ఉగాది నాటికి జిల్లాకు నిర్దేశించిన 6319 ఇళ్ళ నిర్మాణం పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీ లత స్పష్టం చేశారు. శుక్రవారం రాజమండ్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో తొమ్మిది అజెండా అంశాల హౌసింగ్, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీ రాజ్ జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో హౌసింగ్, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సమగ్రంగా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని, ఆమేరకు పురోగతి సాధించాలని అన్నారు. ఇప్పటికే ఇళ్ళ నిర్మాణ పనులు పురోగతి ఉన్న లబ్దిదారులకు మరింత ప్రోత్సాహం ఇవ్వవలసి ఉందన్నారు. ఉగాది నాటికి జిల్లాకు 6319 ఇళ్ళ లక్ష్యం కుగాను1,862 పూర్తి చేసుకోవడం జరిగిందని అన్నారు. రాజమహేంద్రవరం అర్బన్ లో 998, కొవ్వూరు అర్బన్ 450, అనపర్తి 512, కొవ్వూరు రూరల్ 298, బిక్కవోలు 245 పెండింగ్ ఉన్నట్లు తెలిపారు. స్టేజ్ కన్వర్షన్ లో బి ఎల్ - 8819, ఆర్ ఎల్ - 1862, ఆర్ సి - 806 ఉన్నాయని అన్నారు. రాబోయే 30 రోజులు అత్యంత కీలకం అన్నారు. స్టేజ్ కన్వర్షన్ నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ స్పష్టం చేశారు.
స్వంత స్థలం లో ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరు ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. జిల్లాలో ప్రత్యేక సర్వే ద్వారా అత్యంత ప్రాధాన్యత కలిగిన 1958 పనులను గుర్తించడం జరిగిందన్నారు. వీటిలో ఇన్ఫ్రా, సేవలు, మానవ వనరులు చెందిన అంశాలు ఉన్నట్లు తెలిపారు. వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సంబంధించిన పనులకు తక్షణం మంజూరు ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు గుర్తించిన పనులకు చెంది మూడు కేటగిరీ లుగా విభజన చేయాలన్నారు. ప్రతి మండలం వారీగా సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తానని, వాటిపై కేటగిరీ వారీగా మండల అభివృద్ధి అధికారులు నివేదిక సిద్దం చేసుకోవాలని ఆదేశించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో పై పేర్కొన్న పనులు ఉన్నట్లు గుర్తించినట్లు అయితే వాటిపై నివేదిక అంద చేయాలన్నారు. మండల పరిధిలోని గ్రామాల వారీగా, సచివాలయం వారీగా అంశాల ను కేటగిరీ విభజించి నివేదిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ప్రతి సచివాలయానికి కేటాయించిన రూ.20 లక్షల నిధులతో జీజీఎంపి పనులను చేపట్టాలని, మేజర్ పనులకు చెంది ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
65వ సెంట్రల్ సాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ కింద నిర్దేశించిన 11,300 ఇళ్ళ లక్ష్యం కు గాను 9858 డేటా ఎంట్రీ 87 శాతం పూర్తి చేయడం జరిగిందని , 66 వ సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ కింద 5801 ఇళ్లకు గాను 5745(99%) డేటా ఎంట్రీ పనులు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. మిగిలిన డేటా పనులు శుక్రవారం పూర్తి చేస్తే, ప్రభుత్వానికి అందుకు అనుగుణంగా నిధుల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపుతామని కలెక్టర్ మాధవీలత అన్నారు. స్వంత ఇంటి స్థలంలో ఇంటి నిర్మాణం కోసం ఆసక్తి కలిగిన 14134 మంది లబ్దిదారులలో 1060 మంది డేటా అప్డేట్ చెయ్యడం జరుగుందని, మిగిలిన వాటిని రాబోయే 48 గంటల్లో పూర్తి చేయాలన్నారు. లే అవుట్ ల వారీగా కరెంట్, విద్యుత్ సంబంధించి అన్ని పనులు పై నివేదిక అందజేయ్యాలని కలెక్టర్ పేర్కొన్నారు.
సర్వే మేరకు ప్రభుత్వం నేరుగా గుర్తించిన వాటిలో నగరపాలక సంస్థ పరిధిలో 289 ఆర్థికేతర అంశాలకు సంబంధించినవి ఉన్నాయని మునిసిపల్ కమిషనర్ కే. దినేష్ కుమార్ తెలిపారు. ఇవి జీ జీ ఎం పి కింద గుర్తించిన అంశాలు కావని తెలియచేశారు. ఇంటి నిర్మాణ పనులకు అనుగుణంగా ఇటుకలు డిమాండ్ ఉన్నాయని, అందులో భాగంగా స్టేజ్ కన్వర్షన్ మేరకు ఇంటి పనులు కోసం సూక్ష్మ స్థాయి ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరుగుతున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో ఇంఛార్జి జిల్లా హౌసింగ్ అధికారి జీ. పరశురామ్, ఎస్ ఈ ఆర్ డబ్ల్యూ ఎస్ డి. బాల శంకర్ రావు, ఐ సి డి ఎస్ పిడి కె. విజయ కుమారి, డ్వామా పీడీ జీ ఎస్ రామ్ గోపాల్, డి హెచ్ వో వి రాధాకృష్ణ, సిపివో కార్యాలయ ఏ వో కె. శ్రీనివాస రావు, , డిఎల్ డివో పి. వీణా దేవి, కే. శాంత మణి, మైక్రో ఇరిగేషన్ ఎస్. రామ్ మోహన్, ఎంపిడివో లు, హౌసింగ్ ఏ ఈ లు, ఎలక్ట్రికల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
అద్యాత్మిక శక్తి కేంద్రము గా భారత్ రూపాంతరం చెందుతుందని జీవీఎంసీ అదనపు కమిషనర్ డా.వై శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం,విజెఎఫ్ సంయుక్తంగా 3 రోజులపాటు నిర్వహించనున్న మహాశివరాత్రి పర్వదినం మహోత్సవాల బ్రోచర్ ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చెడుపై ఎప్పుడూ మంచి గెలుస్తూనే ఉంటుందని అన్నారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, శివరాత్రి వేడుకలకు జివిఎంసీ మేయర్ హాజరవుతున్నా రన్నారు. బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధి రమా మాట్లాడుతూ, ప్రతీ ఏటా విజేఎఫ్ తో కలసి తాము అన్ని పండగలను ఘనంగా నిర్వహిస్తు న్నామని చెప్పారు. విజెఎఫ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 18వ తేదీ శనివారం మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువపందిళ్లు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా శనివారం తెల్లవారు జామున 2.30 గంటల నుండి 4.30 గంటల వరకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు రథోత్సవం(భోగితేరు), ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు విశేషమైన నంది వాహనసేవ జరుగనున్నాయి. ఉదయం 5.30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4.30 నుండి రాత్రి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఫిబ్రవరి 19వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహిస్తారు.
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో మహాశివరాత్రి సందర్భంగా శనివారం ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు హరికథ, ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తిసంగీతం, హరికథ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శివపురాణం ప్రవచనం, సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో సంగీత, నృత్య కార్యక్రమాలు జరుగనున్నాయి. అదేవిధంగా, రాత్రి 9.30 నుంచి 11 గంటల వరకు నృత్య ప్రదర్శన, రాత్రి 11 నుంచి 12.30 గంటల వరకు శివోహం భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
విశాఖలోని సింథియా మల్కాపురంలోని హిందూస్థాన్ షిపియార్డ్ కార్మికుల నివాసా సముదాయములో ఒక చిన్న కొండపై వెలసియున్న శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి సహిత సోమశేఖర స్వామి దేవస్థానంలో ఫిబ్రవరి 18న శనిత్రయోదశి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు అర్చకులు కామేశ్వర శర్మ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, శనిత్రయోదశి సంయుక్త మహాశివరాత్రి చాలా అరుదుగా( 27 ఏళ్లకు) వస్తుందన్నారు. ఆ మహాపర్వదినాన, శని పూజలు చేయించుకుంటే గోచార రీత్యా శనైశ్చరస్వామి స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి మహా విశేష ఫలితాన్ని ఇస్తాడని అన్నారు. జన్మ లగ్నమును బట్టి గోచారాన్ని బట్టి జన్మశని, అర్ధాష్టమ శని ఏలినాటి శని దోషముల నుండి నివృత్తి చెందుటకు శనేశ్వర స్వామి వారికి చేసే తైలాభిషేకముతోపాటు, శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ సోమశేఖరస్వామి వార్లకు ప్రదోషకాలాభిషేకములు చేయించుకున్నవారికి వెయ్యి రెట్లు అధిక ఫలితము లభిస్తుందని వివరించారు.
విశాఖనుంచి బయలు దేరే వందేభారత్ రెండు గంటలు ఆలస్యంగా ప్రయాణిస్తుందని విశాఖ రైల్వే అధికారులు ప్రకటించారు. ఇటీవల జరిగిన గోదావరి ఎక్స్ ప్రెస్ ఘటన కారణంగా పలు రైళ్ళు ఆలస్యంగా నడుస్తున్నాయని..అందులో భాగంగానే శుక్రవారం విశాఖపట్నం నుండి ఉదయం 5.45గంటలకి బయలుదేరవలసిన వందే భారత్ రెండు గంటలు ఆలస్యంగా 7.45కి విశాఖపట్నం నుండి బయలుదేరుతుందని రైల్వే అధికారులు వివరించారు. ఈ విషయాన్ని ప్రయాణీకులు గమనించుకోవాలని తెలియజేశారు.
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 18వ తేదీ శనివారం మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువపందిళ్లు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా శనివారం తెల్లవారుజామున 2.30 గంటల నుండి 4.30 గంటల వరకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు రథోత్సవం(భోగితేరు), ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు విశేషమైన నంది వాహనసేవ జరుగనున్నాయి.
ఉదయం 5.30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4.30 నుండి రాత్రి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఫిబ్రవరి 19వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 19న శివపార్వతుల కల్యాణం
శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి మరుసటి రోజైన ఆదివారం శివపార్వతుల కల్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుంది. సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు ఆర్జితసేవగా ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) అప్పటికప్పుడు రూ.250/- చెల్లించి టికెట్ కొనుగోలు చేసి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి పోలీస్ స్పందన కార్యక్రమానికి 28 అర్జీలు వచ్చినట్టు జిల్లా అడిషనల్ ఎస్పీ (లా అండ్ ఆర్డర్) ఎం.రజనీ తెలియజేశారు. సోమవారం జిల్లా పరిధిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదిదారులతో జిల్లా ఎస్పీ కార్యాలయంలో స్వయంగా ముఖాముఖిగా మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను జాప్యం లేకుండా తక్షణమే పరిష్కారం చేస్తామని అర్జీదారులకు హామీ ఇచ్చారు. ఈ స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని పోలీసు అధికారులకు ఏఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
ఉత్తరాంధ్రా శాసన మండలి ఎన్నికలకు సిద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శాసన మండలి ఎన్నికలకు సంబంధించి పట్టభద్రులు, స్థానిక సంస్థల నియోజక వర్గాల నోడల్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసరమైతే తప్ప రెవెన్యూ సిబ్బంది ఎన్నికల సమయంలో సెలవులు పెట్టరాదన్నారు. పట్టభద్రులకు సంబంధించి 59 పోలింగ్ స్టేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలకు 4 పోలింగ్ కేంద్రాలు ఉంటాయన్నారు. సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించాలని, పోలీసు బందోబస్తు ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు తెలిపారు. పిఓ, ఎపిఓలకు శిక్షణ తరగతులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిఆర్డిఎ పిడి, కొవ్వాడ ఎస్డీసిలను ఆదేశించారు. అందుబాటులో ఉన్న బ్యాలెట్ బాక్స్ లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
డిపిఓ పోలింగ్ కు సంబంధించి మెటీరియల్ చూసుకోవాలని, ఎన్నికల నియమావళి సిపిఓ, సింగిల్ విండో ఫర్మిషన్ సెట్ శ్రీ సిఇఓ చూడాలన్నారు. సూక్ష్మ పరిశీలకులుగా బ్యాంకు, పోస్టల్ సిబ్బందికి శిక్షణ తరగతులు ఏర్పాటు లీడ్ బ్యాంక్ మేనేజర్ చర్యలు తీసుకోవాలని, బ్యాలెట్ పేపర్ మెప్మా పిడి, వెబ్ కాస్టింగ్ వీడియో గ్రాఫర్లు, ఫొటోగ్రఫీ హౌసింగ్ పీడీ చూసుకోవాలని ఆదేశించారు. నామినేషన్లకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు రిపోర్టులు ఎన్నికల కమీషన్ కు పంపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. స్ట్రాంగ్ రూం వద్ద ఏర్పాట్లు చూసుకోవాలన్నారు. ఎన్నికల మెటీరియల్ కు సంబంధించి అందరి నోడల్ అధికారులతో డిపిఓ కో ఆర్డినేట్ చేసుకోవాలన్నారు. ఎన్నికల పనులపై నిర్లక్ష్యం వహించరాదన్నారు. ఎన్నికల సామగ్రిని ముందుగానే తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ, ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆర్డీవోలు సీతారామమూర్తి, బి. శాంతి, ఉప కలెక్టర్ మురళీకృష్ణ, డిపిఓ రవి కుమార్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేసు, డిఆర్డిఎ పిడి విద్యాసాగర్, ఆర్ అండ్ బి ఎస్ఈ కాంతిమతి, హౌసింగ్ పీడీ గణపతిరావు, కలెక్టరేట్ ఏవో రాజేశ్వరరావు, తహసీల్దార్ వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.
మనబడి నాడు-నేడు పథకంలో భాగంగా జిల్లాలోని విద్యా సంస్థల్లో చేపట్టిన పనులకు సంబంధించి మిగులు సిమెంటును అవసరం ఉన్నచోట సర్దుబాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. రెండో దశలో భాగంగా కేటాయించిన సిమెంటును కొన్ని చోట్ల పూర్తిగా వినియోగించలేదని, సంబంధిత నిల్వలను అవసరం ఉన్న ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని సూచించారు. జిల్లాలో చేపట్టిన నాడు-నేడు పనుల ప్రగతిపై కలెక్టరేట్ ఆడిటోరియంలో సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. పనుల నిమిత్తం కేటాయించిన సిమెంటును వినియోగించి సకాలంలో పనులు పూర్తి చేయాలని, ఒకవేళ సిమెంటు మిగిలినట్లయితే సంబంధిత నివేదికను మంగళవారం సాయంత్రానికి తెలియజేసి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
సిమెంటు కేటాయించినప్పటికీ పనులు ప్రారంభం కాకపోతే సంబంధిత ఇండెంటును ఇతర ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. మొదటి ప్రాధాన్యతగా పాఠశాలలకు, రెండో ప్రాధాన్యతలో భాగంగా కళాశాలలకు మిగులు సిమెంటును సర్దుబాటు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా అందిస్తున్న ఆహారాన్ని మరింత రుచికరంగా వండాలని, ఎక్కువ మంది పిల్లలు ఆహారాన్ని తీసుకొనేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. పిల్లలు సరిగ్గా తినకపోవటం వల్ల రక్తహీనత, ఇతర సమస్యలు ఉత్పన్నమవుతాయని అన్నారు. భోజన విరామ సమయంలో పిల్లలను బయటకి పంపించవద్దని కలెక్టర్ సూచించారు. బయట చిల్లర తిండి తినటం వల్ల పిల్లలు మధ్యాహ్న భోజనం తినడానికి ఆసక్తి కనబరచటం లేదని, దీన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలను మధ్యాహ్నం పూట బయటకు పంపింపచకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఒక వేళ ఎవరైనా ఇంటి నుంచి బాక్సు తెచ్చుకుంటే అనుమతించాలని స్పష్టం చేశారు. సమావేశంలో డీఈవో లింగేశ్వర రెడ్డి, డీవీఈవో సురేశ్, స్పెషల్ ఆఫీసర్లు, హెచ్.ఎం.లు తదితరులు పాల్గొన్నారు.
రహదారి భద్రత కమిటీ సమావేశాన్ని ఈ నెల 15వ తేదీన నిర్వహిస్తున్నట్లు పార్వతీపురం జిల్లా రవాణాశాఖాధికారి సి.మల్లికార్జున రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 15వ తేదీ ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో కమిటీ సమావేశం జరుగుతుందన్నారు. జిల్లాలో శాఖల వారీగా చేపట్టాల్సిన రహదారి భద్రతా కార్యక్రమాలపై సమావేశంలో చర్చించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశానికి జిల్లాలోని రహదారి భద్రతా కమిటీ సభ్యులు అందరూ హాజరుకావాలని ఆయన కోరారు.
అల్లూరి జిల్లాలో పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పి వారిని జాతికి అంకితం చేయాల్సిన ఉపాధ్యాయులే విధులకు డుమ్మా కొడుతూ స్వంత పనులు చక్కపెట్టుకుంటున్నట్టు ఆధారాలతో పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కు కోకొల్లలుగా ఫిర్యాదులు అందుతున్నాయని ఇటువంటి వారిని చూస్తూ ఉపేక్షించేది లేదని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం, కుమారి ఆదిలక్ష్మి త్రిపర్ణ అన్నారు. సోమవారం జిల్లా విద్యా శాఖాధికారులతో పాడేరు కాఫీ హౌస్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సభ్యులు సీతారాం మాట్లాడుతూ, డ్రాప్ ఔట్లు జిల్లాలో ఎంతమంది ఉన్నారు, గుర్తించిన రికార్డులపై ఆరా తీశారు, వారిని చేర్పించిన పాఠశాలల వివరాలు, వారిని పర్యవేక్షిస్తున్న అధికారులు గురించి అడిగి తెలుసుకున్నారు. డుమ్మా కొడుతూ విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్న ఉపాధ్యాయుల వివరాలను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కు త్వరిత గతిన నివేదిక సమర్పించాలని ఎంఈఓలకు ఆదేశాలు జారీచేశారు.
అదేవిధంగా బాలలను మత్తు పదార్థాలు, వ్యసనాలకు గురిచేస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టేలా ప్రణాళికా యుతంగా వ్యవహరించాలన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా కమిషన్ సభ్యులు గిరిజన సంక్షేమ శాఖ, పోలీసు శాఖ, జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ, ఎక్సైజ్ శాఖ, డ్రగ్ కంట్రోల్, జిల్లా విద్యాశాఖాధికారి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, స్త్రీ శిశు సంక్షేమ, తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బాలల, విద్యార్థుల జీవితాలను చిద్రం చేస్తున్న మత్తు పదార్థాలు, బాలల అక్రమ రవాణా వ్యవహారాలపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ డేగ కళ్ళతో పర్యవేక్షణ జరుపుతోందన్నారు. వీటికి దూరంగా ఉంచుతూ వారి బంగారు భవితకు ఎటువంటి చర్యలు తీసుకుంటే వాటిని విడనాడి పయనిస్తారో ఆయా అంశాలను ప్రభుత్వానికి, జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు, సూచనలు రూపంలో అందిస్తున్నామని అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యురాలు ఎం.రజనీ, ఐసిడిఎస్. పిడి ఎన్.సూర్య లక్ష్మి, సిడిపిఓలు, జిల్లా విద్యా శాఖాధికారి డా. పి. రమేష్, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఐ.కొండల రావు, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎల్. రజని, పిఒడిటిటి డా. భారతి, చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జిల్లా కన్వీనర్ లవకుశ ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రతి రోజు వైద్యం కోసం కె.జి.హెచ్ కు వచ్చే రోగులతో పాటు వారి సహాయకులకు విశ్రాంతి తీసుకునేలా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున కెజిహెచ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టర్ కె.జి.హెచ్ ను ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ కొత్తగా ఏర్పాటు చేసిన 200 పడ కల ఉచిత వసతి భవనాన్నిపరిశీలించారు. అదే విదంగా ఎమర్జెన్సీ వార్డుకు వచ్చే రోగుల సహాయకులకు విశ్రాంతి తీసుకొనేందుకు వెయిటింగ్ హాలు ఏర్పాటు చేయా లని సూచించారు. కె.జి.హెచ్ పరిపాలన భవనానికి ఎదురుగా ఉన్న స్థలంలో పార్కును అభివృద్ది చేసి వాటర్ పౌంటేన్ తో పాటు కూర్చుకొనేందుకు బల్లలు ఏర్పాటు చేయాల న్నారు. కె.జి.హెచ్ ప్రవేశ ద్వారానికి ఆర్చ్ ఏర్పాటు చేసి ప్రక్కనే ఉన్న పార్కింగ్ స్థలాన్ని అభివృద్ది చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కె.జి.హెచ్ సూపరిం టెండెంట్ డా.అశోక్ కుమార్, ఎ.పి.ఎం.ఐ.డి.సి ఈఈ నాయుడు, డాక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో అల్బెండజోల్, డి ఇథైల్ కార్భమజైన్ సిట్రెట్ (డి.ఇ.సి) మాత్రల పంపిణీ కార్యక్రమం ఈ నెల 15వ తేదీన జరుగుతుందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. నులిపురుగులు, ఏలిక పాముల నివారణకు, తద్వారా సంభవించే రక్త హీనత నివారణకు అల్బెండజోల్, డి.ఇ.సి మాత్రలు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. సోమ వారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా అల్బెండజోల్, డి.ఇ.సి మాత్రల పంపిణీపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మందుల పంపిణీ పక్కాగా జరగాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. 15వ తేదీన మందులు తీసుకోని వారికి 16, 17 తేదీల్లో పంపిణీ జరుగుతుందని ఆయన వివరించారు.
2 నుండి 5 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు వంద మిల్లీ గ్రాముల డి.ఇ.సి మాత్ర ఒకటి, నాలుగు వందల మిల్లీ గ్రాముల అల్బెండజోల్ మాత్ర ఒకటి పంపిణీ చేయాలని ఆయన సూచించారు. 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు రెండు వందల మిల్లీ గ్రాముల డి.ఇ.సి మాత్రలు రెండు, నాలుగు వందల మిల్లీ గ్రాముల అల్బెండజోల్ మాత్ర ఒకటి పంపిణీ చేయాలని, 15 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి మూడు వందల మిల్లీ గ్రాముల డి.ఇ.సి మాత్ర మూడు, నాలుగు వందల మిల్లీ గ్రాముల అల్బెండజోల్ మాత్ర ఒకటి పంపిణీ చేయాలని ఆయన సూచించారు. పాఠశాలలలో శత శాతం మాత్రలు పంపిణీ జరుగుటకు జిల్లా విద్యా శాఖ అధికారి అందరు ప్రధాన ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేయాలని, అంగన్వాడీ, వసతి గృహాలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, మున్సిపాలిటీలలో శత శాతం మాత్రలు పంపిణీ జరుగుటకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాలని ఆయన స్పష్టం చేశారు. మందులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. బగాది జగన్నాథ రావు మాట్లాడుతూ రెండు సంవత్సరాల వయస్సు లోపు పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నవారికి మాత్రలు వేయరాదని అన్నారు. ఆహారం తీసుకున్న తర్వాత మాత్రమే మాత్రలు వేయాలని, ఖాళీ కడుపుతో మాత్రలు తీసుకోరాదని ఆయన పేర్కొన్నారు. మాత్రల వలన ప్రయోజనం కలుగుతుందని, దుష్ప్రభావాలు ఉండవని చెప్పారు. మాత్రలు వేసుకొన్న అనంతరం ఆరోగ్యంలో మార్పులు, అస్వస్థత కలుగుతున్నట్లు సందేహం కలిగితే వెంటనే దగ్గరలోని వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలలో నిర్వహించడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, పార్వతీపురం ఐటిడిఎ ప్రాజెక్ అధికారి సి. విష్ణు చరణ్, జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకట రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అంతరించిపోతున్న శిల్పకళ సాంప్రదాయ సంగీత, నృత్య కళలను పోషించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం కృషి చేస్తోందని ఈవో ఎవి ధర్మారెడ్డి చెప్పారు.టీటీడీ శిల్ప కళాశాలలో మూడు రోజులపాటు నిర్వహించే శిల్పకళా ప్రదర్శన, అమ్మకాలను సోమవారం ఈవో ప్రారంభించారు. శిల్ప కళాశాల విద్యార్థులు తయారుచేసిన ఆలయ నిర్మాణం, శిల్ప, సుధా, దారు, లోహ శిల్పాలు, సాంప్రదాయ వర్ణ చిత్రాలు, కలంకారి చిత్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఈవో మాట్లాడుతూ, టీటీడీ అనేక హిందూ ధార్మిక కార్యక్రమాలతో పాటు, సాంఘిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోందనిచెప్పారు. ఇందులో భాగంగా 30 కి పైగా పాఠశాలలు, ఆసుపత్రులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. శిల్పకళలో నైపుణ్యం సంపాదించిన వారికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. టీటీడీ శిల్ప కళాశాల నుంచి వెళ్లిన అనేక మంది విద్యార్థులు దేశ, విదేశాల్లో మంచి స్థాయిలో ఉన్నారని ఆయన చెప్పారు.
విద్యార్థులు శిల్పకళలో ప్రావీణ్యం సాధించి, శిల్పకళను బతికించాలని ఉద్భోదించారు. శిల్ప కళాశాలలో కలంకారి కోర్సులో చేరే విద్యార్థులకు కూడా అడ్మిషన్ సమయంలో రూ. లక్ష డిపాజిట్ చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. శిల్ప కళాశాల నిర్వహణ, పరిసరాల వాతావరణం చక్కగా ఉందని అధ్యాపకులను, విద్యార్థులను ఈవో అభినందించారు. కాగా,ఫిబ్రవరి 15వ తేదీ వరకు రోజు ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు శిల్ప కళా ప్రదర్శన, అమ్మకాలు జరుగుతాయి. జేఈవో సదా భార్గవి, డిఈవో భాస్కర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి తో పాటు వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్ళు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా ద్వామా పిడిగా తూతిక శ్రీనివాస విశ్వానాథ్ ను నియమిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈయన గతంలో పశ్చిమగోదావరి జిల్లా పంచాయతీ అదికారిగా, ప్రకాశంజిల్లా ఎస్సీ కార్పోరేషన్ ఈడిగానూ విశేష సేవలు అందించారు. ప్రకాశం జిల్లాలో 33 సంవత్సరాల భూమి కొనుగోలు పథకంలో దీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యను పరిష్కరించి సుమారు 3750 మంది ఎస్సీలకు చెందిన 3750 ఎకరాలను తనఖా రుణమాఫీ కింద జీఓ 492 అమలుకు కృషిచేసి మంచి అధికారిగా గుర్తింపు పొందారు. విశ్వనాథ్ సేవలను గుర్తించి ప్రకాశం జిల్లా అప్పటి కలెక్టర్ పోలా భాస్కర్ ప్రకాశంజిల్లా పంచాయతీ అధికారిగా అవకాశం కల్పించడంతో కోవిడ్ ఫీవర్ సర్వే నమోదులో జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపి ప్రశంసలు అందుకున్నారు. ఉన్నత అదికారుల ఆదేశాలను అమలుచేస్తూ. ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్ళడంలో చొరవ చూపే అధికారిగా పేరున్న ఈయన ఏలూరు జిల్లా ద్వామా పిడిగా భాద్యతలు చేపట్టనున్నారు.