1 ENS Live Breaking News

సింహాచలం అప్పన్న ఉత్సవాలకు కి ఆహ్వానం

సింహాచలం అప్పన్న సన్నిధిలో నిర్వహించే ప్రధాన ఉత్సవాలకు దేవస్థానం అధికారులు, పండితులు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వ రూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములను ఆహ్వానించారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం పీఠానికి వెళ్ళి ఆహ్వాన పత్రికను అందజే సారు. అప్పన్న సన్నిధిలో ఏటా నిర్వహించే చందనోత్సవం, తిరు కళ్యాణోత్సవాలు ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే వచ్చాయి. ఏప్రిల్ 2వ తేదీన తిరు కళ్యాణోత్సవం, 23వ తేదీన చందన మహోత్సవం నిర్వహించనున్నారు. ఉత్సవాలకు హాజరు కావల్సిందిగా పీఠాధిపతులను సింహాచ లం దేవస్థానం ఇన్ ఛార్జ్ ఈఓ త్రినాధ్, పండితులు కోరారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం మెరుగైన ఏర్పాట్లు చేయాలని, వేసవికాలం అ యినందున ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని స్వరూపానందేంద్ర స్వామి అధికారులకు సూచించారు.

Visakhapatnam

2023-03-29 13:30:22

అల్లూరి జిల్లాలో ఏప్రిల్ 1న ఉచిత వైద్యశిబిరం

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో  ఏప్రిల్ ఒకటవ తేదిన విశాఖపట్నం గాయత్రీ విద్యాపరిషత్ ఇనిస్టిట్యుట్ ఆఫ్ హల్త్ కేర్ అండ్ మెడి కల్ టెక్నోలజీస్  ఆద్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటన లో తెలిపారు. పాడేరు కలక్టరేట్ ఆవరణలో జరుగు ఈ ఉచిత వైద్యశిభిరాన్ని ప్రభుత్వ ఉద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేసారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో గాయత్రీ వైద్య కళాశాలలోని ప్రముఖ వైద్యులు పాల్గొంటారని, బిపి, షుగర్, ఇ.సి.జి, కంటి పరీక్షలు వంటి  వైద్య పరిక్షలు ఉచితంగా నిర్వహిస్తారన్నారు.

Paderu

2023-03-29 08:03:43

కోదండరామస్వామివారి ఆలయంలో కవి సమ్మేళనం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినం, శ్రీ పోతన జయంతిని పురస్కరించుకుని  టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల  ఆధ్వర్యంలో మార్చి 30వ తేదీ పోతన భాగవతం అంశంపై  కవి సమ్మేళనం నిర్వహించనున్నారు.  మార్చి 31వ తేదీ  శ్రీరామ పాదుకా పట్టాభిషేకం అంశంపై కవి సమ్మేళనం జరుగుతుంది.  ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో మార్చి 30వ తేదీ మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జియస్ఆర్ కృష్ణమూర్తి అధ్యక్షతన "పోతన భాగవతం''పై  ప్రముఖ పండితులు ఎం.నారాయణ రెడ్డి - రుక్మిణి సందేశం , డా.బి.గోపాలకృష్ణ శాస్త్రి - శ్రీరామ జననం, డా.కె.సుమన- సీతారామ కళ్యాణం,  పి.శంకర్ - భక్తి రసం,  వి.చిన్నయ్య - కుచేలోపాఖ్యానం,  ఎం.లోకనాధం - శరణాగతి తత్వం  అంశాలపై కవి సమ్మేళనం జరుగుతుంది.

అదేవిధంగా మార్చి 31వ తేదీ  టీటీడీ అర్చక శిక్షణ కోఆర్డినేటర్ డా.హేమంత్ కుమార్ అధ్యక్షతన  ''శ్రీరామ పాదుకా పట్టాభిషేకం'' పై
 ఎల్.జగన్నాథ శాస్త్రి - గడియారం వెంకట శేషశాస్త్రి రామాయణం,  ఎం.మల్లికార్జున రెడ్డి -  రామాయణ కల్పవృక్షం,  వై. మధుసూదన్ -  శ్రీ రంగనాథ రామాయణం, డా.సి.శివా రెడ్డి-శ్రీమద్ వాల్మీకి రామాయణం,   యు.భరత్ శర్మ - చంపూ రామాయణం, డా. పి.నీలవేణి - మొల్ల రామాయణం అంశాలపై కవి సమ్మేళనం నిర్వహిస్తారు.  శ్రీ కోదండరామస్వామివారి ఆలయ ప్రాంగణంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా మార్చి 31 నుండి ఏప్రిల్ 8వ తేదీ  వరకు ప్రతి రోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.  

Vontimitta Kodanda Rama Swamy Temple

2023-03-29 02:41:15

విశాఖ సాగరతీరంలో జి20 పతాకం విహంగ వీక్షణం

విశాఖలో నిర్వహించే జి20 సదస్సుల పతాకాన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్ హెలీకాఫ్టర్ ద్వారా వినూత్నంగా నగరవాసులకు తెలియజేశారు. ఆర్కే బీచ్ నుంచి నగరంలో సదస్సు లు జరిగే ప్రాంతాలు, వివిధ దేశాల ప్రతినిధులు హాజరయ్యే ప్రదేశాల్లో ఈ హెలీకాఫ్టర్ అత్యంత క్రింది నుంచి వెళ్లి నగరవాసులకు కనువిందు చేసింది. హెలీకాఫ్టర్ కి కట్టిన జి20 పతాకం, విశేషంగా ఆకట్టుకుంటోంది. జి20 సదస్సులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం అన్ని విషయాలను విశేషంగానే  ప్రజలకు తెలియజేసేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.

Visakhapatnam

2023-03-26 06:07:02

శభాష్ గ్రామ సచివాలయ మహిళాపోలీస్ చాందిని..ఎస్పీ

శభాష్  ధర్మవరం గ్రామ సచివాలయ మహిళా పోలీస్ చాందినీ, లావణ్య, రాధ మీరంతా మిస్సింగ్ కేసులను చాలా చక్కగా గుర్తించి కేసు పరిష్కారంలో మంచి ప్రతిభచూపా రు. ఈ తరహా విధినిర్వహణ ప్రభుత్వ సర్వీసులో చక్కటి గుర్తింపును తీసుకొస్తుంది..ఇకపై కూడా మంచి సేవలు అందించండి, ప్రజాసేవలో పోలీసు రక్షణ మరింతగా తెలి యజేయండి.. అంటూ ఎంతో ఉత్తేజపూర్వక ప్రోత్సాహాన్ని ఇచ్చారు కాకినాడ జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు. జిల్లాలో మిస్సింగ్ కేసుల పరిష్కారంలో గ్రామసచివాల య మహిళా పోలీసులు ప్రత్తిపాడు పోలీస్ సర్కిల్ పరిధిలో చక్కని ప్రతిభ చూపిస్తున్నారని కితాబిచ్చారు. ఈ మేరకు శనివారం జిల్లా కార్యాలయంలో వీరితోపాటు రిజియా సుల్తానాకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, సచివాలయ వ్యవస్థలో మహిళాపోలీసులు కీలకంగా మారారని, వారి యొక్కలు ప్రజలకు అత్యవసర సమయంలో తెలుస్తున్నాయని అన్నారు.ఏఎస్పీ, డిఎస్పీలు పాల్గొన్నారు.

Kakinada

2023-03-25 16:54:58

కమాండ్ కంట్రోల్ రూమ్ పునరుద్దరణకు చర్యలు

ఇంటిగ్రేటెడ్ క‌మాండ్‌, కంట్రోల్ సెంట‌ర్ (ఐసీసీసీ) కార్య‌క‌లాపాల పున‌రుద్ధ‌ర‌ణ‌, నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌తిపాద‌న‌లు రూపొందించాల‌ని కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా అధికారులకు సూచించారు. శ‌నివారం క‌లెక్ట‌రేట్ కోర్టుహాల్‌లో జిల్లా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా అధ్య‌క్ష‌త‌న కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేష‌న్ లిమిటెడ్ (కేఎస్‌సీసీఎల్‌) 37వ డైరెక్ట‌ర్ల బోర్డు స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ విస్తృత ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకొని సీసీటీవీల ద్వారా నిఘా, ప‌బ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్ట‌మ్ వంటి ముఖ్య‌మైన కార్య‌క‌లాపాలు క‌మాండ్‌, కంట్రోల్ సెంట‌ర్ ద్వారా కొన‌సాగించేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై నివేదిక రూపొందించాలన్నారు. ఇందుకు సంబంధించి అయిదుగురు స‌భ్యుల‌తో ప్ర‌త్యేక క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. స్మార్ట్‌సిటీ మిష‌న్ కింద చేప‌ట్టిన సైన్స్ సెంట‌ర్‌, క‌ళాక్షేత్రం, స్కేటింగ్ రింక్ ప‌నుల‌పైనా స‌మావేశంలో చ‌ర్చించారు. వీలైనంత త్వ‌ర‌గా వీటిని ప్రారంభించి, ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు. స‌మావేశంలో కాకినాడ మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్, కేఎస్‌సీసీఎల్ సీఈవో, ఎండీ కె.ర‌మేష్‌; స్వ‌తంత్ర డైరెక్ట‌ర్లు టీవీఎస్ కృష్ణ‌కుమార్‌, డా. జేవీఆర్ మూర్తి, డైరెక్ట‌ర్ సందీప్ కుల్హారియా త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2023-03-25 12:31:37

విశాఖలో ఆ ప్రాంతాలన్నీ రెడ్ జోన్ విత్ నో డ్రోన్

విశాఖలో జి20 సదస్సులు జరుగుతున్న నేపథ్యంలో ప్రముఖులు ఉండే ప్రదేశాలన్నీ తాత్కాలిక నో డ్రోన్ విత్ రెడ్ జోన్ గా ప్రకటించినట్టు సిటీ పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. రాడిసన్ బ్లూ రిసార్ట్స్,  ముడసర్లోవ పార్క్,  కైలాసగిరి కొండ, ఆర్.కె. బీచ్, జిందాల్ వేస్ట్ నుండి ఎనర్జీ ప్లాంట్, కాపులుప్పాడ, ఎస్.సి.ఏ.డి.ఏ , మాధవధార ప్రాంతాను గుర్తించి నట్టు సిపి పేర్కొ్న్నారు. ఈ ప్రాంతాల్లో హెలెవల్ సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఎవరైనా అనుమతిని అతిక్రమిస్తే అలాంటి డ్రోన్లను ధ్వంసం చేయనున్నట్టు హె చ్చరించారు. 

Visakhapatnam

2023-03-25 10:40:48

ప్రసాద్ పథకం నిధులకు 2వ విడత ప్రతిపాదనలు పంపాలి

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పలు దేవాలయాల అభివృద్ధికి ప్రసాద్ పథకం ద్వారా నిధులు మంజూరు చేస్తుందని,అందులో భాగంగానే తొలి విడతగా సింహాచలం దేవస్థా నానికి మంజూరు చేసిన రూ.54 కోట్ల  పనులను వేగవంతం చేసేవిధంగా సహకారం అందించాలని విశాఖ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ ను సింహాచలం దేవస్థానం ధర్మక ర్తల మండలి సభ్యులు, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సలహా మండలి సభ్యులు జాతీయ జర్నలిస్ట్ లు సంఘం కార్యదర్శి వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు కోరారు. శనివారం ఎంపీ ని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని శ్రీను బాబు ఘనంగా సత్కరించి సింహాద్రినాధుని జ్ఞాపిక బహుకరిం చారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ సింహాచలం దేవస్థానానికి తొలి విడతగామంజూరుచేసిన నిధుల పనులు ప్రారంభం కాలేదని ఎంపికి వివరిం చారు. పర్యాటక శాఖ ద్వారా ఈపనులు పూర్తిచేయాల్సి ఉందన్నారు. ఇందుకు  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తగిన సహకారం అందించే విధముగా కృషి చేయాలని కోరా రు. అలాగే2వ విడత నిధులు మంజూరుకు సహకారం అందించాలన్నారు.  ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సానుకూలంగా స్పందించి తన వంతు సహకారం అందిస్తానన్నా రని శ్రీను బాబుకి హామీ ఇచ్చారు.

Visakhapatnam

2023-03-25 10:22:42

విశాఖ పెట్రోలు బంకుల్లో డిఎస్ఓ ఆకస్మిక తనిఖీలు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెట్రోలు బంకులు వినియోగదారులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించాలని.. అలాచేయని బంకులపై చర్యలు తప్పవని డిఎస్ఓ సూర్యప్రకాశ రావు హెచ్చరించారు. గురువారం విశాఖలోని ఎంవీపిలో సుజిత ఏజెన్సీతోపాటు పలు బంకులపై ఏకకాలంలో ఆయన తన బ్రుందంతో తనిఖీలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రతీ పెట్రోల్ బంక్ యాజమాన్యం  ఉచితంగా గాలి, మరుగుదొడ్లు, మంచినీరు సౌకర్యాలు కల్పించాలన్నారు. వినియోగదారులు కోరికమేరకు పెట్రోలు, డీజిల్ కొలతలు కూడా వేసి చూపించాలన్నారు. వాటికోసం ప్రత్యేకంగా కొలతపాత్రలను పెట్రోలు పైపులవద్ద ఉంచాలన్నారు. బంకు ప్రాంగణం మొత్తం పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రిజిస్టర్లలో సంఖ్య మేరకు స్టాకు ఉండాలని, ఖచ్చితంగా ప్రతీ కొనుగోలు దారునికి బిల్లులు ఇవ్వాలన్నారు. శానిటేషన్, మరుగుదొడ్లు, ఉచిత గాలి బోర్డులు ఈబంకులో సక్రమంగా లేవనే విషయాన్ని గుర్తించినట్టు డిఎస్ఓ చెప్పారు.

Visakhapatnam

2023-03-23 09:52:52

జగనన్న గోరుముద్ద మెనూలోకి రాగి జావ


రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తోన్న జగనన్న గోరుముద్ద మెనూలోకి మరో పోషకాహారం రాగి జావను చేర్చడం జరిగిం దని, ఇకపై వారంలో మూడుసార్లు రాగి జావను విద్యార్థులకు అందించనున్నట్లు రాష్ట్రముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తెలిపారు. జగనన్న గోరుముద్దలో భాగంగా రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ జగనన్న గోరుముద్ద పథకం క్రింద రాష్ట్రంలోని 44,392 పాఠశాలల్లో గల 38 లక్షల విద్యార్ధులకు రుచికరమైన, పరిశుభ్రమైన పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. గతంలో మాదిరిగా కేవలం అన్నం, సాంబారు కాకుండా వారంలో 15 రకాల మెనూతో పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి వారంలో 5 రోజులు గ్రుడ్లు, ౩ రోజులు బెల్లం, పల్లీ చిక్కీలు ఇస్తున్నామని అన్నారు. మిగిలిన 3 రోజుల్లో కూడా పిల్లలకు తగినంత ఐరన్, కాల్షియం అందించి రక్తహీనతను నివారించేందుకు వీలుగా జగనన్న గోరుముద్దలో రాగిజావను  కూడా చేర్చడం జరిగిందని వివరించారు. 

ఇందుకోసం శ్రీ సత్యసాయి ట్రస్టు భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని, ట్రస్ట్ రూ.42కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.44కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. ఈ పథకాన్ని 1 నుంచి 10 వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్ధులకు అమలు కానుందన్నారు. గత ప్రభుత్వంలో మధ్యాహ్న భోజన పథకం క్రింద ఏడాదికి రూ.450కోట్లు వెచ్చిస్తే, ప్రస్తుతం నాణ్యమైన, పౌష్టికాహారం కోసం రూ.1824కోట్లు వెచ్చిస్తున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేసారు.  వీడియోకాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాలో 2,572 పాఠశాలలుండగా అందులో 1,77,664 మంది విద్యార్ధులు మధ్యాహ్న భోజన పథకం వినయోగించుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న గోరుముద్ద్ పథకంలో బెల్లం కలిపిన రాగి జావను కూడా చేర్చడం వలన విద్యార్ధుల్లో ఐరన్, కాల్షియం కలిగి రక్తహీనత లేకుండా ఉండేందుకు ఎంతగానో దోహదపడుతుందని కలెక్టర్ వివరించారు.  ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ, సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త డా.ఆర్.జయప్రకాష్, శ్రీకాకుళం శ్రీసత్యసాయి ట్రస్ట్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2023-03-21 07:50:54

పూర్తి నాణ్యతో భూ రక్ష రీసర్వే చేపట్టాలి..

వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు - భూ రక్ష రీ సర్వేలో నాణ్యత ప్రమాణాలు పూర్తిగా పాటించి,జవాబుదారీతనంతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మండల స్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ నుండి 22 మండలాల మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రీ సర్వే, స్పందన అర్జీలు పరిష్కారం ,లంక భూములు సర్వే ఐదేళ్ల పాటు లీజుకు ఇవ్వడం, సరిహద్దురాళ్లు ఏర్పాటు రాగిజావ ప్రారంభోత్సవ సన్నద్ధత, ఇత్యాది అంశాల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రీసర్వేకు సంబంధించి అన్ని ప్రక్రియలు దశలవారీగా చేపట్టాలని మాన్యువల్ డేటాను డిజిటల్ డేటాగా అప్లోడ్ చేసేటప్పుడు పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. ప్రతి స్థాయిలోను రెవెన్యూ రికార్డుల వశీకరణ డిజిటలైజేషన్ అంశాలలో క్రాప్ చెక్కులు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించా రు.

 గ్రౌండ్ ట్రూతిoగు, గ్రౌండ్ వాల్యుయేషన్, వివిధ స్థాయిలలో నోటిఫికేషన్లు జారీ, గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లు గుర్తింపు సరిహద్దురాళ్లు ఏర్పాటు చేయడం సమీక్షించి పనులు వేగవంతం చేసేందుకు తగు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో రక్తహీనత నివారణ చర్యల్లో భాగంగా రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 21వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించను న్నారని రాగిజావ తయారీ పై విధి విధానాలను తెలిపే  వీడియోను  అన్ని పాఠశాలలకు పంపించడం జరిగిందన్నారు. ఆ ప్రకారం రాగిజావని సరఫరా చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశిం చారు. ప్రామాణిక అంశాలను తప్పనిసరిగా పాటిస్తూ రాగిజావ సరఫరా చేయాలని సూచించారు. ఎంపీడీవోలు తమ పరిధిలోని రెండు పాఠశాలల్లో రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని సూచించారు. లంక భూముల సర్వేను వేగవంతం చేసి అర్హులందరికీ ఐదు సంవత్సరాలపాటు లీజుకు ఇవ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర ఆదేశించారు. 

రైతుల భాగస్వామ్యం తో సరిహద్దు రాళ్లు ఏర్పాటు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. స్పందన జిల్లా ఆడిట్ బృందం కొన్ని అర్జీలు అసంపూర్తిగా పరిష్కరించాలని సూచించిందని అలా కాకుండా సంతృప్తి స్థాయిలో అర్జీల పరిష్కార సరళి నాణ్యతతో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లాకు సంబంధించి గత ఆరు మాసాలలో 194 అర్జీలు రాష్ట్రస్థాయిలో పెండింగ్లో ఉన్నాయని వీటిపై సంబంధించిన అధికారులు ప్రత్యేక చొరవ చూపి  పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ వెంకటేశ్వర్లు ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్  ఎస్ ఈ.లు సిహెచ్ వి కృష్ణారెడ్డి, కె చంటిబాబు గృహ నిర్మాణ సంస్థ పిడి ఎం బాబురావు, ఈఈ శ్రీనివాస్, పశుసంవర్ధకశాఖ జీడి డాక్టర్ ఏ జైపాల్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కే నాగేశ్వరరావు డీఈవో ఎం కమల కుమారి, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఏడి కె విశాలాక్షి ఐసిడిఎస్ జిల్లా అధికారిని జీవి సత్యవాణి, డిఆర్డిఏ పిడి వి శివశం కర్ ప్రసాద్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నా రు.

Amalapuram

2023-03-20 16:39:58

సీఎం వైఎస్ జగన్ ను కలిసిన ఎమ్మెల్సీ వంశీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని ఎమ్మెల్సీ సిహెచ్.వంశీక్రిష్ణ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్బంగా అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన సీఎంను కలిసిన వంశీ పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం వెంట రాష్ట్రపర్యాటకశాఖ మంత్రి ఆర్.కె.రోజా, పలువురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, తదితరులు ఉన్నారు.

Amaravati

2023-03-20 16:20:51

వసతి గ్రుహాలకు రిలయన్సు 55 ఇన్వర్టర్లు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న 33 సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, 22 వెనుకబడిన తరగ తుల సంక్షేమ వసతి గృహాలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ గాడిమొగ ఆధ్వర్యంలో సామాజిక బాధ్యత నిధులతో 55 ఇన్వర్టర్ లను తొలిదశలో సమ కూర్చారని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా తెలిపారు. ఈ మేరకు సోమవారం 55 ఇన్వర్టర్ యూనిట్లను సాంఘిక సంక్షేమ శాఖ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ వారి చేతుల మీదుగా అప్పగించారు రాబోయే మూడు రోజుల్లో ఆయా వసతి గృహాలలో ఏర్పాటు చేయాలని సంక్షేమ శాఖ ల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంఘిక సంక్షేమo,వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతిగృహాలలో మౌలిక సదుపాయాలు కల్పనకై దశల వారీగా వివిధ కంపెనీల కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.  ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు, రిలయన్స్ ఇండస్ట్రీస్ సి ఎస్ ఆర్ మేనేజర్ పి సుబ్రహ్మణ్యం, కలెక్టరేట్ పరిపాలనాధికారి కాశీ విశ్వేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారిని పి జ్యోతిలక్ష్మి దేవి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి టి వెంకటే శ్వర్లు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె లక్ష్మీనా రాయణ తదితరులు పాల్గొన్నారు.

Ravulapalem

2023-03-20 15:41:08

శిల్ప కళాశాల ప్రాంగణంలో ఎంపోరియం

శిల్పకళాశాలలో ఉన్న  ఉత్పత్తులను భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఎంపోరియం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా జేఈవో  సదా భార్గవి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆమె కాళాశాల ప్రాంగణంలోని పలు విభాగాలను సందర్శంచారు. జెఈఓ మాట్లాడుతూ, ఎంపోరియం ఏర్పాటు చేయడం వలన నిత్యం వేలాది మంది భక్తులు సందర్శిస్తారని చెప్పారు.. ఒరిస్సా,  కృష్ణా జిల్లా పెడన ప్రాంతాలకు వెళ్లి శిక్షణ పొందిన విద్యార్థులను ఆమె అభినందించారు అనంతరం విద్యార్థులు రూపొందించిన ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు.  ఈ కార్యక్రమంలో సిఈ  నాగేశ్వరరావు, ఎఫ్ ఏ అండ్ సిఏఓ  బాలాజీ, ఎస్ఈ   వెంకటేశ్వర్లు , డిఈవో  భాస్కర్ రెడ్డి,అదనపు ఆరోగ్యాధికారి డా. సునీల్, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీ కృష్ణ, ఆయుర్వేద ఆసుపత్రి సూపరిండెంట్ డా. రేణు దీక్షిత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2023-03-20 15:24:20

ఆయుర్వేద ఆసుపత్రిని ఆధునీకరించాలి

ఎస్వీ  ఆయుర్వేద ఆసుపత్రిని ఆధునీకరించి మరింత అభివృద్ధి చేయాలని టీటీడీ జేఈవో  సదా భార్గవి ఇంజనీరింగ్ అధికారులను  ఆదేశిం చారు. తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద కళాశాల, ఆసుపత్రిని సోమవారం జేఈవో అధికారులతో కలిసి పరిశీలించారు.  ఈ సందర్భంగా జేఈవో శల్య తంత్ర విభాగము, ద్రవ్య గుణ, రసశాస్త్ర సిద్ధాంత, పంచగవ్య చికిత్స పరిశోధనా కేంద్రం, చిన్నపిల్లల వార్డ్, లిచ్ థెరఫీ గది, కాయ చికిత్స వార్డు, పంచకర్మ వార్డు, సెంట్రల్ డ్రగ్ స్టోర్, డ్రెస్సింగ్ రూమ్, క్లీనికల్ ల్యాబ్, ఆపరేషన్ థియేటర్, రక్త పరీక్ష కేంద్రం, ఎక్సరే విభాగాలను పరిశీలించారు.  ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ వివిధ విభాగాలలో అవసరమైన ఫర్నీచర్ ,ఫ్లోరింగ్, ఇతర ఇంజనీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

 గ్రౌండ్ ఫ్లోర్ లో ఓపిడి విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో పచ్చదనాన్ని పెంపొందించాలని, పారిశుధ్యానికి  పెద్దపీట వేయాలని సూచించారు. టీటీడీ అందిస్తున్న సౌకర్యాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. సౌకర్యాలపై రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు.  తరువాత ఎస్వీ ఆయుర్వేద కళాశాలలోని తరగతి గదులు, మ్యూజియం, గ్రంథాలయం, ఇతర విభాగాలను పరిశీలించారు. ఆయుర్వేద వైద్య విద్యార్ధినుల హాస్టల్ భవనంలోని గదులను, డైనింగ్ హాల్, కిచెన్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్ధినులకు అందిస్తున్న వసతి, భోజన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు.

Tirupati

2023-03-20 15:20:51