1 ENS Live Breaking News

తొండమనాడు శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు

టిటిడికి చెందిన తొండమనాడులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 20 నుంచి 28వ తేదీ వరకు జరుగను న్నాయి. ఫిబ్రవరి 19న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు.  ఫిబ్రవరి 20న ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య ధ్వజారోహణంతో  బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి శేష వాహన సేవ నిర్వహిస్తారు. ప్రతిరోజూ రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 21న హంస వాహనం, ఫిబ్రవరి 22న సింహ వాహనం, ఫిబ్రవరి 23న హనుమంత వాహనం, ఫిబ్రవరి 24న సాయంత్రం కల్యాణోత్సవం, రాత్రి గరుడ సేవ, ఫిబ్రవరి 25న గజవాహనం, ఫిబ్రవరి 26న చంద్రప్రభ వాహనం, ఫిబ్రవరి 27న ఉదయం తిరుచ్చి, రాత్రి ఆశ్వ వాహన సేవలు నిర్వహిస్తారు.  ఫిబ్రవరి 28న ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 6.30 నుంచి 8 గంటల వరకు ధ్వజావరోహణం కార్యక్రమాలు నిర్వహిస్తారు. మార్చి 1న సాయంత్రం 5.30 గంటలకు పుష్పయాగం జరగనుంది.

Thondamanadu

2023-02-06 09:50:55

టిడ్కో గృహ సముదాయాల్లో మౌళిక సదుపాయాలు

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని సారిప‌ల్లి, సోనియా న‌గ‌ర్లో నిర్మించిన టిడ్కో గృహ స‌ముదాయాల‌ను ల‌బ్ధిదారులు, అధికారుల‌తో క‌లిసి టిడ్కో ఛైర్మ‌న్ జ‌మ్మాన ప్ర‌స‌న్న కుమార్ శ‌నివారం సంద‌ర్శించారు. అక్క‌డ జ‌రుగుతున్న ప‌నుల‌ను, మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌ను ప‌రిశీలించారు. ఇక్క‌డ నిర్మించిన 2,976 గృహాల‌కు సంబంధించి మార్చి నెల‌లో ప్ర‌వేశాలు క‌ల్పించేలా ప‌నులు పూర్తి చేయాల‌ని అధికారుల‌ను, సిబ్బందిని ఆదేశించారు. ఇప్పటికే నివాసం ఉంటున్న లబ్ధిదారుల‌తో మాట్లాడారు. అక్క‌డ ఉన్న ప‌రిస్థితుల‌ను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, విద్యుత్ స‌దుపాయానికి సంబంధించి మిగిలిన ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని అధికారుల‌ను, కాంట్రాక్టు ఏజెన్సీ ప్ర‌తినిధుల‌ను ఛైర్మ‌న్ జ‌మ్మాన ప్ర‌స‌న్న కుమార్ ఆదేశించారు. అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీ స‌భ్యులు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి మార్చి నాటికి అన్ని గృహాల‌ను అందుబాటులోకి తీసుకురావాల‌ని, మౌలిక స‌దుపాయాల‌ను పూర్తి స్థాయిలో క‌ల్పించాల‌ని సూచించారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప‌నుల ప్ర‌గ‌తిపై అధికారుల‌ను అడిగి తెలుసుకున్న ఆయ‌న ప‌నుల్లో మ‌రింత పురోగ‌తి సాధించాల‌ని నిర్దేశించారు. టిడ్కో సూపరింటెండింగ్ ఇంజనీర్ నరసింహ మూర్తి, ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ జ్యోతి, డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ బాలకృష్ణ, సీఎల్టీసీ శ్రీనివాసరావు, మున్సిప‌ల్ అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీ ప్ర‌తినిధులు, ల‌బ్ధిదారులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-02-04 11:21:03

సామాజిక సేవలకు న్యూహోప్ ఘన సత్కారం

సామాజిక భాద్యతతో ప్రతీఒక్కరు సేవాకార్యక్రమాలు చేపట్టి, ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. డబ్బు అందరూ సంపాదిస్తారు కానీ ఆ డబ్బును సమాజానికి ఉపయోగపడే పనులకు న్యూ హోప్ ఫౌండషన్ వ్యవస్థాపకులు మల్లీశ్వరి లాంటివారు కొందరే ఖర్చు చేస్తుంటారని అన్నారు. ఇలా సేవలు అందించిన వారిని సంస్థ ఆధ్వర్యంలో వంశీ ఘనంగా స్కరించారు. విశాఖలోని న్యూ హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం వారియర్ అఫ్ ది ఇయర్ అవార్డ్స్ లను ప్రధానం చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, వివిధ రంగాలలో ప్రతిభ కనభరిచిన వారిని గుర్తించి సత్కరించడం అభినందనీయం అన్నారు. అవార్డు గ్రహీత వి.జె.ఎఫ్ అధ్యక్షులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ధర్మకర్తల మండలి సభ్యులు  గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, సామాజిక సేవా రంగంలో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డులు ఇవ్వడం అభినందనీయమన్నారు.

 భవిష్యత్తులో ఈ ఫౌండేషన్  మరెన్నో మంచి కార్యక్రమాలను చేపట్టాలని అభిలాషించారు. న్యూ హోప్ ఫౌండేషన్  వ్యవస్థాపకులు మల్లీశ్వరి మాట్లాడుతూ, తమ ఫౌండేషన్ ప్రారంభించినప్పటి నుంచి  నేటి వరకు నిర్విరామంగా  సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. తాము చేస్తున్న మంచికార్యక్రమాలకు ప్రజల నుంచికూడా అనుహ్య స్పందన వస్తుందన్నారు.  సేవే ధ్యేయంగా తమ ఫౌండేషన్ పనిచేస్తుందని చెప్పారు. పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి  హాజరైన అతిధులకు  ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. జీవీఎంసీ  సిబ్బందికి, జర్నలిజం లో పనిచేస్తున్న ప్రముఖులకు, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల తో పాటు  వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు అతిధుల ఈ అవార్డులను అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో  వెంకట శ్రీనివాస్,విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-02-04 10:02:22

భూముల రీసర్వేతో రైతులకు ఎంతోమేలు

భూముల రీసర్వే ప్రక్రియను వేగాన్ని పెంచాలని తాసిల్డార్లను జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఆదేశించారు.  రైతులకు రీసర్వే పై అవగాహన కలిగించాలని అన్నారు.  పక్కా పాస్ బుక్ కలిగి ఉన్నప్పటికీ రీ వెరిఫికేషన్ చేయించుకోవడం వలన  రైతుకే మేలు జరుగుతుందని తెలియజేయాలన్నారు. రైతు ఉన్నా లేకపోయినా కొలతలు ఖచ్చితంగానే ఉంటాయని చెపుతూ రైతు సమక్షంలో సర్వే జరిగితే క్లియర్ టైటిల్ డీడ్ పొందగలరని రైతులకు చెప్పాలన్నారు.   ఎక్కువగా సర్వేయర్లు ఉన్న చోట నుండి డెప్యుటేషన్ వేయాలని ఆర్.డి.ఓ కు సూచించారు.  శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో విజయనగరం డివిజిన్ కు సంబంధించి సుస్థిర అభివృద్ధి సూచీలు, రీ సర్వే తదితర అంశాల పై కలెక్టర్ సమీక్షించారు.  రీసర్వే నెమ్మదిగా జరుగుతున్న మండలాల అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయిలో రోజుకు కనీసం వంద ఎకరాలకు తగ్గకుండా, సగటున 150 ఎకరాలు వరకు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

 గ్రౌండ్ ట్రుతింగ్ పై దృష్టి పెట్టాలని సూచించారు. సర్వేయర్లు, ఇతర సిబ్బందిని సర్దుబాటు చేసి, వారి సేవలను సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పారు. రైతుల సమక్షంలోనే, వారి పొలం రీ సర్వే జరిగేలా చూడాలని, గ్రామ సభలు నిర్వహించాలని చెప్పారు. జూన్ నాటికి  సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిందనీ, అంతకు ముందుగానే జిల్లాలో సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.  రోవర్స్ లభ్యత పై సమీక్షించుకొని అన్ని మండలాలకు పంపిణీ జరిగేలా చూడాలని సర్వే ఎ.డి త్రివిక్రమ రావు కు సూచించారు. 
రక్త హీనత నివారించండి
 సుస్థిర అభివృద్ధి సూచీలలో ముఖ్యమైనవి వైద్య ఆరోగ్యం, ఐ.సి.డి.ఎస్. విద్యా శాఖలని ,  పిల్లల, గర్భిణీ ల ఆరోగ్యమే ప్రధానమని అన్నారు.  మండలాల వారీగా పిల్లలు, విద్యార్థులు, మహిళలకు నిర్వహించిన రక్త పరీక్షలపై కలెక్టర్ ఆరా తీశారు. 

తీవ్ర, అతి తీవ్ర, స్వల్ప రక్త హీనత ఉన్న వారిని గుర్తించి, వారు దానినుంచి బయట పడేవిధంగా  కౌన్సిలింగ్ నిర్వహించి, పోషకాహారం, అవసరమైన మందులను అందించాలని సూచించారు. రక్త హీనతను తగ్గించడంలో స్త్రీ,శిశు సంక్షేమ అధికారులు ముఖ్య పాత్ర పోషించాలని సూచించారు. మధ్యాహ్న భోజనం పై దృష్టి సారించి, పిల్లలు అంతా భోజనం చేసేలా చూడాలని కోరారు.  పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో అందరికీ హీమోగ్లోబిన్ పరీక్షలు జరపాలని, హీమోగ్లోబిన్ తక్కువ ఉన్నవారికి, పోషకాహారం తీసుకోవడంతో బాటు, అవసరమైన మందులను వాడాలని సూచించారు. కొత్తగా వివాహం అయిన మహిళలు, తల్లి కాబోతున్న వారితో సహేలి గ్రూపులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్  ఆదేశించారు. వీరికి వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యం, యూరినరీ ఇన్ఫెక్షన్లు, పోషకాహారం, రక్త హీనత నివారణ, గర్భం దాల్చినతర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లల పోషణ తదితర అంశాలను వివరించాలని సూచించారు. వీరికి అవగాహన కల్పించడంలో వైద్యాధికారులదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. 

మాతృ మరణాలను తగ్గించడమే, సహేలి గ్రూపుల స్థాపన వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యమని చెప్పారు. 20 ఏళ్ళ లోపు గర్భిణీ లపై  ప్రత్యెక శ్రద్ధ చూపాలని అన్నారు.  బడి బయట ఉన్న  వారిని గుర్తించి బడికి పంపాలి లేదా స్కిల్ డెవలప్మెంట్ తరగతులకు పంపాలని ఆదేశించారు. మండల వారీగా బడి బయట ఉన్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి వారి తల్లి దండ్రులతో మాట్లాడి వీలైతే పిల్లల్ని  హాస్టల్ నందు చేర్పించాలని  సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్డీవో సూర్యకళ , సిపిఓ పి.మురళి, డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ ఎస్వీ రమణకుమారి, డీఈవో లింగేశ్వర రెడ్డి, మున్సిపల్ కమీషనర్ శ్రీరాములు నాయుడు , కెఆర్ఆర్సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్య నారాయణ, సర్వే శాఖ ఎడి త్రివిక్రమరావు,  ఎంపిడివోలు, తాసిల్డార్లు, ఎంఈఓలు, సిడిపిఓలు, మెడికల్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

Vizianagaram

2023-02-03 13:22:31

లెబ్రెరీల్లో సామాగ్రి కొనుగోలుకు క‌మిటీ ఆమోదం

విజ‌య‌న‌గ‌రంజిల్లాలోని కేంద్ర గ్రంథాల‌యం, గ్రామీణ గ్రంథాల‌యాల నిర్వ‌హ‌ణ నిమిత్తం అవ‌స‌ర‌మైన సామాగ్రి కొనుగోలుకు క‌మిటీ ఆమోదం తెలిపింద‌ని ఈ మేర‌కు ఆస‌క్తి కలిగిన‌ స‌ర‌ఫ‌రాదారుల నుంచి టెండ‌ర్లు ఆహ్వానిస్తున్న‌ట్లు జిల్లా గ్రంథాల‌య సంస్థ కార్య‌ద‌ర్శి ఎన్‌. ల‌లిత శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఫ‌ర్నీచ‌ర్, జెరాక్స్ మెషీన్లు, ప్రింటింగ్ రిజిస్ట‌ర్లు స‌ర‌ఫ‌రా చేయుట‌కు ముందుకొచ్చే వారు www.apeprocurement.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ-టెండ‌ర్లు దాఖ‌లు చేయాల‌ని సూచించారు. సంబంధిత వివ‌రాల‌ను టెండ‌రుదారుల ప‌రిశీల‌నార్థం ఈ-ప్రొక్యూర్‌మెంట్ వెబ్‌సైట్లో ఫిబ్ర‌వ‌రి 4 నుంచి ప‌ది రోజుల పాటు అందుబాటులో ఉంచుతామ‌ని పేర్కొన్నారు.

Vizianagaram

2023-02-03 13:18:44

రామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై పోలీస్ సమీక్ష

తిరుమల ఈవో ఎవి.ధర్మారెడ్డి ఆదేశాల మేరకు టిటిడి విజిలెన్స్, పోలీసు అధికారులు  రామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై శుక్రవారం కామన్‌కమాండ్‌ కంట్రోల్‌ మీటింగ్‌ హాల్‌లో సమీక్ష నిర్వహించారు. పార్కింగ్ సమస్య దృష్ట్యా భక్తుల రాకపోకలకు ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. తిరుమల పోలీసుల సమన్వయంతో ట్రాఫిక్ నిబంధనలు రూపొందిస్తున్నారు. రామకృష్ణ తీర్థానికి వెళ్లే భక్తులకు ఆహార ప్యాకెట్ల పంపిణీ, పైప్‌లైన్ ద్వారా నీటి సరఫరాపై చర్చించారు. అదనపు ఎస్పీ  మునిరామయ్య, విజీఓలు  బాలిరెడ్డి,  గిరిధర్, డిఎఫ్ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

Tirupati

2023-02-03 11:14:26

విద్యార్ధులకు జగనన్న విదేశీ విద్యాదీవెన చెక్కు అందజేత

జగనన్న విదేశీ విద్యా దీవెన కొత్త పథకం ద్వారా 2023 సంవత్సరానికి గాను మొదటి విడతగా జిల్లాలో మంజూరైన 11 మంది విద్యార్ధులకు  రూ.1,16,78,756 /-మొత్తాన్ని  మెగా చెక్కు రూపంలో విశాఖజిల్లా కలెక్టర్ డా.ఏ.మల్లిఖార్జున కలెక్టరేట్ లో శుక్రవారం జివిఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిలతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ప్రభుత్వం అందజేసిన ఈ సహకారంతో విద్యార్ధినీ విద్యార్దులు ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, విద్యార్ధినీ విద్యార్ధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-02-03 09:16:57

స్పందన అర్జీలు 24 గంటల్లో ఓపెన్ చేసిచూడాలి

స్పందన లాగిన్ లో వచ్చిన వినతులను ఆయా శాఖల అధికారులు 24 గంటల్లో ఓపెన్ చేసి చూడాలని, అలా చూడని వారి పై క్రమశిక్షణా రాహిత్యం గా పరిగణించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని డి.ఆర్.ఓ గణపతి రావు తెలిపారు. గురువారం తన ఛాంబర్ లో స్పందన ఆడిట్ టీం తో సమావేశం నిర్వహించారు.  స్పందన కార్యక్రమం ఇక పై జగనన్నకు చెపుదాం గా మార్పు జరిగిందని, ఈ కార్యక్రమాన్ని నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి పర్యవేక్షిస్తారని తెలిపారు.  అధికారులు స్పందన లాగిన్ లో  వచ్చిన దరఖాస్తు తన పరిధి లో ఉంటే ఎస్ అని క్లిక్ చేసి ఎంకవైరీ అధికారికి పంపాలని , తన పరిధి లో  కానిదైతే నో క్లిక్ చేసి స్పందన టెక్నికల్ టీం కు ఆన్లైన్ లో పంపాలని తెలిపారు.  అదే విధంగా పరిష్కరించె అధికారి ఎంక్వయిరీ రిపోర్ట్, ఫోటో  ను సరి చూసుకోవాలన్నారు.  స్పందన పరిష్కారం పై పిటిషన్ దారు అసంతృప్తి వ్యక్తం చేస్తే జిల్లా స్థాయి ఆడిట్ కమిటీ  విచారణ చేసి మరల రెడ్రెస్సల్ చేయాలన్నారు. ఈ సమావేశం లో జిల్లా పరిషత్ సి.ఈ.ఓ డా.అశోక్ కుమార్, సి.పి.ఓ బాలాజీ, ఇతర శాఖల  అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-02-02 13:20:36

గ్రామ సచివాలయాల్లోనే డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్

గ్రామ, వార్డు  సచివాలయాలలో డాక్యుమెంటు రిజిస్ట్రేషను ప్రారంబించుటకు అవసరమైన ప్రక్రియ పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  గురువారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో  ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ పధకాలు అమలు గూర్చి  సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రీ-సర్వే, భూసేకరణ, మ్యుటేషన్స్, భూ వినియోగ మార్పిడి,  జాతీయ రహదారుల ప్రోజెక్టులు,  వ్యవసాయ రంగానికి సంబంధించి రబీ కాలానికి ఇ-క్రాప్ బుకింగు,  బిందుసేద్యం, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం, జగనన్న పాలవెల్లువ, వై.ఎస్.ఆర్.చేయూత, గృహ నిర్మాణం,  చిరుధాన్యాల సాగు,వినియోగ ప్రోత్సాహం  మొదలైన పధకాలు అమలును  జిల్లాల వారీగా లక్ష్యాలను సమీక్షించారు. 

డాక్యుమెంటు రిజిస్ట్రేషను చేయుటకు అవసరమైన ప్రక్రియ వెంటనే పూర్తిచేయాలని,  అందుకు గాను  భూ రికార్డులను స్వచ్చీకరించాలని,  భూ యజమానులకు అందిస్తున్న భూహక్కు పత్రాలలో పేరు, సర్వేనంబర్ల వివరాలు తప్పులు లేకుండా రికార్డులను 16వ తేదీ నాటికి సిద్దం చేయాలన్నారు.  పాత జీ.ఒ. ప్రకారం వచ్చిన  భూ వినియోగ మార్పిడి ధరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని తెలిపారు.  భూ సేకరణ, జాతీయ రహదారుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు.   20వ తేదీలోపుగా రబీ పంట ఇ-క్రాప్ బుకింగు పూర్తిచేసి గ్రామ వ్యవసాయ సహయకుడు, గ్రామరెవిన్యూ అధికారి దృవీకరణ పూర్తిచేయాలని తెలిపారు. రైతుభరోసా కేంద్రాలలో ఏర్పాటుచేస్తున్న వై.ఎస్.ఆర్.యంత్ర సేవా పధకం నకు రైతులతో సంఘాలు ఏర్పాటుచేసి, ప్రభుత్వం అందించే సబ్సడీతో యంత్రాలు కొనుగోలు చేయాలన్నారు.   చిరుదాన్యాల సాగును ప్రోత్సహించాలని, ఉద్యాన పంటలలో అంతర పంటలుగా చిరుదాన్యాలను సాగుచేయించాలన్నారు.   లక్ష్యం మేరకు బిందు సేద్యం అమలుచేయాలని,  వర్షాధార ప్రాంతాలలో చిరుదాన్యాల సాగును ప్రోత్సహించాలని తెలిపారు.  పట్టు పరిశ్రమ, మత్స్యశాఖల ద్వారా అమలు చేస్తున్న పధకాలను వేగవంతం చేయాలన్నారు.

  ఉగాది నాటికి లక్ష్యం మేరకు గృహాల నిర్మాణాలు పూర్తిచేయుటకు అవసరమైన నిధులను ప్రభుతం అందిస్తున్నదని,  పనులు పూర్తిచేయుటకు కావలసిన సహకారం అందిస్తామని,  ఇసుక, సిమెంటు తదితర మెటీరియల్ అవసరమైతే ఇండెంటు పెట్టాలని తెలిపారు.  వై.ఎస్.ఆర్. చేయూత, వై.ఎస్.ఆర్. పాలవెల్లువ, బల్క్ మిల్క్ కూలింగు సెంటర్ల నిర్మాణం లక్ష్యాలు పూర్తిచేయాలని తెలిపారు. జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ జిల్లా నివేదికలను తెలియజేస్తూ  జిల్లాకు  జాతీయ రహదారులతో రోడ్డు అనుసందానం లేదని, జిల్లా కేంద్రం పార్వతీపురం ను కలుపుకుంటు జాతీయ రహదారి మంజూరు చేయాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టరు అధికారులతో సమీక్షిస్తూ రబీ పంటకు  ఇ-క్రాప్ నమోదు  20వ తేదీ నాటికి పూర్తిజేయాలన్నారు.  గృహనిర్మాణాలకు సంబంధించి మండల వారీగా లక్ష్యాలు నిర్దేశించి పనులు వేగవంతంచేయాలని, అవసరమైన నిధుల కొరకు నివేదిక ను తయాయచేయాలని  తెలిపారు. 

ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టరు ఒ.ఆనంద్, ఐ.టి.డి.ఎ. ప్రోజెక్టు అధికారి  సి. విష్ణుచరణ్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకటరావు,  జిల్లా వ్యవసాయ అధికారి రాబర్ట్ పాల్, జిల్లా మత్స్య శాఖ అధికారి వేమూరి తిరుపతయ్య, జిల్లా పశుసంవర్ధక అధికారి ఏ. ఈశ్వర రావు, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.రఘురాం,  జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామ చంద్ర రావు, జిల్లా సర్వే సెటిల్మెంట్ అధికారి కె. రాజ కుమార్, జిల్లా సూక్ష్మ నీటి అధికారి ఎల్.శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2023-02-02 12:41:24

కెకె లైన్ లో పట్టాలు తప్పిన గూడ్సు రైలు

బచేలి నుంచి విశాఖపట్నం వైపు వస్తున్న గూడ్స్ రైలు కొత్తవలస-కిరండూల్ సెక్షన్‌లోని శివలింగపురం-బొడ్డవర సెక్షన్‌లోని టన్నెల్-7కు ముందు శివలింగపురం యార్డ్ సమీపంలో పట్టాలు తప్పింది. 8 లోడెడ్ వ్యాగన్లు సైట్ వద్ద పట్టాలు తప్పాయి. కోరాపుట్,  విశాఖపట్నం నుండి ప్రమాద సహాయ రైళ్లు పునరుద్ధరణ కార్యకలాపాలు, సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు  వాల్తేరు డీఆర్ఎం అనుప్ సత్పతి కూడా స్థలానికి చేరుకున్నారు. యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. విశాఖపట్నం-కిరండూల్ రైలు 08551 ఈరోజు (02.02.2023) రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ప్రయాణీకులకు రీఫండ్‌లు చేస్తున్నారు. ఆన్‌లైన్ టిక్కెట్ హోల్డర్లు రీఫండ్‌ల కోసం ఆన్‌లైన్ టిడిఆర్ ఫైల్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

Visakhapatnam

2023-02-02 05:06:44

గోరక్షణ మనమంతా బాధ్యతగా స్వీకరించాలి

గోరక్షణను ప్రతీ ఒక్కరూ భాద్యత చేపట్టాలని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. సింహాచలం శ్రీకృష్ణాపురం లోని దేవస్థానం నృసింహ వనం, గోశాలలో నూతనంగా నిర్మించిన షెడ్డును ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ, గో రక్షణ వలన లోకం శుభిక్షంగా ఉంటుందన్నారు. ఇంత పెద్దమొత్తంలో గోశాలను నిర్వహిస్తున్న దేవస్థానాన్ని ఆయన అభినందించారు. ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, దేవస్థానంలో జరిగే పనులను వివరించారు. 30 అడుగుల వెడల్పు, 90 అడుగుల పొడవు ఉన్న షెడ్ నిర్మాణానికి రూ.15 లక్షలు ఖర్చయిందని.. సింహాచలేశుని దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యుడు సంపంగి శ్రీవాసరావు ఈ వ్యయాన్ని అందించారు. గోవుల రక్షణార్ధం ఈ షెడ్ వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో త్రినాథరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రధానార్చకులు శ్రీనివాసాచార్యులు, ఈఈ శ్రీనివాసరాజు, ఏ. రాంబాబు, ఏ ఈవోలు ఇజ్జురోతు శ్రీనివాసరావు, విబివి. రమణమూర్తి, నరసింహరాజు,ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు,  వైసీపీ నేత కేకే.రాజు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.

Simhachalam

2023-01-31 15:25:12

10న ఫైలేరియా నివారణ మాత్ర‌ల పంపిణీ

జాతీయ ఫైలేరియా నియంత్ర‌ణ కార్య‌క్ర‌మంలో భాగంగా ఫైలేరియా నిర్మూల‌న‌కు ఫిబ్ర‌వ‌రి 10వ తేదీన పెద్దఎత్తున ప్ర‌జ‌ల‌కు ఉచితంగా మాత్ర‌లు పంపిణీ చేసి, వేయించే కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా తెలిపారు. మంగ‌ళ‌వారం కాకినాడ క‌లెక్ట‌రేట్ నుంచి క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా అధ్య‌క్ష‌త‌న ఫైలేరియా నియంత్ర‌ణ‌పై జిల్లా స‌మ‌న్వ‌య క‌మిటీ (డీసీసీ) స‌మావేశం వ‌ర్చువ‌ల్‌గా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా మాట్లాడుతూ రెండేళ్ల‌కు పైబ‌డిన వారికి ఫైలేరియా నివార‌ణ మాత్ర‌లు (డై ఇథైల్ కార్బ‌మెజైన్‌-డీఈసీ, ఆల్‌బెండ‌జోల్‌) పంపిణీ చేసి, వేసుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మం ఆవ‌శ్య‌క‌త‌పై ప్ర‌జ‌ల‌కు గ్రామ‌, వార్డు స‌చివాల‌య స్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు.

 స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారులు కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు ఆయా శాఖ‌ల క్షేత్ర‌స్థాయి సిబ్బందికి శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌న్నారు. వ‌య‌సు ఆధారంగా ఇవ్వాల్సిన మాత్ర‌లు, డోస్ త‌దిత‌రాల‌పై అవ‌గాహ‌న పెంపొందించాల‌న్నారు. తిన్న త‌ర్వాతే మాత్ర‌లు వేసుకోవాల్సి ఉంటుంద‌ని, ఈ విష‌యంపై సిబ్బందికి అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మం జ‌రిగే రోజున పీహెచ్‌సీ స్థాయిలో వైద్య అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశించారు. స‌మావేశానికి జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, డీఎంహెచ్‌వో డా. ఎం.శాంతిప్ర‌భ‌, డీసీహెచ్ఎస్ డా. పీబీవీ విష్ణువ‌ర్ధిని, జిల్లా మ‌లేరియా అధికారి ఎస్‌.భాస్క‌ర్, జిల్లా పంచాయ‌తీ అధికారి ఆర్‌.విక్ట‌ర్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2023-01-31 15:07:38

వృత్తిని ఆస్వాదిస్తూ ఉత్త‌మ సేవ‌లందించండి

 వైద్యవృత్తి చాలాప‌విత్ర‌మైన‌ద‌ని.. ఆవృత్తిని ఆస్వాదిస్తూ ప్రజ‌ల‌కు మెరుగైన రీతిలో సేవ‌లందించాల‌ని మెడిక‌ల్ ఆఫీస‌ర్ల‌ను ఉద్దేశించి జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి అన్నారు. చ‌క్క‌టి చిరున‌వ్వుతో ప‌ల‌క‌రించ‌టం ద్వారా రోగుల మ‌న‌సును తేలిక చేయాల‌ని త‌ర్వాత చికిత్స అంద‌జేయాల‌ని హిత‌వు ప‌లికారు. వైద్య‌ప‌ర‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకొనేలా ఆరోగ్యాన్ని కాపాడుకునేలా ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న  క‌ల్పించాల‌ని సూచించారు. ఇటీవ‌ల నియ‌మితులైన మెడిక‌ల్ ఆఫీస‌ర్ల నిమిత్తం స్థానిక డీఎం & హెచ్‌వో కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం ఒన్ డే ఓరియంటేష‌న్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజ‌రైన క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి వైద్యుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. 

ప‌నిని భారంగా కాకుండా ఇష్టంగా చేయాల‌ని, పేద ప్ర‌జ‌ల‌కు వైద్య‌ప‌ర‌మైన సేవ‌లందించటం అదృష్టంగా భావించాల‌ని.. మ‌న‌సుకు సంతృప్తి క‌లిగేలా ప‌ని చేయాల‌ని పేర్కొన్నారు. వైద్య వృత్తిలో ఉన్న‌వారికి ముఖ్యంగా స‌మ‌య‌పాల‌న‌, ప్ర‌శాంతత అవ‌స‌ర‌మ‌ని వాటిని ప్ర‌తి ఒక్క‌రూ పాటించాల‌న్నారు. ప్ర‌జ‌ల‌తో ప్రేమ పూర్వ‌కంగా మాట్లాడి త‌మ స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవాల‌ని, మెరుగైన రీతిలో చికిత్స అంద‌జేయాల‌ని చెప్పారు. సాధ్య‌మైనంత మేర‌కు చిన్న‌చిన్న కేసుల‌ను రిఫ‌ర‌ల్ చేయొద్ద‌ని సూచించారు. నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను పెంపొందించుకోవాల‌ని, ప్ర‌జ‌లు, ఇత‌ర విభాగాల అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను భాగ‌స్వామ్యం చేసుకొని ముందుకెళ్లాల‌ని కలెక్ట‌ర్ సూచించారు. 

స్థానిక ప‌రిస్థితులు, వాత‌వర‌ణాన్ని దృష్టిలో ఉంచుకొని అవ‌స‌ర‌మైన మందుల‌ను అందుబాటులో ఉంచుకోవాల‌న్నారు. చేసిన ప‌నికి సంబంధించిన నివేదిక‌లు స‌మ‌ర్పించేట‌ప్పుడు సాంకేతిక త‌ప్పిదాలు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త వ‌హించాల‌ని చెప్పారు. క్షేత్ర స్థాయిలో గ్రామీణ ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించే అవ‌కాశం రావ‌టం అదృష్టంగా భావించాల‌ని వైద్యుల‌కు సూచించారు. స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, ఇత‌ర విభాగాల అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ప్ర‌జ‌ల‌కు ఉత్త‌మ సేవ‌లందించాల‌ని హిత‌వు ప‌లికారు.కార్య‌క్ర‌మంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డా. ఎస్‌.వి. ర‌మ‌ణ కుమారి, జిల్లా మలేరియా అధికారిణి డా. తుల‌సి, ఇత‌ర వైద్యులు, డెమో సెక్ష‌న్ అధికారులు, సిబ్బంది, అధిక సంఖ్య‌లో మెడిక‌ల్ ఆఫీస‌ర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-01-31 10:38:58

ఫిబ్రవరి5న నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో లెక్కింపు

తిరుమలలో నిర్మించిన నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నంలో ఫిబ్రవరి 5న కానుకల లెక్కింపు ప్రారంభంకానుంది. ఉదయం 9 గంటల నుండి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పుణ్యాహవచనం, గోమాత ప్రవేశం, గోపూజ, సుదర్శన హోమం నిర్వహిస్తారు. అనంతరం కానుకలను వేరుచేయడం, లెక్కించడం చేపడతారు. తిరుమ‌లలో స్వామివారి హుండీ కానుక‌లు లెక్కించ‌డానికి బెంగళూరుకు చెందిన దాత  మురళీకృష్ణ అందించిన రూ.23 కోట్ల విరాళంతో అధునాత‌న సౌక‌ర్యాల‌తో కూడిన నూత‌న పరకామణి భవనం నిర్మించారు. శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల సందర్భంగా 2022 సెప్టెంబరు 28న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఈ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం అభివృద్ధి పనులు పూర్తి చేసి సిద్ధం చేశారు.

Tirumala

2023-01-31 09:57:53

అల్లూరి చరిత్రను పట్టించుకోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్లవ జ్యోతి, అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు చరిత్రను పెడచెవిన పెట్టిందని జనసేన అరకు పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్రజి  వంపూరు గంగులయ్య ఆరోపించారు. మంగళవారం ఆయన అరకులో మీడియాతో మాట్లాడారు. జిల్లాల పునర్విభజనలో అల్లూరి పేరుని పాడేరు జిల్లాకు పెట్టిన ప్రభుత్వం ఆయన చరిత్రను పట్టించుకోవడం మానేసిందన్నారు. అల్లూరి సంచరించిన ప్రదేశాలను ఒక సెంట్రల్ థీమ్ ప్రాజెక్టుగా చేయడం ద్వారా అల్లూరి కోసం భావితరాల గిరిజనులకు తెలుస్తుందని, అంతేకాకుండా ఈప్రాంతం పర్యాటక పరంగా అభివ్రుద్ధి చెందుతుందన్నారు. అల్లూరి సీతారామరాజు ఉమ్మడి విశాఖజిల్లాలోని మన్యం వేదికగా తన పోరాటం చేశారని, ఆయన పోరాటాలు చేసిన ప్రతీప్రదేశాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక గిరిజన యువతకు ఉపాది దొరుకడంతోపాటు, అల్లూరి చరిత్ర భాహ్య ప్రపంచానికి తెలుస్తుందని, ఈవిషయమై ప్రభుత్వం తక్షణమే నిర్ధిష్ట ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

Araku Valley

2023-01-31 05:06:49