1 ENS Live Breaking News

రూ.100 కోట్లతో నగర సుందరీకరణ పనులు

అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సును విజయవంతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్. ఏ మల్లికార్జున స్పష్టం చేశారు. రు.100 కోట్లతో పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దుతున్నామన్నారు.  ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో చేస్తున్న ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిఐఎస్ సదస్సుకు 26 దేశాల చెందిన 30 ఉన్నత పరిశ్రమల నుండి  8 వేల నుండి 9 వేల వరకు డెలిగేట్స్ హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు వివరించారు. సదస్సు నిర్వహించడానికి 5 హాల్స్ ఏర్పాటు చేశామన్నారు. మెయిన్ హాలు, రెక్టిఫికేషన్ హాలు, రిజిస్ట్రేషన్ హాలు, సీఎంఓకు ప్రత్యేకంగా ఒక హాల్ ఏర్పాటు చేశామన్నారు.

 1వ తేదీ సాయంత్రానికే ఏర్పాట్లు పూర్తి చేసి, రెండో తేదీన విద్యుత్ శాఖ ,రహదారులు భవనాలు, అగ్నిమాపక శాఖ అనుమతులతో డ్రైరన్ నిర్వహిస్తామని చెప్పారు. డెలిగేట్స్ కోసం 400 కార్లు, 500  రూమ్స్ ఏర్పాటు చేశామన్నారు. విశాఖపట్నం విశిష్టత, గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా బ్రోచర్లు ముద్రించామని, పర్యాటక ప్రాంతాల్లో గైడ్స్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎ.యు. ప్రాంగణంలో మూడు హెలిప్యాడ్స్ ఏర్పాటు చేయడమైనదని, సదస్సుకు వచ్చే వారికి విమానాశ్రయంలో ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.  ఈ కార్యక్రమంలో సిపి శ్రీకాంత్, జిల్లా జాయింట్ కలెక్టర్ కెయస్ విశ్వనాథన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-03-01 13:05:45

జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు

ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి ఈనెల 16 తేదీన జరిగే ఎన్నికలకు జిల్లాలో ప్రతిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు తెలిపారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, బందోబస్త్ ఏర్పాట్లపై బుధవారం జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, పోలీసు అధికారులతో రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  ముఖేష్ కుమార్ మీనా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్లు చేయాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.  జిల్లాలో 49 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వాటిలో 44 రెగ్యులర్ కాగా 5 ఆక్సిలరీ కేంద్రాలని తెలిపారు. 

28 ప్రదేశాల్లో ఏర్పాటు చేశామని 21 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని చెప్పారు. అనకాపల్లి లో గల 194 పీఎస్ లో అత్యధికంగా 1393 మంది ఓటర్లు ఉండగా పరవాడ ఉక్కునగరంలో ఉన్న 203 పీఎస్ అత్యల్పంగా 85 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు.  జిల్లాలో 42,714 ఉన్నారని వీరిలో 28,370 మంది పురుషులు 14, 338 మంది స్త్రీలు కాగా ఇతరులు 6గురు ఉన్నారని వివరించారు. అనకాపల్లి నుండి కలెక్టర్ తో పాటు పాల్గొన్న పోలీస్ సూపరింటెండెంట్ గౌతమి సాలి  మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును గూర్చి తెలిపారు.  సమస్యాత్మక కేంద్రాల పట్ల ప్రత్యేక దృష్టి సారించినట్లు, చేపట్టిన ఇతర ముందస్తు భద్రతా చర్యలను గూర్చి చెప్పారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సహాయ రిటర్నింగ్ అధికారి, డిఆర్ఓ పి. వెంకటరమణ, సిపిఓ జి.రామారావు, జి ఎస్ వి ఎస్ అధికారి మంజులవాణి తదితరులు పాల్గొన్నారు.

Anakapalle

2023-03-01 12:16:58

ప.గో.జి. శాశ్వత లోక్ అదాలత్ చైర్ పర్శన్ మేరీగ్రేస్

పశ్చిమగోదావరి జిల్లా శాశ్వత లోక్ అదాలత్ చైర్పర్సన్ గా ఈరోజు మేరీ గ్రేస్ కుమారి బాధ్యతలు చేపట్టారు. గతంలో ఫోక్సో కోర్టు న్యాయ మూర్తిగా విశేష సేవలు అందించి, పదవి విరమణ చేసిన మేరీ గ్రేస్ కుమారిని తిరిగి శాశ్వత లోక్ అదాలత్ చైర్ పర్సన్ గా నియమించడం పట్ల పలువురు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాధులు ఆమెకు అభినందనలు తెలియజేశారు.   మేరీ గ్రేస్ ఆధ్వర్యంలో శాశ్వత లోక్ అదాలత్ పశ్చిమగోదావరి జిల్లాలో చక్కటి సేవలు అందజేస్తుందని న్యాయవాదులు గుంటూరు బాబు గణేష్, గుంటూరు చంద్రమౌళి ఆశాభావం వ్యక్తం చేశారు. లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ చీఫ్ మునీశ్వరరావు,  డిప్యూటీ చీఫ్ కౌన్సిల్ రామ్మోహన్ రావు, అసిస్టెంట్ కౌన్సిల్ టి మధు లు తదితరులు  పాల్గొన్నారు.

West Godavari

2023-03-01 11:07:17

సమర్ధవంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించాలి

పట్టభద్ర, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయి శిక్షణ పొందాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పోలింగ్ / సహాయ పోలింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పట్టభద్ర, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పై నిర్వహించిన మొదటి విడత శిక్షణా తరగతుల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పట్టభద్ర, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి చిన్న పొరపాట్లకు తావివ్వకుండా పూర్తిస్థాయి శిక్షణ పొంది సమర్థవంతంగా నిర్వహించాలని పోలింగ్ / సహాయ పోలింగ్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల విధులు సమర్ధవంతగా నిర్వహించాలన్నారు.

పరీక్షలకు ఎలా సిద్ధం అవుతామో అలానే ఎలక్షన్ సిబ్బంది ఎలక్షన్ నిర్వాహణ పుస్తకాలను క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకోవాలన్నారు. కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించాలని, ఎన్నికల విధులను అతిక్రమించవద్దని  పోలింగ్ అధికారులకు సిబ్బందికి సూచించారు. విధుల నిర్వాహణలో అనుమానాలు  ఉన్నట్లయితే శిక్షణ తరగతులలో అడిగి   నివృత్తి చేసుకోవాళ్లన్నారు. ఎన్నికలు యొక్క విధి విధానాలు, ఎన్నికల పత్రాలు నిర్వాహణ, బ్యాలెట్ బాక్స్ ఎలా ఓపెన్ చెయ్యాలి , ఎన్నికల అనంతరం ఎలా సీల్ వెయ్యాలి తదితర అంశాల గురించి గార తెహశీల్దార్ సుధాసాగర పోలింగ్ విధులలో పాల్గొనే సిబ్బందికి స్లయిడ్ షో ద్వారా వివరించారు.

జిల్లాలో పట్టభద్రలకు సంబంధించి 59 పోలింగ్ కేంద్రాలు, స్థానిక సంస్థల సంబంధించి 04 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఇందుకు సంబంధించి పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అనుమానాలు ఉన్న మాస్టర్ ట్రైనర్లచే సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సీరియస్ గా తీసుకొని బ్యాలెట్ బాక్స్, బ్యాలెట్ పేపర్, ఇతర పోలింగ్ మెటీరియల్ తో పాటు సదరు పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన పొంది బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శక సూత్రాల అవగాహన  చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. 

పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల అధికారులపై ఎలాంటి ఫిర్యాదు వచ్చిన సంబంధిత అధికారులపై తీవ్ర కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, డి ఆర్ ఓ రాజేశ్వరి, కొవ్వాడ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మురళీకృష్ణ,  అధికారులు, పోలింగ్, సహాయ పోలింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2023-03-01 10:41:50

MLC ఎన్నికలకు 1082 మంది పోలీసు సిబ్బంది

విశాఖపట్నంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 1082 మంది పోలీసు సిబ్బందిని ఎన్నికల విధుల కోసం మోహరించినట్టు పోలీస్ కమిష నర్ శ్రీకాంత్ తెలియజేశారు. బుధవారం ఆయన విశాఖ కలెక్టరేట్ లో మీడియాతో మాట్లాడారు. పోలింగ్ రోజు 840 మందిని  వినియోగిస్తున్నా మన్న ఆయన పోలింగ్ లొకేషన్లు 43 ప్రాంతాలు, 112 పోలింగ్ స్టేషన్లతో పాటు 15 రూట్ మొబైల్ టీమ్ లను కూడా ఏర్పాటు చేశామన్నా రు. ప్రత్యేక దళాలు, జిల్లా స్ట్రైకింగ్ ఫోర్సును కూడా అందుబాటులో ఉంచామన్నారు. ఎన్నికలు పూర్తయిన తరువాత స్ట్రాంగ్ రూమ్ వద్ద సెం ట్రల్ పారామిలటరీ బలగాలను ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా కౌంటింగ్ డే రోజు అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీసు బలగాను  మోహరించనున్నట్టు చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పోలీసు బందో బస్తును ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్టు చేసినట్టు సిటీ పోలీస్ కమిషనర్ వివరించారు.

Visakhapatnam

2023-03-01 10:24:06

గృహ నిర్మాణ లక్ష్యాలను అధికారులు పూర్తిచేయాలి

గృహ నిర్మాణ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. మండల అధికారులతో బుధ జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణ పనులు వేగవంతం కావాలని ఆయన అన్నారు. ఒక దశ నుండి మరో దశకు ప్రగతి త్వరితగతిన ఉండాలని ఆయన ఆదేశించారు. నిర్మాణాలకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఉండాలని ఆయన స్పష్టం చేశారు. విధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఇంజినీరింగ్ సహాయకులతో పక్కాగా సమీక్షించాలని ఆయన చెప్పారు. సామగ్రి అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు. గృహ నిర్మాణాలలో సంతృప్తి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు గృహ రుణాలు ఇవ్వడం జరుగుతోందని, లక్ష్యాలు పూర్తి కావాలని ఆయన ఆదేశించారు.

 సొంత స్థలాల్లో నిర్మాణాలపై దృష్టి సారించాలని అన్నారు. సొంత స్థలాల్లో అనర్హత లేని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమోదు చేయరాదని ఆయన స్పష్టం చేశారు. సొంత స్థలాల్లో రిజిస్ట్రేషన్ లకు డిమాండ్ సర్వే చేయాలని సూచించారు. ఉపాధి హామీ పథకంలో రోజుకు కనీసం లక్ష మంది వేతనదారులు పనులు చేయాలన్నారు. మేట్, క్షేత్ర సహాయకులు వేతనదారులను సమాయత్తం చేయాలని ఆయన ఆదేశించారు. పాచిపెంట, గరుగుబిల్లి, పార్వతీపురం మండలాలు లక్ష్యాల సాధనలో మెరుగు పడాలని ఆయన సూచించారు. ప్రధాన మంత్రి జన ఔషది కార్యక్రమంలో నమోదుకు రానున్న మూడు రోజులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సిబ్బంది సహకారాన్ని పొందాలని ఆయన స్పష్టం చేశారు. జన ఔషది కార్యక్రమంలో నమోదుకాని వారికి ఆరోగ్య శ్రీ లో వైద్య సేవలు పొందుటకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన వివరించారు. రీ సర్వేలో భాగంగా సర్వే, సబ్ డివిజన్ విధిగా జరగాలని ఆయన ఆదేశించారు. 

సంయుక్త కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ రీ సర్వే వేగవంతం చేయాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా పంచాయతి రాజ్ ఇంజినీరింగ్ అధికారి డా.ఎం.వి.ఆర్. కృష్ణా జి, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.రఘురాం, జిల్లా విద్యాశాఖ అధికారి డా.ఎస్.డి.వి.రమణ, జిల్లా గ్రామ పంచాయితీ అధికారి బలివాడ సత్యనారాయణ, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారి జె. శాంతీశ్వర రావు, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె. విజయ గౌరి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామచంద్ర రావు, ఐటిడిఎ ఏపిఓ సురేష్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2023-03-01 07:29:11

పోలింగ్ కేంద్రాల్లో మౌళిక వసతులు కల్పించాలి

ఉత్త‌రాంధ్ర ప‌ట్ట‌భ‌ద్రుల శాస‌న‌మండ‌లి స్థానం కోసం ఈ నెల 13న జ‌ర‌గ‌నున్నఎన్నికల‌  ప్ర‌క్రియ‌లో భాగంగా, ప‌ట్ట‌ణంలోని పోలింగ్ కేంద్రా ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి బుధ‌వారం సందర్శించారు. జిల్లా ఎస్‌పి దీపికా పాటిల్‌తో క‌లిసి, ఆమె ఏర్పాట్ల‌ను త‌నిఖీ చేశారు. జోన‌ల్‌, పోలింగ్ అధికారుల‌కు ప‌లు ఆదేశాల‌ను జారీ చేశారు. విజ‌య‌న‌గ‌రం కంటోన్మెంటులోని మున్సిప‌ల్ ఉన్న‌త పాఠ‌శాల‌, మ‌హారాజా క‌ళాశాల‌, క‌స్పా మున్సిప‌ల్ ఉన్న‌త పాఠ‌శాల‌, మ‌హారాజా సంస్కృత ఉన్న‌త పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించి, పోలింగ్ కేంద్రాల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ, అన్ని పోలింగ్ కేంద్రాల్లో త్రాగునీరు త‌దిత‌ర క‌నీస మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించాల‌ని ఆదేశించారు. క్యూలైన్ల ప్ర‌క్క‌నే కుండ‌ల‌తో నీటిని ఉంచాల‌న్నారు. కేంద్రాల్లో లైట్లు, ఫ్యాన్లు అన్నీ ప‌నిచేసేలా చూడాల‌న్నారు. ఎండ తీవ్రంగా ఉండటం వ‌ల్ల‌, నీడ‌కోసం షామియానాలు వేయాల‌న్నారు. 

ఓట‌ర్ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు  క్యూలైన్ల ప్ర‌క్కన న‌మూనా బ్యాలెట్ ప‌త్రాల‌ను అంటించాల‌ని సూచించారు. ప్ర‌తీ పోలింగ్ బూత్‌కు వేర్వేరు క్యూలైన్ల‌ను ఉండాల‌ని, అందుకు త‌గిన‌ట్టుగా బ్యారికేడ్లు ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. ఓట‌ర్లు ఇబ్బంది ప‌డ‌కుండా, ఓటింగ్ ప్ర‌క్రియ వేగంగా జ‌రిగేందుకు అవ‌స‌మైన అన్నిర‌కాల చ‌ర్య‌ల‌నూ తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల‌వ‌ద్ద ప‌టిష్ట‌మైన బందోబ‌స్తును ఏర్పాటు చేస్తున్న‌ట్లు ఎస్‌పి దీపికా పాటిల్ చెప్పారు.

గ్రాడ్యుయేట్ ఓట‌ర్ల‌కు ఓట‌ర్ స్లిప్పుల పంపిణీ  త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని, బిఎల్ఓల‌ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ప్ర‌తీ పోలింగ్ కేంద్రంలో, ఓట‌ర్ స్లిప్పుల పంపిణీపై బిఎల్ఓల‌ను ఆరా తీశారు. త‌క్కువ స్లిప్పుల‌ను పంపిణీ చేసిన‌వారిపై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. పంపిణీ శత‌శాతం జ‌ర‌గాల‌ని, స్వ‌యంగా వెళ్లి స్లిప్పుల‌ను ఓట‌ర్ల‌కు అంద‌జేయాల‌ని సూచించారు. ఓట‌ర్ స్లిప్పుల పంపిణీలో, ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో వ‌లంటీర్ల‌ను ఎట్టిప‌రిస్థితిలోనూ వినియోగించ‌రాద‌ని క‌లెక్ట‌ర్‌ స్ప‌ష్టం చేశారు.  ఈ ప‌ర్య‌ట‌న‌లో  జోన‌ల్ ఎన్నిక‌ల అధికారులు పిఎన్‌వి ల‌క్ష్మీనారాయ‌ణ‌, బి.రాంగోపాల్‌, విజ‌య‌న‌గ‌రం డిఎస్‌పి శ్రీ‌నివాస‌రావు, తాశిల్దార్ బంగార్రాజు, ఇత‌ర రెవెన్యూ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2023-03-01 07:24:38

జి-20 సదస్సు ఏర్పాట్లను పరిశీలించి మంత్రి

విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో వచ్చేనెల మూడు, నాలుగు తేదీలలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఏర్పాట్లను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదస్సు ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని రెండవ తేదీ నాటికి ప్రాంగణం మొత్తం అందుబాటులోకి వస్తుందని తెలియజేశారు. మంత్రి అమర్నాథ్ వెంట పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన తదితరులు ఉన్నారు.

Visakhapatnam

2023-02-28 13:52:48

రాష్ట్ర ప్రగతికి దోహదపడనున్న పారిశ్రామిక సదస్సు

విశాఖపట్నం లో వచ్చేనెల 3, 4  తేదీలలో విశాఖలో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు రాష్ట్ర ప్రగతిని మరింత ముందుకు తీసుకు వెళ్లబోతుందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు.  మంగళవారం విశాఖలోని నోవాటెల్ హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పారిశ్రామిక అవకాశాలు, సహజ వనరులు, మౌలిక సదుపాయాలు, రాష్ట్రంలోని పరిశ్రమల ప్రగతిని సదస్సులో పారిశ్రామికవేత్తలకు విస్తారంగా చాటి చెప్పనున్నామని తెలిపారు. దేశంలోనే ఎనిమిదవ అతిపెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో 974 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం ఉందని దీనిని పూర్తిస్థాయిలో వినియోగించుకోబోతున్నామని ఆయన తెలియజేశారు.  మారీటైం బోర్డు ద్వారా 15 వేల కోట్ల రూపాయలతో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. ఇప్పుడున్న పోర్టులకు అదనంగా నాలుగు కొత్త పోర్టులు,  ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేయనున్నామన్నారు. 

ఈ ఏడాది డిసెంబర్ నాటికి రామాయపట్నం పోర్టుకు తొలి వెసెల్ రాబోతుందని అమర్నాథ్ చెప్పారు. త్వరలోనే మచిలీపట్నం పోర్టుకు శంకుస్థాపన చేస్తామని, భావనపాడు పోటు నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ప్రతి పోర్టుకు ఆనుకుని ఐదు నుంచి పదివేల ఎకరాల భూమిని పరిశ్రమల కోసం కేటాయిస్తున్నామని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు మంచి డిమాండ్ ఉందని వెల్లడించారు. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తున్నాయని అని చెప్పారు. ఇది ఇలా ఉండగా రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడును రాబట్టేందుకు అవకాశాలు ఉన్నాయని మంత్రి అమర్నాథ్ తెలియజేశారు.  దీనికోసం రాష్ట్రంలో 29 ప్రాంతాలను గుర్తించామని చెప్పారు. అదేవిధంగా 646 చదరపు కిలోమీటర్ల పరిధిలో పిసిపిఐఆర్ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించామని అని చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్లో ఉన్న హెచ్పీసీఎల్, ఐఓసీ, ఎన్.టి.పి.సి తదితర కర్మాగారాలను ప్రపంచ స్థాయిలో ఫోకస్ చేయనున్నామని ఆయన చెప్పారు. కాగా 2021- 22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం నుంచి 1,44,000 కోట్ల రూపాయల ఎగుమతులు చేశామని చెప్పారు. ఎగుమతుల విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎనిమిదో స్థానంలో ఉందని ఆయన చెప్పారు. మూడు సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని మంత్రి అమర్నాథ్ చెప్పారు. అలాగే రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రదేశాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 2 వేల ఎకరాలలో  బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నమని ఇందులో సుమారు 40,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. 70 శాతం వర్కింగ్ ఏజ్ గ్రూప్ కలిగిన ఆంధ్రప్రదేశ్  జి ఎస్ డి పి లో  ప్రథమ స్థానంలో నిలిచిందని అని చెప్పారు.

హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని అని చెప్పారు. ఈరంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు దిగ్గజ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ రంగంలో విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం ప్రాంతాలను మేజర్ కాన్సెప్ట్ సిటీలుగా  రూపుదిద్దుతున్నమని చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు ఆనుకుని 100 ఎకరాలలో ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తున్నాను అని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి సెకనుకు ఒక సెల్ ఫోన్ తయారవుతోందని మంత్రి అమర్నాథ్ చెప్పారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో స్కిల్  హబ్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ఇదిలా ఉండగా 2023-28 సంవత్సరానికి గాను కొత్త పారిశ్రామిక విధానాన్ని అందుబాటులోకి తీసుకు వస్తున్నామని అని చెప్పారు. పెద్ద ఎత్తున పరిశ్రమలను రాబట్టేందుకు అనువుగా ఈ పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నామని మంత్రి వివరించారు.

 ఈ సమ్మిట్ లో ఎంఓయూలు చేసుకున్న కంపెనీలు ఆరు నెలల్లో పరిశ్రమ స్థాపించేందుకు ముందుకు వస్తే ప్రభుత్వం నుంచి అడిషనల్ సపోర్ట్ ఉంటుందని అమర్నాథ్ చెప్పారు. కాగా మూడో తేదీ ఉదయం సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందని మంత్రి అమర్నాథ్ చెప్పారు. సదస్సు జరిగే ప్రదేశంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని, రాష్ట్రంలోని ఉన్న పరిశ్రమల ప్రగతిని ఎగ్జిబిషన్ ద్వారా అతిథులకు తెలియజేస్తామనిచెప్పారు. తర్వాత సెషన్స్ ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. సదస్సుకు 25 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారని 14 మంది అంబాసిడర్లు రానున్నారని , వివిధ దేశాలకు చెందిన కార్యదర్శులు, యూరోపియన్ యూనియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ప్రతినిధులు ఈ సమ్మిట్ లో పాల్గొనబోతున్నారని ఆయన చెప్పారు. నాలుగవ తేదీన పలు ఎంవోయూలు జరుగుతాయని తెలియజేశారు.

Visakhapatnam

2023-02-28 13:49:55

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల అనుమ‌తుల‌న్నీ ఒకేచోట

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో శాస‌న‌మండ‌లి ఉత్త‌రాంధ్ర ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగే ఎన్నిక‌లు స్వేచ్ఛ‌గా, నిష్ప‌క్ష‌పాతంగా, పార‌ద‌ర్శ‌కంగా జ‌రిగేలా ఎన్నిక‌ల నోడ‌ల్ అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని శాస‌న‌మండ‌లి ఎన్నిక‌ల ప‌రిశీల‌కులు సిద్ధార్ధ్ జైన్ ఆదేశించారు. ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా అభ్య‌ర్ధులంద‌రికీ అనుమ‌తుల విష‌యంలో స‌మాన అవ‌కాశాలు క‌ల్పించాల‌ని, అభ్య‌ర్ధులంద‌రినీ ఒకేలా ప‌రిగ‌ణించాల‌ని సూచించారు. ఎన్నిక‌ల ప్ర‌చారానికి అవ‌స‌ర‌మైన అన్ని అనుమ‌తులు ఒకేచోట‌ ఇచ్చేందుకు సింగిల్‌విండో ప‌ద్ధ‌తిని అనుస‌రించాల‌న్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నోడ‌ల్ అధికారుల‌తో ఎన్నిక‌ల ప‌రిశీల‌కులు సిద్ధార్ధ్ జైన్ మంగ‌ళ‌వారం క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో స‌మావేశ‌మై ఎన్నిక‌ల ఏర్పాట్ల‌పై చ‌ర్చించారు. ఎన్నిక‌ల ఫిర్యాదుల‌ను ప‌రిష్క‌రించేందుకు ప‌క‌డ్బందీ వ్య‌వ‌స్థ ఏర్పాటు చేయాల‌ని, ప్ర‌తి ఫిర్యాదుపై త్వ‌ర‌గా విచార‌ణ జ‌రిపి జాప్యం లేకుండా నివేదిక‌లు ఇవ్వాల‌న్నారు. 

బ్యాలెట్ ప‌త్రాలు, బాక్సుల స‌ర‌ఫ‌రాపై విశాఖ‌లోని రిట‌ర్నింగ్ అధికారి కార్యాల‌యంలో స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి త‌గిన ఏర్పాట్లు చేయాల‌న్నారు. ఎన్నిక‌ల సంఘం పేర్కొన్న మేర‌కు ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళి అమ‌లు జ‌రిగేలా అన్ని చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. ముఖ్యంగా స‌రిహ‌ద్దున ఒడిశా నుంచి అక్ర‌మ మ‌ద్యం స‌ర‌ఫ‌రాకు తావులేకుండా త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు అవ‌స‌ర‌మైన వాహ‌నాల‌ను స‌మ‌కూర్చుకోవాల‌ని, పోలింగ్ ను వెబ్ కాస్టింగ్ చేసేందుకు త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. శాస‌న‌స‌మండ‌లి ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గ‌ ఎన్నిక‌ల‌కు 37 మంది  అభ్య‌ర్ధులు బ‌రిలో వున‌వ్నార‌ని అందువ‌ల్ల పెద్ద సైజు బ్యాలెట్ వ‌చ్చే అవ‌కాశం వున్నందున ఆ మేర‌కు త‌గిన సైజుగ‌ల బ్యాలెట్ బాక్సులు సిద్దం చేయాల‌న్నారు. స‌మావేశంలో జాయింట్ క‌లెక్ట‌ర్ మ‌యూర్ అశోక్‌, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-02-28 13:33:18

జి-20 సదస్సును విజయవంతం చేయాలి

ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు 2023 ను అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున అధికారులను ఆదేశించారు.  సోమవారం సాయంత్రం విఎంఆర్డిఎ ఎరీనా  సమావేశ మందిరంలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు 2023  ఏర్పాట్లు, అధికారులు చేపట్టవలసిన పనులపై పరిశ్రమల శాఖ కమిషనర్ డాక్టర్ జి. సృజన,సచివాలయల డైరెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ కెయస్ విశ్వనాథన్ తో కలసి లైజనింగ్ అధికారులు , నోడల్ అధికారులతో కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని మార్చి 3, 4 తేదీలలో నిర్వహిస్తున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు 2023 (గ్లోబల్  ఇన్ వెస్టర్స్ సదస్సు-2023) కు నియమించిన నోడల్ అధికారులందరూ బాధ్యత యుతంగా పని చేసి విజయవంతం చేయాలన్నారు. 

ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు, అంబాసిడర్లు రానున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా అధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. అతిధులు బస చేయు హోటల్స్ వద్ద, విమానాశ్రయం వద్ద,  ఎయు గ్రౌండ్ లోనూ  వైద్య ఆరోగ్య శాఖ నుండి మెడికల్ టీంలు, ఆంబులెన్స్, మందులు అందుబాటులో పక్కాగా ఉంచుకోవాలని ఆదేశించారు. ప్రతినిధులు బస చేయు హోటల్స్ వద్ద సహాయ కేంద్రాలు ఏర్పాటు గావించాలని చెప్పారు.  ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు. అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పరిశ్రమల శాఖ కమిషనర్ డాక్టర్ జి. సృజన మాట్లాడుతూ గ్లోబల్  ఇన్ వెస్టర్స్ సదస్సు-2023కు ముఖేష్ అంబానీ, నవీన్ మిట్టల్, అదానీ తదితర ప్రముఖ వ్యాపార వేత్తలు, అంబాసిడర్లు, పారిశ్రామిక వేత్తలు హాజరుకానున్నట్లు చెప్పారు. అధికారులకు అప్పగించిన విధులను బాధ్యతతో నిర్వహించి సమ్మిట్ ను విజయవంతం చేయాలని తెలిపారు. 

సమ్మిట్ కు వచ్చే పారిశ్రామిక వేత్తలను విమానాశ్రయంలో రిసీవ్ చేసుకోవాలని, వారికి అవసరమైన వాహనాలు ఏర్పాట్లు గావించాలన్నారు. ముఖ్య అతిధుల సమాచారం ముందుగా తెలుసుకొని పూర్తి సన్నద్ధతతో ఉండాలన్నారు. అధికారులందరూ ప్రధాన వేదిక యొక్క పూర్తి సమాచారం ముందుగా తెలుసుకోవాలని అన్నారు.  జాయింట్ కలెక్టర్ కె ఎస్ విశ్వనాథన్ సదస్సు కు విచ్చేయు ముఖ్య అతిధుల విధులకు కేటాయించిన లైజనింగ్ అధికారులు , నోడల్ అధికారులు చేయవలసిన పనులను సూక్మ స్థాయిలో అధికారులకు వివరించారు.  ఈ సమావేశంలో సమ్మిట్ లో పాల్గొను  నోడల్ అధికారులు , లైజనింగ్ అధికారులు , జిల్లా అధికారులు , సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.   

Visakhapatnam

2023-02-28 13:03:29

ఏయు వీసీపై జరిగిన విచారణ నివేదిక బయటపెట్టాలి

ఏయూ వైస్ చాన్సలర్‌(వీసీ) పీవీజీడీ ప్రసాదరెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఎన్నికల కమిషన్‌కు అందిన ఫిర్యాదులపై జిల్లా అధికార యంత్రాంగం జరిపిన విచారణ నివేదికను జిల్లా కలక్టర్‌ ఎ.మల్లికార్జున తక్షణం బహిర్గతం చేయాలని పబ్లిక్‌ ఫోరం రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ కాండ్రేగుల వెంకటరమణ డిమాండ్‌ చేశారు. ఫిర్యాదుని ఈ మేరకు ఈ మెయిల్‌ ద్వారా జిల్లా కలక్టర్‌కు వినతిపత్రం పంపామన్నారు. ఆర్టీఐ చట్టం సెక్షన్‌ 4(1) (సి) ప్రకారం ప్రజలపై ప్రభావం చూపించే నిర్ణయాలు ప్రకటించినపుడు వాటికి సంబంధించిన అన్ని వాస్తవాలను బయటపెట్టాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్ధికి మద్దతుగా విశాఖపట్నంలోని ఒక హోటల్‌లో ప్రైవేటు కళాశాలల యాజమాన్య ప్రతినిధులతో ఏయు వీసీ ఇటీవల సమావేశం కావడంపై అందిన ఫిర్యాదుల నేపధ్యంలో జరిగిన విచారణ నివేదికను గోప్యంగా ఉంచడం సిగ్గుచేటన్నారు. 

Anakapalle

2023-02-28 12:53:35

ఎమ్మెల్సీ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత

ఆంధ్రప్రదేశ్  శాసనమండలి విశాఖపట్నం-విజయనగరం- శ్రీకాకుళం పట్టభద్రుల నియోజకవర్గ  ఎన్నికల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఎన్నికల పరిశీలకులు సిద్ధార్థ జైన్ అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున , సీపీ సీహెచ్ శ్రీకాంత్ తో కలిసి ఆరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల తో  ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ , ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికల కంటే చాలా భిన్నమైనవని, బ్యాలెట్ పద్దతిలో జరుగు ఈ ఎన్నికలకు పూర్తి సన్నద్ధతతో   ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థుల జాబితా ఖరారు అయినందున ఇకపై పోలింగ్ ఏర్పాట్ల పనులు పూర్తి స్థాయిలో ఎటువంటి సమస్యలు లేకుండా చేయాలని అన్నారు. ఎన్నికల కోడ్ నిభందనలు అభ్యర్థులు అందరూ పాటించేటట్లు అవగాహన కల్పించాలని తెలిపారు.

 ఓటర్లు అందరూ ఓటు వేసేందుకు మంచి వాతావరణం కల్పించాలని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి వచ్చు ఫిర్యాదులను వెను వెంటనే పరిష్కరించాలని అన్నారు. అభ్యర్థుల ప్రచారం కొరకు పొందు అనుమతుల సేవలు అన్ని ఒక్క చోటే ఏర్పాటు చేసి సత్వరమే మంజూరు చేయాలని ఆదేశించారు.  ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికకు అభ్యర్థులు ఖరారు అయినందున పోలింగ్ సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలని అన్నారు . ఓటర్లకు ఓటింగ్ విధానంపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో  జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాస్ మూర్తి , ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ , ఎలక్షన్ సిబ్బంది  పాల్గొన్నారు. 

Visakhapatnam

2023-02-27 17:13:55

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 37 మంది

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి విశాఖపట్నం-విజయనగరం- శ్రీకాకుళం పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికకు  సంబంధించి నామినేషన్ల ఉపసం హరణ  నాటికి  మొత్తం 3అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని , 37 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లికార్జున పేర్కొన్నారు. సోమవారం  జిల్లా కలెక్టరేట్ లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీలతో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబం ధించి ఎన్నికల పరిశీలకులు సిద్ధార్థ జైన్ తో  కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల ను పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి అభ్యర్థి మోడల్ కోడ్  నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాల న్నారు. ఎమ్మెల్సీ బరిలో పాల్గొను అభ్యర్థులు ఎటువంటి ప్రభుత్వ  ప్రారంభోత్సవాలు , శంఖుస్తాపనలు కార్యక్రమాలలో పాల్గొనరాదని తెలిపా రు. ఎన్నికలకు   సంబంధించిన నియమ నిబంధనలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ అభ్యర్థులకు  వివరించారు. ఎన్నిక లకు సంబంధించి ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నట్లయితే రాత  పూర్వకంగా తెలపాలని అన్నారు . ఎన్నికల ప్రచారంలో భాగంగా వ్యక్తిగత వాహనాలు , ర్యాలీలు,  లౌడ్ స్పీకర్లు  కొరకు అభ్యర్థులు ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో  జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాస్ మూర్తి , ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ , ఎలక్షన్ సిబ్బంది , పోటీ అభ్యర్థులు , వారి ఏజెంట్లు ఉన్నారు. 

Visakhapatnam

2023-02-27 17:03:14

స్థానిక సంస్థలఎమ్మెల్సీగా కుడిపూడి ఎన్నిక

తూర్పుగోదావరి స్థానిక సంస్థల నియోజక వర్గం నుండి శాసన మండలి సభ్యుని ఎన్నిక నిర్వహణ ప్రక్రియలో సోమవారం మద్యాహ్నం 3-00 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది.  గడువు ముగిసే సమయానికి ఈ ఎన్నికల పోటీలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా కుడుపూ డి సూర్యనారాయణ రావు ఏకైక అభ్యర్థిగా నిలవడంతో,  రాష్ట్ర శాసన మండలి సభ్యునిగా ఆయన ఎన్నికైనట్లుగా రిటర్నింగ్ అధికారి, జాయిం ట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ ప్రకటించి, ఆయనకు సర్టిఫికేట్ ఆఫ్ ఎలక్షన్ అందజేశారు.  ఎమ్మెల్సీగా ఎన్నికైన కుడుపూడి సూర్యనా రా యణరా వుకు  కాకినాడ, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు వంగా గీత,  మార్గాని భరత్ రామ్, కాకినాడ సిటీ శాససన సభ్యులు ద్వారం పూడి చం ద్రశేఖర రెడ్డి అభినందనలు తెలియజేశారు.  అనంతరం నూతనంగా ఎమ్మెల్సీ గా ఎన్నికైన కుడుపూడి సూర్యనారాయణరావు  జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లాను మర్యాద పూర్వకంగా కలిసారు.

Kakinada

2023-02-27 16:31:38