1 ENS Live Breaking News

జి-20 సదస్సులతో ఏపీ రూపురేఖలు మారిపోతాయి

విశాఖ వేధికగా మార్చి 3, 4 తేదీల్లో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు అభివ్రుద్ధితో మారిపోనున్నాయ ని ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం విశాఖలోని మద్దెలపాలెం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లా డారు. జి-20 సదస్సుల వలన పెట్టుబడులు రావడంతోపాటు, ఎంఎస్ఎంఈలు మరింతగా అభివ్రుద్ధి చెందుతాయన్నారు. టిడిపి రాజకీయ లబ్దికోసం జి-20 సదస్సులపై బురదచల్లే కార్యక్రమం చేస్తుందని.. కానీ  గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ ద్వారా వచ్చే పెట్టుబడులు చూసి అదే పార్టీ నోరెళ్లబెడుతుందన్నారు. అంతేకాకుండా త్వరలోనే సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి విశాఖనుంచే పరిపాలన చేయనున్నారని చెప్పా రు. మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా ఏపీ ప్రభుత్వం సరికొత్త కార్యాచరణతో ముం దుకి వెళుతుందని చెప్పారు. కార్యక్రమంలో మహిళా నేత పేడాడ రమణికుమారి, వైఎస్సార్సీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-02-27 13:00:21

చిరుధాన్యాలతో ఆరోగ్యానికి ఎంతో మేలు

చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. చిరుధాన్యాల ఆహార పండుగ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ, వ్యవసాయ శాఖల  ఆధ్వర్యంలో జిల్లా పరిషత్  సమావేశమందిరం వద్ద చిరుధాన్యాల ఆహార ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తూ దారులకు, జిల్లా అధికారులకు చిరుధాన్యాలతో తయారు చేసిన జావను అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో చిరుధాన్యాల ప్రాధాన్యత మరింత పెరుగుతుందన్నారు. చిరుధాన్యాలలో పోషకాలను గుర్తించి అంతర్జాతీయ చిరుధాన్యాల దినోత్సవంగా ప్రకటించడం అభినందనీయమన్నారు. చిరు ధాన్యాలలో లభించే పోషకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయన్నారు. వాటి విలువను ప్రజలకు వివరించాడనికే ఇలాంటి కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2023-02-27 09:23:42

కేంద్ర నోటరీగా ఇమంది కూర్మారావు కొనసాగింపు

కేంద్ర ప్రభుత్వ నోటరీ గా సీనియర్ న్యాయవాది ఇమంది కూర్మారావును కొనసాగిస్తూ భారత న్యాయ మంత్రిత్వ శాఖ నుంచి ఉత్తర్వులు జారీచేసింది. విశాఖ గోపాలపట్నం కు చెందిన కూర్మారావు 1994 లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. సివిల్,క్రిమినల్ కేసులు వాదించడంలో  పేరు సంపాదించారు. న్యాయవాదిగా మంచి దిట్ట. విశాఖ బార్ అసోసియేషన్ కోశాధికారిగా గతంలో సేవలందించారు. 2008 నుంచీ కూర్మారావు కేంద్ర ప్రభుత్వ నోటరీ గా కొనసాగుతూ వచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19 నాటికి 15 ఏళ్ల పాటు నోటరీ గా ఉండగా, తాజాగా, ఆయనకు మరో అయిదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వ నోటరీ గా అధికారం కొనసాగిస్తూ భారత న్యాయ మంత్రిత్వ శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయి.  కేంద్ర ప్రభుత్వ నోటరీ కి గొప్ప విలువ ఉంటుంది. కుర్మారావు అటెస్టింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. క్లాసిఫైడ్ గెజిటెడ్ హోదా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఓత్ (OATH) కమిషనర్ హోదా కూడా ఉంటుంది.  ఇలా మరో ఐదేళ్ల పాటు కేంద్ర నోటరీ వుంటుంది.

Visakhapatnam

2023-02-26 17:01:47

జి-20 సదస్సులు విజయవంతం చేయాలి

విశాఖపట్నం జిల్లా అధికారులందరూ సమన్వయంతో పనిచేసి గ్లోబల్  ఇన్ వెస్టర్స్ సదస్సు-2023ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున అధికారులను ఆదేశించారు.  ఆదివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గ్లోబల్  ఇన్ వెస్టర్స్ సదస్సు-2023 ఏర్పాట్లు, అధికారులు చేపట్టవలసిన పనులపై పరిశ్రమల శాఖ కమిషనర్ డాక్టర్ జి. సృజన, జిల్లా జాయింట్ కలెక్టర్ కెయస్ విశ్వనాథన్, జివిఎంసి కమిషనర్ రాజాబాబులతో కలసి కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మార్చి 3, 4 తేదీలలో నిర్వహిస్తున్న గ్లోబల్  ఇన్ వెస్టర్స్ సదస్సు-2023కు నియమించిన నోడల్ అధికారులందరూ బాధ్యత యుతంగా పనిచేయాలన్నారు. పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు రానున్నట్లు పేర్కొన్నారు. ముఖేష్ అంబానీ, నవీన్ మిట్టల్ వంటి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, అంబాసిడర్లు, వ్యాపార వేత్తలు హాజరు కానున్నట్లు తెలిపారు.  

ఈ సందర్భంగా అధికారులకు కేటాయించిన విధులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ వివరించారు. సదస్సుకు సంబంధించి పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు.  ప్రతినిధులు బస చేయు హోటల్స్ వద్ద సహాయ కేంద్రాలు ఏర్పాటు గావించాలని చెప్పారు.  అతిధులు బస చేయు హోటల్స్ వద్ద, విమానాశ్రయం వద్ద,  ఎయు గ్రౌండ్ లోనూ  వైద్య ఆరోగ్య శాఖ నుండి మెడికల్ టీంలు, ఆంబులెన్స్, మందులు అందుబాటులో పక్కాగా ఉంచుకోవాలని ఆదేశించారు.  ఎంజిఎంలో సాంస్కృతిక కార్యక్రమాలను టూరిజం అధికారులు చూసుకోవాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ఎపిఇపిడిఎల్ ఎస్ఈని ఆదేశించారు. ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు. అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. 


     పరిశ్రమల శాఖ కమిషనర్ డాక్టర్ జి. సృజన మాట్లాడుతూ గ్లోబల్  ఇన్ వెస్టర్స్ సదస్సు-2023కు నవీన్ మిట్టల్, ముఖేష్ అంబానీ, తదితర ప్రముఖ వ్యాపార వేత్తలు, అంబాసిడర్లు, పారిశ్రామిక వేత్తలు హాజరుకానున్నట్లు చెప్పారు. అధికారులకు అప్పగించిన విధులను బాధ్యతతో నిర్వహించి సమ్మిట్ ను విజయవంతం చేయాలని తెలిపారు. సమ్మిట్ కు వచ్చే పారిశ్రామిక వేత్తలను విమానాశ్రయంలో రిసీవ్ చేసుకోవాలని, వారికి అవసరమైన వాహనాలు ఏర్పాట్లు గావించాలన్నారు.   ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ మైదానంలో ఏర్పాటు చేసిన గ్లోబల్  ఇన్ వెస్టర్స్ సదస్సు ఏర్పాట్లను వెన్యూ వైజ్ గా వివరించారు. ప్రారంభోత్సవంలో లేజర్ షో, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ పాట ఉంటుందని వివరించారు.  ఎంజిఎం గ్రౌండ్ లో సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు 2 రోజుల కార్యక్రమాలను ఆమె పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 

సమ్మిట్ కు వస్తున్న అతిధుల కోసం రిసెప్షన్, రవాణా, వసతి సౌకర్యాలపై చర్చించి పలు సూచనలు చేశారు. సమ్మిట్ కు వచ్చే ప్రముఖుల రాక, విమానాశ్రయంలో విమానాల రాకపోకలు అక్కడి ఏర్పాట్ల గురించి ఎయిర్ పోర్ట్ అధికారులతో చర్చించారు. ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.  మీడియా బ్రీఫింగ్ హాల్, తదితర ఏర్పాట్లు గూర్చి వివరించారు.సమ్మిట్ లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది అవసరమైన ఎంట్రి పాస్ లను తీసు కోవాలన్నారు.   సమ్మిట్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ఎంట్రి పాస్ లను అందించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఎపిఐఐసి జోనల్ మేనేజర్ సిహెచ్ రంగయ్య, పరిశ్రమల శాఖ అధికారులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.   

Visakhapatnam

2023-02-26 16:56:37

ఏలూరులో జిల్లాస్ధాయి స్పందన రద్దు..కలెక్టర్

ఏలూరు జిల్లాలో స్థానిక సంస్థల MLCఎన్నికల సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ నిర్వహిస్తున్న కారణంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి స్పందన రద్దు చేసినట్టు జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగాల  జిల్లాలోని అన్ని డివిజనల్ కార్యాలయాలు, మండల కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలల్లోను  'స్పందన' కార్యక్రమం ఫిబ్రవరి 27వ తేదీ సోమవారం యథావిధిగా నిర్వహిణ జరుగుతుందని అర్జీదారులు ఆయ మండలాలు, డివిజన్ కార్యాలయాల్లో జరిగే స్పందనోల తమ అర్జీలు అందజేసి సమస్యలు పరిష్కరించుకోవాలని కలెక్టర్ సూచించారు. అంతేకాకుండా జిల్లాలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా స్పందన జరుగుతుందని మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Eluru

2023-02-26 16:44:52

జి-20 సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

విశాఖలో మార్చి మూడు, నాలుగు తేదీలలో విశాఖలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు ఏర్పాట్లను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడి వాడ అమర్నాథ్, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజ న తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ, 25 దేశాల నుంచి పారిశ్రామిక ప్రముఖులు హాజరవుతు న్నా రని, ఈ సమ్మిట్ లో పాల్గొనేందుకు 7,500 మంది ఇప్పటివరకు రిజిస్టర్ చేయించుకున్నారని తెలిపారు. వీరందరికీ తగిన ఏర్పాటు చేసేందు కు చర్యలు తీసుకుంటున్నామని అని చెప్పారు. రాష్ట్రంలోని ఉన్న వనరులు, సరళీకృత ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని పారిశ్రామికవేత్తల కు వివరించడంతో పాటు, పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబట్టాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్టు జగన్ మోహన్ రెడ్డి ఆయన చెప్పారు. ఈ స మ్మిట్ ద్వారా రెండు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను రాబట్టాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు.

Visakhapatnam

2023-02-26 14:50:43

విమ్స్ లో కీళ్ల నొప్పులపై మెగా మెడికల్ క్యాంప్

విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సోమవారం మెగా ఆర్తో మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు ఒక ప్రకట నలో తెలిపారు.  ఈ మెడికల్ క్యాంపులో తీవ్ర కీళ్ల నొప్పులు, దీర్ఘకాలికి నొప్పులు ,నడుము నొప్పులు ,వృద్ధాప్యపు నొప్పులు లతో బాధపడు తున్న వారికి  ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. అలాగే అవసరమైన వారికి రూ.8000  విలువ చేసే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ (పి ఆర్ పి) ఉచితంగా  రోగులకు చేస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ మెడికల్ క్యాంపును విమ్స్ పోర్టుకోలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కీళ్లు నొప్పులు ఉన్నవారు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి విమ్స్ డైరెక్టర్ మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో కోరారు.
                                                                                                                                                

Visakhapatnam

2023-02-26 14:25:27

నేటి తరానికి అర్థమయ్యేలా టీటీడీ ప్రచురణలు

సనాతన హిందూధర్మం, భారతీయ సంస్కృతికి సంబంధించి టీటీడీ ప్రచురిస్తున్న పుస్తకాలు నేటితరం వారికి కూడా సులువుగా అర్థమ య్యేలా ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథరెడ్డి సూచించారు. టీటీడీ ప్రచురణల విభాగం కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం ఆయన  జేఈవో సదా భార్గవి తో పాటు పలువురు ప్రముఖ సాహితీవేత్తలు,పండితులతో సమావేశం నిర్వహించారు. వివిధ భాషల్లో టీటీడీ ప్రచురిస్తున్న పురాణాలు, గ్రంథాలు, హిందూ ధర్మ ప్రచారానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని మంత్రి అభినందించారు. ఇంతటి గొప్ప పని టీటీడీ మాత్రమే చేయగలుగుతుందని అన్నారు. ఇలాంటి గ్రంథాలలోని భాషను సరళీకరించి ప్రతి ఒక్కరికీ సులువుగా అర్థమయ్యేలా ప్రచురించాలని కోరారు. దీనివల్ల మరింత ఎక్కువ ప్రయోజనం లభిస్తుందన్నారు. డిజైన్, కంటెంట్  ప్రజెంటేషన్ , అర్థ,తాత్పర్యాలు చెడిపోకుండా విషయాన్ని వాడుక భాషలో చెప్పడం వల్ల ప్రైవేట్ ప్రచురణ కర్తలకు పోటీగా టీటీడీ ప్రచురణలు విశేష ఆదరణ పొందుతాయని రాజేంద్ర నాథ రెడ్డి సూచించారు. 

ముద్రణలో కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని ఆయన చెప్పారు. అనేక మంది ప్రముఖ సాహితీ వేత్తలు, పండితులు ఈ అంశంలో టీటీడీకి స్వచ్ఛందంగా సహకరించడానికి ముందుకు వచ్చారని మంత్రి తెలిపారు. టీటీడీకి వారి సలహాలు, సూచనలు ఇస్తారని, వీటిలో ఆచరణ సాధ్యమైనవి అమలు చేసి టీటీడీ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమ న్నారు.  ఈ సందర్భంగా పలువురు పండితులు సాహితీవేత్తలు, అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. జేఈవో సదా భార్గవి మాట్లాడుతూ, టీటీడీ ప్రచురణలను మరింతగా జనబాహుళ్యంలోకి, ముఖ్యంగా యువతకు చేరువ చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. శ్రీవారి కళ్యాణోత్సవాలు, వైభవోత్సవాలు జరిగే ప్రాంగణాల్లో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని,  వర్క్ షాప్ లు కూడా నిర్వహిస్తామని తెలిపారు.

 మంత్రి సూచించిన విధంగా విమానాశ్రయాల్లోని స్టాల్స్ లో టీటీడీ ప్రచురణలు అందుబాటులో ఉంచే ఆలోచన చేస్తామని చెప్పారు. 1200 దాకా పుస్తకాలు వెబ్సైట్ లో అందుబాటులో ఉంచామని, ఆడియో బుక్స్ కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చే ప్రయత్నం జరుగుతోందన్నారు.  ప్రముఖ సాహితీవేత్తలు, పండితులు  లక్ష్మీనారాయణ, డాక్టర్ సుధ, పాతూరి నాగరాజు, సత్యమూర్తి, సుబ్రమణ్య శర్మ, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు  విభీషణ శర్మ,  సప్తగిరి పత్రిక ప్రధాన సంపాదకులు రాధా రమణ, సంపాదకులు  చొక్కలింగం, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి  రామరాజు, సప్తగిరి ఉపసంపాదకులు  నరసింహాచార్య పాల్గొన్నారు.    టీటీడీ వివిధ భాషల్లో ప్రచురించిన గ్రంధాలు, పుస్తకాలను ఈ సందర్భంగా  పరిశీలించారు.                                                                                                                                                                                       

Tirumala

2023-02-26 12:30:28

ఓటమి భయంతో అధికారపార్టీ దిగజారుడు చర్యలు

ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్సార్సీపీ ఓటమి భయంతో దిగజారుడు పద్ధతులు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతు న్నదని  ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి, ఎ.అజ శర్మ ఆరోపించారు. ఆదివారం విశాఖలోని ఆయన మీడియాతో మాట్లాడారు. 250 కు పైగా ప్రజా సంఘాల మద్దత్తుతో, పిడిఎఫ్ అభ్యర్ధిగా  డాక్టర్ కోరెడ్ల రమాప్రభ పోటీ చేస్తున్నారని.. అయితే అదే పేరు గల వేరే అభ్యర్ధితో వైసిపి ఆఖరి రోజున నామినేషన్  వేయించిందని అన్నారు. ఓటర్లను గందరగోళ పరచడానికే ఈ విధం చేయడం అధికారపార్టీ దిగజారుడు చర్యకు నిరదర్శనమన్నారు. ఇటీవలే ఏయూ వీసి అనుబంధ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలతో దశపల్లా హోటల్ లో సమావేశం నిర్వహిం చి ఓటర్లను ప్రలోభపెట్టారన్న..వీరి కుతంత్రాలను తిప్పికొట్టి, వివేకవంతులయిన ఉత్తరాంధ్ర పట్టభద్రులు,  మన ప్రాంత  ప్రజల వాణిని చట్ట సభలో సమర్ధవంతంగా  వినిపించగలిగే డాక్టర్ కోరెడ్ల రమాప్రభను గెలిపించాలన్నారు.

Visakhapatnam

2023-02-26 06:04:03

విశ్వనాధ్, వాణీజయరాం సేవలు చిరస్మరణీయం

తెలుగునాట కళాతపస్వీ కె.విశ్వనాధ్, వాణిజయరాం అందించిన సేవలు చిరస్మరణీయమని పలువురు ప్రముఖులు కొనియాడారు. తెలుగు చలనచిత్ర రంగం ద్వారా ప్రజల గుండెల్లో వారు శాశ్వతంగా గుర్తిండిపోతారన్నారు. ఈ మేరకు శనివారం రాత్రి అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏపి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కె.విశ్వనాధ్, వాణిజయరామ్ ల పేరిట స్వరనీరాజనం కార్యక్రమం నిర్వహించారు. పైడా విద్యాసం స్థల అధినేత పైడా కృష్ణప్రసాద్, ఏపీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు దాడి సత్యనారాయణ,  సినీనటుడు ప్రస న్నకుమార్, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు, మహ్మద్ ఖాన్, యాద్ కుమార్, రవితేజ, సంఘం కార్యదర్శి కృష్ణ కిషోర్ తదితరులంతా విశ్వనాద్, వాణిజయరాంల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అసోసియే షన్ కార్యదర్శి కిషోర్, ఆర్గనైజర్ అప్పారావు, విశాఖ కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు జనార్ధన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శివజ్యోతి, రాథో గణేష్ , రమేష్ తో పాటు పెద్ద ఎత్తున కళాకారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-02-25 16:19:09

అవినీతి రికార్డు అసిస్టెంటు అనిల్ ను ఇంటికి పంపాం

అన్నవరం శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం వ్రత టిక్కెట్ల అమ్మకాల్లో గోల్ మాల్ చేసిన అవినీతి రికార్డు అసిస్టెంట్ టి.అనిల్ కుమార్ ను రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్టు ఈఓ మూర్తి తెలియజేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఈఎన్ఎస్ ప్రతినిధితో చరవాణిలో మాట్లాడారు. వ్రతటిక్కె ట్లలో(రూ.800) జరిగిన అవినీతిపై విచారణ చేపట్టి, ఆనివేదికను కమిషనర్ కు పంపామని చెప్పారు. దీనితో ఆయన ఆదేశాల మేరకు సదరు ఉద్యోగిపై వేటు వేసినట్టు ఆయన వివరించారు. అంతేకాకుండా దేవస్థానంలో ఏ విభాగంలో అవినీతి జరిగినా సహించేది లేదని, ఏ స్థాయి ఉద్యోగిపైనైనా అవినీతి ఆరోపణలు, లిఖిత పూర్వక ఫిర్యా దులు వస్తే తక్షణమే విచారణచేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. దేవస్థానంలోని అన్ని విభాగాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా మీడియా ద్రుష్టికి అవినీతి వ్యవహారాలు నేరుగా తనకు తెలియజేవచ్చునని స్పష్టం చేశారు.

Annavaram

2023-02-25 15:42:11

ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏర్పాట్లు పక్కగా ఉండాలి

విశాఖలో వచ్చే నెల 16వ తేదిన నిర్వహించబోయే ఎం .ఎల్.సి ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏర్పాట్లలో  ఎటువంటి  లోటు పాట్లు జరగకుండా చూడాలని  అధికారులను ఎం.ఎల్.సి. ఎన్నికల  పరిశీలకులు సిద్ధార్ధ్ జైన్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం  స్థానిక స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం ను ఎం.ఎల్.సి. ఎన్నికల పరిశీలకులు సిద్ధార్ధ్ జైన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్ట్రాంగ్ రూమ్ లను, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని  తనిఖీ చేసారు. అదే విదంగా రిసెప్సన్  కౌంటర్లను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు సమయంలో  చేపడుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని,  పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో  రెవెన్యూ డివిజనల్ అధికారులు హుసేన్ సాహేబ్, భాస్కర్ రెడ్డి, స్పెషల్ డిప్యూటి కలెక్టర్ వెంకటేశ్వర్లు,  సీతమ్మ ధార్ తాహసిల్దార్ శ్యామ్ ప్రసాద్, జి.వి.ఎం.సి సిబ్బందిపాల్గొన్నారు.

Visakhapatnam

2023-02-25 14:24:06

సింఘానియా ఎడ్యుకేషన్ ట్రస్ట్‌తో ఎంఓయు

తిరుమలలో టిటిడి ఆధ్వర్యంలో నడిచే శ్రీ వేంకటేశ్వర ప్రాథమిక, ఉన్నత పాఠశాల శనివారం సాయంత్రం దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన  సులోచనా దేవి సింఘానియా స్కూల్ ట్రస్ట్‌తో అవగాహన ఒప్పందం(ఎంఓయు) కుదుర్చుకుంది. తిరుమలలోని బంగ్లాలో టిటిడి ఈవో ఎవి ధర్మారెడ్డి సమక్షంలో దేవస్థానం విద్యాసంస్థల తరఫున డిఇవో డా. భాస్కర్ రెడ్డి, సింఘానియా ఎడ్యుకేషన్ ట్రస్ట్ గౌరవ కార్యదర్శి  అరుణ్ మహేష్ అగర్వాల్‌తో పాటు సింఘానియా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్తి రేవతి శ్రీనివాసన్ మధ్య ఈ ఒప్పందం జరిగింది. 

       ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ, ఈ ఒప్పందం ద్వారా విద్యా ప్రమాణాలు పెరిగి భారతదేశంలోని ఉన్నతమైన పాఠశాలగా అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. డిజిటల్ లెర్నింగ్, బోధనా పద్ధతులు, విశ్లేషణా సామర్థ్యం తదితర అంశాల్లో ఉపాధ్యాయులకు అత్యుత్తమ శిక్షణ ఇవ్వడం ద్వారా విద్య నాణ్యతను మెరుగుపరచాలని సింఘానియా ఎడ్యుకేషన్ గ్రూప్ ప్రతినిధులను ఆయన కోరారు. అవసరమైన పూర్తి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, విద్యా బోధనాంశాలపై దృష్టి పెట్టాలని, తద్వారా దేశంలోనే ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దవచ్చని అన్నారు.

       శిక్షణ పొందిన అధ్యాపకులతో గుణాత్మక విద్యను అందించేందుకు తమవంతు కృషి చేస్తామని సింఘానియా ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రతినిధులు హామీ ఇచ్చారు. లక్ష మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే రేమాండ్ గ్రూప్ సిఎండి గౌతమ్ సింఘానియా జీవిత ఆశయమని, ఇందులో భాగంగా టిటిడితో ఒప్పందం కుదుర్చుకోవడాన్ని గొప్ప అవకాశంగా భావిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు  కృష్ణమూర్తి, విద్యా విభాగం ఏఈవో ఈశ్వరయ్య, సీనియర్ అసిస్టెంట్  మమత పాల్గొన్నారు. 

Tirumala

2023-02-25 14:15:32

పంచగవ్య ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన

వినియోగ దారుల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది కలిగించని పంచగవ్య ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆ రంగంలోని నిపుణులతో  త్వరలో వర్క్ షాప్ ఏర్పాటు చేయాలని టీటీడీ జేఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు.  తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శనివారం ఆమె  అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా జేఈవో మాట్లాడుతూ, పంచగవ్య ఉత్పత్తుల్లో రసాయనాలు ఉపయోగించడం లేదన్నారు. వీటివల్ల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగమనే విషయంపై అర నిముషం , నిముషం నిడివిగల కాన్సప్ట్ ప్రకటనలు తయారు చేయాలన్నారు. ప్రసార,ప్రచార సాధనాలు,సోషల్ మీడియా ద్వారా  ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు.  రోజూ లక్షలాది మంది భక్తులు తిరుమల ,తిరుపతికి వస్తున్నందువల్ల టీటీడీ సత్రాలు , రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ , వివిధ ఆలయాల వద్ద హోర్డింగులు ఏర్పాటుచేసి పంచగవ్య ఉత్పత్తుల వల్ల కలిగే ఉపయోగాలపై అవగాహనకల్పించాలన్నారు .
పంచగవ్య సోపులు,షాంపులు, పళ్ళపొడి, ముక్కులో వేసుకునే చుక్కలు తదితర ఉత్పత్తుల్లో డిమాండ్ ఉన్న వాటిని గుర్తించి వాటి ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని  సదా భార్గవి అధికారులకు సూచించారు. ఎస్వీ బీసీ, టీటీడీ వెబ్సైట్ లో కూడా ఇందుకు సంబంధించి ప్రచారం చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు.  టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో తయారు చేస్తున్న అగరబత్తులకు విశేష స్పందన వస్తోందని ఆమె వివరించారు. త్వరలోనే రెండవ యూనిట్ ఏర్పాటు చేసి ఎక్కువ మందికి అగరబత్తులు అందుబాటులో ఉంచే ఏర్పాట్లు  జరుగుతున్నాయన్నారు. ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో తయారు చేస్తున్న దేవతా మూర్తుల ఫొటోలు,కీచైన్లు, పేపర్ వెయిట్లు తదితర ఉత్పత్తుల గురించి కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళేలా ప్రచారం చేయాలన్నారు.

    ఎస్వీ ఆయర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీ కృష్ణ, గోసంరక్షణ శాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ రెడ్డి, డిప్యూటీ ఈవో  గుణభూషణ రెడ్డి , అదనపు ఎఫ్ ఎసి ఎవో  శ్రీ రవిప్రసాద్,ఐటి  జనరల్ మేనేజర్  సందీప్ ,ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి  రామరాజు,పంచగవ్య ఉత్పత్తుల విభాగం ఎఈవో  శ్రీనివాస్ , డాక్టర్ వై ఎస్ ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ నాగరాజు పాల్గొన్నారు.

Tirupati

2023-02-25 14:11:59

శ్రీనివాససేతు 3వదశ పనులు త్వరితగతిన పూర్తిచేయాలి

శ్రీనివాస సేతు మూడవ దశలో నిర్మాణంలో ఉన్న దాదాపు 6 స్టీల్ గర్డర్ లను రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుని ఏప్రిల్ 15వ తేదీ లోపు  అమర్చే విధంగా చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో  ఎవి ధర్మారెడ్డి ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలో శనివారం తిరుపతి మున్సిపల్ కమిషనర్ కుమారి అనుపమ అంజలితో కలిసి ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, రామానుజ సర్కిల్ నుండి రేణిగుంట వైపు, తిరుచానూరు మార్కెటింగ్ యార్డ్ వరకు ఉన్న శ్రీనివాస సేతు పనులను మార్చి 15వ తేదీ లోపు పూర్తి చేయాలన్నారు. 

     శ్రీనివాస సేతు పనులు ఇప్పటికే 89 శాతం  పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు కూడా  మే 15వ తేదీ లోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.   అదేవిధంగా పాదాచారులు నడిచేందుకు అనువుగా పేవ్ మెంట్ , కాలువలను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. సుబ్బలక్ష్మి సర్కిల్ వద్ద  పచ్చదనం పెంపొందించాలని,  అవసరమైన చోట్ల పెయింటింగు, తదితర పనులపై ఈవో సమీక్షించారు.   ఈ సమావేశంలో జేఈవోలు సదా భార్గవి,  వీరబ్రహ్మం, ఎఫ్ఎ అండ్ సీ ఏవో  బాలాజీ, సిఇ  నాగేశ్వరరావు,  మున్సిపల్ ఎస్ఇ   మోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2023-02-25 14:00:22