1 ENS Live Breaking News

10వ తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లాకలెక్టర్

పదవ తరగతి పరీక్ష కేంద్రాలను  జిల్లా కలెక్టర్ డా ఎ మల్లికార్జున ఆకస్మికంగా తనిఖీ చేశారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్రం లో గల కె డి పి ఎం ప్రభుత్వ పాఠశాల , కోటక్ పాఠశాలల లో జరుగుతున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాలను  ఆకస్మికంగా సందర్శించి అధికా రులకు పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ పాఠశాలలో పదవ తరగతి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. విద్యార్థుల ఓఎం ఆర్ షీట్, పశ్నా పత్రాలను పరిశీలించారు. విద్యార్థులు పరీక్షా సమయాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులకు కల్పిం చిన సౌకర్యాలను సంబంధిత  అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో ఎవరు కూడా మొబైల్ ఫోన్ లను తీసుకొని రాకుండా చూడాలని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును పరిశీలించారు. ఈ పరీక్షల సమయంలో త్రాగునీరు , విద్యుత్ అంతరాయ సమస్యలు లేకుండా చూసి విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా చూడాలని సంభందిత ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. ఈ తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట డి.ఈ.ఓ. చంద్రకళ , పాఠశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-04-03 06:31:50

రూ.450 కోట్లతో రాష్ట్రంలో 10,960 డిజిటల్‌ లైబ్రరీలు

ఆంధ్రప్రదేశ్ లో రూ.450 కోట్లతో 10,960 డిజిటల్‌ లైబ్రరీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర గ్రంధాలయ పరిషత్‌ చైర్మన్‌ మందపాటి శేషగిరిరావు ప్రకటించారు. శ్రీ గౌరీ గ్రంథాలయంలో ఆదివారం ‘గ్రంథాలయాలు`సాంకేతిక పరిజ్ఞానం’ అంశంపై జరిగిన సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఇప్పటికే కడపలో మొదటి డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటైందని,  అన్ని జిల్లాల్లో దశల వారీగా నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. గ్రంధాలయాల్లో సాంకేతిక భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. స్ధానిక సంస్ధలు పన్ను చెల్లింపు దారుల నుంచి వసూలు చేస్తున్న గ్రంథాలయ సెస్‌తో రాష్ట్రంలోని గ్రంథాలయ పురోగాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ ఉగాదిని ‘జగన్‌ డిజిటల్‌ శోభకృత నామ సంవత్సరం’గా గ్రంథాలయ పరిషత్‌ తరుపున నామకరణం చేశామన్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో ఏప్రిల్‌ 5 నుండి ‘విజనరీ జగన్‌’ పేరుతో సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో గ్రంథాలయాల్లో పుస్తకాల కొనుగోలుకు రూ.15.75 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని, ఇప్పటి వరకు రూ.10 కోట్లతో పుస్తకాలను కొనుగోలు చేసి గ్రంథాలయాలకు అందజేశామన్నారు. 

గత ప్రభుత్వాలు గ్రంథాలయ వ్యవస్ధను పూర్తిగా నిర్వీర్యం చేశాయని, పదేళ్లుగా ఒక్క పుస్తకం కూడా కొనుగోలు చేయకపోవడమే నిదర్శమని ఆయన ఆరోపించారు. ‘యువత-భవిష్యత్‌-వైఎస్‌ ఆర్‌ డిజిటల్‌ లైబ్రరీ’ అంశం ఇతివ్తృతంగా ప్రత్యేక సంకలనంకు రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ శ్రీకారం చుట్టిందని శేషగిరిరావు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామాలకు విజ్ఞాన వీచికలు అందాలన్న లక్ష్యంతో దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్‌ గ్రంథాలయాలను ఏర్పాటు చేసామన్నారు. పేదోళ్లకు విద్య, విజ్ఞానాన్ని అందించాలన్న లక్ష్యంతో విద్యాశాఖలో పలు సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత సీఎం వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డికు దక్కిందన్నారు. గ్రంధాలయాల పురోభివృద్ధే లక్ష్యంగా పరిషత్‌ పనిచేస్తుందన్నారు.

             జిల్లా ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌, ఏపీ వైద్య విధాన పరిషత్‌ జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్‌ పేరాల శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ శ్రీ గౌరీ గ్రంథాలయం డిజిటల్‌ లైబ్రరీ ద్వారా కొన్నేళ్లుగా విద్య, విజ్ఞానం అందించడం అభినందనీయమన్నారు. గ్రంథాలయాలతోనే పురాతన సంస్కృతి, సంప్రదాయం, మేధోసంపత్తి, ఉజ్వల భవిష్యత్తు, మానవ పురోభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. యువత, విద్యార్ధులు గ్రంథాలయాలను సద్వినియోగపరచుకోవాల్సిన ప్రాముఖ్యత గురించి ఆయన వివరించారు. కోవిడ్‌`నేపధ్యంలో డిజిటల్‌ వ్యవస్ధకు అత్యంత ప్రాధ్యాన్యత చేకూరిందని శ్రావణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

             ఈ సందర్భంగా గ్రంధాలయ పరిషత్‌ చైర్మన్‌ మందపాటి శేషగిరిరావు, జిల్లా ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రావణ్‌కుమార్‌, ఎన్‌వైకే జిల్లా యువజన అధికారి జి. మహేశ్వరరావులను గ్రంథాలయం ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో గ్రంథాలయ అధ్యక్షుడు డి.నూకఅప్పారావు, కార్యదర్శి కాండ్రేగుల వెంకటరమణ, కోశాధికారి బీశెట్టి కృష్ణఅప్పారావు, సభ్యులు బొడ్డేడ జగ్గఅప్పారావు, కాండ్రేగుల సత్యనారాయణ (ఎస్‌.ఎఫ్‌.ఐ), కర్రి గంగాధర్‌, మళ్ల బాపునాయుడు, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పుస్తక నిక్షిప్త`డీబీసీ కేంద్రం జిల్లా అధ్యక్షుడు సాసుబిల్లి మహాలక్ష్మినాయుడు పెద్ద సంఖ్యలో మహిళలు, విద్యార్ధులు పాల్గొన్నారు. అనంతరం వారు గ్రంథాలయంలో ఉన్న సాహిత్యం, నవలలు, చరిత్ర పుస్తకాలు, పత్రికలు, పోటీ పరీక్షలు, కంప్యూటర్‌ విభాగాలను వారు పరిశీలించారు.

Anakapalle

2023-04-02 12:30:37

"మిషన్ వాత్సల్య" కు దరఖాస్తుల ఆహ్వానం icds-pd

అనకాపల్లి జిల్లాలో గల అనాధ పిల్లలకు మిషన్ వాత్సల్య పథకం ద్వారా నెలకు రూ 4000/- అందించడం జరుగుతుందని, అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకో వాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు జి.ఉషారాణి ఒక ప్రకటనలో కోరారు.  వారి కుటుంబ ఆదాయం సంవత్సరానికి గ్రామీణ ప్రాంతాల్లో 72 వేలు, పట్టణ ప్రాం తాల్లో 96 వేల లోపు ఉండాలన్నారు. దరఖాస్తు చేసుకునేవారు జనన ధ్రువీకరణ పత్రం ఆధార్ కార్డు తల్లి/తండ్రి ఆధార్ కార్డు తల్లి లేదా తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం మరణ కారణం గార్డియన్ ఆధార్ కార్డు రేషన్ కార్డు బాలిక బాలుడి కుల ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికేట్, పాస్పోర్ట్ ఫోటో,  ఆదాయ ధ్రువీకరణ బ్యాంకు ఎకౌంటు వివరాలు జత చేయాలన్నారు.

తల్లిదండ్రులు లేని అనాధలు,  ప్రాణాంతక వ్యాధి తో బాధపడే తల్లిదండ్రులు గలవారు తల్లి లేదా తండ్రి నీ కోల్పోయిన పాక్షిక అనాధలు, విడాకులు తీసుకున్న తల్లిదండ్రులు ఉన్నవారు, ప్రకృతి వైపరీత్యానికి గురైన, యాచకులైన , బాల కార్మికులు బాల్య వివాహం జరిగిన వారు ఇవి బాధిత పీడిత బాలలు దివ్యాంగులకు మిషన్ వాత్సల్య పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందుటకు అర్హులని ఆవిడ పేర్కొన్నారు. ఇతర వివరములకు దగ్గరలో ఉన్న ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి అంగనవాడీలలో సంప్రదించవలసినదిగా తెలిపారు.

Anakapalle

2023-04-01 14:22:51

గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలుచేస్తే కఠినచర్యలు

అనకాపల్లిజిల్లాలో ఎక్కడైనా గర్భస్థ పిండ నిర్ధారణ పరీక్షలు చేసినట్లయితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి అధికారులను ఆదేశిం చారు. శనివారం ఆయన వెబ్ఎక్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాస్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యాధుల గుర్తింపు తదితర పరీక్షలకు నిర్వహించే యంత్రాలతో పిండ పరీక్షలు చేయకుండా నిరోధించాలన్నారు. అటువంటి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు. ఆడపిల్ల లు తక్కువగా ఉన్న మండలాలను గుర్తించి ఆ ప్రాంతంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అధికారులు విధిగా స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేయాలని చ ట్టంపై విస్తృతమైన ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.ఏ.హేమంత్ అడిషనల్ జిల్లా జడ్జి, అడిషనల్ ఎస్పీ, డాక్టర్ అనురాధ డాక్టర్ విజయకుమార్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటరావు, డి ఐ ఓ డాక్టర్ మురళీధర్ పాల్గొన్నారు.

Anakapalle

2023-04-01 14:12:40

విశాఖజిల్లాలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ

విశాఖ జిల్లాలో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీలో భాగంగా ఎస్సీ , ఎస్టీ  లకు కేటాయించిన 20 పోస్టులను భర్తీచేస్తూ జిల్లా జాయింట్ కలెక్టర్ కె ఎస్ విశ్వనాథన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు స్ధానిక కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఎస్‌ సి, ఎస్‌ టి బ్యాక్‌ లాగ్‌ పోస్టులకు అన్ని అర్హతల తో ఎంపికైన 20 మందికి జాయింట్ కలెక్టర్‌ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. 2019- 20 సంవత్సరానికి గాను 14 పోస్టులు , 2020-21  సంవత్సరానికి గాను 6 పోస్టులకు  సంబంధించి ఎస్సీ , ఎస్టీ బ్యాక్ లాగ్ ఉద్యోగాలకు ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేశారు. ధరఖాస్తు చేసుకొని, ప్రతిభ ఆధారంగా  అర్హులైన అభ్యర్థులకు  ఆఫీస్ సబార్డినేట్, క్లాస్ రూం అటెండెంట్ మొదలగు పోస్టులకు సంబంధించి జాయింట్ కలెక్టర్ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు అంకితభావంతో విధులు నిర్వహించి సమాజంలో వెనుకబడిన వారి అభ్యున్నతికి తమ వంతు సేవలు అందించాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీనివాసమూర్తి , ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్  డైరెక్టర్ రమణ మూర్తి , కలెక్టరేట్ పరిపాలన అధికారి ఈశ్వర రావు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
 

Visakhapatnam

2023-04-01 14:01:33

లింగ నిర్ధారణ చేస్తే స్కానింగ్ సెంటర్లపై కఠినచర్యలు

గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కనింగ్ కేంద్రాల పై చర్యలు తప్పవని  జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.రమణ కుమారి స్పష్టం చేశారు. శుక్రవారం తన ఛాంబర్ లో   జిల్లా స్థాయి అడ్వజరి కమిటీ సమావేశం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి అధ్యక్షతన గర్భధారణ పూర్వ మరియు గర్భస్థ పిండ ప్రక్రియ చట్టం 1994 అమలుపై నియమించిన జిల్లా స్థాయి మరియు ఉప జిల్లా స్థాయి అడ్వయజరి కమిటీ సమావే శం నిర్వహించారు. గర్భస్థ పిండ పరిస్థితి,వ్యాధుల గుర్తింపు తదితర పరీక్షలకు వినియోగించవలసినయంత్రాలను లింగ నిర్ధారణకు ఉపయోగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, ప్రభుత్వం నిర్దేశించిన చట్టాన్ని తప్పక అమలు చేస్తామని కమిటీ సబ్యులు చెప్పారు, ఆడపిల్ల పుట్టుకలు తక్కువగా నున్న మండలాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ,   ప్రాగ్రామ్ అధికారులకు స్కానింగ్ సెంటర్ లను విధిగా పర్యవేక్షించాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి  ఆదేశించారు. ప్రతి స్కాన్ సెంటర్ లో టారిఫ్ బోర్డ్ లను విదిగా ప్రదర్శించాలని ఆదేశించారు.  పి.సి.పి.ఎన్.డి.టి  చట్టం పై సహేలి, సఖి గ్రూప్ ల ద్వారా ప్రజలలో విస్తృత మైన ప్రచారం చేయాలని తెలియజేశారు.

సంతానోత్పత్తి కోసం ఏ ఆసుపత్రి వారు అయిన నమోదు చేసుకోకుండా ఏఆర్టీ పరీక్షలు జరిపినట్లైనా తగు చర్యలు తీసుకోబడును అని హెచ్చరించారు. 
క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆక్ట్ అనుసరించి 31.03.2023 తేదీ లోపుగా జిల్లా లో ఉన్నటువంటి అన్నీ నర్సింగ్ హోమ్లు/ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, క్లినిక్లు, డెంటల్ క్లినిక్లు, ఫిజియోథెరఫీ క్లినిక్లు విదిగా జిల్లా రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో www.clinicalesttact.ap.gov.inఅప్లోడు చేసుకోవాలని జిల్లా అడ్వయిజరీ కమిటీ మీటింగ్లో తెలియచేసారు.  దీనిపై గతంలో పలు ధఫాలుగా పత్రిక ప్రకటన ఇవ్వటం జరిగినది.  స్కానింగ్ సెంటర్లు రిజిస్ట్రేషన్ కొరకు www.pcpndt.ap.gov.inనందు అప్లోడు చేసుకోవలేనని తెలియజేసారు .  ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోని యెడల చట్ట పరమైన చర్యలు తీసుకోబడునని తెలిపారు.

చట్టబద్ద గర్భస్రావములు కమిటీ మీటింగ్ లో ఏ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులనందు గర్భస్రావములు చేయవలేనన్న  చట్టం  ప్రకారం నమోదు చేసుకొని ఉండవలెను. లేనిచో ఆ యాక్ట్ ప్రకారం చట్ట రీత్యా తగు చర్యలు తీసుకొనబడునని తెలియజేయడమైనది.  ఈ కార్యక్రమం లో ఉప జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి, జిల్లా టీకా అధియాకారి,  ఘోష ఆసుపత్రి నుండి జిల్లా స్త్రీ వైద్య నిపుణులు, పిల్లల వైద్యనిపుణులు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నుండి రేడియోలాజిస్ట్, పేతలజిస్ట్, మరియు ఐ.ఎం.ఏ ప్రసిడెంట్, నేచర స్వచ్చంద సంస్థ వారు, డెమో సెక్షన్ సభ్యులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-03-31 14:16:44

ట్రైబల్ సెల్ బలోపేతానికి విశేషంగా కృషిచేయాలి

ట్రైబల్ సెల్ బలోపేతం చేసి రోగులకు మెరుగైన సేవలు అందించడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని  రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుం బ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖా మరియు జిల్లా ఇంచార్జి మంత్రి  విడదల రజని అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం విశాఖపట్నం జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాలకృష్ణ తో విజయవా డ లో క్యాంపు కార్యాలయం నుండి గిరిజన సెల్ కు సంబంధించి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి విడద ల.ర జని మాట్లాడుతూ గిరిజన సెల్ ను బలోపేతం చేసి రోగులకు సేవలను మరింత బలోపేతం చేయాలన్నారు. పాడేరు, అరుకు లో కొత్తగా బ్లడ్ బ్యాంక్ లు నిర్మించాలని ఆదేశించారు. కెజిహెచ్ లో NICU ను అభివృద్ధి చేసి, అదనపు SNCU ను  నిర్మించాలన్నారు. 

జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున మాట్లాడుతూ గిరిజన సెల్ కు ఖరీదైన మందులను కొనుగోలుకు, కాంట్రాస్ట్ స్కాన్ చేయడానికి నిధులు కేటాయించాలని మంత్రిని కోరారు. గిరిజన సెల్ మరియు గిరిజన రోగుల శ్రేయస్సు కోసం ప్రత్యేకంగా అంబులెన్సు ల సంఖ్యను పెంచాలన్నారు. అరుదైన రక్త నమూనాలకు సంబంధించిన సమస్యలను  మంత్రికి వివరించారు.  ఈ కాన్ఫరెన్సులో జిల్లా నుండి  కింగ్ జార్జ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. పి. అశోక్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.జగదీశ్వర రావు, డిసిహెచ్ఎస్  డా. రమేష్ కిషోర్ , వైద్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. 
 

Visakhapatnam

2023-03-31 14:04:57

విశాఖ అంబికాబాగ్ వైభవంగా శ్రీరామ పట్టాభిషేఖం

విశాఖలోని జగదాంబసెంటర్ అంబికాబాగ్ శ్రీరామచంద్రస్వామి వారి దేవస్థానంలో శ్రీరామ పట్టాభిషేఖం శుక్రవారం ఎంతో వైభవంగా నిర్వ హిం చారు. శ్రీ కమహాలక్ష్మి అమ్మవారి దత్తత దేవాలయంలో పట్టాభిషేకమూర్తులకు మంగళధ్వని వేద మంత్రాలు, చతుర్వేద పారాయ ణములతో  ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు .  తదుపరి శ్రీ గీతా ప్రచార సమితి సభ్యులచే  సామూహికంగా శ్రీ లక్ష్మీ అష్టోత్తరం  శ్రీ విష్ణు సహస్రనామం  భగవద్గీత శ్లోకాలను సామూహికంగా పారాయణం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలను వితర చేశారు.  ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శిరీష, ఏఈఓ పి రామారావు వేద పండితులు గీతా ప్రచార సమితి అధ్యక్షులు సిహెచ్ విశ్వేశ్వరరావు,  ఆలయ సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-03-31 11:28:27

గిరిజన సంఘం తిరుగుబాటుతో ఎరుపెక్కిన మన్యం

అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా మొత్తం ఎరుపెక్కింది. అధికార వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న ఎస్టీల జాబితాలోకి బోయ, వాల్మీ కిలను చేర్చడాన్ని నిరశిస్తూ చేపట్టిన మన్యం బంద్ లో గిరిజనులంతా ఏకమయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి బాబూరావు నాయుడు, అరకు పార్లమెంట్ నజసేన కన్వీనర్ వంపురు గంగులయ్యలతోపాటు గిరిజన సంఘం నేతలు రోడ్డెక్కారు. పాడేరు ఐటిడిఏ పీఓ వాహనాన్ని అడ్డుకొని రోడ్డుపై బైటాయించారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా గిరిజనుల బ్రతుకులు అంధకారం అయ్యే ప్రమాదంలో పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కితీసు కోవా లని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండిగా వెళితే గిరిజనులంతా ఏకమై మరింతా పోరాటం చేస్తామని హెచ్చరించారు. 75 సంవత్సరాల స్వాతంత్య్ర  భారత దేశంలో గిరిజనుల అభివ్రుద్ధికి బీటలు పడలేదుని నేడు మా మనుగడ ప్రశ్నార్ధకం చేశారని దుయ్యబట్టారు.

Paderu

2023-03-31 08:32:21

హైటెక్ విధానంలో వాహనాల లెక్కింపు సులభతరం


జాతీయ రహదారిపై వార్షిక వాహనాల లెక్కింపు సులభతరమైంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వాహనాల లెక్కింపు చేపడుతున్నారు.  అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడులంక నాలుగు లైన్ల జాతీయ రహదారిపై గత మూడు రోజులుగా ఈ సర్వే నిర్వహి స్తున్నారు. గతంలో రోడ్లపై మనుషులు ఉండి ఎన్ని వాహనాలు వెళుతున్నాయి, వస్తున్నాయనేది  రాసుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి పో యింది. జాతీయ రహదారిపై రెండు వైర్లు అమర్చి వాటికి సీసీ కెమెరా ఏర్పాటుచేసి అటుగా వెళ్లే వాహనాలు సంఖ్యతో పాటు వాటి వివరాలు పూర్తిగా నమోదయ్యేలా అధునాత విధానాలను ఏర్పాటుచేస్తున్నారు. అంతేకాకుండా  వాహనాల బరువుని కూడా నమోదు చేస్తున్నారు. ద్విచ క్ర వాహనాలు, ఆటోలు, కార్లు, బస్సులు, ట్రక్కులు వంటి వాటిని లెక్కింపు స్పష్టంగా వెల్లడవుతుంది. ఈ వాహనాల రాకపోకల సర్వే ప్రకా రం రోడ్లు పటిష్ఠ పర్చడం, విస్తరించడం వంటివన్నీ కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ చేపడుతుంది.

2023-03-31 08:01:34

ఎస్వీ ఔషధ ఉత్పత్తుల నూతన కేంద్రం ప్రారంభం

నరసింగా పురంలోని శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద ఫార్మసీలో  నూతనంగా నిర్మించిన ఔషధ ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని శుక్రవారం టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి, ఈవో  ఎవి ధర్మారెడ్డి ప్రారంభించారు. అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం చైర్మన్,ఈవో  నూతన భవనంతో  పాటు మందుల ఉత్పత్తిని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం  మీడియాతో మాట్లాడారు. పూర్వీకులు మనకు అందించిన ప్రాచీన ఆయుర్వేద వైద్యాన్ని అభివృద్ధి చేయడానికి టీటీడీ ఎంతో కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా 1983లో ఆయుర్వేద వైద్య కళాశాలను, దానికి అనుబంధంగా ఆయుర్వేద ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  ఆయుర్వేద ఆసుపత్రి దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వస్తున్న రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తోందన్నారు. ఆయుర్వేద ఆసుపత్రికి అవసరమయ్యే మందులు సొంతంగా తయారుచేసుకోవడం కోసం నరసింగాపురంలో 1990వ సంవత్సరంలో 14.75 ఎకరాల్లో టీటీడీ ఆయుర్వేద ఫార్మసీని ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. మొదట 10 రకాల మందులు మాత్రమే తయారు చేసిన ఈ ఫార్మసీ క్రమేణా 80 రకాల మందులు తయారు చేసి ఆయుర్వేద ఆసుపత్రితో పాటు తిరుపతి, తిరుమలలో డిస్పెన్సరీలకు సరఫరా చేస్తోందన్నారు.

   ఫార్మసీని మరింత అభివృద్ధి చేసి ఆయుర్వేద వైద్యాన్ని మరింతగా ప్రజలకు చేరువ చేయడానికి మా పాలకమండలి నిర్ణయించిందని చైర్మన్ వివరించారు.
 ఇందుకోసం ఫార్మసీ భవనాలనూ ఆధునీకరించడంతో పాటు,  మూడు ఔషధఉత్పత్తి కేంద్రాలను నిర్మించి రూ.3.90 కోట్లతో అధునాతన యంత్ర పరికరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో మొదట విడతగా తొలి ఔషధ ఉత్పత్తి కేంద్రం శుక్రవారం  ప్రారంభించినట్లు సుబ్బారెడ్డి చెప్పారు.    ఇప్పటిదాకా సంవత్సరానికి రూ.1.5 కోట్లు విలువ గల మందులను తయారు చేసే ఈ ఫార్మసీలో ఉత్పత్తి సామర్థ్యం పెరిగి ఏడాదికి రూ.5 కోట్ల విలువ చేసే మందులను తయారు చేసే సామర్థ్యం లభిస్తుందని ఆయన తెలిపారు.  ఇక్కడ తయారుచేసే ఆయుర్వేద మందులను టీటీడీ అవసరాలకు పోను, మిగిలినవి ఆయుష్‌ వైద్య శాలలకు విక్రయించేలా రాష్ట్ర ప్రభుత్వంతో  ఒప్పందం జరిగిందని చైర్మన్  చెప్పారు.

కొన్ని ప్రత్యేకమైన, ప్రాచుర్యం పొందిన మందులను టీటీడీ విక్రయశాలల్లో  ప్రజలకు అందుబాటులోకి తేవడానికి  ఆలోచిస్తున్నామని ఆయన చెప్పారు.
శుక్రవారం ప్రారంభించిన ఉత్పత్తి కేంద్రంలో మొదటి విడతగా 10 రకాల ఔషధాలు తయారు చేస్తారన్నారు. భవిష్యత్‌లో 314 నూతన ఔషధాలు తయారు చేయడానికి  ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు.  జేఈవో సదా భార్గవి ఆధ్వర్యంలో జరిగిన ఈ  కార్యక్రమంలో చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఆయుర్వేద ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రేణు దీక్షిత్ , ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మురళీ కృష్ణ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుందరం,ఈఈ  మురళీ కృష్ణ, విజివో  మనోహర్ ,ఆయుర్వేద ఫార్మసీ సాంకేతిక అధికారి డాక్టర్ నారప రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tirupati

2023-03-31 07:48:00

శ్రీ కోదండరామాలయంలో ఘనంగా శ్రీరామనవమి


శ్రీ కోదండరామాలయంలో ఘనంగా శ్రీరామనవమి

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో గురువారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి.  తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఉదయం మూలవర్లకు అభిషేకం చేశారు. ఉదయం 8 నుండి 9 గంటల వరకు ఊంజల్‌ మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.  సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు  శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామివారి మఠం నుండి అర్చకులు నూతన వస్త్రాలను తీసుకొని విమానప్రదక్షిణగా వచ్చి స్వామివారి మూలవర్లకు, ఉత్సవర్లకు సమర్పించారు. ఆ తరువాత శ్రీరామ జన్మపు రాణం, ఆస్థానం నిర్వహించారు. సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ,  అనంతరం ఉత్సవ మూర్తులను వాహన మండ పానికి వేంచేపు చేస్తారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీరామచంద్రమూర్తి తన ప్రియభక్తుడైన హనుమంత వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షిస్తారు.   ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో  నాగరత్న, ఏఈవో  మోహన్, సూపరిం టెండెంట్‌ రమేష్‌ కుమార్, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

Tirupati

2023-03-30 13:59:47

శ్రీ కోదండరామాలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

చంద్రగిరి శ్రీకోదండరామస్వామివారి ఆల‌యంలో గురువారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు  వైభ‌వంగా ప్రారంభ‌మ‌య్యా యి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా స‌క‌ల‌దేవ‌త‌ల‌ను బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఆహ్వానిస్తూ ఉద‌యం 7.45 నుండి 8.15 గంట‌ల మ‌ధ్య మేష ల‌గ్నంలో ధ్వ‌జారోహ‌ణం ఘ‌ట్టాన్ని నిర్వ‌హించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేప‌ట్టారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల రామనామస్మ‌ర‌ణ‌ మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు. కంక‌ణ‌భ‌ట్టార్  శ్రీ‌నివాస‌భ‌ట్టార్‌ ఆధ్వర్యంలో ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ ఈవో  దేవేంద్ర బాబు, ఏఈవో  పార్థ సారధి, సూపరిండేంట్  శ్రీనివాసులు, టెంపుల్ ఇన్స్పెక్టర్  గోపాల కృష్ణ, భక్తులు పాల్గొన్నారు.      

Chandragiri

2023-03-30 09:50:03

వ్యవ‌సాయ మార్కెటింగ్ క‌మిష‌న‌ర్ 31న జిల్లాలో ప‌ర్యట‌న‌

రాష్ట్ర వ్యవ‌సాయ మార్కెటింగ్ శాఖ క‌మిష‌న‌ర్‌, మార్క్ ఫెడ్ ఎం.డి. రాహుల్ పాండే శుక్రవారం జిల్లాలో ప‌ర్యటించ‌నున్నట్టు ఆ శాఖ స‌హాయ సంచాల‌కులు వై వి శ్యాంకుమార్ తెలిపారు. త‌న ప‌ర్యట‌న‌లో భాగంగా జిల్లాలో ప‌లు మార్కెట్ యార్డులు, రైతుభ‌రోసా కేంద్రాలు, రైతుబ‌ జార్‌ల‌ను క‌మిష‌న‌ర్ సంద‌ర్శిస్తార‌ని, జిల్లా కేంద్రంలో వ్యవ‌సాయ మార్కెటింగ్ శాఖ కార్యక‌లాపాల‌పై స‌మీక్షిస్తార‌ని పేర్కొన్నారు. క‌మిష‌న‌ర్ రాహుల్ పాండే తొలుత విజ‌య‌న‌గ‌రం మార్కెట్ యార్డును సంద‌ర్శించి అనంత‌రం అక్కడే జిల్లాలో మార్కెటింగ్ శాఖ కార్యక్రమాల‌పై స‌మీక్ష నిర్వహిస్తార‌ని తెలిపారు. అనంత‌రం ఆర్ అండ్ బి రైతుబజార్‌ను సంద‌ర్శిస్తార‌ని, నెల్లిమ‌ర్ల మండ‌లం గుషిణిలోని ఎం.పి.ఎఫ్‌.సి. గోడౌన్‌ను సంద‌ర్శిస్తార‌ని పేర్కొన్నారు. భోగాపురంలోని వేబ్రిడ్జిని, పూస‌పాటిరేగ మండలం కొప్పెర్లలో రైతుభ‌రోసా కేంద్రాన్ని సంద‌ర్శించి అనంత‌రం విశాఖ వెళ‌తార‌ని పేర్కొన్నారు.

Vizianagaram

2023-03-30 06:47:57

సీఎంను మళ్లీ ఆశీర్వదించండి–ఎమ్మెల్యే కురసాల

ఇచ్చిన మాట ప్రకారం ఆసరా పథకం ద్వారా డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆశీర్వదించాలని డ్వాక్రా అక్క చెల్లెమ్మలను మాజీ మంత్రి, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కోరారు. కాకినాడ నగరంలోని రూరల్‌ నియోజవర్గ పరిధిలోని డివిజన్లలోని లబ్ధిదారులతో వైఎస్సార్‌ ఆసరా 3వ విడత సంబరాలతో ఆయన పాల్గొన్నారు. 3వ డివిజన్‌ గుడారిగుంట మూడు గుళ్ళ సెంటరు లో ఈ కార్యక్రమం నిర్వహించారు.కౌడా చైర్ పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్, వైఎస్సార్ సీపీ కాకినాడ నగర అధ్యక్షు రాలు సుంకర శివప్రసాన్నసాగర్,మున్సిపల్‌ కార్పొరేషన్‌ అడిషనల్‌ కమీషనర్‌ నాగనరసింహరావు, పలువురు పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఆసరా రుణమాఫీ చెక్కు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 8 అర్బన్‌ డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు రూ.3.20 కోట్ల చెక్కును లాంఛనంగా ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చిత్ర పటానికి డ్వాక్రా మహిళలు, మహిళా ప్రజా ప్రతినిధులతో కలిసి పాలాభిషేకం చేశారు.

 ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో ఆసరా పథకం కింద రూ.120కోట్లు రుణమాఫీ అవుతున్నాయ న్నారు. మూడో విడతగా రూ.40కోట్లు మాఫీ అయ్యాయన్నారు. చెప్పాండంటే చేస్తారని ముఖ్యమంత్రి జగనన్నపై ప్రజల్లో ముఖ్యంగా అక్క చెల్లె మ్మల్లో ఉందని ఆ విధంగా ఆయన ఆసరా పథకం అమలు చేస్తూన్నారన్నారు. ఆయన హామీ ఇస్తే శాసనంగా అమలు చేస్తున్నారన్నారు. దేశం లో ఆదర్శవంతంగా బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేస్తున్నారన్నారు. కార్యాక్రమంలో నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ కుర సాల సత్యనారాయణ, మాజీ కార్పొరేటరు వడ్డి మణికుమార్,  ఎమ్మెల్సీ అభ్యర్థి కర్రి పద్మశ్రీ నారాయణరావు, వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రీజనల్‌ కో ఆర్డినేటరు జమ్మలమడక నాగమణి, కాకినాడ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, మాజీ కార్పొరేటరు శైలజ, వడ్డీ మణికుమార్  వైఎస్సార్‌ సీపీ నాయకులు, అధికారులు, నేరేళ్ళు, జగన్నాధం, రాజారపు కృష్ణ, వాసిరెడ్డి సూరిబాబు, కృప పాల్గొన్నారు.   

Kakinada

2023-03-29 15:15:30