1 ENS Live Breaking News

పాతూరు పంచాయతీలో వార్డుల మోత మోగింది..

విశాఖజిల్లా గొలుగొండ మండలం, క్రిష్ణదేవిపేట(పాతూరు) ప్రతిష్టాత్మక పంచాయతీలో నలుగురు సర్పంచ్ అభ్యర్ధులు నిలబడ్డ బరిలో వైఎస్సార్సీపీ మద్దతు దారు పందిరి సత్యన్నారాయణ( సాఫ్ట్ వేర్ఇంజినీర్ సత్యంనాయుడు) పేనల్ లో ఆరుగురు వార్డు మెంబర్లు విజయదుందుబీ మోగించారు. ఇక్కడ ఇండిపెండెంట్ పేనల్ అభ్యర్ధికి మూడు వార్డులు రాగా, టిడిపి పేనల్ అభ్యర్ధికి ఒక వార్డు సభ్యుడు గెలుపొందడం విశేషం. నేరుగా వైఎస్సార్సీపీ జెండా వేసుకొని సర్పంచ్ అభ్యర్ధిగా బరిలో నిలబడ్డ అభ్యర్ధి పేనల్ కి ఒక్కవార్డు గెలవలేకపోవడం చెప్పుకోదగ్గ విషయం. ఆది నుంచి వార్తల్లో నిలిచిన ఈ పంచాయతీ విషయంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా  ఇస్తున్న అంచనా కధనాలన్నీ వాస్తవాలవుతూ వచ్చాయి. దీనితో ఈఎన్ఎస్ లైవ్ యాప్ కధనాలపై పాఠకులకు సరైన గురి ఏర్పడింది. మిగిలిన నాలుగు వార్డుల్లోనూ స్వతంత్ర్య అభ్యర్ధి, టిడిపి అభ్యర్ధి సామాజిక పట్టుతోనే గెలిచినట్టు ఫలితాలు వెల్లడించాయి. నేరుగా వైఎస్సార్సీపీ పార్టీ జెండాతో బరిలో ఉండి నామినేషన్ల దగ్గర నుంచి పోలీంగ్ వరకూ హడావిడి చేసినా ఒక్క వార్డు గెలుచుకోకపోవడంతో.. ఈ పంచాయతీలో సర్పంచ్  అభ్యర్ధి ఎంపిక విషయంలో మండల నేతల అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ప్రస్తుతం వార్డు మెంబర్లుగా గెలిచిన వారందరూ గతంలో ఎలాంటి రాజకీయ అనుభవం లేనివారు కావడం చెప్పుకోదగ్గ అంశం..

Krishnadevipeta

2021-02-13 23:02:22

ఈఎన్ఎస్ లైవ్ కధనమే నిజమైంది.. పాతూరు సర్పంచ్ సత్యంనాయుడు..

ఆరు తరువాత ఏడు పాతూరు సర్పంచ్ సత్యంనాయుడు అనే ఈ శీర్షికతో సరిగ్గా 4 రోజులు క్రితం ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక మొబైల్ యాప్ ఈఎన్ఎస్ లైవ్  ప్రత్యేక కథనంగా ప్రచురిచింది. నేడు ఆ వార్త నిజమైంది. 463 ఓట్లతో  వైఎస్సార్సీపీ మద్దతు దారుడు పందిరి సత్యన్నారాయణ (సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సత్యంనాయుడు) క్రిష్ణదేవిపేట(పాతూరు) సర్పంచ్ గా అఖండ మెజార్టీతో ముగ్గురు అభ్యర్ధులను ఓడిస్తూ గెలుపొందాడు. దీనితో ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ కధనంపై పాఠకులకు పక్కాగా నమ్మకం ఏర్పడింది. ఎప్పుడూ వాస్తవాలకు పెద్దపీట వేసే ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సత్యంనాయుడు గెలుపు విషయంలోనూ అదే చెప్పింది. అల్లూరి సీతారామరాజు తెల్లదొరలపై పోరుబాట సాగించిన పాతూరులో అల్లూరి సాక్షిగా బరిలోకి దిగి ప్రత్యర్ధులను మట్టికరిపించారు సత్యంనాయుడు. ఈ విషయంలో సత్యంనాయుడు తమ్ముడు ఆర్ఎంపీ బుజ్జి చేసిన నిశ్వార్ధ వైద్య సేవలు విశేషంగా పాతూరు ప్రజలను చైతన్య వంతం చేయడంతోపాటు ఎంతగానో ఆలోచింపజేశాయి. నిజమైన అభ్యర్ధి, నికార్శైన అభ్యర్ధి బరిలో వుంటే వార్ వన్ సైడ్ అయిపోతుందనడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలవడం విశాఖజిల్లాలోనే చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యంగా సత్యంనాయుడు గెలుపు విషయంలో ఈఎన్ఎస్ లైవ్ యాప్ కథనాలన్నీ వాస్తవాలవడంతో జిల్లా నలుమూలల నుంచి న్యూస్ ఏజెన్సీ కార్యాలయానికి వందల కొద్దీ ఫోన్ కాల్స్ చేస్తున్నారు. ఇలాంటి మంచి కధనాలు రానున్న రోజుల్లో ఈఎన్ఎస్ లైవ్ యాప్ అందించాలని కూడా శుభాకాంక్షలు తెలియజేశారు పాఠకులు..

Krishnadevipeta

2021-02-13 22:45:34

పాతూరు సర్పంచ్ గా సత్యంనాయుడు..!

విశాఖజిల్లా, గొలుగొండ మండలం, క్రిష్ణదేవిపేట(పాతూరు) సర్పంచ్ గా సత్యంనాయుడు గెలుపొందారు. జిల్లాలోనే ప్రతిష్టాత్మక పంచాయతీ పాతూరులో ఏ పంచాయతీలోనూ లేని విధంగా నలుగురు అభ్యర్ధులు బరిలో వున్నప్పటికీ ఈ పోటీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సత్యంనాయుడు గెలుపొందడం విశేషం. అయితే సర్పంచ్ సత్యంనాయుడు మెజార్టీ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ప్రస్తుతం 126 ఓట్లు మెజార్టీతో గెలుపొందినట్టు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ కార్యాలయానికి వర్తమానం అందింది. కాగా మెజార్టీ పెరిగే అవకాశాలన్నట్టు మా చీఫ్ రిపోర్టర్ బాలు సంఘటనా స్థలం నుంచి లైవ్ అప్డేట్ అందించడానికి సిద్దంగా ఉన్నారు. త్వరలోనే ఆ పూర్తివివరాలను తెలియజేస్తాం...అయితే సాప్ట్ వేర్ ఇంజనీర్ సత్యంనాయుడే పాతూరు సర్పంచ్ అనే విషయాన్ని ఈఎన్ఎస్ లైవ్ యాప్ నాలుగు రోజుల క్రితమే వార్త ప్రచురించింది. 

క్రిష్ణదేవిపేట

2021-02-13 20:02:26

2021-02-12 09:05:07

పాతూరు రూపురేఖలు మార్చి చూపిస్తా..

విశాఖజిల్లా, గొలుగొండ మండలంలోని ప్రతిష్టాత్మక క్రిష్ణదేవిపేట(పాతూరు) గ్రామాన్ని పూర్తిస్థాయిలో మార్చి చూపిస్తానని పంచాయతీ సర్పంచ్ బరిలో నిలబడిన పందిరి సత్యన్నారాయణ( సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సత్యంనాయుడు) పేర్కొన్నారు. కేవలం గ్రామ ప్రజలకు సేవ చేసుకోవడానికి మాత్రమే తాను చేస్తున్న ఉద్యోగాన్ని, లక్షల రూపాయల జీతాన్ని వదిలి సొంత గ్రామానికి వచ్చానని గ్రామస్తులకు తెలిపారు. గ్రామంలోని అన్ని వీధుల్లోనూ సిసి రోడ్లు, డ్రైనేజీలు, వీధిలైట్లు, చెత్త పడేయడానికి చెత్తబండ్లు, ఇంటింటికీ మంచినీటి కుళాయిలు, విద్యార్ధుల కోసం గ్రంధాలయం, యువత కోసం ఆటస్థలం ఇలా అన్నింటి కోసం శక్తివంచన లేకుండా క్రుషి చేస్తానని చెప్పారు. గ్రామంలో ఎంత మంది అర్హులుంటే అంత మందికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయడానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామసచివాలయం ద్వారా సేవలు పొందడం మన హక్కు అని, సేవలన్నీ ప్రజలకు అందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని సత్యంనాయుడు చెప్పారు. చాలా సంవత్సరాల తరువాత ప్రజా ప్రభుత్వం వచ్చిందని, ఈ ప్రభుత్వం ప్రజలకోసమే పనిచేస్తుందని అన్నారు. ఎవరికి ఏ అవసరం ఉన్నా ఎవరూ ఎవరినీ అర్ధించాల్సిన పనిలేదని, సంక్షేమ పథకాల కోసం ఎవరూ ఎవరికీ డబ్బులు కూడా ఇచ్చే పనికూడా లేదన్నారు. అందరికీ మీ ఇంటి మనిషిగా తోడుంటానని, మీ అందరికీ సేవ చేసుకుంటానని, ఇచ్చిన మాటకే కట్టుబడే ఉంటానని చెప్పారు. తనకి ఒక్క అవకాశం ఇస్తే క్రిష్ణదేవిపేటను పూర్తిగా అభివ్రుద్ధి చేసి జిల్లా మొత్తం మన గ్రామంవైపే తొంగి చూసేలా చేస్తానని గ్రామస్తులకు భరోసా ఇస్తున్నారు.

Krishnadevipeta

2021-02-12 09:02:20

ఆఖరిరోజు ప్రచారం అదరగొట్టిన సత్యంనాయుడు..

విశాఖజిల్లా, గొలుగొండ మండలంలోని ప్రతిష్టాత్మక క్రిష్ణదేవిపేట(పాతూరు) పంచాయతీ సర్పంచ్ బరిలో నిలబడిన పందిరి సత్యంనాయుడు ఆఖరిలో ప్రచారం అదరగొట్టాడు. గురువారం పాతూరులో యువత, మహిళలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానుల ఆనందోత్సవాల మధ్య నిర్వహించిన కేన్వాసింగ్ ఎంతో సరదా సరదాగా చేపట్టారు. మహిళా అభ్యర్ధులైతే ఓటర్లను చైతన్యపరచడానికి డాన్సులు చేస్తూ, సత్యంనాయుడిని గెలిపించాలని, గ్రామాన్ని మనమే అభివ్రుద్ధిచేసుకోవాలంటూ.. ఉత్సాహంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్ధి పందిరి సత్యన్నారాయణ(సత్యంనాయుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్) మాట్లాడుతూ, గ్రామంలోని అన్ని వార్డుల్లో సమస్యలనూ తాను స్వయంగా పరిష్కరిస్తానని హామి ఇచ్చారు. ప్రభుత్వ పథకాలకోసం ఎవరూ ఎవరిని అర్ధించాల్సిన పనిలేదని, అర్హులైనవారందరికీ తానే దగ్గరుండి సంక్షేమ పథకాలు వచ్చేలా చేస్తానన్నారు. గ్రామం కోసం, గ్రామాభివ్రుద్ధికోసం వచ్చిన తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే గ్రామాన్ని జిల్లా మొత్తం తొంగిచూసేలా మార్చి చూపిస్తానన్నారు. పాతూరులోని పైవీధిలోని వీరభ్రహ్మేంద్రస్వామి, శ్రీక్రిష్ణుడి ఆలయాల అభివ్రుధ్దికి సహాయం చేస్తానన్నారు. గ్రామంలోని అన్ని వీధుల్లోనూ సిసి రోడ్లు, డ్రైనేజీలు, స్వచ్ఛమైన మంచినీరు, కమ్యూనిటీహాళ్లు అన్నింటినీ క్రమపద్దతిలో చేపడతానన్నారు. విద్యార్ధులు, నిరుద్యోగుల కోసం గ్రామంలో గ్రంధాలయం ఏర్పాటుకి క్రుషిచేస్తానన్నారు. తద్వారా అక్కడ అన్ని రకాల పుస్తకాలు ఏర్పాటు చేసి, పోటీపరీక్షలకు సిద్దమయ్యేవారికోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయిస్తానని యువతకి భరోసా కల్పించారు. ఈ  ప్రచార కార్యక్రమంలో 10వార్డుల మెంబర్లు, వారి అనుచరులు పందిరి రామారావు, పందిరి అప్పారావు, పందిరి బుజ్జి(ఆర్ఎంపీ), పందిరి శివ, పందిరి ఈశ్వరరావు, రాజు, దుంపలపూడి సహదేవుడు, శివ, ప్రసాద్, పందిరి జగన్నాధం, చుక్కల సావిత్రి, కరక కుమారి, చిట్టిబాబు, నూకాలమ్మ, పెద్ద సంఖ్యలో యువత, మహిళలు పాల్గొన్నారు.

Krishnadevipeta

2021-02-11 21:08:58

పాతూరు అభివ్రుద్ధికే వచ్చిన యువ నాయకుడు..

విశాఖజిల్లాలోనే క్రిష్ణదేవిపేట(పాతూరు) గ్రామాన్ని అభవ్రుద్ధి చేసే ఒకే ఒక్క నాయకుడు మన పందిరి సత్యన్నారాయణ(సత్యంనాయుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్) మాత్రమే...ఉంగరం గుర్తుకి ఓటేయండి మన గ్రామ అభివ్రుద్ధికి మీ వంతు సహకారం అందించండి...సత్యంనాయుడు గుర్తు ఉంగరం... ఉంగరం గుర్తుకి ఓటేయండి మన ప్రియతమ నాయకుడు సత్యంనాయుడుని సర్పంచ్ గా గెలిపించండి.. అమ్మా మరిచి పోవద్దు మన గుర్తు ఉంగరం...అక్కా మన గుర్తు ఉంగరం..తమ్ముడూ మరిచిపోవద్దు మన గుర్తు ఉంగరం..సొంత పనులకోసం కాకుండా గ్రామాభివ్రుద్ధికి క్రుషిచేసే సత్యంనాయుడుని గెలిపించి గ్రామాభివ్రుద్ధిలో మీరూ భాగస్వామ్యం కండి. మీ అమూల్యమైన అతిపవిత్రమైన ఓటు ముద్రను ఉంగరం గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించ ప్రార్ధన.. 

Krishnadevipeta

2021-02-11 09:35:14

2021-02-11 09:27:14

ఎన్నికల సామాగ్రి పంపిణీకి ఏర్పాట్లు..

ఎన్నికల సామాగ్రి పంపిణీ (డిస్ట్రిబ్యూషన్‌ ) ‌కేంద్ర, రిసెప్షన్‌ ‌కేంద్రాలలో అన్ని సదుపాయాల కల్పనకు ఏర్పాట్లు పూర్తిస్దాయిలో చేపట్టాలని సంబందిత అధికారులను స్దానిక సబ్‌ ‌కలెక్టరు అనుపమ అంజలి ఆదేశించారు. బుధవారం ఆమె ఆలమూరు కడియం మండలాలలో పర్యటించి ఈనెల 13వ తేదీన నిర్వహించనున్న రెండవ విడత స్దానిక సంస్దల ఎన్నికల ఏర్పాట్లును పరిశీలించి అధికారులకు పలుసూచనలు ఆదేశాలు జారీచేసారు. ఈ కేంద్రాలు నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించి వారు నిర్వహించాల్సిన విధులు గూర్చి పూర్తిగా అవగాహన పెంపొందించాలన్నారు.  ప్రస్తుత కోవిడ్‌-19 ‌నేపధ్యంలో బౌతిక దూరాలు పాటించాలని, మాస్కుధారణ, శానిటైజేషన్‌లు తప్పక పాటించాలన్నారు. ఆదేవిధంగా పోలింగ్‌ ‌కేంద్రంలో సిబ్బందికి అవసరమైన ఫర్నీచరును ఏర్పాటుచేయాలని రిప్రెష్‌మెంటు బోజన వసతుల కల్పనకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా కౌంటింగ్‌ ‌కేంద్రాలు ఏర్పాటుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు ప్రదానంగా భద్రత పరమైన ఏర్పాట్లు అనగా నిరంతర విద్యుత్‌ ‌సరఫరా , బారికేడింగు ఏర్పాట్లు పిన్సింగ్‌ ‌మరుగుదోడ్లు త్రాగునీరు,  కౌంటింగ్‌ ‌సామాగ్రి ముందస్తు ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేసుకోవాలన్నారు. జనరేటర్లు  సదుపాయం తప్పక కల్పించాలన్నారు.  కౌంటింగ్‌ ‌సిబ్బందికి అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం నుంచి సిబ్బందిని ఆయా గ్రామపంచాయితీలలో విధులు నిర్వహించుటకు తగు రవాణా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆలమూరు ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాట్లును చెముడులంక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్‌ ‌కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లును ఆమె పరిశీలించారు. ఆలమూరు మండలంలో 18 గ్రామపంచా యితీలకుగాను ఒక గ్రామపంచాయితీ ఏకగ్రీవం అయ్యిందన్నారు. 208 వార్డుమెంబర్లకుగాను 10 వార్డులు ఏకగ్రీవం అయ్యాయన్నారు.  మిగిలిన 198 వార్డు మెంబర్లు, అదేవిధంగా మిగిలిన 17 సర్పంచ్‌ ‌పదవులకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు కొన్ని గ్రామపంచాయితీలు ఏకగ్రీవం అయ్యినందున రూట్లు కాని జోన్లు కాని అవసరమైన మార్పులు చేసి వెంటనే సంబందిత అధికారులకు తెలియపర్చాలన్నారు జోనల్‌, ‌రూటు అధికారులు వెంటనే విధులలో చేరి గ్రామాలలో పర్యటించి ఏర్పాట్లన్నిటిని సమీక్షించుకోవాలన్నారు. ఆ ప్రాంతంలోఎవరైనా కోవిడ్‌ ‌సోకిన వ్యక్తులుగాని అనుమానితులనుగాని ఉంటే వారికి కేటాయించిన పోలింగ్‌ ‌కేంద్రంలో చివరి గంటలో అనగా మధ్యాహ్నాం 2,30 గంటల నుంచి 3.30 గంటలవరకు ప్రాధమిక ఆరోగ్యకేంద్రాల ద్వారా సరఫరా కాబడిన  వ్యక్తిగత పరిరక్షణ కిట్లు (పిపిఇ) ధరింపజేసి ఓటు హక్కును వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రిపోర్టు చేసిన అధికారులు ఎవరైన సహాయం కొరితే రిజర్వులో ఉన్న అధికారులను అవసరార్దం వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల పక్రియలో అధికారులు సిబ్బంది ప్రణాళికాయుతంగా నిబంధనల ప్రకారం విధులను శాంతియుత వాతావరణంలో సజావుగా నిర్వహించాలన్నారు. ఓటరు నిర్బయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. ఉదయం 6.30 గంటనుంచి మధ్యాహ్నాం 3.30 గంటలవరకు పోలింగ్‌ ఉం‌టుందన్నారు.పారదర్శకత కొరకు అతిసమస్యాత్మక, సమస్యాత్మక పోలింగ్‌ ‌కేంద్రాలలో సూక్ష్మపరిశీలకు సమక్షములో వీడియోచిత్రకరణ, వెట్‌కాస్టింగ్‌తోపాలింగ్‌ ‌నిర్వహించాలన్నారు. కడియం ఎంపిడిఓ కార్యాలయం, పోట్టిలంక, దామిరెడ్డిపల్లిలలో ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. పూర్తి భద్రతా చర్యల నడుమ కౌంటింగ్‌ ‌నిర్వహించాలన్నారు.ఈ కార్యక్రమంలో డిఎల్‌పిఓ జె సత్యనారాయణ, ఎపిడిఒలు మహేశ్వరరావు, జెఎఝాన్షీతాహిసిల్దార్లు జి.భీమారావు, జి.లక్ష్మీపతి, సురేంద్రరెడ్డి, రాజ్‌కుమార్‌ ‌తదితరులు పాల్గొన్నారు. 

Kadiam

2021-02-10 15:12:09

Krishnadevipeta

2021-02-10 14:47:03

6 తరువాత 7..పాతూరు సర్పంచ్ సత్యంనాయుడు

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా శివాజీ మీకు గుర్తుందా.. ఆ సినిమాలోని డైలాగులే క్రిష్ణదేవిపేట(పాతూరు) ఎన్నికల బరి ప్రచారంలో యువత సత్యంనాయుడుకి వినియోగిస్తూ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఆరు తరువాత ఏడు..పాతూరు సర్పంచ్ సత్యంనాయుడు అంటూ ఓటర్లను ఆలోచింప చేస్తున్నారు. ఊరిపై పేద ప్రజలను పథకాలకోసం మభ్యపెట్టి దండుకునే అభ్యర్ధి మాకొద్దు..గ్రామాన్ని సొంత నిధులతోనైనా అభివ్రుద్ధి చేసే సరైన నాయకుడే మాకు ముద్దు.. అంటూ యువత తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. పంచాయతీ సర్పంచ్ ఎన్నికల పుణ్యమాని అల్లూరి సీతారామరాజు చరిత్రను కూడా ఇంటింటికీ తెలియజేస్తూ..తన పోరాటం ప్రజలను పీడిస్తున్న సమస్యలపైనే వుంటుందని భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు సత్యంనాయుడు. అన్నివర్గాల ప్రజలు తనను ఆదరిస్తున్నారని పాతూరు ప్రజలకు తాను అండగా ఉంటానని ఎవరూ ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన పనిలేదని చెబుతూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 10వార్డుల మెంబర్లు, వారి అనుచరులు పందిరి రామారావు, పందిరి అప్పారావు, పందిరి బుజ్జి(ఆర్ఎంపీ), దుంపలపూడి సహదేవుడు, శివ, ప్రసాద్, పందిరి జగన్నాధం, చుక్కల సావిత్రి, కరక చిట్టిబాబు, నూకాలమ్మ, పెద్ద సంఖ్యలో యువత, మహిళలు పాల్గొంటున్నారు.

Krishnadevipeta

2021-02-10 12:33:46

ఉంగరం గుర్తుకి ఓటువేస్తే పాతూరుకి మహర్ధశ..

ఉంగరం గుర్తుకి ఓటువేస్తే మన గ్రామానికి మహర్ధశ తీసుకు వస్తానని  క్రిష్ణదేవీపేటకు(పాతూరు) పంచాయతీ అభ్యర్ధి పందిరి సత్యన్నారాయణ(సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సత్యంనాయుడు) అన్నారు. మంగళవారం పాతూరు గ్రామంలోని అన్నివీధులు తిరుగుతూ ఓటర్లును నేరుగా కలిసి ఓట్లను అభ్యర్ధించారు. భారీ అభిమానుల సందోహం మధ్య ప్రచారం చాలా ఉత్సాహం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యంనాయుడు మాట్లాడుతూ, అందరివాడుగా, మీకుటుంబ సభ్యునిగా భావించి ఈ ఎన్నికల్లో తనకు పట్టం కట్టాలని, ప్రతీ ఓటరు ఉంగరం గుర్తుకే ఓటువేయాలని కోరారు. తనను గెలిపిస్తే అన్ని వార్డులను అభివ్రుద్ధిచేసి చూపిస్తానని, ఇప్పటికే వార్డులన్నీ తిరిగి ప్రధాన సమస్యలన్నీ ప్రత్యేకంగా ఒక పుస్తకంపై రాసుకున్నానని ప్రధానత్య కలిగిన సమస్యలను పరిష్కరించి గ్రామస్తులందరికీ సేవచేసుకుంటానని అన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మన గ్రామాన్ని ఎవరూ పట్టించుకోలేదని, ఈ ప్రభుత్వంలో గ్రామాన్ని అందరం కలిసి అభివ్రుద్ధి చేసుకోవాలంటే దానికి ఒక్కటే మార్గమని, తనను సర్పంచ్ ని చేస్తే అభివ్రుద్ధి ఎలావుంటుందో చేసి చూపిస్తానని ప్రజలను చైతన్య పరిచారు. పందిరి అప్పారావు తర్వాత ఆయన వారసుడిగా పాతూరు గ్రామానికి సేవచేసే భాగ్యాన్ని, అవకాశాన్ని ప్రజలు, ఓటర్లు అంతా కల్పించాలన్నారు. కేవలం మీకు సేవచేయాలనే లక్ష్యంతోనే లక్షలు జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకొని వచ్చానని, నన్న మీరంతా ఆదరించి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇప్పటికే మహిళలు, యువత తమ మద్దతుని తెలియజేశారన్నారు. మిగిలిన వారు కూడా తనను దీవించాలని సత్యంనాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో ఈ  ప్రచార కార్యక్రమంలో 10వార్డుల మెంబర్లు, వారి అనుచరులు పందిరి రామారావు, పందిరి అప్పారావు, పందిరి బుజ్జి(ఆర్ఎంపీ), దుంపలపూడి సహదేవుడు, శివ, ప్రసాద్, పందిరి జగన్నాధం, చుక్కల సావిత్రి, కరక చిట్టిబాబు, నూకాలమ్మ, పెద్ద సంఖ్యలో యువత, మహిళలు పాల్గొంటున్నారు.

Krishnadevipeta

2021-02-09 19:20:27

2021-02-09 14:28:48