అన్నవరం శ్రీశ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం లోకకళ్యాణార్థం రాష్ట్రంలో గల ప్రజలందరూ కరోనా , ఓమిక్రాన్ వంటి వ్యాధి నుండి విముక్తి పొంది సస్యశ్యామలంగా ఉండేందుకు ఈనెల 17 నుండి 26 వరకు శ్రీ స్వామి వారికి "కోటితులసి పత్రి పూజ" శ్రీ స్వామివారి వార్షిక కళ్యాణ మందిరంలో 50 మంది ఋత్విక్ లతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు ఈఓ వేండ్ర త్రినాధరావు తెలయజేశారు. ఈ మేరుకు మంగళవారం స్థానిక మీడియాకి ప్రకటన విడుద లచేశారు. భక్తులు సదరు పూజను ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని నిర్వహించేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. భక్తులు ఈ పూజకోసం రుసము రూ.1,500/-లు టిక్కెట్ తీసుకొని పూజ చేయించుకోవచ్చునన్నారు. సదరు పూజను పరోక్షంగా నిర్వహించుకున్న భక్తులకు వారు కోరిన రోజున పూజ నిర్వహించి, పోస్టల్ ద్వారా కండువా, జాకెట్టు, కుంకుమ అక్షింతలు పంపిస్తామని తెలియజేశారు. భక్తులు aptemples.ap.gov.in ద్వారా రుసము చెల్లించి టిక్కెట్ పొందాలని తెలియజేశారు. ఈ అవకాశాన్ని భక్తులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాధరావు మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.