1 ENS Live Breaking News

సమాచారం ఇచ్చేది గ్రంథాలయమే..

చట్టంతో సంబంధం లేకుండా విద్యావంతున్ని చేసేదీ.. హక్కులతో నిమిత్తం లేకుండా సమాచారం ఇచ్చేదీ పుస్తకమేనని ఆంధ్రా మెడికల్‌ ‌కాలేజీ, కింగ్‌ ‌జార్జి ఆసుపత్రి (కెజీహెచ్‌) ఎం‌డొక్రైనాలజీ విభాగం అధిపతి కె.ఎ.వి.సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. శ్రీ గౌరీ గ్రంథాలయంలోని గ్రంధాలు, పత్రికలు, పోటీ పరీక్షలు, ఆన్‌లైన్‌ ‌విభాగాలను సోమవారం ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలంటే పుస్తక పఠనం అవసరమన్నారు. నిరుద్యోగులు ఆన్‌లైన్‌లో పుస్తకాలు అందించే వెబ్‌సైట్లను వినియోగించుకోవాలని చెప్పారు. పాత పుస్తకాలను దానం చేయడానికి బడ్జెట్‌ ‌రీడ్స్, ‌బుక్‌ ‌చోర్‌ ‌వెబ్‌సైట్లను సంప్రదించవచ్చన్నారు. పుస్తక పఠనం ద్వారా జీవిత లక్ష్యాన్ని అలవోకగా సాధించవచ్చన్నారు. తెలుగు, ఆంగ్ల దినపత్రికలను తప్పనిసరిగా చదవాలన్నారు. పత్రికలు చదవడం వల్ల సమాజంలో జరుగుతున్న వివిధ పరిణామాలపై అవగాహన ఏర్పడుతుందని  ఆయన చెప్పారు. నిరుద్యోగులకు ఆసరాగా శ్రీ గౌరీ గ్రంథాలయం నిలుస్తుందన్నారు. ఈ సందర్భంగా పెంటకోట భోగలింగం జ్ఞాపకార్ధం ఆయన కుటుంబ సభ్యులు గ్రంథాలయానికి అందజేసిన తెలుగు అకాడమీ, పోటీ పరీక్షల పుస్తకాలను ఎండొక్రైనాలజీ విభాగం అధిపతి కె.ఎ.వి.సుబ్రహ్మణ్యం, ఏపీ వైద్య విధాన పరిషత్‌ ‌పాడేరు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ‌కిల్లు కృష్ణారావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి కాండ్రేగుల వెంకటరమణ, మాజీ కార్యదర్శి మళ్ల బాపునాయుడు, సభ్యులు కాండ్రేగుల అప్పారావు (కెప్టెన్‌), ‌కర్రి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.   

Visakhapatnam

2021-03-08 13:09:32

మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాలి..

మున్సిపల్ ఎన్నికలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా అదనపు ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య స్పష్టం చేశారు. ఆదివారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో  జోనల్అధికారులకు, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, మొబైల్ టీమ్స్, పోలీస్, సెక్రటేరియట్ సిబ్బందికి ఎన్నికల నిర్వహణ పై  సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది సమన్వయం తో పనిచేస్తూ  మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు.ఈ మూడు రోజులు అత్యంత కీలకమని జోనల్ అధికారులు, మొబైల్ , సర్వెలేన్స్ టీంలు చాలా జాగ్రత్తగా విధులను నిర్వహించాలన్నారు. డబ్బు, మద్యం రవాణా ఎక్కడైనా జరుగుతున్నట్లు దృష్టికి వస్తె వెంటనే కంట్రోల్ రూం నంబర్లకు కంప్లైంట్ చేయాలన్నారు. ఫిర్యాదు అందిన ఆరు గంటల లోపల క్లియర్ చేయాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్ట్ల వద్ద నిఘా పెంచాలన్నారు. ప్రచార ర్యాలీ లను వీడియో తీయాలన్నారు. మోడల్ కోడ్ ను ఉల్లంఘించే వారిపై చర్యలు చేపట్టాలన్నారు.  స్కూల్స్, దేవాలయాల వద్ద లౌడ్ స్పీకర్లు వాడరాదన్నారు. సెక్రటేరియట్ సిబ్బంది ఓటర్ల స్లిప్పుల పంపిణీ కార్యక్రమాన్ని  పూర్తి చేయాలన్నారు. ఓటర్లకు సంబంధించి ఇంట్లో  అందుబాటులో లేక పోవడం, ఇళ్లు మారడం, డెత్స్ లాంటి వివరాల జాబితాను తయారు చేసి వెంటనే అందజేయాలన్నారు. ఓటర్లకు ఓటు పై అవగాహన పెంచి వారు ఓటు హక్కుని వినియోగించుకొని ఓటింగ్ శాతాన్ని పెంచేవిధంగా  చూడాలన్నారు. వాలంటీర్లు  ఎన్నికల ప్రచారంలో పాల్గొన రాదని, ఎవరి మీదన్నా ఫిర్యాదు వస్తె  ఎన్నికల నియమావళి  ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.  ఈ నెల 8 వ తేదీ సాయంత్రం 5 గంటల కల్లా ఎన్నికల ప్రచారం ముగుస్తుందని, అదే విధంగా లిక్కర్ షాప్స్ మూసి వేయాలన్నారు. ఈనెల 9వ తేదీన ఎన్నికల సామాగ్రిని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పంపిణీ చేయనున్న నేపథ్యంలో త్రాగు నీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు.  ఈ సమావేశంలో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ మరియు మునిసిపల్ కమీషనర్ ఎన్ కనకారావు, పట్టణ సి ఐ స్వామి నాయుడు హాజరయ్యారు.  ఫిర్యాదులకు సంబందించి మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందని   ఫిర్యాదులను నమోదు చేసుకొని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.  84650 13255,  089322  95588  నంబర్లను 24/7 అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.

Narsipatnam

2021-03-07 16:11:21

సమగ్ర భూ సర్వపై అత్యాధునిక శిక్షణ..

సమగ్ర భూ సర్వేపై బేస్ స్టేషన్ శిక్షణ ఇస్తున్నట్టు జిల్లా సర్వేయర్ ఎం.మోహనరావు తెలియజేశారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఈమేరకు సర్వేయర్లకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన  మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం ముందుగా కొంతమంది సర్వేయర్లకు అత్యాధుని సాంకేతిక వ్యవస్థపై శిక్షణ ఇచ్చిందని వారితో అన్ని ప్రాంతాల్లో బేస్ స్టేషన్ శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఆ కార్యక్రమంలో భాగంగా ముందుగా శిక్షణ పొందిన వీర్ల సురేష్, బి.వీరేంద్రల ఆధ్వర్యంలో సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా సర్వేయర్లకు శిక్షణ పూర్తవగానే ఎవరి మండలాల్లో వారు ఈ యొక్క భూ సర్వే ప్రభుత్వ ఆదేశానుసారం ప్రారంభిస్తారని చెప్పారు. కొత్తసర్వేయర్లకు శిక్షణ ఇవ్వడానికి టెక్నాలజీపై బాగా అవగాహన ఉన్న యువ సర్వేయర్లను ప్రభుత్వం తొలి శిక్షణకు ఎంపికచేసిందని వివరించారు. వారే మిగిలిన వారికి శిక్షణ ఇస్తున్నారని చెప్పారు. శిక్షణలో కొత్తగా విధుల్లోకి చేరిన సర్వేయర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మండల సర్వేయర్ పి.సత్యన్నారాయణ, వివిధ మండలా సర్వేయర్లు పాల్గొన్నారు.

Gokavaram

2021-03-05 08:23:50

నెలాఖరు నాటికి నిర్మాణాలు పూర్తికావాలి..

రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య క్లినిక్ భవనాలు, సచివాలయ నూతన భవనాలను మార్చి చివరినాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కోటా నందూరు మండలం బిల్వా నందూరు గ్రామంలో నిర్మిస్తున్నరైతు భరోసా, హెల్త్ కమ్యూనిటీ సెంటర్ల్, సచివాలయాల భవాన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించి, ఈ భవనాలను మార్చి చివరినాటికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎస్ ఆర్ పేటలో ఇంటింటికి రేషన్ పంపిణీ పధకంలో భాగంగా రేషన్ పంపిణీ వాహనాన్ని సందర్శించి పంపిణీ చేయు ప్రక్రియను ఆలాగే పంపిణీ లో వున్న సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కోటానందూరులోను బీమావరపుకోటలో వైస్సార్ చేయూత పథకం కింద మేకలు, పశువులు, గొర్రెలు కొనుగోలుకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలోబ్యాంకు ల ద్వారా అందిస్తున్న ఒక్కకరికి రూ.18600 చొప్పున మంజూరు చేసిన మంజూరు పత్రాలను కలెక్టర్ చేతులు మీదుగా పంపిణీ చేశారు. భీమవరపు కోట లో జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాల లో మధ్యాహ్నం భోజన పధకాన్ని పరిశీలించి, కలెక్టర్ భోజన చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్(ఆసరా, సంక్షేమం)జి. రాజకుమారి, జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్  ఎన్టీ.శ్రీనివాసరావు,ఆర్డిఓ ఎస్. మల్లి బాబు, తహసీల్దార్ల ఎంపీడీఓ,తదితరులు పాల్గొన్నారు.

Kotananduru

2021-03-04 22:33:32

ఆ ఏఈని సస్పెండ్ చేయండి..కలెక్టర్

నాడు-నేడు పనులను  నాణ్యతా ప్రమాణాలు లేకుండా, నిబంధనలు,సరైన పర్యవేక్షణ పాటించకుండా నిర్వహించినందుకు గాను తుని సమగ్ర శిక్ష విభాగం సైట్ ఇంజనీరు వి.రాజేంద్రప్రసాద్ సస్పెన్షన్ కు జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.  గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ తుని మండలం, డి.పోలవరంలో జరిపిన పర్యటనలో గ్రామంలోని జడ్పి హైస్కూల్లో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు.  పాఠశాల భవనాల నిర్మాణ పనులను నాణ్యతలేని సామాగ్రితో, ప్రమాణాలు పాటించకుండా నిర్వహిస్తున్నట్లు ఆయన గమనించి, వాడుతున్న మెటిరీలియల్ గురించి ఆయన కాంట్రాక్టర్ ను ప్రశ్నించారు. పనులు నాసిరకంగా జరుగుతున్నా పట్టించుకోకుండా, పర్యవేక్షణ నిర్లక్ష్యం చేసిన  సైట్ ఇంజనీరు రాజేంద్రప్రసాద్  బాద్యతా రాహిత్యం పట్ల తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసి, అతని సస్పెన్షన్ కు ఆదేశించారు. అలాగే  పనుల్లో నిర్థేశించిన మెటీరియల్ కాకుండా నాసిరకం సిమ్మెంటు, ఇసుక వాడుతున్న కాంట్రాక్టర్ పై కూడా చర్యకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసారు. అలాగే ప్రధానోపాద్యాయుడు, స్కూల్ కమిటీ  నాణ్యత లేకుండా పనులు జరుగుతున్నా అధికారుల దృష్టికి తేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.   ప్రభుత్వం విద్యా వసతుల అభివృద్దికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడు పనులలో అవకతవకలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేశారు.  

Tuni

2021-03-04 22:31:43

నులిపురుగుల మాత్రలు తప్పక వేయించాలి..

నులిపురుగుల నిర్మూల‌నతో పిల్ల‌లకు ఆరోగ్య ప‌రంగా బ‌హుళ ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి పేర్కొన్నారు. బుధ‌వారం కాకినాడ శ్రీన‌గ‌ర్‌లోని న‌గ‌ర‌పాల‌క సంస్థ బాలికోన్న‌త పాఠ‌శాల‌లో నులిపురుగుల నివార‌ణ దినం (deworming day) కార్య‌క్ర‌మాన్ని న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్‌తో క‌లిసి జాయింట్ క‌లెక్ట‌ర్ ప్రారంభించారు. విద్యార్థుల‌కు నులిపురుగుల నివార‌ణ మాత్ర‌ల‌ను అందించారు. ఈ సంద‌ర్భంగా జేసీ మాట్లాడుతూ నులిపురుగుల నిర్మూల‌న మాత్ర‌లు వేసుకోవ‌డం వ‌ల్ల పిల్ల‌ల్లో వ్యాధి నిరోధ‌క శ‌క్తి మెరుగుప‌డుతుంద‌న్నారు. ర‌క్తహీన‌త‌ను నియంత్రించి చిన్నారుల ఆరోగ్య‌క‌ర జీవనానికి అవ‌కాశం ఏర్ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు పాఠ‌శాల‌లు, టెక్నిక‌ల్ క‌ళాశాల‌లు; ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌లు, ప్ర‌భుత్వ‌, ప్రైవేటు డిగ్రీ మొద‌టి సంవ‌త్స‌రం విద్యార్థులతో పాటు అంగ‌న్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ఆల్బెండ‌జోల్ మాత్ర‌లు అందించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మాన్ని 100 శాతం విజ‌య‌వంతం చేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్‌.. వైద్య‌, ఆరోగ్య శాఖ అధికారుల‌ను ఆదేశించారు.  ఈ కార్య‌క్ర‌మానికి ముందు కాకినాడ న‌గ‌ర పాల‌క సంస్థ ఆధ్వ‌ర్యంలో పాఠ‌శాల‌లో అమ‌ల‌వుతున్న స్వ‌చ్ఛతా కార్య‌క్ర‌మాల‌ను జాయింట్ క‌లెక్ట‌ర్ ప‌రిశీలించారు. ప్లాస్టిక్‌, ప‌గిలిన గ్లాసు, హానిక‌ర‌, ఎల‌క్ట్రిక‌ల్, ఎల‌క్ట్రానిక్ త‌దిత‌ర వ్య‌ర్థాల‌పై విద్యార్థులకు ఉన్న అవ‌గాహ‌న‌ను చూసి, వారిని అభినందించారు. వ్య‌ర్థాల విభ‌జ‌న‌, మెటీరియ‌ల్ రిక‌వ‌రీ ఫెసిలిటీ కేంద్రాలు, స్వ‌చ్ఛ కాకినాడ‌-స్వ‌చ్ఛ అంబాసిడ‌ర్‌, గ్రీన్ రిపోర్టు కార్డు త‌దిత‌ర వినూత్న కార్య‌క్ర‌మాల‌ను అమ‌లుచేస్తూ స్వ‌చ్ఛస‌ర్వేక్ష‌ణ్‌లో కాకినాడను ముందు నిలిపేందుకు క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్ ఎంతో కృషిచేస్తున్నార‌ని పేర్కొన్నారు. కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా జేసీ.. చిన్నారుల‌తో ముచ్చ‌టించారు. ఎంపిక చేసుకునే రంగం ఏదైనా స్ప‌ష్ట‌మైన ల‌క్ష్యాన్ని నిర్దేశించుకొని, ఆ ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు అహ‌ర్నిశ‌లు కృషిచేయాల‌ని విద్యార్థుల‌కు సూచించారు. అదే విధంగా ఆధునిక శాస్త్ర‌సాంకేతిక‌త‌లపై విద్యార్థుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఉపాధ్యాయుల‌కు జేసీ మార్గ‌నిర్దేశ‌నం చేశారు. కార్య‌క్ర‌మంలో ఇన్‌ఛార్జ్ డీఎంహెచ్‌వో ఎన్‌.ప్ర‌సన్న‌కుమార్‌, స‌మ‌న్వ‌య‌క‌ర్త డా. ప్ర‌భాక‌ర్‌, ఎంహెచ్‌వో డా. పృధ్వీచ‌ర‌ణ్, పాఠ‌శాల హెచ్ఎం ఎన్‌.నూక‌రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-03-03 17:41:01

మరింతగా సచివాలయ సేవలు అందించాలి..

గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (ఆసరా&సంక్షేమం) రాజకుమారి అధికారులను ఆదేశించారు.  మంగళవారం జేసి రాజకుమారి సోమర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో ఉన్న 1,2,3 సచివాలయలను సందర్శించి, రిజిస్ట్రర్లు తనిఖీ చేసారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ వైఎస్సార్ భీమా , ఆసరా,చేయూత,ఇతర పథకాలకు సంబంధించి ఏ దశలోను‌ పెండింగ్ లేకుండా సిబ్బంది కృషి చేయాలన్నారు. గ్రామ సచివాలయలకు వివిధ సేవల నిమిత్తం వచ్చే దరఖాస్తులను తప్పనిసరిగా గడువు లోపు పరిష్కరించాలని ఆమె తెలిపారు. అనంతరం జేసి వేట్లపాలెం స్టేట్ బ్యాంకు వెళ్ళి , వైయస్సార్ చేయూత  పథకం ద్వారా మేకలు గొర్రెలు, ఆవు గేదెల యూనిట్లకు సంబంధించి బ్యాంకు పరిధిలో ఉన్న 253 మంది లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసి లబ్ధిదారులనుద్దేశించి మాట్లాడుతూ చేయూత పథకం ద్వారా రూ.18,750 సొమ్ము మంజూరు అయిన లబ్ధిదారులకు పాడి పశువులను జీవనోపాధి గా ఎంచుకున్న వారికి రాబోయే మూడు సంవత్సరాల్లో సుమారుగా 56,250  రూపాయలు ముందుగా బ్యాంకు ద్వారా రుణంగా మంజూరు చేయడం జరుగుతుందన్నారు.253 యూనిట్లకు గాను 60 యూనిట్లుకు గ్రౌండిగ్ పూర్తయిందని జేసీ తెలిపారు. లబ్ధిదారులు వారికి కేటాయించిన యూనిట్స్ ను సద్వినియోగం చేసుకుని చక్కని జీవనోపాధి పొందాలని ఆమె సూచించారు. ఈ వారంతానికి అన్ని యూనిట్లకు గ్రౌండింగ్ పూర్తి చేయాలని  బ్యాంకు సిబ్బందికి తెలిపారు.అనంతరం  లబ్ధిదారులకు బ్యాంకు ద్వారా అందిస్తున్న సేవల వివరాలు, బ్యాంకు లాగిన్ ప్రక్రియను జేసి పరిశీలించారు.     ఈ పర్యటనలో జేసి రాజకుమారి వెంట పశుసంవర్థక శాఖ జేడీ డా.ఎన్టీ శ్రీనివాస్ రావు,పీడీ డీఆర్డిఎ వై హరిహరనాథ్, ఎస్బిఐ బ్యాంకు మేనేజర్ విజయ్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Samarlakota

2021-03-02 21:12:17

ఇంటింటి రేషన్ పంపిణీ సంత్రుప్తికరం..

ఇంటింటికీ రేష‌న్ స‌ర‌ఫ‌రా విధానం జిల్లాలో చ‌క్క‌గా అమ‌లవుతోంద‌ని రాష్ట్ర పౌర స‌ర‌ఫ‌రాల క‌మిష‌న‌ర్ కోన శ‌శిధ‌ర్ సంతృప్తిని వ్య‌క్తం చేశారు. అయితే దీనిని మ‌రింత సౌక‌ర్య‌క‌రంగా మెరుగు ప‌ర‌చాల‌ని ఆదేశించారు. జిల్లాలో మిల్ల‌ర్ల ప‌నితీరుప‌ట్ల అసంతృప్తిని వ్య‌క్తం చేశారు.  క‌మిష‌న‌ర్ శ‌శిధ‌ర్ మంగ‌ళవారం జిల్లాలో ఆక‌స్మికంగా ప‌ర్య‌టించారు. డెంకాడ మండ‌లం జొన్నాడ గ్రామం, విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలోని లంకాప‌ట్నం, బొగ్గుల‌దిబ్బ ప్రాంతాల్లో, ఎండియుల‌ ద్వారా జ‌రుగుతున్న రేష‌న్ పంపిణీని ప‌రిశీలించారు. అనంత‌రం క‌లెక్ట‌రేట్‌లో అధికారుల‌తో స‌మావేశాన్ని నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా క‌మిష‌న‌ర్ శ‌శిధ‌ర్ మాట్లాడుతూ మొబైల్ డిస్పెన్స‌రీ యూనిట్ల ద్వారా జ‌రుగుతున్న ఇంటింటికీ రేష‌న్ పంపిణీ కార్య‌క్ర‌మంలో వాలంటీర్ల‌ను మ‌రింత‌గా భాగ‌స్వాముల‌ను చేయాల‌ని ఆదేశించారు. వాలంటీర్ల‌కు ఈ కార్య‌క్ర‌మం ప‌ట్ల అవ‌గాహ‌న పెంచాల‌ని, ఈ పాస్ వేసే ప‌నిని వారికి అప్ప‌గించాల‌న్నారు. స‌రుకులు పంపిణీ చేసే రోజుకు ఒక‌టిరెండు రోజుల ముందుగానే ఆయా ప్రాంత ప్ర‌జ‌ల‌కు స‌మాచారాన్ని ఇవ్వాల‌ని సూచించారు.  వాహ‌నం వెళ్లేందుకు వీలైన ప్ర‌తీ వీధిలోకి వెళ్లి, స‌రుకుల‌ను పంపిణీ చేయాల‌న్నారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ వాహ‌నాల వ‌ద్ద జ‌నం గూమిగూడ‌కుండా, క్యూలు ఏర్పాటు కావ‌డం జ‌ర‌గ‌కూడ‌దని, వాహ‌నం ద‌గ్గ‌ర ఇద్ద‌రు లేదా ముగ్గురు కంటే ఎక్కువ‌మంది ఉండ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తీ ఇంటికీ త‌ప్ప‌నిస‌రిగా సంచుల ద్వారా స‌రుకుల‌ను అందజేయాల‌ని సూచించారు.  మురికివాడ‌లు, క‌డు పేద‌లు నివ‌శిస్తున్న ప్రాంతాల్లో ముందుగా స‌రుకుల పంపిణీ చేయాల‌న్నారు. రేషన్ డిపోల‌ రేష‌న‌లైనేష‌న్ ప్ర‌క్రియ ఈ నెలాఖ‌రులు పూర్తి చేయాల‌ని ఆదేశించారు. గిరిశిఖ‌ర గ్రామాల‌కు వీలైనంత ద‌గ్గ‌ర ప్రాంతాల‌కు వాహ‌నాల‌ను తీసుకువెళ్లి స‌రుకుల‌ను పంపిణీ చేయాల‌న్నారు. ‌ప్ర‌జ‌లు ఎటువంటి ఇబ్బంది ప‌డ‌కుండా, ఇంటిద‌గ్గ‌రే రేష‌న్ స‌రుకుల‌ను అందుకోవాల‌న్న‌ది ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని, దానిని నెర‌వేర్చేవిధంగా   కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేయాల‌ని కోరారు.               జిల్లాలో జ‌రుగుతున్న ధాన్యం సేక‌ర‌ణ‌ ప్ర‌క్రియ‌పై క‌మిష‌న‌ర్ స‌మీక్షించారు. మిల్లింగ్ చేసి, బియ్యాన్ని తిరిగి ఇవ్వ‌డంలో రైస్‌ మిల్ల‌ర్లు చేస్తున్న‌ జాప్యంపై అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. సార్టెక్స్ ఎందుకు ఇవ్వ‌డంలేద‌ని మిల్ల‌ర్ల‌ను ప్ర‌శ్నించారు. రోజుకు 4వేల ట‌న్నులు చొప్పున, ఈ నెలాఖ‌రునాటికి ల‌క్షా,28వేల ట‌న్నుల సార్టెక్స్ ఇవ్వాల‌ని, ఇదే మిల్ల‌ర్ల‌కు ఇస్తున్న చివ‌రి అవ‌కాశ‌మ‌ని క‌మిష‌న‌ర్‌ హెచ్చ‌రించారు.                 స‌మీక్షా స‌మావేశంలో జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జి.సిహెచ్ కిశోర్ కుమార్‌, పార్వ‌తీపురం స‌బ్ క‌లెక్ట‌ర్ విదేహ్ ఖ‌రే, ఐటిడిఏ పిఓ ఆర్‌.కూర్మ‌నాధ్‌, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భ‌వానీ శంక‌ర్‌, డిఎస్ఓ పాపారావు, సివిల్ స‌ప్ల‌యిస్ డిఎం భాస్క‌ర్రావు త‌దిత‌ర అధికారులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-03-02 20:36:28

ఘనంగా నూకాలమ్మ ఆలయ వార్షికోత్సవం..

అన్నవరంలోని బిసీకాలనీ కొండపై వెలసిన శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయ ప్రధమ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఆలయ ధర్మకర్త గంగరాజు కుటుంభం ఉదయం ఐదుగంటలకు తొలిపూజ చేసి అమ్మవారిని మోల్కొలిపారు. అనంతరం శోభాయమానంగా అలంకరించిన అమ్మవారికి భక్తులకు  ప్రత్యేక పూజలు చేసి, దర్శించుకొని తీర్ధ ప్రసాదాలు పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ అన్నదానం కార్యక్రమంలో సుమారు మూడువేల మంది భక్తులు అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఉదయం ఆరుగంటల నుంచి ప్రత్యేక భజన కార్యక్రమాలు 11గంటల వరకూ నిర్వహించారు. అనంతరం అన్నసమారాధన నిర్వహించి. సాయంత్రం అమ్మవారి గాన నీరాజనం ప్రత్యేక హారతి సర్పించారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన మహిళా భక్తులకు గాజులు, పూవులు, కుంకుమను అందించారు ఆలయ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో సుమారు 35 మంది యువకులు మూడు రోజుల పాటు నిర్వహించి ఉత్సవాల్లో కీలక పాత్ర వహించి కార్యక్రమాలను విజయవంతం చేశారు. 

Annavaram

2021-02-28 23:15:31

నూకాలమ్మ గుడిలో విజయవంతమైన ఏకాహాం..

అన్నవరంలోని శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసి ఏకాహం(24 గంటల భజన) ఆదివారం ఉదయం 6గంటలతో పూర్తయింది. ఎనిమిది భక్తమండలి బ్రుందాలు మూడు గంటల చొప్పున 24 గంటల పాటు వాయిద్యాలు వాయిస్తూ అమ్మవారికి గాన నీరాజనం సమర్పించారు. వారికి ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లూ చేశారు. అమ్మవారి ఆలయ వార్షికోత్సవరం సందర్భంగా ఈరోజు ఆలయంలో భారీ అన్నసమారాధాన ఉదయం 11 నుంచి ప్రారంభిస్తామని ధర్మకర్త గంగరాజు తెలియజేశారు. ఉదయం 5 గంటల నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ అశేషంగా వస్తున్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు అన్నవరం గ్రామంతోపాటు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. 

Annavaram

2021-02-28 09:51:40

ఘనంగా పీటీ మాష్టారి ఉద్యోగ విరమణ..

అన్నవరంలోని శ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామి వారి దేవస్థానం సంస్క్రుతోన్నత పాఠశాలలో పీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మొగిలి చక్రరావు మాష్టారి ఉద్యోగ విరమణ శనివారం పాఠశాల ఆవరణలో విద్యార్ధులు ఘనంగా నిర్వహించారు. మాష్టారి దంపతులను ప్రత్యేక కుర్చీపై కూర్చోబెట్టి ఆయన దగ్గర క్రీడల్లో శిక్షణ పొందిన పూర్వ విద్యార్ధులతోపాటు, ప్రస్తుత విద్యార్ధులు కూడా తమ గురువుకి పాదాభివందనం చేశారు. ఈ పాఠశాలలో చదువుకున్నవారంతా ఎక్కడెక్కడో ఉన్నప్పటికీ మాష్టారి ఉద్యోగవిరమణ సంగతి తెలుసుకొని పాఠశాలకు వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. తన వద్ద శిక్షణ పొందిన విద్యార్ధులంతా నేడు తమ పిల్లలతో వచ్చి ఆఖరిరోజు తనను కలుసుకోవడం చాలా ఆనందంగా వుందని పీటీ మాష్టారు చక్రరావు ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజుతో తనకి ఈ పాఠశాలకి రుణం తీరిపోయినప్పటికీ ఎందరో విద్యార్ధులను ఒకేసారి చూసే అవకాశం, ఆనందం తనకి దక్కిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్నవరం గ్రామానికి చెందిన గజివిల్లి సిస్టర్స్ మత్స్య, మణిమాల, నాగసత్యశిరీషలు కూడా పాల్గొని మాష్టారి నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. అధిక సంఖ్యలో విద్యార్ధులు,పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Annavaram

2021-02-27 22:16:57

తక్షణమే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించండి..

ప్రభుత్వం నుంచి స్థలాలు పొందిన వారంతా గృహ నిర్మాణ  పనులు వేంటనే చేపట్టాలని  లబ్ధిదారులను జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి కోరారు. శనివారం ఉదయం  ఆమె కరపలో పర్యటించి, 136 .52 ఎకరాల విస్తీర్ణంలో 14 లేఅవుట్లుగా  వేసిన  సెంట్రల్ లే అవుట్ ను పరిశీలించారు.  ఈ సందర్భంగా ఇంకా  74.37 ఎకరాలు లెవిలింగ్ చేయాల్సి ఉందని, డ్రైనేజ్ ఉండటంతో పనులు ఆగిపోయాయని డిప్యూటీ తాసిల్దారు పొన్నమండ  శ్రీనివాస్ ఆమె దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే డ్రైనేజీ ఏఈ  ని పిలిచి వారం రోజుల్లో డ్రైనేజ్ వద్ద గట్ల నిర్మాణం పూర్తి చేయాలని, గ్రావెల్ లారీలు వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అలాగే పలుచోట్ల విద్యుత్ స్తంభాలు అడ్డుగా ఉండడంతో వాటిని ప్రక్కకు జరిపేందుకు  పనులు వేంటనే ప్రారంభించాలని ట్రాన్స్ కో ఏఈ ప్రసాద్ కు సూచించారు. లెవిలింగ్  పనులు జాప్యం కావడం పట్ల ఆమె తీవ్ర  అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఆయా శాఖల సమన్వయంతో వెంటనే పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని డిప్యూటీ తాసిల్దారు, ఎంపిడిఓ  కర్రే స్వప్న లకు సూచించారు.  ఈ సందర్భంగా  జేసి(డి) పలువురు లబ్ధిదారులతో మాట్లాగా ప్రస్తుతం మూఢం, మంచి రోజులు కాకపోవడంతో ఇళ్ళ నిర్మాణాలు ప్రారంభించలేమని లబ్దిదారులు పేర్కొన్నారు. అయితే వర్షాకాలం వస్తే పనులు జరగవని,  మహాశివరాత్రి  మంచి రోజు అయినందున  ఆరోజు నిర్మాణాలు ప్రారంభించాలని సూచించారు. లబ్ధిదారులకు ఇసుక కూపన్లు ఇస్తామని రవాణా చార్జీలు లబ్దిదారులే  భరించాలి అన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతం లోతట్టు ప్రాంతం అయినందున  మెరక చేసుకోవాలని రూ 20 వేలకు మించి ఖర్చు కాదని సూచించారు. అవసరమైతే డ్వాక్రా రుణాలను ఇందుకోసం వినియోగించుకోవాలని సూచించారు. శ్రీ రామనవమి వెళ్లే వరకు తాము పనులు చేపట్టలేమని లబ్ధిదారులు తెలపగా సొంత ఇంటి నిర్మాణం తొందరగా చేసుకుంటే ఇళ్ల అద్దెలు చెల్లించే బాధ తప్పుతుంది కదా... ఆలోచించండని  అని వారికి అవగాహన కల్పించారు. ఇటుక, ఇసుక, మెటల్ తక్కువ ధరలకు ఇప్పించే ప్రయత్నం చేస్తామని లబ్ధిదారులకు హామీ ఇచ్చారు. కొందరు లబ్ధిదారులు వెంటనే పనులు ప్రారంభించేందుకు ముందుకు రాగా జెసి కీర్తి వారిని  అభినందించారు. మొత్తం స్థలాలు పరిశీలించి  జియో ట్యాగింగ్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.   ఈ కార్యక్రమంలో గృహనిర్మాణ శాఖ పిడి జివి ప్రసాద్, కాకినాడ, రామచంద్రపురం డివిజన్ల ఈఈ రఘురాం, డిఈ కె.వి.ఆర్ గుప్తా, ఏఈ సోమిరెడ్డి, ఆర్ఐ పేపకాయల మాచర రావు, విఆర్వో భద్రిరాజు చండీ, కార్యదర్శి గొలకోటి త్రినాధ్ తదితరులు పాల్గొన్నారు.

Karapa

2021-02-27 13:27:45

నూకాలమ్మ తల్లి ఆలయంలో ఏకాహం..

అన్నవరం బిసికాలనీలో వెలసిన శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా 24 గంటల భజనా కార్యక్రమం(ఏకాహం) ఏర్పాటు చేసినట్టు ఆలయ ధర్మకర్త గంగరాజు తెలియజేశారు. శుక్రవారం అన్నవరంలోని అమ్మవారి ఆలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా శనివారం ఉదయం ఆరుగంటల నుంచి ఆదివారం ఉదయం ఆరుగంటల వరకూ ఏకాహం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వివిధ భజనా బ్రుందాలు పాల్గొంటాయన్నారు. అలాగే ఆదివారం ఉదయం 11 గంటల నుంచి అమ్మవారి ఆలయంలో భారీ అన్న సమారాధన కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. యావత్ భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలతోపాటు అన్నదానములో పాల్గొనాలని భక్తులను కోరుతున్నామన్నారు. అదే సమయంలో అమ్మవారికి ఎవరైనా భక్తులు కానుకలుగాని, విరాళాలు గానీ ఇవ్వాలనుకుంటే ఆలయ కమిటీని నేరుగా సంప్రదించాలని కోరుతున్నారు. 

Annavaram

2021-02-26 20:52:27

గుడిలో హుండీ దోచుకోబోయి పట్టుబడ్డారు.

విజయవాడకు చెందిన ఇద్దరు యువకులు ఒక బైక్ దొంగిలించి ఆపై మరో గుడిలో హుండీని దోచుకోబోయి స్థానికులకు పట్టుబడ్డారు. వివరాలు తెలుసుకుంటే కుమార్, మహేష్ అని చెప్పబడే ఈ ఇద్దరూ శుక్రవారం నర్సీపట్నం పక్కనే వున్న బలిఘట్టం గ్రామంలో ఒక మోటారు బైకుని దొంగిలించి అక్కడి నుంచి చింతపల్లి వెళుతూ..మార్గమధ్యలోని డౌనూరు గ్రామంలోని వినాయకుడి గుడిలో హుండీ పగుల గొట్టేందుకు విఫలయ యత్నం చేశారు. హుండీ పగులకొట్టే శబ్ధం విని గ్రామస్తులు ఆ ఇద్దరి యువకులను పట్టుకొని దేహశుద్ధి చేసి చెట్టుకి కట్టేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిని ప్రశ్నిస్తే తమది విజయవాడని, సన్ హోటల్ మేనేజ్ మెంట్ కాలేజిలో చదువుతున్నామని చెప్పుకొచ్చారు. ఆపై కొన్ని పొంతన లేని మాటలు చెబుతుండటంతో వీరిని పోలీసులు వచ్చేంత వరకూ గ్రామంలోనే ఉంచేశారు. వీరి దగ్గర నుంచి బైకును స్వాధీనం చేసుకొని అందులో ఉన్న రికార్డులు పరిశీలించి అందులో ఉన్న వ్యక్తికి ఫోన్ చేయడంతో తన బైకు పోయిందని, తన పేరు గవిరెడ్డి శ్రీనివాస్ అని చెప్పారు. బైకును, దొంగలను గ్రామస్తులు పోలీసులకు అప్పగించినట్టు వివరించారు.

డౌనూరు

2021-02-26 08:44:52

రేపటి నుంచి నూకాలమ్మ ఆలయ వార్షికోత్సవం..

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం గ్రామంలోని తారకరామ కాలనీలో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ నూకాలమ్మతల్లి ఆలయ ప్రధమ వార్షికోత్సవం మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తున్నట్టు ధర్మకర్త గంగరాజు తెలియజేశారు. గురువారం ఆయన అన్నవరంలో మీడియాతో మాట్లాడుతూ, అమ్మవారిని గ్రామంలో ప్రతిష్టించి సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంగా మూడు రోజుల పాటు ఉత్సవాలు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ ఉత్సవాల్లో భాగంగా గ్రామంలో తీర్ధంతోపాటు, వివిధ సాంస్క్రుతిక కార్యక్రమాలు, నాద నీరాజనం, భజనలు, అమ్మవారి ఆలయంలో ఆఖరిరోజు అనగా అమ్మవారి పుట్టిన రోజు 28వ తేదిన భారీ అన్నసమారాధన కూడా నిర్వహిస్తున్నామన్నారు. అమ్మవారి ఆలయ ప్రధమ వార్షికోత్సవరంలో ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి కమిటీ పూర్తినిర్ణయం తీసుకుందన్నారు. ఈ ఉత్సవాల్లో అన్నవరంతోపాటు శంఖవరం మండల వాసులు, తూర్పుగోదావరి జిల్లాలోని భక్తులు కూడా పాల్గొని, తీర్ధ ప్రసాదాలు స్వీకరించి వార్షికోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. అదే సమయంలో అమ్మవారికి కానుకలు సమర్పించే వారు నేరుగా ఆలయంలోని ధర్మకర్తలను సంప్రదించవచ్చునని వివరించారు.

Annavaram

2021-02-25 21:13:48