కాకినాడ రూరల్ మండలంలో ఇప్పటి వరకూ 11 వేల క్వింటాళ్ల ధాన్యం సేకరణ జరిపినట్టు మండల వ్యవసాయ అధికారి సురేష్ కుమార్ తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మండలంలోని13 ఆర్బీకేల పరిధిలోని 199 మంది రైతుల నుంచి ఇప్పటి వరకూ ఈ ధాన్యం కొనుగోలు చేసినట్టు ఆయన వివిరంచారు. ఇంకా నూర్పులు, కొన్ని చోట్ల కోతలు జరగాల్సి వుందని వుందని, అవి పూర్తయితే మిగిలిన ధాన్యం మండలానికి అధికారులు ఇచ్చిన లక్ష్యం మేరకు ధాన్యం సేకరణ చేపట్టడానికి వీలుపడుతుందని ఆయన వివరించారు. ప్రభుత్వం సూచించిన విధంగా ధాన్యం రంగు, తేమ, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యంత్రాల ద్వారా తనిఖీలు చేసి, ఈ-క్రాప్ బుకింగ్ అయిన రైతుల నుంచి ప్రాధాన్యత క్రమంలో ధాన్యం కొనుగోలుచేస్తున్నట్టు వ్యవసాయ అధికారి సురేష్ కుమార్ ఈ సందర్భంగా మీడియాకి వివరించారు.