1 ENS Live Breaking News

రేపు యలమంచిలికి సీఎం వైఎస్.జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి అనకాపల్లి జిల్లా యలమంచిలిలో పర్యటిస్తున్నారు. విశాఖ డెయిరీ చైర్మన్ బుధవారం  మృతిచెందారు. విషయం తెలుసుకున్న సీఎం రేపు ఇక్కడి వస్తున్నారు. యలమంచిలిలోని ఆడారి తులసీరావు ఇంటికి వెళ్లి ఆయన నివాళులు అర్పిస్తారు. కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఆడారి తులసీరావు సుదీర్ఘకాలం పాటు విశాఖ డెయిరీకి చైర్మన్ గా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విశాఖడెయిరీని పేరు మార్చాలని ప్రయత్నించిన తరుణంలో కూడా తులసీరావు దైర్యంగా పోరాడి డెయిరీని అదేపేరు ఉంచేలా పోరాడారు. 

yalamanchili

2023-01-04 16:19:49

వైజాగ్ లో జి-20సదస్సుకి పక్కాగా ఏర్పాట్లు చేయాలి

విశాఖపట్నం లో మార్చి 28, 29 తేదీలలో విశాఖ వేదికగా జరుగనున్న ప్రతిష్టాత్మక జి-20 సదస్సుకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. బుధవారం విశాఖలో  జి -20 సదస్సు ఏర్పాట్లు , నిర్వహణపై జీవీఎంసీ, రెవెన్యూ, టూరిజం, విఎంఆర్డీఏ సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ విశాఖపట్నం వేదికగా జరిగే జి –20 సదస్సుకు 20 దేశాల నుండి అతిధులు రానున్నారని, వారికి అన్ని ఏర్పాట్లు ప్రణాళిక ప్రకారం పకడ్బందీగా చేయాలని ఆదేశించారు.

Visakhapatnam

2023-01-04 15:30:30

తుది ఓటరు జాబితా పక్కాగా తయారుచేయాలి.

ఫారం-7 ద్వారా ఓటరు నమోదు  అప్లికేషన్ ను రిజక్టు చేసినట్లయితే అందుకు తగిన కారణాలను ఓటరు కు తెలియజేయడం తో పాటు ఆన్లైన్ లో కూడా  అప్లోడ్ చేయాలని మేనేజింగ్ డైరక్టర్, ఎ.పి.డి.డి.సి.ఎఫ్ మరియు స్పెషల్ సమ్మరి రివిజన్ 2023 రోల్ అబ్జర్వర్ ఎ.బాబు తెలిపారు. మంగళంవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో జిల్లా కలెక్టర్ తో కలిసి ఇ ఆర్ ఓ లు,  ఎ.ఇ.ఆర్.ఓలతో సమీక్షా సమావేశం నిర్విహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుది ఓటరు జాబితా ముద్రణలో ఎటువంటి పొరపాటు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.  ఇప్పటి వరకు జరిగిన పరిణామాలతో  పాటు పాపులేషన్ రేషియో,  పోలింగ్ కేంద్రాల లోకేషన్స్ వివరాలు, సర్వీసు ఓటరు వివరాలు, మైగ్రేటెడ్ ఓటర్ల వివరాలు, ఒకే వ్యక్తి పొటో తో రెండు  లేదా అంతకంటే ఎక్కువ ఓటరు నమోదు జరిగినట్లయిటే అటువంటి వాటి  వివరాలు మరియు ఫారం-6బి (ఆధార్ లింక్) వివరాలపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున మాట్లాడుతూ తుది ఓటరు జాబితా ఎటువంటి పొరపాట్లలకు తావు లేకుండా రూపొందిస్తామన్నారు.
 ఈ సమీక్షా సమావేశంలో  జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాధన్ , జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి,  ఇ ఆర్ ఓ లు,  ఎ.ఇ.ఆర్.ఓ లు, వివిద బి.ఎల్.ఓలు  పాల్గొన్నారు. 

Visakhapatnam

2023-01-03 15:40:03

12న రణస్థలంలో పవన్ కళ్యాణ్ "యువశక్తి"

రాష్ట్రాన్ని వెఎస్సార్సీపీ కబంధహస్తాల నుండి కాపాడి, నిరుద్యోగ యువతకు దిశా నిర్దేశం చేయడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 12న శ్రీకాకుళంలోని రణస్థలంలో యువశక్తి పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తు న్నట్టు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తెలిపారు. మంగళవారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఇందుకోసం తమ పార్టీ ప్రాంతాలవారీగా సభ ను విజయవంతం చేయడానికి జనసేన యువశక్తి మీడియా కమిటీ సభ్యులుగా దూలం గోపి, నాగలక్ష్మి, గండి దుర్గాప్రసాద్, గురు ప్రసాద్, మిడతాన రవికుమార్, దాసరి జ్యోతి రెడ్డి నియమించామన్నారు.

Visakhapatnam

2023-01-03 15:36:19

అనకాపల్లి జిల్లాలో 6,718 కొత్త పింఛన్లు

అనకాపల్లి జిల్లాలో 2లక్షల 18 వేల 531 మందికి పెంచిన పింఛన్లు వివిధ కేటగిరీలలో రూ.2750 ల చొప్పున మొత్తం రూ 60 కోట్ల 9 లక్షల 60 వేల 250 లు అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి తెలిపారు. మంగళవారం సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి సభలో  పెంచిన పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు.  కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని జిల్లా కలెక్టర్ తో అధికారులు లబ్ధిదారులు తిలకించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పెంచిన పింఛన్   చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో  6,718 మందికి వివిధ కేటగిరీ పింఛన్లు కొత్తగా మంజూరు అయ్యాయన్నారు. జిల్లాలో పింఛన్ల పెంపును పొందిన వారిలో వృద్ధులు 1,43,141 మంది వితంతువులు 60,337 ఒంటరి మహిళలు 5,780 మత్స్యకారులు 3,265 చేనేత పనివారు 2,623 కల్లుగీత పనివారలు 2,328 మంది కాగా 1057 మంది సాంప్రదాయ చర్మకారులకు వర్తించిందని తెలిపారు. 

Anakapalle

2023-01-03 14:02:11

ఈనెల 8న ఏపీపీఎస్సీ గ్రూప్-1 పక్కాగా నిర్వహించాలి

ఎపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్షను ఈ నెల 8 న నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు. ఈ పరీక్షను  విజయనగరం పట్టణం లో 13  కేంద్రాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. 8న ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా నిర్వహించే ఈ పరీక్షకు  5530 మంది అభ్యర్థులను కేటాయించినట్లు తెలిపారు.  సక్రమ నిర్వహణ కోసం ప్రతి కేంద్రానికి  సీనియర్ అధికారులను లైజన్ అధికారులుగా నియమించామని, వీరంతా ఆయా కేంద్రాలను తనిఖీ చేసి  పరీక్ష నిర్వహణకు అవసరమగు వసతులు, సౌకర్యాలు సక్రమంగా ఉన్నదీ లేనిదీ నివేదికనివ్వాలన్నారు. 
ప్రతి రూమ్ లో సరైన గాలి వెలుతురు ఉండేలా  చూడాలన్నారు. సున్నిత  ప్రాంతాలను గుర్తించి,  కేంద్రం వద్ద 144 సెక్షన్ కు అవసరమగు సిబ్బందిని ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ ను, రూట్ వారీగా   అవసరమైన బస్ లను ఏర్పాటు చేయాలని ఆర్.టి.సి వారికి ఆదేశించారు.  సెంటర్ లో డైరెక్షన్ బోర్డ్ లను ఏర్పాటు చేయాలని చీఫ్ సూపరింటెండెంట్ లకు ఆదేశించారు. నిరంతర విద్యుత్తు, అత్యవసర వైద్యాన్ని అందించే మెడికల్  కాంప్ ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 6 న ఏపీపీఎస్సీ ప్రతినిధుల సమక్షంలో మరో సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో అభ్యర్థులకు అవసరమగు సూచనలను వెల్లడిస్తారని అన్నారు.
ఈ సమావేశంలో డి.ఆర్.ఓ గణపతి రావు,  లైజన్ అధికారులు, కళాశాలల ప్రతినిధులు పాల్గొన్నారు.

Vizianagaram

2023-01-03 13:45:25

కారుణ్య నియామకాల ఖాళీలు వెంటనే సమర్పించాలి

శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో విధి నిర్వహణలో మృతిచెందిన వారి వివరాలు, కారుణ్యనియామకాలు చేపట్టాల్సిన వారి వివరాలను తక్షణమే అందజేయాలని జాల్లా కలెక్టర్  శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించా రు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లాశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కారుణ్య నియామకాల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల వివరాలను తెలియజేయ డం ద్వారా కారుణ్య నియామకాలు సత్వరమే చేపట్టడానికి ఆస్కారం వుంటుందని కలెక్టర్ అధికారులకు సూచించారు.

Srikakulam

2023-01-02 16:19:55

గడువులోపు స్పందన అర్జీలను పరిష్కరించాలి

స్పందన గ్రీవెన్స్ కు వస్తున్న అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్  రవిపట్టన్ శెట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అనకాపల్లి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా 110 అర్జీలను ప్రజల నుంచి  స్వీకరించారు.  జిల్లా కలెక్టర్ తోపాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి, అసిస్టెంట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి, డిఆర్ఓ వెంకట రమణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Anakapalle

2023-01-02 13:27:50

వృత్తి నిబద్ధత కలిగిన అధికారిని సీతామహాలక్ష్మి

మహిళా శిశు సంక్షేమ అధికారిగా పనిచేసిన ఉప కలెక్టర్ నందూరి సీతామహాలక్ష్మి   పనిచేసిన ప్రతిచోట తన ప్రజ్ఞతో వృత్తిపట్ల నిబద్ధతతో పదవికే వన్నె తెచ్చేవారని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి ప్రశంసించారు.  డిసెంబర్ 31వ తేదీన స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన సీతామహాలక్ష్మికి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా 
అధికారుల సంఘం ఆమెకు సన్మానసభ ఏర్పాటుచేశారు.  ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ ఆమెను చూసి సమయపాలన, చట్టాల పట్ల పరిజ్ఞానం నేర్చుకోవాలన్నారు.  కలెక్టర్లకు ఆమె తలలో నాలుకల వ్యవహరించే వారన్నారు. ఆమె స్పందన కార్యక్రమంలో కూడా పాల్గొని అనేకసమస్యల ను పరిష్కరించరించ డం గుర్తుకు తెచ్చారు. ఎన్.సీతామహాలక్ష్మి మాట్లాడుతూ, కృషి పట్టుదల ఉంటే ఏ కార్యాన్నైనా సాధించవచ్చ ని చిన్నతనంలోనే నేర్చుకున్నానని చెప్పారు. ఏ శాఖలో పనిచేసిన సహ ఉద్యోగులు, పైఅధికారుల సహాయ సహకారాలతోనే విజయం సాధించానన్నారు. మంచి ఆలోచనలతో కష్టపడి పని చేస్తే పదిమందికి మేలు చేయగలమన్నారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి, అసిస్టెంట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి, డిఎంహెచ్వో డాక్టర్ హేమంత్ డ్వామా పిడి సంపత్ డిహెచ్ఓ ప్రభాకర్ రావు జిఎం డిఐసి శ్రీధర్ డిపిఓ శిరీష రాణి డిఎల్డివో మంజులవాణి వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా అధికారుల సంఘం అధ్యక్షులు సిపిఓ రామారా వు స్వాగతం పలుకగా కార్యదర్శి మత్స్యశాఖ డిడి లక్ష్మణరావు వందన సమర్పణ చేశారు.

Anakapalle

2023-01-02 13:01:34

అప్పన్నను దర్శించుకున్న స్వరూపానందేంద్ర సరస్వతి

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి సింహాచలం అప్పన్న ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తర ద్వారం నుంచి ప్రవేశిం చి అప్పన్నను దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన దేవస్థానం అధికారులు స్వామీజీకి అప్పన్న దర్శనం కల్పించారు. ఆలయ మర్యాదలతో అధికారులు, పండితులు స్వామీజీకి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ ముక్కోటి దేవతలంతా కలిసి శ్రీమన్నారాయణుని దర్శించుకున్న పర్వదినమే ముక్కోటి ఏకాదశి అని తెలిపారు. పీఠం 27వ వార్షిక ఆహ్వాన పత్రిక స్వామిముందుంచారు.

Simhachalam

2023-01-02 06:08:17

మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యంగా సేవలందించాలి

విజయనగరం జిల్లాలో మత్స్యకారుల అభివృద్దే లక్ష్యంగా విఎఫ్ఏలు, మత్స్యశాఖ సిబ్బంది పూర్తిస్థాయిలో సేవలు అందించాలని ఫిషరీష్ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.నిర్మలకుమారి సూచించారు. నూతన సంవత్సరం సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు చెబుతూ, జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా జిల్లాని మత్స్యశాఖ పరంగా ముందుంచాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మత్స్యకారులకు అందించడంతోపాటు, ప్రభుత్వ లక్ష్యాలను కూడా సకాలంలో అదిగమించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీఓ చాందిని, కార్యాలయ సిబ్బంది, విఎఫ్ఏలు పాల్గొన్నారు.

Vizianagaram

2023-01-01 17:49:39

కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలియజేసిన మత్స్యశాఖ

విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారికి మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.నిర్మలకు మారి, ఇతర సిబ్బంది ఆంగ్లనూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు. కలెక్టర్ సూచనల మేరకు పూల బొకేలు కాకుండా నిరుపేద విద్యార్ధుల కోసం పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు ఒక కిట్ గా తయారు చేసి వాటితో కలెక్టర్ కు శుభాకంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొత్త ఏడాది ఉత్సాహంతో పనిచేసి ప్రజలకు మరింతగా సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ డిడితోపాటు ఎఫ్డీఓ చాందిని, విఎఫ్ఏలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2023-01-01 17:39:36

ఇంటింటికీ వెళ్ళి పించన్లు ఇచ్చిన కలెక్టర్..

కొత్తగా పెంచిన పెన్షన్లు పంపిణీ వేగవంతం చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. ఆదివారం చీరాల మున్సిపాలిటీ లోని 2వ వార్డులో జనవరి1నుండి పెంచిన పెన్షన్లు జిల్లా కలెక్టర్ పెన్షన్ దారులకు స్వయంగా పంపిణీ చేశారు. ప్రభుత్వం గతంలో పెన్షన్ దారులకు ఇచ్చే రూ.2500 ను రూ.2750కి పెంచారన్నారు. కొత్తగా పెంచిన పెన్షన్లు పంపిణీ వారోత్సవాలు 1వ తేదీ నుండి7వ తేదీ వరకు జిల్లాలో నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఎ పీడీ అర్జున్, మున్సిపల్ కమిషనర్ ఏసయ్య,తహసీల్దార్ ప్రభాకర్,పాల్గొన్నారు.     

Chirala

2023-01-01 09:26:14

జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలియజేసిన గంట్ల

నూతన సంవత్సరం 2023లో జర్నలిస్టులు వారి కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలని, వారికి అన్నింటా మంచి జరగాలని సింహాద్రి అప్పన్నను వేడుకున్నట్టు వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు, సింహాచలం ట్రస్టుబోర్డు ప్రత్యేక ఆహ్వానితులు గంట్లశ్రీనుబాబు తెలియజేశారు. ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా జర్నలిస్టులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గంట్ల మాట్లాడుతూ, తన జీవితం జర్నలిస్టుల సంక్షేమానికే అంకితం చేస్తున్నానన్నారు. జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకి సాగుతున్నానన్నారు.

Visakhapatnam

2023-01-01 06:03:52

నగరాభివృద్ధిలో జర్నలిస్టుల సహకారం మరువలేనిది

మహా విశాఖ నగరాభివృద్ధిలో జర్నలిస్టులు అందించిన సహకారం మరువలేనిదని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. ఇక్కడ సీతమ్మ ధార విజేఎఫ్  వినోద వేధికలో వైజాగ్ జర్నలిస్టుల ఫోరం 2023 నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ ను పలువురు అతిథులతో కలిసి మేయర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో విశాఖ అగ్రగామి గా నిలిచింది అంటే అందుకు జర్నలిస్టుల సహకారమే ప్రధానమన్నారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షన్ లో మహావిశాఖకు నాలుగో రాంక్ రావడంలో కూడా  మీడియా ప్రధాన పాత్ర పోషించింది అన్నారు. గౌరవ అతిథిలుగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి,
వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ అక్కర మాని విజయనిర్మల, పి సి పి ఐ ఆర్ చైర్మన్ చొక్కాకుల లక్ష్మీ, జి సి సి  కార్పొరేషన్ చైర్మన్ శోభ స్వాతిరాణి ,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండ రమాదేవ లు  పాల్గొని మాట్లాడుతూ, సమాజము లో మీడియా వల్లే అన్ని విషయాలు ప్రజలకూ తెలియ చేయగలుగుతున్నామన్నారు.

  సభ్యుల  సంక్షేమానికి వైజాగ్ జర్నలిస్టుల ఫోరం  చేస్తున్న కృషి అత్యంత ప్రశంసనీయమన్నారు.. ప్రతీ పండుగను  క్రమము తప్పకుండా నిర్వహించడం, జర్నలిస్టులకు క్రీడలతో పాటు అనేక సంక్షేమ ఫలాలు అందించడం అభినందనీయమన్నారు. నూతన సంవత్సరంలో జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు ఆనందమయ జీవనం గడపాలని వీరంతా ఆకాంక్షించారు.  కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శీను బాబు మాట్లాడుతూ గడిచిన ఏడాదిలో తమ సభ్యుల కోసం ఎంతగానో శ్రమించి అనేక కార్యక్రమాలను విజయవంతం చేసామన్నారు. దసరా, దీపావళి పండుగలు నిర్వహించడము తో పాటు మీడియా అవార్డుల ప్రధానోత్సవం కూడా అత్యంత ఘనము గా నిర్వహించామన్నారు. అలాగే జర్నలిస్టుల పిల్లలకు ప్రతి ఏటా ఉపకార వేతనాలు అందజేస్తున్నామన్నారు. తమ కార్యవర్గం హయాంలో కేవలం సభ్యుల వైద్య సదుపాయాలు కోసం సుమారు 22లక్షలు వెచ్చించామన్నారు..

నూతన సంవత్సర వేడుకలతో పాటు జనవరి 3 నుంచి జర్నలిస్టుల క్రీడా సంబరాలు ప్రారంభం కానున్నాయన్నారు.  ఫోరం కార్యదర్శి దాడి రవికుమార్ . ఉపాధ్యక్షులు ఆర్. నాగరాజ్ పట్నాయక్ లు మాట్లాడుతూ అందరి సహకారం తోనే ఆయా కార్య క్రమాలు విజయ వంతం చేయ గలుగు తున్నా మన్నారు.  సభ్యులకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి వీరు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తొలుత స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ బాలలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించా యీ. కార్య క్రమంలో ఫోరమ్ కార్య వర్గ సభ్యులు ఐరోతి ఈశ్వర్ రావు, ఎం ఎస్ ఆర్ ప్రసాద్, పి. వరలక్ష్మి, దొండ గిరిబాబు, డేవిడ్, శేఖర మంత్రి,తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-12-31 15:33:41