1 ENS Live Breaking News

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పర్వతరెడ్డి

ఉమ్మడి ప్రకాశం –నెల్లూరు–చిత్తూరు ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో ప్రాధాన్యతా ప్రకారం ఓట్ల లెక్కింపులో చంద్రశేఖర్ రెడ్డి పర్వతరెడ్డి గెలిచినట్టుగా ఎన్నికల కమిషన్ ప్రకటనతో డిక్లరేషన్ అందించామని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. శుక్రవారం ఉదయం ఆర్ వి యస్ లా కాలేజీ కౌంటింగ్ ప్రక్రియ జరిగిన మూట్ కోర్ట్ హాల్ నందు రిటర్నింగ్ అధికారి ఉపాధ్యా యుల  ఎన్నికల్లో గెలుపొందిన చంద్రశేఖర్ రెడ్డి పర్వతరెడ్డి కి డిక్లరేషన్ ను అందించారు. ఈ నెల 16 న ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉదయం 8 గం.ల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై 17 న ఉదయం 3 గం.ల వరకు కొన సాగిన ఎలిమినేషన్ ఓటింగ్ ప్రక్రియతో తన సమీప అభ్యర్థి బాబురెడ్డి పొక్కి రెడ్డి పై 1,043 ఓట్ల ఆధిక్యంతో చంద్రశేఖర్ రెడ్డి పర్వతరెడ్డి గెలుపొందడంతో ఎన్నికల కమిషన్ జారీ చేసిన డిక్లరేషన్ ను అందుకున్నారు. ఎలిమినేషన్ కౌంటింగ్ ప్రాధాన్యతా ప్రక్రియ విధానంతో మొత్తం 24,291 ఓట్లకు గానూ చంద్రశేఖర్ రెడ్డి పర్వతరెడ్డి కి 11,714 ఓట్లు, బాబురెడ్డి పొక్కి రెడ్డి కి 10,671 ఓట్లు రాగా, 1906 ఓట్లు చెల్లని ఓట్లుగా నమోదైందని తెలిపారు. డి ఆర్ ఓ ఎన్. రాజశేఖర్ డిక్లరేషన్ అందించే కార్యక్రమంలో పాల్గొన్నారు.       

Tirupati

2023-03-17 06:47:20

ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో మార్చి 20 నుండి 28వతేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.  ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 9.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి, పసుపు, కుంకుమ, చందనం, సీకాయ, నామం, కర్పూరం, కిచిలిగడ్డ, కస్తూరి పసుపు, పచ్చాకు తదితరాలతో తయారుచేసిన సుగంధ మిశ్రమాన్ని గర్భాలయ గోడలకు పూశారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.

ఆలయానికి పరదాలు విరాళం..

శ్రీ కోదండరామాలయానికి శుక్రవారం హైదరాబాదుకు చెందిన  ప్రసన్నరెడ్డి అనే భక్తురాలు  5 మరియు తిరుపతికి చెందిన శ్రీ మణి 4 పరదాలు, కురాళాలు, కర్టన్లను విరాళంగా అందించారు.  ఈ కార్యక్రమంలో   డెప్యూటీ ఈవోలు నాగరత్న,  గోవింద రాజన్, ఏఈవో  మోహన్,  సూపరింటెండెంట్‌  ర‌మేష్‌, ప్ర‌ధాన అర్చ‌కులు  ఎపి.ఆనంద‌కుమార్ దీక్షితులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సురేష్, చలపతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2023-03-17 06:34:02

సెలవంటూ వెళ్లిపోయిన YSRCPఅభ్యర్ధి సుధాకర్

ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి చెందుతానని ముందగానే పసిగట్టిన అధికారపార్టీ వైఎస్సార్సీపీ అభ్యర్ధి సీతం రాజు సుధాకర్ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. 16వ తేది రాత్రి నుంచి ప్రారంభమైన పోలింగ్ కౌంటింగ్ లో మొదటి రౌండ్ నుంచి టిడిపి అభ్యర్ధి డా.వేపాడ చిరంజీవిరావు ఆధిక్యత కొనసాగుతూ వచ్చింది. అభ్యర్ధి గెలుపుని నిర్ధేశించేది మూడు రౌండ్ల ఫలితాలే నని తేలడంతో 5వ రౌండ్ వరకూ వేసి చూసిన వైఎస్సార్సీపీ అభ్యర్ధి అందులోనూ టిడిపీకే మెజార్టీ రావడంతో అక్కడ ఉండటం ఇష్టంలేక వెనుతిరిగారు. రాత్రి నుంచి ఎలాంటి కౌంటింగ్ పాసులు లేకపోయినా హడావిడి చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా కౌంటింగ్ కేంద్రం నుంచి ఒక్కొక్కరుగా సీతంరాజు వెంట నడవాల్సి వచ్చింది. ఎన్నికల ముందురోజు వరకూ నలుగురు అభ్యర్ధుల మధ్య పోటీ వుంటుందని భావించా.. ఎన్నిక అయినరోజు మాత్రం అసలైన పోటీ ముగ్గురు మద్యే ఉంటుందని తేలిపోయింది..అయినా విజయం దక్కలేదు..!

Visakhapatnam

2023-03-17 05:25:19

బీజేపీ మాధవ్ కి ఓట్లు పడకపోవడం వెనుక స్టీల్ ప్లాంట్

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధి మాదవ్ కి ఓట్లు రాకపోవడం వెనుక స్టీల్ ప్రైవేటీకరణ అంశం గట్టిగా ప్రభావం చూపింది. కలిసి వస్తాయనుకున్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఓట్లన్నీ టిడిపి అభ్యర్ధికి, అధికార పార్టీ అభ్యర్ధులకే వెళ్లిపోతున్నాయి. మొదటి రౌండ్ నుంచి మూడవ రౌండ్ పూర్తయ్యేవరకూ బిజేపీ 4వ స్థానానికే పరిమితం అయ్యింది. విశాఖ సెంటిమెంట్ గా ఉన్న స్టీల్ ప్లాంట్ జోలికి వస్తే ఎవరికైనా గట్టి గుణపాఠం చెబుతామన్న ఉద్యోగులు ఆ పంతాన్ని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజం చేసి చూపారన్న మాట రుజువైపోయింది. అందులోనూ కేంద్రం ఇచ్చిన విశాఖ రైల్వే జోన్, విభజన ఆంధ్రప్రదేశ్ హామీలు అమలు చేయకపోవడం, ఎల్ఐసి లాంటి సంస్థలను కూడా ప్రైవేటు పరం చేసే దిశగా కేంద్రం అడుగులు వేయడంతో ఉద్యోగులే కాకుండా నిరుద్యోగులు కూడా బిజేపీపై తమ నిరసనను ఓటు రూపంలో చూపించారు. ఇపుడు పడ్డ ఓట్లన్నీ పార్టీ కేడర్ ఓట్లే అంటున్నారు విశ్లేషకులు.

Visakhapatnam

2023-03-17 01:46:26

చిరంజీవిరావుకి అత్యధిక ఓట్లు రావడానికి కారణమిదే

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధి భారీ మెజార్టీ దిశగా దూసుకెళుతున్నారు. అధికారపార్టీ అభ్యర్ధి రెండవ స్థానానికి, పీడిఎఫ్ అభ్యర్ధి మూడవ స్థానానికి, బిజేపీ అభ్యర్ధి నాల్గవ స్థానంలోనూ కొనసాగుతున్నారు. టిడిపి అభ్యర్ధి డా.వేపాడచిరంజీవిరావు(ఎకానమీ చిరంజీవి)ప్రముఖ పోటీపరీక్షల కోచింగ్ సెంటర్ లో పనిచేశారు. ఆ తరువాత ప్రత్యేకంగా ఆయన ఎన్నోవేలమంది విద్యార్ధులకు ఎకానమీ పాఠాలు బోధించారు. ఆయనదగ్గర చదువుకున్న ఎందరో విద్యార్ధులు, ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా పెద్ద పెద్ద అధికారులుగా స్థిరపడ్డారు. నాడు ఆయన చెప్పిన పాఠలు నేడు ఉత్తరాంధ్రా పట్టభద్రుల  ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపార్టీ అభ్యర్ధికి వ్యతిరేక ఓటు గుణపాఠంగా మారిందనే వాదన బలంగా వినిపిస్తుంది. అధికార దుర్వినియోగం చేసినా కూడా ఓటర్లలో మార్పు వచ్చిందని చెప్పడానికి ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఇంకా ఐదురౌండ్ల ఫలితాలు మిగిలి ఉన్నాయి.

Visakhapatnam

2023-03-17 01:35:57

స్వరూపానందేంద్రను కలిసిన క్రికెటర్ భరత్

భారత క్రికెట్ జట్టు ఆటగాడు, వికెట్ కీపర్ కేఎస్ భరత్ గురువారం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించి.. భార్య అంజలితో కలిసి రాజశ్యామల అమ్మవారి పూజలు చేశాడు. అనంతరం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామిని కలిసి ఆశీస్సులు అందుకున్నాడు. ఈ సందర్భంగా  భరత్ మాట్లాడుతూ, గుజరాత్ టైటాన్ తరపున ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడేందుకు అహ్మదాబాద్ క్యాంప్ కు వెళుతున్నట్లు తెలిపాడు. అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతుల ఆశీస్సుల కోసం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించానని అన్నాడు. ఇక్కడికి వచ్చి స్వామి దర్శించి, అమ్మవార్లకు పూజలు చేయడం ఆనందాన్ని పంచిందన్నాడు.

Pendurthi

2023-03-16 12:55:30

అమరజీవి పొట్టి శ్రీరాములు ఒక గొప్ప త్యాగమూర్తి

అమర జీవి పొట్టి శ్రీరాములు ఒక గొప్ప త్యాగ మూర్తి, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆద్యుడు,  మహనీయుడు అని సంయుక్త  కలెక్టర్  మయూర్ అశోక్  అన్నారు. గురువారం ఉదయం  కలెక్టరేట్  ఆడిటోరియంలో  అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి  జిల్లా కలెక్టర్ సూర్య కుమారి, జె.సి మయూర్ అశోక్ ,  డి.ఆర్.ఓ గణపతి రావు తదితరులు  పుష్పాంజలి ఘటించారు. అనంతరం  జె.సి మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16 న జన్మించి  1952 డిసెంబరు 15న అమరులయ్యారని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు 58 రోజులు ఆమరణ  నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడని,  ఆయన త్యాగం ఫలితంగా నే  ఆంధ్ర రాష్ట్రం 1956 నవంబర్1 న ఏర్పడిందని అన్నారు.  పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడన్నారు.

 తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సర కాలంలో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించాడని అన్నారు. ఆంధ్రులకు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణ భూతుడైనవారని, మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడని కొనియాడారు. డి.ఆర్. ఓ గణపతి రావు మాట్లాడుతూ  మహనీయుల జయంతి వర్ధంతి కార్యక్రమాల ద్వారా వారి జీవిత విశేషాల నుండి స్ఫూర్తి పొంది యువత సన్మార్గంలో దేశ భక్తితో మెలగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సంక్షేమ అధికారి యశోధన రావు,   వివిధ శాఖల  అధికారులు, సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-03-16 10:50:43

అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడు

ఆంధ్రరాష్ట్ర సాధనకోసం ఆమరణ నిరాహాదీక్ష చేసి, ప్రాణాలర్పించిన అమరజీవి, మహాపురుషుడు, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కృషిచేసిన మహానీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడని జిల్లా కలెక్టరు డా. మాధవీలత పేర్కొన్నారు. గురువారం రాజమం డ్రి  జిల్లా కలెక్టరు కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను పురష్కరించుకొని కలెక్టరు మాధవీలత, జిల్లా అధికారులతో కలసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధన కోసం అహర్నిషలు కృషి చేసి ఆంధ్రరాష్ట్ర ఆవిర్భానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములని పేర్కొన్నారు. ఆంధ్రుల చిరకాల స్వప్నమైన రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణత్యాగంతో అమరజీవియైన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు అని పేర్కొన్నారు.  శ్రీరాములు చేసిన త్యాగం ఫలితంగా దేశ వ్యాప్తంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఆవిర్భావానికి కారణం అయిందని, దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ప్రయోజనం పొందారని  వివరించారు.

 అమరజీవి పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16 న జన్మించి  1952 డిసెంబరు 15న అమరులయ్యారని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు 58 రోజులు ఆమరణ  నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి, అమరజీవి ఆయన త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్రం 1956 నవంబర్1 న ఏర్పడిందని అన్నారు. అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు అడుగుజాడలలో నడవాలని, ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో డీఆర్వో  జి. నరశింహులు, సీపీఓ కె.ప్రకాష్ రావు, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ ఈ  డి.బాలశంకర్ రావు ,  డ్వామా పీ డి జిఎస్ రామగోపాల్,  డి ఎల్ డిఓ వీణాదేవి, డివిజనల్ పిఆర్వో యం. లక్ష్మణాచార్యులు, కలెక్టరేట్ ఏఓ భీమారావు, జిల్లా అధికారులు , కలక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Rajamahendravaram

2023-03-16 10:46:42

ఉత్తరాంధ్ర MLC గెలుపు చుట్టూ అష్గ దిగ్బంధనం

ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజవకర్గ ఎమ్మెల్సీ గెలుపుపై అష్ట దిగ్బందనం అలము కుంది.  అష్టదిగ్బంధనం అంటే ఏదో అనుకునేరు 8 రౌండ్లు మన చుట్టూ ఉన్నాయి అని అర్ధం.. అదేనండీ..8 రౌండ్లలో ఎవరు గెలుస్తారనే విషయాలు తేలనున్నాయన్నమాట. ఇప్పటి వరకూ నాలుగు రౌండ్లలో ఎవరి బ్యాలెట్ పేపర్ వారికి కట్టలుగా విభజించారు. మొత్తం ఎనిమిది రౌండ్లలో ఎమ్మెల్సీ గెలుపుపై ప్రకటన వస్తుంది( ఇపుడు రావడానికి అవకాశం లేదు కోర్టు మధ్యంతర ఉత్తర్వులున్నాయి) కట్టలు విభజన పూర్తి అవుతున్న సమయంలో సిబ్బందికి భోజన విరామం ఇచ్చారు. ఆ తరువాత రౌండ్ల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో లెక్కిస్తారు. ఆఖరుగా అధికంగా ఓట్లు వచ్చిన వారు విజేతలవుతా రు. అదే సమయంలో ఇవ్వాలీడ్వ ఓట్లు వచ్చే ప్రమాదం కూడా ఉందని ప్రధాన పోటీదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గెలుపుపై ప్రధాన అధికారపార్టీతోపాట, ప్రధాన పోటీ పార్టీలు ధీమాతో ఉన్నా పెరుగుతున్న ఆలస్యం ఉత్కంఠను రేపుతోంది..!

Visakhapatnam

2023-03-16 10:14:48

ఆదిలోనే చెమటలు పట్టించిన ఇన్వాలీడ్ పోస్టల్ బ్యాలెట్

ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజవకర్గ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో అభ్యర్ధులను ఆదిలోనే పోస్టల్ ఇన్వాలీడ్ ఓట్లు ముచ్చెమటలు పట్టించా యి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 228 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లకుండా పోయాయి. ఆరుజిల్లాల్లో కలిపి 767 పోస్టల్ బ్యాలెట్లు అధికార యంత్రంగాం ఎన్నికల విధుల్లోకి పాల్గొన్నవారికి జారీచేసింది. అయితే అందులో 583 మంది మాత్రమే ఓటును వినియోగించుకోగా మళ్లీ అందులోనే 228 ఓట్లు చెల్లకుండా పోయాయి. దీనితో పోస్టల్ బ్యాలెట్ సుభ సూచికం అనుకున్న అభ్యర్ధులకు గుండెల్లో రాయి పడినట్టు అయ్యింది. పోస్టల్ బ్యాలెట్ పరిస్థితే ఈ విధంగా ఉంటే చాలా చోట్ల బ్యాలెట్ లో ప్రాధాన్యత ఓట్లు సక్రమంగా వేయలేదనే ప్రచారం జరిగింది. సాధారణ బ్యాలెట్ పేపర్లు పరిశీలన తరువాత ఇంకెన్ని ఓట్లు చెల్లకుండా పోతాయోననే ఆందోళన బరిలో ఉన్న అభ్యర్ధులు వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎన్నికల ఫలితాలపై హై కోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఒక్కో చేదువార్త అభ్యర్ధులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నది.

Visakhapatnam

2023-03-16 09:28:53

బ్యాలెట్ చెప్పే కబురుతో విజయం.. విలాపం.. విశ్లేషణ

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజవకర్గం ఎన్నికలు మార్చి13న నువ్వా నేనా అన్నట్టుగా 4గురు మధ్యసాగాయి. ఎన్నికల బ్యాలెట్ పత్రాలు విశాఖలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం నుంచి ఈరోజు ఉదయం బయటకు వచ్చాయి.. వస్తూ వస్తూనే తీపి, చేదు, వగరు కబురు మోసుకు రాబోతున్నది. తీపి కబురు విన్న అభ్యర్ధి విజయంతో ఆనంద డోలికల్లో మునగగా.. చేదుకబురు విన్న అభ్యర్ధి విలాపానికి లోనవుతా డు.. కాస్త దగ్గర ప్రజల నాడి తెలుసుకున్న మరో అభ్యర్ధి పరిస్థితి అదన్నమాట అనే విశ్లేషన మొదలు పెడతాడు..ఇక నాల్గవ అభ్యర్ధి ఇక మన కి సుఖం లేదు అంటూ అక్కడి నుంచి విసర్జించే పరిస్థి వస్తుంది. సాధారణ ఎన్నికలను తలపించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిజి స్టర్ అయిన 2లక్షల 89వేల 214 మంది ఓటర్లలో 2లక్షల 926 మంది మాత్రమే తమ ఓటు హక్కును విభజన ఆరుజిల్లాల్లో(ఉమ్మడి 3జిల్లా లు) వినియోగించుకున్నారు. పిడిఎఫ్, టిడిపి, వైఎస్సార్సీపి, బిజేపి అభ్యర్ధుల్లో ఎమ్మెల్సీ పీఠం ఎవరిని వరిస్తుందో మరి..!

Visakhapatnam

2023-03-16 01:59:04

బాలక్రిష్ణ వ్యాఖ్యలపై ఫైరైన శ్రీనివాస్‌ రెడ్డి

పల్నాడు జిల్లా నర్సాపురం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే  గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి  ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ వ్యాఖ్యలపై గట్టి కౌంటర్‌ ఇచ్చారు. నియోజకవర్గంలో పనికిమాలిన వ్యక్తికి ఒత్తాసు పలికి స్థాయిని దిగజార్చుకోవద్దని హితవు పలికారు. ‘నా నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకు నీకేం పని ? . నువ్వు హీరో అయితే నీ పార్టీకి గొప్ప.. నాకు కాదు’అంటూ తనదైన రీతిలో స్పందించారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచిస్తూ..మూడోకన్ను తెరిచినా ఒరిగిపోయేది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. సినిమాల్లో లాగా జీవితంలో నటించడం కుదరదని తెలుసుకోవాలని ‘మనుషులకు మూడో కన్ను ఉండదని తెలుసుకోవాలని సూచించారు.  ఏదో ఒకటి అనడం, తప్పైందని వెనక్కి తీసుకోవడం బాలకృష్ణకు అలవాటుగా మారిందని’ఎద్దేవా చేశారు.  ఇటీవల నర్సాపురంలో పర్యటించిన సందర్భంగా బాలకృష్ణఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పై పలు వ్యాఖ్యలు చేయడంతో విషయం చిలికి చిలికి గాలివానలా మారింది. తాను అభిమానులకు చిటికేస్తె చాలు. జాగ్రత్త బాలక్రిష్ణ మాట్లాడటం అగ్నికి ఆజ్యం పోసిట్టైంది..!

Narsapuram

2023-03-15 16:49:15

జగనన్న డిగ్రీకాలేజీ అభ్యర్దులకున్న ఓటు సీఎంకి లేదా

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిగ్రీ చదివిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎందుకు ఓటు వేయలేదని రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. బుధవారం విశాఖలోని బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాసైన సీఎంకి ఓటు లేదా..? నమోదు కాలేదా..? లేదంటే ఎందుకు నమోదు చేయించుకోలేదని అన్నారు. ఈనెల 13న జరిగిన ఎమ్మె ల్సీ ఎన్నికల్లో జగనన్న డిగ్రీ కాలేజీల్లో 5, 6, 7, 8 తరగతులు చదివిన వారంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులుగా ఓట్లు వేయడాన్ని రాష్ట్ర ప్రజానీకం అంతా చూసిందన్నారు.  ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపుకోసం వెండి బిళ్లలు పంచిన వైఎస్సార్సీపీ రేపు వచ్చే ఎన్నికల్లో 175 నియోజ వకర్గాల్లోనూ బంగారు బిళ్లలు పంచుతుందా అని ఎద్దేవా చేశారు. త్వరలోనే వైఎస్సార్సీపీ బంగాళాఖాతంలో కలవడం ఖాయమన్నారు. ఏపీ పోలీసులు పోలీసులుగా కాకుండా ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవరిస్తున్నారని ఆరోపించారు.

Visakhapatnam

2023-03-15 13:55:14

విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు పంపిణీ

అగర్వాల్ మహాసభ సామాజిక బాధ్యతగా విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలను పంపిణీ చేసినట్లు అగర్వాల్ మహాసభ విశాఖపట్నం అధ్యక్షులు విజయేంద్ర కుమార్ గుప్తా తెలిపారు. తమ సంస్థ చేపడుతున్న వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈ ఏడాది తొలిఅంశంగా వీల్ చైర్స్, వాకర్స్, స్టిక్స్, ఊత కర్రలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన వివ రించారు. రాజస్థాన్ సాంస్కృతిక మండల్ భవన్ లో మంగళవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులకు ఈ ఉపకరణాలను అందజేశారు. ప్రోగ్రాం చైర్మ న్ ప్రకాష్ సరోగి మాట్లాడుతూ, భవిష్యత్తులో శాశ్వత ప్రాతిపదిగిన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు చెప్పారు. కోచైర్మన్ అగర్వాల్ మాట్లా డుతూ, 3దశాబ్దాల చరిత్ర కలిగిన సంస్థ విశాఖలో ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలను చేపట్టిందన్నారు. అదే స్ఫూర్తితో రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తా మని ప్రకటించారు. సంధానకర్తగా సీనియర్ జర్నలిస్ట్ ఎన్.నాగేశ్వరరావు వ్యవహరించారు.

Visakhapatnam

2023-03-14 08:52:17

విశాఖ చేరుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులు

విశాఖపట్నం -విజయనగరం-శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాల పట్టభద్రులు నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలు -2023 పోలింగ్ అనంతరం ఆరు జిల్లాల నుండి అన్ని బ్యాలట్ బాక్సులు స్వర్ణ భారతి ఇన్డోర్ స్టేడియంకు చేరుకున్నాయి . బ్యాలెట్ బాక్సులను జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లికార్జున , ఎన్నికల పరిశీలకులు సిద్దార్ధ్ జైన్ , ఆరు జిల్లాల డిఆర్వోలు , అభ్యర్థుల సమక్షంలో ఆరు స్ట్రాంగ్ రూములలో భద్రపరచి సీల్ వేశారు. ప్రత్యేక బందో బస్తు కూడా ఏర్పాటు చేశారు. వీటిని మళ్లీ కౌంటింగ్ రోజున అధికారుల సమక్షంలోనే సీల్ విప్పి బయటకు తీస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని రాత్రి పదిగంటల వరకూ ఎన్నిక జరగడంతో బ్యాలెట్ బాక్సులు రావడం ఆలస్యం అయ్యింది. కట్టుదిట్టమైన భద్రత మధ్యవీటిని విశాఖ తీసుకు వచ్చారు. జాయింట్ కలెక్టర్ కె ఎస్ విశ్వనాథన్ , డి సి పి సుమిత్ సునిల్ గరుడ్ , డిఆర్వో శ్రీనివాస మూర్తి , ఎలక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2023-03-14 06:46:53