మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలోనూ, ఆపద సమయంలో రక్షణ కల్పించడంలో దిశ యాప్ ఒక రక్షణ కవచంగా నిలుస్తుందని మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష పేర్కొన్నారు. శంఖవరం మండల కేంద్రంలోని గ్రామ సచివాలయంలో ఆమె మాట్లాడారు. గ్రామ సచివాలయ పరిధిలోని మహిళా పోలీసుల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒక్కో సచివాలయానికి ఒక్కొక్క మహిళా పోలీస్ ఉంటారని, ఎవరికైనా సమస్య వస్తే వెంటనే తమను దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేయడం ద్వారా నిమిషాల్లో మీకు రక్షణ ఉంటుందని అన్నారు. ప్రతి మహిళకు అనునిత్యం వెంట ఉండి అనుక్షణం కంటికి రెప్పలా రక్షించే రక్షక భటుడే దిశ యాప్అనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. ఆడ, మగ అనే బేధం లేకుండా ప్రతీ ఒక్కరూ దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని వినియోగించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా గుర్తించాలని ఈ సందర్భంగా జిఎన్ఎస్ శిరీష మీడియా ద్వారా ప్రజలకు సూచించారు.