1 ENS Live Breaking News

22న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 22వ తేదీన శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జ‌రుగ‌నుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 నుండి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

Tirupati

2023-03-19 11:12:19

బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయండి

శ్రీవారి సేవకులు ఎప్పటిలాగే ఈ సారి కూడా  ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు,కళ్యాణోత్సవంలో భక్తులకు చక్కని సేవలు అందించాలని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం పిలుపునిచ్చారు. బ్రహ్మోత్సవాల నిర్వహణలో భాగంగా ఆదివారం ఒంటిమిట్టలో శ్రీవారి సేవకు లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్బంగా జేఈవో మాట్లాడుతూ, ఏప్రిల్ 5వ తేదీ స్వామివారి కల్యాణం రోజున సాయంత్రం 4 గంటల నుండే భక్తులు గ్యాలరీల్లోకి వస్తారని అన్నారు .భక్తులకు అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదం,అక్షింతలు,పసుపు,కుంకుమ , వాటర్ పాకెట్లు ఉంచిన బ్యాగు అందిస్తామని చెప్పారు. శ్రీవారి సేవకులు గ్యాలరీల్లో ఉండి భక్తులందరికీ ఈ బ్యాగులు అందించాలని, భక్తులతో  మర్యాద పూర్వకంగా, ఓపికతో వ్యవహరించాలన్నారు. శ్రీవారి సేవకులు ఎక్కడ సేవ చేయాలో  నిర్ణయించి అందుకు సంబంధించిన పాసులు ముందే ఇస్తామని జేఈవో చెప్పారు. సేవకోసం వచ్చే వారికి ఆహారం ఇతర సదుపాయాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. టీటీడీలో శ్రీవారి సేవ విభాగానికి ఎంతో గౌరవం గుర్తింపు ఉన్నాయన్నారు. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో అద్భుత సేవలందించి  ఈ పేరు నిలుపుకోవాలని  కోరారు. ఎస్వీబీసి సిఈఓ  షణ్ముఖ్ కుమార్, టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, పిఆర్వో డాక్టర్ రవి, జిఎం ట్రాన్స్ పోర్ట్  శేషారెడ్డి ,శ్వేత డైరెక్టర్  ప్రశాంతి, విజివో  మనోహర్ పాల్గొన్నారు.

Tirupati

2023-03-19 09:53:26

సమాజానికి దిక్సూచి పాత్రికేయులు

సమాజానికి దిక్సూచిగా ఉన్న పాత్రికేయుల సంక్షేమానికి తమ సంస్థ అండగా నిలుస్తుందని వర్తమాన సినీ నటుడు కంచర్ల ఉపేంద్ర హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సహకారంతో తామ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన గుర్తు చేశారు. స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అల్లూరి విద్యాన కేంద్రంలో శనివారం నిర్వహించిన శోవకృత్ నామ ఉగాది సంబరాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జర్నలిస్టుల ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని అవసరమైన వారికి తమ సంస్థ సహకార అందిస్తున్నామని ఆయన చెప్పారు  తమ సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని స్పష్టం చేశారు  సభకు అధ్యక్షత వహించిన స్మార్ట్ సిటీ రిపోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థకు అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ నిర్దిష్టమైన లక్ష్యంతో ఏడేళ్ల క్రితం ప్రారంభించిన తమ సంస్థ ఎన్నో విజయాలు నమోదు చేస్తుందని తెలిపారు  జర్నలిస్టుల సంక్షేమ సంక్షేమం సహా వృత్తి పరమైన కార్యక్రమాలు కూడా నిర్వహించినట్లు చెప్పారు. అసోసియేషన్ కోసం ప్రత్యేకంగా ఒక భవన నిర్మానించే అంశం పరిశీలనలో ఉందన్నారు. 

ఈ ఏడాది విభిన్న కార్యక్రమాలతో జర్నలిస్టులకు భరోసాగా నిలుస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన అసోసియేషన్ గౌరవ సలహాదారు ఎన్. నాగేశ్వరరావు మాట్లాడుతూ సంస్థ భవన నిర్మాణం కోసం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు. వృత్తిపరమైన అంశాలపై జర్నలిస్టులకు త్వరలో ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని నిర్వహించినట్లు ఆయన తెలియజేశారు. ఉపకార్ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కంచర్ల అచ్యుతరావు, వారి తనయుడు ఉపేంద్ర కు కృతజ్ఞతలు తెలియజేశారు. సీనియర్ జర్నలిస్ట్ పిఏఆర్ పాత్రుడు, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అప్పారావు ప్రసంగించారు  సీనియర్ న్యూస్ రీడర్ ఎండి ధర్మజ్యోతి వ్యాఖ్యాతిగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో  చిన్నారి దివ్య నృత్యం, సీనియర్ సింగర్ ఎస్ జగదాంబ ఆలపించిన గీతాలు అలరించాయి. నగర పరిధిలోని వివిధ జోన్ లకు చెందిన పాత్రికేయులకు ఉగాది పురస్కారాలతో సత్కరించడం జరిగింది. ఈ వేదికపై  ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ రూపొందిస్తున్న వర్ధమాన హీరో ఉపేంద్ర నటించిన అనగనగా కథలో పోస్టర్ ను అతిథులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు దుస్తులు మిఠాయిలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ,అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-03-18 14:07:06

ఉత్తరాంధ్రలో టిడిపి ఎమ్మెల్సీ గెలుపు ఆధిక్యం 34,673

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓటింగ్ వార్ వన్ సైడ్ అయినట్టుగా చేశారు. అధికారపార్టీ అభ్యర్ధి సీతంరాజు సుధాక ర్ పై టిడిపి అభ్యర్ధి డా.వేపాడ చిరంజీవి రావు ఏకంగా 34,673 ఓట్లతో గెలుపొందారు. పోలైన ఓట్లను పరిశీలిస్తే ఉత్తరాంధ్రలో చదువుకు న్నవా రంతా అధికార పార్టీని ఏ స్థాయిలో వ్యతిరేకిస్తున్నారో ప్రభుత్వానికి కూడా తెలిసేలా చేశారు. ఈ ఎన్నికలో రాష్ట్రప్రభుత్వానికి ఒక్క ఎమ్మె ల్సీ సీటు మాత్రమే పోయినా.. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు, నిరుద్యోగులు ప్రదర్శిం చడానికి వీలు పడింది. అయితే ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంకా చాలామందికి ఓట్లు రాలేదు.  ఆది నుంచి ఎన్నికల సరళిపై ప్రత్యేక కథనా లు అందిస్తున్న ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ యాప్ ens live, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net చెప్పినట్టుగానే ఫలితాలు రావడంతో ఈఎన్ఎస్ కథనాల పట్ల పాఠకులు, ప్రజల్లో నమ్మకం పెరిగింది. 

Visakhapatnam

2023-03-18 02:11:35

ఉత్తరాంధ్రలో పట్టభద్రులు సరైన గుణపాఠం చెప్పారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉత్తరాంధ్రాలోని పట్టభద్రులు సరైన రీతిలో వ్యతిరేక ఓటుతో బుద్ధిచెప్పారని జనసేన పార్టీ అనకాపల్లి సమన్వయకర్త పరుచూరి భాస్కరరావు ఎద్దేవా చేశారు. శుక్రవారం అనకాపల్లిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రప్రజలకు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అధికారపార్టీ అంటే ఎంత వ్యతిరేకత ఉందో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనిపించిందన్నారు.  ప్రజావ్యతిరేక విధానాలతో మొండిగా వ్యవహరించే ప్రభుత్వాలకు ప్రజలు ఓటు తో ఇలాంటి గుణపాఠాలే చెబుతారన్నారు. రాష్ట్రబడ్జెట్ లో ఐటిశాఖకు కేవలం రూ.215 కోట్లు మాత్రమే కేటాయించిన ప్రభుత్వం పార్టీ సొంత కార్యక్రమాలకే అత్యధికం గా కేటాయించినా ప్రశ్నించే దైర్యంలేని మంత్రి అమర్నాధ్ అభివ్రుద్ధి కోసం మాట్లాడం సిగ్గుచేటన్నారు. జనరంజక బడ్జెట్ అని గొప్పలకు పోయే వైఎస్సార్సీపీ ఇది పూర్తిగా వైఎస్సార్సీపీ బడ్జెట్ అని తెలుసుకునే లోపే ప్రజలు పెద్ద ఎత్తున బుద్దిచెప్పారని ఆరోపించారు.

Anakapalle

2023-03-17 16:22:26

రాజాం శ్రీవారి ఆలయం టీటీడీలో విలీనం

విజయనగరం జిల్లా రాజాం మండలం అంతకాపల్లి గ్రామంలో నిర్మించిన  శ్రీ పద్మావతి సహిత భూదేవి వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని శుక్రవా రం టీటీడీ విలీనం చేసుకుంది. ఇప్పటిదాకా ఆలయాన్ని నిర్వహిస్తున్న బాలాజీ ట్రస్టు సభ్యులు  శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 12.30 గంటల మధ్య టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డికి ఆలయానికి సంబంధించిన పత్రాలు అందజేశారు. ఇకమీదట ఈ ఆలయంలో టీటీడీ పద్ధతి ప్రకారం సేవలన్నీ నిర్వహిస్తారు. అంతే కాకుండా ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మికంగా అభివద్ధి చేయనున్నారు.  ఈ సందర్భంగా ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి  మీడియాతో మాట్లాడారు. శ్రీ గ్రంథి మల్లిఖార్జునరావు నిర్మించిన 
ఈ ఆలయాన్ని బాలాజీ ట్రస్టు పర్యవేక్షణలో, జీఎంఆర్‌ వరలక్ష్మి పౌండేషన్‌ ద్వారా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ ఆలయాన్ని టీటీడీ నిర్వహించాలని 
 శ్రీ గ్రంథి మల్లిఖార్జునరావు కోరారని ఈవో తెలిపారు. టీటీడీ పాలకమండలి ఇందుకు ఆమోదించడంతో ఆలయాన్ని  విలీనం చేసుకున్నామని అన్నారు.  

పాంచరాత్ర ఆగమయుక్తంగా ఆలయ నిర్వహణ జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయాన్ని మరింత  అభివద్ది పరిచేందుకు జీఎంఆర్‌తోపాటు రాజాం ప్రజలు, దాతల సహకారం తీసుకుంటామని తెలిపారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఇక్కడ కూడా అందుబాటులో ఉంచుతామన్నారు.  తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలో ఇప్పటి వరకు సుమారు 60 ఆలయాలు ఉన్నాయని ఈవో తెలిపారు.  విశాఖపట్నం డిప్యూటీ ఈవో  పరిధిలోకి రాజాం ఆలయం వస్తుందని చెప్పారు.  తిరుమల కు నడక దారిలో వచ్చే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కరోనా సమయంలో మూడు నెలలకు ఒకసారి ఆన్‌లైన్‌లో  దర్శనం టికెట్లు విడుదల చేసేవారమని చెప్పారు. ఇప్పుడు కరోనా ఇబ్బందులు లేనందువల్ల గతంలో లాగానే నెలకోసారి ఆన్లైన్లో టికెట్లు విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు.  టీటీడీ కల్యాణమండపాలు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేస్తున్నారన్న ప్రశ్నకు స్పందించిన ఆయన స్పందిస్తూ, కొన్నిచోట్ల కల్యాణమండపాలు శిథిలావస్థకు చేరుకున్నాయనీ, మరి కొన్నింటికి ఆదరణ లేదని అన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని అలాంటి కల్యాణ మండపాల నిర్వహణ మాత్రమే  కాంట్రాక్ట్‌ పద్దతిలో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చామన్నారు. 

 ఇదీ ఆలయ చరిత్ర..
రాజాం పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం రోడ్డులో 3.5 ఎకరాల్లో రూ. 3 కోట్ల వ్యయంతో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త త్రిదండి చినజియర్‌ స్వామి పర్యవేక్షణలో ఆలయాన్ని నిర్మించారు. 2015లో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించి 2018 సంవత్సరంలో ప్రతిష్ట నిర్వహించారు. అప్పటి నుంచి ట్రస్టు ద్వారా ఆలయ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రంధి ఈశ్వరరావు, గ్రంధి నీలాచలం, గ్రంధి భాస్కరరావు, కొల్లూరు వెంకట నాగేశ్వరరావు, జీఎంఆర్  కుటుంబసభ్యులు, భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2023-03-17 13:30:06

శ్రీకాకుళంలో 19నుంచి చేనేత వస్త్ర ప్రదర్శన

 చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో ఈ నెల 19నుంచి వారం రోజులు పాటు శ్రీకాకుళం టౌన్ హాల్ లో చేనేత వస్త్ర ప్రదర్శన (ఎగ్జిబిషన్) ఏర్పాటు చేస్తున్నట్టు  జిల్లా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ అధికారి ఐ. ధర్మారావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం జిల్లాలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రదర్శనలో మన రాష్ట్రం ఉత్పత్తులే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి నాణ్యమైన చేనేత ఉత్పత్తులను ఒకే వేదికపై తక్కువ ధరలకు వినియోగదారులకు అందుబాటులో ఉంచుతామన్నారు. చేనేత నేత కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించేందుకు చేనేత నేత సహకార సంఘాల చేనేత ఉత్పత్తులను విక్రయిస్తున్నట్టు పేర్కొన్నారు. నగర వాసులు, జిల్లా వాసులు అందరు ఈ ఎగ్జిబిషన్ సందర్శించి చేనేత కార్మికులను ప్రోత్సాహించాలని ఆయన మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో కోరారు.

Srikakulam

2023-03-17 08:33:03

మానవసహిత లెవెల్ క్రాసింగ్ లకు ప్రత్యామ్నాయ సబ్ వే

చెన్నై గూడూరు సెక్షన్ పరిధిలోని రైల్వే లైన్ మధ్య రైలు రాకపోకల వేగం గంటకు 110 కిలోమీటర్ల నుండి 130 కి.మీ కు పెంచిన నేపథ్యంలో మానవ సహిత లెవెల్ క్రాసింగ్ లను మూసివేసి వాటికి ప్రత్యామ్నాయ సబ్ వే, అండర్పాస్ ఏర్పాటు పై దక్షిణ రైల్వే డివిజినల్ ఇంజనీర్, చెన్నై జంషీర్,  జిల్లా ఆర్ అండ్ బి అధికారి సుధాకర్ రెడ్డి, జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారి శంకర్ నారాయణ తో కలిసి శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా దక్షిణ రైల్వే డివిజనల్ ఇంజనీర్ కలెక్టర్ గారికి వివరిస్తూ నాయుడుపేట విన్నమాల రైల్వే లెవెల్ క్రాసింగ్ నంబర్ 78, తడ మండల పరిధిలో పూడి ఎల్ సి నెంబర్ 48, సూళ్లూరపేట పట్టణ పరిధిలోని ఎల్సి 60 లను మూసి వేస్తూ ప్రత్యామ్నాయ అండర్ పాస్ సబ్వే ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం సహకారం కావాలనీ జిల్లా కలెక్టర్ ను కోరగా,  కలెక్టర్ సానుకూలంగా స్పందించి నాయుడుపేట విన్నమాల ఎల్ సి నం.78 మరియు తడ ఎల్సి 48 పూడి గ్రామం పంచాయతీ రోడ్ కు సంబంధించి జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారి సంబంధిత తాసిల్దార్ రైల్వే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సబ్ వే/ అండర్ పాస్ ఏర్పాటు ప్రజలకు అనుకూలంగా ఉండేలా ప్రతిపాదనలు, నిర్మాణ చర్యలు ఉండాలని అన్నారు.

సూళ్లూరుపేట పట్టణంలోని మానవ సహిత ఎల్సి 60 మూసివేయుటకు సంబంధిత మున్సిపల్ కమిషనర్, ఆర్డిఓ సూళ్లురుపేట, తాసిల్దారు రైల్వే అధికారులు సంయుక్త సర్వే నిర్వహించి అప్రోచ్ రహదారి మరియు అండర్పాస్ ఏర్పాటు కొరకు అంచనాలు ప్రతిపాదనలు ప్రజలకు ఇబ్బంది కలిగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా చెన్నై గూడూరు సెక్షన్ పరిధిలోని రైళ్ల వేగం 130 కిలోమీటర్లకు పెంచడం వలన ప్రాణ, ఆస్తి నష్టం ప్రమాదాలు సంభవించకుండా ఉండటం కొరకు మానవ సహిత లెవెల్ క్రాసింగ్ ల మూసివేత జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. దీని కొరకు జిల్లా యంత్రాంగం నుండి సంపూర్ణ సహకారం అందిస్తామని అలాగే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేలా అండర్పాస్/ సబ్ వే ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

Tirupati

2023-03-17 08:26:36

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పర్వతరెడ్డి

ఉమ్మడి ప్రకాశం –నెల్లూరు–చిత్తూరు ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో ప్రాధాన్యతా ప్రకారం ఓట్ల లెక్కింపులో చంద్రశేఖర్ రెడ్డి పర్వతరెడ్డి గెలిచినట్టుగా ఎన్నికల కమిషన్ ప్రకటనతో డిక్లరేషన్ అందించామని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. శుక్రవారం ఉదయం ఆర్ వి యస్ లా కాలేజీ కౌంటింగ్ ప్రక్రియ జరిగిన మూట్ కోర్ట్ హాల్ నందు రిటర్నింగ్ అధికారి ఉపాధ్యా యుల  ఎన్నికల్లో గెలుపొందిన చంద్రశేఖర్ రెడ్డి పర్వతరెడ్డి కి డిక్లరేషన్ ను అందించారు. ఈ నెల 16 న ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉదయం 8 గం.ల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై 17 న ఉదయం 3 గం.ల వరకు కొన సాగిన ఎలిమినేషన్ ఓటింగ్ ప్రక్రియతో తన సమీప అభ్యర్థి బాబురెడ్డి పొక్కి రెడ్డి పై 1,043 ఓట్ల ఆధిక్యంతో చంద్రశేఖర్ రెడ్డి పర్వతరెడ్డి గెలుపొందడంతో ఎన్నికల కమిషన్ జారీ చేసిన డిక్లరేషన్ ను అందుకున్నారు. ఎలిమినేషన్ కౌంటింగ్ ప్రాధాన్యతా ప్రక్రియ విధానంతో మొత్తం 24,291 ఓట్లకు గానూ చంద్రశేఖర్ రెడ్డి పర్వతరెడ్డి కి 11,714 ఓట్లు, బాబురెడ్డి పొక్కి రెడ్డి కి 10,671 ఓట్లు రాగా, 1906 ఓట్లు చెల్లని ఓట్లుగా నమోదైందని తెలిపారు. డి ఆర్ ఓ ఎన్. రాజశేఖర్ డిక్లరేషన్ అందించే కార్యక్రమంలో పాల్గొన్నారు.       

Tirupati

2023-03-17 06:47:20

ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో మార్చి 20 నుండి 28వతేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.  ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 9.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి, పసుపు, కుంకుమ, చందనం, సీకాయ, నామం, కర్పూరం, కిచిలిగడ్డ, కస్తూరి పసుపు, పచ్చాకు తదితరాలతో తయారుచేసిన సుగంధ మిశ్రమాన్ని గర్భాలయ గోడలకు పూశారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.

ఆలయానికి పరదాలు విరాళం..

శ్రీ కోదండరామాలయానికి శుక్రవారం హైదరాబాదుకు చెందిన  ప్రసన్నరెడ్డి అనే భక్తురాలు  5 మరియు తిరుపతికి చెందిన శ్రీ మణి 4 పరదాలు, కురాళాలు, కర్టన్లను విరాళంగా అందించారు.  ఈ కార్యక్రమంలో   డెప్యూటీ ఈవోలు నాగరత్న,  గోవింద రాజన్, ఏఈవో  మోహన్,  సూపరింటెండెంట్‌  ర‌మేష్‌, ప్ర‌ధాన అర్చ‌కులు  ఎపి.ఆనంద‌కుమార్ దీక్షితులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సురేష్, చలపతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2023-03-17 06:34:02

సెలవంటూ వెళ్లిపోయిన YSRCPఅభ్యర్ధి సుధాకర్

ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి చెందుతానని ముందగానే పసిగట్టిన అధికారపార్టీ వైఎస్సార్సీపీ అభ్యర్ధి సీతం రాజు సుధాకర్ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. 16వ తేది రాత్రి నుంచి ప్రారంభమైన పోలింగ్ కౌంటింగ్ లో మొదటి రౌండ్ నుంచి టిడిపి అభ్యర్ధి డా.వేపాడ చిరంజీవిరావు ఆధిక్యత కొనసాగుతూ వచ్చింది. అభ్యర్ధి గెలుపుని నిర్ధేశించేది మూడు రౌండ్ల ఫలితాలే నని తేలడంతో 5వ రౌండ్ వరకూ వేసి చూసిన వైఎస్సార్సీపీ అభ్యర్ధి అందులోనూ టిడిపీకే మెజార్టీ రావడంతో అక్కడ ఉండటం ఇష్టంలేక వెనుతిరిగారు. రాత్రి నుంచి ఎలాంటి కౌంటింగ్ పాసులు లేకపోయినా హడావిడి చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా కౌంటింగ్ కేంద్రం నుంచి ఒక్కొక్కరుగా సీతంరాజు వెంట నడవాల్సి వచ్చింది. ఎన్నికల ముందురోజు వరకూ నలుగురు అభ్యర్ధుల మధ్య పోటీ వుంటుందని భావించా.. ఎన్నిక అయినరోజు మాత్రం అసలైన పోటీ ముగ్గురు మద్యే ఉంటుందని తేలిపోయింది..అయినా విజయం దక్కలేదు..!

Visakhapatnam

2023-03-17 05:25:19

బీజేపీ మాధవ్ కి ఓట్లు పడకపోవడం వెనుక స్టీల్ ప్లాంట్

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధి మాదవ్ కి ఓట్లు రాకపోవడం వెనుక స్టీల్ ప్రైవేటీకరణ అంశం గట్టిగా ప్రభావం చూపింది. కలిసి వస్తాయనుకున్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఓట్లన్నీ టిడిపి అభ్యర్ధికి, అధికార పార్టీ అభ్యర్ధులకే వెళ్లిపోతున్నాయి. మొదటి రౌండ్ నుంచి మూడవ రౌండ్ పూర్తయ్యేవరకూ బిజేపీ 4వ స్థానానికే పరిమితం అయ్యింది. విశాఖ సెంటిమెంట్ గా ఉన్న స్టీల్ ప్లాంట్ జోలికి వస్తే ఎవరికైనా గట్టి గుణపాఠం చెబుతామన్న ఉద్యోగులు ఆ పంతాన్ని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజం చేసి చూపారన్న మాట రుజువైపోయింది. అందులోనూ కేంద్రం ఇచ్చిన విశాఖ రైల్వే జోన్, విభజన ఆంధ్రప్రదేశ్ హామీలు అమలు చేయకపోవడం, ఎల్ఐసి లాంటి సంస్థలను కూడా ప్రైవేటు పరం చేసే దిశగా కేంద్రం అడుగులు వేయడంతో ఉద్యోగులే కాకుండా నిరుద్యోగులు కూడా బిజేపీపై తమ నిరసనను ఓటు రూపంలో చూపించారు. ఇపుడు పడ్డ ఓట్లన్నీ పార్టీ కేడర్ ఓట్లే అంటున్నారు విశ్లేషకులు.

Visakhapatnam

2023-03-17 01:46:26

చిరంజీవిరావుకి అత్యధిక ఓట్లు రావడానికి కారణమిదే

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి భారీ మెజార్టీ దిశగా దూసుకెళుతున్నారు. అధికారపార్టీ అభ్యర్ధి రెండవ స్థానానికి, పీడిఎఫ్ అభ్యర్ధి మూడవ స్థానానికి, బిజేపీ అభ్యర్ధి నాల్గవ స్థానంలోనూ కొనసాగుతున్నారు. టిడిపి అభ్యర్ధి డా.వేపాడచిరంజీవిరావు(ఎకానమీ చిరంజీవి)ప్రముఖ పోటీపరీక్షల కోచింగ్ సెంటర్ లో పనిచేశారు. ఆ తరువాత ప్రత్యేకంగా ఆయన ఎన్నోవేలమంది విద్యార్ధులకు ఎకానమీ పాఠాలు బోధించారు. ఆయనదగ్గర చదువుకున్న ఎందరో విద్యార్ధులు, ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా పెద్ద పెద్ద అధికారులుగా స్థిరపడ్డారు. నాడు ఆయన చెప్పిన పాఠలు నేడు ఉత్తరాంధ్రా పట్టభద్రుల  ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపార్టీ అభ్యర్ధికి వ్యతిరేక ఓటు గుణపాఠంగా మారిందనే వాదన బలంగా వినిపిస్తుంది. అధికార దుర్వినియోగం చేసినా కూడా ఓటర్లలో మార్పు వచ్చిందని చెప్పడానికి ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఇంకా ఐదురౌండ్ల ఫలితాలు మిగిలి ఉన్నాయి.

Visakhapatnam

2023-03-17 01:35:57

స్వరూపానందేంద్రను కలిసిన క్రికెటర్ భరత్

భారత క్రికెట్ జట్టు ఆటగాడు, వికెట్ కీపర్ కేఎస్ భరత్ గురువారం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించి.. భార్య అంజలితో కలిసి రాజశ్యామల అమ్మవారి పూజలు చేశాడు. అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామిని కలిసి ఆశీస్సులు అందుకున్నాడు. ఈ సందర్భంగా  భరత్ మాట్లాడుతూ, గుజరాత్ టైటాన్ తరపున ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడేందుకు అహ్మదాబాద్ క్యాంప్ కు వెళుతున్నట్లు తెలిపాడు. అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతుల ఆశీస్సుల కోసం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించానని అన్నాడు. ఇక్కడికి వచ్చి స్వామి దర్శించి, అమ్మవార్లకు పూజలు చేయడం ఆనందాన్ని పంచిందన్నాడు.

Pendurthi

2023-03-16 12:55:30

అమరజీవి పొట్టి శ్రీరాములు ఒక గొప్ప త్యాగమూర్తి

అమర జీవి పొట్టి శ్రీరాములు ఒక గొప్ప త్యాగ మూర్తి, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆద్యుడు,  మహనీయుడు అని సంయుక్త  కలెక్టర్  మయూర్ అశోక్  అన్నారు. గురువారం ఉదయం  కలెక్టరేట్  ఆడిటోరియంలో  అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి  జిల్లా కలెక్టర్ సూర్య కుమారి, జె.సి మయూర్ అశోక్ ,  డి.ఆర్.ఓ గణపతి రావు తదితరులు  పుష్పాంజలి ఘటించారు. అనంతరం  జె.సి మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16 న జన్మించి  1952 డిసెంబరు 15న అమరులయ్యారని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు 58 రోజులు ఆమరణ  నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడని,  ఆయన త్యాగం ఫలితంగా నే  ఆంధ్ర రాష్ట్రం 1956 నవంబర్1 న ఏర్పడిందని అన్నారు.  పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడన్నారు.

 తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సర కాలంలో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించాడని అన్నారు. ఆంధ్రులకు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణ భూతుడైనవారని, మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడని కొనియాడారు. డి.ఆర్. ఓ గణపతి రావు మాట్లాడుతూ  మహనీయుల జయంతి వర్ధంతి కార్యక్రమాల ద్వారా వారి జీవిత విశేషాల నుండి స్ఫూర్తి పొంది యువత సన్మార్గంలో దేశ భక్తితో మెలగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సంక్షేమ అధికారి యశోధన రావు,   వివిధ శాఖల  అధికారులు, సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-03-16 10:50:43