ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ఫలితమే నేడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ మద్దతు దారులు ఇంత పెద్దస్థాయిలో పంచాయతీ ఎన్నికల్లో విజయపతాకాలను ఎగురవేశారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాద్ అన్నారు. బుధవారం కశింకోట మండలం కన్నురూపాలెంలో దంతులూరి శ్రీధర్ రాజు ఆధ్వర్యంలో మండలంలో గెలిచిన సర్పంచ్ అభ్యర్థులతో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 59 పంచాయితీలలో 49 మంది పంచాయతీలను మన అభ్యర్థులే అఖండమైన మెజారిటీతో గెలుపొందడం శుభపరిణామమన్నారు. వారిలో గ్రామాభివృద్ధి కోసం 17 మంది యువకులకు సర్పంచి అభ్యర్థులగా గెలిపించి యువకులు కూడా రాజకీయాల్లో రావాలనే చైతన్యాన్ని కలిగించడం చెప్పుకోదగ్గ అంశమన్నారు. గెలిచిన సర్పంచ్ అభ్యర్థులందరూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, గ్రామ అభివృద్ధి కోసం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు గొల్లవిల్లి శ్రీనివాసరావు, కశింకోట మండలం సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లు, సచివాలయ సిబ్బంది,పెద్ద సంఖ్యలో మహిళలు,పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆర్అండ్ ఆర్ కాలనీల్లో మౌళిక సదుపాయాల కల్పన సత్వరమే చేపట్టాలని రంపచోడవరం ఆర్డీఓ శీనానాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం కమలపాలెం, పోతవరం కాలనీలను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, కాలనీల నిర్మాణాలు పూర్తయ్యేనాటికి మిగిలిన సదుపాయాలు కూడా పూర్తచేయాలన్నారు. తద్వారా ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఉంటాయన్నారు. నీటి సరఫరరా, విద్యుత్ లైన్లు, వీధి దీపాలు, మరుగుదొడ్ల నిర్మాణాలు సత్వరమే పూర్తిచేయాలన్నారు. మరో 15 రోజుల్లో సదుపాయాల పురోగతిపై నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ఆర్డీఓ వెంట తహశీల్దార్ వీర్రాజు, రెవిన్యూ ఇనెస్పెక్టర్ బాపిరావు, గ్రామ రెవిన్యూ అధికారి సతార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
కోవిడ్ వాక్సిన్ ను పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్దార్ సింగుపురం పి.హెచ్.సిలో తీసుకున్నారు. ఏ.ఎన్.ఎమ్ రోజారాణి ఎస్.పికి వాక్సిన్ వేశారు. ఫ్రంట్ లైన్ కోవిడ్ వర్కర్లకు వాక్సినేషన్ లో భాగంగా బుధ వారం పోలీసు శాఖకు వాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. సింగుపురం పి.హెచ్.సిలో సింగుపురం పి.హెచ్.సిలో ఎస్.పి అమిత్ బర్దార్ తో పాటు ఏ.ఎస్.పి టి.పి.విఠలేశ్వర్, ఎస్.ఇ.బి ఏ.ఎస్.పి కంచి శ్రీనివాసరావు, డి.ఎస్.పి జి.శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ పి.వి.రమణ తదితరులు వాక్సిన్ ను తీసుకున్నారు. వాక్సిన్ తీసుకున్న అనంతరం ఎస్.పి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కోవి షీల్డ్ వాక్సిన్ తీసుకోవడం జరిగిందని అన్నారు. వాక్సిన్ తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. వాక్సిన్ కు పేరు నమోదు చేసుకున్న క్రమంలో సింగుపురం పి.హెచ్.సిలో వాక్సినేషన్ కు పేరు వచ్చిందని చెప్పారు. వాక్సిన్ తీసుకొనుటకు ప్రాధాన్యత క్రమం ఉండదని, అందరూ సమానమేనని చెప్పారు. ప్రతి ఒక్కరూ వాక్సిన్ తీసుకోవాలని ఆయన అన్నారు. వాక్సిన్ తీసుకొనుటకు భయం అవసరంలేదని పేర్కొన్నారు. అయితే వైద్యుల సూచనలు పాటించాలని కోరారు. వాక్సిన్ తీసుకునే ముందు రోజు మంచి నిద్ర ఉండాలని, వాక్సిన్ అనంతరం తగిన విశ్రాంతి తీసుకోవాలని ఆయన సూచించారు. కోవిడ్ వ్యాప్తి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి దేశంలో ప్రారంభం అయినట్లు వార్తలు వస్తున్నాయని అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. 2వ సారి, 3వ సారి లాక్ డౌన్ వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నట్లు గమనించాలని పేర్కొన్నారు. దీని దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులు తరచూ శుభ్రపరచుకోవాలని సూచించారు.
అదనపు డి.ఎం.హెచ్.ఓ డా.బి.జగన్నాథ రావు మాట్లాడుతూ కోవిడ్ వ్యాప్తిపట్ల ప్రజలు అందరూ అప్రమత్తం కావలసిన సమయం ఆసన్నమైందన్నారు. దక్షిణాఫ్రికా తదితర కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి ఉన్నట్లు గమనిస్తన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డి.ఎం.హెచ్.ఓ డా.కె.సి.చంద్ర నాయక్, డి.ఐ.ఓ డా.ఎల్. భారతి కుమారి దేవి తదితరులు ఉన్నారు.
ఎస్.రాయవరం గ్రామకమిటీ టిడిపి నాయకుడిగా సోమిరెడ్డిరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో బుధవారం జరిగిన గ్రామకమిటీ సమావేశంలో రాజును కార్యకర్తలంతా కలిసి ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టిటిపి సీనియర్ కార్యకర్తలు మాట్లాడుతూ, టిడిపికి బలమైన నాయకుడు లేకపోవడం వలన ప్రభుత్వంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించడానికి వీలులేకుండా పోతుందన్నారు. ఈయనను ఎన్నుకోవడం ద్వారా ఎస్.రాయవరం మండలకేంద్రంలో టిడిపి మరింత అభివ్రుద్ధి చెందడానికి ఆస్కారం వుంటుందన్నారు. సోమిరెడ్డిరాజు మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి గ్రామకమిటీ నేతగా ఎన్నుకోవడం ఆనందంగా వుందన్నారు. పార్టీ అభివ్రుద్ధితోపాటు, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసి ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవడానికి అన్ని రకాలగా సమిష్టి క్రుషి చేద్దామని అన్నారు. ఎస్.రాయవరం మండల కేంద్రంలో పార్టీ అభివ్రుద్ధి నూతక కమిటీలు ఏర్పాటు చేసుకొని ప్రణాళికా బద్దంగా ముందుకు నడుద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో బత్తుల వాసు, మురుకుర్తి గణేష్, కర్రి అబద్ధం, భీమరశెట్టి సత్యనారాయణ, నాగ సూరిబాబు, దుబాసి రమేష్, అంకాబత్తుల రమణ, అంగిన రమణ, బత్తుల సూరన్న, తాడేల సంతోష్, కర్రి శ్రీనివాసరావు, 13 వ వార్డ్ మెంబర్ గాలి సత్యనారాయణ, కశింకోట రాంబాబు, సూర్య ప్రకాష్, తదితరులు, పాల్గున్నారు.
భారదేశ చరిత్రలో గతంలో ఎన్నడూలేని విధంగా సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలన కొనసాగుతుందని విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. మంగళవారం నియోజకవర్గలో గెలుపొందిన సర్పంచ్ లతో కోటవురట్ల మండలం రామచంద్రా పురం శ్రీపతిరాజు పామ్ హౌస్ లో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశం మొత్తం ఇపుడు ఆంధ్రప్రదేశ్ వైపు తొంగి చూస్తుందన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఉందన్నారు. పేద ప్రజల అభివృద్ధికి జగన్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో 108 సర్పంచ్ లకు గాను వైఎస్సార్సీపీ అభ్యర్ధులు 86 స్థానాలు గెలుచుకోవడం ఆనందంగా వుందన్నారు. పార్టీ రహిత ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులను గెలిపించుకున్న మనం త్వరలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించుకుని సీఎం వై ఎస్ జగన్ కు కానుకగా అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన సర్పంచ్ లను ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల వైఎస్సార్సీపీ నేతలు, రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే జడ్పీటీసీ, ఎంపిటిసి అభ్యర్థులు, ఈధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
పేదలందరికి ఇల్లు నిర్మాణ పనుల్లో లబ్ధిదారుల సమస్యలను హౌసింగ్ అధికారులు గుర్తించి నివేదికలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి హౌసింగ్ అధికారులు ఆదేశించారు మంగళవారం సామర్లకోట మండలం జి. మేడపాడు, సామర్లకోట అర్బన్ కు సంబంధించిన పేదలందరికీ ఇల్లు నిర్మాణ పనులనుపరిశీలన, భూమి పూజ కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ పాల్గున్నారు.ముందుగా జి మేడపాడు గ్రామంలో 372 మంది లబ్ధిదారులకు కేటాయించిన లేఔట్ లో 6 ఇళ్ల నిర్మాణ పనులకు కలెక్టర్, హౌసింగ్ అధికారుల సమక్షంలో భూమి పూజ కార్యక్రమం జరిగింది అనంతరం సామర్లకోట అర్బన్ సంబంధించి 2258 లబ్ధిదారులకు కేటాయించిన పేదలందరికి ఇళ్ళులేఔట్ లో చేపట్టిన ఇళ్ళ నిర్మాణ పనులను, హౌసింగ్, మున్సిపల్ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. నిర్మాణ పనులకు సంబంధించి వాటర్ సప్లై ,కరెంటు , మెటీరియల్ స్టోరేజ్, సెక్కురిటీ, తదితర సమస్యలను నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు .హోసింగ్ నిర్మాణ సమస్యలను హౌసింగ్ అధికారులు నివేదిక తయారు చేస్తారని వాటిని సమావేశం చర్చించి పరిష్కరిస్తామని లబ్ధిదారులకు తెలిపారు. లబ్ధిదారులకు ఇల్లు నిర్మాణానికి లక్ష 80 వేలు లబ్ధిదారులకు విడతలవారీగా వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.ప్రతి ఒక్కరు ఇళ్ళునిర్మాణం చేపట్టాలని తెలిపారు. వాటర్ సప్లై, కరెంటు, పైప్ లైన్, తదితర అంశాలపై, మున్సిపల్ హౌసింగ్ ,పబ్లిక్ హెల్త్ అధికారులతో కలెక్టర్ చర్చించారు అనంతరం కలెక్టర్ ఇంటి నిర్మాణానికి నిల్వ ఉంచే సిమెంట్ తూరలను, దానికి అయ్యే ఖర్చు గురించి నిర్మాణం చేపట్టిన ఇంటి యజమాని అడిగి తెలుసుకున్నారు.కలెక్టర్ వెంట జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి వీరేశ్వర ప్రసాద్, హౌసింగ్ ఇఇ బి. సుధాకర్ పట్నాయక్, డి.ఈ.ఈ. ఆర్.ఎస్.కె. రాజు, మున్సిపల్ కమిషనర్ శేషాద్రి హౌసింగ్ ఏఈ శ్రీనివాసరావు ,మున్సిపల్ డీఈ చదలవాడ రామారావు, టి పి ఎస్ మంజుల తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. జిల్లాలో గృహనిర్మాణ కార్యక్రమంపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటివరకూ జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ, రిజిష్ట్రేషన్, మ్యాపింగ్, జియో ట్యాగింగ్ తదితర ప్రక్రియలపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా జెసి మహేష్ కుమార్ మాట్లాడుతూ వారం రోజుల్లోగా రిజిష్ట్రేషన్, మ్యాపింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. కొన్ని మండలాల్లో పురోగతి పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయంలో అలక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు. ఎటువంటి సాంకేతిక సహకారం కావాలన్నా అందిస్తామని, సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నామని, ఈ నెలాఖరుకు పని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని చెప్పారు. వంద ఇళ్లు దాటిన లేఅవుట్లను జిల్లా స్థాయి టౌన్ ప్లానింగ్ అధికారులకు చూపించి, వారి సహలహాలను తీసుకోవాలని సూచించారు. 2016 నుంచి 2019 వరకూ మంజూరైన ఇళ్ల స్థితిగతులపై నివేదికలను వెంటనే పంపించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్‌వి రమణమూర్తి, డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారులు కె.రామచంద్రరావు, కె.రాజ్‌కుమార్, హౌసింగ్ డిఇలు, ఏఈలు పాల్గొన్నారు.
ఇంటింటికి బియ్యం పంపిణీ పధకం పక్కాగా అమలు చేయాలని పౌర సరఫరాల కమీషనర్ కోన శశిధర్ పేర్కొన్నారు. నిత్యావసర సరుకులు ఇంటింటికి పంపిణీపై మంగళవారం అమరావతి నుంచి జాయింట్ కలెక్టర్లు , ఐటీడీఏ పి.ఓలు, రెవిన్యూ అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసర సరుకులు పంపిణీ లో అలసత్వం వుండకుదన్నారు. సరుకులు పంపిణీపై వాహన ఆపరేటర్ లకు శిక్షణ ఇవ్వాలని చెప్పారు. అదేవిధంగా ప్రతివాహనానికి సంబంధించిన ఆపరేటర్ హెల్పర్ లను నియమించుకోవాలని స్పష్టం చేశారు. వాహనాలు ఆపరేటర్ లకు రూ.10 వేలు,హెల్పర్ కు రూ.5వేలు చెల్లిస్తామన్నారు. ఉదయం 7.30 గంటలనుంచి సరుకుల పంపిణీ చేపట్టాలని సూచించారు. వచ్చే నెలనుంచి నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకుని లబ్ధిదారులకు ముందుగా కూపన్లు పంపిణీ చేసి తరువాత నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలన్నారు. ఐటీడీఏ పి.ఓ డా.వెంకటేశ్వర్ మాట్లాడుతూ 11 మండలాల్లో 144 మినీ వాహనాల ద్వారా పంపిణీ జరుగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్ డిఓ కె.లక్ష్మీ శివజ్యోతి. పౌర సరఫరాల డి.టీలు చంద్రశేఖర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖ మారిక వలస లో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ ప్రతిభా కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి ఖర్గపూర్ ఐ ఐ టిలో మైనింగ్ విభాగంలో సీటు సాధించిన గిరిజన విధ్యార్దిని సందడి నీరజకు ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారి డా. వెంకటేశ్వర్ సోమవారం ఆయన కార్యాలయంలో ల్యాప్ టాప్‌ను బహూరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యార్దులు ఉన్నతమైన స్దానాలను అధిరోహించాలన్నారు. ఐ ఐ టి సీటు సాధించిన గిరిపుత్రికను ఆయన అభినందించారు. మైనింగ్ ఇంజనీరింగ్‌కు మంచి డిమాండ్ ఉందని ఉన్నతమై ఉద్యోగాలు వస్తాయన్నారు. మైనింగ్ విభాగానికి ఉద్యోగ అవకాశాలు ఎక్కవన్నారు. బాగా చదువుకుని మన్యానికి మంచిపేరు తీసుకుని రావాలని సూచించారు. పెదబయలు మండలం పరదానపుట్టు గ్రామానికి చెందిన నీరజ ఐ ఐటి సీటు సాధించడం గిరిజన విద్యార్దులకు ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ ఉపసంచాలకులు జి. విజయకుమార్, గురుకుల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విశాఖజిల్లాలోని భీమిలీ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు విజయఢంకా మోగించారంటూ సర్పంచ్ అభ్యర్ధులను రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అభినందించారు. సోమవారం భీమిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపు సాధించిన సర్పంచ్ లతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వానికి, పార్టీకి మంచి విజయాన్ని తెచ్చిపెట్టారన్నారు. 15 స్థానాలకి స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం చేసుకోవడం గొప్పవిషయమన్నారు. ఈవిషయంలో నాయకులు, కార్యకర్తలు చేసిన క్రుషి మరువలేనిదన్నారు. చాలా చోట్ల టిడిపికి అభ్యర్ధులే లేరన్న మంత్రి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభ్యర్ధులపై ప్రజలకున్న నమ్మకమే ఈ గెలుపునకు కారణమని పేర్కొన్నారు. అనంతరం సర్పంచ్ లు కార్యకర్తలతో కలిసి డప్పు వాయిస్తూ సంబరాల్లో పాల్గొన్నారు. మంత్రి నేరుగా సర్పంచ్ అభర్ధులను అభినందిస్తూ చైతన్య పరచడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే ఉత్సాహంతో రానున్న రోజుల్లో కూడా ప్రజల వద్దకు సంక్షేమ పథకాలు చేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
అన్నవరం గ్రామ పంచాయతీని తూర్పుగోదావరి జిల్లాలోనే బెస్ట్ పంచాయతీగా అభివ్రుద్ధి చేస్తామని గ్రామ సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా పేర్కొన్నారు. ఆదివారం ఎస్వీఎస్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నవరం నూతన సర్పంచ్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, సత్యదేవుని ఆశీస్సులతో ప్రజలకు సేవచేసుకునే అవకాశం దక్కిందన్నారు. గ్రామంలోని ప్రధాన సమస్యలు పరిష్కరించడంతోపాటు, ప్రజలకు చేరువగా ఉండి సేవచేసుకుంటానని అన్నారు. గ్రామ సర్పంచ్ గా పాలన చెయ్యాలనే చిరకాలవాంఛను అన్నవరం ప్రజలు నెరవేర్చార్నారు. జర్నలిస్టులు కూడా గ్రామాభివ్రుద్ధికి మంచి సూచనలు, సలహాలు అందించాలన్నారు. సర్పంచ్ ని కలిసిన వారిలో వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కార్యదర్శి యాళ్ల శివ, సత్తి బాలకృష్ణమూర్తి తదితరులు వున్నారు.
విశాఖ జిల్లాలో 4వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధారిటీ వి వినయ్ చంద్ వెల్లడించారు. 4వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని ఆనందపురం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఆనందపురం, వెల్లంకి పోలింగ్ కేంద్రాలను ఆదివారం ఆయన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ విశాఖపట్నం డివిజన్ లో గ్రామ పంచాయతీ ఎన్నికలు 4వ దశ కూడా ప్రశాంతంగా జరిగినట్లు పేర్కొన్నారు. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకొని పోలింగ్ లో పాల్గొన్నారన్నారు. రానున్న 5 సంవత్సరాలలో గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు అభ్యర్థి ని ఎన్నుకొనేందుకు చక్కని అవకాశమని వివరించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగు ప్రశాంతంగా జరిగాయని చెప్పారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలింగ్ లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారని పేర్కొన్నారు. పెద్ద వయసు గల ఓటర్లను ఆశా కార్యకర్తలు సహాయంతో పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నట్లు వివరించారు. ఉదయం 6.30 గంటల నుండే ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నట్లు తెలిపారు. డివిజన్ లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న 6 మండలాల్లో 68 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, ఆ ప్రాంతాల్లో వీడియో గ్రఫీ తీయిస్తున్నట్లు తెలిపారు. అధికారులు, పోలింగ్ సిబ్బంది, పోలీసులు, మెడికల్ సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేసి ప్రశాంతంగా ఎన్నికలు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈ పర్యటనలో విశాఖపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి పెంచల కిషోర్, తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపిడిఓ ఎ. లవరాజు, తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో నాల్గవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. శనివారం గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పెనుకొండ మండలం మావటూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి వసతి సౌకర్యాలు కల్పించాలని, భోజనాన్ని సకాలంలో అందించాలని, వారికి దిండ్లు, రగ్గులు, మ్యాట్ అందించాలని, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. పోలింగ్ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో విఆర్వో బుచ్చిబాబు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని గిరిజన రైతులకు భూములు మంజూరు చేసి వారి జీవితాల్లో వెలుగులు చూడాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక మంచి కార్యక్రమం చేపట్టారని ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు. ప్రాజెక్ట్ అధికారి శనివారం తన పర్యటనలో జియ్యమ్మ వలస, కురుపాం, కొమరాడ మండలాల తహశీల్దార్ కార్యాలయంలో ఆర్.ఓ.ఎఫ్ ఆర్ పట్టాల పంపిణీపై నేటికి చేపట్టిన పనులు పై ఆరా తీశారు. జియ్యమ్మ వలస మండలంలో 2314, కురుపాం మండలంలో 8644, కొమరాడ మండలంలో 3165 మంది లబ్ధిదారులకు సంబందించి గిరి భూమి వెబ్సైట్ లో చేపడుతున్న ఆన్లైన్ అప్డేషన్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ గిరి భూమి వెబ్సైట్ లో చేపడుతున్న ఆన్లైన్ అప్డేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అలాగే ఆధార్ నెంబర్, తండ్రి పేరు తదితర వివరాలు ఎక్కడా తప్పులు జరగకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కురుపాం, కొమరాడ తహసీల్దార్లు, జియ్యమ్మ వలస డిప్యూటీ తహశీల్దార్, కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విధులకు గైర్జాజరైన గ్రామ సిచివాలయం సిబ్బందిపై ఐటిడి ఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల ఆగ్రహం వ్యక్తం చేసారు . వంతాడపల్లి గ్రామ సచివాలయాన్ని ప్రాజెక్టు అధికారి శని వారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేసారు. గ్రామ సచివాలయ సిబ్బంది హాజరు పరిశీలించి నలుగురు సిబ్బంది విధులకు హాజరు కాలేదని గుర్తించి పంచాయతీ కార్యదర్శులు ఎం. హైందవి, ఎన్.మత్స్యరాజు, సర్వేయర్ సిటిబి ఎస్ ఎన్ అప్పరాజు, మహిళాపోలీస్ కె.జయశ్రీలకు షోకాజ్ నోటీస్ జారీ చేసారు. గ్రామ సచివాలయం సిబ్బంది నిర్లక్ష్యంగా విధులు నిర్వహించి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సచివాలయంలోనే పౌర సేవలన్ని ప్రజలకు అందించాలన్నారు. అనంతరం మినీ వ్యాన్‌లో ఇంటింటికి పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్నితనిఖీ చేసారు. బియ్యం పంపిణీలో కచ్చితమై తూకం ఉండాలన్నారు. సకాలంలో పంపిణీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. గ్రామస్తులతో మాట్లాడి అటవీ హక్కుపత్రాలు అందరికి అందినది లేనిది అడిగి తెలుసుకున్నారు. బియ్యం ఇంటింటికి పంపిణీ చేయడం గిరిజనులను స్పందన ఆరా తీసారు. ఇంటికి తెచ్చి బియ్యం పంపిణీ చేయడం పై లబ్దిదారులు సంతృప్తి వ్యక్తం చేసారు. అందరూ దోమ తెరలు వినియోగించాలని ప్రాజెక్టు అధికారి సూచించారు.