గొలుగొండ మండలం కృష్ణదేవిపేట సర్పంచ్ పందిరి సత్యనారాయణకు గ్రామంలో ఆక్రమ ణలకు గురైన స్థలాన్ని ఖాళీ చేయించే దమ్ముందా అని కృష్ణా దేవిపేట వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు పి.గిరిబాబు, దంతులూరి సూర్యనారాయణరాజు, ఎం.వరహాలబాబు, ఎం.నానాజీ, వి.నాగేశ్వరరావు, గాజ్జలపు అర్జునరావు,తోపాటు మరికొందరు సవాల్ విసిరారు. ఈ మేరకు సోమవారం వారంతా మీడియాతో మాట్లాడారు. కాలనిస్థలం కబ్జాకు గురవు తుంటే కళ్లుకనబడటం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికే ఎంతస్థలం కబ్జాలో వుందో తెలుసా అని ఎద్దేవా చేశారు. స్థలం ఆక్రమణలు తొలగించ లేక చేతకాని దద్దమ్మలా చేతులు ముడుచుకొని కూర్చొనే నువ్వా మమ్మల్ని విమర్శించేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం గ్రామంలో మెయిన్ రోడ్డులో కాలువ కూడా తవ్వించలేని దుస్థితిలో ఉన్నవని విమర్శించారు. నువ్వుగెలిచి దాదాపు ఎడాది కావస్తున్నా..గ్రామంలో వేసిన కుళాయిల ద్వారా సరిగా మంచినీరు ఇవ్వలేకపోతే సర్పంచ్ గా ఎందుకన్నారు. సర్పంచగా గెలిచి ఏమిచేయాలో తెలియక కుడితిలోపడ్డ ఎలుకలా గింజుకొంటున్నావని ఎద్దేవా చేశారు. అసలు గ్రామంలో సర్పంచ్ పందిరి సత్యనారాయణ దళితులకు చెందిన సంఘం భూమిని ఖబ్జా చేసుకొని ఒక ఇల్లు కట్టుకొని,పశువుల షేడ్ వేసుకొని దర్జాగా అనుభవించటం లేదా ప్రశ్నించారు. త్వరలోనే వాస్తవాలన్నీ బయటకు వస్తాయన్నారు. గ్రామంలో సర్పంచ్ సుమారు 8సెంట్ల గ్రామ కంఠం భూమి ఖాబ్జా చేసి ఇపుడు నీతులు వల్లించటం సిగ్గుచేటన్నారు. దమ్మువుంటే కబ్జాచేసిన భూమిని తిరిగి దళితులకు ఇవ్వగలవా అని సవాల్ విసిరారు. నిన్నగాక మొన్న వచ్చి ..ఏరోజూ పార్టీ అభివ్రుద్ధి కోసం, కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేయని నువ్వు..నేను సర్పంచ్ అయ్యాక ఏం మాట్లాడుతున్నావో తెలుసుకోవాలన్నారు. గ్రామంలో సంక్షేమ పదకాలు అందరికీ అందుతున్నాయా లేదా..అనే కనీస అవగాహన కూడా లేకపోవడం శోచనీయమన్నారు. నిజంగా సర్పంచ్ గా ఏడాది పూర్తిచేసుకున్న నువ్వు ఎన్నికల కేంపైన్ లో ఏమి హామిలిచ్చావో అవి గుర్తు చేసుకొని ముందు వాటిని అమలు చేయాలన్నారు. సర్పంచ్ గా నువ్వు అట్టర్ ఫ్లాప్ అవడంతోనే ఏమిచేయాలో తోచక.. మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందనే నిరాధార ఆరోపణలు చేస్తున్నావుంటూ క్రిష్ణదేవిపేట వైఎస్సార్సీపీ నాయకులు నిప్పులు చెరిగారు. గ్రామంలో జరిగిన, జరుగుతున్న అభివ్రుద్ధిని ప్రజలు గమనిస్తున్నారని..ప్రజలే తీర్పుచెబుతారన్నారు.