ప్రతీ విద్యార్ధికీ భగవద్గీతలోని శ్లోకాలను చేరువ చేసి భగవద్గీతను పెద్ద ఎత్తున ప్రాచుర్యం లోకి తీసుకు రావడానికి విశ్వహిందూపరిషద్ విశేషంగా క్రుషి చేస్తుందని తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బిక్కిన రాజు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడలోని భానుగుడి బ్రిడ్జి క్రింద గల ఆండాలమ్మ జూనియర్ కళాశాలలో విశ్వహిందుపరిషద్ కాకినాడ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి భగవద్గీత పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా సుమారు 10 ప్రఖండలనుండి విజేతలు 150మంది వరకు ఈ పోటీలలో పాల్గొన్నారని అన్నారు. పిల్లలకు బాల్యంనుండే భారత సంప్రదాయాలు అలవరచ వలసిన బాధ్యత తల్లితండ్రులపై ఉందన్నారు. జిల్లా భగవద్గీత పోటీల నిర్వాహకులు రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ, భగవద్గీత మానవులలో సత్పరివర్తన కు మార్గదర్శనం చూపుతుందని, ప్రతి ఒక్కరు భగవద్గీత నేర్చుకోవాలన్నారు. జిల్లా కన్వీనర్ అన్నపూర్ణయ్య శర్మ మాట్లాడుతూ, భగ్వద్గీతతో పాటు దేశ భక్తి కూడా పిల్లలలో పెరగాలన్నారు. విజేతలకు బహుమతిప్రధానం చేశారు. డిసెంబర్ 25 వ తేదీన ప్రాంత స్థాయి పోటీలకు ఎంపిక చేసినవారందరు విజయవాడలో సత్యనారాయణ పురం లో గల ప్రాంత కార్యాలయం లో జరుగు ప్రాంతస్థాయి పోటీలలో పాల్గొనాలని అన్నారు. ఈ పోటీల న్యాయనిర్ణేతలుగా బి.శ్యామసుందర రావు, వి.బి.టి.సుందరి, దుర్గాప్రసాద్, శ్రీహరి మన్నారు,రవివర్మ,డా.రమాదేవి వ్యవహరించారు. ఈ కార్యక్రమము లో ఈమని పరమేశ్వర రావు, ముమ్మిడి బాబూరావు, రామానుజాచార్యులు,ఉదయబానోజి రావ్, తదితరులు పాల్గొన్నారు.