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ కమిషనర్ ఇచ్చిన హామీల అమలును పరిశీలిస్తామని జర్నలిస్టులకు న్యాయంజరగని పక్షంలో యూనియన్ తన ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని స్పష్టం చేశారు.