1 ENS Live Breaking News

హైకోర్టు జడ్జిలను కలిసిని విజయనగరం కలెక్టర్

అమరావతి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జస్టిస్ సురేష్ రెడ్డి, జస్టిస్ మానవెంద్ర నాథ్ రాయ్ లను విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి మర్యాద పూర్వకంగా కలిసిశారు. జిల్లా పర్యటన కోసం ఆదివారం నగరానికి వచ్చిన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులిరువురికీ  పుష్ప గుచ్చాలు అందజేశారు. అనంతరం జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షే పథకాలు, ప్రభుత్వ పరిపాలన విధానాలు తదితర అంశాలను న్యాయమూర్తులకు కలెక్టర్ వివరించారు.

Vizianagaram

2023-02-12 06:18:34

'విశాఖ ఉక్కు క్షతగాత్రుల'ను పరామర్శించిన మంత్రి

విశాఖ స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్-2 విభాగంలో శనివారం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి స్థానిక సెవెన్ హిల్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు. ఆయన రోగుల వద్దకు వెళ్లి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం  ప్రమాద తీవ్రతను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులు అందరికీ మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. అనంతరం మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ క్షతగాత్రులకు ప్రాణాపాయం లేదని ఇద్దరు, ముగ్గురికి 50 నుంచి 65 శాతం, మిగిలిన వారికి 20 నుంచి 25 శాతం కాలిన గాయాలు అయ్యాయని చెప్పారు. వైద్య సహాయ విషయంలో ఎటువంటి తారతమ్యాలు లేకుండా చూడాలని ప్లాంట్ అధికారులను మంత్రి ఆదేశించారు. 

అవసరమైతే మరింత మెరుగైన వైద్య సహాయం అందించేందుకు ఎయిర్ లిఫ్ట్ ద్వారా ముంబై తరలించేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని ఈ మేరకు ముంబైలో సంబంధిత వైద్యులతో కూడా మాట్లాడినట్లు మంత్రి అమర్నాథ్ చెప్పారు. ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించనున్నామని అమర్నాథ్ తెలియజేశారు. కార్మికుల భద్రత విషయంలో రాజీ పడేది లేదని ఆయన అన్నారు. అనంతరం బాధిత కుటుంబాలను మంత్రి అమర్నాథ్ కలుసుకొని వారికి ధైర్యం చెప్పారు. మంత్రి అమర్నాథ్ వెంట ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వైసిపి విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు తదితరులు ఉన్నారు.

Vizag

2023-02-11 16:10:57

రాజీ మార్గం శ్రేయ‌స్క‌రం.. జిల్లా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి

ప్ర‌తీ మూడు నెల‌ల‌కోసారి నిర్వ‌హించే లోక్ అదాల‌త్‌ను క‌క్షిదారులు ఉప‌యోగించుకోవాల‌ని, జిల్లా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి బి.సాయి క‌ల్యాణ‌చ‌క్ర‌వ‌ర్తి కోరారు. రాజీమార్గం ఎంతో శ్రేయ‌స్క‌ర‌మ‌ని ఆయ‌న సూచించారు. జాతీయ లోక్ అదాల‌త్‌ను జిల్లా కోర్టు స‌ముదాయంలో శ‌నివారం ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి మాట్లాడుతూ, మంచి జీవితం కావాలంటే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకొని, ప్ర‌శాంతంగా ఉండాల‌ని సూచించారు. రాజీమార్గం ద్వారా కేసుల‌ను ప‌రిష్క‌రించుకోవ‌డం ద్వారా ఎంతో స‌మ‌యం ఆదా అవుతుంద‌ని చెప్పారు. ఇత‌ర కేసుల‌తోపాటు భార్యాభ‌ర్త‌ల గొడ‌వ‌ల‌ను కూడా లోక్ అదాల‌త్ ద్వారా ప‌రిష్కరించుకోవాల‌ని సూచించారు. రోడ్డు ప్ర‌మాదాల‌కు సంబంధించిన కేసుల‌ను మూడు నెల‌ల్లోనే ప‌రిష్క‌రించ‌డం జ‌రుగుతోంద‌న్నారు. జిల్లా అద‌న‌పు న్యాయ‌మూర్తి కె.రాధార‌త్నం మాట్లాడుతూ, ఏ స‌మ‌స్య‌కైనా త‌ప్ప‌కుండా ప‌రిష్కారం ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. 

పెద్ద‌ల స‌మ‌క్షంలో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవ‌చ్చున‌ని, సివిల్ కేసుల‌ను రాజీ చేసుకోవ‌చ్చ‌ని, కుటుంబ త‌గాదాల‌ను రాజీ చేసుకొని సంతోషంగా ఉండాల‌ని సూచించారు. దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్న జాతీయ లోక్ అదాల‌త్‌, కేసుల ప‌రిష్కారానికి చ‌క్క‌టి మార్గ‌మ‌ని అన్నారు. నాల్గ‌వ అద‌న‌పు న్యాయ‌మూర్తి (ఎస్‌సి, ఎస్‌టి ట్ర‌యిల్‌ కేసుల ప్ర‌త్యేక న్యాయ‌మూర్తి), షేక్ సికింద‌ర్ భాషా మాట్లాడుతూ, రాజీయే రాజ‌మార్గ‌మ‌న్న‌ది లోక్ అదాల‌త్ ఉద్దేశ‌మ‌ని పేర్కొన్నారు. సివిల్ కేసులు, చిన్న‌చిన్న క్రిమిన‌ల్ కేసుల‌ను కూడా రాజీ ద్వారా ప‌రిష్క‌రించుకోవ‌చ్చ‌ని సూచించారు. ఫ్యామిలీకోర్టు న్యాయ‌మూర్తి ఎం.మీనాదేవి మాట్లాడుతూ, లోక్ అదాల‌త్‌ను క‌క్షిదారులు స‌ద్వినియోగం చేసుకొని త‌మ కేసుల‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని కోరారు.

 ముఖ్యంగా ఐదు సంవ‌త్స‌రాలు పైబ‌డిన కేసుల‌పై దృష్టి పెట్టాల‌ని సూచించారు. జిల్లా బార్ అసోసియేష‌న్ అధ్య‌క్ష‌లు బి.సంజీవ‌రావు మాట్లాడుతూ,  సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల‌కు అనుగుణంగా ఈ మెగా లోక్ అదాల‌త్‌ను నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు. లోక్ అదాల‌త్ ద్వారా స‌త్వ‌ర‌మే న్యాయం జ‌రుగుతుంద‌ని, తిర‌గాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని అన్నారు. జిల్లా న్యాయ‌సేవ‌ల సంస్థ కార్య‌ద‌ర్శి, సీనియ‌ర్ సివిల్ జ‌డ్జి బిహెచ్‌వి ల‌క్ష్మీకుమారి, ప‌లువురు న్యాయ‌వాదులు, బార్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-02-11 15:25:34

ఫిష్ ఆంధ్రా లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలి

విజయనగరం జిల్లాలో ఫిష్ ఆంధ్రా లక్ష్యాలను మత్స్యశాఖ సకాలంలో పూర్తిచేసి యూనిట్లను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.నిర్మలకుమారితో కలిపి ఆమె డివిజన్ స్థాయి అధికారులతో అభివృద్ధిపనులు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ల‌బ్దిదారుల‌ను చైత‌న్య‌ప‌రిచి, యూనిట్ల‌ను త్వ‌ర‌గా ప్రారంభించేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు. జిల్లాలో 112 మినీ ఫిష్ వెండింగ్ యూనిట్ల ఏర్పాటు లక్ష్యం కాగా,  112 మంది లబ్దిదారుల వాటాసొమ్ము  కట్టించి..అందులో 58 మందితో వెండింగ్ యూనిట్లు  ప్రారంభించారన్నారు. వారందరికీ డిసిసిబి బ్యాంకు రుణాలను మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. ఈ షాపులన్నిటికీ కూడా పెయింటింగ్ వేయించి, సప్లై ఆర్డర్లును మంజూరు చేశామన్నారు. 

 సొంత స్థ‌లాల్లో యూనిట్ల‌ను స్థాపించ‌డానికి ముందుకువ‌చ్చే వారికి ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని కలెక్టర్ సూచించారు. మున్సిప‌ల్, పంచాయితీ స్థలాల్లో షాపుల‌ను పెట్టుకొనేవారి ద‌గ్గ‌ర‌నుంచి, నిబంధ‌న‌ల ప్ర‌కారం  స్థానిక సంస్థల తీర్మాణంతోపాటు స‌మ‌గ్ర వివ‌రాల‌తో ఒప్పందాన్ని కూడా తీసుకోవాల‌ని అధికారులను ఆదేశించారు.  మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ నిర్మల కుమారి మాట్లాడుతూ, హబ్ & స్పోక్స్ లో భాగంగా విజయనగరం జిల్లాలో  రూ.10. 00 లక్షల ఫిష్ కియోస్క్ యూనిట్లు 3,  రూ.20 లక్షల లైవ్ ఫిష్ వెండి యూనిట్ 1, రూ.50 లక్షల వాల్యూ యాడెడ్ యూనిట్లను గుర్తించి వారిచేత ఇప్పటికే లబ్దిదారుల వాటాను కట్టించి యూనిట్లును ఏర్పాటు చేస్తున్నారు.  అంతేకాకుండా రూ.50.00 లక్షల యూనిట్ కు బ్యాంకు ఋణం మంజూరై, గ్రౌండింగ్ కు సిద్దంగా ఉన్నదని తెలియజేశారు.

 యువ‌త‌కు ఉపాధి క‌ల్పించ‌డంతోపాటు, ప్ర‌జ‌ల‌కు నాణ్య‌మైన మ‌త్స్య ఉత్ప‌త్తుల‌ను అందించ‌డానికి, ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింద‌ని, ల‌క్ష్యాల‌ను శ‌త‌శాతం పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. మండ‌ల‌, జిల్లా స్థాయిలో డీఆర్డీఏ, మెప్మా, ఆర్టీసీ తదితర సంబంధిత ప్ర‌భుత్వ శాఖ‌లను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ, ల‌క్ష్యాల‌ను వీలైనంత త్వ‌ర‌గా పూర్తిచేయడానికి సమగ్ర కార్యాచరణతో ముందుకి వెళుతున్నట్టు డిడి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని మత్స్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2023-02-11 07:02:39

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేటి నుంచి అమలు

గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎన్నికలతో పాటు లోకల్ బాడి ఎన్నికలు ఇదివరకు చిత్తూరు జిల్లాకు సంబంధించి 20 మండలాల్లో, నెల్లూరు కు సంబంధించి 14 మండలాల్లో కూడా జరగనున్నాయి జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి అన్నారు. గురువారం రాత్రి స్థానిక కలెక్టరేట్ లో మండలి ఎన్నికల నిర్వహణ పై జిల్లా కలెక్టర్ ఈ ఆర్ ఓ లతో , ఏ ఈ ఆర్ ఓ లతో సమీక్ష నిర్వించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్ మండల పరిధిలో, మునిసిపల్ పరిధిలో వెంటనే ఏర్పాటు కావాలని అన్నారు. నేటి నుండే ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని అనుసరించాలని అన్నారు. ఎన్నికల కమిషన్ రోజువారీ ఇవ్వనున్న ఆదేశాలు పాటించాలని అన్నారు. ఎం సి సి టీమ్ వీడియో కవరేజ్ చూడాలని అన్నారు. డూప్లికేట్ ఓటర్లు తొలగింపు , ఈ నెల 10వరకు అందే క్లైములు పరిశీలన చేయాలని అన్నారు. ఈ ఆర్ ఓ లు అనుసంధాన ( అక్సిలరి) పోలింగ్ కేంద్రాల లో సౌకర్యాలు చూడాలని అన్నారు. 

మండల స్థాయిలో , నియోజక వర్గ స్థాయిలో రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేసి వివరించాలి అన్నారు. తప్పని సరి పోలింగ్ కేంద్రాలు మరోసారి పరిశీలించాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియలో విధుల నిర్వహణ అధికారుల, సిబ్బంది జాబితా జిల్లా ట్రెజరీ నుండి సేకరించాలని రాండమైజేషన్ చేయాల్సి వుంటుందని అన్నారు. ఎన్నికల నిర్వహణ శిక్షణ నిర్వహించాలని అన్నారు. నిర్వహణ మెటీరియల్ టెండర్ జేసి చూడాలని అన్నారు. మైక్రో అబ్జర్వర్లు గా కేంద్ర ప్రభుత్వ అధికారులను నియమించాలని అన్నారు. గొడౌన్ల గుర్తింపు, స్ట్రాంగ్ రూమ్ ల ఏర్పాటు పూర్తి స్థాయిలో గుర్తింపు జరగాలని అన్నారు. ఈ సమీక్ష లో నగరపాలక కమిషనర్ అనుపమ అంజలి, డి ఆర్ ఓ శ్రీనివాసరావు, ఏ ఓ సుబ్రమణ్యం,ఈ ఆర్ ఓ లు , ఏ ఈ ఆర్ ఓ లు పాల్గొన్నారు.

Tirupati

2023-02-09 14:55:02

భూరక్ష భూముల రీసర్వే వేగవంతం చేయాలి

జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష ( రీ సర్వే) పనులను వేగవంతం చేయాలని సిసిఎల్ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్ జిల్లా కలక్టర్లు , జాయింట్ కలెక్టర్లు ను ఆదేశించారు. జగనన్న శాశ్వత భూహక్కు, మరియు భూ రక్ష ( రి సర్వే),  భూముల మ్యుటేషన్లు మొదలగు అంశాల ప్రగతి వివరాలపై వివిధ జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో విజయవాడ నుంచి గురువారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంధర్బంగా సిసిఎల్ఎ   స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్ మాట్లాడుతూ భూముల హద్దులు ఖచ్చితత్వం తో ఉండాలని అన్నారు . సర్వే పూర్తయిన గ్రామాల వివరాలను ఎలక్ట్రానిక్ రిజిస్టర్స్ ద్వారా  కలెక్టర్లు నిర్వహించాలని పేర్కొన్నారు . మారుమూల గ్రామాలలో కూడా సర్వే చేసి హక్కు పత్రాలు ప్రజలకు అందించాలని, ఇందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు .పెండింగ్ లో ఉన్న జగనన్న ఇంటి స్థలాల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్   సచివాలయాల ద్వారా చాలా సులభతరం చేయడమైనదని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రజలకు ఎటువంటి వివాదాలు లేకుండా అధికారులు సంతకం చేసి, పూర్తి స్థాయిలో అప్లోడ్ చేయాలని తెలియజేశారు. ఈ వీడియో కాన్పరెన్స్ లో జిల్లా నుండి జాయింట్ కలెక్టర్ కె .ఎస్. విశ్వనాథన్ , సర్వే విభాగం సహాయ సంచాలకులు ఆర్.విజయ్ కుమార్, కె.ఆర్.ఆర్.సి స్పెషల్ డిప్యూటి కలెక్టర్ సత్య పద్మ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-02-09 14:34:30

ఆయిల్ ఫ్యాక్టరీ మ్రుతులకు రూ.25లక్షలు నష్టపరిహారం

పెద్దాపురం మండలం, జి.రాగంపేటలోని అంబటి సుబ్బన్న ఆయిల్ ఫాక్టరీలో గురువారం ఉదయం జరిగిన దుర్ఘటనలో మరణించిన 7గురు కార్మికుల కుటుంబాలు ఒక్కక్కరికీ రూ. 25 లక్షలు ఎక్స్ గ్రేషియా ని రాష్ట్ర ప్రభుత్వం  ప్రకటించిందని జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా తెలియజేశారు. దుర్ఘటన సమాచారం అందిన వెంటనే జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, అధికారులతో హుటాహుటిన జి.రాగంపేటలోని ఆయిల్ ఫ్యాక్టరీన సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాద కారణాలను విచారించారు. ఉదయం 7 గంటల సమయంలో  ఫ్యాక్టరీలోని ఆయిల్ ట్యాంక్ ను శుభ్రపరిచే సందర్భంలో ఊపిరి ఆడక 7 గురు వ్యక్తులు మరణించారని, వీరిలో 5గురు అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరుకు చెందిన వారు కాగా, మరో ఇద్దరు పెద్దాపురం మండలం పులిమేరు గ్రామానికి చెందిన వారు ఉన్నారని తెలిపారు.   పాడేరుకు చెందిన 5 గురు వ్యక్తులు, వెచంగి కృష్ణ (35), వెచంగి నరసింహ (38), వెచంగి సాగర్ (20), కురవడు బంజుబాబు, కుర్రా రామారావు కాగా, పులిమేరుకు చెందిన ఇరువురు వ్యక్తులు కట్టమూరి జగదీష్ (25), యల్లమిల్లి దుర్గాప్రసాద్ ఉన్నారు.  ప్రమాదం వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించామని, ఒక్కొక్కరికీ 25 లక్షలు వంతున ఎక్స్ గ్రేషియా సహాయన్ని ప్రభుత్వం ప్రకటించిందని కలెక్టర్ వెల్లడించారు. 

   ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి  ప్రమాదం జరిగిన ఫాక్టరీని సీజ్ చేయడం జరిగిందని, ప్రమాదానికి కారణాలపై సమగ్ర విచారణకు  జాయింట్ కలెక్టర్, డిప్యూటీ ఇన్స్ పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్,  జిల్లా పరిశ్రమల అధికారి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ, పెద్దాపురం ఆర్డీవో లతో కూడిన ఐదుగురులు అధికారుల బృందాన్ని నియమించామని, మూడు రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఈ బృందాన్ని ఆదేశించామని కలెక్టర్ తెలిపారు.  ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తూ, ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఆర్డిఓ జె.సీతారామారావు, డిప్యూటీ ఇన్స్ పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్ రాధాకృష్ణ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తదితరులు పాల్గొన్నారు.

Peddapuram

2023-02-09 14:12:59

శాసనమండలి ఎన్నికల షెడ్యూలు విడుదల

రాష్ట్రంలో ఉత్తరాంధ్రాతోపాటు పలు ప్రాంతాల్లో శాసనమండలి ఎన్నికల షెడ్యూలు విడుదల చేసినందున ఎన్నికల కోడ్ కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. ఎన్నికల ప్రచారంలో ఉద్యోగులు పాల్గొనరాదని తెలిపారు.  ఓటర్లను ప్రలోభ పెట్టుటకు ప్రయత్నించకూడదని తెలిపారు.  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా  శాసనమండలి, స్థానిక సంస్థల ఎన్నికలపై జిల్లాకలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు,రిటర్నింగు అధికారులు, సహాయ రిటర్నింగు అధికారులు మరియు ఎన్నికల రిటర్నింగు అధికారులతో  గురువారం   వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు.  ఎన్నికల నిర్వహణ సన్నద్దత, ఓటర్ల జాబితా తయారీ, చేర్పులు, డూప్లికేట్ మరియు అనర్హుల తొలగింపు,  ఎన్నికల ఏర్పాట్లు, పోలింగు అధికారులు,  సిబ్బంది నియామకం, పోలింగు కేంద్రాలు ఏర్పాటు, సిబ్బందికి పోలింగుపై శిక్షణ తదితర అంశాలపై  సమీక్ష నిర్వహించారు. 

జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ మాట్లాడుతూ శాసనమండలి ఎన్నికల నిర్వహణకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో   ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ గూర్చి తెలియజేసారు.  శాసనమండలి ఎన్నికలకు 24 పోలింగు కేంద్రాలు ఏర్పాటు చేసామని, అవసరమైన బ్యాలెట్ బాక్సులు సిద్దం చేసినట్లు, పోలీసు బందోబస్తుకు ప్రణాళిక తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లారెవిన్యూ అదికారి జె.వెంకటరావు, కలెక్టరు కార్యాలయ పరిపాలనాధికారి ఆర్. ఉమామహేశ్వరరావు,  ఎన్నికల సెక్షను సూపరింటెండెంటు డి.రవి హాజరయ్యారు.

Parvathipuram

2023-02-09 12:23:24

జీవనశైలి మార్పులపై అవగాహన సదస్సు

శ్వేత ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఫిబ్రవరి 11 నుంచి 13వ తేదీ వరకు టీటీడీ  పురుష ఉద్యోగులకు జీవనశైలిలో మార్పుల ద్వారా  ఆరోగ్యంగా జీవించడం అనే అంశంపై అవగాహన సదస్సు జరగనుంది. ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ కార్యక్రమంలో నిపుణులైన డాక్టర్లు పాల్గొని అనారోగ్యానికి దారి తీస్తున్న అలవాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్య చికిత్సలు తదితర అంశాలను తెలియజేస్తారు. దీనికోసం టిటిడి అన్నిరకాల ఏర్పాట్లు పూర్తిచేసింది.

Tirupati

2023-02-09 12:12:59

గ్రాడ్యుయేట్ MLC ఎన్నిక‌కు షెడ్యూలు విడుదల

రాష్ట్ర శాస‌న‌మండ‌లిలో ఈ ఏడాది మార్చి 29వ తేదీతో ఖాళీ అవుతున్న‌ మూడు ప‌ట్ట‌భ‌ద్రుల, రెండు ఉపాధ్యాయుల నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మె ల్సీ స్థానాల ఎన్నిక కోసం కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూలు ప్ర‌క‌టించింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్‌, జిల్లా ఎన్నిక‌ల అధికారి ఏ.సూర్య‌కుమారి వెల్ల‌డిం చారు. శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌ప‌ట్నం జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ శ్రీ పి.వి.ఎన్‌.మాధ‌వ్ ప‌ద‌వీకాలం మార్చి 29వ తేదీతో ముగుస్తు న్న కార‌ణంగా ఎన్నిక‌ల సంఘం ఈ ఖాళీ భ‌ర్తీ కోసం ఎన్నిక నిర్వ‌హించేందుకు గురువారం షెడ్యూలు విడుద‌ల చేసిన‌ట్టు పేర్కొన్నారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం విడుద‌ల చేసిన షెడ్యూలు ప్ర‌కారం ఫిబ్ర‌వ‌రి 16న ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ జారీ అవుతుంద‌ని, నామినేష‌న్ల దాఖ‌లుకు 23వ తేదీ చివ‌రిరోజుగా నిర్ణ‌యించార‌ని, 24న నామినేష‌న్ల ప‌రిశీల‌న‌, 27న నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రితేదీగా నిర్ణ‌యించ‌డం జ‌రిగింద‌న్నారు. 

మార్చి 13న ఉద‌యం 8 నుంచి మ‌ధ్యాహ్నం 4 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌రుగుతుంద‌ని, మార్చి 16న ఓట్ల లెక్కింపు వుంటుంద‌ని పేర్కొన్నారు. ఎన్నిక‌ల షెడ్యూలు ప్ర‌క‌టించినందున ఫిబ్ర‌వ‌రి 9వ తేదీ నుంచి జిల్లాలో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళి అమ‌లులోకి వ‌చ్చింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. ఎన్నిక‌ల సంఘం నిర్దేశించిన మేర‌కు ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు అంతా ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళి పాటిం చాల్సి వుంటుంద‌న్నారు. కోవిడ్ నియంత్ర‌ణ చ‌ర్య‌లు పాటిస్తూ ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం జ‌రుగుతుంద‌న్నారు.

Vizianagaram

2023-02-09 12:08:48

పెన్సనర్లు త‌ప్ప‌కుండా ఈ-కేవైసీ చేయించుకోవాలి

ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు పింఛ‌నుదారులంద‌రూ త‌ప్ప‌కుండా లైఫ్ సిర్టిఫికేట్లు స‌మ‌ర్పించాల‌ని, ఈ-కేవైసీ చేయించుకోవాల‌ని జిల్లా ఖ‌జానా అధికారి ఆర్‌.ఎస్‌. కుమార్ తెలిపారు. ఈ మేర‌కు గురువారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. హెర్బ్ యాప్ సాయంతో సంబంధిత పింఛ‌నుదారు డు త‌న సీఎఫ్ఎంఎస్ ఐడీకి ఈ-కేవైసీ చేయించుకొని సంబంధిత వివ‌రాల‌ను ఉప ఖ‌జానా అధికారికి ఆన్‌లైన్లో స‌మ‌ర్పించాల‌ని సూచించారు. ఈ ప్ర‌క్రియలో త‌న ఆధార్ నెంబ‌ర్‌కు లింకైనా మొబైల్ నెంబ‌ర్ల‌ను మాత్ర‌మే వినియోగించాల‌ని, లేని ప‌క్షంలో ఆధార్‌కు మొబైల్ నెంబ‌ర్ను లింకు చేయించుకోవాల‌ని పేర్కొన్నారు. అలాగే జీవ‌న్ ప్రమాణ్ పోర్ట‌ల్ ద్వారా గానీ, హెచ్‌.సి.ఎం. పెన్ష‌న్ లాగిన్ ద్వారా గానీ ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రు లోగా లైఫ్ స‌ర్టిఫికేట్ల‌ను స‌మ‌ర్పించాల‌ని పేర్కొన్నారు.

Vizianagaram

2023-02-09 11:50:54

GVMCకి పన్ను ఎగ్గొట్టే పనిలో స్టీల్ ప్లాంట్..!

కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేస్తున్నవేళ విశాఖ మహానగర పాలక సంస్థ(జివిఎంసీ)కి కట్టాల్సిన పన్నులపై రాష్ట్రప్రభుత్వం బకాయిలను రాబట్టుకునే పనిలో పడింది. జివిఎంసీకి స్టీల్ ప్లాంట్ సుమారు 400 కోట్ల రూపాయలకు పైగానే పన్నులు చెల్లించాల్సి వుంది.  గతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడంతో కొద్ది కొద్దిగా పన్నులు వసూలు చేసుకుంటూ వచ్చింది. ఇదే సమయంలో స్టీలు ప్లాంటు ప్రైవేటు పరం అయిపోతే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన పన్నులన్నీ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో చూపిస్తారా అనే చర్చ ఇపుడు విశాఖలో జోరుగా సాగుతుంది. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత ఇపుడు షడన్ గా జీవిఎంసీకి గుర్తొచ్చింది. దీనితో రెవిన్యూ విభాగం విశాఖ స్టీలు ప్లాంట్ నుంచి రావాల్సిన పన్నులను చిట్టాను తనిఖీ చేసి..ఇప్పటి వరకూ ఎంతమేర బకాయిలున్నాయనే కోణంలో లెక్కలు వేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆగమేఘాలపై స్టీలు ప్లాంటుని ప్రైవేటీకరించే పనిలో పడినందున స్టీలు ప్లాంట్ నుంచి బకాయిలు పడ్డవారంతా కూడా యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నారు. 

ప్లాంటు ఉంచాలని రాజకీయం ఏ స్థాయిలో ఒత్తిడి పడుతుందో అదే స్థాయిలో విద్యుత్ బకాయిలు, జివిఎంసీ పన్ను బకాయిలు, ఉద్యోగుల ఇన్కం టాక్స్ బకాయిలు, జిఎస్టీ బకాయిలు ఇలా సమస్తం రాబట్టుకోవాలనే పనిలో రాష్ట్రప్రభుత్వం చాలా సీరియస్ గా లెక్కలు వేస్తుంది. ఏ శాఖలకు చెందిన ముఖ్య అధికారులు వారి వారి పరిధిలో రావాల్సిన పన్నులను లెక్కలు వేసి రాబట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ అవకాశం ఒకవేళ పోతే ఎవరైతే నష్టాల్లో ఉన్న స్టీలు ప్లాంటుని కొనుగోలు చేస్తున్నారో వారి దగ్గర నుంచి బకాయిలు రాబట్టుకోవడానికి చాలా సమయం పడుతుంది. దానికోసం ప్రస్తుం స్టీలుప్లాంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఉన్నప్పుడు మాత్రమే ఈ బకాయిలు వసూలు చేసుకుంటే ఇదొక చరిత్రగా అయినా మిగిలిపోతుందనేది బకాయిలు వసూలు చేసుకునే ప్రభుత్వ శాఖల ఆలోచనగా కనిపిస్తుంది. ఈ తరుణంలోనే జీవిఎంసీకి బకాయిపడ్డ మొత్తం పన్నులను సింగిల్ టేక్ లో రాబట్టుకోవాలని గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు.

 అన్నీ అనుకున్నట్టు జరిగితే జీవిఎంసీ గళ్లా పెట్టి కొత్త పాలక వర్గం కొలువుతీరిన మలి సమావేశానికల్లా గలగల లాడనుంది.  స్టీలు ప్లాంటుతోపాటు, కేంద్ర ప్రభుత్వం మరో 34 సంస్థలను ప్రైవేటీకరించే యోచనలో ఉన్నందున విశాఖలోని అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల బకాయిలను వసూలు చేసుకోకపోతే తరువాత ఆ నష్టాలను రాష్ట్రప్రభుత్వం భరించాల్సి వుంటుంది.  అందులోనూ జీవిఎంసీలో చాలా పనులకు నిధులు లేకపోవడంతో ప్రజల నుంచి ప్రభుత్వ సంస్థల నుంచి స్టీలు ప్లాంటు నుంచి ఎంత త్వరగా వీలైతే అంతే త్వరగా బకాయి పన్నులన్నీ రాబట్టుకోవాలని యోచిస్తుంది. స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణ నేపథ్యంలో విశాఖ మహానగర పాలక సంస్థ ఏ మేరకు బకాయి పన్నులు వసూలు చేస్తుందనేది ఇపుడు సర్వత్రా ఆశక్తిని రేపుతుంది.

Visakhapatnam

2023-02-09 02:53:20

నాడు సీబిఐ,ఈడీలకే సీఎం జగన్ భయపడలేదు

నారా లోకేష్ చేస్తున్నది పాదయాత్ర కాదని అది టీడీపీ పార్టీకి పాడే కట్టే యాత్ర అని రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ ఎద్దేవా చేశారు. బుధవారం మద్దెలపాలెంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నారాలోకేష్ యువగలం పాదయాత్రలో మాట్లాడుతూ, సీఎం జగన్ మోహన్ రెడ్డిని తాను భయపెడతాను.. భయాన్ని జగన్ కి పరిచయం చేస్తాను అనే చౌకబారు విమర్శలు లోకేష్ మానుకోవాలని సూచించారు. కేంద్రంలో యుపిఐ ప్రభుత్వం ఉండగా సాక్షాత్తు యుపిఐ ఛైర్పర్సన్, దేశంలోనే అత్యంత శక్తివంతమైన మహిళా అయిన సోనియాగాంధీ సీబీఐ , ఈడి, ఐటీ ఇవన్నీ ఉపయోగించి అక్రమ కేసులు పెట్టి 16నెలలు అన్యాయంగా జైలులో పెట్టినప్పుడే జగన్ మోహన్ రెడ్డి  భయపడలేదన్నారు. అయినా ఓటుకి నోటుకేసులో అర్థరాత్రి హైదరాబాద్ నుండి పారిపోయి వచ్చిన పిరికి పందలు నారా చంద్రబాబు లోకేశ్ లు కాదా అని  ప్రశ్నించారు.

Visakhapatnam

2023-02-08 17:41:34

డిటిఓగా రుద్ర‌పాటి అశోక్ స‌మ‌ర్ప‌ణ కుమార్‌

విజ‌య‌న‌గ‌రంజిల్లా ఖజానా, లెక్క‌ల అధికారిగా రుద్ర‌పాటి అశోక్ స‌మ‌ర్ప‌ణ కుమార్‌, సోమ‌వారం  బాధ్య‌త‌లు చేపట్టారు. ఇప్ప‌టివ‌ర‌కు జిల్లా ఖ‌జానా అధికారిగా ఉన్న ఎస్ఆర్‌కె గ‌ణేష్ అనారోగ్య కార‌ణాల‌తో సెల‌వు పెట్ట‌డంతో,  ఉమ్మ‌డి జిల్లా ఖ‌జానా అధికారిగా అశోక్ స‌మ‌ర్ప‌ణ కుమార్‌ పూర్తి అద‌న‌పు బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించారు. బాధ్య‌త‌లు స్వీక‌రించిన అశోక్‌కుమార్‌కు, ఎపిటిఎస్ఎ నాయ‌కులు, ఖ‌జానా కార్యాల‌య సిబ్బంది అభినంద‌న‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో స‌హాయ ఖ‌జానా అధికారులు నితిన్‌, ఆదిత్య‌, ఎపిటిఎస్ఎ రాష్ట్ర కార్య‌ద‌ర్శి ప‌ద్మ‌నాభం, జిల్లా కార్య‌వ‌ర్గ స‌భ్యులు స‌రేష్‌, సంతోషి, రామ‌కృష్ణ‌, చంద్ర‌శేఖ‌ర్‌, నాగ‌మునిరెడ్డి పాల్గొన్నారు.

Vizianagaram

2023-02-06 10:32:50

సిబ్బందికి ముఖ ఆధారితహాజరు తప్పనిసరి

అన్ని ప్రభుత్వశాఖల జిల్లా అధికారులు వారి సిబ్బంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా ముఖ ఆధారిత హాజరు సెల్ ఫోన్  ద్వారా వేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్ లో స్పందన హాల్లో నిర్వహించిన ప్రజాఫిర్యా దుల పరిష్కార వేదిక జిల్లాస్థాయి  స్పందన వినతుల స్వీకరణ కార్య క్రమంలో అర్జీదారుల నుండి సుమారు 231 అర్జీలను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర, డిఆర్ఓ సిహెచ్ సత్తిబాబులు అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు.ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుల నుండి అందిన అర్జీలపై క్రియాత్మకంగా స్పందించి తగు పరి ష్కార మార్గాలు సకాలంలో చూపా లని తెలిపారు. గడువు దాటిన అర్జీలు, ఒకసారి ఒక అంశంపై దాఖలు కాబడిన అర్జీ మరల పునరావతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

 ప్రతి అర్జీని నిబంధనల మేరకు స్పందన వెబ్సైట్లో ఫోటోలతో సహా అప్లోడ్ చేయాలని అర్జీలపై క్షేత్రస్థాయి విచారణ సమయంలో కూడా ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగు లు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల కొరకు ప్రవేశపెట్టిన ముఖ ఆధారిత హాజరును  ఉదయం సాయంత్రం నిర్దేశిత సమయాలలో హాజరును తప్పనిసరిగా వేయాలని సూచించారు. ముఖ ఆధారిత హాజరు అమలు తీరుపై ఆయన జిల్లా అధికారులతో సమీక్షించారు ఐ పోలవరం మండలం ముమ్మిడివరం గ్రామానికి చెందిన దూనబోయిన శేషారావు అనే దివ్యాంగుడు  ట్రై సైకిల్ ఇప్పించాలని జిల్లా కలెక్టర్ వారిన్ని అభ్యర్థించగా, ట్రై సైకిల్ ను విభిన్న ప్రతిభావంతులు వయోవృ ద్ధుల సంక్షేమ శాఖ ద్వారా ఉచి తంగా అందించారు. కాకినాడ కేంద్రంగా నిర్వహించిన రెవెన్యూ శాఖ క్రికెట్ పోటీలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కెప్టెన్ హరి సారధ్యంలోని టీం విన్నర్ గా నిలవడంతో ఈ టీం సాధించిన కప్పును సోమవారం జిల్లాకలెక్టర్ తమ ఛాంబర్ నందు గెలుపొందిన  టీం సభ్యులకు అందించారు.

 జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర వారు కూడా రెవెన్యూ టీం ను అభినందించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ వెంకటేశ్వర్లు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ టి వెంకటేశ్వర్లు డిసి హెచ్ఎస్ పద్మశ్రీ రాణి పంచాయి తీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగాల ఎస్ ఈలు చంటిబాబు, కృష్ణారెడ్డి, గృహ నిర్మాణ సంస్థ పిడి ఏం బాబురావు డిఎస్ఓ ఎ.పాపా రావు, డిఎం సివిల్ సప్లయిస్ కె తులసి, డిపిఓ వి కృష్ణకుమారి డిఆర్డిఏ పిడి వి శివశంకర్ ప్రసాద్ ఏపీ డి ఎం ఎం జలాని, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె. లక్ష్మీ నారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి కె నాగేశ్వర రావు, పశుసంవర్ధక శాఖ జెడి డాక్టర్ ఏ జైపాల్ డ్వామా పిడి ఎస్ మధుసూదన్, మత్స్యశాఖ జేడీ షేక్ లాల్ మహమ్మద్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ నాగలక్ష్మి, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ అధికారి భీమేశ్వరరావు వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు  పాల్గొన్నారు.

Amalapuram

2023-02-06 10:02:32